విధ్వంసరహిత వృద్ధి అసాధ్యమా?


Mon,July 30, 2018 11:24 PM

ప్రపంచంలో పర్యావరణాన్ని విధ్వంసం చేయకుండా ప్రజలకు ఆహారాన్ని చాలినంత అందించలేమా? ఇది ఈ మధ్య జర్మనీలోనిబెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఆహార సదస్సులో ప్రధాన సమస్యగా చర్చనీయాంశమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల నుంచి ఐదు వందల మంది ఆ సదస్సులో పాల్గొన్నారు. అందులో ఈ వ్యాస రచయత కూడా ఒక ఆహ్వానితునిగా పాల్గొనటం జరిగింది. ఈ ప్రపంచ సదస్సులో వివిధ దేశాల నుంచి రాజకీయవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, దౌత్యాధికారులు, ఎన్‌జీవోలు, విద్యావేత్తలు పాల్గొన్నారు.

జర్మనీలో జరిగిన ఈ ప్రపంచసదస్సు ఫలితంగా ప్రపంచంలో విధ్వంసం లేకుండానే ఆహారాన్ని అందివ్వటం ఎలాగో చర్చ ముందుకు వచ్చింది. అలాగే అభివృద్ధి చెందిన యూరప్ దేశాల్లో వ్యవసాయ విధానంలో తక్షణం మార్పురావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. మార్కెట్ ఆధారిత వ్యవసాయ పద్ధతులు కాకుండా సంప్రదాయ వ్యవసాయ విధానాలకు పెద్దపీట వేసి ఆహారభద్రతకు జీవం పోయాల్సిన అవసరాన్ని గుర్తింపజేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తి, పంపకంపై వీరంతా విస్తృతంగా చర్చించారు. వారి అంచనా ప్రకారం 2050 కల్లా ప్రపంచవ్యాప్తంగా తొంభై కోట్ల మంది సరైన ఆహారం అం దని పరిస్థితిలో ఉంటారు. ఇలాంటి వారందరికీ సరైన, పౌష్ఠికాహారం అందించటం సులభతరమైన పనేమీ కాదన్నది అందరి అభిప్రాయం. కానీ ఆచరణీయంగా 21వ శతాబ్దంలో ఎదుర్కోబోయే ఆహార సమస్యలను ఎలా ఎదుర్కోవాలన్నదే నేడు అందరిముందున్న సమస్య. ఈ క్రమంలో రానున్నకాలంలో ఆహారపుటలవాట్లలో మౌలికమైన మార్పు లు రావాలి. మనం ఏం, ఎలా తింటున్నామన్న దానిపై ఆధారపడి ఆహా ర పదార్థాల ఉత్పత్తిని పెంపొందించాల్సిన అవసరమున్నది. అలాగే ఆహారం వినియోగదారులుగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రజల ఆహారపుటలవాట్లు కూడా మారాలి. అలాగే పర్యావరణానికి హాని తలపెట్టకుండానే, విధ్వంసం చేయకుండానే ఆహారభద్రతను సాధించాల్సిన అవసరమున్నది. అలాగే ఆహార ఉత్పత్తిని పెంచుతూ పంపకం విషయం లో కూడా తగు జాగ్రత్తలతో ఆకలిని, పేదరికాన్ని దూరం చేయాలి.

ఈ ప్రపంచ సదస్సులో ప్రధాన వక్తలుగా పాల్గొన్న ఆరుగురు వక్తలు ఆరు ప్రధాన సమస్యల గురించి సదస్సులో చర్చించారు. 1.మొదట ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆహారం అందుబాటులో ఉన్నదా? వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం ముఖ్య ఆర్థిక సలహాదారు డాక్టర్ ఆరీఫ్ హుస్సేన్ ప్రకా రం.. రాబోయేకాలంలో రాత్రివేళ తిండిలేక ఆకలితో నిద్రకు ఉపక్రమిం చే వారి సంఖ్య తగ్గిపోతుంది. ఇలా ఒక పూట భోజనంతో సరిపుచ్చుకు నే వారి సంఖ్య 2016లో 777 మిలియన్లు ఉంటే, అది 2018 నాటికి 850 మిలియన్లకు చేరుకున్నది. ఈ విధమైన ఆహార కొరత, ఆకలి సమస్యకు ప్రపంచవ్యాప్తంగా అశాంతి, యుద్ధాలు, గ్లోబల్ వార్మింగ్ కారణమని వివరించారు. ఆయన అధ్యయనం, అంచనా ప్రకారం ప్రస్తుతం 124 మిలియన్ల ప్రజలు తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్నారు. ఇందు లో 74 మిలియన్ల మంది అంతర్గత యుద్ధాలు, అశాంతి కారణంగా నూ, మరో 38 మిలియన్ల మంది వాతావరణంలో వచ్చిన వినాశకర మార్పుల కారణంగానూ ఆహారానికి దూరమయ్యారు.

ఈ పరిస్థితుల్లో పాలకులు ప్రజల ఆహారభద్రతను కాపాడటానికి తమ భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలి. అలాగే వారి అభివృద్ధి విధానాలను, ప్రాధాన్యాలను గుర్తించి అమలుచేయాలి. 2.వ్యవసాయరంగ సమగ్రత అనేది ఆహార భద్రతకు ఉపకరిస్తుందా? అన్నదానిపై జర్మనీ వ్యవసాయ మంత్రి జులియా క్లాక్‌నర్ వ్యవసాయరంగాన్ని స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నదన్నారు. దీనిద్వారానే ఆహార భద్రతను సాధించవచ్చనీ, ఉత్పత్తినీ పెంచవచ్చన్నారు. ఈ క్రమంలోనే మాట్లాడు తూ.. చాలా దేశాల్లో సగటు వ్యవసాయోత్పత్తి చాలా తక్కువగా ఉన్నదన్నారు. ఉదాహరణకు ఇతియోపియాలో ఎకరానికి 2700 కి.గ్రా.ల పం ట ఉత్పత్తవుతుంటే, అదే జర్మనీలో 9000 కి.గ్రా. ఎకరానికి ఉత్పత్తవుతున్నది. ఇదిలా ఉంటే ఇతియోపియాలో 40 శాతం భూమి వ్యవసాయ యోగ్యంగా ఉంటే, అందులో 15 శాతం భూమిలో మాత్రమే వ్యవసా యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆహార విధానాలపై, అధిక దిగుబడు లు ఇచ్చే పంటలపై అంతటా తీక్షణంగా చర్చలు జరుగాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ దిగుబడినిచ్చే పంటలు, విత్తనాల వినియోగం గురించి కూడా జర్మనీలో తగు జాగ్రత్త తీసుకుంటున్నారు. జర్మనీ పార్లమెంట్‌లో గ్రీన్ పార్టీ సభ్యులు కూడా అధిక దిగుబడి వంగడా లు, పంటల గురించి చెప్పారు.

అయితే విత్తనాలుగా పరిశోధనశాలల బయటినుంచి వ్యవసాయదారులు వినియోగించటంవల్ల ఆశించిన స్థాయిలో దిగుబడులుంటాయా అన్నది ఆలోచించాలి. సంప్రదాయ రైతులు మాత్రం తమ పొలాల నుంచి ఉత్పత్తయిన విత్తనాలనే వాడు తూ పంటలు పండించటానికి ఆసక్తి చూపుతున్నారు. 3.జీవావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ప్రకృతి విధ్వంసం లేకుండా వ్యవసాయం చేస్తే 50-70 శాతం మాత్రమే పంట దిగుబడులుంటాయి. ఈ అభిప్రాయాన్ని బేయర్ కార్పొరేషన్ మేనేజర్ వోల్కర్ వెలిబుచ్చారు. ఈ మధ్య నే బేయర్ కంపెనీ మాన్‌శాంటో కంపెనీతో విలీనమై ప్రపంచంలోనే అతిపెద్ద విత్తన ఉత్పత్తి కంపెనీగా అవతారమెత్తింది. ఈ కంపెనీ చెబుతున్నదాని ప్రకారం.. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు, విధానాలు ప్రజల ఆహార అవసరాన్ని మాత్రమే తీర్చగలవు. మరోవైపు పంట దిగుబడుల్లో స్తబ్ధత ఏర్పడి ఉత్పత్తిలో గుణాత్మక దిగుబడి అభివృద్ధి ఉండదు. అధిక దిగుబడుల కోసం భారతదేశంలోని పంజాబ్‌లో చేస్తున్నవిధంగా ఎరువులు, పురుగు మందులు ఎక్కువగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వ్యవసాయంలో దిగుబడులు ఎక్కవగా లేక, మద్దతు ధరలు రాక నష్టాలతో రైతులు అధిక సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

4.గెర్డ్ ముల్లర్ ప్రకారం.. ప్రతి ఒక్కరికీ సరిపోయినంత ఆహారం పొందేందుకు హక్కున్నది. జర్మనీ అభివృద్ధి, కో ఆపరేషన్ మంత్రి అం టున్న దానిప్రకారం, ఈ భూగోళం దానిపైన ఉన్న ప్రతి ఒక్కరికీ ఆహారాన్ని అందించే శక్తి కలిగినది. కాకుంటే దీనికి మానవ జాతి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఈ క్రమంలోనే యూరప్ దేశాలన్నీ మార్కెట్లపై ఉన్న నియంత్రణను ఎత్తివేయటం కారణంగా అభివృద్ధి చెందుతు న్న దేశాల్లోని రైతులకు తీవ్ర కష్ట, నష్టాలు ఎదురవుతున్నాయి. రైతులకు ఉత్పత్తికి తగ్గ ఫలితాలు దక్కాలి. మరోవైపు మార్కెట్లలో రైతులకు నష్టా లు ఎదురుకాకూడదు. పశ్చిమాఫ్రికాలో పండిస్తున్న కాఫీ ప్రజలకు చేర దు. జర్మనీల ఉత్పత్తవుతున్న ఆహారపదార్థాలు ప్రజలకు సరైన విధంగా పంపకం జరుగవు. మరోవైపు, మూడింట్లో ఒక వంతు ఆహార పదార్థా లు వ్యర్థంగా చెత్తకుప్పలకు చేరుతున్నది. అందుకోసం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అంతర్గత వలసలను నిరుత్సాహపర్చాలి. ఈ విధమైన అంతర్గత వలస సమస్య అనేది గత దశాబ్దకాలంగా తీవ్రమై ఇవ్వాళ ప్రపంచవ్యాప్త సమస్యగా ముందుకువచ్చింది. అయితే ఈ వలసల కారణంగానే ఆహార సమస్య ఉత్పన్నమవుతున్నదని చెప్పలేం. కానీ ఆహార సంక్షోభానికి ఇదొక ప్రధాన సమస్యగా ఉందన్నది సత్యం. 5.వ్యవసాయాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించటం అత్యవసరం.

దీనికి వ్యవసాయరంగాన్ని డిజిటలైజేషన్ చేయాలి. దీనిద్వారా వ్యవసాయంరంగం ఎదుర్కొంటున్న సమస్యలను, పెరుగుతున్న జనా భా అవసరాలను తీర్చవచ్చు. వ్యవసాయ అవసరాలు, అభివృద్ధి కోసం ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. ఈ క్రమంలోనే వ్యవసా యరంగంలో ట్రాక్టర్లు, డ్రోన్ల వినియోగం పెంచాలి. అలాగే సెల్‌ఫోన్లు, వాట్సప్‌లతో సమాచారం రైతుల మధ్య పంపకం జరుగాలి. 6.కంపెనీల ఏర్పాటు, ప్రారంభం పెరుగాలి. ముఖ్యంగా పరిశోధనలు పెరుగాలి. వ్యవసాయ సంబంధ పరిశోధనలు, ఆవిష్కరణలు పెరిగి ఆధునిక వ్యవసాయ అవసరాలను తీర్చాలి. అంతిమంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగేందుకు దోహదం చేయాలి. అప్పుడు మాత్రమే గ్రామీణ ప్రజానీకం తమ పరిసరాలపై ఆధారపడి జీవించే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోంచే ప్రజలు సహజ వాతావరణంలో పెరిగి, ఉత్పత్తయిన ఆహారపదార్థాలు పొందగలుగుతారు. ఈ విధమైన విధానాలతో జర్మనీలో 15 నగరాలకు సహజసిద్ధ ఆహర ఉత్పత్తులను విజయవంతంగా సరఫరా చేస్తున్నారు. ఇదే విధానాన్ని అంతటా అనుసరించి అమలు చేయాలి.

ఈ నేపథ్యంలోనే గుడ్‌ఫర్ గ్రోత్ కంపెనీ తరఫున నటాచా న్యూమన్ పిల్లల్లో మంచి ఆహారపు అలవాట్ల కోసం కృషిచేస్తున్నారు. నటాచా, న్యూమన్ 2010 నుంచి భవిష్యత్ తరాలకు మంచి ఆహారపు అలవాట్ల కోసం పనిచేస్తున్నారు. వీరు కార్పొరేట్ కంపెనీల తరహాలో కాకుండా సుస్థిర ఆహార పద్ధతులపై విశేష కృషిచేస్తున్నారు. వీరు అనతికాలంలోనే జర్మనీలోని పిల్లల్లో ప్రత్యామ్నాయ ఆహారవిధానాన్ని అనుసరించటంలో తమ పాత్ర నిర్వహించారు. పండ్లు, కూరగాయలతో మంచి ఆహార అలవాట్లను ప్రోత్సహిస్తున్నారు. మరో కంపెనీ హెల్డెన్ అనేది స్కూల్ పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రోత్సహిస్తున్నారు. చక్కెర ఎక్కువగా ఉండే జంక్‌ఫుడ్ కాకుండా బలవర్ధక ఆహారాన్ని తీసుకునేవిధంగా పిల్లల్లో మార్పు తెస్తున్నారు. వీరి కృషి ఫలితంగా వందశాతం సేంద్రియ పదార్థాలతో కూడిన పిల్లల ఆహారాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇదే ఇవ్వాళ జర్మనీలో పెద్ద మార్పునకు కారణమవుతున్నది.
ramesh
జర్మనీలో జరిగిన ఈ ప్రపంచసదస్సు ఫలితంగా ప్రపంచంలో విధ్వం సం లేకుండానే ఆహారాన్ని అందివ్వటం ఎలాగో చర్చ ముందుకు వచ్చింది. అలాగే అభివృద్ధి చెందిన యూరప్ దేశాల్లో వ్యవసాయ విధానంలో తక్షణం మార్పురావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. మార్కెట్ ఆధారిత వ్యవసాయ పద్ధతులు కాకుండా సంప్రదాయ వ్యవసాయ విధానాలకు పెద్దపీట వేసి ఆహారభద్రతకు జీవం పోయాల్సిన అవసరా న్ని గుర్తింపజేసింది. అబివృద్ధి చెందిన దేశాల సమస్యలు అనేకం. ఉత్పత్తిని, దిగుబడిని పెంచేందుకు కృషిచేస్తూనే, పర్యావరణాన్ని విధ్వంసం చేయకుండా ఆహారోత్పత్తిని పెంచేందుకు కృషిచేయాలి. అలాగే మంచి బలవర్ధక ఆహార పదార్థాల ఉత్పత్తిని పెంచుతూ, అందరికీ అందుబాటులో ఉండేవిధంగా చూడాలి. ఈ విధమైన వ్యవసాయక విధానాలతో వ్యవసాయంలో గుణాత్మక మార్పులు తీసుకురావాలి. ఈ విధమైన పర్యావరణ అనుకూల, ప్రజానుకూల సుస్థిర వ్యవసాయ విధానాలే నేటి సమస్యలకు పరిష్కారం.
(వ్యాసకర్త: ఎమ్మెల్యే, వ్యవసాయ, పర్యావరణ, కో ఆపరేటివ్ రంగ నిపుణులు)

501

RAMESH CHENNAMANENI

Published: Mon,January 29, 2018 11:04 PM

వందశాతం ఎఫ్‌డీఐలతో అల్లకల్లోలమే

ప్రస్తుత వంద శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి విధానం కారణంగా పట్టణ, గ్రామీణ చిన్నతరహా వ్యాపార రంగమే తీవ్రంగా ప్రభావితం కాబోతున్నది. ఈ క్రమలో

Published: Tue,May 2, 2017 08:39 AM

రాష్ట్ర వ్యవసాయానికి పునరుజ్జీవం

చిన్న, సన్నకారు రైతులతో కూడి ఉన్న తెలంగాణ వ్యవసాయరంగం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో పూర్తిగా స్వరూప స్వభావాలను మార్చుకోనున్నది.

Published: Thu,May 5, 2016 01:29 AM

ప్రమాదకర స్థితిలో పర్యావరణం

వేడి గాడుపులను నివారించేందుకు విస్తృతంగా చెట్లను నాటడమే కాదు కాలుష్యాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి. చల్లదనాన్నిచ్చే నిర్మాణాలకు

Published: Thu,March 31, 2016 01:24 AM

సహకార సంఘాలే దిక్కు

ఎక్కడైతే.. విజయవంతంగా ప్రజల కో ఆపరేటివ్స్ పనిచేశాయో అక్కడ మాత్రమే ఆర్థిక సంక్షోభ ప్రతిఫలనాలు పడలేదు. ప్రజలు ఇబ్బందుల పాలు కాలేదు.

Published: Fri,January 10, 2014 02:06 AM

జనతన సర్కార్ వెలుగులో కాళోజీ..

తెలుగు సాహిత్యంలోనేగాక, సామాజిక జీవితంలో కూడా నూరేళ్ల అరుదైన వ్యక్తిత్వం కాళోజీ. అధీకృత హింసకు వ్యతిరేకం గా నిలిచిన కలం ఆయనది. ‘ప్

Published: Sun,April 28, 2013 11:43 PM

చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ నేతలు

ఎంపీ వివేక్ ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల భేటీ. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. ఇది బ్రేకింగ్ న్యూస్. ఈ న్యూస్‌ను మూడ

Published: Sat,October 6, 2012 04:18 PM

లక్ష్మణరేఖ గీయవలసిందే!

‘నిన్న జరిగిన కాంగ్రెస్ ప్రజావూపతినిధుల సమావేశంపై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూశారు. కానీ వారి ఆశలు నిరాశలయ్యా యి. కాంగ్రెస్

Published: Sat,October 6, 2012 04:18 PM

రాజకీయ అస్తిత్వంవైపు..

ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఓటరు మహాశయుడే తన నిర్ణయాన్ని ప్రకటించాలి. ఎన్నికల ఫలితాలు రాకముందే వాటి రాజకీయ ప్రభావం గురించి మా

Published: Sat,October 6, 2012 04:19 PM

చరిత్ర మరిచిన ప్రణబ్ ముఖర్జీ

రాష్ట్ర ఏర్పాటు గురించి తెలంగాణ ప్రజలంతా సకల జనుల సమ్మెతో సత్యాక్షిగహ పోరాటం చేస్తుంటే.పణబ్ ముఖర్జీ చరివూతను మరి చి , బాధ్యతారాహిత

Published: Sat,October 6, 2012 04:19 PM

నవ తెలంగాణ సాధన కోసం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమం దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలలో ఒక ఆణిముత్యంగా నిలుస్తది. ఒక్క

Featured Articles