కష్టంగా నెట్టుకొస్తున్న మోదీ


Wed,August 19, 2015 12:07 AM

పరిపాలనా రంగంలో పరివర్తన కోసం భారత ప్రజ లు మోదీకి అధికారం కట్టబెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందని ప్రజలు ఆశించారు. కానీ పదిహేను నెలల మోదీ ప్రభుత్వ పాలన ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిం ది. మోదీ దేశాన్ని పాలించ డం అంటే గుజరాత్‌ను ఏలినంత సులభం అనుకున్నారు. కానీ అంత సులువు కాదని ఆయనకు ఇప్పుడిప్పుడే అనుభవంలోకి వస్తున్నది. లలిత్‌గేట్, వ్యాపం కుంభకోణాల్లో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.

ఎన్డీయే ప్రభుత్వం మొదట్లో భారత రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం అని భావన కల్పించింది. ఇది ఎంతో కాలం నిలువలేదు. కానీ అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం విఫలమైందన్న అప్రతిష్ఠను మూటగట్టుకున్నది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ప్రతిపక్షాలు బహిష్కరించడం మోదీ అసమర్థతను బయటపెట్టాయి. సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ పనిచేస్తుందన్న జవాబుదారీతనం లోపించింది. ఈ సమావేశాల్లో ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం ఎన్డీయే ప్రభు త్వ అసమర్థతకు అద్దం పట్టింది. రాష్ర్టాల అసెంబ్లీలలో సభ్యులను సస్పెండ్ చేయడం వేరు. కానీ పార్లమెంటు నుంచి సభ్యులను బహిష్కరించడం అరుదుగా జరగాలె. గతం లో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గందరగోళ పరిస్థితులను సృష్టించింది. అయినంత మాత్రాన సభ్యులను బహిష్కరించడం సరికాదు. గుజరాత్‌లో సాగించుకున్నట్టుగా పార్లమెంటులో కూడా వ్యవహరించాలని మోదీ భావిస్తున్నారు.

poonam-kaushik

ఢిల్లీలో అత్యున్నత పరిపాలనా వ్యవస్థ ఉన్నది. కానీ మోదీ దాన్ని మొత్తం గుజరాత్ నమూనాలా మార్చివేశాడు. మంత్రులు, ఎం పీలు అంతా నిమిత్తమాత్రులుగా మిగిలిపోయారు. మొత్తం పనులన్నీ తన పీఏలకు అప్పగించారు. పనులన్నీ పీఎంవో గుప్పిట్లో పెట్టుకున్నాడు. అధికారులంతా ప్రతి విషయాన్ని తనకు చెప్పడం, పాలనకు సంబంధించిన పర్యవేక్షణ అంతా తనవద్దనే ఉంచుకుంటున్నారు. గాంధీ చెప్పిన మూడుకోతుల మాదిరిగా చెడు చూడవద్దు, మాట్లాడవద్దు, వినవద్దు అనే విధంగా మోదీ తయారయ్యాడు. తన కండ్ల ముందే కుంభకోణాలు బయటపడ్డా మౌనంగా ఉంటున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదు. కానీ ఇదే సమయంలో రాహుల్‌గాంధీ తన చాతుర్యంతో ప్రజలకు దగ్గరవుతున్నాడు.

తన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆర్థిక రంగం వృద్ధి చెందుతున్నది. ఐటీ రంగం విస్తరిస్తున్నది, వ్యాపార, బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ తదితర అన్నిరంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. అయినా వృద్ధి రేటు ఐదు శాతానికి మించలే దు. పన్నుల విషయం ప్రభుత్వం ముందు పెద్ద సందిగ్ధత నెలకొన్నది. నిరుద్యో గం పెరిగిపోతున్నది. నిరక్షరాస్యత, అనారోగ్యాలు, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. అందరికి కూడు, గూడు, గుడ్డ నినాదాలు ఏమయ్యాయి. సెల్‌ఫోన్ల వాడకం అధికంగా పెరుగుతున్న ఈ కాలంలోనూ ఇంకా ప్రజలు అడుక్కుతింటున్నారు. యూపీఏ హయాంలో జరిగిన అవినీతి అంతమైంది. దీన్ని పారిశ్రామిక వర్గాలు కూడా ఒప్పుకుంటున్నాయి.

అయితే ప్రస్తుతం పాలనా వ్యవస్థ అంత చచ్చుబడిపోయింది. పాలన మొత్తం పీఎంవో వద్దే కేంద్రీకృతమైంది. 2019 నాటికి మంచినీళ్లు, మరుగుదొడ్లు కల్పించి స్వచ్ఛభారత్ చేయాలన్నది మోదీ లక్ష్యం. కానీ ప్రభుత్వ కార్యాలయాలు, నివాస ప్రాంతాలు, రోడ్లన్నీ చెత్త తో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయి. గ్రామీణ ప్రాంతంలో నివసిస్తు న్న మూడోవంతు మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతుండటం సిగ్గుచేటు. ప్రతిరోజు సుమారు పదిహేను వందల మంది మరణిస్తున్నారు. మరో అరవై లక్షల మంది భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నది.

మోదీ భక్తుడు ఒకరు తమ నాయకుడిని ఇందిరా గాంధీతో పోల్చాడు. మోదీ అధికారాన్ని ఉపయోగిస్తున్న తీరు, వ్యవహార శైలి ఇందిరా గాంధీని పోలి ఉన్న ది. తన చుట్టూ రాజకీయ నాయకులను నిర్వీర్యం చేస్తున్నాడు. స్పష్టమైన ముం దు చూపు ఉన్న బలమైన నాయకుడు మోదీ. ఆయనకు విపరీతమైన ప్రజాభిమానం ఉన్నది. మోదీ గొప్ప వక్త. జనాన్ని ఆకర్షించే శక్తి ఆయనకున్నది. ఇప్పు డు ఆయనతో సరితూగగల ప్రత్యర్థులు పార్టీలో కానీ, మొత్తం రాజకీయ రంగం లో కానీ ఎవరూ లేరు అని మోదీ భక్తుడు విశ్లేషించాడు. కానీ మోదీని కీర్తించడానికి కానీ, ఆయన పాలనకు నివాళులు అర్పించడానికి కానీ ఈ పదిహేను నెలలు చాలా తక్కువ కాలం. మోదీ బలమైన నాయకుడే కావచ్చు. కానీ అరవై ఏండ్లుగా భారత్‌ను పీడిస్తున్న రుగ్మతలన్నీ ఒక్కసారిగా మాయం చేయడానికి మోదీ మంత్రగాడు కాదు. మోదీ రాజకీయ దృక్పథం ఎటువంటిది, ఆయన ప్రాధాన్యాలు ఏమిటి అనేది స్పష్టంగా బోధపడటానికి మరికొన్ని నెలలు పట్టవచ్చు.

నాయకులు ఎట్లా సవాళ్ళను పరిష్కరిస్తారనే దానిపైనే జాతులు పురోభివృద్ధి చెందడ మో, నశించిపోవడమో జరుగుతుందని మోదీ గ్రహించారు. సందర్భానికి అనుగుణం గా ఎదిగే నాయకుడు, సమస్యను గుర్తించి పరిస్థితి చేజారకముందే పరిష్కరించే నాయకుడు మాత్రమే నిలువ గలుగుతాడని కూడా మోదీకి అర్థమైంది. గుజరాత్ ముఖ్యమంత్రి స్థానం నుంచి ప్రధాని పదవి పొందగలిగినా మోదీ గ్రహించవలసింది రాజకీయాలలో నెగ్గుకురావడం మాత్రమే సరిపోదు. ఆ పదవిలో ఉండి ప్రజలకు సేవ చేయగలగాలె. ట్విటర్, యూట్యూబ్, సోషల్ మీడియాల ద్వారా మోదీ అనుకూల ప్రచారం భారీ స్థాయిలో సాగింది. దీంతో ప్రజలు మోదీ గురించి ఎంతో ఊహించుకున్నారు. ఆయన అన్ని సమస్యలు పరిష్కరిస్తాడని నమ్ముతున్నారు. ఈ భారీ ప్రతిష్ఠకు అనుగుణంగా వ్యవహరించడమే మోదీ ముందున్న సవాలు.

మోదీపై ఎంతో బరువు బాధ్యతలున్నాయి. ఓటర్లు తొందరగా మారిపోతా రు. నాయకులను క్షమించరు. మోదీ విషయంలోనూ అంతే. మోదీ నుంచి ఆశించినంత కనిపించకపోతే ప్రజల్లో అనతికాలంలోనే తీవ్ర వ్యతిరేకత కనిపించవచ్చు. ఒకప్పుడు సామాన్య భారతీయుడిగా ఉండి ఇప్పుడు అసామాన్య నాయకుడిగా అవతరించిన మోదీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చగలుగుతారా? ప్రజలు భావిస్తున్నట్టు రాజకీయాలను పునర్నిర్వచించగలరా? ఇందుకు మరికొంతకాలం వేచి ఉండాల్సిందే.
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్)

854

PUNAM I KOUSHISH

Published: Sat,December 19, 2015 12:48 AM

శాసనకర్తలకు విద్య అవసరం లేదా?

ఎంపీలు, ఎమ్మెల్యేలు.. చట్టసభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరించాలి. ప్రజలకు కావాల్సినవి సాధించాలి. ప్రజలకు మంచి జీవితాన్నందించడం కోసం పా

Published: Wed,August 12, 2015 01:47 AM

చర్చలు సాగని చట్టసభలు

ఇవ్వాళ రాజకీయాల్లో చర్చలకు తావులేకుండాపోయింది. బలప్రదర్శనకే పెద్దపీట వేస్తున్నారు. తమ సంఖ్యాబలంతో అధిపత్యం చూపించుకోవడానికే ప్రాధా

Published: Sat,May 16, 2015 12:39 AM

అధికార దుర్వినియోగం..

మన నేతలంతా వ్యాపారుల్లా అవతారాలెత్తి లాభాలు దండుకుంటుంటే.. ఆమ్ ఆద్మీ- గరీబ్ అవుతున్నాడు. మన నేతలు తమ ప్రైవేటు వ్యవహారాలుగా చెబుతున

Published: Thu,February 26, 2015 01:56 AM

పరిశుభ్రత సరే... ప్రాణాల సంగతి?

ఇండియాలో అన్నింటికన్నా అగ్గువ (చీప్) ఏదైనా ఉన్నదంటే.. అది మనుషు ల ప్రాణమే. కూరగాయల కన్నా ఒకింత విలువ, సమయాన్ని బట్టి వాటి ప్రాముఖ్

Published: Sun,December 21, 2014 01:51 AM

మత మార్పిడులకు పునాది ఏమిటి?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. కానీ ఇది

Published: Tue,April 15, 2014 01:23 AM

ప్రజా జీవితంలో వ్యక్తిగతం ఉంటుందా..?

ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులకు వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు. ఉండకూడదు అని గాంధీ బోధించారు. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత వ్

Published: Wed,April 2, 2014 01:18 AM

ఎన్నికలు- విదేశీ నిధులు

ప్రజాస్వామ్యం వెలుగొందాలి అంటే.. రాజకీయాలను నియంత్రిస్తున్న ధనప్రవాహాన్ని నియంత్రించాలి. ఎన్నికల నిధులు ఎక్కడనుంచి,ఏం ఆశించి వస్త

Published: Thu,February 6, 2014 12:15 AM

తెలంగాణ ఏర్పాటు-పాఠాలు

సామాజిక సమస్యల విషయంలో వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించి దానికి తగిన విధంగా మసలుకోకుంటే.. అది కాలక్రమంలో ప్రతీకారం తీర్చుకుంటుందని భ

Published: Sun,May 5, 2013 12:42 PM

నేతల చావు రాజకీయాలు

మన నేతలు ప్రతిదాన్నీ రాజకీయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అది ఇంకా ముదిరి శవరాజకీయాలనుంచి ఎదిగి చావు రాజకీయాల దాకా వచ్చింది. సరబ

Published: Mon,April 8, 2013 02:41 AM

జేపీసీలు ఎందుకోసం?

ఊహించినట్లుగానే శీతాకాల పార్లమెంటు సమావేశాలు వాడి, వేడిగా సాగా యి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు నడిచిందనిపించుకున్నది. శ్రీ

Published: Fri,March 15, 2013 02:16 AM

అవినీతి అంతమెప్పుడు?

ముఖం చూసి బొట్టు పెట్టడమన్నది మన సంప్రదాయమైపోయింది. ఇదిప్పుడు పాలనా విధానంలోకి తర్జుమా అయ్యింది. నీ చేయి బెంచి కిందినుంచి ఎంత తొంద

Published: Mon,January 21, 2013 12:11 AM

నేర రాజకీయాలే సమస్య

మేకలను బలి ఇచ్చి పులులను అందలమెక్కించే నీతి దేశంలో రాజ్యమేలుతున్న ది. ఇది ఎక్కడనో ఒకచోట జరుగుతున్న తంతు కాదు, దేశంలో మూల మూలనా ఇదే

Published: Thu,January 3, 2013 11:47 PM

మన ప్రయాణమెటు?

ఈమధ్య కొన్ని ఉదంతాలు సగటు భారతీయుడిని భయవూభాంతులకు గురిచేస్తున్నాయి. మనం కలలుగన్న భారత్ ఇదే నా అని కన్నీరు కార్చే స్థితి వచ్చింది.

Published: Mon,December 10, 2012 12:12 AM

నీతిబాహ్య రాజకీయాలే నీటి తగాదాలు

రాజకీయ నాయకులు ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ, మహానీయులు భావి తరాల కోసం ఆలోచిస్తారనేది పెద్దలమాట. దీని కనుగుణంగానే నేటి రాజకీయ న

Published: Sun,December 2, 2012 11:30 PM

ప్రజారోగ్యం పట్టని పాలకులు

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నది పాత మాట. ఇప్పుడు ప్రజల అనారోగ్యమే కొందరికి వరమైపోయింది. రోగగ్రస్థ సమాజంతోనే లాభాలను పిండుకునే పరిస్థిత

Published: Wed,October 10, 2012 05:33 PM

మాటల్లోనే గాంధీ మార్గమా?

నేనుంటున్న ఇంటి పక్కనే ఓ నవయువకుడు ఉంటాడు. ఆయనను ‘గాంధీ గురించి నీ అభివూపాయం ఏమిటీ’ అనగానే.. ‘అతనికేం సొట్టబుగ్గల అందగాడు. మోస్ట్

Published: Sat,October 6, 2012 04:24 PM

అసోం అల్లర్లపై అలసత్వమేల?

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుం టూ కాలక్షేపం చేశాడని..అది నిర్లక్ష్యానికి, బాధ్యతా రాహిత్యానికి సంకేతంగా చె

Published: Sat,October 6, 2012 04:25 PM

ఎంతకాలం ఈ గందరగోళం?

ఇరాచకం తరువాత అత్యంత అధ్వాన్నమైన స్థితి ప్రభుత్వం అంటాడు హెన్నీ బీచర్. ఇప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ పరిపాలనా విధానాన్ని చూస్తే

Published: Sat,October 6, 2012 04:25 PM

కాముకుల కాసుల క్రీడ

జంటిల్‌మెన్ గేమ్ జంగ్లీగా తయారైంది. ‘ఐపీఎల్’క్షికికెట్ వివాదాల మయం అవుతోంది. క్రికెట్ ఇవాళ.. మూడు ‘సీ’ల చుట్టూ తిరుగు తున్నది. క్య

Published: Sat,October 6, 2012 04:25 PM

అర్హత లేకున్నా అందలమేలా?

రాజకీయాలకు కేంద్ర నిలయమైన ఢిల్లీ ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటుం ది. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం (ఎన్సీటీసీ) ఏర్పాటుపై కేంద్రానికి ర

Featured Articles