రాజకీయ అస్తిత్వంవైపు..


Sat,October 6, 2012 04:18 PM

ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఓటరు మహాశయుడే తన నిర్ణయాన్ని ప్రకటించాలి. ఎన్నికల ఫలితాలు రాకముందే వాటి రాజకీయ ప్రభావం గురించి మాట్లాడటం సాహసమే అవుతుండవచ్చు. కానీ నిన్నటి ఎన్నికలను వాటిని దోహదపరిచిన పరిణామాలను విశ్లేషిస్తే తెలంగాణవాదుల ఒక కొత్త పంథా వైపు దృష్టిసారిస్తున్నారని సులువుగా తెలుసుకోవచ్చు. ఈ కొత్త పంథా లక్ష్యమే తెలంగాణకు రాజకీయ అస్తిత్వం సాధించుకోవడం. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కొల్లాపూర్ నుంచి స్టేషన్ ఘన్‌పూర్ వరకు చేసిన ప్రసంగాలతో ఈ పంథాకు గణనీయమైన ప్రాధాన్యం ఇచ్చారు. అన్నింటికంటే ముఖ్యమైన విషయేమిటంటే ఈ పంథాను ప్రజలు సమ్మతించారు కరచాల ధ్వనుల ద్వారా స్వాగతించారు. ఈ పరిణామాన్ని విశ్లేషించాలనుకున్నప్పుడు మూడు కీలక అంశాలను పరిశీలించాలి.

కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షానంత రం 9 డిసెంబర్ నాడు చిదంబరం ప్రకటన తర్వాత సీమాంధ్ర శాసనసభ్యులు మూకుమ్మడి రాజీనా మా చేసి తెలంగాణకు అడ్డుపుల్ల వేసిన విషయం మనకు తెలిసిందే! అప్పటి నుంచి టీఆర్‌ఎస్ పార్టీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రజావూపతినిధుల ఐక్యత కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. రాజకీయ జేఏసీ ఆవిర్భావంలో టీఆర్‌ఎస్ పార్టీ పాత్ర కీలకమయినదన్న విష యం జగమెరిగిన సత్యం. జేఏసీలో భాగంగా టీఆర్‌ఎస్ పార్టీ సీమాంవూధుల రాజీనామాల పర్వం నుంచి మొదలుకొని మలిదశలో జరిగిన సకల జనుల సమ్మె వరకు తెలంగాణ ప్రజావూపతినిధుల ఐక్యత ద్వారా రాష్ట్రసాధన సాధించాలని తీవ్ర ప్రయత్నం చేసింది. కానీ తొలి దశలో లాగా నే మలిదశలో కూడా తెలంగాణలోని కాంగ్రెస్, టీడీపీ ప్రజావూపతినిధులు సీమాంవూధుల కుట్రలకు బలైపోయారు. ఈ సందర్భంలో ఒక విచివూతమైన రాజకీయ సన్నివేశం తెలంగాణలో నెలకొన్నది. ప్రజలంతా తెలంగాణ సాధన వైపు కృతనిశ్చయంతో ఉంటే, దురదృష్టవశాత్తు తెలంగాణలోని మెజారిటీ శాసనసభ్యులు సీమాంవూధుల రాజకీయ పావులుగా మిగిలిపోయారు. ఈ రాజకీయ పరిణామాల నుంచే తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వం అవసరమనే పంథాకు పునాదులు పడినవి. మరి ఈ పంథాను విజయవంతం చేసే మార్గాలున్నాయా?

ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు వారు బలపర్చిన వారు గెలవటం ఖాయం. ఎవంత మెజారిటీతో గెలుస్తారన్న విషయం ఆసక్తికరమైనప్పటికీ మరో అత్యంత ఆసక్తిగల రాజకీయ పరిణామం ఒకటున్నది. ఈ ఎన్నికలలో ఇద్దరు కాంగ్రెస్, ముగ్గురు టీడీపీ నేతలు తమ పార్టీలకు సహ రాజీనామా చేసి (నాగం జనార్దన్‌డ్డి మినహా) టీఆర్‌ఎస్‌లో చేరి తెలంగాణ వాదుల దీవెనల కోసం పోటీకి సిద్ధమయ్యారు. సకల జనుల సమ్మెలో ఉధృతంగా పాల్గొ న్న ఈ నేతలు తెలంగాణ ప్రజలకు, జేఏసీకి, టీఆర్‌ఎస్‌కు చేరువయ్యారు. అత్యంత ఆసక్తికర విషయమేమిటంటే టీఆర్‌ఎస్ పార్టీ వారిని తమ పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా పొలిట్‌బ్యూరోలు నుంచి మొదలుకొని జిల్లా నాయకత్వాల నుంచి ఆయా నియోజకవర్గాల పార్టీ శ్రేణుల వరకు ఈ అభ్యర్థుల వెన్నంటి ఉండి గెలిపించడానికి అహర్నిశల కృషిచేశారు. అదేవిధంగా జేఏసీ లు కూడా తమ సంపూర్ణ మద్దతును పలికి వారి శక్తివంచన లేకుండా తెలంగాణ పోరాటాన్ని మరోసారి ఎన్నికల బరిలో పెట్టినవి.ఇక్కడ గమనించవలసిన ఆసక్తికర విషయమేమిటంటే ఈ రోజు ఆంధ్రవూపదేశ్‌లో సీట్లను, పదవులను, హోదాలను కొంతమంది వ్యక్తులు తమ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర పార్టీలతోనో ఢిల్లీ దర్బార్‌తోనో బేరసారాలు చేసి సాధించుకొని తమ రాజకీయ మజిలీలు చేరామని తృప్తిపడుతున్నారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల వారి వెంట ఉన్న రాజకీయ శక్తులు ఇక నిర్దిష్టమైన లక్ష్యం కోసం స్వప్రయోజనాలకతీతంగా చిరకాల ప్రజాపోరాటాల సారాంశమయిన తెలంగాణ రాష్ట్ర సాధన దాని పునర్నిర్మాణం ఆశయాలను నెరవేర్చడం కోసం కృషి చేయడం అత్యంత ప్రాముఖ్యం గల పరిణామం. ఈ పరిణామం తెలంగాణకు రాజకీయ అస్తిత్వం చేకూర్చడానికే కాకుండా దిగజారిపోతున్న రాజకీయ విలువలను పునరుద్ధరించడానికి దోహదపడుతుంది అనడానికి సందేహం లేదు.

ఈ నూతన పరిణామమే తెలంగాణవాదుల ముందు ముఖ్యంగా తెలంగాణలో అత్యంత కీలకమైన రాజకీయ శక్తిగా ఎదిగి న టీఆర్‌ఎస్ పార్టీ ముందున్న నేటి సవా ళ్ళు. ఒకవైపు పోరాట దశల్లోంచి ఎదిగిన బలమైన యువ నూతన రాజకీయ నాయకత్వాన్ని ప్రోత్సహించి తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాన్ని ఉధృ తం చేసి తద్వారా తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని సాధించడం మరోవైపు ప్రజాస్వామ్యాన్ని ప్రజల భాగస్వామ్యాన్ని మైలురాయిగా తీసుకొని నూతన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక పునర్నిర్నాణానికి దోహదపడే అంశాలన్నింటి పైన పొలిట్‌బ్యూరో నుంచి గ్రామశాఖ వరకు విస్తృతమైన చర్చ నిర్దిష్టమైన అవగాహన ఆధారంగా ప్రత్యామ్నాయ రాజకీయ ప్రణాళికను రూపొందించడం. ఒక దశలో ఇది సాధ్యమా అని అనిపించవచ్చు. కానీ పదకొండు సంవత్సరాల అనుభవం గల టీఆర్‌ఎస్ పార్టీ నేడు తెలంగాణ రాజకీయ అస్తిత్వ ప్రాధాన్యాన్ని నాలుగున్నర కోట్ల మందికి నచ్చచెప్పి అందరినీ కూడగట్టగలిగిందంటే ఈ సవాల్‌ను స్వీకరించే నైతిక బాధ్యత దీన్ని విజయవంతం చేసే సాంఘిక చిత్తశుద్ధి ఒక్క టీఆర్‌ఎస్‌కే ఉన్నది.

-డాక్టర్ చెన్నమనేని రమేష్
శాసనసభ్యులు, వేములవాడ

35

RAMESH CHENNAMANENI

Published: Mon,July 30, 2018 11:24 PM

విధ్వంసరహిత వృద్ధి అసాధ్యమా?

ప్రపంచంలో పర్యావరణాన్ని విధ్వంసం చేయకుండా ప్రజలకు ఆహారాన్ని చాలినంత అందించలేమా? ఇది ఈ మధ్య జర్మనీలోనిబెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఆహా

Published: Mon,January 29, 2018 11:04 PM

వందశాతం ఎఫ్‌డీఐలతో అల్లకల్లోలమే

ప్రస్తుత వంద శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి విధానం కారణంగా పట్టణ, గ్రామీణ చిన్నతరహా వ్యాపార రంగమే తీవ్రంగా ప్రభావితం కాబోతున్నది. ఈ క్రమలో

Published: Tue,May 2, 2017 08:39 AM

రాష్ట్ర వ్యవసాయానికి పునరుజ్జీవం

చిన్న, సన్నకారు రైతులతో కూడి ఉన్న తెలంగాణ వ్యవసాయరంగం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో పూర్తిగా స్వరూప స్వభావాలను మార్చుకోనున్నది.

Published: Thu,May 5, 2016 01:29 AM

ప్రమాదకర స్థితిలో పర్యావరణం

వేడి గాడుపులను నివారించేందుకు విస్తృతంగా చెట్లను నాటడమే కాదు కాలుష్యాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి. చల్లదనాన్నిచ్చే నిర్మాణాలకు

Published: Thu,March 31, 2016 01:24 AM

సహకార సంఘాలే దిక్కు

ఎక్కడైతే.. విజయవంతంగా ప్రజల కో ఆపరేటివ్స్ పనిచేశాయో అక్కడ మాత్రమే ఆర్థిక సంక్షోభ ప్రతిఫలనాలు పడలేదు. ప్రజలు ఇబ్బందుల పాలు కాలేదు.

Published: Fri,January 10, 2014 02:06 AM

జనతన సర్కార్ వెలుగులో కాళోజీ..

తెలుగు సాహిత్యంలోనేగాక, సామాజిక జీవితంలో కూడా నూరేళ్ల అరుదైన వ్యక్తిత్వం కాళోజీ. అధీకృత హింసకు వ్యతిరేకం గా నిలిచిన కలం ఆయనది. ‘ప్

Published: Sun,April 28, 2013 11:43 PM

చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ నేతలు

ఎంపీ వివేక్ ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల భేటీ. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. ఇది బ్రేకింగ్ న్యూస్. ఈ న్యూస్‌ను మూడ

Published: Sat,October 6, 2012 04:18 PM

లక్ష్మణరేఖ గీయవలసిందే!

‘నిన్న జరిగిన కాంగ్రెస్ ప్రజావూపతినిధుల సమావేశంపై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూశారు. కానీ వారి ఆశలు నిరాశలయ్యా యి. కాంగ్రెస్

Published: Sat,October 6, 2012 04:19 PM

చరిత్ర మరిచిన ప్రణబ్ ముఖర్జీ

రాష్ట్ర ఏర్పాటు గురించి తెలంగాణ ప్రజలంతా సకల జనుల సమ్మెతో సత్యాక్షిగహ పోరాటం చేస్తుంటే.పణబ్ ముఖర్జీ చరివూతను మరి చి , బాధ్యతారాహిత

Published: Sat,October 6, 2012 04:19 PM

నవ తెలంగాణ సాధన కోసం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమం దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలలో ఒక ఆణిముత్యంగా నిలుస్తది. ఒక్క