ప్రమాదకర స్థితిలో పర్యావరణం


Thu,May 5, 2016 01:29 AM

వేడి గాడుపులను నివారించేందుకు విస్తృతంగా చెట్లను నాటడమే కాదు కాలుష్యాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి. చల్లదనాన్నిచ్చే నిర్మాణాలకు ప్రాధాన్యమివ్వాలి. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతూ
కాలుష్య కారక వాహనాలను నియంత్రించాలి.. ఇలాంటి కార్యక్రమాలన్నీ కేవలం ప్రభుత్వ పాలనా
యంత్రాంగం చేపడితే మాత్రమే సరిపోదు. స్థాని క కాలనీ, బస్తీ సంఘాలు కాలుష్య నివారణకు
కృషిచేయాలి. పౌరసమాజం భాగస్వామ్యం కావడమే బాధ్యతగా వ్యవహరించాలి.

ramesh
ఎండలు, వడగాల్పుల తీవ్రత తో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, ప్రధానంగా పేదలు వడగాల్పుల కారణంగా ప్రాణా లు వదులుతున్నారు. అభివృద్ధి చెందిన ఈ కాలం లో కూడా జనం ఇలా చనిపోవడం ఒక రకంగా అం గీకరించరాని విషయం. గ్లోబల్ వార్మింగ్ కారణం గా వీస్తున్న వేడి గాలులతో భూ ఉపరితలం మునుపెన్నడూ లేనివిధంగా వేడెక్కింది. ఉష్ణోగ్రతలు రికా ర్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం కలుగజేస్తున్నది. ఈ విధమైన వడగాల్పులతో మరణాలు కూడా నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు, పౌరసమాజం ఏమీ చేయలేవా అన్నది ఇవ్వాళ పెద్ద ప్రశ్న. అలాగే ఎండ వేడిమి తగ్గించేందుకు పౌరసమాజం,ప్రభుత్వాలు చేయాల్సిన కర్తవ్యాలేమిటో ఆలోచించాలి. గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్‌కు విరుగుడుగా ఏం చేయాలో చూడాలి. ఇలాంటి కార్యాచరణను ఎంచుకుని ఆచరించినప్పుడే ఎండవేడిమి తగ్గించి వడదె బ్బ చావులను అడ్డుకోగలుగుతాం.

ఈ నేపథ్యంలోనే.. సుస్థిర హైదరాబాద్‌పై ఇండో-జర్మన్ ప్రాజెక్టుపై 60 మంది శాస్త్రవేత్తలు, ఈ వ్యాస రచయిత నేతృత్వంలో ఎనిమిదేళ్లు అధ్యయ నం చేశారు. ఈ క్రమంలో వారు గత వందేళ్లలో హైదరాబాద్‌లో కురిసిన వర్షపాతం ఆధారంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులను అధ్యయనం చేశారు. ఈ క్రమంలో గత వందేళ్లలో హైదరాబాద్, తెలంగాణ, దక్కన్ పీఠభూమిలోని వాతావరణ స్థితిగతులను లోతుగా, శాస్త్రీయంగా అధ్యయనం చేశారు. ఈ క్రమంలో గ్లోబల్ ఎమిషన్‌ను కనిష్టంగా ఉంచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ఈ సందర్భంగా నగరాల్లో వాతావరణ కాలుష్యం, కార్బన్ డయాక్సైడ్ విడుదలను తగ్గించడం గురించి తీసుకోవాల్సిన చర్యలను, వాతావరణ వైపరీత్యాలను వివరించారు.

వర్షాలు, వరదల ప్రభావం: ఎనభై మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం ఉంటే దాన్ని భారీ వర్షంగా పరిగణిస్తాం. ఇలాంటి వర్షం రెండేళ్లకోసారి కురిసి హైదరాబాద్ నగరం వరదల్లో మనుగుతున్నది. ఇలాంటి వరదల కారణంగా జనజీవనం స్తంభించి పోవడమేగాక మౌలిక వసతులకు కూడా తీవ్ర నష్టం జరుగుతున్నది. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. జనానికి ఇక్కట్లను కలిగిస్తున్నాయి. ఇవి భవిష్యత్ కాలంలో మరింత ఎక్కు వయ్యే పరిస్థితులున్నాయి.

అత్యధిక ఉష్ణోగ్రతలు: ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఏదో ఒకరోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే రాబోయే కాలాల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయని ఆ అధ్యయనం తెలుపుతున్న ది. ఈ విధంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతే మరింత ప్రమాదం కాబోతున్నది. సాధారణమవుతున్న అధికోష్ణగ్రతలు: అనేక అధ్యయనాలు చెబుతున్న దాని ప్రకారం భవిష్యత్‌కాలం లో మరింతగా వేడి పెరిగిపోనున్నది. గత యాభై ఏళ్లుగా గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నా.. ఇదివరకే ఓజోన్ పొర విషయం లో జరిగిన నష్టం ఉండనే ఉన్నది. ఈ విషయంలో మనమంతా జాగరూకతతో వ్యవహరించి గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించాలనుకుంటే దానికి సంబంధించిన కార్యాచరణను ఎంచుకోవాలి. కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు తగు చర్యలు తీసుకోవాలి. దీనికోసం మనం రెండు రకాల చర్యలు తీసుకోవాలి. అభివృద్ధిలో భాగంగా చేస్తున్న చర్యల్లో సహజ వనరుల వినియోగాన్ని తగ్గించుకోవాలి. ఆర్థికాభివృద్ధి నేపథ్యంలో జరుగుతున్న పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించుకోవాలి. అలాగే కాలుష్య నియంత్రణ కు సామాజిక కార్యాచరణకు ప్రాధాన్యం ఇవ్వాలి.

ప్రజారోగ్యంపై వేడి గాలుల ప్రభావం: అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మానవ శరీరంలోని జీవ క్రియలపై తీవ్ర ప్రభావాన్ని కలుగజేస్తాయి. ప్రధానంగా శరీరంలోని నీరంతా చెమట రూపంలో ఆవిరై పోతుంది. కాబట్టి ఉష్ణోగ్రతను సమపాళ్లలో ఉంచే ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో రక్తప్రసరణలో వేగం పెరుగుతుంది. దీంతో గుండె, ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే అధికోష్ణగ్రతలతో మనిషి శరీరంలో మరిన్ని దుష్ఫలితాలు ఏర్పడుతాయి. వేడి బొబ్బలు శరీరంపై ఏర్పడుతా యి. ఒక్కోసారి వాపు కూడా కనిపిస్తుంది. అంతే గాకుండా.. స్పృహతప్పి పడిపోవడం కూడాజరుగుతుంది. దీంతో పాటు మనిషి అతిప్రమాదకర పరిస్థితులకు నెట్టబడతాడు. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం తో.. కండరాల రోగాలు, మల్టిపుల్ స్లెరోసిస్, హైపర్‌థాయిడ్, డయాబెటిస్, గుండె, కిడ్నీ సంబంధ రోగాలు, శ్వాస ఆడకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. చిన్న పిల్లలతో సహా పెద్దలు కూడా ఈ విధమైన ఆరోగ్య సమస్యలతో సతమతమవడమే కాదు ప్రాణాలకు ప్రమాదం కూడా ఉంటున్నది.

ఉష్ణోగ్రతల పెరుగుదలకు నగర పరిస్థితులు కూడా హేతువుగా మారుతున్నాయి. నగరాల్లోని పెద్దపెద్ద భవనాలు, తారురోడ్లు ఎండ వేడిమిని గ్రహించి ఉష్ణోగ్రతలను మరింత పెరగడానికి కారణమవుతున్నాయి. ఈ కారణాలతో గ్రామీణ ప్రాం తాల కన్నా నగరాల్లో ఎక్కువ వేడి ఉండటానికి కారణమవుతున్నది. దీన్నే మనం అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటున్నాం.

ైక్లెమేట్ ఛేంజ్ నేపథ్యంలో సమాజం, ప్రభుత్వాల ముందున్న సవాళ్లు: ైక్లెమేట్ ఛేంజ్ అనేది నేటి ఆధునిక ప్రపంచంలో ప్రపంచ సమస్య. దీనికోసం ఎక్కడికక్కడ స్థానిక ప్రభుత్వాలతో పాటు ప్రపంచ దేశాలన్నీ దీనికోసం కలిసికట్టుగా పనిచేయాలి. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు, ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి సమిష్టిగా కృషిచేయాలి. అందుకోసం పల్లెనుంచి పట్టణం దాకా అంతటా కార్యాచరణకు పూనుకోవాలి.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వాతావరణంలో సమతుల్యతను సాధించేందుకు, పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే మిషన్ కాకతీయ, హరిత హారం లాంటి పథకాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి అమలు చేస్తున్నారు. ఈ పథకాలు వాతావరణంలో ఏర్పడ్డ అసమతుల్యతను తొలగిస్తాయి. వాతావరణంలో వచ్చిన వినాశకర మార్పులను సరిచేస్తాయి. అంతేకాదు.. ఈ పథకాల కారణంగా ఆయా ప్రాంతాల్లో పర్యావరణం కూడా సంరక్షించబడి దీర్ఘకాలంలో వాతావరణాన్ని కాపాడబడుతుంది. ఈ క్రమంలోం చే.. కేసీఆర్ మార్గదర్శకత్వంలో.. ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రేనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఈపీటీఆర్‌ఐ) తెలంగాణలో వాతావరణంలో మార్పుకోసం పనిచేస్తున్నది. ఇక్రిశాట్ సాయంతో కూడా తెలంగాణ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించి తగు విధమైన కార్యాచరణతో ముందుకుపోతున్నది. దీనికో సం జాతీయ నిధులను కూడా సమీకరించి కృషి చేస్తున్నది.

కోటికి పైగా జనాభాతో హైదరాబాద్ నగరంలో వాతావరణ పరిరక్షణకు తగు విధంగా కార్యాచరణ తో ముందుకు పోవాలి. వివిధ కాలాల్లో వస్తున్న వాతావరణ మార్పులు, అతివృష్టి, వడగాల్పుల నుంచి నగర ప్రజలను కాపాడాలి. ఈ నేపథ్యంలో సస్టేనబుల్ హైదరాబాద్ కోసం చేస్తున్న అధ్యయనాలు, పనులు దీర్ఘకాలికంగా ఎంతో మేలు జరుగుతుంది. అయినా భవిష్యత్ అవసరాలు, రాబోయే ప్రమాదాల నేపథ్యంలో.. హైదరాబాద్ నగరంలో ఈ క్రింది విధమైన చర్యలు చేపట్టాలి. నగర వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే నిర్మాణాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలి. పెరుగుతున్న జనాభా కారణంగా వాతావరణంలో కలిగే మార్పులను అంచనా వేసి తగు విధమైన రక్షణ చర్యలు తీసుకోవాలి. జనాభా ఎక్కువగా ఉండి.. పర్యావరణానికి హాని కలుగజేసే ప్రాంతాలను గుర్తించి తగు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలి. వరద ముంపు ప్రాంతాలను గుర్తించి రక్ష ణ చర్యలు తీసుకోవాలి.

ఈ నేపథ్యంలోనే.. హైదరాబాద్‌లో మంచి వాతావరణం కోసం స్థానిక మున్సిపల్ పాలకులు మొదలు రాష్ట్ర ప్రభుత్వం దాకా, ఎన్జీవోలు, పౌరసంఘాలు అన్నీ కలిసి నడుం కట్టాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటేనే మనకు రక్ష అని అందరూ భావించాలి. ఈ క్రమంలోనే మనం ైక్లెమే ట్ ప్రూఫ్ హైదరాబాద్‌ను నిర్మించుకోవాలి. దీనికోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ, మినిస్ట్రీ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అం డ్ అర్బన్ డెవలప్‌మెంట్, తెలంగాణ ప్రభుత్వం కలిసి కట్టుగా, ఏకతాటిగా కృషిచేయాలి. 2031ని దృష్టిలో పెట్టుకుని నగరాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. భవిష్యత్ పర్యావరణ సమస్యలకు కారణమయ్యే చర్యలకు చరమగీతం పాడాలి. ముంపు ప్రాంతాల అభివృద్ధికి కృషిచేస్తూ.. మురుగు కాలువల వ్యవస్థ(డ్రైనేజీ సిస్టం)ను క్రమబద్ధీకరించడమే కాదు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తృతపర్చాలి.

వేడి గాడు పులను నివారించేందుకు విస్తృతంగా చెట్లను నాటడమే కాదు కాలుష్యాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి. చల్లదనాన్నిచ్చే నిర్మాణాలకు ప్రాధాన్యమివ్వా లి. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతూ కాలుష్య కారక వాహనాలను నియంత్రించాలి. ఇలాంటి కార్యక్రమాలన్నీ కేవలం ప్రభుత్వ పాలనాయంత్రాంగం చేపడితే మాత్రమే సరిపోదు. స్థాని క కాలనీ, బస్తీ సంఘాలు కాలుష్య నివారణకు కృషి చేయాలి. పౌరసమాజం భాగస్వామ్యం కావడమే బాధ్యతగా వ్యవహరించాలి. దీనికి తోడు స్వచ్ఛంద సంస్థలు, అధ్యయన, పరిశోధక సంస్థలు కూడా ైక్లెమేట్ ఛేంజ్‌పై విస్తృత కార్యాచరణకు పూనుకోవా లి. అప్పుడే వాతావరణ కాలుష్యంతో సతమతమవుతున్న మనిషికి విముక్తి లభిస్తుంది.

1148

RAMESH CHENNAMANENI

Published: Mon,July 30, 2018 11:24 PM

విధ్వంసరహిత వృద్ధి అసాధ్యమా?

ప్రపంచంలో పర్యావరణాన్ని విధ్వంసం చేయకుండా ప్రజలకు ఆహారాన్ని చాలినంత అందించలేమా? ఇది ఈ మధ్య జర్మనీలోనిబెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఆహా

Published: Mon,January 29, 2018 11:04 PM

వందశాతం ఎఫ్‌డీఐలతో అల్లకల్లోలమే

ప్రస్తుత వంద శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి విధానం కారణంగా పట్టణ, గ్రామీణ చిన్నతరహా వ్యాపార రంగమే తీవ్రంగా ప్రభావితం కాబోతున్నది. ఈ క్రమలో

Published: Tue,May 2, 2017 08:39 AM

రాష్ట్ర వ్యవసాయానికి పునరుజ్జీవం

చిన్న, సన్నకారు రైతులతో కూడి ఉన్న తెలంగాణ వ్యవసాయరంగం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో పూర్తిగా స్వరూప స్వభావాలను మార్చుకోనున్నది.

Published: Thu,March 31, 2016 01:24 AM

సహకార సంఘాలే దిక్కు

ఎక్కడైతే.. విజయవంతంగా ప్రజల కో ఆపరేటివ్స్ పనిచేశాయో అక్కడ మాత్రమే ఆర్థిక సంక్షోభ ప్రతిఫలనాలు పడలేదు. ప్రజలు ఇబ్బందుల పాలు కాలేదు.

Published: Fri,January 10, 2014 02:06 AM

జనతన సర్కార్ వెలుగులో కాళోజీ..

తెలుగు సాహిత్యంలోనేగాక, సామాజిక జీవితంలో కూడా నూరేళ్ల అరుదైన వ్యక్తిత్వం కాళోజీ. అధీకృత హింసకు వ్యతిరేకం గా నిలిచిన కలం ఆయనది. ‘ప్

Published: Sun,April 28, 2013 11:43 PM

చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ నేతలు

ఎంపీ వివేక్ ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల భేటీ. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. ఇది బ్రేకింగ్ న్యూస్. ఈ న్యూస్‌ను మూడ

Published: Sat,October 6, 2012 04:18 PM

లక్ష్మణరేఖ గీయవలసిందే!

‘నిన్న జరిగిన కాంగ్రెస్ ప్రజావూపతినిధుల సమావేశంపై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూశారు. కానీ వారి ఆశలు నిరాశలయ్యా యి. కాంగ్రెస్

Published: Sat,October 6, 2012 04:18 PM

రాజకీయ అస్తిత్వంవైపు..

ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఓటరు మహాశయుడే తన నిర్ణయాన్ని ప్రకటించాలి. ఎన్నికల ఫలితాలు రాకముందే వాటి రాజకీయ ప్రభావం గురించి మా

Published: Sat,October 6, 2012 04:19 PM

చరిత్ర మరిచిన ప్రణబ్ ముఖర్జీ

రాష్ట్ర ఏర్పాటు గురించి తెలంగాణ ప్రజలంతా సకల జనుల సమ్మెతో సత్యాక్షిగహ పోరాటం చేస్తుంటే.పణబ్ ముఖర్జీ చరివూతను మరి చి , బాధ్యతారాహిత

Published: Sat,October 6, 2012 04:19 PM

నవ తెలంగాణ సాధన కోసం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమం దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలలో ఒక ఆణిముత్యంగా నిలుస్తది. ఒక్క

Featured Articles