తెగించి కొట్లాడుదాం


Sat,October 6, 2012 04:13 PM

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పిల్లలు నిట్టనిలువునా కాలిపోతున్నరు. పిట్టల వలె రాలిపోతున్నరు. ఇప్పటి వరకు దాదాపు 63 మంది యువతీ యువకులు తెలంగాణ కోసం ప్రాణాలర్పించారు. మొన్న జరిగిన ఉప ఎన్నికల తరువాత భోజ్యానాయక్‌తో మొదలై మొత్తం 13 మంది ఆత్మబలిదానం చేశారు. ఈ చావులను చూసి తెలంగాణ ప్రజలే కాదు, ప్రపంచంలో మనసున్న మనుషులందరూ తల్లడిల్లిపోతున్నరు. కానీ వీటి గురించి నోరువిప్పనిది కాంగ్రెస్, టీడీపీ రాజకీయనాయకులే. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు ఆంధ్రవూపాంతంలో ప్రమాదాలలో చనిపోయినా.. పోయి మందలించి వస్తున్నరు. కానీ తెలంగాణల రోజుకొకరు ఆత్మహత్య చేసుకొని చనిపోయినా కనీసం సానుభూతి ప్రకటన కూడా చేస్తలేరు. పిల్లలు తెలంగాణ కోసం చనిపోతే ముఖ్యమంత్రి ఇవి బలిదానాలు కావు, ఈ చావులకు వేరే కారణాలున్నాయంటడు.పరీక్షల్లో ఫేయిలై కొందరు, ప్రేమించిన అమ్మాయి కాదన్నందు కు కొందరు, కుటుంబ పరిస్థితి కారణంగా కొందరు ఆత్మహత్యలు చేసుకున్నరని ముఖ్యమంత్రి అంటడు. సీఎం ఈ మాట అన్న తర్వాత ఒక యువకుడు తాను తెలంగాణ కోసమే చనిపోతున్న విషయం అనుమానానికి తావులేని విధంగా ప్రపంచానికి స్పష్టం చేయడానికి సెల్‌ఫోన్‌లో మరణవాంగ్మూ లం రికార్డ్ చేసి ఉరివేసుకున్నడు.

అయినా ఆంధ్ర పాలకులు బలిదానాలను అవమానపరుస్తున్నరు. బలిదానాల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నరు. ఇంత దయలేని రాతిగుండెల పాలకులను ప్రపంచంలో ఎక్కడా చూడం. సూడాన్ దేశంలో ఒక్క వ్యక్తి తగులబెట్టుకుంటే అక్కడ ప్రభుత్వమే కూలిపోయింది. మనదేశం చెప్పుకోవడానికైతే పెద్ద ప్రజాస్వామ్యదేశం. కానీ ఈ ఆత్మహత్యల గురించి మాట్లాడటానికి లోకసభలో స్పీకర్ ఒప్పుకోరు. అసెంబ్లీ స్పీకరైతే అనవసరమైన విషయాలు మాట్లాడి సమయం పాడు చేస్తరని ముఖం మాడ్చుకుంటడు. పార్లమెంటుల అన్ని పార్టీల సభ్యులు లేచి నిలుచొని పిల్లల చావులను ఆపడానికి తెలంగాణపై మాట్లాడి నిర్ణయం తీసుకుందామని అడిగితే ప్రధానమంత్రి ఊ.. అనడు. అనడు. బట్టల దుకాణంల బొమ్మతీరుగ కూర్చుంటడు. అసెంబ్లీల టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, నగారా సభ్యులు అద్భుతంగా తెలంగాణ విషయం చెప్పుతుంటే, స్పీకర్ ముందట నిలబడి నినాదాలిస్తుంటే.. అది తనకు సంబంధంలేని విషయమైనట్లుగా ముఖ్యమంత్రి నేల చూపులు చూస్తడు. ప్రతిపక్ష నాయకుడు పట్టించుకోడు. తెలంగాణ మంత్రులు మూగనోము ప్రదర్శిస్తరు.

ఆత్మబలిదానాలు వద్దంటూ ప్రతిఒక్కరూ ఉచిత సలహాలు ఇస్తూ చేతులు దులుపుకునే ప్రయత్నమే చేస్తున్నరు గానీ, ఈ బలిదానాలను ఆపటానికి ప్రభుత్వం గానీ, అధికారప్రతిపక్ష పార్టీలు గానీ చేయవలసిన ప్రయత్నాల మీద ఎవ్వరూ కనీసం స్పందించడం లేదు. తెలంగాణ కోసం జరుగుతున్న బలిదానాలపై శాసనమండలిలో చైర్మన్ స్వయంగా తీర్మానం పెడితే అది తీర్మానం కానేకాదని ముఖ్యమంత్రి తన అహాంకారాన్ని ప్రదర్శించిండు. కిరణ్‌కుమార్‌డ్డి ప్రభుత్వం మీద అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టిన సందర్బంలో కాంగ్రెస్‌లో కలిసిన ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సినిమా ఫక్కీలో అలిగినట్లు నటించి తన వాళ్లకు మంత్రి పదవులు సంపాదించుకున్నడు. తెలంగాణ కోసం పాణాలైనా ఇస్తమని ఉస్మానియా క్యాంపస్‌లో శవాల మీద ప్రమాణం చేసిన తెలంగాణ మంత్రులు ఇదే పద్ధతిలో ఆలోచించి ఉంటే ఇంతమంది ఆత్మహత్యలకు అవకాశం ఉండేది కాదు. మూడున్నర గంటలు ఏకధాటిగా ప్రపంచంలోని అన్ని విషయాల మీద మాట్లాడిన చంద్రబాబు కనీసం తెలంగాణ పదం ఉచ్ఛరించకుండా అతి జాక్షిగత్తపడ్డడు. ఇట్లాంటి మనిషి తాను తెలంగాణకు వ్యతిరేకం కాదంటడు.

తెలంగాణ టీడీపీ ఫోరం నాయకులు ఇది మనల్ని నమ్మమంటరు. నమ్మేదిలేదంటే చంద్రదండు కిరాయి రౌడీలతో దాడులు చేయిస్తరు. పోలీసులతో మిలాఖతై కేసులు పెట్టిస్తరుపజలకు మంచి చేయాలనే ఆలోచనలతోనే ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. ఏం పని చేయకపోతే ఓట్లెందుకు. ప్రభుత్వాపూందుకు? మన రాష్ట్రంలో వింత ఏందంటే... తెలంగాణ గ్యారంటీగా ఇస్తమని మాట ఇచ్చి, ఓట్లు వేయించుకుని గద్దెనెక్కి ఇప్పుడు మాటమారుస్తున్నరు. గట్టిగ అడిగితే ఈ పండుగ ఎల్లనియ్యి..ఆ ఎన్నికలు దాటనియ్యి అంటూ మాయమాటలతో కాలం గడుపుతున్నరు. మేం తెలంగాణకు వ్యతిరేకం కాదని ఏదీ తేల్చకుండ మోసం చేస్తున్నరు. నిలదీస్తే అరెస్టు చేస్తరు. కేసులు పెడుతరు. ఇది ఆంధ్ర పాలకుల ప్రభుత్వం. వాళ ్లమంచి కోసమే పనిచేస్తది. మన అవసరాలు ఆంధ్ర పాలకులకు పట్టవు. కరివేపాకును కూరవండినంక తీసిపారేసినట్టు,ఎన్నికల తర్వాత ఆంధ్ర పాలకులకు తెలంగాణ అవసరం లేదు.

మన ఓట్లతోని గెలిచి మన గురించి ఆలోచించడానికి ఇష్టపడని ఈ అసెంబ్లీ, పార్లమెంటు ఎందుకు? ఈ ప్రభుత్వమెందుకు? తెలంగాణ విషయంలో ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, ప్రజాఉద్యమాలను పట్టించుకోకపోవడం, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకరావాల్సిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్, టీడీపీ నాయకులు తమ బాధ్యతలను విస్మరించడం వల్లనే... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తమ భవిష్యత్తు ముడిపడి ఉన్నదన్న నమ్మకంతో ఉన్న యువతీయువకులు విశ్వాసం కోల్పోయి బలిదానాలకు పాల్పడుతున్నారు.

ఆంధ్ర నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీలలోని తెలంగాణ నాయకులు ఒక్కతాటి మీదికొచ్చి గట్టిగా కొట్లాడితే ఆ పార్టీల నిర్ణయాలు మారుతయి. కానీ స్వంత లాభం కోసం తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ నాయకులు ఆంధ్రపాలకుల చెప్పులు మోస్తున్నరు. ఇక్కడి పిల్లలు తెలంగాణ కోసం చనిపోతుంటే ఇక్కడి కాంగ్రెస్, టీడీపీ నాయకులు పదవుల కోసం తెలంగాణను తాకట్టుపెడుతున్నరు. పార్లమెంటుల అందరు లొల్లి చేస్తుంటే తెలంగాణకు చెందిన బలమైన నాయకుడు జైపాల్‌డ్డి నోరువిప్పడు. రాష్ట్రమంత్రి జానాడ్డి కూడా తెలంగాణ కోసం తెగించి మాట్లాడడు. ఉద్యమం ఊపు మీద ఉన్నప్పుడుల్లా ఉత్తుత్తి మీటింగ్‌లు పెట్టి ఏదో చేస్తున్నట్టు ఊదరగొడుతరు. ఈ నాయకులే తెలంగాణకు అడ్డం.తెలంగాణ ఓట్లతో గెలిచిన ఇక్కడి నాయకులు కూడా తెలంగాణకు అడ్డుపడుతున్న ఆంధ్రానాయకుల చంకనజేరిండ్రు. తెలంగాణ కోసం కొట్లాడకపోగా, ప్రజలు చేసే పోరాటాలను అవమానపరుస్తున్నరు. ఇటీవల ఉపఎన్నికల ఫలితాల్లో పూర్తిగా తెలంగాణ ఆకాంక్ష ఆకాశమంత ఎత్తులో ప్రతిఫలిస్తే, గండ్ర వెంకటరమణాడ్డి లాంటి తాబేదార్లు ఇష్టమచ్చినట్టు మాట్లాడుతున్నరు.

దయాకర్‌రావు లాంటి సమైక్యవాదుల బానిసలు ఉద్యమ వూదోహానికి ఒడిగడుతున్నరు. ఇట్లాంటి బానిసనాయకుల ద్రోహాల కారణంగానే ఇవ్వాళ్ల తెలంగాణలో ఆత్మబలిదానాలు పెరుగుతున్నయి. తెలంగాణలో జరిగిన ఆత్మబలిదానాలన్నింటికీ వీరినే బాధ్యులను చెయ్యాలె. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలె. బరిగీసి నిలవాలె. ధైర్యంగ కొట్లాడాలె. తెలంగాణ ఉద్యమ ప్రజలందరూ గతంలో ఎన్నడూ లేని తీరుగ ఐక్యంగ నిలబడ్డరు. వారికి అండగా మనమందరమూ నిలవాలె. ఇదే సమయంలో ఏప్రిల్ 24 వ తేదీన నుంచి మళ్లీ ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఈ ప్రాంత ఎంపీలందరూ ఐక్యంగా నిలిచి, ఇక్కడి ప్రజల ఆకాంక్షలను పార్లమెంటులో వినిపించాలి. ఈ దిశలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, కాంగ్రెస్, టీడీపీ చెందిన అన్ని స్థాయిల్లోని నాయకులు ఉమ్మడిగా కదిలితే స్పష్టమైన నిర్ణయం వచ్చే అవకాశాలున్నాయి. వారిపై మనమందరమూ ఐక్యంగా ఒత్తిడి పెంచాలి.ఇప్పుడు జరగాల్సింది బలిదానాలు కాదు..తెలంగాణ వచ్చేదాక తెగించి కొట్లాడాలె. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ పునర్‌నిర్మాణంలో మనమందరమూ కలిసి మెలిసి ముందుకు సాగాలె.

- పిట్టల రవీందర్,
జేఏసీ సమన్వయకర్త

35

RAVINDAR PITTALA

Published: Wed,March 26, 2014 12:55 AM

తెలంగాణ జేఏసీ తక్షణ కర్తవ్యం!

తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో సంఘటిత శక్తి ని ప్రదర్శించి, రాజకీయ ఐక్యతను సాధించిన తెలంగాణ జేఏసీ తెలంగాణ పునర్నిర్మాణంలోనూ తన అస్త

Published: Sun,December 15, 2013 12:34 AM

జలధారలపై జలగలదాడి

ఆదిలాబాద్ జిల్లాలోని జలధారలమీద సీమాంధ్ర దోపిడీవర్గాలు జలగల్లాగా విరుచుకుపడేందుకు రంగాన్ని సిద్ధం చేసుకున్నాయి. కుంటాల జలపాతంపైన జల

Published: Thu,September 26, 2013 02:40 AM

‘సకల జనభేరి’ మోగిద్దాం

సమైక్యత పేరుమీద సీమాంవూధలో ముఖ్యమంత్రి పరోక్ష నాయకత్వంలో యాభయి రోజులుగా జరుగుతున్న ‘తమాషా’ ఉద్యమం వెనక స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడ

Published: Mon,July 22, 2013 01:05 AM

తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ బాధ్యత

తెలంగాణ అంశాన్ని తేలుస్తున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలోనూ, కేంద్రంలోనూ నెలరోజులుగా తీవ్రస్థాయిలో హడావుడి చేస్తున్నది. గ్రామ

Published: Fri,May 31, 2013 09:58 PM

ఆంధ్రాపార్టీలు అవసరమా?

ప్రజలు వ్యక్తం చేసే అభివూపాయాలను, ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా పనిచేయాల్సిన బాధ్యత పార్లమెంటు, శాసనసభలకు ఉన్న ది. రాజ్యాంగ ని

Published: Wed,March 27, 2013 10:51 PM

విద్యావంతుల ఉద్యమవేదిక

నడుస్తున్న చరివూతలో మన పాదమువూదలను ఎంత గాఢంగా వేయగలిగామన్న దానిపైనే చరివూతలోమన స్థానం నిర్ధారించబడుతుంది. గత తొమ్మిదేళ్లలో తెలంగ

Published: Sun,March 17, 2013 12:41 AM

ఆకాంక్ష పట్టని అసమర్థ నేతలు

మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక ఆకాంక్షగానే మొదలయ్యింది. సాంస్కృతిక, సాహిత్య రూపాలలో భావవ్యాప్తి జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష

Published: Sat,October 6, 2012 04:12 PM

తెలంగాణ మార్చ్ దిశగా..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ హామీని అమలు చేసే వి

Published: Sat,October 6, 2012 04:14 PM

ఉత్పత్తి వేటలో జీవన విధ్వంసం

వేగవంతమైన బొగ్గు ఉత్పత్తి, మితిమీరిన లాభాపేక్ష లక్ష్యాలతో సింగరేణి బొగ్గుగనుల సంస్థ ఓపెన్‌కాస్ట్ గనులను నిర్వహిస్తున్నది. దీనివల్ల

Published: Sat,October 6, 2012 04:14 PM

ఎన్టీపీసీ విస్తరణ ఎవరి కోసం?

ఏదైనా సంస్థ విస్తరించడమంటే.. అది అభివృద్ధి దిశలో పయనిస్తున్నట్టుగా భావించాలి. ఆ అభివృద్ధిని చూసి అందరూ గర్వపడతారు. ఆ విస్తరణను ఆహ్

Published: Sat,October 6, 2012 04:15 PM

ఈ మోసం ఇంకెన్నాళ్లు?

సరిగ్గా రెండేళ్ల కితం 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా

Published: Sat,October 6, 2012 04:14 PM

ఈ ప్రభుత్వం మనదెట్లా..?

ప్రజాస్వామిక హక్కులను ప్రతిబింబించవలసిన ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు ప్రజలపై విశ్వాసం లేదు. ప్రజా ప్రతినిధులపై విశ్వాసంలేదు. ప్రజలకు ఇ

Published: Sat,October 6, 2012 04:16 PM

ఐక్య ఉద్యమమే అంతిమ మార్గం

తెలంగాణ రాష్ట్ర సాధనకు ఐక్య ఉద్యమమే అంతిమ మార్గంగా అందరూ కలిసి ముందుకుపోవాల్సి ఉంది. రాష్ట్ర సాధనోద్యమంలో ముందువరుసలో నిలబడిన తెలం

Published: Sat,October 6, 2012 04:15 PM

సొంత రాష్ట్రం మా జన్మహక్కు

-శ్రీధర్‌రావు దేశ్‌పాండే, పిట్టల రవీందర్ తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు తెలంగాణను అన్ని రంగాలలో దోపిడీకి, అణిచివేతకు, వివక్ష

Published: Sat,October 6, 2012 04:15 PM

సింగరేణి ఉద్యమానికి కొండంత అండ..

-పిట్టల రవీందర్ (‘తెలంగాణ విద్యావంతుల వేదిక’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ‘ఒక ప్రాంతంలో లభ్యమయ్యే వనరులు ఆ ప్రాంత ప్రజల సంక్షేమాన