నవ తెలంగాణ సాధన కోసం


Sat,October 6, 2012 04:19 PM

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమం దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలలో ఒక ఆణిముత్యంగా నిలుస్తది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఉద్యమానికి సకల జనుల వేదికను ఏర్పాటు చేయడంలో తెలంగాణ జేఏసీ సఫలీకృతమైంది. తెలంగాణ రాష్ట్రం రావడం తథ్యమైన ప్రస్తుత నేపథ్యంలో రాజకీయ జేఏసీ భవిష్యత్తు పయ నం ఎటువైపు ఉండాలే? సకల జనుల ఆశయాలను వమ్ము చేయకుండా ఎలాంటి వ్యూహ రచనకు దోహదపడాలే? అనే అంశాలపై చర్చకు ముందు రెండు ముఖ్యమైన ప్రశ్నలకు సరైన సమాధానాలు వెదకాలె.

1) రాజకీయ వేదికను ఏర్పాటు చేయడంలో జేఏసీ సఫలీకృతమవడానికి మూల కారణాలు, పరిణామాలు ఏమిటి?
2) ఈ రాజకీయ ఐక్య వేదిక రేపటి నవ తెలంగాణలో రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక సవాళ్లకు పటిష్టమైన పంథాలను రూపొందించడానికి ఏ ఉద్యమ పాఠాలను, అనుభవాలను అవలంబించాలె?
మన మొదటి ప్రశ్న రాజకీయ ఐక్య వేదికను ఏర్పాటు చేయడంలో జేఏసీ ఎలా సఫలీకృతమైంది అనే అంశానికి జవాబు రావాలంటే కనీసం మూడు కోణాలలో చూడాల్సి ఉంటుంది.

మొదటి కోణం: కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష, ఆ తరువాత డిసెంబర్ తొమ్మిది నాటి ప్రకటనను వమ్ము చేస్తూ 23 డిసెంబర్ చిదంబరం వేసిన రాజకీయ వెనుకడుగు టీఆర్‌ఎస్‌పార్టీలో కీలకమైన ఉద్యమ పంథా చర్చకు దారి తీసింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ పదకొండేళ్లుగా ఉద్యమ వ్యూహ రచనలో నిస్సందేహంగా దశదిశా నిర్దేశకుడిగా మెప్పు పొందారు. కేసీఆర్ వ్యవహారశైలిపై, ముక్కుసూటి తనంపై ముఖ్యంగా సీమాంధ్ర నేతలను అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శించడం పక్కనపెడితే, రాష్ట్రంలోనే కాదు దేశ ఉద్యమ చరివూతలోనే కేసీఆర్ రాజకీయ పరిణతకు జేజేలు కొట్టక తప్పదు. 2004, 2009లలో రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీల తో పొత్తు కుదుర్చుకొని, ఆ పార్టీల ఎన్నికల ప్రణాళికలో తెలంగాణను చేర్పించింది టీఆర్‌ఎస్ పార్టీ. అయితే ఈ ఎన్నికల ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రయత్నించి భంగపడ్డది టీఆర్‌ఎస్.

కేసీఆర్‌కు అది పెద్ద రాజకీయ చేదు అనుభవం. దాని పర్యవసానమే ఆయన చేసిన చరివూతాత్మక ఆమరణ నిరాహారదీక్ష. అయితే ఆ దీక్ష ఫలితాలను సీమాంవూధు లు చిదంబరంచే వమ్ము చేయించిన పిదప టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు రాష్ట్ర సాధన పంథాను రచించడం పెను సవాలుగా మారింది. అయి తే ఈ చరివూతాత్మక సమయంలో కేసీఆర్ ఒక చరివూతాత్మక నిర్ణయం తీసుకున్నారు. జేఏసీ నాయకత్వం ద్వారానే సకల జనుల ప్రజా ఉద్యమం సాధ్యమవుతుందన్న గట్టి నమ్మకం తో తెలంగాణ జేఏసీకి పునాదులు వేయడం లో కీలక పాత్ర పోషించారు. ఆయన తీసుకు న్న పంథా తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ కేంద్ర ప్రకటనను ప్రజా ఉద్యమం ద్వారా అమలు చేయడం ఒక ఎత్తయితే, రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీడీపీల విశ్వసనీయతను ప్రజా ఉద్యమ వేదికపై పరీక్షకు పెట్ట డం రెండో ఎత్తుగడ. ఇది కేసీఆర్ తన 2004, 2009ల పొత్తు అనుభవంలో నుంచి నేర్చుకున్న పాఠాల పర్యవసానమే!

నిక్కచ్చిగా చెప్పాలంటే అటు బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్షికసీ వంటి రాజకీయ పక్షాలతో పాటు ఉద్యోగ (గెజిటెడ్, నాన్ గెజిటెడ్), ఉపాధ్యాయ, మహిళా, విద్యార్థి, యువజనులు, మేధావులు, జర్నలిస్టులు, ప్రజా సంఘా లు, కళాకారుల తోడ్పాడు తెలంగాణ జేఏసీకి ఊపిరి పోసింది. తెలంగాణ ఉద్యమానికి కీలకమైన ఈ ప్రక్రియను అత్యంత ప్రజాస్వామ్యంగా తీర్చిదిద్దడంలో ప్రొఫెసర్ కోదండరాం, మల్లేపల్లి లక్ష్మయ్య ఇతర సర్వ సభ్య సమా జ నేతల కృషి చరివూతాత్మకం. రాజకీయ పరిణతితో పాటు తెలంగాణ ప్రజాసమస్యలపై కొన్ని దశాబ్దాలుగా వీరందరికి ఉన్న లోతైన రాజకీయ, సామాజిక అనుభవం, పోరాట అవగాహన ఇందుకు ఉపయోగపడింది. తెలంగా ణ విముక్తి ఉమ్మడి లక్ష్యం కోసం బీజేపీ, కమ్యూనిస్టుల కలయిక అసాధార ణ విశేషం. తెలంగాణ రాష్ట్ర సాధన ప్రజాస్వామ్యయుతమైనదని తమ కీలకమైన సిద్ధాంతాలను, పంథాలను పక్కన పెట్టారు. కాంగ్రెస్, టీడీపీలు నేటి వరకు కూడా తమ విశ్వసనీయతను ప్రజల ముందు నిరూపించుకోలేకపోయాయి. అందుకే తెలంగాణ జేఏసీ వాళ్లకు పక్కలో బల్లెంగా మారింది.
పైన వివరించిన పంథాలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సాధన కీలక దశకు చేరుకున్న విషయం మనందరికి తెలిసిందే.

అయితే నేటి సకల జనుల చైత న్యం, ఉద్యమ సందేశాల నుంచి రాజకీయ జేఏసీ, పార్టీ భాగస్వాములు నేర్చుకోవలసింది ఏమిటి? తెలంగాణ వాదులు అత్యంత ప్రజాస్వామ్యవాదులు. సాంఘిక సమస్యలపైన లోతైన అవగాహనను ఉద్యమంలో భాగం గా అలవర్చుకున్నారు. పటిష్టమైన రాజకీయ పంథాలేని రాజకీయ పార్టీల ను పార్టీ నాయకులను ఎన్నికల్లోనే కాదు, ఏ ప్రజా వేదికపైన కూడా నిలదీ సే ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని ఇముడ్చుకున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రం నిజంగా సకల జనుల కోసం అంటే వారి రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక బహుముఖ అభివృద్ధికి దోహదం చేయాలంటే తెలంగాణ జేఏసీ నవ తెలంగాణలో సకల జనుల ప్రభుత్వాన్ని ఏర్పాటు సాధించడంలో కీలకమైన రాజకీయ పాత్ర పోషించాల్సి ఉంటుంది. అందుకోసం నాలుగు ముఖ్యమైన అంశాలపై తెలంగాణ జేఏసీ తమ భాగస్వాములందరితో భవిష్యత్తు వ్యూహరచనలు ప్రారంభించాలి.

1) అరవై ఏళ్లుగా తెలంగాణ సాధన విఫలమవడానికి మూల కారణం ఈ ప్రాంతంలో నిస్వార్థ, స్వతంత్ర, ప్రజా సంక్షేమం కోరే పటిష్టమైన నాయకత్వం లేకపోవడం. సాధించిన తెలంగాణను స్వార్థపూరిత రాజకీయ నాయకులకు వారి కూటములకు అప్పజెప్పడం చారివూతక తప్పిదం అవుతుంది. ఈ సమస్య పరిష్కారం అంత సులభమైనది కాదని మనకు అనిపించవచ్చు. కానీ నేడు తెలంగాణలోని పది జిల్లాలో జేఏసీ ఆధ్వర్యంలో అద్భుతమైన రాజకీయ లక్షణాలు గల యువనాయకత్వం పుట్టింది. అన్నిటికంటే ముఖ్యంగా వీళ్లందరికీ బ్రహ్మాండమైన ప్రజాదరణ ఉన్నది. చైతన్యవంతమైన ప్రజలు నోట్లకు ఆశపడకుండా ఉప ఎన్నికలలో త్యాగధనులనే ఎన్నుకున్నా రు. రేపటి తెలంగాణ పునర్ నిర్మాణం కోసం వారు ప్రజా సంక్షే మం కోరే నాయకులనే ఎన్నుకుంటారు. ఈ అంశం తెలంగాణ రాష్ట్ర సాధన ఎంత ముఖ్యమో ఈ నూతన నాయకత్వాన్ని రాజకీ య జేఏసీ తెరపైకి తేవడం అంతే ముఖ్యం.

భవిష్యత్ తెలంగాణపైన సకల జనులందరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా వ్యవసాయం (సాగునీటి ప్రాజెక్టులు, పునరావాస సమస్యలు), చేతి వృత్తుల వారి ప్రోత్సాహం (చేనేత, పవర్‌లూంతో సహా) సహకార సంస్థలకు ప్రోత్సాహం, ప్రజల భాగస్వామ్యంగా నూతన పారిక్షిశామికాభివృద్ధి పంథా, ఉద్యోగులకు న్యాయం, ఉద్యోగావకాశాలు కల్పించడం, మహిళలకు వడ్డీలివ్వడమే కాక శాశ్వతమైన జీవనోపాధి కల్పించడం, ప్రజా విద్య, వైద్యం, రవాణా, విద్యుత్తు, తెలంగాణ సాంస్కృతిక పునరుద్ధరణ తదితర రంగాలపై కీలక దృష్టి పెట్టాలి. ఇలాంటి ‘విజన్’ తయారీ కోసం ఇది వరకే టీడీఎఫ్ తదితర ప్రజా సంఘాలు అత్యం త విలువైన ముసాయిదాలు తయారు చేశా యి. వాటిని ప్రజల ముందు చర్చకు పెట్టాలి. ప్రజలే తుది నిర్ణేతలుగా పథకాలను రూపొందించాలి.

తెలంగాణకు గత అరవై సంవత్సరాలుగా కాక నూతన ఆర్థిక విధానాల ముసుగులో ఇరవయి సంవత్సరాలుగా సెజ్‌ల పేరిట, భూము ల అన్యాక్షికాంతం ద్వారా, జలయజ్ఞం ద్వారా, గ్రానైడ్ మాఫియా, ఇసుక మాఫియా, ఓపెన్‌కాస్ట్‌ల ద్వారా లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది. ఇంకా అవుతున్నది. అత్యంత విలువైన ఈ ప్రజాధనాన్ని, పర్యావరణాన్ని మళ్లీ సమకూర్చి ప్రజల ఆస్తిగా వచ్చే తరాల కోసం భద్రపరుచుకోవడం కోసం పటిష్టమైన చట్టాలు అమలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
తెలంగాణ రాష్ట్ర సాధన వల్ల మన ప్రాంత అభివృద్ధికి మన పాలనతో ఎంతో గొప్ప సదవకాశం లభిస్తుంది.

గ్రామీణ సర్వతోముఖాభివృద్ధికి, గ్రామాల స్వావలంబన కోసం, రాష్ట్ర గ్రామీణ బడ్జెట్‌ను గ్రామాలకు వికేంవూదీకరించడం అంత కంటే గొప్ప సదవకాశం. 72,73 రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రం ఇది వరకే ఈ దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం రాష్ట్రాలకు కల్పించింది. తెలంగాణ గ్రామాలు భవిష్యత్తులో ఆర్థికంగా, సాంఘికంగా, సాంస్కృతికం గా తమ స్వపరిపాలనను సార్థకం చేసుకొని తమ వైభవాన్ని చాటుకోవాలంటే ఈ అంశాలపై నవ తెలంగాణ సకల జనుల ప్రభు త్వం తమ మొట్టమొదటి సంతకం పెట్టాలి.

-డాక్టర్ చెన్నమనేని రమేశ్
శాసనసభ్యులు

35

RAMESH CHENNAMANENI

Published: Mon,July 30, 2018 11:24 PM

విధ్వంసరహిత వృద్ధి అసాధ్యమా?

ప్రపంచంలో పర్యావరణాన్ని విధ్వంసం చేయకుండా ప్రజలకు ఆహారాన్ని చాలినంత అందించలేమా? ఇది ఈ మధ్య జర్మనీలోనిబెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఆహా

Published: Mon,January 29, 2018 11:04 PM

వందశాతం ఎఫ్‌డీఐలతో అల్లకల్లోలమే

ప్రస్తుత వంద శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి విధానం కారణంగా పట్టణ, గ్రామీణ చిన్నతరహా వ్యాపార రంగమే తీవ్రంగా ప్రభావితం కాబోతున్నది. ఈ క్రమలో

Published: Tue,May 2, 2017 08:39 AM

రాష్ట్ర వ్యవసాయానికి పునరుజ్జీవం

చిన్న, సన్నకారు రైతులతో కూడి ఉన్న తెలంగాణ వ్యవసాయరంగం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో పూర్తిగా స్వరూప స్వభావాలను మార్చుకోనున్నది.

Published: Thu,May 5, 2016 01:29 AM

ప్రమాదకర స్థితిలో పర్యావరణం

వేడి గాడుపులను నివారించేందుకు విస్తృతంగా చెట్లను నాటడమే కాదు కాలుష్యాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి. చల్లదనాన్నిచ్చే నిర్మాణాలకు

Published: Thu,March 31, 2016 01:24 AM

సహకార సంఘాలే దిక్కు

ఎక్కడైతే.. విజయవంతంగా ప్రజల కో ఆపరేటివ్స్ పనిచేశాయో అక్కడ మాత్రమే ఆర్థిక సంక్షోభ ప్రతిఫలనాలు పడలేదు. ప్రజలు ఇబ్బందుల పాలు కాలేదు.

Published: Fri,January 10, 2014 02:06 AM

జనతన సర్కార్ వెలుగులో కాళోజీ..

తెలుగు సాహిత్యంలోనేగాక, సామాజిక జీవితంలో కూడా నూరేళ్ల అరుదైన వ్యక్తిత్వం కాళోజీ. అధీకృత హింసకు వ్యతిరేకం గా నిలిచిన కలం ఆయనది. ‘ప్

Published: Sun,April 28, 2013 11:43 PM

చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ నేతలు

ఎంపీ వివేక్ ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల భేటీ. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. ఇది బ్రేకింగ్ న్యూస్. ఈ న్యూస్‌ను మూడ

Published: Sat,October 6, 2012 04:18 PM

లక్ష్మణరేఖ గీయవలసిందే!

‘నిన్న జరిగిన కాంగ్రెస్ ప్రజావూపతినిధుల సమావేశంపై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూశారు. కానీ వారి ఆశలు నిరాశలయ్యా యి. కాంగ్రెస్

Published: Sat,October 6, 2012 04:18 PM

రాజకీయ అస్తిత్వంవైపు..

ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఓటరు మహాశయుడే తన నిర్ణయాన్ని ప్రకటించాలి. ఎన్నికల ఫలితాలు రాకముందే వాటి రాజకీయ ప్రభావం గురించి మా

Published: Sat,October 6, 2012 04:19 PM

చరిత్ర మరిచిన ప్రణబ్ ముఖర్జీ

రాష్ట్ర ఏర్పాటు గురించి తెలంగాణ ప్రజలంతా సకల జనుల సమ్మెతో సత్యాక్షిగహ పోరాటం చేస్తుంటే.పణబ్ ముఖర్జీ చరివూతను మరి చి , బాధ్యతారాహిత

Featured Articles