శాసనకర్తలకు విద్య అవసరం లేదా?


Sat,December 19, 2015 12:48 AM

ఎంపీలు, ఎమ్మెల్యేలు.. చట్టసభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరించాలి. ప్రజలకు కావాల్సినవి సాధించాలి. ప్రజలకు మంచి జీవితాన్నందించడం కోసం పాలనా విధానాల్లో మార్పులు, సంస్కరణలు తేవాలి. ప్రజలకు కూడు, గూడు, గుడ్డ, నీరు అందించే బాధ్యత నిర్వర్తించాలి.ఇవన్నీ భవష్యత్ దర్శనంతో సాధించాలంటే.. శాసనకర్తలు వేలిముద్రతో సాధించగలరా?

హర్యానా రాష్ట్రంలో ఇటీవల పం చాయతీ ఎన్నికల సందర్భంగా ప్రజా ప్రతినిధులకు ఉండాల్సిన విద్యార్హతల గురించి హైకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యా ప్తంగా చర్చనీయాంశమవుతున్నది. పం చాయతీ ఎన్నికల్లో పోటీ చేయదల్చుకు న్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు నిర్దేశించిన విద్యార్హతలు తప్పక ఉండాలని కోర్టు చెప్పింది. పురుషులు పదో తరగతి, మహిళలు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని ఆదేశించింది. దీంతో హర్యానా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న గ్రామీణ ప్రాంతాల్లోని 83 శాతం మంది, పట్టణ ప్రాంతంలోని 67 శాతం మంది అనర్హులయ్యారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు వచ్చేదాకా ఎన్నికలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది!

ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ప్రజా ప్రతినిధులకు ఉండాల్సిన విద్యార్హతల గురించి తీవ్ర చర్చకు తెరలేచింది. ఏ చిన్న ఉద్యోగానికైనా కనీస విద్యార్హతలు ఉం డాలంటున్నప్పుడు, శాసనకర్తలుగా, ప్రభుత్వ కార్యకలాపాల్లో, విధాన నిర్ణయాల్లో కీలక భూమిక పోషిం చే ప్రజా ప్రతినిధులకు మాత్రం ఏ విద్యార్హత లేక పోవడమేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ఈ నేపథ్యంలోనే అనేక వాదాలు, వివాదాలు ఉనికిలోకి వస్తున్నాయి. నిజానికి భారతదేశమే ఓ వైరుధ్యాల పుట్ట. దీనికి ఈ మధ్య ప్రధాని మోదీ మాట్లాడిన మాటలతోనే ఉన్న వైరుధ్యం అర్థమవుతున్నది. దేశంలో నెలకొన్న పరస్పర విభిన్న పరిస్థితులు, పోకడలు తేటతెల్లమవుతున్నాయి.

ప్రధాని మోదీ పదే పదే డిజిటల్ ఇండియా గురించి మాట్లాడతారు. అమెరికా పోయినప్పుడు మొబైల్ గవర్నెన్స్ గురించి మాట్లాడారు. ఇండియాకు తిరిగివచ్చి బీహార్ ఎన్నికల సందర్భంగా మహా అలయెన్స్ కూటమిని ఎన్నికల్లో ఎదుర్కోవడం కోసం కుల సమీకరణాలను లెక్కలేసి ఎన్నికల గోదాలోకి దిగుతారు. ఏ కుల సమూహం ఎంత శాతమున్నదీ, ఏ కులం వ్యక్తి అయితే గెలుస్తాడనే లెక్కలతోనే అభ్యర్థులను ప్రకటించారు. ఇదిలా ఉంటే.. మోదీ మాట మాట్లాడితే.. అవినీతిని అంతమొందించడమే కర్తవ్యంగా చెప్పుకుంటారు.విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెచ్చి పేదల అభ్యున్నతికి ఖర్చు చేస్తానని చెబుతారు. అదే సందర్భంలో.. ఒక బీజేపీ సీనియర్ ఎంపీ చేత ధన బలం, కండ, కుల బలం ఉన్న వారికే ఎమ్మెల్యే సీట్లు అమ్మకానికి పెడతా రు. ఈ క్రమంలో తమ పార్టీ తరఫున టికెట్లు ఇస్తున్న వారి నేరచరిత్రను పరిగణనలోకి తీసుకోకుండా అదే ఒక అర్హతగా సీట్లు అమ్మారు! ఇలా దేశంలో ఎప్పు డు, ఏ రంగం తీసుకుని పరిశీలించినా పరస్పర విరు ద్ధ, వైరుధ్య పూరిత విషయాలు సదా కనిపించడం సర్వ సాధారణమైపోయింది.

ఇక్కడ ఎవరికైనా ఓ ప్రశ్న ఉదయిస్తుంది. ఎంపీ గా, ఎమ్మెల్యేగా ఎన్నికల్లో నిలవడానికీ, గెలవడానికీ అర్హత కులమేనా? అన్నది. కానీ వారికున్న విద్యార్హతలేమిటన్నది ఎప్పుడైనా చర్చకు నోచుకున్నదా? ఇక్కడ మరో విషయం. ఈ మధ్య యూపీలో 368 చప్రాసీ పోస్టులకు ఉద్యోగ ప్రకటన వెలువరించారు. వీటికోసం 23 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 250 మంది పీహెచ్‌డీలు చేసిన వారూ, 25 వేల మంది పీజీ చేసిన వారు, లక్షా 52వేల మంది డిగ్రీ చేసిన వారు కూడా ఉన్నారు. ఇదీ మన దేశంలో ఉద్యోగార్థుల దుస్థితి!
బీహార్ ఎన్నికలను తీసుకుంటే.. ఈ ఎన్నికల్లో కీల క భూమిక పోషించిన విషయాలు మన దేశాభివృద్ధి దిశ, దశను చెప్పకనే చెబుతాయి.

మోదీ, నితీష్ కుమార్ ఇద్దరూ.. ఎన్నికల గోదాలో కులం బలం మీదనే ఆధారపడ్డారు. ఆ కులం అండతోనే గెలిచారు. నితీష్-లాలు కూటమి ఓబీసీ-ఈబీసీలకు 55 శాతం సీట్లను కేటాయించింది. 16 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీలకు, 14 శాతంగా ఉన్న ముస్లింలకు మొత్తం 243 సీట్లలో కనీసంగానే కేటాయించింది. ఇక ఎన్డీఏ ఉన్న త కులాల వారికి 42 శాతం సీట్లను కేటాయించింది. 26 సీట్లను యాదవులకు కేటాయించి మిగతా సీట్లను ఎల్‌జేపీ, ఆర్‌ఎస్‌ఎల్‌పీలకు కేటాయించింది. ఆర్‌ఎస్‌ఎల్‌పీ తన సీట్లలో 70 నుంచి 75 శాతం ఓబీసీ, దళితులకు కేటాయింది. ఈ మొత్తం క్రమంలో పరిగణనలోకి తీసుకున్నది కేవలం కులాన్ని మాత్రమేనని అధికారికంగానే చెబుతున్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో ఎన్నికయ్యే ప్రజా ప్రతినిధులకు ఉండాల్సినది ఏమిటనేది, విద్యార్హత అనేది ఎప్పుడూ ఎక్కడా చర్చలోకి రాలేదు. మన పాలనా విధానంలో ఒక ప్రభుత్వ కార్యాలయంలో అతి చిన్న స్థాయిలో ఉద్యోగం చేయడానికి ఉండే ఒక ప్యూన్(చప్రాసీ) ఉద్యోగానికైనా కనీసం ఐదో తరగతి చదివి ఉండాలనే నిబంధన పెట్టారు. కానీ చట్టసభల్లో ప్రవేశించే శాసన కర్తలకు, ప్రజలకు సేవలందిస్తూ.., పాలననందించే వారికి మాత్రం ఏ విద్యార్హతలు అక్కరలే దు! ఇది సమంజసమేనా?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 48(బి)ప్రకారం ఎన్నిక ల్లో పాల్గొని పోటీ చేయదల్చుకున్న వారు ఎవరైనా 25 ఏళ్లు నిండి ఉండి భారత పౌరుడై ఉండాలి. ఏదై నా నేరపూరిత చర్యలో రెండేళ్లు శిక్ష అనుభవించి ఉం డకూడదు. అంతే ఇంతకన్నా ఏ అర్హతలు అక్కరలే దు. ఇంకేవీ ప్రతిబంధకాలు లేవు. శాసనకర్తలుగా వ్యవహరిస్తూ చట్టాలు చేసి ప్రజలకు చట్టబద్ధ, స్వచ్ఛమైన పాలన అందించాల్సిన వారికి ఏమి తెలిసి ఉం డాలి? వారు ప్రజలకు నేర్పడానికి వారికి అవసరమై న జ్ఞానం ఏమిటన్నది ఎవరికీ పట్టని విషయం.

నేటికీ దేశంలో నూటికి 60 మంది మాత్రమే అక్షరాస్యులున్న చోట విద్యార్హత ప్రామాణికం చేయడం సబబేనా అని ఎవరైనా వాదించే అవకాశమున్నది. అంతే కాదు.. ఇంత తక్కువ అక్షరాస్యత ఉన్న చోట చదువును అర్హతగా చేయడం ప్రజాస్వామ్యంలో సబబేనా? దానిపేర వారి హక్కులను హరించడం కాదా అన్నది విషయమే. అలాగే దానిపేరుతో ఒకరి జీవనపథాన్ని, రాజకీయాల్లోకి పోవాలన్న ఆశయాన్ని అడ్డుకోవడం కాదా? అన్నది కూడా ఉన్నది. అలాగే విశాల భారత దేశంలో గ్రామీణ ప్రాంతాలు, ఆదివాసీ ప్రాంతాల్లో కనీస అవసరాలు లేక చదువులకు దూరం చేయబడ్డ వారికి విద్యార్హతలు ఎలా సమకూరుతాయి. వాటి పేరుమీద వారిని ఎన్నికలకు దూరం చేయడం సబబేనా?

అలాగే.. ఎంపీలు, ఎమ్మెల్యేలు.. చట్టసభల్లో ప్రజ ల గొంతుకగా వ్యవహరించాలి. ప్రజలకు కావాల్సినవి సాధించాలి. ప్రజలకు మంచి జీవితాన్నందించడం కోసం పాలనా విధానాల్లో మార్పులు, సంస్కరణలు తేవాలి. ప్రజలకు కూడు, గూడు, గుడ్డ, నీరు అందిం చే బాధ్యత నిర్వర్తించాలి. ఇవన్నీ భవష్యత్ దర్శనంతో సాధించాలంటే.. శాసనకర్తలు వేలిముద్రతో సాధించగలరా? అని ఎవరైనా అడగవచ్చు. అంటే.. ఎక్కడైనా ఎవరికైనా ఒక ప్రాంత ప్రజల ఆశలు, అవసరా లు తీర్చాలంటే.. చదువే అవసరమా? ఆ ప్రాంతం, ప్రజలపై ప్రేమానురాగాలు, అవగాహన ఉంటే సరిపోతుంది కదా, దీనికి చదువు అవసరమా అన్నది కూడా ఉన్నది. నిజానికి ఓ మారుమూల పల్లెలోని రైతును తీసుకుంటే.. వ్యవసాయ మెళకువలు.., మన విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న వారికన్నా చదువురాని, లేని రైతుకే ఎక్కువగా తెలుసు. ఇదొక చేదు వాస్తవం.

అయితే నేటి ఆధునిక ప్రపంచీకరణ కాలంలో ప్రతి పౌరునికీ కనీస (వస్తు) పరిజ్ఞానం అవసరం. మొబైల్ గవర్నెన్స్ గురించి తెలియాలంటే.. కనీస విద్యార్హతలు అత్యవసరం. దేశ భవిష్యత్ అవసరాలు, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగాలంటే ఉన్నత శిఖరాలు చేరాలంటే అత్యున్నత విద్యా ప్రమాణాలు అత్యవసరం. ఒకవేళ ఎంపీ, ఎమ్మెల్యేలకు ఏబీసీడీలు, అఆఇఈలు తెలియకుంటే.. నేటి ఆధునిక ప్రచార, ప్రసార సాధనాల్లో వస్తున్న విషయాలను ఎలా అవగాహన చేసుకుంటారు, ఎలా ప్రతిస్పందిస్తారు! డిజిటల్ టెక్నాలజీ, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఏమీ తెలియకుండా.. ప్రజా ప్రతినిధులుగా దుబాసీలపైనే ఆధారపడి పాలన సాగిస్తే సృజనాత్మకత, ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఎలా ప్రతిఫలిస్తాయి? కాబట్టి ఎం పీ, ఎమ్మెల్యేలకు కనీస విద్యార్హతలుండాలన్న దానిలో సహేతుకత లేకపోలేదు. ఎంపీలు, ఎమ్మెల్యేల ముం దు ఐఏఎస్, ఐపీఎస్ చేసిన ఉన్నతాధికారులు చేతు లు కట్టుకుని నిలబడి మన నేతలు చెప్పిందానికి తల ఊపి పనిచేయాల్సిందేనా? కనీస అవగాహన లేని నేతలు చెప్పిందానికల్లా తలలు ఊపి పనిచేస్తే ఐఏఎస్, ఐపీఎస్‌ల చదువులు ఎందుకు? కేవలం ప్రజాప్రతినిధులైనంత మాత్రాన వారి చెప్పుచేతల్లో ఉన్న తాధికారులంతా పనిచేయాల్సిందేనా?

అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లండ్ దేశాల్లో ప్రజా ప్రతినిధులకు నిర్ధిష్టంగా విద్యార్హత అనేది నిర్దేశించకున్నా కనీస గ్రాడ్యుయేట్ అయ్యి ఉండటమే కాదు, సామాజిక కార్యాచరణ ప్రాతిపదికగా రాజకీ య ప్రవేశం ఉంటున్నది. అలాంటి వారినే ప్రజలు ఆమోదిస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా కావాలనుకుంటున్న వారికి ఏదో ఒక రంగంలో నైపుణ్యాలు, విజయాలు ప్రాతిపదికగా ఉంటున్నాయి. ఇలాంటి అర్హతలు, నైపుణ్యాల ప్రాతిపదికన మాత్రమే గాక, వారికున్న భావవ్యక్తీకరణ,నాయకత్వ లక్షణాల మధ్య పోటీగా పరిగణింపబడతాయి. కానీ మనదగ్గర ఇవేవీ పరిగణింపబడటం లేదు. మళ్లీ బీహార్ ఎన్నికలకు పోతే.. కండబలం, ధనబలం ఉన్నవారికే సీట్లు కేటాయించడంలో.., 58 శాతం మంది నేర చరిత్ర ఉన్నవారికే ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. ఇది ఇవ్వాళ్టి నేరమ య రాజకీయాల స్థితి. వీరే నేటి నరమయ రాజకీయా ల్లో బాహుబలి అవుతున్నారు.

గెలుపు గుర్రాలవుతున్నారు. రాజకీయం-రౌడీయిజం కలిసి నేరమయ రాజకీయంగా మారిన దుస్థితి నేడున్నది. నేరస్థులు రాజకీయ అవతారమెత్తి చేయాల్సినంత రచ్చ చేస్తున్నారు. ముంబైలో పేరుమోసిన మాఫియా లీడర్‌గా పేరుగాంచిన అరుణ్ గౌలీ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వా త తన రాజకీయ బలాన్నంతా ప్రదర్శించాడు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఇప్పుడు చెయ్యండి నన్ను ఎన్‌కౌంటర్. కిరాయి హంతకులు, ఎన్‌కౌంటర్ స్పెషలిస్టులు నన్నిప్పుడు చంపుతారా? నాకిప్పుడు బుల్లెట్ ప్రూప్ జాకెట్ ఉన్నది.. అదే ఎమ్మెల్యే పదవి.. అంటూ రాజకీయ ప్రయోజనాన్నీ, బలాన్నీ ప్రదర్శించుకున్నాడు. పోలీసులకు సవాలు చేశాడు.

ఈ క్రమంలోనే దేశంలో రాజకీయ పార్టీలన్నీ నేరమయ రాజకీయాల గురించి మాట్లాడుతునే ఉంటా యి. నేరస్థ రాజకీయాలను నియంత్రించాలని నినదిస్తుంటాయి. కానీ వాటి జెండాల నీడనే నేరస్త రాజకీయాలు వర్ధిల్లుతున్నాయి. ఈ క్రమంలోనే అంబేద్కర్ మాటలు గుర్తుకు వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితు ల్లో రాజ్యాంగ వ్యతిరేక, విరుద్ధ చర్యలు సాగిపోతుం టే.. అది రాజ్యాంగం తప్పిదం కాదు. ఆ రాజ్యాంగ పరిధిలోని వ్యక్తుల వ్యవహార శైలి మాత్రమేనన్నారు. ఈ వెలుగులో ఆర్టికల్ 84 అయినా.., నేరమయ రాజకీయాలైనా రాజకీయ నేతల లోపమే.. వారు చేస్తున్న నిర్వాకమే. ఈ క్రమంలో రాజ్యాంగ పదవు ల్లో, చట్టసభల్లో కూర్చున్న వారంతా నేరచరిత్ర ఉన్న వారు ఉంటే.. స్వచ్ఛ పాలన ఎలా వస్తుంది. అవినీతి అంతం ఎలా, ఎప్పుడు అవుతుంది? దీని గురించి ఇప్పటికైనా అందరూ ఆలోచించాలి.

1709

PUNAM I KOUSHISH

Published: Wed,August 19, 2015 12:07 AM

కష్టంగా నెట్టుకొస్తున్న మోదీ

పరిపాలనా రంగంలో పరివర్తన కోసం భారత ప్రజ లు మోదీకి అధికారం కట్టబెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన

Published: Wed,August 12, 2015 01:47 AM

చర్చలు సాగని చట్టసభలు

ఇవ్వాళ రాజకీయాల్లో చర్చలకు తావులేకుండాపోయింది. బలప్రదర్శనకే పెద్దపీట వేస్తున్నారు. తమ సంఖ్యాబలంతో అధిపత్యం చూపించుకోవడానికే ప్రాధా

Published: Sat,May 16, 2015 12:39 AM

అధికార దుర్వినియోగం..

మన నేతలంతా వ్యాపారుల్లా అవతారాలెత్తి లాభాలు దండుకుంటుంటే.. ఆమ్ ఆద్మీ- గరీబ్ అవుతున్నాడు. మన నేతలు తమ ప్రైవేటు వ్యవహారాలుగా చెబుతున

Published: Thu,February 26, 2015 01:56 AM

పరిశుభ్రత సరే... ప్రాణాల సంగతి?

ఇండియాలో అన్నింటికన్నా అగ్గువ (చీప్) ఏదైనా ఉన్నదంటే.. అది మనుషు ల ప్రాణమే. కూరగాయల కన్నా ఒకింత విలువ, సమయాన్ని బట్టి వాటి ప్రాముఖ్

Published: Sun,December 21, 2014 01:51 AM

మత మార్పిడులకు పునాది ఏమిటి?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. కానీ ఇది

Published: Tue,April 15, 2014 01:23 AM

ప్రజా జీవితంలో వ్యక్తిగతం ఉంటుందా..?

ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులకు వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు. ఉండకూడదు అని గాంధీ బోధించారు. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత వ్

Published: Wed,April 2, 2014 01:18 AM

ఎన్నికలు- విదేశీ నిధులు

ప్రజాస్వామ్యం వెలుగొందాలి అంటే.. రాజకీయాలను నియంత్రిస్తున్న ధనప్రవాహాన్ని నియంత్రించాలి. ఎన్నికల నిధులు ఎక్కడనుంచి,ఏం ఆశించి వస్త

Published: Thu,February 6, 2014 12:15 AM

తెలంగాణ ఏర్పాటు-పాఠాలు

సామాజిక సమస్యల విషయంలో వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించి దానికి తగిన విధంగా మసలుకోకుంటే.. అది కాలక్రమంలో ప్రతీకారం తీర్చుకుంటుందని భ

Published: Sun,May 5, 2013 12:42 PM

నేతల చావు రాజకీయాలు

మన నేతలు ప్రతిదాన్నీ రాజకీయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అది ఇంకా ముదిరి శవరాజకీయాలనుంచి ఎదిగి చావు రాజకీయాల దాకా వచ్చింది. సరబ

Published: Mon,April 8, 2013 02:41 AM

జేపీసీలు ఎందుకోసం?

ఊహించినట్లుగానే శీతాకాల పార్లమెంటు సమావేశాలు వాడి, వేడిగా సాగా యి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు నడిచిందనిపించుకున్నది. శ్రీ

Published: Fri,March 15, 2013 02:16 AM

అవినీతి అంతమెప్పుడు?

ముఖం చూసి బొట్టు పెట్టడమన్నది మన సంప్రదాయమైపోయింది. ఇదిప్పుడు పాలనా విధానంలోకి తర్జుమా అయ్యింది. నీ చేయి బెంచి కిందినుంచి ఎంత తొంద

Published: Mon,January 21, 2013 12:11 AM

నేర రాజకీయాలే సమస్య

మేకలను బలి ఇచ్చి పులులను అందలమెక్కించే నీతి దేశంలో రాజ్యమేలుతున్న ది. ఇది ఎక్కడనో ఒకచోట జరుగుతున్న తంతు కాదు, దేశంలో మూల మూలనా ఇదే

Published: Thu,January 3, 2013 11:47 PM

మన ప్రయాణమెటు?

ఈమధ్య కొన్ని ఉదంతాలు సగటు భారతీయుడిని భయవూభాంతులకు గురిచేస్తున్నాయి. మనం కలలుగన్న భారత్ ఇదే నా అని కన్నీరు కార్చే స్థితి వచ్చింది.

Published: Mon,December 10, 2012 12:12 AM

నీతిబాహ్య రాజకీయాలే నీటి తగాదాలు

రాజకీయ నాయకులు ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ, మహానీయులు భావి తరాల కోసం ఆలోచిస్తారనేది పెద్దలమాట. దీని కనుగుణంగానే నేటి రాజకీయ న

Published: Sun,December 2, 2012 11:30 PM

ప్రజారోగ్యం పట్టని పాలకులు

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నది పాత మాట. ఇప్పుడు ప్రజల అనారోగ్యమే కొందరికి వరమైపోయింది. రోగగ్రస్థ సమాజంతోనే లాభాలను పిండుకునే పరిస్థిత

Published: Wed,October 10, 2012 05:33 PM

మాటల్లోనే గాంధీ మార్గమా?

నేనుంటున్న ఇంటి పక్కనే ఓ నవయువకుడు ఉంటాడు. ఆయనను ‘గాంధీ గురించి నీ అభివూపాయం ఏమిటీ’ అనగానే.. ‘అతనికేం సొట్టబుగ్గల అందగాడు. మోస్ట్

Published: Sat,October 6, 2012 04:24 PM

అసోం అల్లర్లపై అలసత్వమేల?

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుం టూ కాలక్షేపం చేశాడని..అది నిర్లక్ష్యానికి, బాధ్యతా రాహిత్యానికి సంకేతంగా చె

Published: Sat,October 6, 2012 04:25 PM

ఎంతకాలం ఈ గందరగోళం?

ఇరాచకం తరువాత అత్యంత అధ్వాన్నమైన స్థితి ప్రభుత్వం అంటాడు హెన్నీ బీచర్. ఇప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ పరిపాలనా విధానాన్ని చూస్తే

Published: Sat,October 6, 2012 04:25 PM

కాముకుల కాసుల క్రీడ

జంటిల్‌మెన్ గేమ్ జంగ్లీగా తయారైంది. ‘ఐపీఎల్’క్షికికెట్ వివాదాల మయం అవుతోంది. క్రికెట్ ఇవాళ.. మూడు ‘సీ’ల చుట్టూ తిరుగు తున్నది. క్య

Published: Sat,October 6, 2012 04:25 PM

అర్హత లేకున్నా అందలమేలా?

రాజకీయాలకు కేంద్ర నిలయమైన ఢిల్లీ ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటుం ది. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం (ఎన్సీటీసీ) ఏర్పాటుపై కేంద్రానికి ర