‘సకల జనభేరి’ మోగిద్దాం


Thu,September 26, 2013 02:40 AM

సమైక్యత పేరుమీద సీమాంవూధలో ముఖ్యమంత్రి పరోక్ష నాయకత్వంలో యాభయి రోజులుగా జరుగుతున్న ‘తమాషా’ ఉద్యమం వెనక స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడంతో, దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా ఈ ప్రాయోజిత ఉద్యమం అనేక విపరిణామాలకు దారితీసే ప్రమాదం కనిపిస్తున్నది. కనీసం ఆలోచించడానికి అర్హత కలిగిన ఒక్క డిమాండు లేదు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు డిమాండు రాజ్యంగబద్ధమైనది, న్యాయసమ్మతమైనది. అందువల్లనే సర్వజనామోదం పొందగలిగింది. సబ్బండవర్ణాలను ఉద్యమంలో సంలీనం చేయగలిగింది. కానీ సమైక్యత అనేది రాజ్యాంగ విరుద్ధమైనది, ప్రజాస్వామిక స్ఫూర్తికి వ్యతిరేకమైనది. సహజన్యాయ సూత్రాలకు విలోమమైనది. అందువల్లనే ఈ ఉద్యమంలో బాహ్యవూపపంచం ప్రేక్షకపావూతకు పరిమితమైపోయింది.


తెలంగాణ వనరులను దోచుకుంటున్న పెట్టుబడిదారీశక్తులు, ఆధిపత్య రాజకీయాలు నిర్వహిస్తున్న పాలకవర్గాలు తమ దోపిడీ పద్ధతులను కొనసాగించుకోవడం, తమ ఆధిపత్య రాజకీయాలను శాశ్వతంగా నడిపించుకోవడం కోసం, హైదరాబాద్‌లో అక్రమంగా కూడబెట్టుకున్న ఆస్తులను నిలబెట్టుకోవడంకోసం, నగరం చుట్టూ ఆక్రమించుకున్న వేలాది ఎకరాల భూములను కాపాడుకోవడం కోసం మాత్రమే కొంతమంది స్వార్థపరశక్తుల నాయకత్వంలో ఈ సమైక్య ఉద్య మం కొనసాగుతున్న విషయం సీమాంధ్ర ప్రజలకు అర్థమైపోయింది. అందుకే సమైక్య ఉద్యమాన్ని సీమాంవూధలోని మేధావులు, ప్రజాస్వామికవాదులు, ప్రజాసంఘా లు, దళితబహుజనవర్గాలు బాహాటంగానే వ్యతిరేకిస్తున్నాయి.
‘సేవ్ హైదరాబాద్’ పేరుమీద ఏపీఎన్జీవోస్ నిర్వహించిన సభ తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య మానసికమైన విభజనరేఖను మరింత విశాలం చేసిం ది. హైదరాబాద్ నడిబొడ్డులో సీమాంధ్ర ఉద్యోగులు సభ నిర్వహించడం తెలంగాణ ఉద్యమకారుల్లో చాలామందికి పుండుమీద కారం చల్లినట్లు, గుండెగాయాన్ని గెలికినట్లు బాధ కలిగించింది. నిరంతర పోరాటంతో, సుమారు వెయ్యిమంది యువతీయువకుల ఆత్మబలిదానంతో తాము సాధించుకున్న స్వరాష్ర్ట హక్కుపై దాడి జరిగినట్లుగా, హైదరాబాద్ దురావూకమణసభగా తెలంగాణ ప్రజ లు భావించారు.


అధికారుల అండతో, పోలీసుల సహకారంతో, ఉద్యమం పేరుమీద జరిగే ఆరాటాలు ఎంత పేలవంగా ఉంటాయో ...పోలీసుల అణచివేతలమధ్య, ప్రభుత్వ దమనకాండ నడుమ జరిగే ప్రజల పోరాటాలు ఎంతటి సజీవంగా నిలుస్తాయో కూడా ప్రజలు అర్థం చేసుకోవడానికి ఈ సందర్భం ఉపయోగపడుతున్నది. సీమాంవూధలో ప్రస్తుతం జరుగుతున్న ప్రాయోజిత ఉద్యమం తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమవూశేణులకు ఇరువూపాంతాల ఉద్యమ తీరుతెన్నులను పోల్చుకునేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తే, సీమాంధ్ర ప్రజలకు దీర్ఘకాలికంగా అనేక రకాలైన కష్ట,నష్టాలను మూటగట్టుతున్నది.


సమైక్యాంధ్ర పేరుమీద సీమాంవూధలో జరుగుతున్న ఉద్యమాల అసలు రూపా న్ని ఈ సభ బహిర్గతం చేస్తే, ముఖ్యమంత్రి అనుసరిస్తున్న ప్రాంతీయ వివక్షను, దురభిమానాన్ని సమైక్య ఉద్యమం నిగ్గుతేలుస్తున్నది. తెలంగాణ ప్రజల పట్ల రాష్ర్ట పోలీసు బాసు అనుసరిస్తున్న దురహంకారాన్ని, దుర్మార్గాన్ని ఈ సమా ‘వేశం’ బట్టబయలు చేస్తే, సీమాంధ్ర ఆధిపత్య మీడియా ఇంతకాలంగా తెలంగాణ ఉద్యమంపట్ల అనుసరిస్తున్న పక్షపాతధోరణులకు అక్కడి ఉద్యమం అద్దం పడుతున్నది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతవూపజల శాంతికాముకత్వాన్ని, సహనశీలతను, సౌభ్రాతృత్వాన్ని, ఔదార్యాన్ని, సాటి మనిషిని మనిషిగా గౌరవించే ఔన్యత్వాన్ని ..పపంచానికి ఈ సీమాంధ్ర ఆధిపత్య దురావూకమణ సభ చాటిచెప్పితే, భౌతికదాడులతో, వేధింపులతో తెలంగాణవూపాంతానికి చెందిన ఉద్యోగులను సీమాంవూధలో హింసిస్తున్న సంఘటనలు అక్కడి పరిస్థితులను ఈ ఉద్యమ సందర్భం బహిర్గతం చేస్తున్నది. ఇరువూపాంతాలలో ప్రస్తుతం నెలకొనిఉన్న పరిస్థితులకు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న నాన్చివేత ధోరణులే కారణమవుతున్నవి. కాంగ్రెస్ పార్టీ వెను రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడం వాంఛనీయం కాదు.


మరోవైపు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చేష్టలుడిగిపోయినట్లు ప్రవర్తించడం కూడా తెలంగాణ ప్రజల ఆందోళనకు కారణమవుతున్న్దది. సీమాం ధ్ర ప్రాంత కేంద్రమంవూతులు, ఎంపీలు, రాష్ర్ట మంత్రులు, నాయకులందరూ ఢిల్లీలో తెలంగాణకు వ్యతిరేకంగా లాబీయింగ్ చేస్తూ, రాష్ర్ట ఏర్పాటును అడ్డుకుంటున్నట్లుగా మీడియాలో దుష్ర్పచారం జోరుగా సాగిస్తున్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు మరింత గందరగోళానికి గురవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలం గాణపై స్పష్టమైన ప్రకటన వెలువరించినప్పటికీ, తెలంగాణలో యువతీయువకులు ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ వెం టనే క్యాబినెట్ నోట్‌ను ఆమోదించే విధంగా, ఆ తర్వాత పార్లమెంటులో తెలంగాణ బిల్లును ఆమోదింపజేసే రీతిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ నాయకత్వం అవసరమైన చొరవను ప్రదర్శించాలి. సుదీర్ఘ పోరాట ఫలితంగా, అమరుల ఆశయాలను సాధించుకునే సందర్భంలో ప్రకట న అమలు కోసం కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచేందుకు, తెలంగాణ ఉద్యమ ప్రజల్లో విశ్వాసాన్ని నిలబె సెప్టెంబర్ 29వ తేదీన హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ‘‘సకల జనభేరి’’ బహిరంగ సదస్సుకు వేలాదిగా తరలిరావాల్సిందిగా కోరుతున్నాము.

-పిట్టల రవీందర్
తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

148

RAVINDAR PITTALA

Published: Wed,March 26, 2014 12:55 AM

తెలంగాణ జేఏసీ తక్షణ కర్తవ్యం!

తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో సంఘటిత శక్తి ని ప్రదర్శించి, రాజకీయ ఐక్యతను సాధించిన తెలంగాణ జేఏసీ తెలంగాణ పునర్నిర్మాణంలోనూ తన అస్త

Published: Sun,December 15, 2013 12:34 AM

జలధారలపై జలగలదాడి

ఆదిలాబాద్ జిల్లాలోని జలధారలమీద సీమాంధ్ర దోపిడీవర్గాలు జలగల్లాగా విరుచుకుపడేందుకు రంగాన్ని సిద్ధం చేసుకున్నాయి. కుంటాల జలపాతంపైన జల

Published: Mon,July 22, 2013 01:05 AM

తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ బాధ్యత

తెలంగాణ అంశాన్ని తేలుస్తున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలోనూ, కేంద్రంలోనూ నెలరోజులుగా తీవ్రస్థాయిలో హడావుడి చేస్తున్నది. గ్రామ

Published: Fri,May 31, 2013 09:58 PM

ఆంధ్రాపార్టీలు అవసరమా?

ప్రజలు వ్యక్తం చేసే అభివూపాయాలను, ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా పనిచేయాల్సిన బాధ్యత పార్లమెంటు, శాసనసభలకు ఉన్న ది. రాజ్యాంగ ని

Published: Wed,March 27, 2013 10:51 PM

విద్యావంతుల ఉద్యమవేదిక

నడుస్తున్న చరివూతలో మన పాదమువూదలను ఎంత గాఢంగా వేయగలిగామన్న దానిపైనే చరివూతలోమన స్థానం నిర్ధారించబడుతుంది. గత తొమ్మిదేళ్లలో తెలంగ

Published: Sun,March 17, 2013 12:41 AM

ఆకాంక్ష పట్టని అసమర్థ నేతలు

మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక ఆకాంక్షగానే మొదలయ్యింది. సాంస్కృతిక, సాహిత్య రూపాలలో భావవ్యాప్తి జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష

Published: Sat,October 6, 2012 04:12 PM

తెలంగాణ మార్చ్ దిశగా..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ హామీని అమలు చేసే వి

Published: Sat,October 6, 2012 04:13 PM

తెగించి కొట్లాడుదాం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పిల్లలు నిట్టనిలువునా కాలిపోతున్నరు. పిట్టల వలె రాలిపోతున్నరు. ఇప్పటి వరకు దాదాపు 63 మంది యువతీ యువకులు

Published: Sat,October 6, 2012 04:14 PM

ఉత్పత్తి వేటలో జీవన విధ్వంసం

వేగవంతమైన బొగ్గు ఉత్పత్తి, మితిమీరిన లాభాపేక్ష లక్ష్యాలతో సింగరేణి బొగ్గుగనుల సంస్థ ఓపెన్‌కాస్ట్ గనులను నిర్వహిస్తున్నది. దీనివల్ల

Published: Sat,October 6, 2012 04:14 PM

ఎన్టీపీసీ విస్తరణ ఎవరి కోసం?

ఏదైనా సంస్థ విస్తరించడమంటే.. అది అభివృద్ధి దిశలో పయనిస్తున్నట్టుగా భావించాలి. ఆ అభివృద్ధిని చూసి అందరూ గర్వపడతారు. ఆ విస్తరణను ఆహ్

Published: Sat,October 6, 2012 04:15 PM

ఈ మోసం ఇంకెన్నాళ్లు?

సరిగ్గా రెండేళ్ల కితం 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా

Published: Sat,October 6, 2012 04:14 PM

ఈ ప్రభుత్వం మనదెట్లా..?

ప్రజాస్వామిక హక్కులను ప్రతిబింబించవలసిన ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు ప్రజలపై విశ్వాసం లేదు. ప్రజా ప్రతినిధులపై విశ్వాసంలేదు. ప్రజలకు ఇ

Published: Sat,October 6, 2012 04:16 PM

ఐక్య ఉద్యమమే అంతిమ మార్గం

తెలంగాణ రాష్ట్ర సాధనకు ఐక్య ఉద్యమమే అంతిమ మార్గంగా అందరూ కలిసి ముందుకుపోవాల్సి ఉంది. రాష్ట్ర సాధనోద్యమంలో ముందువరుసలో నిలబడిన తెలం

Published: Sat,October 6, 2012 04:15 PM

సొంత రాష్ట్రం మా జన్మహక్కు

-శ్రీధర్‌రావు దేశ్‌పాండే, పిట్టల రవీందర్ తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు తెలంగాణను అన్ని రంగాలలో దోపిడీకి, అణిచివేతకు, వివక్ష

Published: Sat,October 6, 2012 04:15 PM

సింగరేణి ఉద్యమానికి కొండంత అండ..

-పిట్టల రవీందర్ (‘తెలంగాణ విద్యావంతుల వేదిక’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ‘ఒక ప్రాంతంలో లభ్యమయ్యే వనరులు ఆ ప్రాంత ప్రజల సంక్షేమాన