తెలంగాణ మార్చ్ దిశగా..


Sat,October 6, 2012 04:12 PM

telanganaతెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ హామీని అమలు చేసే విధంగా ఒత్తిడి తేవాలె. ఇందులో కోసం పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేయాలె. తెలంగాణ ఏర్పాటుకు అడ్డుతగుతులుతున్న ప్రాంతేతర శక్తులను కట్టడి చేయాలె. సీమాంధ్ర ఆధిపత్య శక్తులకు బానిసలుగా మారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడుతున్న అంతర్గత శత్రువులను వెలివేయాలె.

తెలంగాణ సాధన దిశగా సాగుతున్న అంతిమ పోరాటంలో వచ్చే నెల 30 వ తేదీన తలపెట్టిన తెలంగాణ మార్చ్ కీలకమైనది. ఈ మార్చ్ నిర్వహణ కోసం మొత్తం తెలంగాణ సమాజం సమాయత్తం కావాలె. ఇందుకోసం కింద సూచించిన విధంగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించవలసిందిగా ఉద్యమ శ్రేణులను కోరుతున్నాం.

‘తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (తెలంగాణ జేఏసీ)లో భాగస్వాములుగా ఉన్న సంస్థలన్ని తమ తమ శక్తులన్నింటినీ కూడగట్టుకుని ఉద్యమ కార్యాచరణకు సిద్ధం కావాలి. ఇందులో భాగంగా భాగస్వామ్య సంస్థలు జిల్లా స్థాయిల్లో సమావేశాలను నిర్వహించుకుని, ఉద్యమ సమాజంలో భవిష్యత్తు కార్యాచరణపట్ల విశ్వాసాన్ని పెంపొందించాలి. ‘మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న తెలంగాణ సాధన ఉద్యమంలో క్రియాశీలక పాత్రను నిర్వహిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కళాకారులు, రచయితలు, కులసంఘాలు, విద్యార్థి, మేధావి వర్గాలతోపాటు ఇతర వర్గాలను కూడా తెలంగాణ మార్చ్‌లో సమీకరించుకునేందుకు ప్రత్యేక ప్రయత్నాలు జరగాలి. ముఖ్యంగా తెలంగాణ రైతాంగం, ముస్లింలు, ఆదివాసీలు, మహిళలను ఉద్యమంలోకి పూర్తిస్థాయి లో సమీకరించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకుని అమలు పరచాలి.

‘తెలంగాణ మార్చ్ ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన కార్యక్షికమాలను రూపొందించడానికి, అవసరమైన ప్రచారాన్ని నిర్వహించడానికి, ప్రజలను సమీకరించడానికి, తెలంగాణలో ని రాజకీయ పార్టీల నాయకులను ఉద్యమంలో భాగస్వాములను చేయడానికి అవసరమైన సమన్వ యం సాధించడానికి కనీసం ముగ్గురు సభ్యులతో కూడిన సబ్‌‘కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. ‘రోజువారీ కార్యక్షికమాలకు సంబంధించిన క్యాలండర్ (ఇప్పటి నుంచి సెప్టెంబర్ 30 వరకు) ను రూపొందించుకుని, దాని అమలుకు సంబంధించిన కార్యాచరణపై సమన్వయం సాధించాలి.

‘జేఏసీ రాష్ట్ర కమిటీ నుంచి జిల్లా కమిటీలకు పరిశీలకులుగా ఉన్న బాధ్యులు జిల్లాకమిటీలతో ప్రతిరోజూ సమన్వయం చేసుకోవాలి. ఆగస్టు నెలాఖరులోగా మండల, గ్రామ స్థాయిల్లో జేఏసీ కమిటీలను ఏర్పాటు చేసుకుని జిల్లా స్థాయి లో మహాసభగానీ, ప్రతినిధుల సభగానీ నిర్వహించుకోవాలి. అదే సందర్భంగా జిల్లా కేంద్రాలలో తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా తెలంగాణ కవాతు నిర్వహించాలి. ఈ కార్యక్షికమాలను సమన్వయం చేసేందుకు జిల్లా కమిటీ నుంచి పూర్తికాలం (కనీసం సెప్టెంబర్ 30 వరకు) పనిచేసే పదిమంది సమన్వయకర్తలను ఎంపిక చేసుకోవాలి. ఇదే పద్ధతిలో ప్రతి మండలానికి కనీసం ఇద్దరు చొప్పున పూర్తికాలపు ఉద్యమ ప్రతినిధులను కూడా సమకూర్చుకోవాలి.

‘హైదరాబాద్ నగరంలో ప్రచారం నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ, కార్యక్షికమాన్ని రూపొందించుకోవాలి. నగరంలోని ప్రతి తెలంగాణ గడపకు కరపత్రం చేరుకునేలా చర్య లు తీసుకోవాలి. ఇందుకోసం న్యూస్‌పేపర్ హాకర్లు, ర్యాగ్‌పిక్కర్స్, కరెంటు మీటర్ రీడింగ్ తీసేవాళ్ల నుంచి సహకారం తీసుకోవాలి. ఇంకా వీలైన ఇతర పద్ధతులను అన్వేషించి అమలు పరచాలి. ‘రాజధాని నగరంలోని ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రైవేటు రంగ ఉద్యోగుల సంఘాలు, మున్సిపల్ ఉద్యోగుల సంఘాలు, ఇతర సంస్థలు, స్వచ్ఛంద, పౌర సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రతిరోజూ సాయంత్రం లేదా ఉదయం సమయాల్లో బస్తీ యాత్రలు నిర్వహించి జన సమీకరణకు ప్రయత్నించాలి. బస్తీ పెద్దల నాయకత్వంలో యువకులు, విద్యార్థులతో బస్తీ కమిటీలను ఏర్పాటు చేయాలి. బస్తీ సమస్యలను కూడా ఉద్యమానికి జోడించాలి. ‘తెలంగాణ మార్చ్‌పై డోర్ స్టిక్కర్, కరపత్రం, వాల్‌పోస్టర్, ఫ్లెక్సీలను డిజైన్‌చేసి విరివిగా పంపిణీ చేయాలి.

ప్రతిఇంటికీ డోర్ స్టిక్కర్ చేరేవిధంగా చూడాలి. తెలంగాణ మార్చ్ ప్రచారంలో భాగంగా కనీసం ఆరు పాటలతో ఒక సిడిని తయా రు చేసి గ్రామస్థాయి జేఏసీలకు చేరేవిధంగా ప్రయత్నం చేయాలి. ‘లోకల్ కేబుల్ నెట్‌వర్క్ ద్వారా తెలంగాణ మార్చ్ ఉద్యమ కార్యక్షికమానికి విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలి. ఇందుకు అనుగుణంగా మిలియన్ మార్చ్, మానుకోట ప్రతిఘటన, రైల్‌లోకో, వంటావార్పు, విద్యార్థి ఉద్యమాలు, కేసీఆర్ అరెస్టు సందర్భంగా ప్రజల నుంచి వెల్లు నిరసన కార్యక్షికమాలు, ఈజిప్టు ఉద్యమ తీరుతెన్నులు, సహాయ నిరాకరణ, సకల జనుల సమ్మెల సందర్భంగా ఉద్యో గ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు నిర్వహించిన వీరోచితమైన పాత్ర, సింగరేణి గని కార్మికుల సమ్మె, తదితర అంశాలతో కూడిన డాక్యుమెంటరీని తయారుచేసి పట్టణ ప్రాంతాలలో విరివిగా ప్రచారం నిర్వహించాలి. సినిమా హాళ్ళలో స్లైడ్స్ ద్వారా ప్రచారం నిర్వహించాలి.

‘జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ సంతకంతో కూడిన విన్నపం పత్రాన్ని ప్రతి ఇంటికీ చేరేలా చూడాలి. తెలంగాణ మార్చ్ ఉద్దేశాలను, తెలంగాణ సాధన ఉద్యమ కర్తవ్యాలను ఈ ఉత్తరంలో వివరంగా రాయాలి. చలో హైదరాబాద్ కార్యక్షికమంలో ఇంటికొక్కరు పాల్గొనే విధంగా పిలుపునివ్వాలి. ‘మండల స్థాయి లో ఉద్యమ ప్రచారం కోసం కళాబృందాలను తయారు చేసుకుని గ్రామాల్లో రోజూ ప్రచారం నిర్వహించాలి.
‘గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో కుల సంఘాలు, వృత్తి కులాలకు సంబంధించిన కమిటీలను ఉద్యమంలో సమీకరించేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలి.

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ప్రతినిధులతో అన్ని స్థాయిల్లో నూ సమన్వయం సాధించాలి. మహిళా పొదుపు సంఘాలు, ఐకెపి ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ కార్మికులను సంఘటితం చేసుకోవాలి. వాడల్లో ఉన్న మహి ళా గ్రూప్‌లను సమీకరించుకోవాలి. మండల స్థాయిలో ఉన్న రైతు కమిటీలను, రైతు సంఘాలను సమన్వయం చేసుకోవాలి. వీరందరినీ జేఏ సీ మండల కమిటీలలో భాగం చేసుకోవాలి. ‘గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో వీలు న్న పద్ధతుల్లో, అందుబాటులో అవకాశాల మేర కు రోజూ ఏదో ఒక రూపంలో నిరసన కార్యక్షికమాలను నిర్వహించుకోవాలి. ప్రతిరోజూ విరా మ సమయంలో పాఠశాల, కళాశాల విద్యార్థులతో వాడల్లో పాదయావూతలను నిర్వహించడం ద్వారా తెలంగాణ మార్చ్ కార్యక్షికమాన్ని ప్రతిఇంటికీ ప్రచారం చేయాలి.

‘తెలంగాణ మార్చ్‌పై అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తించే రీతిలో ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను నిర్వహించాలి. అంతర్జాతీయ పౌరసమాజం నుంచి మద్దతును కూడగ ప్రయత్నించాలి. పౌరసంస్థలు, హక్కుల సంఘాలు, అంతర్జాతీయ మీడి యా సంస్థలను సంప్రదించి, నైతిక మద్దతును కూడగట్టాలి. ‘జాతీయ మీడియాను వాడుకోవాలి. అవసరమైతే తెలుగు మీడి యా ఛానళ్ల ఎడిటర్లతోనూ, పత్రికా సంపాదకులతోనూ ఒక సమావేశాన్ని నిర్వహించి మద్దతును కూడగట్టాలి. మీడియా మేనేజ్‌మెంట్ కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. ‘ఫేస్‌బుక్, ట్విట్టర్‌లాంటి సోషియ ల్ మీడియాను ఆన్‌పూన్ ప్రచారం కోసం వినియోగించుకోవాలి. తెలంగాణ నెటిజన్స్ ఫోరం, టిడిఎఫ్ చర్చలాంటి గ్రూప్‌ల సహకారం తీసుకోవాలి.
‘సెప్టెంబర్ 30నాడు ప్రకటించుకున్న చలో హైదరాబాద్ కార్యక్షికమానికి సంబంధించిన పూర్తి కార్యాచరణ ప్రణాళికపై ఉద్యమ సమాజానికి పూర్తిస్థాయిలో స్పష్టతను ఇవ్వాలి.ఇందుకు అవసరమైన భావవూపచారాన్ని విస్తృతంగా నిర్వహించాలి.

-పిట్టల రవీందర్
తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

35

RAVINDAR PITTALA

Published: Wed,March 26, 2014 12:55 AM

తెలంగాణ జేఏసీ తక్షణ కర్తవ్యం!

తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో సంఘటిత శక్తి ని ప్రదర్శించి, రాజకీయ ఐక్యతను సాధించిన తెలంగాణ జేఏసీ తెలంగాణ పునర్నిర్మాణంలోనూ తన అస్త

Published: Sun,December 15, 2013 12:34 AM

జలధారలపై జలగలదాడి

ఆదిలాబాద్ జిల్లాలోని జలధారలమీద సీమాంధ్ర దోపిడీవర్గాలు జలగల్లాగా విరుచుకుపడేందుకు రంగాన్ని సిద్ధం చేసుకున్నాయి. కుంటాల జలపాతంపైన జల

Published: Thu,September 26, 2013 02:40 AM

‘సకల జనభేరి’ మోగిద్దాం

సమైక్యత పేరుమీద సీమాంవూధలో ముఖ్యమంత్రి పరోక్ష నాయకత్వంలో యాభయి రోజులుగా జరుగుతున్న ‘తమాషా’ ఉద్యమం వెనక స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడ

Published: Mon,July 22, 2013 01:05 AM

తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ బాధ్యత

తెలంగాణ అంశాన్ని తేలుస్తున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలోనూ, కేంద్రంలోనూ నెలరోజులుగా తీవ్రస్థాయిలో హడావుడి చేస్తున్నది. గ్రామ

Published: Fri,May 31, 2013 09:58 PM

ఆంధ్రాపార్టీలు అవసరమా?

ప్రజలు వ్యక్తం చేసే అభివూపాయాలను, ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా పనిచేయాల్సిన బాధ్యత పార్లమెంటు, శాసనసభలకు ఉన్న ది. రాజ్యాంగ ని

Published: Wed,March 27, 2013 10:51 PM

విద్యావంతుల ఉద్యమవేదిక

నడుస్తున్న చరివూతలో మన పాదమువూదలను ఎంత గాఢంగా వేయగలిగామన్న దానిపైనే చరివూతలోమన స్థానం నిర్ధారించబడుతుంది. గత తొమ్మిదేళ్లలో తెలంగ

Published: Sun,March 17, 2013 12:41 AM

ఆకాంక్ష పట్టని అసమర్థ నేతలు

మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక ఆకాంక్షగానే మొదలయ్యింది. సాంస్కృతిక, సాహిత్య రూపాలలో భావవ్యాప్తి జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష

Published: Sat,October 6, 2012 04:13 PM

తెగించి కొట్లాడుదాం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పిల్లలు నిట్టనిలువునా కాలిపోతున్నరు. పిట్టల వలె రాలిపోతున్నరు. ఇప్పటి వరకు దాదాపు 63 మంది యువతీ యువకులు

Published: Sat,October 6, 2012 04:14 PM

ఉత్పత్తి వేటలో జీవన విధ్వంసం

వేగవంతమైన బొగ్గు ఉత్పత్తి, మితిమీరిన లాభాపేక్ష లక్ష్యాలతో సింగరేణి బొగ్గుగనుల సంస్థ ఓపెన్‌కాస్ట్ గనులను నిర్వహిస్తున్నది. దీనివల్ల

Published: Sat,October 6, 2012 04:14 PM

ఎన్టీపీసీ విస్తరణ ఎవరి కోసం?

ఏదైనా సంస్థ విస్తరించడమంటే.. అది అభివృద్ధి దిశలో పయనిస్తున్నట్టుగా భావించాలి. ఆ అభివృద్ధిని చూసి అందరూ గర్వపడతారు. ఆ విస్తరణను ఆహ్

Published: Sat,October 6, 2012 04:15 PM

ఈ మోసం ఇంకెన్నాళ్లు?

సరిగ్గా రెండేళ్ల కితం 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా

Published: Sat,October 6, 2012 04:14 PM

ఈ ప్రభుత్వం మనదెట్లా..?

ప్రజాస్వామిక హక్కులను ప్రతిబింబించవలసిన ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు ప్రజలపై విశ్వాసం లేదు. ప్రజా ప్రతినిధులపై విశ్వాసంలేదు. ప్రజలకు ఇ

Published: Sat,October 6, 2012 04:16 PM

ఐక్య ఉద్యమమే అంతిమ మార్గం

తెలంగాణ రాష్ట్ర సాధనకు ఐక్య ఉద్యమమే అంతిమ మార్గంగా అందరూ కలిసి ముందుకుపోవాల్సి ఉంది. రాష్ట్ర సాధనోద్యమంలో ముందువరుసలో నిలబడిన తెలం

Published: Sat,October 6, 2012 04:15 PM

సొంత రాష్ట్రం మా జన్మహక్కు

-శ్రీధర్‌రావు దేశ్‌పాండే, పిట్టల రవీందర్ తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు తెలంగాణను అన్ని రంగాలలో దోపిడీకి, అణిచివేతకు, వివక్ష

Published: Sat,October 6, 2012 04:15 PM

సింగరేణి ఉద్యమానికి కొండంత అండ..

-పిట్టల రవీందర్ (‘తెలంగాణ విద్యావంతుల వేదిక’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ‘ఒక ప్రాంతంలో లభ్యమయ్యే వనరులు ఆ ప్రాంత ప్రజల సంక్షేమాన