ఈ ప్రభుత్వం మనదెట్లా..?


Sat,October 6, 2012 04:14 PM

ప్రజాస్వామిక హక్కులను ప్రతిబింబించవలసిన ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు ప్రజలపై విశ్వాసం లేదు. ప్రజా ప్రతినిధులపై విశ్వాసంలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలపై కూడా కనీస బాధ్యతలేకుండా పరిపాలిస్తున్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన ప్రజాస్వామికమైన వైఖరి.

ఈ అసెంబ్లీ ఎంతసేపటికీ సంపన్న వర్గాలకు సంబంధించిన పంపకాల పంచాయితీ చుట్టూ తిరుగుతోంది. ప్రజల బాధలగురించి, సమస్యలగురించిగానీ పట్టింపులేదు. ముమ్మాటికీ ఇది మా తెలంగాణ ప్రభుత్వం కాదు. ప్రత్యేక రాష్ట్ర అస్తిత్వం కోసం 700 మంది ఉద్యమకారులు ఆత్మహత్యలకు పాల్పడినా పట్టించుకోని ప్రభుత్వం ఇది. తెలంగాణ ప్రాంతంలో నోళ్లెండినా, బీళ్లెండినా ఓదార్పునివ్వలేని, మానవత్వంలేని ప్రభుత్వం ఇది. అందుకే మీ పాలనపైనే మాకు విశ్వాసం లేదని ప్రకటిస్తున్నా ము. మీకు మా ప్రజలంటే గౌర వం లేదు. మా ప్రాంత ప్రజా ప్రతినిధులంటే గౌరవం లేదు. కనీసం మీ పార్టీకి చెందిన తెలంగాణ మంత్రులన్నా, ఎంపీలన్నా, నాయకులన్నా ఏమాత్రం విలువ లేదు. ఈ రాష్ట్రంలో భాగంచేసుకున్న తెలంగాణ ప్రాంతం మీ దృష్టిలో వనరుల దోపిడీకి, రాజకీయ ఆధిపత్యానికి ఒక వలస కేంద్రం మాత్రమే. ఒక ప్రాంత ప్రజల పట్ల, ఆ ప్రాంత రాజకీయ నాయకత్వం పట్ల, ప్రజల సమస్యల పట్ల, వారి రాజకీయ ఆకాంక్షలపట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తు న్న ఈ ప్రభుత్వానికి పాలనలో కొనసాగే హక్కులేదు. తెలంగా ణ ప్రజలు మా రాష్ట్రాన్ని మాకు తిరిగి ఇవ్వాలని, అందుకోసం ఉద్యమిస్తున్నందుకే వారిని ఈ ప్రభుత్వం శత్రువులుగా చూస్తున్నది. వారి పక్షాన మాట్లాడుతున్న నాయకులను, విద్యార్థుల ను, ఉద్యమకారులను ద్రోహులుగా, నేరస్థులుగా చిత్రీకరిస్తూ నిత్య నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నది.

తెలంగాణ ప్రజలు కోరుతున్నది రాజ్యాంగబద్ధమైన డిమాం డ్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేసే హక్కు ఉన్నది. ఆ హక్కును కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. పార్లమెంటులోపలా, బయటా అధికారికంగా ప్రకటన కూడా చేసింది. 2009 డిసెంబర్ 9 తర్వాత తెలంగాణ డిమాండు ఒక రాజ్యాంగ హక్కుగా మారింది. ప్రజలు ఉద్య మం ద్వారా సాధించుకున్న హక్కును అమలు చేయవలసిన బాధ్యత ప్రజాస్వామిక ప్రభుత్వాలపై ఉంది. పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టాలని రెండేళ్లుగా ప్రజలు ఉద్యమిస్తూనే ఉన్నారు. అయినా తెలంగాణ ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆకాంక్షలను కనీసం ఒక్కసారి కూడా ఈ ప్రభు త్వం అసెంబ్లీలోచర్చించిన దాఖలాలు లేవు.

700మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడితే ఒక్కసారైనా ఆత్మహత్యలు వద్దని ఈ అసెంబ్లీ ఓ సూచనైనా చేసిందా? సంతాపం తెలిపిందా? విద్యార్థి యువకులు, ఉద్యమకారులు ఆత్మహత్యలకు పాల్పడి, తమ శవయావూతను గన్ పార్క్ వద్దకు తీసుకుపోవాలని కోరితే ఈ ప్రభుత్వం అనుమతించిం దా? పార్లమెంటు సాక్షిగా తెలంగాణ కోసం ఆత్మహత్యకు పాల్ప డి, తన నిరసనను వ్యక్తంచేస్తే ఆయన భౌతికకాయాన్ని ఆంధ్రవూపదేశ్ భవన్ దాకా కూడా పోనియ్యకుండా మోసపూరితంగా హైదరాబాద్‌కు తరలించిన ఘోరచరిత్ర ఈ ప్రభుత్వానిది కాదా? తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేయడానికి ఏర్పాటు చేసిన సభ లు, సమావేశాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా? తెలంగాణలోని విశ్వవిద్యాలయాలను పోలీస్ క్యాంపులుగా మార్చి భయోత్పాతాన్ని సృష్టించింది ఈ ప్రభుత్వం కాదా? తెలంగాణ ఉద్యమ కారులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తి వేస్తామన్న కేంద్ర హోం మంత్రి ప్రకటన అమలయ్యిందా? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నాయకత్వానికి ఉన్న గౌరవం ఏపాటిది? కేసులు ఎత్తివేయాలని ఎంపీలు దీక్ష చేస్తే ముఖ్యమంత్రి లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీ ఏమయ్యింది? తెలంగాణ ఎంపీలకు ఇస్తు న్న గౌరవం ఇదేనా? తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎనిమిదిమంది మంత్రులు, మొత్తం ఎంపీలు మూకుమ్మడిగా కలిసి గ్రూప్-1 పరీక్షలు వాయిదావేయమన్నా వినిపించుకోని ఈ ప్రభుత్వం తెలంగాణకు ఎట్లా ప్రభుత్వమైతది? అక్రమ అరెస్టు ల గురించి హోం మ ంత్రికి దృష్టికి తీసుకెళ్లడానికి అపాయింట్‌మెంట్‌తో ఇంటికికెళ్లిన ఎమ్మెల్యే కేటీఆర్‌ను హోం మంత్రి ఇంటిదగ్గరే అరెస్టు చేయడాన్ని ఎలా భావించాలి? ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు వేసుకున్న టెంటును పోలీసులు తీసుకెళితే.. ముపె్పై మంది ఎమ్మెల్యేలు అడిగినా ఇప్పించలేదం పట్ల వివక్షకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?

ఈ ప్రాంత ప్రజల పట్ల మీరు అనుసరిస్తున్న అణచివేతకు, అగౌరవానికి కారణం ఏమిటో ఇప్పుడు మాకు అర్థమయ్యింది. ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా తెలంగాణ ప్రజ లు నలభై ఏళ్లుగా సాగిస్తున్న ప్రజా ఉద్యమాన్ని అర్థం చేసుకునేందుకు అవకాశం ఉండేది. సమైక్య నినాదంతో మీరు చూపిస్తున్న ప్రేమ మా వనరులను దోచుకోవడానికి మాత్రమే అనే వాస్తవం గ్రహించాము. మా ఉద్యోగాలను కొల్లగొట్టడానికి, మా ఖనిజ సంపదను దిగమింగడానికి మీరు మా మీద చూపిస్తున్న ప్రేమ వాస్తవం కాదని తెలిసింది.
మా నీళ్లను మళ్లించుకుని, ఇక్కడి రైతుల నోట్లో మట్టి గొట్టి మా వ్యవసాయాన్ని నిస్సారం చేయడానికి మీరు నిర్మిస్తున్న ప్రాజెక్టుల మర్మాలు మాకు తెలిశాయి.

హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంచాలని, కేంద్రపాలిత ప్రాంతం చేయాలని మీరు చేస్తున్న కుట్రలు.., రాజధాని చుట్టూ ప్రభుత్వ భూములను, పేదల భూములను మీరు ఆక్రమించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకేనని గ్రహించాము. తెలంగాణ ప్రాంతం మీద రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం మీడియా, సినిమాలపై గుత్తాధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి మా భాషపైనా, యాసపైనా అణచివేత కొనసాగించడానికి మాత్రమే కాని ప్రజలపై ప్రేమతో కాదని తేలిపోయింది. తెలంగాణ ప్రాంత ఆకాంక్షల మీద గౌరవంలేని ప్రభుత్వంపై మాకు కూడా విశ్వాసం ఉండాల్సిన అవసరం లేదనే వాస్తవాన్ని గ్రహించాము. అందుకే ఇక్కడి ప్రజల పక్షాన ఈ ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నాము.

-పిట్టల రవీందర్
తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

35

RAVINDAR PITTALA

Published: Wed,March 26, 2014 12:55 AM

తెలంగాణ జేఏసీ తక్షణ కర్తవ్యం!

తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో సంఘటిత శక్తి ని ప్రదర్శించి, రాజకీయ ఐక్యతను సాధించిన తెలంగాణ జేఏసీ తెలంగాణ పునర్నిర్మాణంలోనూ తన అస్త

Published: Sun,December 15, 2013 12:34 AM

జలధారలపై జలగలదాడి

ఆదిలాబాద్ జిల్లాలోని జలధారలమీద సీమాంధ్ర దోపిడీవర్గాలు జలగల్లాగా విరుచుకుపడేందుకు రంగాన్ని సిద్ధం చేసుకున్నాయి. కుంటాల జలపాతంపైన జల

Published: Thu,September 26, 2013 02:40 AM

‘సకల జనభేరి’ మోగిద్దాం

సమైక్యత పేరుమీద సీమాంవూధలో ముఖ్యమంత్రి పరోక్ష నాయకత్వంలో యాభయి రోజులుగా జరుగుతున్న ‘తమాషా’ ఉద్యమం వెనక స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడ

Published: Mon,July 22, 2013 01:05 AM

తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ బాధ్యత

తెలంగాణ అంశాన్ని తేలుస్తున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలోనూ, కేంద్రంలోనూ నెలరోజులుగా తీవ్రస్థాయిలో హడావుడి చేస్తున్నది. గ్రామ

Published: Fri,May 31, 2013 09:58 PM

ఆంధ్రాపార్టీలు అవసరమా?

ప్రజలు వ్యక్తం చేసే అభివూపాయాలను, ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా పనిచేయాల్సిన బాధ్యత పార్లమెంటు, శాసనసభలకు ఉన్న ది. రాజ్యాంగ ని

Published: Wed,March 27, 2013 10:51 PM

విద్యావంతుల ఉద్యమవేదిక

నడుస్తున్న చరివూతలో మన పాదమువూదలను ఎంత గాఢంగా వేయగలిగామన్న దానిపైనే చరివూతలోమన స్థానం నిర్ధారించబడుతుంది. గత తొమ్మిదేళ్లలో తెలంగ

Published: Sun,March 17, 2013 12:41 AM

ఆకాంక్ష పట్టని అసమర్థ నేతలు

మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక ఆకాంక్షగానే మొదలయ్యింది. సాంస్కృతిక, సాహిత్య రూపాలలో భావవ్యాప్తి జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష

Published: Sat,October 6, 2012 04:12 PM

తెలంగాణ మార్చ్ దిశగా..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ హామీని అమలు చేసే వి

Published: Sat,October 6, 2012 04:13 PM

తెగించి కొట్లాడుదాం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పిల్లలు నిట్టనిలువునా కాలిపోతున్నరు. పిట్టల వలె రాలిపోతున్నరు. ఇప్పటి వరకు దాదాపు 63 మంది యువతీ యువకులు

Published: Sat,October 6, 2012 04:14 PM

ఉత్పత్తి వేటలో జీవన విధ్వంసం

వేగవంతమైన బొగ్గు ఉత్పత్తి, మితిమీరిన లాభాపేక్ష లక్ష్యాలతో సింగరేణి బొగ్గుగనుల సంస్థ ఓపెన్‌కాస్ట్ గనులను నిర్వహిస్తున్నది. దీనివల్ల

Published: Sat,October 6, 2012 04:14 PM

ఎన్టీపీసీ విస్తరణ ఎవరి కోసం?

ఏదైనా సంస్థ విస్తరించడమంటే.. అది అభివృద్ధి దిశలో పయనిస్తున్నట్టుగా భావించాలి. ఆ అభివృద్ధిని చూసి అందరూ గర్వపడతారు. ఆ విస్తరణను ఆహ్

Published: Sat,October 6, 2012 04:15 PM

ఈ మోసం ఇంకెన్నాళ్లు?

సరిగ్గా రెండేళ్ల కితం 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా

Published: Sat,October 6, 2012 04:16 PM

ఐక్య ఉద్యమమే అంతిమ మార్గం

తెలంగాణ రాష్ట్ర సాధనకు ఐక్య ఉద్యమమే అంతిమ మార్గంగా అందరూ కలిసి ముందుకుపోవాల్సి ఉంది. రాష్ట్ర సాధనోద్యమంలో ముందువరుసలో నిలబడిన తెలం

Published: Sat,October 6, 2012 04:15 PM

సొంత రాష్ట్రం మా జన్మహక్కు

-శ్రీధర్‌రావు దేశ్‌పాండే, పిట్టల రవీందర్ తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు తెలంగాణను అన్ని రంగాలలో దోపిడీకి, అణిచివేతకు, వివక్ష

Published: Sat,October 6, 2012 04:15 PM

సింగరేణి ఉద్యమానికి కొండంత అండ..

-పిట్టల రవీందర్ (‘తెలంగాణ విద్యావంతుల వేదిక’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ‘ఒక ప్రాంతంలో లభ్యమయ్యే వనరులు ఆ ప్రాంత ప్రజల సంక్షేమాన