సొంత రాష్ట్రం మా జన్మహక్కు


Sat,October 6, 2012 04:15 PM

-శ్రీధర్‌రావు దేశ్‌పాండే, పిట్టల రవీందర్
తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు


తెలంగాణను అన్ని రంగాలలో దోపిడీకి, అణిచివేతకు, వివక్షకు గురిచేసి ఇవ్వాళ కలిసి ఉంటే కలదు సుఖం అంటే నమ్మేదెవరు? ఒక ప్రాంత ప్రజలు ఐదు దశాబ్దాలుగా వ్యక్తం చేస్తున్న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను అంగీకరించేందుకు గానీ కనీసం ఆ డిమాండ్ అంశాన్ని ఆలోచించేందుకుగానీ ఇష్టపడని సహచరులు సమైక్యతను గురించి మాట్లాడటమే అత్యంత నిరంకుశమైనది.

Draw-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaసమైక్య వాదాన్ని ప్రచారం చేస్తున్న లగడపాటి, కావూరి, దేవినేని, రాయపాటి, టీజీ వెంక తదితరులు గమనించవలసింది, తెలుసుకోవల్సింది ఏమిటంటే.. సమైక్యత ఒక సామాజిక విలువ. హక్కు కాదు. విడిపోవటం మాత్రం ఒక హక్కు. భార్యభర్తలు కలిసి ఉండటం, అన్నదమ్ములు కలిసి ఉండటం, దేశాలు కలిసి ఉండటం, జాతులు ఒక సమాఖ్యగా కలిసి ఉండటం ఎప్పుడైనా ఒక విలువే తప్ప హక్కు కాదు. కలిసి ఉండటం ఇద్దరి పరస్పర అంగీకారం మేరకే జరుగుతుంది. జరగాలి కూడా. కాని అయిష్టం గా, బలవంతంగా కలిసి ఉంచటం,ఉండాలనటం అప్రజాస్వామికం. పరస్పర అంగీకారం లేని కాపురాలు, వ్యాపార భాగస్వామ్యం ఉమ్మడి కుటుంబాలు, జాతుల సమాఖ్యలు ఎన్నటికీ నిలువ జాలవు.

అన్యాయానికి , దోపిడీకి, వివక్షకు గురి అవుతున్న భాగస్వామ్య పక్షాలు విడిపోయి స్వతంవూతం గా బతకాలనుకోవటం ప్రపంచమంతా అంగీకరించిన హక్కు. సీమాంవూధు లు కలిసి ఉండటాన్ని కూడా ఒక హక్కుగా భావించి సమైక్యతను తెలంగాణ ప్రజల మీద రుద్దతున్నారు. హక్కుల భావనకే కొత్త భాష్యం చెబుతున్నారు. ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అంటూ నినాదాలు ఇస్తే సరిపోదు. కలిసి ఉంటే ఎవరికి సుఖమో ఎవరికి దుఃఖమో తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. కనుకనే విడిపోతామంటున్నారు. నిజానికి సమైక్యత అనే విలువను కాపాడాలనుకుంటున్న వారందరూ ఆ విలువను ఎవరికి బోధించా లి? సమైక్యంగా ఉండాలనుకుంటున్న వాళ్ళకా? విడిపోతామనుకుంటున్నా వాళ్లకా? సమైక్యవాద ప్రచారం చేయవలిసింది విజయవాడ, విశాఖ, తిరుపతి కడపలలో కాదు, బేషరతుగా విడిపోతామనే డిమాండ్‌తో కలిసి ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజలకు సమైక్యతవాద తాత్వికతను తెలియచెప్పాలి.

సమైక్యవాదం వల్ల వారికేమి లాభమైందో, భవిష్యత్‌లో తెలంగాణ ఎట్లా ఉపయుక్తమైయిందో నమ్మించగలగాలి. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సుదీర్ఘంగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమం వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పగలగాలి. తెలుగువారి ఆత్మగౌరవ పునాది మీద అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు తీసుకొచ్చిన 610 జీవో 25 ఏళ్లుగా ఎందుకు అమలు కాలేదో, గిర్‌గ్లానీ సిఫారసులు ఎందుకు అమలవుతలేవో చెప్పాలి. సెక్రె ‘ఫెయిర్ షేర్’ ఎందుకు అమలవుత లేదో చెప్పాలి. తెలంగాణ నిధులు తెలంగాణ అభివృద్ధికి ఎందుకు ఖర్చు అవుతలేవో చెప్పాలి. పాఠ్యపుస్తకాలలో తెలంగాణ చరివూతకు, భాషకు, సంస్కృతికి, సాహిత్యానికి, సాంప్రదాయాలకు ప్రాధాన్యం ఇంతకాలంగా ఎందుకు ఇవ్వలేదో వివరించగలగాలి. ట్యాంకు బం డ్‌పై తెలంగాణ వైతాళికుల ప్రతిమలను ఏ కారణంగా విస్మరించారో చెప్పగలగాలి.

విజయవాడ, విశాఖ తిరుపతి తదితర సీమాం ధ్ర పట్టణాలలో ఏ ఒక్క తెలంగాణ వైతాళికుల విగ్రహం గానీ రోడ్డు పేరు గాని, భవనాల పేర్లుగానీ పార్కుల పేర్లుగానీ ఎందుకు లేదో చెప్పాలి.
ఇది ఇప్పుడే వేస్తున్న కొత్త ప్రశ్నలు కావు. 20 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు అడుగుతున్నదే. ఆ ప్రశ్నలపై ఇన్నాళ్ళు మౌనం వహించి ఇవ్వాళ కొత్తగా సమైక్యత అంటూ సరికొత్త వాదాన్ని ముందుకు తీసుకరావడంలోని నిజాయితీ ప్రశ్నార్థకమే అవుతుంది. తెలంగాణను అన్ని రంగాలలో దోపిడీకి, అణిచివేతకు, వివక్షకు గురిచేసి ఇవ్వాళ కలిసి ఉంటే కలదు సుఖం అంటే నమ్మేదెవరు? ఒక ప్రాంత ప్రజలు ఐదు దశాబ్దాలుగా వ్యక్తం చేస్తున్న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను అంగీకరించేందుకు గానీ కనీసం ఆ డిమాండ్ అంశాన్ని ఆలోచించేందుకుగానీ ఇష్టపడని సహచరులు సమైక్యతను గురించి మాట్లాడటమే అత్యంత నిరంకుశమైనది.

దేశంలో రాష్ట్రాలు ఏర్పడటం కొత్తకాదు. 14 రాష్ట్రాలుగా ఉన్న దేశం 28 రాష్ట్రాలుగా మారింది. రాష్ట్రాల సరిహద్దులు కూల్చలేని రాతి గోడలు కావు. 70 ఏండ్లపాటు జాతుల సమాఖ్యగా కొనసాగిన సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై జాతులు దేశాలుగా అవతరించిన చరిత్ర ఇటీవలిదే. ఎటువంటి హింసకుతావు లేకుండానే ఈ దేశాల ఆవిర్భావం జరిగింది. జాతుల సమాఖ్యగా సోవియట్ యూనియన్ ఏర్పాటైనప్పుడు జాతులకు ఎపుడైనా సమాఖ్య నుంచి విడిపోయే హక్కుని కల్పించారు లెనిన్. యుగోస్లోవియాలోనూ అదే జరిగింది. ఇదే కాలంలో జర్మనీ జాతిని రెండవ ప్రపంచ సామ్రాజ్యవాద యుద్ధం రెండుగా చీల్చింది. జర్మన్ ఏకీకరణ కోసం రెండు దేశాల ప్రజల పరస్పర అంగీకారం మేరకు జరిగింది. సమాఖ్య నుంచి విడిపోవాలనుకున్నపుడు ఒక హక్కుగా విడిపోయి జాతి రాజ్యాలుగా ఏర్పాటైనాయి. ఇటీవలి దక్షిణ సూడాన్‌లోనూ జరిగింది కూడా ఇదే.

1956లో నిర్దిష్టమైన షరతులతో ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఏర్పాటయ్యింది. ఆంధ్రవూపదేశ్ ఏర్పాటు పరస్పర సంఫూర్ణ అంగీకారం మేరకు జరిగింది కాద ని చరిత్ర చెబుతున్నది. పెద్ద మనుషుల ఒప్పందం అనే షరతుల పునాది మీదనే ఈ రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రవూపదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు భావ సమైక్యత ఏర్పడలేదు. సాంస్కృతిక రంగంలోనూ సీమాంధ్ర మేధావివర్గాలు, ఆలోచనాపరులు కూడా ఇందుకోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. సీమాంధ్ర పాలక వర్గాలు అందుకు అవసరమైన కృషి చేయలేదు. పరిపాలనలోనూ, నిర్ణయాధికారంలోనూ సీమాంధ్ర పాలకులదే పైచేయిగా కొనసాగడం వల్ల తెలంగాణ ప్రాంత నాయకత్వం రాజకీయ బానిసలుగా మారిపోయారు. తమకు అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రజలు భావిస్తే విడిపోయే హక్కు వారికి ఉంటుంది.

నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విలీన ప్రకటన చేసిన సందర్భంలోనే విడిపోయే హక్కును గుర్తిస్తూ మరో ప్రకటన కూడా చేశారు. అయితే అంతర్జాతీయ సమాజం గుర్తించిన విడిపోయే హక్కును సమైక్యవాదులుగా చెలామణి అవుతున్న కొంతమంది సీమాంధ్ర నాయకులు గుర్తించడంలేదు. పైగా సమైక్యవాదాన్ని ఒక హక్కు గా గుర్తించమంటున్నారు. హక్కుల భావనకే కొత్త భాష్యాన్ని చెప్పే ప్రయ త్నం చేస్తున్నారు. 1969 లో విడిపోతామని ఉద్యమిస్తే 370 మంది విద్యార్థులను చంపి సమైక్య రాష్టాన్ని కొనసాగిస్తున్నారు. ఇవ్వాళ 600 మంది ప్రాణ త్యాగం చేశారు. మొత్తం తెలంగాణ సమాజమంతా స్వరాష్ట్రం కోసం పిడికిపూత్తి నినదిస్తున్నది. సమైక్యత అనే భావన తెలంగాణ ప్రజల మనోఫలకాల నుంచి సమూలంగా చెదిరిపోయిం ది.

అంతర్గత వలస దోపిడీకి అలవాటు పడిన కొంతమంది సీమాంధ్ర సంపన్ను లు, వారికి అంటగాగుతున్న కొంతమంది సీమాంధ్ర పాలక వర్గాల ప్రతినిధులు సమైక్యత ముసుగులో తమ స్వార్థ ప్రయోజనాలను కలకాలం కొనసాగించుకునేందుకు తాపవూతయపడుతున్నారు.

ఇవ్వాళ తెలంగాణ, ఆంధ్ర ప్రజలు నిట్టనిలువునా చీలిపోయిన స్థితిలో ఇంకా ఈ పెట్టుబడిదారీ వర్గాలు మాయా సమైక్యతవాదాన్ని పట్టుకుని వేలాడుతున్నారు. తెలంగాణ ప్రజావూపతినిధులు అసెంబ్లీకి హాజరుకావడం లేదు. తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్యెల్యేలు, ఎమ్మె ల్సీలు, మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఆంధ్రవూపదేశ్ అసెంబ్లీ కేవ లం ఆంధ్ర అసెంబ్లీగా కుదించుకు పోయిం ది. తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, జర్నలిస్టులు, డాక్టర్లు, అడ్వకేట్లు, విద్యార్థులు ... ఇట్లా అన్ని వర్గాల ప్రజలు ఆంధ్రవూపదేశ్ భావన నుంచి మానసికంగా విడిపోయి తెలంగాణ అస్తిత్వంతో మమేకమయ్యారు. అయినా తెలంగాణ ప్రాంతంలో నివసిస్తు న్న సీమాంధ్ర ప్రజల పట్ల సుహృద్భావాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

ఇరు ప్రాంతాలకు చెందిన నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసిన సందర్భాల్లోనూ తెలంగాణ ప్రాంత సాధారణ ప్రజపూవ్వరూ ఆంధ్రా ప్రజల మీద తమ అక్కసును వెళ్లగక్కిన సందర్భాలు లేవు. తెలంగాణ ప్రాంతంలో నివస్తున్న సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ప్రజపూవ్వరూ తెలంగాణ అస్తిత్వ భావన కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలూ లేవు. అంటే ఇరు ప్రాంతాలకు చెందిన ప్రజలందరూ అనేక దశాబ్దాలుగా కొనసాగిస్తున్న సమైక్యతను ఒక సామాజిక విలువగానూ, తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సహజమైన హక్కుగానూ పరస్పరం గుర్తిస్తున్నారు.

సామరస్యపూర్వక వాతావరణాన్ని కొనసాగిస్తూ, నిలబెట్టుకుంటూ.. ఇరు ప్రాంతాలకు చెందిన ప్రజల మధ్యన నెలకొని ఉన్న పౌర సామరస్యతను గౌరవించుకుంటున్నా రు. ప్రజల మధ్యన విద్వేషాలు, వైషమ్యాలను రెచ్చగొడుతూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల ఐక్యతను దెబ్బతీస్తున్న వారిని ప్రజలు గమనిస్తున్నారు. భౌతిక విభజన ద్వారా తెలంగాణ ప్రజల జాతీయతాభావనను కాపాడుకోవాల్సిన కర్తవ్యం అందరి మీదా ఉందని గుర్తిస్తున్నారు.

35

RAVINDAR PITTALA

Published: Wed,March 26, 2014 12:55 AM

తెలంగాణ జేఏసీ తక్షణ కర్తవ్యం!

తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో సంఘటిత శక్తి ని ప్రదర్శించి, రాజకీయ ఐక్యతను సాధించిన తెలంగాణ జేఏసీ తెలంగాణ పునర్నిర్మాణంలోనూ తన అస్త

Published: Sun,December 15, 2013 12:34 AM

జలధారలపై జలగలదాడి

ఆదిలాబాద్ జిల్లాలోని జలధారలమీద సీమాంధ్ర దోపిడీవర్గాలు జలగల్లాగా విరుచుకుపడేందుకు రంగాన్ని సిద్ధం చేసుకున్నాయి. కుంటాల జలపాతంపైన జల

Published: Thu,September 26, 2013 02:40 AM

‘సకల జనభేరి’ మోగిద్దాం

సమైక్యత పేరుమీద సీమాంవూధలో ముఖ్యమంత్రి పరోక్ష నాయకత్వంలో యాభయి రోజులుగా జరుగుతున్న ‘తమాషా’ ఉద్యమం వెనక స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడ

Published: Mon,July 22, 2013 01:05 AM

తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ బాధ్యత

తెలంగాణ అంశాన్ని తేలుస్తున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలోనూ, కేంద్రంలోనూ నెలరోజులుగా తీవ్రస్థాయిలో హడావుడి చేస్తున్నది. గ్రామ

Published: Fri,May 31, 2013 09:58 PM

ఆంధ్రాపార్టీలు అవసరమా?

ప్రజలు వ్యక్తం చేసే అభివూపాయాలను, ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా పనిచేయాల్సిన బాధ్యత పార్లమెంటు, శాసనసభలకు ఉన్న ది. రాజ్యాంగ ని

Published: Wed,March 27, 2013 10:51 PM

విద్యావంతుల ఉద్యమవేదిక

నడుస్తున్న చరివూతలో మన పాదమువూదలను ఎంత గాఢంగా వేయగలిగామన్న దానిపైనే చరివూతలోమన స్థానం నిర్ధారించబడుతుంది. గత తొమ్మిదేళ్లలో తెలంగ

Published: Sun,March 17, 2013 12:41 AM

ఆకాంక్ష పట్టని అసమర్థ నేతలు

మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక ఆకాంక్షగానే మొదలయ్యింది. సాంస్కృతిక, సాహిత్య రూపాలలో భావవ్యాప్తి జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష

Published: Sat,October 6, 2012 04:12 PM

తెలంగాణ మార్చ్ దిశగా..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ హామీని అమలు చేసే వి

Published: Sat,October 6, 2012 04:13 PM

తెగించి కొట్లాడుదాం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పిల్లలు నిట్టనిలువునా కాలిపోతున్నరు. పిట్టల వలె రాలిపోతున్నరు. ఇప్పటి వరకు దాదాపు 63 మంది యువతీ యువకులు

Published: Sat,October 6, 2012 04:14 PM

ఉత్పత్తి వేటలో జీవన విధ్వంసం

వేగవంతమైన బొగ్గు ఉత్పత్తి, మితిమీరిన లాభాపేక్ష లక్ష్యాలతో సింగరేణి బొగ్గుగనుల సంస్థ ఓపెన్‌కాస్ట్ గనులను నిర్వహిస్తున్నది. దీనివల్ల

Published: Sat,October 6, 2012 04:14 PM

ఎన్టీపీసీ విస్తరణ ఎవరి కోసం?

ఏదైనా సంస్థ విస్తరించడమంటే.. అది అభివృద్ధి దిశలో పయనిస్తున్నట్టుగా భావించాలి. ఆ అభివృద్ధిని చూసి అందరూ గర్వపడతారు. ఆ విస్తరణను ఆహ్

Published: Sat,October 6, 2012 04:15 PM

ఈ మోసం ఇంకెన్నాళ్లు?

సరిగ్గా రెండేళ్ల కితం 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా

Published: Sat,October 6, 2012 04:14 PM

ఈ ప్రభుత్వం మనదెట్లా..?

ప్రజాస్వామిక హక్కులను ప్రతిబింబించవలసిన ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు ప్రజలపై విశ్వాసం లేదు. ప్రజా ప్రతినిధులపై విశ్వాసంలేదు. ప్రజలకు ఇ

Published: Sat,October 6, 2012 04:16 PM

ఐక్య ఉద్యమమే అంతిమ మార్గం

తెలంగాణ రాష్ట్ర సాధనకు ఐక్య ఉద్యమమే అంతిమ మార్గంగా అందరూ కలిసి ముందుకుపోవాల్సి ఉంది. రాష్ట్ర సాధనోద్యమంలో ముందువరుసలో నిలబడిన తెలం

Published: Sat,October 6, 2012 04:15 PM

సింగరేణి ఉద్యమానికి కొండంత అండ..

-పిట్టల రవీందర్ (‘తెలంగాణ విద్యావంతుల వేదిక’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ‘ఒక ప్రాంతంలో లభ్యమయ్యే వనరులు ఆ ప్రాంత ప్రజల సంక్షేమాన