చరిత్ర మరిచిన ప్రణబ్ ముఖర్జీ


Sat,October 6, 2012 04:19 PM

రాష్ట్ర ఏర్పాటు గురించి తెలంగాణ ప్రజలంతా సకల జనుల సమ్మెతో సత్యాక్షిగహ పోరాటం చేస్తుంటే.పణబ్ ముఖర్జీ చరివూతను మరి చి , బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. మొదటి ఎస్‌ఆర్‌సీ మొదలుకొని, ఆరు సూత్రాల పథకం, అభివృద్ధికి సంబంధించిన సమస్యలను లేవనెత్తి ‘రాష్ట్ర ఏర్పాటు అంత తేలిక కాద’ని చెప్పుకొచ్చారు. ‘తెలంగాణ సమస్య చాలా సున్నితమైనదని, అరవై ఏళ్లుగా నానుతున్న క్లిష్టమైన సమస్య’ అని ప్రణబ్ అన్నారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి.. ‘దేశంలో రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి ఓ నిర్ధిష్ట విధానమంటూ లేద’ని అన్నారు. ప్రణబ్ ముఖర్జీ లాంటి సీనియర్ నేత నోట ఇలాంటి మాటలు రావడం నిజంగా దురదృష్టం. మొదటి రాష్ట్రాల పునర్విభజన కమిషన్ (ఫజల్ అలీ కమిషన్) అభివూపాయాలూ, ఆరు సూత్రాల పథకం, పెద్ద మనుషుల ఒప్పందం లాంటి వాటన్నింటినీ సీమాంధ్ర పాలకులు తుంగలో తొక్కారు. అంతేకాదు ఈ అరవై ఏళ్ల కాలంలో అభివృద్ధి విషయంలో తెలంగాణను పూర్తిగా నిర్ల క్ష్యం చేశారు. ఈక్రమంలో.. ప్రణబ్‌ముఖర్జీ కారణాలను పరిణామాలను కలిపేశారు. కార్యకారణ సంబంధాలను మరిచి ప్రస్తుతమున్న తెలంగాణ సమస్యను చారివూతక సమస్యగా గాక ఓ తేలికపాటి సమస్యగా చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు సుదీర్ఘకాలంగా చేస్తున్న తెలంగాణ డిమాండ్, దాని చారివూతక నేపథ్యం, న్యాయబద్ధత చూడకుండా..కేవలం సున్నితమైనదని తప్పించుకో జూస్తున్నారు. అంతే కాదు.. అరవై ఏళ్లుగా నానుతున్న సమస్యకు కారణమైన కాంగ్రెస్ పార్టీ అసలు నిజాన్ని దాచాలని చూస్తోంది. దృగ్గోచర ప్రపంచంలో ప్రతి ఘటన వెనకా ఓ కారణముంటుందని గ్రీకు తత్వవేత్తలనుంచి, ఆధునిక శాస్త్రవేత్త ఐన్‌స్టయిన్ దాకా తెలిపారు.

ఇలా తార్కిక, శాస్త్రీయ దృక్పథాన్ని మరచి తెలంగాణ సమస్యకు కూడా చారివూతక నేపథ్యం, ఓ న్యాయబద్ధత ఉందన్న విషయాన్ని గుర్తించనిరాకరించడం బాధ్యతారాహిత్యం గాక మరేమి అవుతుంది? రెండో ముఖ్యమైన విషయమేమంటే.. తెలంగాణ సమస్యలో అసలు దోషి కాంగ్రెస్ పార్టీ. అరవై ఏళ్లుగా తెలంగాణ సమస్యను నాన్చుతూ ఉన్న పార్టీ నాయకుడిగా..అది పాత సమస్య అనడం అసంబద్దం. అలాగే తెలంగాణ సమస్య పరిష్కారం కోసం ఇతని నాయకత్వంలోనే ఏర్పడ్డ కమిటీ కూడా ఏపరిష్కారం చూపక పోగా.. ఇప్పుడు దానిని సంక్లిష్ట సమస్య అనడం ఎంతవరకు సబబో ఆయనకే తెలియాలి. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు గానీ, చిదంబరం డిసెంబర్ ప్రకటన గానీ..ఆతర్వాత సీమాంధ్ర పెట్టుబడిదారులకు లొంగి తెలంగాణ ఏర్పాటు ప్రకటన వెనక్కి తీసుకోవడం..,ఆతర్వాత పరిణామాలకు అన్నింటికీ.. కాంగ్రెస్ పార్టీదే బాధ్యత కాదా?

మూడో ముఖ్య విషయం ఏమంటే.. సమకాలీన భారతదేశ చరివూతకు సంబంధించి చాలా అజ్ఞానంగా మాట్లాడారు. స్వాతంవూత్యానంతర కాలం లో.పజాస్వామీకరణ, కేంద్రీకరణ, ఏకీకరణలలో.. దేశం అనేక మార్పులకు లోనైంది. అనేక భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు ప్రకారం ప్రజల ఆకాంక్షలు, ఒత్తిడి మేరకు అనేక కొత్త రాష్ట్రాలు ఉనికిలోకొచ్చాయి. ఈ నేపథ్యం అంతా లేకుంటే.. ఇప్పు డు దేశంలో 28 రాష్ట్రాలు ఎలా ఉన్నాయి? ఈ సందర్భంలోనే భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి పార్లమెంటులో చర్చ జరుగుతున్న సందర్బంగా రాసిన లేఖను ఇక్కడ ఉల్లేఖించడం సముచితంగా ఉంటుదనుకుంటున్నాను. తనకు జ్వరంగా ఉండటంతో పార్లమెంటుకు హాజరు కాలేక పోతున్నందుకు విచారం వ్యక్తం చేస్తూ..అతిముఖ్యమైన చర్చకు తన అభివూపాయాలను తెలుపుతూ అంబేద్కర్ లేఖ రాశారు. 55 ఏళ్ల కిందటి దైనా.. అది ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా అదే సమాధానంగా ఉంటుందని భావిస్తూ..ఆ లేఖ సంక్షిప్త పాఠాన్ని ఉదహరిస్తున్నాను.

‘ ప్రియమైన ప్రతినిధులారా!
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అనేది ఈరోజు చాలా తక్షణ సమస్య. ప్రజల ఆకాంక్షల నేపథ్యంలో దేశంలో రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి పార్లమెంటులో చర్చ జరుగుతున్నప్పుడు జ్వరంతో రాలేక పోతున్నందుకు విచారిస్తున్నాను. ఓ ముఖ్యమైన చర్చ జరుగుతున్నప్పుడు విషయం తెలసిన వాడిగా మౌనంగా ఉండటం నేరం. అందుకోసం నేను నా అభివూపాయాలను సభ్యులతో పంచుకోవడానికి ఈ లేఖ రాస్తున్నాను. రాష్ట్రాల పునర్విభజన కమిషన్ రిపోర్టు చూసిన తర్వాత గతంలో నాకున్న అభివూపాయాలను కొన్నింటిని ఇంకింత పరిపుష్టం చేసుకొని ఇవి తెలుపుతున్నాను. గతంలో నేను వెలిబుచ్చిన అభివూపాయాలకు ఇవి కొం త భిన్నంగా ఉన్నా అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సమగ్ర పరిశీలన, అధ్యయనం తర్వాత ఇవి వెలిబుచ్చుతున్నాను. కొంత మంది స్థిరత్వం పేరుమీద అభివూపాయాలను మార్చుకోకూడదని అంటారు. ఇది పూర్తిగా అశాస్త్రీయం. అసంబద్దం. నా మటుకు నేను స్థిరత్వం పేరుమీద అభివూపాయాలను మార్చుకోకుండా కాలంచెల్లిన అభివూపాయాలనే పట్టుకు వేలాడను. నిత్య నూతనంగా, శాస్త్రీయంగా.. ఎప్పటికప్పుడు అభివూపాయాలను మార్చుకుంటూ.. భావాలను ఉన్నతీకరించుకుంటూ జ్ఞానాన్ని పొందుతాను.

ఓ బాధ్యత గల వ్యక్తిగా అది నా బాధ్యత కూడా. బాధ్యతాయుత వ్యక్తి తప్పకుండా.. భావాలను మార్చుకోవడానికీ, ఆలోచించడానికి ధైర్యం చేయాలి. నేర్చుకోవడానికి సిద్ధంగా లేని వాడెప్పుడూ జ్ఞనాన్ని పొందలేడు. జ్ఞానానికి తుది ఉండకూడదు.భాషావూపయుక్త రాష్ట్రాల ఏర్పాటు అత్యావశ్యకం. అయితే.. ఇది ఇంకే పడికట్టు విధానాలతోనో, పార్టీ ప్రయోజనాల కొరకో నిర్ణయాలు తీసుకోరాదు. ఇది ఆ నిర్ధిష్ట ప్రాంతంలోని భూమి పువూతుల ఆకాంక్షల మేరకు నిర్ణయాలు తీసుకోవాలి. ఈ దృక్పథంతోనే నేనీ అభివూపాయాలను రాస్తున్నాను. సౌలభ్యం కోసం రాష్ట్రాల పునర్విభజనకు సంబంధించి కింది విధంగా సంక్షిప్తీకరిస్తున్నాను. సంయుక్త రాష్ట్రం అనే భావననే ముందుగా మనం విడనాడాలి. ప్రతి రాష్ట్రం తప్పకుండా ఒకే భాష ప్రాతిపాదికగా ఉండాలి. ఒక భాష , ఒకరాష్ట్రం విధానంగా ఉండాలి. ఇక్కడ ఒకే భాష, ఒకే రాష్ట్రం అనేదానిని చూసి తికమక పడవద్దు. ‘ఒకే భాష ఒకే రాష్ట్రం’ అనే సూత్రం ప్రకారం ఒక నిర్దిష్ట ప్రాంతంలోని ప్రజలంతా ఒకే భాష మాట్లాడుతున్న వారంతా ఒకే పాలన కింద ఉండాలన్నది విధానం. ఈ విధానం వెలుగులోనే.. ఐక్య మహారాష్ట్ర ఏర్పాటు ఉద్యమం వచ్చింది.

ఇది శిలా శాసనం ఏమీ కాదు. ఒకే భాష మాట్లాడే ప్రజలంతా.. వివిధ ప్రాంతాలలో వేరు వేరు రాష్ట్రాలుగా కూడా ఏర్పడవచ్చు. ఒకే భాష మాట్లాడుతూ వేరు వేరు రాష్ట్రాలుగా ఏర్పడేటప్పుడు ఏది ప్రాతిపదికగా తీసుకోవాలి అంటే.. ప్రజల సెంటిమెంట్లు, మెజారిటీ, మైనారిటీ నిష్పత్తితో పాటు.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పాలనా పరమైన అవసరాలు తీర్చగల ప్రాంతమైతే చాలు రాష్ట్రంగా ఏర్పాటు చేయవచ్చు. పాలనా పరమైన సౌలభ్యం కొరకైనా.. రాష్ట్రాలు చిన్నవిగా ఉంటేనే మేలు.’
ఇదీ అంబేద్కర్ భాషావూపయుక్త రాష్ట్రాల ఏర్పాటు గురించి రాసిన లేఖ.

ఈ అభివూపాయాల వెలుగులోనే రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రణబ్ ముఖర్జీ గారి అభివూపాయాలు అసంబద్ధమైనవని చెప్పడానికి ఈ లేఖ చాలనుకుంటాను. తెలంగాణ ఉద్యమం చాలా ప్రజాస్వామికమైన ఉద్యమం. 60 ఏళ్లుగా న్యాయం కోసం తెలంగాణ ప్రజలు పోరాడుతున్నారు. రాజకీయ, ఆర్థిక, సాంఘిక కారణాల రీత్యా చూసినా.. తెలంగాణ పోరాటం ధర్మపోరాటం. అంబేద్కర్‌పై ఏమాత్రం గౌరవం ఉన్నా.. తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించి వెంటనే తెలంగాణ ఏర్పాటు చేయాలి.

-డా. రమేష్ చెన్నమనేని, ఎమ్మెల్యే

35

RAMESH CHENNAMANENI

Published: Mon,July 30, 2018 11:24 PM

విధ్వంసరహిత వృద్ధి అసాధ్యమా?

ప్రపంచంలో పర్యావరణాన్ని విధ్వంసం చేయకుండా ప్రజలకు ఆహారాన్ని చాలినంత అందించలేమా? ఇది ఈ మధ్య జర్మనీలోనిబెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఆహా

Published: Mon,January 29, 2018 11:04 PM

వందశాతం ఎఫ్‌డీఐలతో అల్లకల్లోలమే

ప్రస్తుత వంద శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి విధానం కారణంగా పట్టణ, గ్రామీణ చిన్నతరహా వ్యాపార రంగమే తీవ్రంగా ప్రభావితం కాబోతున్నది. ఈ క్రమలో

Published: Tue,May 2, 2017 08:39 AM

రాష్ట్ర వ్యవసాయానికి పునరుజ్జీవం

చిన్న, సన్నకారు రైతులతో కూడి ఉన్న తెలంగాణ వ్యవసాయరంగం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో పూర్తిగా స్వరూప స్వభావాలను మార్చుకోనున్నది.

Published: Thu,May 5, 2016 01:29 AM

ప్రమాదకర స్థితిలో పర్యావరణం

వేడి గాడుపులను నివారించేందుకు విస్తృతంగా చెట్లను నాటడమే కాదు కాలుష్యాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి. చల్లదనాన్నిచ్చే నిర్మాణాలకు

Published: Thu,March 31, 2016 01:24 AM

సహకార సంఘాలే దిక్కు

ఎక్కడైతే.. విజయవంతంగా ప్రజల కో ఆపరేటివ్స్ పనిచేశాయో అక్కడ మాత్రమే ఆర్థిక సంక్షోభ ప్రతిఫలనాలు పడలేదు. ప్రజలు ఇబ్బందుల పాలు కాలేదు.

Published: Fri,January 10, 2014 02:06 AM

జనతన సర్కార్ వెలుగులో కాళోజీ..

తెలుగు సాహిత్యంలోనేగాక, సామాజిక జీవితంలో కూడా నూరేళ్ల అరుదైన వ్యక్తిత్వం కాళోజీ. అధీకృత హింసకు వ్యతిరేకం గా నిలిచిన కలం ఆయనది. ‘ప్

Published: Sun,April 28, 2013 11:43 PM

చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ నేతలు

ఎంపీ వివేక్ ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల భేటీ. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. ఇది బ్రేకింగ్ న్యూస్. ఈ న్యూస్‌ను మూడ

Published: Sat,October 6, 2012 04:18 PM

లక్ష్మణరేఖ గీయవలసిందే!

‘నిన్న జరిగిన కాంగ్రెస్ ప్రజావూపతినిధుల సమావేశంపై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూశారు. కానీ వారి ఆశలు నిరాశలయ్యా యి. కాంగ్రెస్

Published: Sat,October 6, 2012 04:18 PM

రాజకీయ అస్తిత్వంవైపు..

ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఓటరు మహాశయుడే తన నిర్ణయాన్ని ప్రకటించాలి. ఎన్నికల ఫలితాలు రాకముందే వాటి రాజకీయ ప్రభావం గురించి మా

Published: Sat,October 6, 2012 04:19 PM

నవ తెలంగాణ సాధన కోసం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమం దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలలో ఒక ఆణిముత్యంగా నిలుస్తది. ఒక్క

Featured Articles