జనతన సర్కార్ వెలుగులో కాళోజీ..


Fri,January 10, 2014 02:06 AM

తెలుగు సాహిత్యంలోనేగాక, సామాజిక జీవితంలో కూడా నూరేళ్ల అరుదైన వ్యక్తిత్వం కాళోజీ. అధీకృత హింసకు వ్యతిరేకం గా నిలిచిన కలం ఆయనది. ‘ప్రతిహింస తప్పెట్టౌనో చెప్పు. .హిరణ్యకశిపుడు పొట్ట చీల్చి..నరసింహుడు చేసిందీ ప్రతిహింస..’ అనేది ఆయన రాజకీయతాత్విక విశ్వాసం. అందుకే ప్రజా, విప్లవ పోరాటాల పట్ల దృఢంగా నిలబడే హింసాహింసల తిరుగు లేని స్పష్టత ఆయన సొంతం.


కాళోజీ శతజయంతి సందర్భంగా విరసం 24వ రాష్ర్ట మహా సభలు జనవరి11,12 తేదీల్లో హనుమకొండలో జరుగుతున్నా యి. భారత విప్లవోద్యమంలో వరంగల్‌కు ప్రత్యేకత ఉన్నట్లే విర సం చరివూతలో కూడా వరంగల్‌కు అలాంటి ప్రత్యేకత ఉన్నది. విరసం ఆవిర్భావ పూర్వరంగానికి దోహదపడ్డ ‘తిరగబడు’ కవుల సాహిత్యం, రాజకీయ సన్నాహాలు, కాళోజీ సంపాదకుడిగా ఆధు నిక సాహిత్యవేదిక ‘సృజన’ ప్రారంభం, నక్సల్బరీ, శ్రీకాకుళాల ప్రేరణతో ‘సృజన’ రక్త చలన సంగీతాన్ని వినిపించి ట్రిగ్గర్ మీది వేలుతో రమ్మని స్వాగతించడం వంటి సాహిత్య ప్రజా ఆచరణకు, విప్లవ సాహిత్యోద్యమ నిర్మాణరంగాలకు వరంగల్ కేంద్రమైంది. విరసంతోపాటు, విప్లవోద్యమంతోపాటు, ‘సృజన’ సమష్టి ఆలోచనా అన్వేషణా సాహిత్య కార్యకలాపాలతో ఎదిగిన రెండు తరా ల మేధో సృజనజీవులకు వరంగల్‌తో సజీవ సంబంధం ఉన్నది. ఈ వికాసం వెనుక వరంగల్, తెలంగాణ విప్లవోద్యమ నేపథ్యం ఉన్నది.

విరసం రాష్ర్ట స్థాయి నిర్మాణమే అయినా అప్పట్లో తిరుపతి, కావలి,విశాఖ, గుంటూరు, హైదరాబాదు, వరంగల్, అనంతపు రం పట్టణాలు విప్లవోద్యమ నేపథ్యం వల్ల కూడా ప్రధాన కేం ద్రాలుగా ఉండేవి. విరసం ఏర్పడ్డప్పుడు అప్పటికే సుప్రసిద్ధ రచయితలు సభ్యులుగా ఉన్నా, యువతరం నుంచి విప్లవ ఔత్సాహి క రచయితలకు తర్ఫీదు కోసం కూడా సాహిత్య పా నిర్వహించే పద్ధతి మొదలైంది.అట్లా మొదటి సాహిత్య పా 1973లో, ఎమ్జన్సీ తర్వాత 1979లో మరోసారి వరంగల్‌లో జరిగాయి. ఆ తర్వాత వరంగల్‌లో మళ్లీ రాష్ర్ట స్థాయి కార్యవూకమం ఈ 24వ మహాసభలే. ఈ చరిత్ర పొడవునా విప్లవ, విప్లవ సాహిత్యోద్యమ వైభవం, ప్రభావం మాత్రమే కాదు, దారుణ నిర్బం ధం కూడా వరంగల్‌కు తప్పలేదు. విరసంపై నిర్బంధంలో వరంగల్ విప్లవకవులు, రచయితలు, కళాకారులు అనుభవించిన అణచివేత అంతులేనిది. జెయిళ్లు, కోర్టులు సరేసరి. జ్ఞానేశ్వర్‌కీర్తి హత్యకే గురయ్యాడ

వరంగల్ విరసం కన్వీనర్‌గా పనిచేసిన కవి జనార్దన్ ఆ తర్వాత విప్లవోద్యమంలోకి వెళ్లి బూటకపు ఎన్‌కౌంటర్‌లో ఆమరుడయ్యాడు. విప్లవోద్యమంలో ఉంటూ శివసాగర్, సమువూదుడు, ఎమ్మెస్సార్‌లు తర్వాత విప్లవ కవిత్వంపై తనదైన ముద్ర వేసిన కౌముది కూడా వరంగల్‌లో పుట్టి మెదక్, విశాఖ విప్లవోద్యమంలో పనిచేస్తూ బూటకపు ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యాడు. జనార్దన్ విరసం సభ్యుడిగా విప్లవోద్యమంలోకి వెళి తే, కౌముది విప్లవోద్యమంలో ఉంటూ 1992 లో విరసం సభ్య త్వం తీసుకున్నాడు. ఈ చరిత్ర పొడవునా కాళోజీ తన దారిలో తాను విరసం వెంట నడిచారు. విరసంతో నడిచారు. మౌలికంగా ధిక్కరించేవాళ ్లపట్ల ఆయనకుండే ఆరాధన కేవలం భావావేశానికి సంబంధించిందే కాదు. బలమైన ప్రజాస్వామిక విలువల పునాది మీద తనలాంటి వ్యక్తిత్వం తనదే కాగల కాళోజీ తాత్విక దృక్పథంలోని బలం అది.


శ్రీకాకుళ పోరాట తాత్కాలిక ఓటమి తర్వాత చేపట్టిన విప్లవోద్యమ ప్రచారం, సాహిత్య రచన, మొత్తంగా అట్టడుగు ప్రజా విప్లవాచరణ తెలంగాణ మీదుగా దండకారణ్యానికి విస్తరించాయి. అందువల్లే ఈ మహాసభలను విరసం ప్రజా వూపత్యామ్నాయాల్లో నూరేళ్ల కాళోజీని చదవాల్సిన చారివూతక సందర్భంగా గుర్తించింది. అయితే ఆయన విశిష్టత ఏమంటే ఏ నిర్మాణంలో భాగం కాకపోవడమే కాదు, ఏనాడూ వ్యవస్థలో భాగం కాకపోవడమే ఆయ న జీవన సారాంశం.పైగా వ్యవస్థను ధిక్కరించే ఏ ప్రజావూపత్యా మ్నాయన్నయినా.. దానితో ఆయనకు ఏకీభావం ఉన్నా లేకపోయినా అది వ్యవస్థపై తిరుగుబాటు కాబట్టి దాన్నాయన గుండెకు హత్తుకున్నారు.గత నలభైఏళ్లలో భారతదేశంలో ముందుకు వచ్చి న ఉద్యమాలు, ఆందోళనలు, నూతన సిద్ధాంతాల్లో చాలా వరకు వ్యవస్థలో భాగమైపోయినా.. దానిపై ధిక్కారాన్ని, పోరాటాన్ని కొనసాగిస్తున్న శక్తులల్లో మావోయిస్టు ఉద్యమం కీలకం. గాంధే య కాళోజీని విరసం గౌరవించడానికి ఈ విలువ ప్రామాణికం.


ఆ ధిక్కారం ఒక విలువగా, తిరుగుబాటుగానే ఉండి ఉంటే పాలకులకు ఇంతగా భయం ఉండేది కాదు. అదొక నిర్మాణంగా, నూతన వ్యవస్థకు అవసరమైన దృక్పథంగా ఎదుగుతూ వచ్చి బూర్జువా వ్యవస్థకు ప్రత్యామ్నాయం ఇప్పటికి కూడా సాధ్యమే అనే భరోసా ఇవ్వడంతో అమెరికాతో సహా భారత పాలకవర్గానికి అంతరంగిక అభద్రతకు దారితీసింది. ఆ నిర్మాణం ఇవాళ క్రాంతికారీ విప్లవ జనతన సర్కార్. మావోయిస్టు పార్టీ 2008లో జనతన సర్కార్ విధాన ప్రకటన చేశాక ఆదివాసీ, గైరాదివాసీల కలయికగా, దండకారణ్యంలోని నాలుగు విప్లవకర వర్గాల నిర్మాణంగా ప్రజారాజ్యాధికార బీజరూపంలో ప్రారంభమైంది.

ఇది కొమరంబీం, గుండాదుర్ తదితరుల కాలం నాటి స్వ యం పాలనారూపాల కన్నా చాలా పరిణతి పొందినది. తీవ్రమైన వర్గపోరాటం నుంచి దండకారణ్యంలో జనతన సర్కార్ ఆవిర్భవించి పని చేస్తున్నది. వర్గపోరాటం అభివృద్ధి వేరుచేయలేని అం శాలేగా దండకారణ్యంలో కొనసాగుతున్నాయి. ఈ రెండూ వర్గ రాజకీయాల ఆధిక్యంలో, నిర్మాణపరంగా వాటికి ప్రతినిధి అయి న కార్మికవర్గ పార్టీ నాయకత్వంలో ఇవి కొనసాగుతున్నాయి.
సుదీర్ఘ భారత విప్లవోద్యమ ప్రయాణంలో జనతన సర్కార్ ఒక అభివృద్ధికర దశ. విప్లవ రచయితల సకల సాహిత్య కళాకలాపాలన్నీ ఈ చారివూతక దశను గుర్తెరిగి సాగవలసి ఉన్నది. అసలైన చరిత్ర నిర్మాణం కావడం, పునర్నిర్మాణం కావడం అనే అద్భుత సన్నివేశాన్ని ఆదివాసులు మావోయిస్టు రాజకీయాల నాయకత్వంలో నిర్మిస్తున్నారు.

విప్లవ రచయితల సంఘం సల్వాజుడుం కాలం నుంచి దండకారణ్యం విప్లవోద్యమం గురించి రాయడం, మాట్లాడటం, ప్రచారం చేయడం, సంఘీభావాన్ని కూడగట్టడం అనే ప్రధాన కర్తవ్యం నిర్వహిస్తోంది. తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగాల్లో జనతన సర్కార్ ప్రచారానికి ఈ మహాసభల్లో విరసం సమాయత్తమవుతోంది. తెలంగాణ కోసం కాళోజీ జీవితమంతా గొడవపడ్డప్పటికీ ఆయనను తెలంగాణ వాద కవిగా కుదించే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల క్రాంతికారీ జనతన సర్కార్ వెలుగులో నూరేళ్ల కాళోజీని చదువుకోవడమే ఇప్పుడాయనకు నివాళి. ఈ స్ఫూర్తిని చాటడానికే విరసం మహా సభలు వరంగల్‌లో జరుగుతున్నాయి.
-పాణి, విరసం

354

RAMESH CHENNAMANENI

Published: Mon,July 30, 2018 11:24 PM

విధ్వంసరహిత వృద్ధి అసాధ్యమా?

ప్రపంచంలో పర్యావరణాన్ని విధ్వంసం చేయకుండా ప్రజలకు ఆహారాన్ని చాలినంత అందించలేమా? ఇది ఈ మధ్య జర్మనీలోనిబెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఆహా

Published: Mon,January 29, 2018 11:04 PM

వందశాతం ఎఫ్‌డీఐలతో అల్లకల్లోలమే

ప్రస్తుత వంద శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి విధానం కారణంగా పట్టణ, గ్రామీణ చిన్నతరహా వ్యాపార రంగమే తీవ్రంగా ప్రభావితం కాబోతున్నది. ఈ క్రమలో

Published: Tue,May 2, 2017 08:39 AM

రాష్ట్ర వ్యవసాయానికి పునరుజ్జీవం

చిన్న, సన్నకారు రైతులతో కూడి ఉన్న తెలంగాణ వ్యవసాయరంగం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో పూర్తిగా స్వరూప స్వభావాలను మార్చుకోనున్నది.

Published: Thu,May 5, 2016 01:29 AM

ప్రమాదకర స్థితిలో పర్యావరణం

వేడి గాడుపులను నివారించేందుకు విస్తృతంగా చెట్లను నాటడమే కాదు కాలుష్యాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి. చల్లదనాన్నిచ్చే నిర్మాణాలకు

Published: Thu,March 31, 2016 01:24 AM

సహకార సంఘాలే దిక్కు

ఎక్కడైతే.. విజయవంతంగా ప్రజల కో ఆపరేటివ్స్ పనిచేశాయో అక్కడ మాత్రమే ఆర్థిక సంక్షోభ ప్రతిఫలనాలు పడలేదు. ప్రజలు ఇబ్బందుల పాలు కాలేదు.

Published: Sun,April 28, 2013 11:43 PM

చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ నేతలు

ఎంపీ వివేక్ ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల భేటీ. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. ఇది బ్రేకింగ్ న్యూస్. ఈ న్యూస్‌ను మూడ

Published: Sat,October 6, 2012 04:18 PM

లక్ష్మణరేఖ గీయవలసిందే!

‘నిన్న జరిగిన కాంగ్రెస్ ప్రజావూపతినిధుల సమావేశంపై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూశారు. కానీ వారి ఆశలు నిరాశలయ్యా యి. కాంగ్రెస్

Published: Sat,October 6, 2012 04:18 PM

రాజకీయ అస్తిత్వంవైపు..

ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఓటరు మహాశయుడే తన నిర్ణయాన్ని ప్రకటించాలి. ఎన్నికల ఫలితాలు రాకముందే వాటి రాజకీయ ప్రభావం గురించి మా

Published: Sat,October 6, 2012 04:19 PM

చరిత్ర మరిచిన ప్రణబ్ ముఖర్జీ

రాష్ట్ర ఏర్పాటు గురించి తెలంగాణ ప్రజలంతా సకల జనుల సమ్మెతో సత్యాక్షిగహ పోరాటం చేస్తుంటే.పణబ్ ముఖర్జీ చరివూతను మరి చి , బాధ్యతారాహిత

Published: Sat,October 6, 2012 04:19 PM

నవ తెలంగాణ సాధన కోసం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమం దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలలో ఒక ఆణిముత్యంగా నిలుస్తది. ఒక్క