జలధారలపై జలగలదాడి


Sun,December 15, 2013 12:34 AM

ఆదిలాబాద్ జిల్లాలోని జలధారలమీద సీమాంధ్ర దోపిడీవర్గాలు జలగల్లాగా విరుచుకుపడేందుకు రంగాన్ని సిద్ధం చేసుకున్నాయి. కుంటాల జలపాతంపైన జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించుకునేందుకు ప్రభు త్వ అనుమతిని కోరుతూ 1999లోనే ‘రాజీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సీమాంధ్ర కంపెనీ దరఖాస్తు చేసుకున్నది.దీన్ని ఆదివాసీ సంఘా లు, స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అలుపెరుగని పోరాటాలు చేశా రు. దీంతో ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం పక్కన పెట్టింది. 2011 లో తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలోనే ఈ కంపెనీ యాజమాన్యం కుంటాలపై జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు మరోమారు ప్రయత్నించింది. ఆదివాసీ సంఘాలు, ప్రజా సంఘా లు,స్థానిక ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించడంతో కాంట్రాక్టు కంపెనీ వెనుదిరిగిపోయిం ది. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియ వేగవంతంగా సాగుతున్న సందర్భంలోనే ఆంధ్రా అధికారులు, పాలకుల అండదండలతోఈ కంపెనీ యాజ మా న్యం ఒక్క ఆదిలాబాద్ జిల్లాలలోనే ఏకంగా ఏడు మినీ జల విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నది.

కుంటాల జలపాతాలపై గతంలో ఆరు మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ప్రతిపాదించిన ఒక యూనిట్ స్థానంలో, మొత్తం 15మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి సామ ర్థ్యం కలిగిన రెండు యూనిట్లను ఏర్పాటు చేసేందుకు తాజాగా అనుమతిని కోరింది. పనిలోపనిగా ఆదిలాబాద్ పశ్చిమ జిల్లాలో ఏ యే ప్రాంతాల్లో జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నాయో పరిశీలన జరిపి కుంటాలలో ప్రతిపాదించిన రెండు యూనిట్లకు అదనంగా మరో మూడు ప్రాంతాల్లో మరో ఐదు జలవిద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అనుమతిని కోరింది. కడెం నీటిపారుదల ప్రాజెక్టుమీద రెడున్నర మెగావాట్ల సామర్థ్యంతో ఒక యూనిట్ జల విద్యుత్ కేంద్రం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న సరస్వతి కాలువపై మొత్తం ఐదు మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో రెండు యూనిట్లు, ఖానాపూర్ వద్ద ఏడు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో మరో రెండు యూనిట్లు నెలకొల్పేందుకు సన్నాహాలు ప్రారంభించింది.

జిల్లాలోని నాలుగు ప్రాంతాలలో ఏడు జలవిద్యుత్ యూనిట్లలో కలిపి మొత్తం 29.5 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నది. కరీంనగర్ జిల్లాకేంవూదానికి ఆనుకుని ఉన్న లోయర్ మానేర్ డ్యాం (ఎల్.ఎం.డి) పై కూడా పది మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో మరో మినీ జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు ఈ సంస్థ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నది. ఇందుకు కుంటాల జలపాతం పై మినీ జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ సంస్థలనుంచి అనుమతులు సాధించిన పద్ధతులనే ఈ సంస్థ పాటిస్తున్నది. ఇందుకోసం రాజీ పవర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు తోడుగా ‘విజయ కృష్ణ పవర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే మరో బినామీ సంస్థను తెరమీదికి తీసుకువచ్చింది.

కుంటాల జలపాతంపై మినీ జల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గ్రామ పంచాయతీతో తీర్మానం చేయిం చి కథ నడపడం మొదలుపెట్టారు. రెవెన్యూ అధికారులు ఆగమేఘాలమీద ఫైళ్లు కదిలించారు. ఏడవ నెంబరు జాతీయ రహదారికి 13 కిలోమీటర్ల దూరంలో, దట్టమైన అడవిలో సహజసిద్ధంగా ఏర్పడిన ఈ కుంటాల జలపాతంపైన మినీ జలవిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంవల్ల అడవికి వచ్చే ముప్పు ఏమీలేదని అటవీ శాఖ తేల్చి చెప్పింది. తరతరాలుగా అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తున్న వందలాదిమంది ఆదివాసీ కుటుంబాలకు జీవనోపాధిని దూరం చేసే ఈ ప్రాజెక్టు వల్ల ఆదివాసీలకు ఎలాంటి నష్టం కలగబోదని గిరిజన సంక్షేమశాఖ తాఖీదు ఇచ్చింది.

కడెం ప్రాజెక్టుకు నీటిని జీవధారగా చేరవేసే ‘కడెం’ వాగుపై ఏర్పడిన ఈ జలపాతానికి అడ్డంగా జలవిద్యుత్తు కేంద్రాన్ని నిర్మిస్తే నీటివనరులకు ఎలాంటి ప్రమాదం రాదని నీటిపారుదలశాఖ ప్రకటించింది. జలవిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయవలసిన ఆంధ్రవూపదేశ్ పవర్ జెనరేషన్ కార్పోరేషన్ (ఏ.పి. జెన్‌కో) వాళ్లు ఏకంగా కుంటాల జలపాతాన్ని సంప్రదాయేతర ఇంధన వనరుల కార్పోరేషన్ (నెడ్‌క్యాప్) వాళ్లకు హక్కులు ధారాదత్తం చేశారు. కుంటాల జలపాతంపైన మినీ జలవిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన పక్షంలో పర్యాటక రంగాన్ని వచ్చేముప్పు ఏమీ లేదని పర్యాటక శాఖ పత్రాలు జారీ చేసింది. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఏ)వారు ‘కుంటాల జలపాతంపైన మినీ జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించడంవల్ల స్థానికంగా మౌలిక వసతులు అభివృధ్ధి జరుగుతాయని, పరిసరవూపాంతాలకు విద్యుత్ సదుపాయం కలుగుతుందని, అంతేకాకుండా పర్యాటకుల సంఖ్య బాగా పెరుగుతుందని’ భుజం తట్టింది.

కుంటాల జలపాతం నుండి జాలువారే ప్రవాహంపై ఆధారపడి అనేక మత్స్యకారుల కుటుంబాలు తరతరాలుగా జీవనం సాగిస్తున్నాయి. అటవీ ఉత్పత్తులనే నమ్ముకున్న ఆదివాసీ కుటుంబాలు కూడా పూర్తిగా జీవనాధారం కోల్పోతాయి. జలపాతం చూడటానికి వచ్చే సందర్శకులను చేరవేసేందుకు ఆటోలు, జీపులను నడుపుకుని జీవనం సాగిస్తున్న స్థానిక యువకులు తమ ఉపాధిని కోల్పోతారు. జలపాతం ఎగువ భాగంలో కడెంవాగు వాలుపై మోటార్లు ఏర్పాటు చేసుకుని వ్యవసాయం చేస్తున్న అనేకమంది రైతులు ఈ అవకాశాన్ని కోల్పోతారు.
కుంటాల జలపాతం మధ్యలో బండసొరికెల్లో వెలిసిన కుంటాల సోమన్నకు (శివలింగం) మహాశివరాత్రి పర్యదినం సందర్భంగా ప్రత్యేక పూజ లు నిర్వహిస్తారు. సంవత్సరానికి రెండుసార్లు స్థానిక గోండు లు కుంటా ల గుండంలో పవివూతస్నానాలు ఆచరించి, తాము ఆరాధిం చే ‘పెర్సిపేన్’ దేవునికి మొక్కులు చెల్లించుకుంటారు. కుంటా ల జలపాతం చుట్టూ రోల్‌మామడ, కుంటాల, సిరిచెల్మ, నాగమల్ల, మొదలై న అభయారణ్య క్షేత్రాలు (రిజర్వ్ ఫారెస్ట్) ఉన్నాయి. నెమళ్లు, జింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు పెద్దసంఖ్యలో జీవిస్తున్నాయి. పక్కనే ఉన్న కవ్వాల అభయారణ్యం నుండి పెద్దపులులు కూడా ఈ ప్రాం తానికి వస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. జల విద్యుత్ కేంద్రం నిర్మిస్తే ఈ అభయారణ్యాల్లో జీవిస్తున్న జంతుజాలం ఉనికికే ప్రమా దం ఎదురవుతుంది.

తెలంగాణ నయాగారాగా పిలుచుకుంటున్న కుంటాల జలపాతంపై మినీ జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించే ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ఇక్కడి ఆదివాసీ సంఘాలు, ప్రజాసంఘాలు పదిహేనేళ్లుగా అలుపెరుగకుండా పోరాటం చేస్తున్నాయి. అయినా సీమాంధ్ర బడాబాబులు జిల్లాలో ని జలవనరులపై ఏడు జలవిద్యుత్ కేంద్రాలను నిర్మించేందుకు పావులు కదుపుతున్నారు. ఆంధ్రా అధికారవర్గం ఇందుకు అన్నివిధాల సహకారాలు అందజేస్తున్నది. తెలంగాణ ప్రాంతంలోని ప్రకృతి వనరులపై సీమాంధ్ర దోపిడీ వర్గాలకు శాశ్వతంగా దోచుకునే అవకాశం కల్పించే కుట్రలో భాగంగానే ఈ పరిణామాలను అర్థంచేసుకోవాలి. ఈ ప్రయత్నాలను తిప్పికొట్టాలి.
-పిట్టల రవీందర్
తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ర్ట ప్రధాన కార్యదర్శి

199

RAVINDAR PITTALA

Published: Wed,March 26, 2014 12:55 AM

తెలంగాణ జేఏసీ తక్షణ కర్తవ్యం!

తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో సంఘటిత శక్తి ని ప్రదర్శించి, రాజకీయ ఐక్యతను సాధించిన తెలంగాణ జేఏసీ తెలంగాణ పునర్నిర్మాణంలోనూ తన అస్త

Published: Thu,September 26, 2013 02:40 AM

‘సకల జనభేరి’ మోగిద్దాం

సమైక్యత పేరుమీద సీమాంవూధలో ముఖ్యమంత్రి పరోక్ష నాయకత్వంలో యాభయి రోజులుగా జరుగుతున్న ‘తమాషా’ ఉద్యమం వెనక స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడ

Published: Mon,July 22, 2013 01:05 AM

తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ బాధ్యత

తెలంగాణ అంశాన్ని తేలుస్తున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలోనూ, కేంద్రంలోనూ నెలరోజులుగా తీవ్రస్థాయిలో హడావుడి చేస్తున్నది. గ్రామ

Published: Fri,May 31, 2013 09:58 PM

ఆంధ్రాపార్టీలు అవసరమా?

ప్రజలు వ్యక్తం చేసే అభివూపాయాలను, ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా పనిచేయాల్సిన బాధ్యత పార్లమెంటు, శాసనసభలకు ఉన్న ది. రాజ్యాంగ ని

Published: Wed,March 27, 2013 10:51 PM

విద్యావంతుల ఉద్యమవేదిక

నడుస్తున్న చరివూతలో మన పాదమువూదలను ఎంత గాఢంగా వేయగలిగామన్న దానిపైనే చరివూతలోమన స్థానం నిర్ధారించబడుతుంది. గత తొమ్మిదేళ్లలో తెలంగ

Published: Sun,March 17, 2013 12:41 AM

ఆకాంక్ష పట్టని అసమర్థ నేతలు

మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక ఆకాంక్షగానే మొదలయ్యింది. సాంస్కృతిక, సాహిత్య రూపాలలో భావవ్యాప్తి జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష

Published: Sat,October 6, 2012 04:12 PM

తెలంగాణ మార్చ్ దిశగా..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ హామీని అమలు చేసే వి

Published: Sat,October 6, 2012 04:13 PM

తెగించి కొట్లాడుదాం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పిల్లలు నిట్టనిలువునా కాలిపోతున్నరు. పిట్టల వలె రాలిపోతున్నరు. ఇప్పటి వరకు దాదాపు 63 మంది యువతీ యువకులు

Published: Sat,October 6, 2012 04:14 PM

ఉత్పత్తి వేటలో జీవన విధ్వంసం

వేగవంతమైన బొగ్గు ఉత్పత్తి, మితిమీరిన లాభాపేక్ష లక్ష్యాలతో సింగరేణి బొగ్గుగనుల సంస్థ ఓపెన్‌కాస్ట్ గనులను నిర్వహిస్తున్నది. దీనివల్ల

Published: Sat,October 6, 2012 04:14 PM

ఎన్టీపీసీ విస్తరణ ఎవరి కోసం?

ఏదైనా సంస్థ విస్తరించడమంటే.. అది అభివృద్ధి దిశలో పయనిస్తున్నట్టుగా భావించాలి. ఆ అభివృద్ధిని చూసి అందరూ గర్వపడతారు. ఆ విస్తరణను ఆహ్

Published: Sat,October 6, 2012 04:15 PM

ఈ మోసం ఇంకెన్నాళ్లు?

సరిగ్గా రెండేళ్ల కితం 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా

Published: Sat,October 6, 2012 04:14 PM

ఈ ప్రభుత్వం మనదెట్లా..?

ప్రజాస్వామిక హక్కులను ప్రతిబింబించవలసిన ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు ప్రజలపై విశ్వాసం లేదు. ప్రజా ప్రతినిధులపై విశ్వాసంలేదు. ప్రజలకు ఇ

Published: Sat,October 6, 2012 04:16 PM

ఐక్య ఉద్యమమే అంతిమ మార్గం

తెలంగాణ రాష్ట్ర సాధనకు ఐక్య ఉద్యమమే అంతిమ మార్గంగా అందరూ కలిసి ముందుకుపోవాల్సి ఉంది. రాష్ట్ర సాధనోద్యమంలో ముందువరుసలో నిలబడిన తెలం

Published: Sat,October 6, 2012 04:15 PM

సొంత రాష్ట్రం మా జన్మహక్కు

-శ్రీధర్‌రావు దేశ్‌పాండే, పిట్టల రవీందర్ తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు తెలంగాణను అన్ని రంగాలలో దోపిడీకి, అణిచివేతకు, వివక్ష

Published: Sat,October 6, 2012 04:15 PM

సింగరేణి ఉద్యమానికి కొండంత అండ..

-పిట్టల రవీందర్ (‘తెలంగాణ విద్యావంతుల వేదిక’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ‘ఒక ప్రాంతంలో లభ్యమయ్యే వనరులు ఆ ప్రాంత ప్రజల సంక్షేమాన