ఈ మోసం ఇంకెన్నాళ్లు?


Sat,October 6, 2012 04:15 PM

సరిగ్గా రెండేళ్ల కితం 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రకటన రావడానికి రెండురోజుల ముందుగానే ప్రతిపక్షనేత నారా చంద్రబాబు ‘దమ్ముంటే అసెంబ్లీలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం ప్రవేశపెట్టాలని’ సవాలు విసిరారు. డిసెంబర్ ఏడవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అంశం పై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలోనూ మెజారిటీ రాజకీయ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా తమ అభివూపాయాలను స్పష్టంగా చెప్పాయి.
1996లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుయ ఉద్యమం ‘ప్రజల ఆకాంక్ష’ గా ఊపందుకున్నది. 2001 లో ‘తెలంగాణ రాష్ట్రసమితి’ ఏర్పాటుతో ప్రజల ఆ కాంక్షకు ఒక బలమైన రాజకీ య వ్య క్తీకరణ తోడయ్యింది. ఫలితంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం వెల్లు పర్యవసానంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష ‘రాజకీయ డిమాండ్’ గా రూపుదిద్దుకున్నది. తెలంగాణ ప్రజా ఉద్యమ నేపథ్యంలో 2009 డిసెంబర్ 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం చేసిన రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిం ది. డిసెంబర్ 10వ తేదీనాడు కేంద్ర ప్రభుత్వం లోకసభ, రాజ్యసభలలో అధికారిక ప్రకటనలు చే సింది. అంతకు ఐదేళ్ల ముందుగానే యూపీఏ ప్రభుత్వం రూపొందించుకున్న ‘కనీస ఉమ్మడి కార్యక్రమం’లోనూ, పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశంలోనూ, భారత రాష్ట్రపతి చేసిన ప్రసంగంలోనూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను గుర్తించారు. అందువల్ల తెలంగాణ రాజకీయ డిమాండ్ ఒక ‘రాజ్యాంగ హక్కు’గా మారింది. ప్రజలు ఉద్యమం ద్వారా సాధించుకున్న హక్కును అమలు చేయవలసిన బాధ్యత ప్రజాస్వామిక ప్రభుత్వాలపై ఉంటుంది.
తెలంగాణ రాష్ట్ర డిమాండును ఆమోదించిన రోజు నుం చి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది.

ఆ పార్టీ నాయకత్వంలోనే యూపీఏ సర్కార్ నడుస్తున్నది. కానీ ప్రజాస్వామిక స్ఫూర్తితో, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించవలసిన కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవడంలోనూ, ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయడంలోనూ బుద్ధిపూర్వకంగా విఫలమయ్యాయి. అందువల్లనే పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టాలని గడిచిన రెండు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు నిరంతరంగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలకు బాధ్యత వహించవలసిన ఇక్కడి కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులపై నిరంతరంగా అనేక రూపాల్లో ఒత్తిడి కొనసాగిస్తూనే ఉన్నారు.

తెలంగాణ విషయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు. 2009 ఎన్నికల ముందుదాకా గాఢ నిద్రలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ, దాని నాయకత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హఠాత్తుగా మేలుకొని, ఎన్నికలకు ముందు హడావుడిగా అసెంబ్లీలో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేశాయి. అప్పటి ఆర్థిక శాఖ మంత్రి రోశ య్య చైర్మన్‌గా తెలంగాణ పై రాష్ట్ర ప్రభుత్వం మరో కమిటీ ఏర్పాటు చేసింది. ‘రాష్ట్ర విభజన’ ఫలితంగా తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు, ఇరు ప్రాంతాలకు సంబంధించిన అనేక అంశాలపై పరిష్కార మార్గాలను సూచించేందుకు రోశయ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు’ అప్పటి సీఎం వైఎస్ ప్రకటించారు.ఈ నేపథ్యంలోనే ఎన్నికల సందర్భంగా మరోసారి తెలంగాణ హామీని ఎన్నికల ఎజెండాగా కాంగ్రెస్‌పార్టీ తెరపైకి తీసుకువచ్చింది.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగా ణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ కోసం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ‘అమరణ నిరహార దీక్ష’తో వెలు ప్రజా ఉద్యమానికి తలవంచిన కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9న ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు’ ప్రకటించింది.

పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం స్వయం గా చేసిన ప్రకటన కూడా ఇంతవరకూ అమలుకు నోచుకోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరిత వైఖరి కారణంగానే, తెలంగాణ పై ఇచ్చిన హామీలు తప్పిన కారణంగానే ఇప్పటికి 750 మందికిపైగా యువతీ యువకు లు, విద్యార్థులు ఆత్మబలిదానాలు చేశారు. ఈ పాపం కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. తెలంగాణ ఏర్పాటును తమకున్న అధికారంతో, ఆర్థిక బలంతో అడుగడుగునా అడ్డుకుంటున్న సీమాంధ్ర పాలకులు, ఆ ధిపత్యశక్తులు, సంపన్నవర్గాలు తె లంగాణలో జరుగుతున్న ఈ బలవంతపు మరణాలకు బాధ్యత వహించాలి.
తెలంగాణ రాష్ట్రాన్ని ‘ఇచ్చేది మేమే... తెచ్చేది మేమే’ అంటూ గడిచిన రెండేళ్లు గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులు ఉద్యమంలో దాగుడుమూతలు ఆడుతున్నారు. తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ‘మాక్ దీక్ష లు’, డిన్నర్ మీటింగులు, మీడియా హెచ్చరికలు, అధిష్ఠానం ముందు అలకలతో నాటకానికి రక్తి కట్టిస్తున్నారు.

నియోజకవర్గాల్లో వీర విప్లవకారులుగా, హైదరాబాద్‌లో ఉభయకుశలోపరులుగా, ఢిల్లీలో వీర విధేయులుగా తెలంగాణ ప్రాంత ఎంపీలు తమ బహుముఖ ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ నాటకానికి తెరదించకుండా, తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీని భూస్థాపితం చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రకటనను అమలు చేయించుకోవడం సులభం కాదు. కాబట్టి మంత్రాలకు చింతకాయలు రాలవని, దెబ్బకే దెయ్యం వదులుతుందని తెలంగాణ ప్రజలకు తెలి సొచ్చింది.

-పిట్టల రవీందర్
తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

35

RAVINDAR PITTALA

Published: Wed,March 26, 2014 12:55 AM

తెలంగాణ జేఏసీ తక్షణ కర్తవ్యం!

తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో సంఘటిత శక్తి ని ప్రదర్శించి, రాజకీయ ఐక్యతను సాధించిన తెలంగాణ జేఏసీ తెలంగాణ పునర్నిర్మాణంలోనూ తన అస్త

Published: Sun,December 15, 2013 12:34 AM

జలధారలపై జలగలదాడి

ఆదిలాబాద్ జిల్లాలోని జలధారలమీద సీమాంధ్ర దోపిడీవర్గాలు జలగల్లాగా విరుచుకుపడేందుకు రంగాన్ని సిద్ధం చేసుకున్నాయి. కుంటాల జలపాతంపైన జల

Published: Thu,September 26, 2013 02:40 AM

‘సకల జనభేరి’ మోగిద్దాం

సమైక్యత పేరుమీద సీమాంవూధలో ముఖ్యమంత్రి పరోక్ష నాయకత్వంలో యాభయి రోజులుగా జరుగుతున్న ‘తమాషా’ ఉద్యమం వెనక స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడ

Published: Mon,July 22, 2013 01:05 AM

తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ బాధ్యత

తెలంగాణ అంశాన్ని తేలుస్తున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలోనూ, కేంద్రంలోనూ నెలరోజులుగా తీవ్రస్థాయిలో హడావుడి చేస్తున్నది. గ్రామ

Published: Fri,May 31, 2013 09:58 PM

ఆంధ్రాపార్టీలు అవసరమా?

ప్రజలు వ్యక్తం చేసే అభివూపాయాలను, ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా పనిచేయాల్సిన బాధ్యత పార్లమెంటు, శాసనసభలకు ఉన్న ది. రాజ్యాంగ ని

Published: Wed,March 27, 2013 10:51 PM

విద్యావంతుల ఉద్యమవేదిక

నడుస్తున్న చరివూతలో మన పాదమువూదలను ఎంత గాఢంగా వేయగలిగామన్న దానిపైనే చరివూతలోమన స్థానం నిర్ధారించబడుతుంది. గత తొమ్మిదేళ్లలో తెలంగ

Published: Sun,March 17, 2013 12:41 AM

ఆకాంక్ష పట్టని అసమర్థ నేతలు

మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక ఆకాంక్షగానే మొదలయ్యింది. సాంస్కృతిక, సాహిత్య రూపాలలో భావవ్యాప్తి జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష

Published: Sat,October 6, 2012 04:12 PM

తెలంగాణ మార్చ్ దిశగా..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ హామీని అమలు చేసే వి

Published: Sat,October 6, 2012 04:13 PM

తెగించి కొట్లాడుదాం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పిల్లలు నిట్టనిలువునా కాలిపోతున్నరు. పిట్టల వలె రాలిపోతున్నరు. ఇప్పటి వరకు దాదాపు 63 మంది యువతీ యువకులు

Published: Sat,October 6, 2012 04:14 PM

ఉత్పత్తి వేటలో జీవన విధ్వంసం

వేగవంతమైన బొగ్గు ఉత్పత్తి, మితిమీరిన లాభాపేక్ష లక్ష్యాలతో సింగరేణి బొగ్గుగనుల సంస్థ ఓపెన్‌కాస్ట్ గనులను నిర్వహిస్తున్నది. దీనివల్ల

Published: Sat,October 6, 2012 04:14 PM

ఎన్టీపీసీ విస్తరణ ఎవరి కోసం?

ఏదైనా సంస్థ విస్తరించడమంటే.. అది అభివృద్ధి దిశలో పయనిస్తున్నట్టుగా భావించాలి. ఆ అభివృద్ధిని చూసి అందరూ గర్వపడతారు. ఆ విస్తరణను ఆహ్

Published: Sat,October 6, 2012 04:14 PM

ఈ ప్రభుత్వం మనదెట్లా..?

ప్రజాస్వామిక హక్కులను ప్రతిబింబించవలసిన ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు ప్రజలపై విశ్వాసం లేదు. ప్రజా ప్రతినిధులపై విశ్వాసంలేదు. ప్రజలకు ఇ

Published: Sat,October 6, 2012 04:16 PM

ఐక్య ఉద్యమమే అంతిమ మార్గం

తెలంగాణ రాష్ట్ర సాధనకు ఐక్య ఉద్యమమే అంతిమ మార్గంగా అందరూ కలిసి ముందుకుపోవాల్సి ఉంది. రాష్ట్ర సాధనోద్యమంలో ముందువరుసలో నిలబడిన తెలం

Published: Sat,October 6, 2012 04:15 PM

సొంత రాష్ట్రం మా జన్మహక్కు

-శ్రీధర్‌రావు దేశ్‌పాండే, పిట్టల రవీందర్ తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు తెలంగాణను అన్ని రంగాలలో దోపిడీకి, అణిచివేతకు, వివక్ష

Published: Sat,October 6, 2012 04:15 PM

సింగరేణి ఉద్యమానికి కొండంత అండ..

-పిట్టల రవీందర్ (‘తెలంగాణ విద్యావంతుల వేదిక’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ‘ఒక ప్రాంతంలో లభ్యమయ్యే వనరులు ఆ ప్రాంత ప్రజల సంక్షేమాన

Featured Articles