తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ బాధ్యత


Mon,July 22, 2013 01:05 AM


తెలంగాణ అంశాన్ని తేలుస్తున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలోనూ, కేంద్రంలోనూ నెలరోజులుగా తీవ్రస్థాయిలో హడావుడి చేస్తున్నది. గ్రామ పంచాయతీలకు ఎన్నికల తేదీలను ప్రకటిస్తూనే, హైదరాబాద్‌లో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ‘తెలంగాణ సాధన సభ’ పేరుతో బహిరంగసభను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇంఛార్జిగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న దిగ్విజయ్‌సింగ్ రాష్ట్రంలో పర్యటించి తెలంగాణ పరిష్కారానికి ‘రోడ్ మ్యాప్’ తయారు చేసే బాధ్యతలను త్రిమూర్తులకు (ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు) అప్పగించారు. జూలై 12న ఢిల్లీలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం వెలువరిస్తారని అందరికీ నోరూరించారు. వారంరోజులపాటు మీడియాలో హంగామా సృష్టించి, తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ లో చర్చించి నిర్ణయించాలన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట డిమాండులో తప్పులేదని ఇంతకాలంగా మాయమాటలతో మభ్యపెడుతూ వచ్చిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ కోర్ కమిటీలో అధిష్ఠానం ముందు అసలు రంగు ఆవిష్కరించా డు. ఇటీవల ఢిల్లీలో జరిగిన అంతర్గత భద్రత సమావేశంలో ఆంధ్రవూపదేశ్‌లో నక్సలైట్లు లేకుండా చేసామని, నక్సలైట్ల సమస్యను ఎదుర్కొంటున్న ఇతర రాష్ట్రాలన్నీ ఆంధ్రవూపదేశ్ ఫార్ములాను అనుసరించాలని గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, తెలంగాణ ఇస్తే రాష్ర్టంలో నక్లలైట్లు విజృంభిస్తారని తన నిజ స్వరూపం బయటపెట్టుకున్నాడు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నారని, రాయలసీమ రెండు జిల్లాలతో (కర్నూలు,అనంతపురం) కూడిన రాయల తెలంగాణ ఏర్పా టు చేస్తున్నారని సీమాంధ్ర మీడియాలో లీకేజీ వార్తలతో ఊదరగొట్టిన సమైక్యవాద నాయకులు, అధిష్ఠానం ఏదో ఒకటి తేలుస్తుందనే అనుమానాలు బయటపడగానే, అడ్డుకునే ప్రయత్నాల్లో మునిగితేలుతున్నారు.

తెలంగాణపై ఇక ఎవ్వరినీ సంప్రదించేదిలేదని కాంగ్రెస్ పార్టీ తేల్చిచెప్పడంతో ఇద్దరు ‘వైకాపా’ ఎమ్మెల్యే లు రాజీనామా చేస్తామని బెదిరింపులకు దిగారు. ఇదే పార్టీకి చెందిన మరికొంతమంది నాయకులు తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కొత్తపాట అందుకున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ అంశంపై ఇంత జరుగుతున్నా తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఈ విషయంలో ఎక్కడా నోరు విప్పడంలేదు. టి.డి.పి తెలంగాణ ఫోరం నాయకులు ఎక్కడా కనిపించడంలేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల గండం నుంచి గట్టెక్కడానికి ఈ మూడు పార్టీలు లోపాయికారీ పద్ధతుల్లో సహకరించుకుంటూ, తెలంగాణ డిమాండు ను, తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణ ఉద్య మం గతంలో తేల్చి చెప్పిన అంశాలనే కొత్తగా మళ్లీ చర్చలోకి లాగుతున్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పా టు చేస్తే ఆంధ్రాకు సాగునీటి కోసం యుద్ధాలు జరుగుతాయని ముఖ్యమంత్రి అంటున్నాడు. కానీ రెం డు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించడానికి, నీటి పంపిణీని పర్యవేక్షించడానికి కేంద్ర జలసంఘం ప్రత్యేక అజమాయిషీ బృందాలను ఏర్పాటు చేస్తుంది. నక్సలైట్లు పెరుగుతారనే మరో పసలేని వాదనను సీమాంధ్ర నాయకులు తీసుకువస్తున్నారు.నక్సలైట్ల సమస్య కేవలం రాష్ట్రం ఉమ్మడిగా ఉండటం వల్లనో, విడిపోవడంవల్లనో ఉత్పన్నమయ్యేది కాదు. ఇది సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నది. అంతకు మించి చారిత్రక సందర్భంలో ముందుకు వచ్చిన ఓ సామాజిక ఉద్యమం అది. అంతకంటే ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన పరిణామాల నేపథ్యంలోనే నక్సలైట్ ఉద్యమాన్ని చూడాలి. కాని కొందరు వ్యక్తులు, కొన్ని తాత్కాలిక సమస్యల మూలాల్లోంచి సామాజిక ఉద్యమాలు పుట్టుకు రావు. ప్రాంతాల వైశాల్యం, భౌగోళిక సరిహద్దులపై ఆధారపడి విప్లవోద్యమాల ఉనికి ఆధారపడి ఉండదు. ఈ విషయం సీమాంధ్ర దోపిడీ పాలకులకు తెలువక కాదు. కానీ తెలంగాణను వ్యతిరేకించేందుకు ఎత్తుకున్న తొండి వాదం ఇది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రులకు రక్షణ ఎట్లా అని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లో నాలుగు శతాబ్దాలుగా వివిధ దేశాల ప్రజలు, అనేక రాష్ట్రాల ప్రజలు సహజీవనం సాగిస్తున్నట్లుగానే ప్రత్యేక రాష్ర్టంలోనూ అన్నదమ్ముల్లా కలిసి ఉంటారని ఉద్యమ నాయకత్వం పదేపదే భరోసా ఇస్తున్నది. గడచిన నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమం సీమాంధ్ర ప్రజల పట్ల అనుసరిస్తున్న సోదరభావమే ఇందుకు నిదర్శనం. హైదరాబాద్‌లో తమ పెట్టుబడుల సంగతేమిటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. దేశవిదేశాలకు చెందిన కంపెనీపూన్నో ఇక్కడ భారీ పెట్టుబడులను పెట్టి తమ కార్యకలాపాలను కొనసాగిస్తుండగా కేవలం ఆంధ్రా పెట్టుబడీదారులకు మాత్రమే ఈ సమస్య ఎందుకు కనిపిస్తున్నదో అందరికీ అర్థమైపోయింది. సీమాంధ్ర ఆధిపత్య రాజకీయాలు, అంతర్గత వలస దోపిడీ పద్ధతులకు అలవాటు పడి, హెదరాబాద్ చుట్టుపక్కల భూములన్నీ ఆక్రమించుకుని వేలకోట్లను దోచుకోవడానికి అలవాటు పడిన ఆంధ్రా పెట్టుబడిదారులకు తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంగా అవతరిస్తే ఈ అవకాశాలు చేజారిపోతాయనే ఆందోళన తప్ప మరో కారణం లేదు.మూడున్నర సంవత్సరాల క్రితం, డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేసిన సందర్భంలో ప్రదర్శించిన పటుత్వం, ఐక్యత ఇవాళ్ల సీమాంధ్ర రాజకీయ నాయకత్వంలో కొరవడిపోయింది. కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను డబ్బుల సంచులతో ఏమార్చగలిగే కొనుగోలుశక్తి సీమాంధ్ర పెట్టుబడిదారుల్లో అంతరించిపోయింది.అంతకంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఇట్లాంటి ఆవరోధాలను అధిగమించే శక్తి, యుక్తులను కూడగట్టుకుని నిలిచింది. సీమాంధ్ర ఆధిపత్య శక్తుల కుట్రలను, కుయుక్తులను ... సీమాంధ్ర పాలకవర్గాల ఎత్తుగడలను, వ్యూహాలను తన కార్యాచరణతో చిత్తుచేయగలిగే సత్తాను తెలంగాణ ఉద్యమ సమాజం సంతరించుకున్నది.అన్నింటికంటే ముఖ్యంగా, సీమాంధ్ర రాజకీయ ఆధిపత్యం నుండి తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని రాష్ర్ట సాధన ఉద్యమం విముక్తం చేసుకున్నది. రాజకీయ ఐక్యత వైపు వారందరితో అడుగులు వేయిస్తున్నది.

గడచిన నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు ‘తెలంగాణ ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే’ అంటున్నారు. జూన్ 30 నాడు నిజాం కళాశాల మైదానంలో బహిరంగసభ నిర్వహించి ఇదే విషయాన్ని మళ్లీ నొక్కి చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చే బాధ్యతను ఇక్కడి కాంగ్రెస్‌నాయకులు స్వయం గా నెత్తికెత్తుకున్నారు. అందు వల్ల తెలంగాణ ఏర్పాటు దిశలో కాంగ్రె స్ పార్టీ అధిష్ఠానంపై అవసరమైన ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ప్రాంత కాం గ్రెస్ నాయకుల మీదనే ఎక్కువగా ఉం టుంది. తెలంగాణ విషయంలో ఎవ్వరినీ సంప్రదించవలసిన అవసరం లేదని, తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కాంగ్రెస్ అధిష్ఠాన ప్రతినిధిగా దిగ్విజయ్‌సింగ్ పదేపదే స్పష్టం చేశారు. ఒకటి రెండు పార్టీలు మినహాయి స్తే, జాతీయ స్థాయి రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ విషయంలో మద్దతును ఈ మధ్యనే మళ్లీ ప్రకటించాయి. పార్లమెంటులో బిల్లుపెడితే బేషరతుగా తమ మద్దతును ఇస్తామని ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ స్పష్టంగానే చెప్పింది. కాం గ్రెస్ అధిష్ఠా నం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆంధ్రా నాయకులందరూ ప్రకటిస్తున్నారు. ఇంతటి సానుకూలపరిస్థితులు నెలకొని ఉన్న ప్రస్తుత నేపథ్యంలో తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు అంశంపై ఇంకా కాలయాపన చేయ డం కాంగ్రెస్‌పార్టీకి, ఆ పార్టీ అధిష్ఠానానికి సముచితం అనిపించుకోదు. వేయిమందికి పైగా పిల్లలను పోగొట్టుకున్న కన్నతల్లి శోకం తెలంగాణ సమాజాన్ని కుదిపేస్తున్నది. అరవై ఏండ్లకు పైబడిన తెలంగాణ రాష్ర్ట ఆకాంక్ష ఇక్కడి ప్రజల గుండెలను పిండేస్తున్నది. మూడున్నరేండ్ల ప్రజా ఉద్యమం తెలంగాణ డిమాండును రాజ్యాంగహక్కుగా నిలబెట్టుకున్నది. ప్రజల భావోద్వేగాలు అత్యున్నత స్థాయికి చేరుకున్న ఇట్లాంటి సమయంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉన్నది. ఈ దిశలో కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడిని పెంచవలసిన కర్తవ్యం తెలుగుదేశం, వైఎస్‌ఆర్ సిపి పార్టీతోపాటుగా ఇతరపార్టీలపై కూడా ఉన్నది.

-పిట్టల రవీందర్
తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ర్ట ప్రధాన కార్యదర్శి

300

RAVINDAR PITTALA

Published: Wed,March 26, 2014 12:55 AM

తెలంగాణ జేఏసీ తక్షణ కర్తవ్యం!

తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో సంఘటిత శక్తి ని ప్రదర్శించి, రాజకీయ ఐక్యతను సాధించిన తెలంగాణ జేఏసీ తెలంగాణ పునర్నిర్మాణంలోనూ తన అస్త

Published: Sun,December 15, 2013 12:34 AM

జలధారలపై జలగలదాడి

ఆదిలాబాద్ జిల్లాలోని జలధారలమీద సీమాంధ్ర దోపిడీవర్గాలు జలగల్లాగా విరుచుకుపడేందుకు రంగాన్ని సిద్ధం చేసుకున్నాయి. కుంటాల జలపాతంపైన జల

Published: Thu,September 26, 2013 02:40 AM

‘సకల జనభేరి’ మోగిద్దాం

సమైక్యత పేరుమీద సీమాంవూధలో ముఖ్యమంత్రి పరోక్ష నాయకత్వంలో యాభయి రోజులుగా జరుగుతున్న ‘తమాషా’ ఉద్యమం వెనక స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడ

Published: Fri,May 31, 2013 09:58 PM

ఆంధ్రాపార్టీలు అవసరమా?

ప్రజలు వ్యక్తం చేసే అభివూపాయాలను, ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా పనిచేయాల్సిన బాధ్యత పార్లమెంటు, శాసనసభలకు ఉన్న ది. రాజ్యాంగ ని

Published: Wed,March 27, 2013 10:51 PM

విద్యావంతుల ఉద్యమవేదిక

నడుస్తున్న చరివూతలో మన పాదమువూదలను ఎంత గాఢంగా వేయగలిగామన్న దానిపైనే చరివూతలోమన స్థానం నిర్ధారించబడుతుంది. గత తొమ్మిదేళ్లలో తెలంగ

Published: Sun,March 17, 2013 12:41 AM

ఆకాంక్ష పట్టని అసమర్థ నేతలు

మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక ఆకాంక్షగానే మొదలయ్యింది. సాంస్కృతిక, సాహిత్య రూపాలలో భావవ్యాప్తి జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష

Published: Sat,October 6, 2012 04:12 PM

తెలంగాణ మార్చ్ దిశగా..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ హామీని అమలు చేసే వి

Published: Sat,October 6, 2012 04:13 PM

తెగించి కొట్లాడుదాం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పిల్లలు నిట్టనిలువునా కాలిపోతున్నరు. పిట్టల వలె రాలిపోతున్నరు. ఇప్పటి వరకు దాదాపు 63 మంది యువతీ యువకులు

Published: Sat,October 6, 2012 04:14 PM

ఉత్పత్తి వేటలో జీవన విధ్వంసం

వేగవంతమైన బొగ్గు ఉత్పత్తి, మితిమీరిన లాభాపేక్ష లక్ష్యాలతో సింగరేణి బొగ్గుగనుల సంస్థ ఓపెన్‌కాస్ట్ గనులను నిర్వహిస్తున్నది. దీనివల్ల

Published: Sat,October 6, 2012 04:14 PM

ఎన్టీపీసీ విస్తరణ ఎవరి కోసం?

ఏదైనా సంస్థ విస్తరించడమంటే.. అది అభివృద్ధి దిశలో పయనిస్తున్నట్టుగా భావించాలి. ఆ అభివృద్ధిని చూసి అందరూ గర్వపడతారు. ఆ విస్తరణను ఆహ్

Published: Sat,October 6, 2012 04:15 PM

ఈ మోసం ఇంకెన్నాళ్లు?

సరిగ్గా రెండేళ్ల కితం 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా

Published: Sat,October 6, 2012 04:14 PM

ఈ ప్రభుత్వం మనదెట్లా..?

ప్రజాస్వామిక హక్కులను ప్రతిబింబించవలసిన ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు ప్రజలపై విశ్వాసం లేదు. ప్రజా ప్రతినిధులపై విశ్వాసంలేదు. ప్రజలకు ఇ

Published: Sat,October 6, 2012 04:16 PM

ఐక్య ఉద్యమమే అంతిమ మార్గం

తెలంగాణ రాష్ట్ర సాధనకు ఐక్య ఉద్యమమే అంతిమ మార్గంగా అందరూ కలిసి ముందుకుపోవాల్సి ఉంది. రాష్ట్ర సాధనోద్యమంలో ముందువరుసలో నిలబడిన తెలం

Published: Sat,October 6, 2012 04:15 PM

సొంత రాష్ట్రం మా జన్మహక్కు

-శ్రీధర్‌రావు దేశ్‌పాండే, పిట్టల రవీందర్ తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు తెలంగాణను అన్ని రంగాలలో దోపిడీకి, అణిచివేతకు, వివక్ష

Published: Sat,October 6, 2012 04:15 PM

సింగరేణి ఉద్యమానికి కొండంత అండ..

-పిట్టల రవీందర్ (‘తెలంగాణ విద్యావంతుల వేదిక’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ‘ఒక ప్రాంతంలో లభ్యమయ్యే వనరులు ఆ ప్రాంత ప్రజల సంక్షేమాన

Featured Articles