సింగరేణి ఉద్యమానికి కొండంత అండ..


Sat,October 6, 2012 04:15 PM

-పిట్టల రవీందర్
(‘తెలంగాణ విద్యావంతుల వేదిక’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
‘ఒక ప్రాంతంలో లభ్యమయ్యే వనరులు ఆ ప్రాంత ప్రజల సంక్షేమానికి, ఆ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడాలి. అట్లా జరగని పక్షంలో అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. ఆంధ్రవూపదేశ్ ఏర్పాటైన నాటి నుంచి సింగరేణిలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నదని’ జయశంకర్ ప్రతి సమావేశంలోనూ అనేవారు.

‘తెలంగాణ వనరుల దోపిడిని వలస ఆధిపత్య కోణంలోనే అర్థం చేసుకోవాలి. వలస పాలనను అంతం చేయకుండా వనరుల తరలింపును ఆప డం సాధ్యం కాదు. కృష్ణా, గోదావరి నదీజలాలైనా, బయ్యారంలో ఇనుప ఖనిజమైనా, సింగరేణి బొగ్గు అయినా, గ్రానైట్ మైనింగ్ అయినా, ఇసుక తరలింపు అయినా... అంతర్గత వలస దోపిడిలో భాగం మాత్రమే. ఈ సమస్యలన్నింటికి పరిష్కారం వెతకాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాల్సిందే. ఇందుకు స్వయం నిర్ణయాధికారం, స్వయంపాలన ఇందుకు ఎంతగానో ఉపకరిస్తాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఒక్కటే ఈ సమస్యలన్నిటికి పరిష్కారమని ‘తెలంగాణ విద్యావంతుల వేదిక’ వ్యవస్థాపక గౌరవాధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి జయశంకర్ అనేకమార్లు వ్యక్తం చేసిన అభివూపాయమి ది. తెలంగాణ విద్యావంతుల వేదిక కోల్‌బెల్ట్ ప్రాంతాలలో నిర్వహించిన అనేక సదస్సులలో జయశంకర్ పాల్గొని ప్రసంగించారు. ఆరోగ్యం సహకరించని సందర్భాలలోనూ విద్యావంతుల వేదిక కార్యక్షికమాలలో ప్రముఖంగా పాలుపంచుకుని వేదికకు దిశా నిర్దేశం చేశారు.

నిజాం పాలనా కాలం నాటి సింగరేణి స్థితిగతులను అందరికీ తెలియజెప్పేవారు. ఆ కాలంలో బొగ్గు అవసరాలు పరిమితంగా ఉండడం వల్ల పర్యావరణ సమస్యలుగానీ, అడవుల నరికివేత, నిర్వాసితుల సమస్యలు ఉండేవి కావు. బొగ్గు ఉత్పత్తిని కేవలం రైల్వేలకు, విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే ఉపయోగించారు. ఆంధ్రవూపదేశ్ ఏర్పడిన తర్వాత మాత్రమే బొగ్గు ఉత్పత్తి అవసరాలు పెరిగిపోయి, అనేక సమస్యలకు కారణమయ్యిందని జయశంకర్ అభివూపాయపడేవారు. ఆంధ్రవూపదేశ్‌ను ఏర్పాటు చేయడం ఒక దీర్ఘకాలిక కుట్రలో భాగంగానే జరిగిందని, ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటుకు కృష్ణా, గోదావరి నదీజలాలు, హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలో మాత్ర మే లభ్యమయ్యే నేలబొగ్గు కూడా ఒక కారణమని జయశంకర్ పలు సందర్భాలలో విశ్లేషించారు.

శ్రీకృష్ణ కమిటీ మొదటిసారిగా హైదరాబాద్ సందర్శించిన రోజున సింగరేణి గని కార్మికులు ఒకరోజు సమ్మె ద్వారా తమ నిరసనను వ్యక్తం చేయడాన్ని ఆయన కొనియాడారు. చైతన్యవంతులైన సింగరేణి కార్మికులు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం మంచి పరిణామమని ఆయన అనేవారు. కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించిన ప్రతి సందర్భంలోనూ జయశంకర్ పూర్తి మద్దతు తెలిపారు. దేశ వ్యాప్తంగా అమలులోకి రావాల్సిన వేతన సవరణ ఒప్పందాలను సాధించడంలో గని కార్మికులు ముందుండి ఉద్యమించారని, వారి పోరాట ఫలితంగానే అనేక వేతన సవరణ ఒప్పందాలు అమలులోకి వచ్చాయన్నారు. కార్మికులు ఏ సమస్య కోసమైనా పరిష్కారమయ్యే వరకు పోరాడుతారని, తమ వ్యక్తిగత సమస్యలను పక్కనపెట్టి సమష్టి విషయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారన్నారు. కార్మికులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఎవ్వరూ అడ్డుకోలేరని ఆయన ప్రశంసించారు.

శ్రీ కృష్ణ కమిటీ నివేదికలో సింగరేణికి సంబంధించిన కనీస ప్రస్తావన లేదని ఒక సందర్భంలో ప్రస్తావించినప్పుడు.. ‘అదొక పనికి మాలిన కమి టీ. అది ఇచ్చే నివేదిక వల్ల ఒరిగేదేమీలేదు. అట్లాంటి కమిటీ నివేదికలో సింగరేణి ప్రస్తావనకు నోచుకోలేదంటే, సింగరేణి ఒక ప్రత్యేకతను కలిగిన అంశంగా గుర్తించినట్టే’ అన్నారు. ‘బొగ్గును దాచిపెట్టాలనుకోవడం మూర్ఖ త్వం. అట్లాంటి ప్రయత్నం ఎవ్వరూ చేసినా ఏదో ఒకరోజున అది తప్పనిసరిగా అగ్గి అయి మండుతుంది. అణచివేతను దహించి తీరుతుంది. ఈ విషయంలో సింగరేణి కార్మికులకు ప్రత్యేక స్థానం ఉన్నది’. సింగరేణి సమస్యలను జయశంకర్ ఒక ప్రత్యేక దృష్టితో చూశారు. అందుకే ‘సేవ్ సింగరేణి’ కార్యక్షికమాలలో చురుకుగా పాల్గొనేవారు.

సీమాంధ్ర పెట్టుబడీదారులు అనుసరించే దోపిడి పద్ధతులు, ప్రపంచీకరణ తీసుకువస్తున్న పరిణామాలు, సంస్కరణల పేరుతో సింగరేణిలో అమలవుతున్న విధ్వంసాలు, తదితర అంశాలపై జయశంకర్ సోదాహరణంగా వివరించేవారు. ‘ఒక ప్రాంతంలో లభ్యమయ్యే వనరులు ఆ ప్రాంత ప్రజల సంక్షేమానికి, ఆ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడాలి. అట్లా జరగని పక్షంలో అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. ఆంధ్రవూపదేశ్ ఏర్పాటైన నాటి నుంచి సింగరేణిలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నదని’ జయశంకర్ ప్రతి సమావేశంలోనూ అనేవారు. ఇలాంటి సందర్భాలలో ఈ ప్రాంత ప్రజావూపతినిధులు తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అయితే ఆ పనిని వారు చేయకపోవడం వల్లనే కార్మికులే దాన్ని నిర్వర్తిస్తున్నారన్నారు. అందుకే సింగరేణి కార్మికులు ప్రపంచానికి ఆదర్శవూపాయులని ఆయన కొనియాడారు.

సింగరేణిలో సంస్కరణల అమలు తీరుపై ‘తెలంగాణ విద్యా వంతుల వేదిక’ 16 జూలై 2006లో నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ సమావేశంలో జయశంకర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీల కు చెందిన నేతలు, సింగరేణి కార్మిక సంఘాల అగ్ర నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సింగరేణిలో అమలవుతున్న సంస్కరణల తీరుతెన్నులను, పర్యవసానంగా ఎదురవుతున్న సమస్యలను కూలంకషంగా వివరించారు. సమావేశంలో పాల్గొన్న అందరూ ‘ఓపెన్ కాస్ట్’లను వ్యతిరేకించా రు. (ఆచరణలో పూర్తి భిన్నంగా వ్యవహరించిన వారు కూడా ఉన్నారు అది వేరే సంగతి) ఈ చర్చ సందర్భంగా సంస్కరణల నేపథ్యంలో సింగరేణిలో జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ ఒక పుస్తకాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని జయశంకర్ గుర్తు చేశారు. రెండేళ్ల తర్వాత విద్యావంతుల వేదిక ప్రచురణగా ‘సింగరేణి పరిణామాలు-పర్యవసానాలు ’పేరిట తీసుకువచ్చిన పుస్తకాన్ని కె.బాలగోపాల్, జయశంకర్ సంయుక్తంగా గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆవిష్కరించారు.

ధన్‌బాద్‌లో నిర్వహిస్తున్న ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్’కు సంబంధించిన రెండు శాఖలను ఏర్పాటు చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ 2008లో నిర్ణయించింది. అందులో ఒక కేంద్రాన్ని ఆంధ్రవూపదేశ్‌లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి పురందరేశ్వరి మైనింగ్ విశ్వవిద్యాలయ శాఖను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ దానికి అనుమతించారు. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ విద్యావంతుల వేదిక హైదరాబాద్‌లో రౌండ్ ల్ సమావేశాన్ని నిర్వహించింది. అన్ని పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జయశంకర్ మాట్లాడుతూ ‘సమువూదగర్భ శాస్త్రానికి సంబంధించిన కోర్సులను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని డిమాండు చేయడం ఎంత హాస్యాస్పందం గా ఉంటుందో, విశాఖపట్నంలో మైనింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరడం కూడా అంతే తెలివితక్కువగా ఉంటుందన్నారు’.

మైనింగ్ విశ్వవిద్యాలయాన్ని కోల్‌బెల్ట్ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తే తెలంగాణ విద్యావంతుల వేదిక అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉద్యమించింది. ‘కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్’ ఆవరణలో జరిగిన సదస్సులో జయశంకర్ పాల్గొని ఉద్యమిస్తున్న విద్యార్థులను ఉత్తేజపరిచారు. కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయంలో మైనింగ్ కోర్సులను ప్రవేశపెట్టి, భవిష్యత్తులో విశ్వవిద్యాలయం స్థాయికి తీర్చిదిద్దుతామని నాడు వైఎస్ హామీ ఇచ్చారు. ఇవేవీ జరుగలేదు. కానీ గోదావరిఖని ప్రాంతంలో ‘జేఎన్‌టీయు’ ప్రాంతీ య కేంద్రా న్ని ఏర్పాటు చేసి, మైనింగ్ కోర్సులను నిర్వహిస్తున్నారు.
సింగరేణి సమాజం చుట్టూ అల్లుకుని ఉన్న సమస్యలమపై అన్ని వర్గాల ప్రజలను సమీకరించేందుకు ‘తెలంగాణ విద్యావంతుల వేది క’ శ్రీకారం చుట్టింది.

దేశ చరివూతలోనే మొట్టమొదటిసారిగా బుద్ధి జీవులందరినీ బాధిత ప్రజల వద్దకు తీసుకు కార్యక్షికమాన్ని నిర్వహించింది. 2008, ఆగస్టు 28-30 వరకు మూడు రోజుల పాటు ‘కాలరీ కవాతు’ పేరిట గోలేటి నుంచి గోదావరిఖని వరకు చేపట్టిన ఈ యాత్రకు కోల్‌బెల్ట్ ప్రాంతాలకు చెందిన అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సింగరేణి బొగ్గు గనుల్లో, కార్మికవాడల్లోనూ అనేక సమావేశాలను నిర్వహించింది. గని అధికారులను, కార్మికులను, వారి కుటుంబాలను నేరుగా కలుసుకుని సమస్యలను తెలుసుకున్నది. ఆగస్టు 30న గోదావరిఖనిలో నిర్వహించిన ముగింపు బహిరంగ సభలో జయశంకర్ పాల్గొన్నా రు.

సింగరేణితో తనకున్న అనుభవాలన్నింటినీ ఈ సభలో నెమరు వేసుకున్నారు.2004-2009 చివరలో తెలంగాణ ప్రజా ఉద్యమం ప్రారంభమయ్యేదాకా, దాదాపు ఆరేళ్లపాటు కేవలం సింగరేణికి సంబంధించిన అంశాలపైనే కాకుండా తెలంగాణ ప్రాంతంలోని అన్ని విషయాలపైనా ‘తెలంగాణ విద్యావంతుల వేదిక’ అధ్యయనం చేసింది. విస్తృతస్థాయిలో ప్రచారం చేసింది. 2009 నవంబర్ చివరి నుంచి జరుగుతున్న ప్రజా ఉద్యమానికి విద్యావంతుల వేదిక నిర్వహించిన భావవ్యాప్తి కూడా నేపథ్యంగా ఉపకరించిందనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో జయశంకర్ నిర్వహించిన పాత్ర కూడా ఎంతో ఉత్తజితమైనది.

39

RAVINDAR PITTALA

Published: Wed,March 26, 2014 12:55 AM

తెలంగాణ జేఏసీ తక్షణ కర్తవ్యం!

తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో సంఘటిత శక్తి ని ప్రదర్శించి, రాజకీయ ఐక్యతను సాధించిన తెలంగాణ జేఏసీ తెలంగాణ పునర్నిర్మాణంలోనూ తన అస్త

Published: Sun,December 15, 2013 12:34 AM

జలధారలపై జలగలదాడి

ఆదిలాబాద్ జిల్లాలోని జలధారలమీద సీమాంధ్ర దోపిడీవర్గాలు జలగల్లాగా విరుచుకుపడేందుకు రంగాన్ని సిద్ధం చేసుకున్నాయి. కుంటాల జలపాతంపైన జల

Published: Thu,September 26, 2013 02:40 AM

‘సకల జనభేరి’ మోగిద్దాం

సమైక్యత పేరుమీద సీమాంవూధలో ముఖ్యమంత్రి పరోక్ష నాయకత్వంలో యాభయి రోజులుగా జరుగుతున్న ‘తమాషా’ ఉద్యమం వెనక స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడ

Published: Mon,July 22, 2013 01:05 AM

తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ బాధ్యత

తెలంగాణ అంశాన్ని తేలుస్తున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలోనూ, కేంద్రంలోనూ నెలరోజులుగా తీవ్రస్థాయిలో హడావుడి చేస్తున్నది. గ్రామ

Published: Fri,May 31, 2013 09:58 PM

ఆంధ్రాపార్టీలు అవసరమా?

ప్రజలు వ్యక్తం చేసే అభివూపాయాలను, ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా పనిచేయాల్సిన బాధ్యత పార్లమెంటు, శాసనసభలకు ఉన్న ది. రాజ్యాంగ ని

Published: Wed,March 27, 2013 10:51 PM

విద్యావంతుల ఉద్యమవేదిక

నడుస్తున్న చరివూతలో మన పాదమువూదలను ఎంత గాఢంగా వేయగలిగామన్న దానిపైనే చరివూతలోమన స్థానం నిర్ధారించబడుతుంది. గత తొమ్మిదేళ్లలో తెలంగ

Published: Sun,March 17, 2013 12:41 AM

ఆకాంక్ష పట్టని అసమర్థ నేతలు

మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక ఆకాంక్షగానే మొదలయ్యింది. సాంస్కృతిక, సాహిత్య రూపాలలో భావవ్యాప్తి జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష

Published: Sat,October 6, 2012 04:12 PM

తెలంగాణ మార్చ్ దిశగా..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ హామీని అమలు చేసే వి

Published: Sat,October 6, 2012 04:13 PM

తెగించి కొట్లాడుదాం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పిల్లలు నిట్టనిలువునా కాలిపోతున్నరు. పిట్టల వలె రాలిపోతున్నరు. ఇప్పటి వరకు దాదాపు 63 మంది యువతీ యువకులు

Published: Sat,October 6, 2012 04:14 PM

ఉత్పత్తి వేటలో జీవన విధ్వంసం

వేగవంతమైన బొగ్గు ఉత్పత్తి, మితిమీరిన లాభాపేక్ష లక్ష్యాలతో సింగరేణి బొగ్గుగనుల సంస్థ ఓపెన్‌కాస్ట్ గనులను నిర్వహిస్తున్నది. దీనివల్ల

Published: Sat,October 6, 2012 04:14 PM

ఎన్టీపీసీ విస్తరణ ఎవరి కోసం?

ఏదైనా సంస్థ విస్తరించడమంటే.. అది అభివృద్ధి దిశలో పయనిస్తున్నట్టుగా భావించాలి. ఆ అభివృద్ధిని చూసి అందరూ గర్వపడతారు. ఆ విస్తరణను ఆహ్

Published: Sat,October 6, 2012 04:15 PM

ఈ మోసం ఇంకెన్నాళ్లు?

సరిగ్గా రెండేళ్ల కితం 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా

Published: Sat,October 6, 2012 04:14 PM

ఈ ప్రభుత్వం మనదెట్లా..?

ప్రజాస్వామిక హక్కులను ప్రతిబింబించవలసిన ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు ప్రజలపై విశ్వాసం లేదు. ప్రజా ప్రతినిధులపై విశ్వాసంలేదు. ప్రజలకు ఇ

Published: Sat,October 6, 2012 04:16 PM

ఐక్య ఉద్యమమే అంతిమ మార్గం

తెలంగాణ రాష్ట్ర సాధనకు ఐక్య ఉద్యమమే అంతిమ మార్గంగా అందరూ కలిసి ముందుకుపోవాల్సి ఉంది. రాష్ట్ర సాధనోద్యమంలో ముందువరుసలో నిలబడిన తెలం

Published: Sat,October 6, 2012 04:15 PM

సొంత రాష్ట్రం మా జన్మహక్కు

-శ్రీధర్‌రావు దేశ్‌పాండే, పిట్టల రవీందర్ తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు తెలంగాణను అన్ని రంగాలలో దోపిడీకి, అణిచివేతకు, వివక్ష

Featured Articles