ఆంధ్రాపార్టీలు అవసరమా?


Fri,May 31, 2013 09:58 PM


ప్రజలు వ్యక్తం చేసే అభివూపాయాలను, ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా పనిచేయాల్సిన బాధ్యత పార్లమెంటు, శాసనసభలకు ఉన్న ది. రాజ్యాంగ నిర్దేశాల ప్రకారం ప్రజలు తమకున్న ఓటుహక్కును వినియోగించుకుని తమ ప్రతినిధులను చట్టసభలకు పంపిస్తున్నారు. ఇట్లా ఎన్నికైన ప్రతినిధులు ప్రజల పక్షాన పనిచేయాల్సి ఉంటుంది. 2004, 2009లలో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రాంతం నుంచి పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికైన ప్రజావూపతినిధులందరూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఏర్పాటు కోసం చట్టసభల్లో కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఎన్నికల బరిలోకి దిగిన పార్టీలన్నీ ఇదే హామీతో ప్రజలను నమ్మించాయి. పార్టీలు, ఆ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అభ్యర్థులు తెలంగాణపై స్పష్టమైన హామీ ఇచ్చిన కారణంగానే ఇక్క డి ప్రజలు వారికి ఓటేసి ఆదరించారు.అక్కున చేర్చుకున్నారు. తమ ఆకాంక్షలను నెరవేర్చేందుకు వారిని పార్లమెంటు, అసెంబ్లీలకు పం పించారు.

కానీ అట్లా ఎన్నికైన ప్రజావూపతినిధు లు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించని కారణంగానే, ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను తుంగలోతొక్కిన ఫలితంగానే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఆంధ్ర ఆధిపత్యంలోని రాజకీయపార్టీలు తెలంగాణ డిమాండు విషయంలో దోబూచులాడుతున్నాయి. ఈ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్రాంత నాయకులు బానిసత్వాన్ని వదులుకోవడంలేదు.ఫలితంగా నిరాశా, నిస్పృహలకు లోనైన తెలంగాణ యువత ఆత్మహత్యలను నిరసన రూపంగా ఎంచుకుంటున్న ది. ఇప్పటికే దాదాపు రెండువేల మంది అమాయకులు బలైనా పార్లమెంటు, అసెంబ్లీల్లో కనీసం ఇక్కడి బలిదానాలపై సానుభూతిని కూడా ప్రకటించడంలేదు. ఆత్మహత్యలకు దారితీసిన పరిస్థితులపై చర్చించడంలేదు.వారి కుటుంబాలను పరామర్శించడంలేదు. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలను నివారించేందుకు ఈ ప్రభుత్వాలు కనీస చర్యలు తీసుకోవడం లేదు. పైగా రేణుకాచౌదరిలాంటి ఆంధ్రా దురహంకార నేతలు తెలంగాణ కోసం జరుగుతున్న ఆత్మహత్యలపై వక్రభాష్యాలు చెప్పుతున్నరు. తెలంగాణ బలిదానాలను అపహాస్యం చేస్తున్నరు.

రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలందరినీ సమాన దృష్టితో చూస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నిండుసభలోనే ‘తెలంగాణ ప్రాం తానికి ఒక్కరూపాయి కూడా ఇచ్చేదిలేదని, ఏం చేసుకుంటారో చేసుకోండ’ని వీధిరౌడీలాగా సవాలు విసురుతున్నాడు. ఎవ్వరు అడ్డమొచ్చినా బయ్యారం ఇనుప ఖనిజాన్ని ఆంధ్రాకు దోచుకుపోతామని బరిదెగించి మాట్లాడుతున్నాడు.ఆంధ్రాపార్టీలన్నీ ఆయనకు అండగా నిలుస్తున్నాయి.అయినా ఆంధ్రా పార్టీల్లోని తెలంగాణ ప్రాంత నాయకులు నోరుమూసుకుని కూర్చుంటున్నారు. కిరణ్ ప్రభుత్వం మీద అసెంబ్లీలో అవిశ్వాసం ప్రకటించిన ప్రతి సందర్భంలోనూ ఆంధ్రాపార్టీలు ఆయనకు అండగా నిలిచి కాపాడుతున్నయి. ఆంధ్రా ఆధిపత్య ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఏకమవుతున్నయి. అధికారా న్ని పంచుకునే విషయంలో ప్రతిరోజూ ఘర్షణ పడే ఆంధ్రా పార్టీ లు, తెలంగాణను అడ్డుకునే విషయంలో ఒక్కటిగా నిలుస్తున్నయి. కానీ తెలంగాణ రాజకీయ నాయకత్వం మాత్రం ఇట్లాంటి ఐక్యతను ప్రదర్శించడం లేదు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులు కట్టుబానిసల కంటే హీనంగా వ్యవహరిస్తున్నరు. ప్రజ లు ఛీదరించుకుంటున్నా, ఉపఎన్నికల్లో డిపాజిట్లు దక్కకుండా తిరస్కరించినా,బతికుండగానే కర్మకాండలు జరిపినా, చెప్పుల దండ లు వేసినా ప్రజల ఆకాంక్షలకంటే పదవులే ముఖ్యమంటూ జీవచ్ఛవాలుగా బతుకుతున్నరు. తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర, రాష్ర్ట మంవూతులు ఆంధ్రా పాలకుల అవినీతికి అండగా నిలుస్తున్న రు.

అభివృద్ధి విషయంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నా, ప్రభుత్వాలు వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నా, తెలంగాణ ప్రాంతాన్ని, ప్రజలను చట్టసభల్లో అవమానపరుస్తున్నా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నరు. తెలంగాణ ప్రజల ఆత్మఘోషను దేశరాజధానిలో వినిపించడానికి ‘సంసద్‌యాత్ర’ నిర్వహిస్తే, పార్లమెంటులో గొంతువిప్పాల్సిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సరియైన విధంగా స్పందించలేదు. తెలంగాణ గోసను పట్టించుకోని పార్లమెంటు, అసెంబ్లీలు మన వి కావని తేలిపోయింది. అందులో కూర్చుంటున్నవాళ్లు మనవాళ్లు కాదని తెలిసిపోయింది. తెలంగాణపై ఈ ఆంధ్రా అసెంబ్లీ తీర్మానం చేయదు. పార్లమెంటులో తెలంగాణబిల్లు పెడుతరని నమ్మకం లేదు. ఇట్లాంటి ఆంధ్రాపార్టీలను తెలంగాణలో ఎందుకు ఉండనియ్యాలె? ఆంధ్రా పార్టీలతో కలిసి పనిచేసే తెలంగాణ నాయకులు మనవాళ్లు ఎట్టయితరు!? తెలంగాణ గోసపట్టని ఆంధ్రా అసెంబ్లీని నిలదీద్దాం రాండ్రి. అంబేడ్కర్ చెప్పినట్లుగా రాజ్యాంగ వ్యవస్థలు ప్రజల ఆకాంక్షలను పట్టించుకోనప్పుడు, ప్రజల్లే నడుంకట్టాలి. తెలంగాణపై తీర్మానం చేయని ఈ ఆంధ్రా ఆధిపత్య ఆంధ్రవూపదేశ్ అసెంబ్లీ దద్దరిల్లేలా మన గొంతును దిక్కులు పిక్కటిల్లేలా వినిపిద్దాం రాండ్రి. జూన్ 14వ తేదీన లక్షలాదిగా తరలివచ్చి ‘చలో అసెంబ్లీ’ కార్యవూకమాన్ని విజయవంతం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న ఆంధ్రా పార్టీలకు తెలంగాణలో నిలువనీడలేకుండా చేద్దాం. తెలంగాణ సాధించుకుందాం.

-పిట్టల రవీందర్
తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ర్ట ప్రధాన కార్యదర్శి

37

RAVINDAR PITTALA

Published: Wed,March 26, 2014 12:55 AM

తెలంగాణ జేఏసీ తక్షణ కర్తవ్యం!

తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో సంఘటిత శక్తి ని ప్రదర్శించి, రాజకీయ ఐక్యతను సాధించిన తెలంగాణ జేఏసీ తెలంగాణ పునర్నిర్మాణంలోనూ తన అస్త

Published: Sun,December 15, 2013 12:34 AM

జలధారలపై జలగలదాడి

ఆదిలాబాద్ జిల్లాలోని జలధారలమీద సీమాంధ్ర దోపిడీవర్గాలు జలగల్లాగా విరుచుకుపడేందుకు రంగాన్ని సిద్ధం చేసుకున్నాయి. కుంటాల జలపాతంపైన జల

Published: Thu,September 26, 2013 02:40 AM

‘సకల జనభేరి’ మోగిద్దాం

సమైక్యత పేరుమీద సీమాంవూధలో ముఖ్యమంత్రి పరోక్ష నాయకత్వంలో యాభయి రోజులుగా జరుగుతున్న ‘తమాషా’ ఉద్యమం వెనక స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడ

Published: Mon,July 22, 2013 01:05 AM

తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ బాధ్యత

తెలంగాణ అంశాన్ని తేలుస్తున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలోనూ, కేంద్రంలోనూ నెలరోజులుగా తీవ్రస్థాయిలో హడావుడి చేస్తున్నది. గ్రామ

Published: Wed,March 27, 2013 10:51 PM

విద్యావంతుల ఉద్యమవేదిక

నడుస్తున్న చరివూతలో మన పాదమువూదలను ఎంత గాఢంగా వేయగలిగామన్న దానిపైనే చరివూతలోమన స్థానం నిర్ధారించబడుతుంది. గత తొమ్మిదేళ్లలో తెలంగ

Published: Sun,March 17, 2013 12:41 AM

ఆకాంక్ష పట్టని అసమర్థ నేతలు

మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక ఆకాంక్షగానే మొదలయ్యింది. సాంస్కృతిక, సాహిత్య రూపాలలో భావవ్యాప్తి జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష

Published: Sat,October 6, 2012 04:12 PM

తెలంగాణ మార్చ్ దిశగా..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ హామీని అమలు చేసే వి

Published: Sat,October 6, 2012 04:13 PM

తెగించి కొట్లాడుదాం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పిల్లలు నిట్టనిలువునా కాలిపోతున్నరు. పిట్టల వలె రాలిపోతున్నరు. ఇప్పటి వరకు దాదాపు 63 మంది యువతీ యువకులు

Published: Sat,October 6, 2012 04:14 PM

ఉత్పత్తి వేటలో జీవన విధ్వంసం

వేగవంతమైన బొగ్గు ఉత్పత్తి, మితిమీరిన లాభాపేక్ష లక్ష్యాలతో సింగరేణి బొగ్గుగనుల సంస్థ ఓపెన్‌కాస్ట్ గనులను నిర్వహిస్తున్నది. దీనివల్ల

Published: Sat,October 6, 2012 04:14 PM

ఎన్టీపీసీ విస్తరణ ఎవరి కోసం?

ఏదైనా సంస్థ విస్తరించడమంటే.. అది అభివృద్ధి దిశలో పయనిస్తున్నట్టుగా భావించాలి. ఆ అభివృద్ధిని చూసి అందరూ గర్వపడతారు. ఆ విస్తరణను ఆహ్

Published: Sat,October 6, 2012 04:15 PM

ఈ మోసం ఇంకెన్నాళ్లు?

సరిగ్గా రెండేళ్ల కితం 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా

Published: Sat,October 6, 2012 04:14 PM

ఈ ప్రభుత్వం మనదెట్లా..?

ప్రజాస్వామిక హక్కులను ప్రతిబింబించవలసిన ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు ప్రజలపై విశ్వాసం లేదు. ప్రజా ప్రతినిధులపై విశ్వాసంలేదు. ప్రజలకు ఇ

Published: Sat,October 6, 2012 04:16 PM

ఐక్య ఉద్యమమే అంతిమ మార్గం

తెలంగాణ రాష్ట్ర సాధనకు ఐక్య ఉద్యమమే అంతిమ మార్గంగా అందరూ కలిసి ముందుకుపోవాల్సి ఉంది. రాష్ట్ర సాధనోద్యమంలో ముందువరుసలో నిలబడిన తెలం

Published: Sat,October 6, 2012 04:15 PM

సొంత రాష్ట్రం మా జన్మహక్కు

-శ్రీధర్‌రావు దేశ్‌పాండే, పిట్టల రవీందర్ తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు తెలంగాణను అన్ని రంగాలలో దోపిడీకి, అణిచివేతకు, వివక్ష

Published: Sat,October 6, 2012 04:15 PM

సింగరేణి ఉద్యమానికి కొండంత అండ..

-పిట్టల రవీందర్ (‘తెలంగాణ విద్యావంతుల వేదిక’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ‘ఒక ప్రాంతంలో లభ్యమయ్యే వనరులు ఆ ప్రాంత ప్రజల సంక్షేమాన

Featured Articles