ఆకాంక్ష పట్టని అసమర్థ నేతలు


Sun,March 17, 2013 12:41 AM

మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక ఆకాంక్షగానే మొదలయ్యింది. సాంస్కృతిక, సాహిత్య రూపాలలో భావవ్యాప్తి జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంతో టిఆర్‌ఎస్ ఏర్పాటుతో తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ఆకాంక్షకు ఒక బలమైన రాజకీయ వ్యక్తీకరణ తోడయ్యింది. ఈ రాజకీయ పరిణామాలతో రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష ఒక రాజకీయ డిమాండుగా పరిణామం చెందింది. 2009 నవంబర్ 29వతేదీన చంద్రశేఖర్‌రావు ఆమరణ దీక్ష నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఒక పూర్తిస్థాయి ప్రజాఉద్యమంగా మారింది. తెలంగాణ సమాజం మొత్తంగానే ఈ ఉద్యమంలో తమ ఉనికిని ప్రదర్శించింది. పాత్రను నిర్వహిస్తున్నది. తెలంగాణ ప్రజానీకం ఎక్కడివారక్కడ, ఎవరికివారుగా స్వచ్ఛందంగా పాలుపంచుకున్నారు.

ప్రపంచీకరణలో భాగంగా అమలులోకివచ్చిన నూతన పారివూశామిక, ఆర్థిక విధానాల నేపథ్యంలో ఎదురైన సంక్షోభాల నుంచి బయటపడటం కోసం అంతర్గత వలస దోపిడీని, ఆధిపత్యాన్ని ఎదిరించడమే ఏకైక లక్ష్యంగా ప్రజలు రాష్ట్ర సాధన ఉద్యమ పథాన్ని ఎంచుకున్నారు. స్వయంపాలన ద్వారా మాత్రమే తమ సమస్యలకు పరిష్కారం వెతుక్కునేందుకు మార్గం సుగమ మం అవుతుందని ప్రజలు భావించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అంతిమ సారంలో తమ బతుకుదెరువు పోరాటంగా ప్రజలు నిశ్చయించుకున్నారు. ఉద్యమంలో పెద్దయెత్తున భాగస్వాములయ్యారు. జేఏసీ ఎప్పుడు, ఎట్లాంటి పిలుపులిచ్చినా స్వచ్ఛందంగా స్పందించారు. నిరహారదీక్షలతో తమ కడుపులు మాడ్చుకున్నారు.

బంద్‌లు, రాస్తారోకోలు నిర్వహించి స్వీయ హింసను తట్టుకున్నారు. ప్రజాస్వామిక స్ఫూర్తిని, శాంతియుత పద్ధతుల్లో ఉద్యమా న్ని ముందుకు తీసుకుపోయారు. ప్రజా ఉద్యమం నుంచి ఎదురైన ఒత్తిడికి తలవంచిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు స్వయంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో తెలంగాణ డిమాండు ఒక హక్కుగా అంగీకారం పొందింది. రాష్ట్ర ఏర్పాటు ఒక ఆకాంక్షగా ప్రారంభమై, రాజకీయ డిమాండుగా మారి, ఒక రాజ్యాంగ హక్కుగా ఎదగడం తెలంగాణ ప్రజా ఉద్యమంలోని మూడు కీలక పరిణామాలుగా గుర్తించవలసిఉన్నది.

‘పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడటంలోనూ, అమలు పరచడంలోనూ రాజ్యాంగ వ్యవస్థలు (పాలనావ్యవస్థ, న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థలు) విఫలమైనప్పుడు.. ప్రజలే స్వయం గా పూనుకుని తమ హక్కులను రక్షించుకోవాలి. లేనిపక్షంలో ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతుంది.’అంటూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట ‘సహాయ నిరాకరణ’ ‘సకల జనుల సమ్మె’లాంటి వినూత్న కార్యవూకమాలను రూపకల్పన చేయడంలో స్ఫూర్తినిచ్చాయి. ఈరెండు కార్యవూకమాలు ఏకకాలంలో మూడు ప్రధానమైన లక్ష్యాలతో నిర్వహించుకున్నాము. 1) తెలంగాణపై పార్లమెంటులో బిల్లుపెట్టే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడిని పెంచడం. 2) సీమాంధ్ర ఆధిపత్యంలో మగ్గుతూ, తెలంగాణ ఉద్యమానికి అడుగడుగునా అడ్డుపడుతున్న విద్రోహశక్తులకు దాసులుగా పనిచేస్తున్న తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని ఉద్యమ క్రమంలోకి సమీకరించడం. 3) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అనేక రూపాలలో వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర శక్తుల కు సంబంధించిన ఆర్థిక, రాజకీయ, ఆధిపత్య మూలాలలను తెలంగాణలో దెబ్బతీయడం.

ఈ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించడంలోనూ, అట్లా రూపొందించుకున్న కార్యాచరణను అమలుచేయడంలోనూ తెలంగాణ రాజకీయ నాయకత్వం అడుగడుగునా అడ్డుగా నిలిచింది. రాష్ట్ర సాధన కోసం సర్వం తెగించి నిలిచిన ఉద్యమ ప్రజానీకానికి అండగా నిలవకుండా, సీమాంధ్ర ఆధిపత్య రాజకీయాలకు బానిసలుగా పనిచేశారు. ఇప్పటికీ అదే పద్ధతులను పాటిస్తున్నారు. తెలంగాణ రాజకీయ నాయకత్వం అనుసరిస్తున్న ఇట్లాంటి లోపాయికారీ విధానాల కారణంగానే దాదాపు పన్నెండు సంవత్సరాలుగా రాష్ట్రలోని ప్రధాన పార్టీలు తెలంగాణ రాష్ట్ర డిమాండు విషయంలో దోబూచులాడగలుగుతున్నాయి. గడచిన మూడున్నర ఏళ్ల ఉద్యమంలో అనేక సందర్భాలలో తెలంగాణ రాజకీయ నాయకత్వం తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి అద్భుతమైన అవకాశాలు ఉద్యమం అందించింది. ‘సహాయ నిరాకరణ’ సందర్భంలో ఉద్యోగ వర్గాలు రాష్ట్ర పాలనారంగాన్ని స్థంభింపజేశారు. టీఆర్‌ఎస్ శాసనసభ్యులు అసెంబ్లీ నడవకుండా అడ్డుకోగలిగారు. ఇదే సందర్భంలో తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్, తెలుగుదేశం,లాంటి ఇతర పార్టీల నేతలు కూడా ఏకకాలంలో ప్రభుత్వం పై ‘సహాయ నిరాకరణ’ పాటించి ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవి. ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగేది. కానీ రాజ కీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చి, ప్రజాఉద్యమాన్ని చులకనగా చూసిన కారణంగానే సీమాంధ్ర ఆధిపత్య ప్రభుత్వం నిలబడగలిగింది.

‘సకల జనుల సమ్మె’ సందర్భంలోనూ ఇదే పరిస్థితి ఎదురయ్యింది. తెలంగాణ సమాజంలోని అన్నివర్గాల ప్రజలు తమతమ పద్ధతుల్లో ఎంతో క్రియాశీలకంగా సమ్మెలో పాలుపంచుకుంటే ... తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ మంత్రులు దొడ్డిదారుల్లో అధికారిక కార్యకలాపాలను నిర్వహించి, తెలంగాణ ప్రజాఉద్యమానికి ద్రోహం తలపెట్టారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్, తెలుగుదేశంఎమ్మెల్యేలు సీమాంధ్ర ఆధిపత్యానికి దాసోహమన్నారు. అన్నివర్గాల ప్రజలు ‘సకల జనుల సమ్మె’లో పాల్గొని అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంపట్ల తెలంగాణ రాజకీయ నాయకత్వం అనుసరిస్తున్న నిర్లిప్త, నిర్లక్ష్య ధోరణులకు వ్యతిరేకంగా ప్రజలు అనేక రూపాల్లో తమ నిరసనలను వ్యక్తం చేశారు. శవ దహనాలు, శవాల ను ఊరేగింపులు, ఉరితీయడాలు, పిండవూపదానాలు, పూడ్చిపెట్టడాలులాంటి అనేకకార్యవూకమాల రూపంలో తెలంగాణ రాజకీయ నాయకత్వంపై ప్రజలు తమ ఆగ్రహాలను ప్రకటించారు. ఆత్మహత్యలను కూడా ఒక నిరసన మార్గంగా ఆచరించిన చరిత్ర ప్రపంచ ఉద్యమాలలో ఎక్కడా కనిపించదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇక్కడి ప్రజలందరూ ఇన్నిరకాలుగా ఇబ్బందులు అనుభవిస్తుంటే, తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులు మాత్రం అధికారమే పరమావధిగా, సీమాంధ్ర ఆధిపత్యమే శరణ్యంగా ప్రవర్తిస్తున్నారు.

ఐదు దశాబ్దాల రాజకీయ ఆధిపత్యం నుంచి విముక్తిని సాధించుకునే అవకాశాన్ని తెలంగాణ రాజకీయ నాయకత్వానికి ఉద్యమం ఇచ్చింది. కానీ సీమాంధ్ర బానిసత్వం నుంచి బయటపడే చొరవను, తెగువను, లౌక్యాన్ని తెలంగాణ రాజకీయ నాయకత్వం ప్రదర్శించడంలేదు. తెలంగాణ ఉద్యమ ప్రభావం ఫలితంగా, సీమాంధ్ర ఆధిపత్య రాజకీయాల్లో అందుబాటులోకి వస్తున్న చిన్నపాటి వెసులుబాటు అవకాశాలకే తెలంగాణ రాజకీయ నాయకత్వం ఉబ్బితబ్బిబ్బవుతున్నది. ఉద్యమంలో ప్రజలు చేస్తున్న త్యాగాలను గుర్తించకుండా వ్యవహరిస్తున్నది.

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపెల్లి జయశంకర్ చెప్పినట్లుగా ... తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఉండవలసిన మూడుపార్శాలలో భావవ్యాప్తి, ఉద్యమం, రాజకీయ వూపవూకియ ..తెలంగాణ ప్రాంత మేధావులు, విద్యావంతులు, కవులు,కళాకారులు, రచయితలు తెలంగాణ భావజాలవ్యాప్తిలో నిరంతరంగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. సమాజంలోని అన్నివర్గాల ప్రజలు మూడున్నరేళ్లుగా ఉద్యమంలో చురుకైన పాత్రను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర సాధన ఉద్యమాన్ని తమ భుజాలపై మోస్తున్నారు. కానీ అంతిమంగా జరగాల్సిన ‘రాజకీయ ప్రక్రియ’లో తెలంగాణ రాజకీయ నాయకత్వం సంఘటితంగా వ్యవహరించకపోవడంవల్లనే ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ’ స్తంభించిపోయిందనే వాస్తవం ఇవ్వాల్టి ఉద్యమ సమాజానికి అర్థమైంది. సీమాంధ్ర ఆధిపత్యంలోని పార్టీలు తెలంగాణపట్ల అనుసరిస్తున్న వైఖరులు అందరికీ తెలిసిపోయాయి.

గత డిసెంబర్ 28న కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమా ర్ షిండే ఏర్పాటు చేసిన సమావేశంలో దాదాపు అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా తమ అభివూపాయాలను వెల్లడించాయి. ఆ సందర్భంలో నెలరోజుల్లో నిర్ణయాన్ని లేదా అభివూపాయాన్ని తెలియజేస్తామన్న ప్రభుత్వం, ఆ తర్వాత మాటమార్చినప్పుడు, కేంద్ర వూపభుత్వాన్ని నిలదీయవలసిన బాధ్యత తెలంగాణకు అనుకూలంగా అభివూపాయాన్ని వ్యక్తం చేసినట్లు చెప్పుకున్న పార్టీలకున్నది. కానీ ఏ ఒక్కరూ ఇది అన్యాయమని మాట్లాడలేదు. అందువల్ల తెలంగాణ విషయంలో సమయానుకూలంగా, కప్పదాటు ధోరణితో ప్రవర్తిస్తున్న కాంగ్రెస్, తెలుగుదేశం, వైకాపా ... తదితర పార్టీలకు చెంది న తెలంగాణ ప్రాంత నాయకులు తెలంగాణ అంశంపట్ల తమ చిత్తశుద్ధిని, నిబద్ధతను, నిజాయితీని నిరూపించుకోవాల్సి ఉన్నది. ప్రజాసమస్యలను గాలికివదిలి, అన్నివర్గాల ప్రజలకూ కంటకంగా మారిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పాలనాపరంగా తన ఉనికిని ఎప్పుడో కోల్పోయింది. గడచిన ఐదు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ, వంచిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ర్టంలో భూస్థాపితం చేయడం ద్వారా మాత్రమే తెలంగాణపై కేంద్రవూపభుత్వ హామీని అమలు చేయించుకోగలం.

కిరణ్‌కుమార్‌డ్డి ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. ప్రజల్లో విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలంటే ... కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీలకు చెందిన ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయాల్సింది. కానీ అందుకు విరుద్ధంగా సీమాంధ్ర నాయకత్వాన్ని బల పరచడం ద్వారా ఈ ప్రాంత ప్రజల విశ్వసనీయతను కోల్పోయారు. రాష్ర్ట సాధన కోసం ఇప్పటికే వేయిదాటిన బలవన్మరణాలకు ఈ బానిస నేతలే బాధ్యత వహిం చాల్సి ఉంటుంది.

-పిట్టల రవీందర్

35

RAVINDAR PITTALA

Published: Wed,March 26, 2014 12:55 AM

తెలంగాణ జేఏసీ తక్షణ కర్తవ్యం!

తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో సంఘటిత శక్తి ని ప్రదర్శించి, రాజకీయ ఐక్యతను సాధించిన తెలంగాణ జేఏసీ తెలంగాణ పునర్నిర్మాణంలోనూ తన అస్త

Published: Sun,December 15, 2013 12:34 AM

జలధారలపై జలగలదాడి

ఆదిలాబాద్ జిల్లాలోని జలధారలమీద సీమాంధ్ర దోపిడీవర్గాలు జలగల్లాగా విరుచుకుపడేందుకు రంగాన్ని సిద్ధం చేసుకున్నాయి. కుంటాల జలపాతంపైన జల

Published: Thu,September 26, 2013 02:40 AM

‘సకల జనభేరి’ మోగిద్దాం

సమైక్యత పేరుమీద సీమాంవూధలో ముఖ్యమంత్రి పరోక్ష నాయకత్వంలో యాభయి రోజులుగా జరుగుతున్న ‘తమాషా’ ఉద్యమం వెనక స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడ

Published: Mon,July 22, 2013 01:05 AM

తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ బాధ్యత

తెలంగాణ అంశాన్ని తేలుస్తున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలోనూ, కేంద్రంలోనూ నెలరోజులుగా తీవ్రస్థాయిలో హడావుడి చేస్తున్నది. గ్రామ

Published: Fri,May 31, 2013 09:58 PM

ఆంధ్రాపార్టీలు అవసరమా?

ప్రజలు వ్యక్తం చేసే అభివూపాయాలను, ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా పనిచేయాల్సిన బాధ్యత పార్లమెంటు, శాసనసభలకు ఉన్న ది. రాజ్యాంగ ని

Published: Wed,March 27, 2013 10:51 PM

విద్యావంతుల ఉద్యమవేదిక

నడుస్తున్న చరివూతలో మన పాదమువూదలను ఎంత గాఢంగా వేయగలిగామన్న దానిపైనే చరివూతలోమన స్థానం నిర్ధారించబడుతుంది. గత తొమ్మిదేళ్లలో తెలంగ

Published: Sat,October 6, 2012 04:12 PM

తెలంగాణ మార్చ్ దిశగా..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ హామీని అమలు చేసే వి

Published: Sat,October 6, 2012 04:13 PM

తెగించి కొట్లాడుదాం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పిల్లలు నిట్టనిలువునా కాలిపోతున్నరు. పిట్టల వలె రాలిపోతున్నరు. ఇప్పటి వరకు దాదాపు 63 మంది యువతీ యువకులు

Published: Sat,October 6, 2012 04:14 PM

ఉత్పత్తి వేటలో జీవన విధ్వంసం

వేగవంతమైన బొగ్గు ఉత్పత్తి, మితిమీరిన లాభాపేక్ష లక్ష్యాలతో సింగరేణి బొగ్గుగనుల సంస్థ ఓపెన్‌కాస్ట్ గనులను నిర్వహిస్తున్నది. దీనివల్ల

Published: Sat,October 6, 2012 04:14 PM

ఎన్టీపీసీ విస్తరణ ఎవరి కోసం?

ఏదైనా సంస్థ విస్తరించడమంటే.. అది అభివృద్ధి దిశలో పయనిస్తున్నట్టుగా భావించాలి. ఆ అభివృద్ధిని చూసి అందరూ గర్వపడతారు. ఆ విస్తరణను ఆహ్

Published: Sat,October 6, 2012 04:15 PM

ఈ మోసం ఇంకెన్నాళ్లు?

సరిగ్గా రెండేళ్ల కితం 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా

Published: Sat,October 6, 2012 04:14 PM

ఈ ప్రభుత్వం మనదెట్లా..?

ప్రజాస్వామిక హక్కులను ప్రతిబింబించవలసిన ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు ప్రజలపై విశ్వాసం లేదు. ప్రజా ప్రతినిధులపై విశ్వాసంలేదు. ప్రజలకు ఇ

Published: Sat,October 6, 2012 04:16 PM

ఐక్య ఉద్యమమే అంతిమ మార్గం

తెలంగాణ రాష్ట్ర సాధనకు ఐక్య ఉద్యమమే అంతిమ మార్గంగా అందరూ కలిసి ముందుకుపోవాల్సి ఉంది. రాష్ట్ర సాధనోద్యమంలో ముందువరుసలో నిలబడిన తెలం

Published: Sat,October 6, 2012 04:15 PM

సొంత రాష్ట్రం మా జన్మహక్కు

-శ్రీధర్‌రావు దేశ్‌పాండే, పిట్టల రవీందర్ తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు తెలంగాణను అన్ని రంగాలలో దోపిడీకి, అణిచివేతకు, వివక్ష

Published: Sat,October 6, 2012 04:15 PM

సింగరేణి ఉద్యమానికి కొండంత అండ..

-పిట్టల రవీందర్ (‘తెలంగాణ విద్యావంతుల వేదిక’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ‘ఒక ప్రాంతంలో లభ్యమయ్యే వనరులు ఆ ప్రాంత ప్రజల సంక్షేమాన