విద్యావంతుల ఉద్యమవేదిక


Wed,March 27, 2013 10:51 PM


నడుస్తున్న చరివూతలో మన పాదమువూదలను ఎంత గాఢంగా వేయగలిగామన్న దానిపైనే చరివూతలోమన స్థానం నిర్ధారించబడుతుంది. గత తొమ్మిదేళ్లలో తెలంగాణ సమాజం అనేక ఆటుపోట్లకు గురైంది. సుదీర్ఘమైన ఉద్యమ అనుభవాలతో రాటుదేలిపోయింది. తెలంగాణ విద్యావంతుల వేదికలాంటి ఒక ప్రజా సంఘానికి తొమ్మిది సంవత్సరాల ప్రయాణం సుదీర్ఘమైనదేమీ కాకపోయినా.. తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని పదిలపరుచుకోవడానికి ఇది తక్కువ సమయమేమీకాదు. అయితే నడుస్తున్న చరివూతలో మన స్థానాన్ని భవిష్యత్తు మాత్రమే నిర్ణయిస్తుంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక ఆకాంక్షగా ప్రారంభమై, రాజకీయ డిమాండ్‌గా మారి, ఒక రాజ్యాంగహక్కుగా మారడం తెలంగాణ ప్రజా ఉద్యమంలోని మూడు కీలక పరిణామాలుగా గుర్తించవలసి ఉన్నది. ఈ పరిణామ క్రమంలో విద్యావంతుల వేదిక తమవంతు కృషిని వివిధ రూపాల్లో కొనసాగించింది. ముఖ్యంగా విద్యావంతులను భావ వ్యాప్తిరంగం మీదికి సమీకరించడంలో తెలంగాణ విద్యావంతుల వేదిక ఎంచుకున్న మూడంచెల పద్ధతి ఎంతగానో ఉపకరించింది.

తెలంగాణ విద్యావంతుల వేదిక ఆవిర్భావం నుంచి 2009 చివరి వరకు ఒక ప్రత్యేకమైన కార్యాచరణతో ముందుకుపోయింది. ఉద్యమ భావవ్యాప్తి రంగంలో విశేషంగా తన కృషిని కొనసాగించింది. అధ్యయనం, భావవ్యాప్తి, ఉద్యమం ....అనే మూడంచెల విధానాన్ని విద్యావంతుల వేదిక అనుసరించింది. తెలంగాణలోని మౌళిక సమస్యలపైన సమక్షిగంగా అధ్యయనం చేయడం, ఆ అధ్యయనం ద్వారా వచ్చిన అవగాహనను ఉద్యమ ప్రజల్లోకి విస్తరించడం, చివరగా ఆ సమస్యల పరిష్కారానికి ప్రజా సమూహాలను ఉద్యమంలోకి సమీకరించిడంలో విద్యావంతుల వేదిక తమకంటూ ఒక ప్రత్యేకమైన పని విధానాన్ని రూపొందించుకున్నది.

తెలంగాణ రాష్ట్ర సాధన, పునర్నిర్మాణం ప్రధాన లక్ష్యాలతో 2004లో ప్రారంభమైన తెలంగాణ విద్యావంతుల వేదిక కృషి చేస్తున్నది. రాష్ట్ర సాధనలో అంతిమంగా అవసరమై న రాజకీయ ప్రక్రియను ముందుకు తీసుకుపోవడంలోనూ, తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని ఏకతాటి మీదికి తీసుకురావడంలోనూ ... తెలంగాణ ఉద్యమ సమాజం చేస్తున్న ప్రయత్నాల్లో తెలంగాణ విద్యావంతుల వేదిక తనవంతు పాత్రను నిర్వహిస్తున్నది. అయి నా ఒకవైపు తెలంగాణ విద్యావంతుల వేదిక తన స్వీయ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే తెలంగాణ జేఏసీలో కీలక పాత్రను నిర్వహిస్తున్నది. జిల్లా, స్థానిక జేఏసీలలోనూ విద్యావంతుల వేదిక నాయకత్వ బాధ్యలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నది. రాష్ట్ర సాధన ఉద్యమ కార్యాచరణ రూపొందించడంలోనూ,అమలు చేయడంలోనూ గ్రామస్థాయి వరకు విస్తరించుకున్న విద్యావంతుల వేదిక నాయకులు,కార్యకర్తలు,ఉద్యమకారులు ముఖ్య భూమికను పోషిస్తున్నారు. తెలంగాణ జేఏసీలో విద్యావంతుల వేదికకు ప్రధాన భూమికను పోషించే అవకాశం కలగడం, ఉద్యమ ప్రజల్లో వేదికపై ఉన్న అచంచలమైన విశ్వాసంగానే భావిస్తున్నాము.

ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకైన పాత్రను పోషిస్తూనే, మరోవైపున స్థానిక సమస్యల పరిష్కారానికి కూడా తనవంతు ప్రయత్నాన్ని కొనసాగించింది. తెలంగాణలో పత్తి రైతుల ఆత్మహత్యల నేపథ్యాన్ని అధ్యయనం చేసేందుకు విద్యావంతుల వేదిక ప్రతినిధుల బృందం ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా, ముథోల్, బోధ్, నేరడిగొండ, నిర్మల్, లక్షెట్టిపేట తదితర ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించింది. ఒక్క సంవత్సరంలోనే కేవలం ఆదిలాబాద్ జిల్లాలోనే దాదాపు 65 మంది పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం మానవహక్కుల ఉల్లంఘనగా స్పందించాలని కోరుతూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు విద్యావంతుల వేదిక పక్షాన ఫిర్యాదు చేసింది.

వరంగల్ జిల్లా మహబూబాబాద్ పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యపై విద్యావంతుల వేదిక ప్రత్యేకంగా అధ్యయనం నిర్వహించి, పరిష్కారానికి అవసరమైన నివేదికను తయారు చేసింది. కరీంనగర్, వరంగల్లు, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలలో విస్తరించిన బొగ్గుగనులపై కూడా వేదిక అధ్యయనం కొనసాగింది. ముఖ్యంగా ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల కారణంగా సింగరేణి ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న విస్తాపన, పర్యావరణ విధ్వంసం, వనరుల దోపి డీ, తదితర సమస్యలపై సమక్షిగమైన అధ్యయనం నిర్వహించడంతోపాటు, బాధిత ప్రజలను ఉద్యమంలోకి సమీకరించడంలో విద్యావంతుల వేదిక ప్రధాన పాత్రను నిర్వహించింది.


ప్రకృతి ప్రసాదించిన అందాలను కూడా వ్యాపార దృష్టితో చూసే ప్రపంచీకరణ ప్రభావం ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం ఆధారంగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రైవేటు కంపెనీ జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించే ప్రయత్నాన్ని అక్కడి ఆదివాసీలతో కలిసి వేదిక ఉద్యమించి ఆపగలిగింది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతాల ప్రజలను భయాందోనలకు గురిచేసిన టైగర్‌జోన్‌పై కూడా వేదిక ఉద్యమ ప్రజలకు అండగా నిలిచింది. ఇవాళ విద్యుత్ సంక్షోభంతో ప్రజలు అతలాకుతలం అవుతున్న పరిస్థితులు గమనిస్తున్నాం.

తెలంగాణ కరెంటు సమస్యలపైనా, పరిష్కారాలపైనా తెలంగాణ విద్యావంతుల వేదిక ఏడాది క్రితమే రామగుండంలోనూ, కరీంనగర్‌లోనూ నిపుణులతో సదస్సులను నిర్వహించి కరెంటు సమస్యకు కారణాలను విశ్లేషించింది. కరీంనగర్ సమీపంలోని నేదునూరులో ప్రతిపాదించిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి, రామగుండంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని విస్తరించాలని, కేంద్ర ఆధీనంలోని ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రం విస్తరణ ప్రయత్నాలను విరమించుకోవాలని వేదిక విస్తృతంగా భావజాలవ్యాప్తిని నిర్వహించింది. ఇవాళ ప్రభుత్వం రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకోవడం వెనక విద్యావంతుల వేదిక నిర్వహించిన అధ్యయనం, భావవ్యాప్తి ప్రభావం ఉందని గర్వంగా చెప్పుకోవచ్చు.
కరీంనగర్ జిల్లాలోని హరిత బయోప్లాంట్ వెదజల్లుతున్న కాలుష్యం, ఆ ప్రభావంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విద్యావంతుల వేదిక ప్రత్యేక బృందం అధ్యయనం చేసి, కరీంనగర్‌లో రౌండ్ సమావేశాన్ని నిర్వహించి,బాధిత ప్రజలకు అన్ని సందర్భాల్లోనూ అండగా నిలిచాము.

సకల జనుల సమ్మె సందర్భంలో విద్యావంతుల వేదిక అన్ని జిల్లాలలోనూ సన్నాహక సదస్సులను నిర్వహించింది. సమ్మె సమయంలో నాలుగు రోజులపాటు ఏడు జిల్లాలలో బస్సుయావూతను నిర్వహించి, ఉద్యమంలో పాలుపంచుకుంటున్న ప్రజలను ఉత్తేజపరిచింది. సకల జనులసమ్మెలో ఎంతో ఉద్యమస్ఫూర్తిని రగిలించిన సింగరేణి గని కార్మికుల సమ్మెను ప్రోత్సహించడానికి విద్యావంతుల వేదిక గౌరవాధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్,అధ్యక్షులు మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి పిట్టల రవీందర్ ‘చలో సింగరేణి’ యాత్రను నిర్వహించిన సందర్భంలో ప్రభుత్వం వేదిక నాయకత్వం మీద అమలు జరిపిన నిర్బంధాన్ని ప్రజలు సంఘటితంగా ఎదుర్కొని ప్రతిఘటించిన సందర్భాలు మరిచిపోలేనివి. శ్రీ కృష్ణ కమిటీ ప్రతిపాదించిన ఎనిమిదవ చాప్టర్ కుట్రలపై వాస్తవాలను వెలువరించేంచుకు విద్యావంతుల వేదిక అన్ని జిల్లాలోనూ సదస్సులను నిర్వహించింది.

రాష్ట్ర సాధన ప్రజా ఉద్యమంలో సోదర సంస్థలతోనూ స్నేహపూర్వక ధోరణితో వ్యవహరిస్తూ, వారితో కలిసి అనేక కార్యవూకమాలను నిర్వహించింది. ప్రధానంగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరంతో కలిసి తెలంగాణ ఉద్యమం పట్ల సీమాంధ్ర ఆధిపత్య మీడియా అనుసరిస్తున్న ధోరణులపై మీడియా రంగంలోని ప్రముఖులతో సెమినార్‌ను నిర్వహించింది. తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ స్ఫూర్తిని కొనసాగించేందుకు ఆయన వర్థంతి, జయంతి సందర్భాల ను తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో స్ఫూర్తి సభలను నిర్వహించుకున్నాం. ఒకవైపు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొంటూనే అనేక కరపవూతాలు, వాల్‌పోస్టర్ల, పత్రికల్లో వ్యాసాలు ప్రచురించడంతోపాటు అనేక పుస్తకాలను కూడా ప్రచురించింది. రాష్ట్ర సాధన ఉద్యమంలో అత్యంత కీలకమైన ప్రతిఘటన ఘట్టంగా చరివూతలో నిలిచిపోయిన మిలియన్ మార్చ్ సంఘటన మిగిల్చిన స్ఫూర్తిని నిలబెట్టే రీతిలో ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ పుస్తకాన్ని తీవ్రమైన పోలీసు నిర్బంధం మధ్య ఆవిష్కరించుకుని మిలియన్‌మార్చ్ స్ఫూర్తి సభను నిర్వహించుకున్నాం.

రెండున్నర ఏళ్లుగా తెలంగాణ విద్యావంతుల వేదిక తన లక్ష్యాలకు అనుగుణంగా పని చేసిందని చెప్పుకోవడం అతిశయోక్తికాదు. తొమ్మిదేళ్ల ఉద్యమ కార్యాచరణ అనుభవంలో మనముందు మరిన్ని బాధ్యతలు ఉన్నాయని అంగీకరించక తప్పదు. ముఖ్యంగా ఉద్యమ కార్యాచరణను గ్రామస్థాయిలోకి విస్తరించడంలోనూ, నిర్వహించడంలోనూ నిర్మాణపరమైన ఆటంకాలను అధిగమించవలసి ఉన్నది. ఇందుకు అవసరమైన అవగాహనను, నేపథ్యాన్ని, భూమికను ఉద్యమ అవగాహన పత్రం ద్వారా చర్చకు పెడుతున్నాం. ఆనేపథ్యంలోనే విద్యావంతుల వేదిక భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుని, ఆచరణలో ముందుకుపోవడంలోనూ, మరింత మెరుగైన ఉద్యమాచరణను అమలు చేయడంలోనూ కృతనిశ్చయంతో ఒక ఉద్యమ సంస్థగా ముందుకు పోవల్సి ఉన్నది.
-పిట్టల రవీందర్
తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

35

RAVINDAR PITTALA

Published: Wed,March 26, 2014 12:55 AM

తెలంగాణ జేఏసీ తక్షణ కర్తవ్యం!

తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో సంఘటిత శక్తి ని ప్రదర్శించి, రాజకీయ ఐక్యతను సాధించిన తెలంగాణ జేఏసీ తెలంగాణ పునర్నిర్మాణంలోనూ తన అస్త

Published: Sun,December 15, 2013 12:34 AM

జలధారలపై జలగలదాడి

ఆదిలాబాద్ జిల్లాలోని జలధారలమీద సీమాంధ్ర దోపిడీవర్గాలు జలగల్లాగా విరుచుకుపడేందుకు రంగాన్ని సిద్ధం చేసుకున్నాయి. కుంటాల జలపాతంపైన జల

Published: Thu,September 26, 2013 02:40 AM

‘సకల జనభేరి’ మోగిద్దాం

సమైక్యత పేరుమీద సీమాంవూధలో ముఖ్యమంత్రి పరోక్ష నాయకత్వంలో యాభయి రోజులుగా జరుగుతున్న ‘తమాషా’ ఉద్యమం వెనక స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడ

Published: Mon,July 22, 2013 01:05 AM

తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ బాధ్యత

తెలంగాణ అంశాన్ని తేలుస్తున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలోనూ, కేంద్రంలోనూ నెలరోజులుగా తీవ్రస్థాయిలో హడావుడి చేస్తున్నది. గ్రామ

Published: Fri,May 31, 2013 09:58 PM

ఆంధ్రాపార్టీలు అవసరమా?

ప్రజలు వ్యక్తం చేసే అభివూపాయాలను, ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా పనిచేయాల్సిన బాధ్యత పార్లమెంటు, శాసనసభలకు ఉన్న ది. రాజ్యాంగ ని

Published: Sun,March 17, 2013 12:41 AM

ఆకాంక్ష పట్టని అసమర్థ నేతలు

మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక ఆకాంక్షగానే మొదలయ్యింది. సాంస్కృతిక, సాహిత్య రూపాలలో భావవ్యాప్తి జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష

Published: Sat,October 6, 2012 04:12 PM

తెలంగాణ మార్చ్ దిశగా..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ హామీని అమలు చేసే వి

Published: Sat,October 6, 2012 04:13 PM

తెగించి కొట్లాడుదాం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పిల్లలు నిట్టనిలువునా కాలిపోతున్నరు. పిట్టల వలె రాలిపోతున్నరు. ఇప్పటి వరకు దాదాపు 63 మంది యువతీ యువకులు

Published: Sat,October 6, 2012 04:14 PM

ఉత్పత్తి వేటలో జీవన విధ్వంసం

వేగవంతమైన బొగ్గు ఉత్పత్తి, మితిమీరిన లాభాపేక్ష లక్ష్యాలతో సింగరేణి బొగ్గుగనుల సంస్థ ఓపెన్‌కాస్ట్ గనులను నిర్వహిస్తున్నది. దీనివల్ల

Published: Sat,October 6, 2012 04:14 PM

ఎన్టీపీసీ విస్తరణ ఎవరి కోసం?

ఏదైనా సంస్థ విస్తరించడమంటే.. అది అభివృద్ధి దిశలో పయనిస్తున్నట్టుగా భావించాలి. ఆ అభివృద్ధిని చూసి అందరూ గర్వపడతారు. ఆ విస్తరణను ఆహ్

Published: Sat,October 6, 2012 04:15 PM

ఈ మోసం ఇంకెన్నాళ్లు?

సరిగ్గా రెండేళ్ల కితం 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా

Published: Sat,October 6, 2012 04:14 PM

ఈ ప్రభుత్వం మనదెట్లా..?

ప్రజాస్వామిక హక్కులను ప్రతిబింబించవలసిన ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు ప్రజలపై విశ్వాసం లేదు. ప్రజా ప్రతినిధులపై విశ్వాసంలేదు. ప్రజలకు ఇ

Published: Sat,October 6, 2012 04:16 PM

ఐక్య ఉద్యమమే అంతిమ మార్గం

తెలంగాణ రాష్ట్ర సాధనకు ఐక్య ఉద్యమమే అంతిమ మార్గంగా అందరూ కలిసి ముందుకుపోవాల్సి ఉంది. రాష్ట్ర సాధనోద్యమంలో ముందువరుసలో నిలబడిన తెలం

Published: Sat,October 6, 2012 04:15 PM

సొంత రాష్ట్రం మా జన్మహక్కు

-శ్రీధర్‌రావు దేశ్‌పాండే, పిట్టల రవీందర్ తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు తెలంగాణను అన్ని రంగాలలో దోపిడీకి, అణిచివేతకు, వివక్ష

Published: Sat,October 6, 2012 04:15 PM

సింగరేణి ఉద్యమానికి కొండంత అండ..

-పిట్టల రవీందర్ (‘తెలంగాణ విద్యావంతుల వేదిక’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ‘ఒక ప్రాంతంలో లభ్యమయ్యే వనరులు ఆ ప్రాంత ప్రజల సంక్షేమాన