ఉత్పత్తి వేటలో జీవన విధ్వంసం


Sat,October 6, 2012 04:14 PM

colbelt talangana patrika telangana culture telangana politics telangana cinemaవేగవంతమైన బొగ్గు ఉత్పత్తి, మితిమీరిన లాభాపేక్ష లక్ష్యాలతో సింగరేణి బొగ్గుగనుల సంస్థ ఓపెన్‌కాస్ట్ గనులను నిర్వహిస్తున్నది. దీనివల్ల గోదావరి నదీలోయలో వెలుగుచూస్తున్న విధ్వంసానికి వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు సంఘటితంగా ఎదురు తిరుగుతున్నారు. రెండు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం ఈ ప్రాంతాలలోని రాజకీయ పార్టీలను ప్రభావితం చేయడంతోపాటు, ఇది వాటికి ఎజెం డాగా మారిపోయింది. ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల విస్తరణకు లోపాయికారీ పద్ధతుల్లో సహకరిస్తున్న రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ఇవ్వాళ వీటిని బహిరంగంగా ఆమోదించే సాహసం చేయలేకపోతున్నాయి. ఫలితంగా సుమారు మూడేళ్ల పాటు ఓపెన్‌కాస్ట్ గనుల విస్తరణపై వ్యూహాత్మకంగా మౌనం పాటించిన సింగరేణి యాజమాన్యం ఇందారం, శ్రావణ్‌పల్లి తదితర ప్రాజెక్టుల ప్రతిపాదనలను తెచ్చి కోల్‌బెల్ట్ పల్లెల్లో కల్లోలానికి తెరలేపింది. అందువల్ల ఓపెన్‌కాస్ట్ గనుల విధానం వల్ల పెల్లుబుకుతున్న నిరసనల నేపథ్యా న్ని, ఇందుకు దారి తీసిన పరిస్థితులను విశ్లేషించుకోవాల్సి ఉన్నది. బాధిత ప్రజల పక్షాన నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉన్నది.

దక్షిణ భారతదేశంలోనే ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థగా ఉన్న సింగరేణి ప్రస్తుతం 36 అండర్‌క్షిగౌండ్ గనులు, 14 ఓపెన్‌కాస్ట్ గనుల ద్వారా ఏటా 53 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నది. రానున్న కాలంలో మరో 25 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులను చేప ప్రణాళికలను సిద్ధం చేసుకున్నది. అనేక అండర్‌క్షిగౌండ్ గనులను ఓపెన్‌కాస్ట్‌లుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నది. గత ఇరవై ఏళ్లలో 26 అండర్‌క్షిగౌండ్ గనుల ను మూసివేశారు. దీంతో 52 వేల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయా రు. పరోక్షంగా ఐదు లక్షల మంది తమ ఉపాధి అవకాశాలు కోల్పోయారు.

ఓపెన్‌కాస్ట్ విధానంలో భూమి ఉపరితలం నుంచి 150 మీటర్ల లోతు వర కు (కొన్ని సందర్భాలలో 300 మీటర్ల లోతు వరకు కూడా) మట్టిని తొలగిం చి, భూగర్భంలో ఉన్న బొగ్గు పొరలను వెలికితీస్తారు. ఒక టన్ను బొగ్గును వెలికితీయడానికి సగటున నాలుగు నుంచి ఎనిమిది క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించవలసి ఉంటుంది. (భూ భౌతిక పరిస్థితులను బట్టి ఈ లెక్కల్లో మార్పులుంటాయి.) ఒక క్యూబిక్ మీటర్ మట్టి బరువు సగటున ఒకటిన్నర టన్నుల బరువుగా లెక్కగడతారు. అంటే ఒక టన్ను బొగ్గును వెలికితీయాలంటే 15 టన్నుల బరువుతో సమానమైన మట్టిని తొలగించవలసి ఉంటుంది. సింగరేణి సంస్థ ఇప్పటి వరకు ఓపెన్‌కాస్ట్ విధానం ద్వారా సుమారు 30 కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. అంటే 45 వేల కోట్ల టన్నుల బరువుతో సమానమైన మట్టిని భూమి ఉపరితలం నుంచి తొలచివేసింది.

ఈ మట్టిని నిలువ చేయడానికి 22 వేల ఎకరాల భూమిని ఉపయోగించుకున్నది. ప్రస్తుతం నిర్వహిస్తున్న 15 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల వల్ల 50 వేల ఎకరాల వ్యవసాయ, అటవీ భూములు నిరూపయోగంగా మారాయి. ఇవేగాక 56 అండర్‌క్షిగౌండ్ గనుల నిర్వహణ కోసం మరో లక్ష ఎకరాలను వినియోగిస్తున్నది. ఈ భూమి మీద ఆధారపడి లక్షలాది మంది ఆదివాసీలు, దళితులు, వ్యవసాయ కూలీలు ఉపాధిని కోల్పోయారు.

ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల వల్ల అనేక దుష్పరిణామలు చోటుచేసుకుంటున్నాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఓపెన్‌కాస్ట్ విధానంతో భూమి ఉపరితలం నుంచి 150 మీటర్ల లోతు వరకు మాత్రమే బొగ్గు నిక్షేపాలను వెలికితీసేవారు. కానీ అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పుడు సుమారు 400 మీటర్ల వరకు బొగ్గును వెలికితీసే అవకాశాలు లభించాయి. దీనివల్ల ఈ పరిసర ప్రాంతాల్లోని భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోతాయి. ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు పరిధిలోని దాదాపు 10 కిలోమీటర్ల పరిధిలో వ్యవసాయ భూములు సాగుయోగ్యతను కోల్పోతాయి. ఓపెన్‌కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలు వినియోగించడం వల్ల శబ్ద కాలుష్యం, చమురు కాలుష్యం, పర్యావరణాన్ని ఎక్కువగా దెబ్బతీస్తాయి. జంతు జీవాలకూ ప్రాణాంతకంగా మారుతున్నది.

ఓపెన్‌కాస్ట్ గనుల ప్రాంతాల్లో పంటపొలాల భూసారంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గనికి ఐదున్నర కిలోమీటర్ల దూరంలో నిర్వహించిన భూసా ర పరీక్షల్లో భూసార క్షీణకారకాల (పీహెచ్) స్థాయి మూడున్నరగా నమోదుకాగా, గని సమీప ప్రాంతాల్లోని భూముల్లో (పీహెచ్)స్థాయి 3నుంచి .13 వరకు ఉన్నట్టు వ్యవసాయశాఖ అధ్యయనంలో నిర్ధారించారు.

గనుల సమీపంలోని పంటపొలాల్లో భూసారం తగ్గిపోయి, ఎరువుల వినియోగం పెరిగిపోయింది. దీంతో రైతులకు సాగు ఖర్చులు పెరగడంతో పాటు , పంట దిగుబడులు కూడా తగ్గిపోతున్నట్లు పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. కోల్ ఇండియాకు అనుబంధంగా ఉన్న నార్త్ ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌ఇసిఎల్)లో అక్కడి వ్యవసాయ శాఖ నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఓపెన్ కాస్ట్ గని పరిసర ప్రాంతంలోని 250 ఎకరాల పంటపొలాలకు నష్టం వాటిల్లుతుండగా, మరో 75 ఎకరాల మేర భూమి బొగ్గు , దుమ్ము పేరుకుపోవడంతో సాగుకు పనికిరాకుండాపోతున్నది. ఓపెన్ కాస్ట్ గని రాకపూర్వం ఈ ప్రాంతంలో హెక్టారుకు 1 టన్నుల వరి ధాన్యం దిగుబడి రాగా, బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత నుంచి 9 టన్నులకు దిగుబడి పడిపోయినట్లు వ్యవసాయశాఖ తన అధ్యయనంలో తెలిపింది.

ఓపెన్ కాస్ట్ గనుల్లో వెలువడే ఆమ్లాలు, ఇతరత్రా నీటి కాలుష్య కారకాలు సమీప చెరువుల్లోకి చేరటం వల్ల గని పరిసరప్రాంతాల్లో చేపల పెంపకం పూర్తిగా కుంటుపడిపోయింది. దానిమీద ఆధారపడిన వందలాది మత్స్యకార కుటుంబాలు ఉపాధిని కోల్పోయాయి. బొగ్గులో బూడిద శాతం తక్కువగా ఉండే ఎన్‌ఇసీఎల్ సంస్థ పరిధిలోనే పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే, బొగ్గులో 15నుంచి 45 శాతం బూడిద కలిగి ఉండే సింగరేణి ప్రభావిత ప్రాంతాలలో పరిస్థితి మరెంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఓపెన్ కాస్ట్ నిర్వహణ వల్ల పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న 11 ఏళ్లలోపు పిల్లల్లో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెలువరించిన అధ్యయన నివేదికలు వెల్లడించాయి. ఓపెన్ కాస్ట్ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యార్థుల్లో ఏకాక్షిగత తగ్గిపోతున్నదని, జ్ఞాపకశక్తి క్షీణిస్తున్నదని కూడా ఆ అధ్యయనంలో తెలిపారు.

ముఖ్యంగా ఈ వయస్సు పిల్లల్లో శ్వాస కోశ,చర్మసంబంధమైన వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పష్టం చేసింది. ఓపెన్ కాస్ట్ గనులున్న ప్రాంతాల్లోని గర్భిణీలు ఎక్కువ శాతం సహజ ప్రసవాలకు నోచుకోక సిజేరియ న్ ఆపరేషన్‌ల ద్వారానే పిల్లలకు జన్మనిస్తున్నారని కూడా ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఓపెన్‌కాస్ట్ గనుల్లో నిర్వహించే పేలుళ్లతో శబ్ధకాలుష్యం, దుమ్ము ,ధూళితో పక్షులు, చిట్టడవుల్లో నివసించే జీవాలు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. క్రిమి కీటకాలు, కనిపించకుండాపోతున్నాయి. ఫలితంగా జీవ సమతుల్యత దెబ్బతింటున్నది. ప్రతి ఓపెన్ కాస్ట్ బొగ్గుగని నిర్వహణ ఫలితంగా చుట్టూ పదికిలోమీటర్ల పరిధిలో ఈ దుష్ఫరిణామాలన్నీ సంభవిస్తున్నాయని అంతర్జాతీయ పర్యావరణ సంస్థలు నిర్వహించిన శాస్త్రీయ పరిశీలనలో తేల్చి చెప్పాయి.
అయితే ఈ పరిణామాలన్నింటినీ ఎదుర్కోవడానికి భారత బొగ్గు మంత్రిత్వశాఖ చేసిన సూచనలేవీ మనదేశంలోని బొగ్గు ఉత్పత్తి సంస్థలు పాటించడం లేదు.

మన దేశంలోని బొగ్గుగనుల ప్రాంతాల్లో సామాజిక , పర్యావరణ సమస్యలపై ఢిల్లీలో 2007 నవంబర్‌లో అంతర్జాతీయ మహాసభ జరిగింది. ఈ సభ ‘న్యూ ఢిల్లీ డిక్లరేషన్’ పేరిట అనేక సూచనలు చేసింది. కొత్తగా గనులను ప్రారంభించినప్పుడు, ప్రభావిత ప్రాంతాలలో, సామాజిక, పర్యావరణ సంబంధమైన అధ్యయనాలు నిర్వహించాలని, ఆ ప్రాంత ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సూచించింది. సింగరేణి గడచిన 125 ఏళ్ళలో భారీ బొగ్గు ఉత్పత్తి, అధిక లాభాలను లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ ప్రజల స్థితిగతులను, దుష్ఫరిణామాల పట్టించుకున్న పాపానపోలేదు. ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు ప్రతిపాదించిన ప్రతిచోటా ప్రజల్లో వెల్లు నిరసనలే ఇందుకు నిదర్శనం. ఇంతటి విధ్వంసానికి కారణమైన ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులను ప్రజపూందుకు ఆమోదించాలి?

-పిట్టల రవీందర్
తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

35

RAVINDAR PITTALA

Published: Wed,March 26, 2014 12:55 AM

తెలంగాణ జేఏసీ తక్షణ కర్తవ్యం!

తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో సంఘటిత శక్తి ని ప్రదర్శించి, రాజకీయ ఐక్యతను సాధించిన తెలంగాణ జేఏసీ తెలంగాణ పునర్నిర్మాణంలోనూ తన అస్త

Published: Sun,December 15, 2013 12:34 AM

జలధారలపై జలగలదాడి

ఆదిలాబాద్ జిల్లాలోని జలధారలమీద సీమాంధ్ర దోపిడీవర్గాలు జలగల్లాగా విరుచుకుపడేందుకు రంగాన్ని సిద్ధం చేసుకున్నాయి. కుంటాల జలపాతంపైన జల

Published: Thu,September 26, 2013 02:40 AM

‘సకల జనభేరి’ మోగిద్దాం

సమైక్యత పేరుమీద సీమాంవూధలో ముఖ్యమంత్రి పరోక్ష నాయకత్వంలో యాభయి రోజులుగా జరుగుతున్న ‘తమాషా’ ఉద్యమం వెనక స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడ

Published: Mon,July 22, 2013 01:05 AM

తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ బాధ్యత

తెలంగాణ అంశాన్ని తేలుస్తున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలోనూ, కేంద్రంలోనూ నెలరోజులుగా తీవ్రస్థాయిలో హడావుడి చేస్తున్నది. గ్రామ

Published: Fri,May 31, 2013 09:58 PM

ఆంధ్రాపార్టీలు అవసరమా?

ప్రజలు వ్యక్తం చేసే అభివూపాయాలను, ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా పనిచేయాల్సిన బాధ్యత పార్లమెంటు, శాసనసభలకు ఉన్న ది. రాజ్యాంగ ని

Published: Wed,March 27, 2013 10:51 PM

విద్యావంతుల ఉద్యమవేదిక

నడుస్తున్న చరివూతలో మన పాదమువూదలను ఎంత గాఢంగా వేయగలిగామన్న దానిపైనే చరివూతలోమన స్థానం నిర్ధారించబడుతుంది. గత తొమ్మిదేళ్లలో తెలంగ

Published: Sun,March 17, 2013 12:41 AM

ఆకాంక్ష పట్టని అసమర్థ నేతలు

మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక ఆకాంక్షగానే మొదలయ్యింది. సాంస్కృతిక, సాహిత్య రూపాలలో భావవ్యాప్తి జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష

Published: Sat,October 6, 2012 04:12 PM

తెలంగాణ మార్చ్ దిశగా..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ హామీని అమలు చేసే వి

Published: Sat,October 6, 2012 04:13 PM

తెగించి కొట్లాడుదాం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పిల్లలు నిట్టనిలువునా కాలిపోతున్నరు. పిట్టల వలె రాలిపోతున్నరు. ఇప్పటి వరకు దాదాపు 63 మంది యువతీ యువకులు

Published: Sat,October 6, 2012 04:14 PM

ఎన్టీపీసీ విస్తరణ ఎవరి కోసం?

ఏదైనా సంస్థ విస్తరించడమంటే.. అది అభివృద్ధి దిశలో పయనిస్తున్నట్టుగా భావించాలి. ఆ అభివృద్ధిని చూసి అందరూ గర్వపడతారు. ఆ విస్తరణను ఆహ్

Published: Sat,October 6, 2012 04:15 PM

ఈ మోసం ఇంకెన్నాళ్లు?

సరిగ్గా రెండేళ్ల కితం 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా

Published: Sat,October 6, 2012 04:14 PM

ఈ ప్రభుత్వం మనదెట్లా..?

ప్రజాస్వామిక హక్కులను ప్రతిబింబించవలసిన ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు ప్రజలపై విశ్వాసం లేదు. ప్రజా ప్రతినిధులపై విశ్వాసంలేదు. ప్రజలకు ఇ

Published: Sat,October 6, 2012 04:16 PM

ఐక్య ఉద్యమమే అంతిమ మార్గం

తెలంగాణ రాష్ట్ర సాధనకు ఐక్య ఉద్యమమే అంతిమ మార్గంగా అందరూ కలిసి ముందుకుపోవాల్సి ఉంది. రాష్ట్ర సాధనోద్యమంలో ముందువరుసలో నిలబడిన తెలం

Published: Sat,October 6, 2012 04:15 PM

సొంత రాష్ట్రం మా జన్మహక్కు

-శ్రీధర్‌రావు దేశ్‌పాండే, పిట్టల రవీందర్ తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు తెలంగాణను అన్ని రంగాలలో దోపిడీకి, అణిచివేతకు, వివక్ష

Published: Sat,October 6, 2012 04:15 PM

సింగరేణి ఉద్యమానికి కొండంత అండ..

-పిట్టల రవీందర్ (‘తెలంగాణ విద్యావంతుల వేదిక’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ‘ఒక ప్రాంతంలో లభ్యమయ్యే వనరులు ఆ ప్రాంత ప్రజల సంక్షేమాన

Featured Articles