ఐక్య ఉద్యమమే అంతిమ మార్గం


Sat,October 6, 2012 04:16 PM

తెలంగాణ రాష్ట్ర సాధనకు ఐక్య ఉద్యమమే అంతిమ మార్గంగా అందరూ కలిసి ముందుకుపోవాల్సి ఉంది. రాష్ట్ర సాధనోద్యమంలో ముందువరుసలో నిలబడిన తెలంగాణ ఉద్యమ ప్రజానీకంతో కలిసి కదం తొక్కడమే ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఆగస్టు మొదటి వారంలో ప్రారంభమయ్యే కల జనుల సమ్మె ఇందుకు ఒక చక్కని అవకాశం.తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజావూపతినిధులందరూ తమ పదవులకు రాజీనామాలు చేశారు. దీంతో తెలంగాణ డిమాండు పరిష్కార మవుతుందని భావించిన ప్రజల ఆశలు ఫలించలేదు. రాజీనామాల ద్వారా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తుతుందని, ఈ పరిస్థితి అంతిమంగా రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందనుకున్న రాజకీయ నాయకుల ఆశలు కూడా ఫలించలేదు. మొత్తంగా రాజీనామాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందనే విశ్వాసం భ్రమగా మిగిలిపోయింది.

డిసెంబర్ 9 నాటి కేంద్రవూపభుత్వ ప్రకటనను వెనక్కి తీసుకోవడానికి, డిసెంబర్ 23న మరో ప్రకటన చేయడానికి సీమాంధ్ర రాజకీయనాయకత్వం ప్రయోగించిన రాజీనామాల అస్త్రాన్ని తెలంగాణ ఉద్యమ సమా జం గట్టిగా నమ్ముతున్నది. అందుకే రాజీనామాల డిమాండ్ ఏడాదికాలం తర్వాత మరోమారు తెరమీదికి వచ్చింది. తెలంగాణ ప్రజాఉద్యమంలో ఇక్కడి రాజకీయ నాయకత్వం క్రియాశీలమైన పాత్రను నిర్వహించకపోవడం, ఉద్యమానికి దూరంగా ఉంటూ తమ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వడంలాంటి కారణాల ఫలితంగానే రాజీనామాల విషయంలో ఉద్యమ ప్రజల నుంచి తెలంగాణ రాజకీయ నాయకత్వంపై ఒత్తిడి పెరిగింది. కేవలం రాజీనామాలతోనే తమ లక్ష్యం నెరవేరుతుందనే భ్రమలో పడిపోయిన తెలంగాణ ప్రజావూపతినిధులు, రాజీనామాల అనంతరం ఆచరించవలసిన ఉమ్మడి కార్యాచరణ విషయంలో ఎలాంటి వ్యూహాన్ని రూపొందించుకోకపోవడమే ప్రధాన లోపంగా కనిపిస్తున్నది. డిసెంబర్ 9 నాడు తెలంగాణకు అనుకూలంగా కేంద్రమంత్రి చిదంబరం చేసిన ప్రకటనను వమ్ము చేయడానికి సీమాంధ్ర రాజకీయ నాయకత్వం అనుసరించిన ప్రతిఘటన వ్యూహాన్ని ఎదిరించడంలో తెలంగాణ రాజకీయ నాయకత్వం విఫలమైంది . అదే వైఫల్యం తాజా రాజీనామాల వ్యూహంలోనూ పునరావృతమైంది. ఏడాదిన్నర క్రితం ప్రజ ల నుంచి ఎదురైన రాజీనామాల డిమాండును పట్టించుకోని తెలంగాణ రాజకీయ నాయకత్వం ఇవ్వాళ రాజీనామాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రయోగించినట్లుగా ఉద్యమ ప్రజలు భావించే పరిస్థితి నెలకొన్నది. రాజీనామాల అనంతరం తెలంగాణ రాజకీయ నాయకత్వం ఒక ఉమ్మడి కార్యాచరణతో ఉద్యమిస్తుందని ప్రజలు ఆశించారు.

ఏడాదిన్నర కాలంగా అలుపెరుగని రీతిలో తాము సాగిస్తున్న రాష్ట్ర సాధనోద్యమానికి తెలంగాణ రాజకీయవర్గం ముందు నిలుస్తుందని ప్రజలు ఆశించారు. ఐక్య ఉద్యమంతో ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతారని నమ్మారు. కానీ ఐదు దశాబ్దాలుగా సీమాంధ్ర రాజకీయ ఆధిపత్యాన్ని అనుభవిస్తున్న తెలంగాణ రాజకీయ నాయకత్వం, అణువణువునా జీర్ణించుకుపోయిన బానిస భావజాలం నుంచి బయటపడి ఈ అవకాశాలను అందిపుచ్చుకునే సాహసం చేయడంలేదు. అందువల్లనే వర్తమాన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రాంత ప్రజావూపతినిధుల రాజీనామాలు ఒక వ్యూహాత్మకమైన రాజకీయ ఎత్తుగడగానే భావించవలసి వస్తున్నది.రాజీనామాల ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్‌వాళ్లు చేస్తేనే మేమూ చేస్తామని పదేపదే ప్రకటించిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు చివరి నిమిషంలో కాంగ్రెస్ వాళ్లకంటే ముందుగానే తమ రాజీనామాలు సమర్పించారు. వెను తెలంగాణ తెలుగుదేశం ఫోరం ఆధ్వర్యంలో సొంత కార్యాచరణ ప్రకటించుకుని బస్సుయావూతకు బయలుదేరారు. తెలుగుదేశం నాయకులు ఐక్య ఉద్యమం పేరుమీద ‘ఎక్కేగడప, దిగే గడపగా’ హడావుడి చేస్తున్నారు. తెలంగాణ జేఏసీకి ప్రత్యామ్నాయంగా మరో జేఏసీని ఏర్పాటు చేసే ప్రయత్నంలో తెలంగాణ తెలుగుదేశం ఫోరం నాయకులు ప్రజావూఫంట్ నేత గద్దర్, యునైటెడ్ ఫ్రంట్ నాయకులు విమల తదితరులను కలిసిన సందర్భాలలో ఎదురైన ప్రశ్నలకు జవాబు చెప్పలేక ఖంగుతిన్నారు.

రాజీనామాలను కూడా ఒక డ్రామాగా రక్తికట్టిస్తున్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు బస్సుయావూతకు ప్రజల నుంచి స్పందన లభించకపోవడంతో డీలా పడిపోయారు. బస్సుయాత్ర సందర్భంగా చంద్రబాబు ఫోటో పక్కన తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ఫోటోను పెట్టుకోవడంపై వ్యక్తమైన అభ్యంతరాలను టీడీపీ నాయకులు లెక్కచేయలేదు. పైగా చంద్రబాబు అనుమతితోనే తామందరమూ రాజీనామా లు చేశామని, ఆయన సూచన మేరకే బస్సుయాత్ర నిర్వహిస్తున్నామని బహిరంగంగా ప్రకటించుకోవడం వారి బానిస భావజాలాన్ని మరోమారు బహిర్గత పరిచింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌కంటే చెదిరిపోతున్న పార్టీ శ్రేణులను సమీకరించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ బస్సుయాత్ర సాగింది. తెలంగాణ తెలుగుదేశం ఫోరం నాయకులు బస్సుయాత్ర చేస్తున్న సమయంలోనే అదే పార్టీకి చెందిన సీమాంధ్ర నాయకులు చంద్రబాబు బొమ్మతోనే సమైక్యవాదానికి అనుకూలంగా కార్యక్షికమాలను నిర్వహించి చంద్రబాబు ప్రకటించిన రెండు కళ్ల సిద్ధాంతాన్ని రక్తికట్టించారు. ఒక వైపు ప్రత్యేక రాష్ట్ర డిమాండు, మరోవైపు సమైక్యవాద ఉద్యమాలు జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ అధినేత మధ్యంతర ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమైక్యవాద నినాదంతో తెలుగుదేశం పార్టీకి చెందిన సీమాం ధ్ర నాయకులు పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించడం తెలంగాణ పట్ల ఆ పార్టీ అనుసరిస్తున్న ప్రతికూల వైఖరిని స్పష్టం చేస్తున్నది.

ఇక ఒంటరి పోరా టం ఎలా చేయాలో తెలియక తెలంగాణ తెలుగు తమ్ముళ్లు ఇప్పు డు తంటాలు పడుతున్నారు. అరకొర విభేదాలున్పప్పటికీ రాజీనామాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాజకీయ నాయకత్వం ఉమ్మడిగా కదిలేందుకు ప్రయత్నిస్తున్నది. ఇందిరాపార్కు దగ్గర 48 గంటల దీక్షాశిబిరం తర్వాత అధిష్ఠానం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆ పార్టీకి చెందిన తెలంగాణ నాయకత్వం స్వరాన్ని పెంచింది. ఎంపీలు కొంచెం కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ.., మంత్రులు మెతక వైఖరితో ఉన్నారు. పదవులకు రాజీనామాలు చేశామని చెప్పుకుంటూనే.. , అధికారిక కార్యక్షికమాల్లో పాల్గొనడం అనుమానాలకు తావిస్తున్నది. చివరికి వీరి పోరా టం ప్రభుత్వం మీదనా? పార్టీ మీదనా అన్నది స్పష్టత లేకుండా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేశామంటున్న ఎమ్మెల్యేలందరిని కలుపుకొనిపోయి ఉమ్మడి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిపోయి ఒంటరిగా కార్యాచరణను ప్రకటించుకోవడం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీక్షలతో కాలయాపన చేస్తూ.. ఉత్తుత్తి ఉద్యమాలు చేస్తున్నారని మండిపడుతున్నారు.

తెలంగాణ కోసం సొంత కార్యాచరణను ప్రకటించుకొని సీపీఐ తనదైన మార్గంలో ముందుకుపోతున్నది. తెలంగాణ పట్ల నిజాయితీని నిరూపించుకుంటున్నది. వైఎస్ జగన్మోహన్‌డ్డి తన ప్లీనరీలో తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేస్తారని ఆశించిన వారందరూ గాలితీసిన బుడగలా నీరు గారిపోయారు. ‘తెలంగాణ ఇచ్చే శక్తి కానీ, అడ్డుకునే శక్తిగానీ లేద’ని తప్పించుకునే ధోరణితో.. అసలు విషయం తేల్చకుండా జారుకున్నది. నాగం జనార్ధనడ్డి సమై క్యవాద నాయకత్వాన్ని ఎదిరించి తెలంగాణ బ్యానర్‌పై జరిగే సకల సమావేశాలకు సౌహార్ద ప్రతినిధిగా మారిపోయారు. చంద్రబాబును ఎండగట్టడమే ఆయన ఏకైక ఎజెండాగా సాగిపోతున్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా పనిచేస్తున్న విద్యా ర్థి సంఘాలన్నీ ఒక్కతాటిమీదకు వచ్చి ఉమ్మడి కార్యక్షికమాలకు శ్రీకారం చుట్టాయి. నిర్బంధాల మధ్య నిరాహార దీక్షలు చేసి ఉద్యమానికి కొత్త బలాన్నిచ్చి ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ సాధనకోసం ఉమ్మడి కార్యాచరణకు అందరూ, అన్ని శక్తులూ ఏకం కావాలని పిలుపునిస్తున్నారు. తెలంగాణ జేఏసీలో ప్రధా న భాగస్వాములుగా ఉన్న బీజేపీ, న్యూ డెమాక్షికసీ, టీఆర్‌ఎస్ పార్టీలు ఇప్పటికే ఉమ్మడి కార్యాచరణలో కలిసి పనిచేస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, సింగరేణి, విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగులు, అడ్వకేట్లు, డాక్ట ర్లు, కులసంఘాలు, తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం అన్నీ కలిసి పనిచేస్తున్నాయి. వీటికి తోడు.పజావూఫంట్, యునైటెడ్ ఫ్రంట్, జర్నలిస్టుల ఫోరం తెలంగాణ ఉద్యమ కార్యాచరణలో తమవంతు కర్తవ్యం గా పనిచేస్తున్నాయి. ఉద్యమానికి ఊతంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు ఐక్య ఉద్యమమే అంతిమ మార్గంగా అందరూ కలిసి ముందుకు పోవాల్సి ఉంది. రాష్ట్ర సాధనోద్యమంలో ముందువరుసలో నిలబడిన తెలంగాణ ఉద్యమ ప్రజానీకంతో కలిసి కదం తొక్కడమే ప్రతిఒక్కరి కర్తవ్యం. ఆగస్టు మొదటి వారంలో ప్రారంభమయ్యే సకల జనుల సమ్మె ఇందుకు ఒక చక్కని అవకాశం.

-పిట్టల రవీందర్
తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


42

RAVINDAR PITTALA

Published: Wed,March 26, 2014 12:55 AM

తెలంగాణ జేఏసీ తక్షణ కర్తవ్యం!

తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో సంఘటిత శక్తి ని ప్రదర్శించి, రాజకీయ ఐక్యతను సాధించిన తెలంగాణ జేఏసీ తెలంగాణ పునర్నిర్మాణంలోనూ తన అస్త

Published: Sun,December 15, 2013 12:34 AM

జలధారలపై జలగలదాడి

ఆదిలాబాద్ జిల్లాలోని జలధారలమీద సీమాంధ్ర దోపిడీవర్గాలు జలగల్లాగా విరుచుకుపడేందుకు రంగాన్ని సిద్ధం చేసుకున్నాయి. కుంటాల జలపాతంపైన జల

Published: Thu,September 26, 2013 02:40 AM

‘సకల జనభేరి’ మోగిద్దాం

సమైక్యత పేరుమీద సీమాంవూధలో ముఖ్యమంత్రి పరోక్ష నాయకత్వంలో యాభయి రోజులుగా జరుగుతున్న ‘తమాషా’ ఉద్యమం వెనక స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడ

Published: Mon,July 22, 2013 01:05 AM

తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ బాధ్యత

తెలంగాణ అంశాన్ని తేలుస్తున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలోనూ, కేంద్రంలోనూ నెలరోజులుగా తీవ్రస్థాయిలో హడావుడి చేస్తున్నది. గ్రామ

Published: Fri,May 31, 2013 09:58 PM

ఆంధ్రాపార్టీలు అవసరమా?

ప్రజలు వ్యక్తం చేసే అభివూపాయాలను, ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా పనిచేయాల్సిన బాధ్యత పార్లమెంటు, శాసనసభలకు ఉన్న ది. రాజ్యాంగ ని

Published: Wed,March 27, 2013 10:51 PM

విద్యావంతుల ఉద్యమవేదిక

నడుస్తున్న చరివూతలో మన పాదమువూదలను ఎంత గాఢంగా వేయగలిగామన్న దానిపైనే చరివూతలోమన స్థానం నిర్ధారించబడుతుంది. గత తొమ్మిదేళ్లలో తెలంగ

Published: Sun,March 17, 2013 12:41 AM

ఆకాంక్ష పట్టని అసమర్థ నేతలు

మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక ఆకాంక్షగానే మొదలయ్యింది. సాంస్కృతిక, సాహిత్య రూపాలలో భావవ్యాప్తి జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష

Published: Sat,October 6, 2012 04:12 PM

తెలంగాణ మార్చ్ దిశగా..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ హామీని అమలు చేసే వి

Published: Sat,October 6, 2012 04:13 PM

తెగించి కొట్లాడుదాం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పిల్లలు నిట్టనిలువునా కాలిపోతున్నరు. పిట్టల వలె రాలిపోతున్నరు. ఇప్పటి వరకు దాదాపు 63 మంది యువతీ యువకులు

Published: Sat,October 6, 2012 04:14 PM

ఉత్పత్తి వేటలో జీవన విధ్వంసం

వేగవంతమైన బొగ్గు ఉత్పత్తి, మితిమీరిన లాభాపేక్ష లక్ష్యాలతో సింగరేణి బొగ్గుగనుల సంస్థ ఓపెన్‌కాస్ట్ గనులను నిర్వహిస్తున్నది. దీనివల్ల

Published: Sat,October 6, 2012 04:14 PM

ఎన్టీపీసీ విస్తరణ ఎవరి కోసం?

ఏదైనా సంస్థ విస్తరించడమంటే.. అది అభివృద్ధి దిశలో పయనిస్తున్నట్టుగా భావించాలి. ఆ అభివృద్ధిని చూసి అందరూ గర్వపడతారు. ఆ విస్తరణను ఆహ్

Published: Sat,October 6, 2012 04:15 PM

ఈ మోసం ఇంకెన్నాళ్లు?

సరిగ్గా రెండేళ్ల కితం 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా

Published: Sat,October 6, 2012 04:14 PM

ఈ ప్రభుత్వం మనదెట్లా..?

ప్రజాస్వామిక హక్కులను ప్రతిబింబించవలసిన ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు ప్రజలపై విశ్వాసం లేదు. ప్రజా ప్రతినిధులపై విశ్వాసంలేదు. ప్రజలకు ఇ

Published: Sat,October 6, 2012 04:15 PM

సొంత రాష్ట్రం మా జన్మహక్కు

-శ్రీధర్‌రావు దేశ్‌పాండే, పిట్టల రవీందర్ తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు తెలంగాణను అన్ని రంగాలలో దోపిడీకి, అణిచివేతకు, వివక్ష

Published: Sat,October 6, 2012 04:15 PM

సింగరేణి ఉద్యమానికి కొండంత అండ..

-పిట్టల రవీందర్ (‘తెలంగాణ విద్యావంతుల వేదిక’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ‘ఒక ప్రాంతంలో లభ్యమయ్యే వనరులు ఆ ప్రాంత ప్రజల సంక్షేమాన

Featured Articles