సహకార సంఘాలే దిక్కు


Thu,March 31, 2016 01:24 AM

ఎక్కడైతే.. విజయవంతంగా ప్రజల కో ఆపరేటివ్స్ పనిచేశాయో అక్కడ మాత్రమే ఆర్థిక సంక్షోభ ప్రతిఫలనాలు పడలేదు. ప్రజలు ఇబ్బందుల పాలు కాలేదు. ఈ విధమైన కో ఆపరేటివ్స్‌ల మూలంగానే యూరోపియన్ యూనియన్ కానీ, అమెరికా కానీ ఆర్థిక సంక్షోభాన్నుంచి బయటపడగలిగాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే.. ఇండియాలో, తెలంగాణలో కూడా ఇలాంటి కోఆపరేటివ్స్ మూలంగానే మార్కెట్ సంక్షోభాన్నుంచి తప్పించుకోగలిగాం.

ramesh
కో ఆపరేటివ్ అనేది తక్కువ బాధ్యత గల లాభాపేక్ష గల సంస్థ. ఇది కార్పొరేషన్ కన్నా భిన్నమైనది. నాన్ ప్రొడ్యూసింగ్ షేర్ హోల్డర్స్ కాకుండా ప్రొడ్యూసింగ్ మెంబర్స్ నిర్ణయాధికారం కలిగి ఉం డటం అనేది రెండింటి మధ్య గల తేడా. వ్యవసా య కో ఆపరేటివ్స్, కన్జూమర్స్ కో ఆపరేటివ్స్, వర్కర్స్ కో ఆపరేటివ్స్- ఇట్లా ఏదైనా కావచ్చు, కో ఆపరేటివ్ బిజినెస్ మోడల్ అనేది ఆర్థిక ప్రజాస్వామ్య ప్రయోజనాలకు మౌలికమైనది. అంతర్జాతీయ సహకార కూటమి (ఇంటర్నేషనల్ కో ఆపరేటివ్ అలయెన్స్) నిర్దేశించిన ఏడు సూత్రాలు ఈ కో ఆపరేటివ్స్‌కు మార్గదర్శకంగా ఉంటాయి. ఈ సూత్రాల ను భారత్‌తో సహా అన్ని దేశాలు ఆమోదించాయి. ఈ సూత్రాలు: 1 స్వచ్ఛంద సార్వత్రిక సభ్యత్వం 2. ప్రజాస్వామి క సభ్య నియంత్రణ 3. సభ్యుడి ఆర్థిక భాగస్వా మ్యం 4. స్వయం ప్రతిపత్తి, స్వతంత్రత 5. విద్య, శిక్షణ, సమాచారం 6. కో ఆపరేటివ్స్ మధ్య సహకారం 7. సమాజం పట్ల నిబద్ధత.

2009లో అంతగా పేరు ప్రఖ్యాతులు లేని ఎలినార్ ఓస్ట్రోమ్‌కు నోబెల్ బహుమతి ప్రకటించడంతో ప్రపంచంలోని అకడమిక్ మేధావులంతా ఒక్కసారిగా ఆమె వైపు దృష్టిసారించారు. ఎకనామిక్ గవర్నెన్స్, ముఖ్యంగా కామన్ ప్రాప ర్టీ రిసోర్సెస్‌పై ఆమె విశ్లేషణ, కృషి సాగింది. ప్రభుత్వం, మార్కెట్‌తో సంబంధం లేకుండా ప్రజల భాగస్వామ్యంతో ఆర్థిక పరిపుష్టి, స్వయం సమృద్ధి ఎలా సాధించవచ్చో ఓస్ట్రోమ్ పరిశోధనలతో రుజువుచేశారు. దీంతో ఆ విషయాలకు ఎనలేని ప్రాధాన్యం వచ్చింది. ఆమె పరిశోధన, అధ్యయనమంతా వ్యక్తి, సామూహికం, ప్రభుత్వం మధ్య ఉండాల్సిన ఆర్థిక సంబంధం, ఉమ్మడి వనరుల వినియోగం, వాటి నిర్వహణపై సాగింది. ఓస్ట్రోమ్ పరిశోధన.. సాధారణ ఆర్థిక సూత్రాలు, నియమాలను తోసిపుచ్చి వ్యక్తులు స్వచ్ఛంద సామూహిక ఆర్థిక కలాపాలతో ఎలా అభివృద్ధి చెందవచ్చో నిరూపించింది.

కో ఆపరేటివ్స్ అంటే నిర్దిష్ట సభ్యుల యాజమాన్యంలోని ఆర్థిక కలాపం. దీన్ని సులభంగా చెప్పుకోవాలంటే.. ప్రజలంతా తమ భాగస్వామ్యంతో మార్కెట్‌తో సంబంధం లేకుండా, ఏ ఒక్కరి ఆధిపత్యం లేకుండా ఆర్థిక కలాపాలు నిర్వహించి పేదరికం నుంచి బయటపడటం. ఈ విధానాన్నసరించి ఇవ్వాళ.. ప్రపంచ వ్యాప్తంగా 800 మిలియన్ల ప్రజలు సుస్థిరాభివృద్ధిని సాధించారు. ఉదాహరణకు వ్యవసాయ కో ఆపరేటివ్స్ 400 మిలియన్ల రైతుల భాగస్వామ్యంతో మొత్తంగా 50శాతం వ్యవసాయోత్పత్తులను సాధిస్తున్నారు. ఇది ఒక ఆచరణాత్మక అనుసరణీయ విధానంగా మనముందున్నది. ఇది ఏ స్టాక్ మార్కెట్లు, మార్కెట్ల ఎగుడుదిగుడులపై ఆధారపడిలేకుండా.. వారు ఉత్పత్తి చేస్తున్న వస్తువుల వినియోగ విలువపై ఆధారపడి నిలదొక్కుకుంటున్నాయి. ఎవరు మార్కెట్‌లో అమ్మితే వారికే లాభం దక్కుతుందన్నట్లుగా గాకుండా.. అందరికీ సమంగా అందుతుంది. మరో రకంగా చెప్పాలంటే.. ఆ సామాజిక సమూహానికంతా ఆ ఆర్థిక ప్రతిఫలం దక్కుతుంది.

ఈ మధ్య కాలంలో ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం, పర్యవసానాలు అందరికీ అనుభవంలోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మార్కెట్ విధానం ఉన్న సోవియట్ యూనియన్‌కూడా ఆర్థిక సంక్షోభం కారణంగా కుప్పకూలిపోయింది. ఎక్కడైతే.. విజయవంతంగా ప్రజల కో ఆపరేటివ్స్ పనిచేశాయో అక్కడ మాత్రమే ఆర్థిక సంక్షోభ ప్రతిఫలనాలు పడలేదు. ప్రజలు ఇబ్బందుల పాలు కాలేదు. ఈ విధమైన కో ఆపరేటివ్స్‌ల మూలంగానే యూరోపియన్ యూనియన్ కానీ, అమెరికా కానీ ఆర్థిక సంక్షోభాన్నుంచి బయటపడగలిగాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే.. ఇండియా, తెలంగాణలలో కూడా ఇలాంటి కో ఆపరేటివ్స్ మూలంగానే మార్కెట్ సంక్షోభాన్నుంచి తప్పించుకోగలిగాం.

దేశంలో 29 వ రాష్ట్రంగా తెలంగాణ కొత్తగా ఏర్పడింది. ముందుచూపు, భవిశ్యద్దర్శనం కలిగిన కేసీఆర్ నాయకత్వంలో.. అనేక పథకాలు పునర్నిర్వచించుకొని ముందుకు సాగుతున్నది. ప్రజల వికాసం, విముక్తి లక్ష్యంగా అనేక అభివృ ద్ధి కార్యక్రమాలు రూపుదిద్దుకుంటున్నాయి. తెలంగాణ తనదైన స్వయం సమృద్ధి విధానంతో ముందుకు పోతున్నది. ఈ క్రమంలో ప్రజలంద రి భాగస్వామ్యంతో ఎలా అభివృద్ధి పథంలో సాగవచ్చో మనం కొన్ని ప్రశ్నలు వేసుకుని వాటి కి సమాధానాలు రాబట్టితే.. ఆ మార్గంలో మనం పయనించవచ్చు.
దేశంలో కో ఆపరేటివ్ సెక్టార్ ఇప్పుడు ఏ స్థితి లో ఉన్నది? కో ఆపరేటివ్‌ల విజయ గాథలకు కారణమైన ముఖ్యాంశాలేవి?

కో ఆపరేటివ్ సోసైటీలు వ్యవస్థాపరమైన సంస్థలతో ఎదుర్కొంటున్న ఇబ్బందులేవి? కో ఆపరేటివ్‌లతో చిన్న, సన్నకారు రైతులు, వృత్తి కార్మికులకు లాభం జరుగుతుందా? కో ఆపరేటివ్‌లతో ప్రజ ల భాగస్వామ్యం పెరిగి ఉమ్మడి తత్వం పెరుగుతున్నదా, దీంతో పర్యావరణానికి ఏ మేలు జరుగుతున్నది? వినియోగ దారులకు లాభం జరుగుతున్నదా లేదా? కో ఆపరేటివ్‌లు ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాలుగా చెప్పుకోవచ్చా? తెలంగాణలో కో ఆపరేటివ్‌ల నిర్వహణలో అనుభవాలు, గుణపాఠాలు ఏమిటి? ఇలా.. వీటన్నింటికి సమాధానాలు రాబడితే.. తెలంగాణ అభివృద్ధిలో కో ఆపరేటివ్‌ల పాత్ర, నిర్వహణకు సంబంధించి విలువైన పాఠాలు తీసుకోవచ్చు.

1189

RAMESH CHENNAMANENI

Published: Mon,July 30, 2018 11:24 PM

విధ్వంసరహిత వృద్ధి అసాధ్యమా?

ప్రపంచంలో పర్యావరణాన్ని విధ్వంసం చేయకుండా ప్రజలకు ఆహారాన్ని చాలినంత అందించలేమా? ఇది ఈ మధ్య జర్మనీలోనిబెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఆహా

Published: Mon,January 29, 2018 11:04 PM

వందశాతం ఎఫ్‌డీఐలతో అల్లకల్లోలమే

ప్రస్తుత వంద శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి విధానం కారణంగా పట్టణ, గ్రామీణ చిన్నతరహా వ్యాపార రంగమే తీవ్రంగా ప్రభావితం కాబోతున్నది. ఈ క్రమలో

Published: Tue,May 2, 2017 08:39 AM

రాష్ట్ర వ్యవసాయానికి పునరుజ్జీవం

చిన్న, సన్నకారు రైతులతో కూడి ఉన్న తెలంగాణ వ్యవసాయరంగం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో పూర్తిగా స్వరూప స్వభావాలను మార్చుకోనున్నది.

Published: Thu,May 5, 2016 01:29 AM

ప్రమాదకర స్థితిలో పర్యావరణం

వేడి గాడుపులను నివారించేందుకు విస్తృతంగా చెట్లను నాటడమే కాదు కాలుష్యాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి. చల్లదనాన్నిచ్చే నిర్మాణాలకు

Published: Fri,January 10, 2014 02:06 AM

జనతన సర్కార్ వెలుగులో కాళోజీ..

తెలుగు సాహిత్యంలోనేగాక, సామాజిక జీవితంలో కూడా నూరేళ్ల అరుదైన వ్యక్తిత్వం కాళోజీ. అధీకృత హింసకు వ్యతిరేకం గా నిలిచిన కలం ఆయనది. ‘ప్

Published: Sun,April 28, 2013 11:43 PM

చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ నేతలు

ఎంపీ వివేక్ ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల భేటీ. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. ఇది బ్రేకింగ్ న్యూస్. ఈ న్యూస్‌ను మూడ

Published: Sat,October 6, 2012 04:18 PM

లక్ష్మణరేఖ గీయవలసిందే!

‘నిన్న జరిగిన కాంగ్రెస్ ప్రజావూపతినిధుల సమావేశంపై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూశారు. కానీ వారి ఆశలు నిరాశలయ్యా యి. కాంగ్రెస్

Published: Sat,October 6, 2012 04:18 PM

రాజకీయ అస్తిత్వంవైపు..

ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఓటరు మహాశయుడే తన నిర్ణయాన్ని ప్రకటించాలి. ఎన్నికల ఫలితాలు రాకముందే వాటి రాజకీయ ప్రభావం గురించి మా

Published: Sat,October 6, 2012 04:19 PM

చరిత్ర మరిచిన ప్రణబ్ ముఖర్జీ

రాష్ట్ర ఏర్పాటు గురించి తెలంగాణ ప్రజలంతా సకల జనుల సమ్మెతో సత్యాక్షిగహ పోరాటం చేస్తుంటే.పణబ్ ముఖర్జీ చరివూతను మరి చి , బాధ్యతారాహిత

Published: Sat,October 6, 2012 04:19 PM

నవ తెలంగాణ సాధన కోసం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమం దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలలో ఒక ఆణిముత్యంగా నిలుస్తది. ఒక్క