విలీనంతో తెలంగాణకు చేటు


Fri,January 3, 2014 01:09 AM

తెలంగాణ రాష్ర్ట కల సాకారమవుతున్న వేళ.. రాజకీయ పార్టీ ల మధ్య ఆధిపత్య పోటీ ప్రారంభమైంది. ఇదేమి ఊహించని పరిణామం కాదు. కాకపోతే ఇంతతొందరగా మొదలైతుందని ఎవ రూ ఊహించలేదు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ముసాయిదా బిల్లు ఇంకా అసెంబ్లీ గడప కూడా దాటకుండానే తెలంగాణ కాం గ్రెస్ నేతలు టిఆర్‌ఎస్ పార్టీ విలీనంపై సన్నాయి నొక్కులు నొక్క డం ప్రారంభించారు.

రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, ఇచ్చిన మాట ప్రకా రం టీఆర్‌ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని కేసీఆర్‌ని బాహాటంగానే కోరారు. టీఆర్‌ఎస్ కూడా దానికి దీటుగానే స్పంది స్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్ విలీనం కోసం ఇస్తుందా లేక తెలంగాణ ప్రజల కోసం ఇస్తుందో తేల్చాలని అన్నా రు. దీంతో రాష్ర్టంలో ఇప్పుడు విలీన రాజకీయాలపై చర్చ మొదలైంది. దీనిపై ప్రత్యేక కథనాలు, విశ్లేషణల రూపంలో ఆంధ్ర మీడి యా హడావిడి చేయటం మొదలుపెట్టాయి. ఓ దినపవూతిక అయి తే ‘విలీనానికి టీఆర్‌ఎస్ సుముఖంగా లేనందున కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ ఇవ్వబోదని’మొదటి పేజీలో బ్యానర్ ఐటమ్‌గా ఓ కథనాన్ని ప్రచురించింది. మరికొన్ని పత్రికలు కూడా ఇదే బాటలో సాగుతూ కట్టుకథలను గుప్పిస్తున్నారు.కాకపోతే ఇటువంటి చర్చ కి తెరలేపిన మన ఇంటి దొంగల ఉద్దేశ్యాలేమిటో గమనించాల్సిన అవసరం ఉంది.

కాంగ్రెస్ పార్టీ నాయకులుకాని, కార్యకర్తలు కానీ తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నన్ని రోజులు కేవలం ప్రేక్షక పాత్ర పోషించిన విషయం అందరికీ తెలుసు. తెలంగాణ బిడ్డలు పిట్టల్లా రాలిపోతుంటే కనీసం సానుభూతి కూడా తెలుప లేదు. పోలీసులు విద్యార్థులు ఉద్యమకారులపై లాఠీలు, తూటాలు కురిపిస్తుంటే, ఉద్యమకారులపై కేసులను మోపుతూ జైళ్ళపాళ్ళు చేస్తుంటే కనీ సం ఖండించడానికి కూడా ఒక్క కాంగ్రెస్ నాయకుడు ముందు కు రాకపోగా, ప్రజలపైనే దౌర్జన్యం చేయటం వారికే చెల్లింది. దీని కి ఉదాహరణగా కాంగ్రెస్‌పార్టీ నాయకుడు దానం నాగేందర్ స్వయంగా లాఠీ చేతబూని విద్యార్థులను ఏ విధంగా చితకబాదాడో మీడియాలో వీక్షించాం.

ఈ నాయకుడే మరోసారి వినతిపత్రం ఇచ్చేందుకు ఇంటికొచ్చిన విద్యార్థి నాయకులపై అనుచరగణంతో వీరంగం సృష్టించిన విపరీత పోకడలను ప్రజపూవరూ మరువలేదు. ఇది అన్ని రాజకీయ పార్టీల్లో ఇదే సంసృ్కతి నెలకొని ఉంది. పైపెచ్చు తెలంగాణకు వ్యతిరేకంగా కొంతమంది నాయకులు ఇచ్చిన పరస్పర విరుద్ధ ప్రకటనలు ఇంకా ప్రజల చెవులలో మార్మోగుతనే ఉన్నాయి.
ఇదే సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో మాట్లాడుకోవలసిన మరో రాజకీయపార్టీ టీడీపీ. రెండు కళ్ళ సిద్ధాంతంతో ఇరు ప్రాం త ప్రజలను మోసం చేస్తున్నాడు చంద్రబాబు. ఆయన గోడమీద పిల్లి వాటం మూలంగా చివరకు టీడీపీ ఇరు ప్రాంతాల్లో ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో ప్రాంతంలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిందనే చెప్పవచ్చు. అయినా ఆ పార్టీనేతలకు కేసీఆర్, టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తాడనే ఓ దింపుడు కళ్లం ఆశ కారణంగానే రేవంత్ రెడ్డి వీలీనం ఎందుకు చేయవని కేసీఆర్‌ను అడుగుతున్నాడు.

ఈ పరిస్థితి కేవలం తెలంగాణ ప్రాంతంలోనే కాదు ఈ రెండు పార్టీలకి అటు సీమాంవూధలో సైతం గడ్డు పరిస్థితి ఉంది. అక్కడ వైఎస్‌ఆర్‌సీపీ గాలి బలంగా వీస్తుండడంతో కాంగ్రెస్ ఒకపక్క దోషిగా నిలబడితే మరోపక్క టీడీపీ తన నిజాయితీ నిరూపించుకోవడానికి సతమతమవుతుంది. ఇక తెలంగాణ ప్రాంతంలో టీఆర్‌ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కొనేశక్తి కాంగ్రెస్‌పార్టీకి కూడా లేదు. ‘ఇచ్చింది మేమే తెచ్చింది మేమే’ అని కాంగ్రెస్ నాయకులు ఎంత బాకాలూదుకున్నా టీఆర్‌ఎస్‌కు తెలంగాణ వాదం పట్ల ఉండే నిబద్ధత కాంగ్రెస్‌కు లేదనే విషయం తేటతెల్లం అయ్యింది.

నేడు తెలంగాణ సమాజానికి కావలసింది కేవలం తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ఒకటే కాదు. రేపు రాష్ర్టం ఏర్పడ్డాక తెలంగాణవాదాన్ని ప్రజలలో సజీవంగా ఉంచగలిగే రాజకీయ పార్టీ. అది ఎటువంటి సిద్ధాంతం, నిబద్ధతలేని కాంగ్రెస్‌పార్టీలో కాని, వలసనాయకుల గుప్పిట్లో ఉన్న టీడీపీతో కాని, మత రాజకీయాలలో పూర్తిగా మునిగిపోయిన ఎమ్‌ఐఎమ్ పార్టీతో కాని, అవినీతిని పారదోలుతా అని రాజకీయలలోకి వచ్చి కేవలం ఒక్క సీటుతో తెలంగాణ పట్ల చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తున్న లోక్‌సత్తా పార్టీతో కాని సాధ్యం కాదు. కేవలం తెలంగాణ వాదం పునాదుల మీద పుట్టుకొచ్చిన రాజకీయపార్టీ ద్వారానే ఇది సాధ్యం అవుతుంది. అది కేవలం టీఆర్‌ఎస్ లేక భవిష్యత్తులో ఈ వాదంతో వచ్చి నిలబడగలిగే ఏ రాజకీయ శక్తితోనైనా సాధ్యమవుతుంది. అటువంటి పార్టీలే రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజం తిరిగి వలసవాదుల గుప్పిట్లోకిపోకుండా కాపాడగలుగుతాయి నవనిర్మాణం దిశగా అడుగులు వేయించగలుగాతాయి. అంతేకాని బూర్జువా మనస్తత్వం గల కాంగ్రెస్, టీడీపీలకు పట్టం కడితే తిరిగి చరిత్ర పునరావృత్తమయ్యే అవకాశం ఉంది.

టీఆర్‌ఎస్ పోకడలు కొందరికి నచ్చకపోవచ్చు. తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేసే, లేక వారి ఆశలను నెరవేర్చ లేని వారికి ప్రజలు అవకాశం వచ్చినప్పుడు తగిన విధంగా బుద్ధిచెపుతారు. అదే సందర్భంలో వలసవాదాన్ని పాతరేయకపోతే చరిత్ర ఎవ్వరిని క్షమించదు. అందుకే తెలంగాణకు జెండా పట్టిన పార్టీలకే పట్టం కట్టాల్సిన అవసరం ఉంది. కాకపోతే కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి, సోనియా గాంధీ తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేస్తుంది కాబట్టి తమకే అధికారం ఇవ్వాలని కోరుకోవడం కాంగ్రెస్ నాయకుల అత్యాశ అవుతుంది. ఇప్పుడు ప్రతిపాదించిన తెలంగాణ, ప్రజలు కోరుకునే తెలంగాణ కాదు.

ఆంక్షలతో కూడుకున్న తెలంగాణ. ఇది తెలంగాణ సమాజానికి రాబోయే రోజుల్లో తీవ్రమైన హాని కలిగిస్తుంది. దీనికి వ్యతిరేకంగా పోరాడిల్సిన రాజకీయ పార్టీ అవసరం తెలంగాణ సమాజానికి ఉంది. టీఆర్‌ఎస్ ఒక్కటే ప్రస్తుతం ఆ పాత్ర పోషించగలదు. అం దుకే నేడు ప్రజలు కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ పార్టీ విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాకపోతే కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకుని రాబోయే ఎన్నికల్లో గెలిచి వలసవాద పార్టీ లకు పాతరే యాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆశి స్తున్నారు.
శీధర్ ధర్మాసనం

231

SRIDHAR RAO DESH PANDE

Published: Fri,November 24, 2017 03:26 AM

కృష్ణా నీరు అడుగాల్సిందెవరిని?

హైదరాబాద్‌లో ఇటీవల పాలమూరు అధ్యయన వేదిక వారు ఎగువ ప్రాంత బాధిత రైతాంగ భవిష్యత్తు కోసం కృష్ణానదీ జలాల పునఃపంపిణీ అత్యవసరం, అనివార్య

Published: Sun,October 29, 2017 01:08 AM

అపోహలు-వాస్తవాలు

పలు కారణాల వల్ల సాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదనల్లో మార్పు లుచేర్పులు చోటుచేసుకుంటాయి. డీపీఆర్‌లో ప్రతిపాదించినట్లుగాప్రాజెక్టులను న

Published: Sat,September 16, 2017 11:41 PM

ప్రాజెక్టులపై అపోహలు-వాస్తవాలు

కల్వకుర్తిలో జలాశయాలు లేవు. పాలమూరు రంగారెడ్డి పథకంలో నిర్మిస్తున్న జాలాశయాలను కల్వకుర్తి పథకంలో భాగం చేయాలి. ఈ రెండు ప్రాజెక్టులన

Published: Sat,August 26, 2017 11:59 PM

ప్రాజెక్టుల దశ తిరిగింది

గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయనీ, ఈ ప్రభుత్వం రెండేండ్లల్లో 5 శాతం పనులను పూరి చేయలేకపోతున్నదని ప్రతిపక

Published: Sat,July 29, 2017 11:39 PM

ఇంకా వీడని వలసాధిపత్యం

వలసవాదం అంతం కావడానికి సుదీర్ఘ పోరాటం సాగాలె. తెలంగాణలో వలసవాదాన్ని అంతం చెయ్యడం, వలసవాద ప్రభావాల నుంచి తెలంగాణను బయట పడేయడం, వలసవ

Published: Wed,May 3, 2017 11:49 PM

సార్ సేవలు చిరస్మరణీయం

నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు-2 మంత్రి హరీశ్‌గారు ప్రతి వారం నిర్వహించే మిషన్ కాకతీయ వీడి యో కాన్ఫరెన్స్‌లకు, ప్రాజెక్టుల సమీక్ష

Published: Sat,September 17, 2016 01:16 AM

దోపిడీకి బీజంవేసిన దినం

-వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17 1956 నవంబర్ 1న విద్రోహ రాజకీయాలది పైచేయి కావడానికి నేపథ్యాన్ని ఏర్పర్చిన 1948 సెప్టెంబర్ 17 విమో

Published: Fri,September 16, 2016 02:19 AM

వలస పాలనకు పునాది సెప్టెంబర్ 17

1946-56 వరకు దశాబ్ద కాలంపాటు చోటు చేసుకున్న రాజకీయాలు తెలంగాణ పరాధీనం కావడానికి దోహదం చేశాయి. విశాలాంధ్ర విద్రోహ రాజకీయాలకు 1948

Published: Sat,July 30, 2016 01:33 AM

మల్లన్నసాగర్ మన మంచికే

-ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు-2 మల్లన్న సాగర్ వద్దనే 50 టీఎంసీల స్టోరేజీ అవసరం ఏమిటీ అన్నది పూర్తిగా సాంకేతికపరమైన అంశం మాత్రమే.

Published: Fri,July 29, 2016 01:25 AM

ప్రాజెక్టులపై అసంబద్ధ వాదనలు

సీమాంధ్రకు మాత్రమే లాభం చేసే, మన భూములను ముంచే పోలవరం ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులు, దుమ్ముగూడెం టైల్‌పాండ్ ప్రాజెక్టులు కడు

Published: Sun,May 22, 2016 01:20 AM

కోటి ఎకరాల స్వప్నసాకారం దిశగా

గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను రూపకల్పన చేసినప్పుడు అనేక అవకతవకలు, అధ్యయనలోపం కారణంగా తప్పుడు నిర్ణయాలు జరిగినట్లు ప్రభుత్వ విశ్లేషణ

Published: Sat,January 23, 2016 01:50 AM

అస్తిత్వం చాటాల్సిన సమయం..

హైదరాబాద్ తెలంగాణ పహెచాన్. ఒక తెలంగాణ కవి, గాయకుడు అన్నట్టు హైదరాబాద్ తెలంగాణ పెద్ద బతుకమ్మ. ఈ బతుకమ్మను రక్షించుకునేందుకు మనం సిద

Published: Sat,November 28, 2015 01:37 AM

పాలనను ప్రతిఫలించిన ఫలితం

తెలంగాణ ఏర్పడినా తెలంగాణలో స్థిరపడిపోయిన వలసాధిపత్యంపై పోరు నడవాల్సిందేనని ఉద్యమ ప్రజలకు తెలుసు. ఒకవైపు పునర్నిర్మాణం, మరోవైపు వల

Published: Thu,July 9, 2015 01:50 AM

కాళేశ్వరంపై అపోహలు-వాస్తవాలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తొలుత సాగునీటి మం

Published: Wed,November 12, 2014 03:22 AM

‘మిషన్ కాకతీయ’కు ప్రజలే సారథులు

చెరువులను పునరుద్ధరించడం వల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం పొందే వర్గాలు రైతులు, వ్యవసాయ కూలీలు. కాబట్టి రైతులు చురుకుగా పాల్గొంటే మన వూర

Published: Thu,May 29, 2014 12:08 AM

ఆదివాసీలను ముంచే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిద్దాం

తెలంగాణ ఆవిర్భావ శుభవేళ మోడీ ప్రభుత్వం తెలంగాణ ఆదివాసీలను ముంచే పోలవరం ఆర్డినెన్స్‌ను తీసుకు కొచ్చింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆ

Published: Tue,April 1, 2014 03:21 AM

పునర్నిర్మాణం - ప్రజల ఆకాంక్షలు

అధికారంలోకి వచ్చే ఏప్రభుత్వామైనా తాము మ్యానిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేసినప్పుడే వాటికి సార్థకత. వాటిని అమలు చేయించుకునే బాధ్

Published: Sat,March 22, 2014 12:16 AM

స్థానికత ప్రామాణికం కావాలె!

జూన్ 2 నుండి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా విభజన చెంది తెలంగాణ ఉనికిలోకి రానున్నది. ఈ సందర్భంగా ఉద్యోగుల పంపిణీకి స్థానికత ఆధార

Published: Mon,October 7, 2013 01:11 AM

బిల్లు ఆమోదం పొందేదాక అప్రమత్తం

కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిసిందని కేబినెట్ తరుఫున హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటించగానే తెలంగాణలో ఆనందం మిన్

Published: Fri,August 16, 2013 12:36 AM

దురాశ ఆంధ్రా అభివృద్ధికి అవరోధం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీలు తీర్మానం చేశాయి. ఆ తర్వాత సీమాంధ్ర ప్ర

Featured Articles