వందశాతం ఎఫ్‌డీఐలతో అల్లకల్లోలమే


Mon,January 29, 2018 11:04 PM

ప్రస్తుత వంద శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి విధానం కారణంగా పట్టణ, గ్రామీణ చిన్నతరహా వ్యాపార రంగమే తీవ్రంగా ప్రభావితం కాబోతున్నది. ఈ క్రమలో అనేక సామాజిక మార్పులకు,ఆహారపు అలవాట్లలో మార్పునకు హేతువుగా మారబోతున్నది.

ఈమధ్య కేంద్ర ప్రభుత్వం సింగిల్ బ్రాండ్ రిటేల్ వ్యాపారం లో వంద శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ విధానపరమైన నిర్ణయం తీసుకున్నది. దీంతో దేశంలోకి కుప్పలుతెప్పలుగా విదేశీ పెట్టుబడులు ప్రవహించి దేశాభివృద్ధికి, వృద్ధిరేటుకు సహకరిస్తాయ ని చెప్పుకొస్తున్నది. అయితే రిటేల్ రంగంలోకి వందశాతం పెట్టుబడుల కారణంగా దేశీయంగా చిన్న, మధ్యతరహా వ్యాపారస్తులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నదన్న దాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. మరోవైపు పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ పన్నువిధానంతో దేశీయంగా సకల ఉత్పత్తి, వ్యాపా రరంగాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణనలోకి తీసుకోలేదు. అంతేకాదు స్థూల ఆర్థికాభివృద్ధిలో మందగమనం చోటుచేసుకున్నది. అలాగే వాస్తవ జీడీపీలో వృద్ధి ఏడాదిలో 6-7 శాతం ఉండొచ్చని అంచ నా. దీంతో దేశంలో కొత్తగా ఉనికిలోకి వచ్చిన వస్తు వినియోగవర్గం అం టే ఏడాదికి 90 వేల ఆదాయం గల వారు 60 కోట్లకు చేరుకున్నది. దీంతో దేశ రిటేల్ మార్కెట్ 10 శాతం పెరుగుతుందని ప్రభుత్వం చెబుతున్నది. దీంతోపా టు సాలీన వ్యాపారం కూడా గణనీయంగా పెరుగుతుందని 2016లో 641 అమెరికా మిలియన్ డాలర్ల వ్యాపారం మాత్రమే ఉన్నది, 2026 నాటికి అది 1.6 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందంటున్నది.

దేశ వ్యాపార, మార్కెట్ పరిస్థితి చూస్తే.. దేశీయ రిటైల్ మార్కెట్ సం ఘటిత రిటైల్‌మార్కెట్, అసంఘటిత రిటైల్ మార్కెట్‌గా విడిపోయి ఉన్న ది. దేశంలో సంఘటిత రిటైల్ మార్కెట్ 9 శాతమే ఉండి 60 బిలియన్ డాలర్ల వ్యాపారం మాత్రమే చేస్తున్నది. అదే అసంఘటిత రిటైల్ మార్కెట్ 91 శాతం ఆక్రమించి ఉన్నది. ఈ నేపథ్యంలో జీఎస్టీతో నే అసంఘటిత చిన్న, మధ్య తరహా వ్యాపారవర్గం ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో 100 శాతం ఎఫ్‌డీఐలు సింగిల్ బ్రాండ్ రిటేల్ రంగంలోకి వస్తే ఈ వర్గాలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుం ది. గతంలో స్థానిక చిన్న వ్యాపారాల్లోకి 30 శాతం స్థానిక వర్గాల పెట్టుబ డులకే చోటుండాలనే నిబంధనను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో వంద శాతం విదేశీ పెట్టుబడులు వస్తే స్థానిక చిన్న వ్యాపారస్తులు విదేశీ వ్యాపార వర్గాలతో పోటీపడలేక చతికిలపడే పరిస్థితి దాపురిస్తున్నది. స్థాని క చిన్న వ్యాపారాల్లోకి విదేశీ పెట్టుబడులు, సరకులు ప్రవేశిస్తే స్థానిక వర్గా లు పోటీ తట్టుకోలేక తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. చిన్నచిన్న వ్యాపారాలతో జీవనోపాధిగా ఉన్న వర్గాలు, ముఖ్యంగా మహిళలు తమ జీవనోపాధిని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికే పెద్ద నోట్లరద్దు, జీఎస్టీ తో చిన్న, మధ్య తరహా వ్యాపారవర్గాలు అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఇప్పుడు వందశాతం ఎఫ్‌డీఐలకు అవకాశం ఇవ్వ టం ఆ వర్గాలకు పెద్ద ఉప ద్రవమే.

సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో అసంఘటిత వ్యాపార వర్గమంతా ఆహారపదార్థాల తయారీ, అమ్మకంలో ఉన్నది. తోపుడుబండ్లు, ఇతర చిన్నచిన్న వాహనాలపై తిను బండారాలను తయారుచేసి అమ్ముకోవటం లాంటి నగర జీవితంలో ఎక్కువగా ఉంటున్నది. అలాగే చిన్నచిన్న కిరా ణా దుకాణాలు కూడా వీటిలో భాగంగానే చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో చిన్నచిన్న నిత్యావసర వస్తువుల తయారీ, అమ్ముకొని జీవనోపాధిని పొం దే వ్యక్తుల సమూహం పెద్ద సంఖ్యలో ఉంటుంది. ఈ క్రమంలోనే చూస్తే ప్రపంచంలోనే అతి ఎక్కువ సంఖ్యలో చిన్న తరహా జీవనోపాధి రిటైల్ రంగంలో 15 మిలియన్ల షాపులున్నాయి. చిన్నతరహా ఆహారపదార్థాల తయారీ పంపిణీ చేస్తూ జీవనోపాధి పొందే వర్గం కూడా గణనీ య సంఖ్యలో ఉన్నది. దీంతో లక్షలాదిమంది జీవనోపాధి పొందుతున్నా రు. కానీ ప్రస్తుత వందశాతం ఎఫ్‌డీఐలకు అనుమతి విధానంతో ఈ వర్గా లు తీవ్రంగా ప్రభావితమయ్యే పరిస్థితులున్నాయి. దీనికి రోజురోజుకూ మారుతున్న నగరజీవిత ఆహారపు అలవాట్లు కూడా దీనికి తోడవుతున్నా యి. ఇలాంటి సామాజిక, జీవన పరిస్థితులున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఒక విధానపరమైన నిర్ణయం చేసేటప్పుడు ప్రజాజీవనంపై ఎలాంటి ప్రభావం పడనున్నదో చూడాల్సిన అవసరం ఉన్నది. కానీ మన పాలకు లు దీన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు కనపించటం లేదు.

నిజానికి ఎఫ్‌డీఐల అనుమతి విషయంలో అనేకం ముడిపడి ఉన్నా యి. ఎఫ్‌డీఐలు దేశంపై ఎలాంటి ప్రభావం చుపుతాయో, దీర్ఘకాలికంగా వాటితో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ఆలోచించాలి. కానీ ఇదే మీ ప్రభుత్వం పట్టించుకున్నట్లు లేదు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా గ్రామీ ణ, పట్టణ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న చిన్న వ్యాపారవర్గాలు, జీవనోపాధిగా ఎంచుకొని రిటైల్ రంగంలో ఉన్న కుటుంబాలు, గ్రామీణ పేద రైతు లు వందశాతం సబ్సిడీలతో తీవ్రంగా ప్రభావితులవుతారు. ఇది నిజాని కి గ్రామీణ, పట్టణ ప్రజాజీవనానికి తీవ్ర ప్రమాదం. కాబట్టి ఎవరూ ఎఫ్‌డీఐలు, చిన్న తరహా వ్యాపా ర వర్గాలతో సంబంధంలేనిదని ఎవరూ అనలేరు.

ఆహార అలవాట్లనే తీసుకుం టే ఇది సామాజిక, ఆర్థిక, సాం స్కృతిక జీవనంతో ముడిపడి ఉంటుంది. ఆహారపదార్థాల తయారీ, ప్రజలకు అందుబాటులో ఉంచటం మధ్యలో అనేక తంతెలు న్నాయి. దీంట్లో ప్రధానంగా ఉత్పత్తిని చెప్పుకోవచ్చు. దీనికి కావలసిన మౌలిక వసతులు, వనరుల, భూమి, నీరు లాంటివి ప్రధానమైనవి. వీటి తో ఆహార పదార్థాలు తయారై ప్రజలకు అందుబాటులోకి రావటమనేది ఉన్నది. ఆ తర్వాత తయారైన ఆహార పదార్థాలను రవాణా చేయటం, అమ్మకం చేయటం ఉంటుంది. అలాగే పంపకం, వినియోగం లాంటి ప్రధాన అంచెల్లో అనేక శ్రమలు, అవరోధాలు ఇమిడి ఉన్నాయి.
ramesh
అయితే ప్రస్తుత వంద శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి విధానం కారణంగా పట్టణ, గ్రామీణ చిన్నతరహా వ్యాపార రంగమే తీవ్రంగా ప్రభావితం కాబోతున్నది. ఈ క్రమలో అనేక సామాజిక మార్పులకు, ఆహారపు అలవాట్లలో మార్పునకు హేతువుగా మారబోతున్నది. ఈ నేపథ్యంలోనే సంప్రదాయ ఆహార పదార్థాల స్థానంలో జంక్‌ఫుడ్స్, చిన్న బడ్డికొట్టు స్థానంలో ల్యాండ్ స్కేప్‌లు, ఫుడ్ కోర్డులు, మాల్‌లు వచ్చి సంప్రదాయ ఆహారపదార్థాల తయా రీదారులను మార్కెట్ నుంచి తరిమేస్తున్నాయి, లేదా మింగేస్తున్నాయి. అయితే ఇప్పటికే పెద్దపెద్ద బహుళజాతి కంపెనీలు ఆహార రంగంలోకి, రిటైల్ రంగంలోకి వచ్చి తమదైన ఆధిపత్యంతో దూసుకుపోతున్నాయి. ప్రజల జీవ న, ఆహార అలవాట్లను నిర్దేశిస్తున్నా యి. ఈ పరిస్థితుల్లో ఈ వందశాతం ఎఫ్‌డీఐలు కూడా ప్రజా జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేయటమే కాదు, అల్లకల్లోలం చేయనున్నాయి. దీన్నుంచి ప్రజలు, రైతుల ప్రయోజనాలను పరిరక్షించుకోవాల్సిన అవస రం ఎంతైనా ఉన్నది.
(వ్యాసకర్త: వేములవాడ శాసనసభ్యులు)

530

RAMESH CHENNAMANENI

Published: Mon,July 30, 2018 11:24 PM

విధ్వంసరహిత వృద్ధి అసాధ్యమా?

ప్రపంచంలో పర్యావరణాన్ని విధ్వంసం చేయకుండా ప్రజలకు ఆహారాన్ని చాలినంత అందించలేమా? ఇది ఈ మధ్య జర్మనీలోనిబెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఆహా

Published: Tue,May 2, 2017 08:39 AM

రాష్ట్ర వ్యవసాయానికి పునరుజ్జీవం

చిన్న, సన్నకారు రైతులతో కూడి ఉన్న తెలంగాణ వ్యవసాయరంగం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో పూర్తిగా స్వరూప స్వభావాలను మార్చుకోనున్నది.

Published: Thu,May 5, 2016 01:29 AM

ప్రమాదకర స్థితిలో పర్యావరణం

వేడి గాడుపులను నివారించేందుకు విస్తృతంగా చెట్లను నాటడమే కాదు కాలుష్యాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి. చల్లదనాన్నిచ్చే నిర్మాణాలకు

Published: Thu,March 31, 2016 01:24 AM

సహకార సంఘాలే దిక్కు

ఎక్కడైతే.. విజయవంతంగా ప్రజల కో ఆపరేటివ్స్ పనిచేశాయో అక్కడ మాత్రమే ఆర్థిక సంక్షోభ ప్రతిఫలనాలు పడలేదు. ప్రజలు ఇబ్బందుల పాలు కాలేదు.

Published: Fri,January 10, 2014 02:06 AM

జనతన సర్కార్ వెలుగులో కాళోజీ..

తెలుగు సాహిత్యంలోనేగాక, సామాజిక జీవితంలో కూడా నూరేళ్ల అరుదైన వ్యక్తిత్వం కాళోజీ. అధీకృత హింసకు వ్యతిరేకం గా నిలిచిన కలం ఆయనది. ‘ప్

Published: Sun,April 28, 2013 11:43 PM

చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ నేతలు

ఎంపీ వివేక్ ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల భేటీ. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. ఇది బ్రేకింగ్ న్యూస్. ఈ న్యూస్‌ను మూడ

Published: Sat,October 6, 2012 04:18 PM

లక్ష్మణరేఖ గీయవలసిందే!

‘నిన్న జరిగిన కాంగ్రెస్ ప్రజావూపతినిధుల సమావేశంపై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూశారు. కానీ వారి ఆశలు నిరాశలయ్యా యి. కాంగ్రెస్

Published: Sat,October 6, 2012 04:18 PM

రాజకీయ అస్తిత్వంవైపు..

ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఓటరు మహాశయుడే తన నిర్ణయాన్ని ప్రకటించాలి. ఎన్నికల ఫలితాలు రాకముందే వాటి రాజకీయ ప్రభావం గురించి మా

Published: Sat,October 6, 2012 04:19 PM

చరిత్ర మరిచిన ప్రణబ్ ముఖర్జీ

రాష్ట్ర ఏర్పాటు గురించి తెలంగాణ ప్రజలంతా సకల జనుల సమ్మెతో సత్యాక్షిగహ పోరాటం చేస్తుంటే.పణబ్ ముఖర్జీ చరివూతను మరి చి , బాధ్యతారాహిత

Published: Sat,October 6, 2012 04:19 PM

నవ తెలంగాణ సాధన కోసం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమం దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలలో ఒక ఆణిముత్యంగా నిలుస్తది. ఒక్క

Featured Articles