తెలంగాణ జేఏసీ తక్షణ కర్తవ్యం!


Wed,March 26, 2014 12:55 AM

తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో సంఘటిత శక్తి ని ప్రదర్శించి, రాజకీయ ఐక్యతను సాధించిన తెలంగాణ జేఏసీ తెలంగాణ పునర్నిర్మాణంలోనూ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇందుకు ప్రస్తుత ఎన్నికల సందర్భంలో నూ జేఏసీ తన ఉనికిని ప్రదర్శించడం చారిత్రక అవసరం. ఇందుకోసం తెలంగాణ జేఏసీ గతాన్ని స్మరించుకుని, వర్తమానాన్ని సమీక్షించుకుని, భవిష్యత్తును నిర్దేశించుకోవాలి.
తెలంగాణ భావజాల వ్యాప్తిలో అత్యంత కీలకమైన పాత్రను నిర్వహించిన తెలంగాణ విద్యావంతుల వేదికకు పదేళ్లుగా నాయకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్న ప్రొఫెసర్ కోదండరాం బందం తెలంగాణ జేఏసీకి నాయక త్వం వహించడం, వారు అనుసరించిన శాంతియుత మార్గాలు, ఉద్యమ సందర్బాలకు అనుగుణంగా కార్యక్రమాల రూపకల్పన, కార్యాచరణలో వీరు ప్రదర్శించిన నిబద్ధత, నిజాయితీలు ఉద్యమానికి దఢమైన నైతిక బలాన్ని చేకూర్చాయి.
2009డిసెంబర్ 24నాడు అనుకోని పరిస్థితుల్లో, ఎట్లాం టి ముందస్తు ప్రణాళికలు లేకుండా, రాజకీయ నాయకుల ఆలోచనలనుంచి తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటైన తెలంగాణ జేఏసీ తక్కువ కాలంలోనే ఒక ప్రజాస్వామిక ఉద్యమ సంస్థగా రూపాంతరం చెందింది. ముఖ్యంగా తెలంగాణ జేఏసీ నిర్మాణంలోనూ, ఉద్యమకార్యాచరణలోనూ ఉద్యోగ సంఘాలు నిర్వహించిన పాత్ర అమోఘమైనది. విద్యార్థులు, జర్నలిస్టులు, కళాకారులు, ప్రజాసంఘాలు, అడ్వకేట్లు, ఆర్టీసీ, సింగరేణి, తదితర కార్మిక వర్గాలు, విద్యుత్ ఉద్యోగులు, కుల సంఘాలు లాంటి అన్నివర్గాల ప్రజల ఉద్యమ భాగస్వామ్యం తెలంగాణ జేఏసీని రాజకీయాలకు అతీతంగా నిలబెట్టింది.
మిలియన్ మార్చ్, మానుకోట ప్రజా ప్రతిఘటన, సాగరహారం, సంసద్‌యాత్ర, చలో అసెంబ్లీలాంటి కార్యక్రమాల సందర్భంగా జేఏసీ నాయకత్వంలో ఉద్యమశక్తులు ప్రదర్శించిన తెగింపు, రాజకీయపార్టీలు పాటించిన పరిమితులు ... తెలంగాణ జేయేసీని రాజకీయాలకు అతీతమైన అత్యున్నతశక్తిగా నిలబెట్టాయి. జేఏసీ ఇచ్చిన ఉద్యమ కార్యాచరణ రాజకీయ పార్టీల సహకారంతో నిమిత్తం లేకుండానే విజయవంతంగా అమలయ్యాయి.
అయితే తెలంగాణ జేయేసీ ఒక బలమైన శక్తిగా నిలదొక్కుకోవడానికి జేఏసీలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు, జేఏసీకి వెలుపలనుండి మద్దతును అందించిన సహకారం తక్కువేమీకాదు. అయితే రాజకీయ పార్టీలకంటే అతీతమైన శక్తిగా తెలంగాణ జేఏసీ ఎదుగుతున్న సందర్భాలలో జేఏసీని నిర్వీర్యం చేసేందుకు, జేఏసీ నాయకత్వంలోని ఐక్యతను భగ్నం చేయడానికి కొన్ని స్వార్థపర రాజకీయశక్తులు చేసిన ప్రయత్నాలు తక్కువేమీలేవు.
రాష్ర్టసాధన ఉద్యమంలో తెలంగాణ ప్రజలు చూపించిన ఐక్యత మాత్రమే తెలంగాణ జేఏసీకి ఒక బలమైన ఆయుధంగా పనిచేసింది. ఈ ఐక్యతే పాలకవర్గాలమీద ఒత్తిడిని పెంచింది. తెలంగాణ రాష్ర్టం కోసం జరిగిన బలిదానాలు ఇందుకు మరింత దోహదం చేసాయి. ఇవాళ తెలంగాణ తెచ్చింది మేమే, ఇచ్చిం ది మేమే, సహకరించింది మేమే, మా ఉత్తరాలతోనే వచ్చిదంటూ రకరకాలుగా రాజకీయ ప్రయోజనాల కోసం గొప్పలు చెప్పుకుంటున్న పార్టీలన్నీ తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు కావడంలో జరిగిన జాప్యానికి బాధ్యత హించవలసిందే! రాష్ర్ట సాధన ప్రజా ఉద్యమంలో పార్టీలు ప్రదర్శించిన దాగుడుమూతలు, నాయకులు అనుసరించిన పలాయన మార్గాలు ప్రజల జ్ఞాపకాలలో పదిలంగానే ఉన్నాయి. గత జూలై 30వ తేదీనాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటన రోజు నుంచి ఫిబ్రవరి 20న రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేవరకూ జరిగిన రాజకీయ పరిణామాలు, పార్టీలు, ఆయా పార్టీల నాయకులు అనుసరించిన వైఖరులు, కలిగించిన అడ్డంకులు తెలంగాణ సమాజాన్ని కుదిపివేసాయి.
ఒకవైపు రాజకీయపార్టీలు, తెలంగాణ రాజకీయ నాయకత్వం రెట్టించిన ఉత్సాహంతో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకుంటూ, ఈ ఘనత అంతా తమదేనని ఊరేగుతుంటే (తెలంగాణ జేఏసీ ఊసెత్తకుండా!)... ఈ పాక్షిక విజ య సందర్భంలో తెలంగాణ సమాజం స్తబ్దంగా ఎందుకున్నది? మార్చి ఒకటోతేదీనాడు జరిగిన తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ ప్రశ్న చర్చకు వచ్చింది. కానీ ఇంతవరకూ సమాధానం వెతికే ప్రయత్నం జరగలేదు. తెలంగాణ రాష్ర్టం ప్రకటించిన వెంటనే, తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి తమ కలలకు ఒక రూపం వస్తుందని ఆశపడిన తెలంగాణ ప్రజలు రాష్ర్టపతి పాలన, గవర్నర్ అధికారాలు, పదేళ్ల ఉమ్మడి రాజధాని, పోలవరం జాతీయ హోదాతోపాటు ముంపు గ్రామాల కేటాయింపు, తదితర అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన నాయకత్వం మౌనం పాటించడం ఆందోళనకు గురిచేస్తున్నది.
భరో సా ఇవ్వాల్సిన రాజకీయపార్టీలు ఎన్నికల బరిలోకి దిగి అధికారపీఠాన్ని అధిరోహించడంపైనే పూర్తిగా దష్టినిలిపి, ప్రజలను విస్మరించడంతో ఆందోళన మరిం త పెరిగింది. రాష్ట్ర సాధన ఉద్యమంలో కలిపి నడిచిన ఉద్యమ ప్రజలు రాష్ర్టం ఏర్పాటైన వెంటనే పార్టీలుగా విడిపోయి, నాయకులుగా చీలిపోయి, ప్రత్యర్థులుగా ఎన్నికల్లో పోటీపడుతున్న సందర్భం, ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లడానికి కారణమయ్యింది. ప్రజల్లో విశ్వాసాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించవలసిన తెలంగాణ జేఏసీ నాయకత్వంలోని కొందరు అధికారంలో భాగస్వామ్యం కోసం పార్టీలవెంట పరుగులుపెట్టడం, టికెట్ల కోసం వెంపర్లాడటం విస్మయానికి గురిచేసింది.
తెలంగాణ పునర్నిర్మాణానికి సారధ్యం వహించాల్సిన తెలంగాణ జేఏసీ బాధ్యతను వాచ్‌డాగ్ పాత్రకు పరిమితం చేసుకోవడం సమాజాన్ని కలచివేస్తున్నది. తెలంగాణ ద్రోహ పార్టీలుగా స్వయంగా ప్రకటించిన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులను గులాబీ తివాచీ పరిచి స్వాగతించడం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మానుకోటలో ఉద్యమకారులపై స్వయంగా కాల్పులు జరిపి, రక్తపాతానికి నాయకత్వం వహించిన కొండా దంపతులను పార్టీలో చేర్చుకోవడాన్ని తెలంగాణ సమాజం మన్నించలేకపోతున్నది. ఈ దుస్సాహసాన్ని ప్రజల పక్షాన ప్రశ్నించకుండా మౌనం పాటిస్తున్న తెలంగాణ జేఏసీ నాయకత్వ దీనావస్థను చూసి తెలంగాణ సమాజం అధైర్యపడుతున్నది.
తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేముందు తెలంగాణ జేఏసీ తన భవిష్యత్తు మీద వెంటనే దష్టి నిలపాలి. ముందుగా జేఏసీని పునర్నిర్మాణం చేసుకోవాలి. జేఏసీలోని భాగస్వామ్య పార్టీలను జేఏసీ నుంచి మినహాయించి, ప్రజాస్వామికవాదులను, ఉద్యమంలో పనిచేసిన ప్రజాసంఘాలను కలుపుకుని జేఏసీని విస్తరించుకోవాలి. స్పష్టమైన లక్ష్యాలతో, కార్యాచరణతో తెలంగాణ రాజకీయాలను ప్రజాస్వామీకరించే కర్తవ్యానికి పూనుకోవాలి. అప్పుడే తెలంగా ణ భవిష్యత్తుకు భరోసా ఇచ్చి ప్రస్తుతం నెలకొన్న స్తబ్దతను ఛేదించగలుగుతాము.- పిట్టల రవీందర్

158

RAVINDAR PITTALA

Published: Sun,December 15, 2013 12:34 AM

జలధారలపై జలగలదాడి

ఆదిలాబాద్ జిల్లాలోని జలధారలమీద సీమాంధ్ర దోపిడీవర్గాలు జలగల్లాగా విరుచుకుపడేందుకు రంగాన్ని సిద్ధం చేసుకున్నాయి. కుంటాల జలపాతంపైన జల

Published: Thu,September 26, 2013 02:40 AM

‘సకల జనభేరి’ మోగిద్దాం

సమైక్యత పేరుమీద సీమాంవూధలో ముఖ్యమంత్రి పరోక్ష నాయకత్వంలో యాభయి రోజులుగా జరుగుతున్న ‘తమాషా’ ఉద్యమం వెనక స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడ

Published: Mon,July 22, 2013 01:05 AM

తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ బాధ్యత

తెలంగాణ అంశాన్ని తేలుస్తున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలోనూ, కేంద్రంలోనూ నెలరోజులుగా తీవ్రస్థాయిలో హడావుడి చేస్తున్నది. గ్రామ

Published: Fri,May 31, 2013 09:58 PM

ఆంధ్రాపార్టీలు అవసరమా?

ప్రజలు వ్యక్తం చేసే అభివూపాయాలను, ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా పనిచేయాల్సిన బాధ్యత పార్లమెంటు, శాసనసభలకు ఉన్న ది. రాజ్యాంగ ని

Published: Wed,March 27, 2013 10:51 PM

విద్యావంతుల ఉద్యమవేదిక

నడుస్తున్న చరివూతలో మన పాదమువూదలను ఎంత గాఢంగా వేయగలిగామన్న దానిపైనే చరివూతలోమన స్థానం నిర్ధారించబడుతుంది. గత తొమ్మిదేళ్లలో తెలంగ

Published: Sun,March 17, 2013 12:41 AM

ఆకాంక్ష పట్టని అసమర్థ నేతలు

మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక ఆకాంక్షగానే మొదలయ్యింది. సాంస్కృతిక, సాహిత్య రూపాలలో భావవ్యాప్తి జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష

Published: Sat,October 6, 2012 04:12 PM

తెలంగాణ మార్చ్ దిశగా..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ హామీని అమలు చేసే వి

Published: Sat,October 6, 2012 04:13 PM

తెగించి కొట్లాడుదాం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పిల్లలు నిట్టనిలువునా కాలిపోతున్నరు. పిట్టల వలె రాలిపోతున్నరు. ఇప్పటి వరకు దాదాపు 63 మంది యువతీ యువకులు

Published: Sat,October 6, 2012 04:14 PM

ఉత్పత్తి వేటలో జీవన విధ్వంసం

వేగవంతమైన బొగ్గు ఉత్పత్తి, మితిమీరిన లాభాపేక్ష లక్ష్యాలతో సింగరేణి బొగ్గుగనుల సంస్థ ఓపెన్‌కాస్ట్ గనులను నిర్వహిస్తున్నది. దీనివల్ల

Published: Sat,October 6, 2012 04:14 PM

ఎన్టీపీసీ విస్తరణ ఎవరి కోసం?

ఏదైనా సంస్థ విస్తరించడమంటే.. అది అభివృద్ధి దిశలో పయనిస్తున్నట్టుగా భావించాలి. ఆ అభివృద్ధిని చూసి అందరూ గర్వపడతారు. ఆ విస్తరణను ఆహ్

Published: Sat,October 6, 2012 04:15 PM

ఈ మోసం ఇంకెన్నాళ్లు?

సరిగ్గా రెండేళ్ల కితం 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా

Published: Sat,October 6, 2012 04:14 PM

ఈ ప్రభుత్వం మనదెట్లా..?

ప్రజాస్వామిక హక్కులను ప్రతిబింబించవలసిన ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు ప్రజలపై విశ్వాసం లేదు. ప్రజా ప్రతినిధులపై విశ్వాసంలేదు. ప్రజలకు ఇ

Published: Sat,October 6, 2012 04:16 PM

ఐక్య ఉద్యమమే అంతిమ మార్గం

తెలంగాణ రాష్ట్ర సాధనకు ఐక్య ఉద్యమమే అంతిమ మార్గంగా అందరూ కలిసి ముందుకుపోవాల్సి ఉంది. రాష్ట్ర సాధనోద్యమంలో ముందువరుసలో నిలబడిన తెలం

Published: Sat,October 6, 2012 04:15 PM

సొంత రాష్ట్రం మా జన్మహక్కు

-శ్రీధర్‌రావు దేశ్‌పాండే, పిట్టల రవీందర్ తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు తెలంగాణను అన్ని రంగాలలో దోపిడీకి, అణిచివేతకు, వివక్ష

Published: Sat,October 6, 2012 04:15 PM

సింగరేణి ఉద్యమానికి కొండంత అండ..

-పిట్టల రవీందర్ (‘తెలంగాణ విద్యావంతుల వేదిక’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ‘ఒక ప్రాంతంలో లభ్యమయ్యే వనరులు ఆ ప్రాంత ప్రజల సంక్షేమాన

Featured Articles