అధికార దుర్వినియోగం..


Sat,May 16, 2015 12:39 AM

మన నేతలంతా వ్యాపారుల్లా అవతారాలెత్తి లాభాలు దండుకుంటుంటే.. ఆమ్ ఆద్మీ- గరీబ్ అవుతున్నాడు. మన నేతలు తమ ప్రైవేటు వ్యవహారాలుగా చెబుతున్న అన్ని ఆర్థిక లావాదేవీల ముసుగులను తొలగించి చూస్తే నాయకుల వికృత రూపమంతా బయటపడుతుంది. ప్రజాస్వామ్యం మాటున వారు చేస్తున్న మాయాజాలం తెలిసి వస్తుంది. ఇలాంటి పరిస్థితి పోయినప్పుడే అవినీతి రూపుమాసిపోతుంది. ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుంది.

మన నేతల తీరు రోజుకొక రూపం లో కంపరం పుట్టిస్తున్నది. అవినీతి, లంచగొండి తనం, కుంభకోణాలూ ఒక ఎత్తు అయితే.. అధికార దుర్వినియోగం మరో ఎత్తుగా కొనసాగుతున్నది. కనీస నీతినియమాలు, రాజ్యాంగబద్ధమైన సూత్రాలు కూడా పక్కనపెట్టి ఇష్టానుసారం ప్రభుత్వ పదవిని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని వక్రమార్గాలు తొక్కుతున్న తీరు పరమ నీచంగా ఉంటున్నది. అధికారం కోసం వెంపర్లాడటం అనేది పాత మాట అయి పోయి, ఇప్పుడు అవినీతికోసమే అధికారం అన్నట్టుగా మారిపోయింది. పరిస్థితి ఇలా ఉంటే.. సుపరిపాలన గురించి మన పాలకులు మైకు దొరికితే చాలు ఉపన్యాసాలు దంచుతున్నారు.

ఈ మధ్యన వెలుగు చూసిన కొన్ని విషయాలు చూస్తుంటే.. అధికార పక్షం నేతలు, వారి మద్దతుదారులు తమ ఇష్టానుసారం ప్రభుత్వ పదవులను అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడటం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. కేంద్ర మంత్రి గడ్కరీ, మరో మంత్రి పంజాబ్ ముఖ్యమంత్రి తనయుడు, మాజీ కేంద్రమంత్రి కూడా అయిన సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కూడా పదవులను అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారు. గడ్కరీ అధ్యక్షుడిగా ఉన్నా పుత్రి కంపెనీ ఐఆర్‌ఈడీఏ నుంచి 22 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కంపెనీ పెట్టడానికి 2002 మార్చిలో 84 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నది. నాటినుంచి నేటిదాకా తీసుకున్న అప్పుకు వాయిదాల ప్రకారం చెల్లించాల్సింది చెల్లించకుండా సదరు కంపెనీ దాట వేస్తున్నది. ఈ క్రమంలో ఆ కంపెనీ 12 కోట్ల రూపాయ లు బాకీ పడ్డది. దీనిపై రాజ్య సభలో పెద్ద ఎత్తున రబ స జరిగింది.

గడ్కరీ స్వంత కంపెనీ బకాయిలు ఎగవేతకు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుంటున్నారని ప్రతిపక్షం ఆరోపించింది. కాగ్ నివేదిక కూడా ఆ కం పెనీ వ్యవహారాలను తప్పుపట్టింది. అలాగే గడ్కరీకి చెందిన ఈ కంపెనీ 12 బినామీ పేర్లతో కంపెనీలు తెరిచి తప్పుడు అడ్రస్‌లు సమర్పించి 2012లో ఏడు కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే గడ్కరీ 2013లో రెండో సారి బీజేపీకి అధ్యక్షులుగా ఎన్నిక కాలేదు. ఈ నేపథ్యంలోనే ఆ కంపెనీ చేసిన అక్రమ అప్పులు బయటకు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపై గడ్కరీ సమాధానం ఇస్తూ ఆ కంపెనీ నుంచి తాను 2011లోనే రాజీనామా చేశానని సభకు చెప్పుకొచ్చారు. కానీ ఆయన సమాధానంపై సంతృప్తి చెందని ప్రతిపక్షాలన్నీ గడ్కరీ వ్యవహారంపై తీవ్రంగా దుమ్మెత్తి పోశాయి.

ఇదిలా ఉంటే.. పంజాబ్ ముఖ్యమంత్రి తనయుడు ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన సుఖ్‌బీర్ సింగ్ కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెలాయిస్తున్న అధికారం అంతా ఇంతా కాదు. ఈ మధ్యనే పంజాబ్‌లోని మోఘా జిల్లాలో ఓ బస్సులో తల్లి కూతుళ్లనిద్దరినీ బస్సును నడుపుతున్న వ్యక్తులే చెరబట్టి నానా హింసలు పెట్టారు.దీంతో ప్రాణభయంతో కూతురు బస్సునుంచి దుమికి ప్రాణాలు రక్షించుకోవాలనుకున్నది. కానీ ఆ క్రమంలోనే ఆమె ప్రాణాలను కోల్పోయింది. తల్లికూతుళ్లపై అఘాయిత్యానికి పాల్పడిన బస్సు నిర్వాహకులను గానీ, యాజమాన్యాన్ని కానీ పట్టుకుని తగు విధంగా శిక్షించకుండా అక్కడి పోలీసు యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరించింది. బాధితుల విషయం ఆలస్యంగా వెలుగు చూసి బస్సు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి.

చివరికి తేలిందేమంటే.. ఆ బస్సు ముఖ్యమంత్రి తనయుడిదని. ఈ విధంగా అధికారాన్ని ఆసరా చేసుకుని చేస్తున్న అరాచకాలు, అధికార దుర్వినియోగం రోజుకొకటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రైవేటు దందాలు, అధికార పీఠాలు కలగలిసి పోయి జరుగుతున్న అన్యాయాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రజల సేవకోసమే పదవులు అని చెప్పే వారు ఎప్పటికి మారుతారు? ప్రైవేటు వ్యవహారాలను ప్రభుత్వ అధికార నిర్వహణకు దూరంగా ఎప్పుడు పెడతారు? నేతల ప్రైవేటు దందాలు ఎప్పుడు ఆగిపోతాయి? నేరస్తులు ఎప్పుడు శిక్షింపబడతారు?

ఇప్పుడు అంతా క్రోనీ క్యాపిటలిజం రాజ్యం నడుస్తున్నది. నేతలంతా ఏదో ఒక రూపంలో ప్రైవేటు వ్యాపారాలలో మునిగి తేలుతున్న వారే. దీంతో అధికార దుర్వినియోగానికి అంతే లేకుండా పోతున్నది. అధికార దుర్వినియోగానికి పాల్పడని నేతలెవరని వెదికితే.. మిగిలేది ఎంత శాతమో చెప్పడం కష్టమే. టూ-జీ స్పెక్ట్రమ్, ఆదర్శ హౌంసింగ్ సొసైటీ కుంభకోణం మొదలు బొగ్గు కుంభకోణం దాకా అన్ని కుంభకోణాల్లో నేతల పాత్ర వెలుగు చూస్తూనే ఉన్నాయి. యూపీఏ ప్రభుత్వంలోని మంత్రులు, వారి బందుగణం అంతా కుంభకోణాల్లో భాగస్వాములయ్యారు. నీరా రాడియా టేపుల వ్యవహారం నేతలు, వారి అధికార దుర్వినియోగానికి ఓ మచ్చుతునకగా దేశం ముందు ఉండనే ఉన్నది. ఒకానొక అధ్యయనం ప్రకారం రాజ్యసభలోని 232 సభ్యుల్లో 92 మందికి ప్రైవేటు వ్యాపారాలతో ప్రత్యక్ష సంబం ధం ఉన్నది. ప్రజాప్రతినిధిగా ఉంటూనే ప్రైవేటు కంపెనీలకు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.

వాటి నుంచి జీత భత్యాలు తీసుకుంటున్నారు. వాటి వ్యాపార పరమైన సంబంధాల్లో పాలుపంచుకుంటున్నారు. అలాగే.. గతంలో కేంద్రంలో మంత్రి పదవుల్లో ఉన్న డీఎంకే నేత టీఆర్ బాలు, యూపీఏ ప్రభుత్వంలో పెట్రోలియం మంత్రిగా ఉన్న మురళీ దేవరా తదితరుల వ్యవహరాలు ప్రపంచానికంతా తెలుసు. ఈ నేతలంతా అధికార దుర్వినియోగానికి ఎంత బరితెగించి పాల్పడ్డారంటే.. బయటకు పొక్కి తే ఏమవుతుందోనన్న ఆలోచన కూడా లేకుండా వ్యవహరించారు. మాజీ కేంద్ర మంత్రి మారన్ అయితే.. ఏకంగా తాను మంత్రిగా అధికారం వెలగబెట్టినప్పుడు తన సన్ టీవీ కార్యాలయాల్లో 323 హై స్పీడ్ టెలిఫోన్ లైన్లను అక్రమంగా వినియోగించుకున్నారు.

మరో వైపు పెద్ద వ్యాపారసామ్రాజ్యాలకు అధిపతులుగా ఉంటూ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న చట్టబద్ధ కమిటీల్లో చోటు దక్కించుకుంటున్నారు. మహారాష్ట్రలో పెద్ద పత్రికా సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్న విజయ్ దర్దా, రిలయెన్స్ పెట్రోలియం డైరెక్టర్ వైపీ త్రివేదీ ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు! కేంద్ర ప్రభుత్వంలో బీహార్‌లోని పెద్ద వ్యాపార దిగ్గజం కింగ్ మహేంద్ర యజమాని మహేంద్ర ప్రసాద్ ఆకాఇండస్ట్రీ మినిస్ట్రీలో సలహా కమిటీలో నియమింపబడ్డారు.

రాజ్యాంగం చెబుతున్న దాని ప్రకారం రూల్ 293 ననుసరించి ప్రతి ప్రజాప్రతినిధి విధి విధానాలు, విధి నిర్వహణల గురించి సోదాహరణంగా వివరించింది. ప్రతి వ్యక్తి చట్టసభకు ఎన్నికైన 90 రోజుల లోపల తన ఆస్తి పాస్తుల గురించి సభలో రాతపూర్వకంగా ప్రకటించాలి. ఆదాయం వచ్చే ఏ ప్రైవేటు వ్యవహారాల్లోనూ భాగస్వాములు కారాదు. భాగస్వామ్యం ఉండరాదు. కానీ ఏ ఒక్కరూ దీన్ని పాటించిన పాపాన పోవడం లేదు. ప్రజా ప్రతినిధిగా ఎన్నికైనా వారూ, అధికార అదలం ఎక్కిన వారూ అంతా ప్రజలందరి కన్నా తాము ఎక్కువ సమానులమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికార పదవిలో ఉండి ప్రైవేటు వ్యాపారాలు, ఆదాయాలు సమకూర్చుకునే మరే ఇతర కార్యకలాపాలు, వ్యాపారాలు చేయవద్దని రాజ్యాంగ విధివిధానాలు చెబుతున్నాయి. అయినా వాటిని చెవికెక్కించుకున్న వారు ఎవరూ లేరు. ఎవరైనా ప్రతినిధిగా ఎన్నికైన వెంటనే అంతవరకూ ఏ ప్రైవేటు కంపెనీకి డైరెక్టర్‌గా, సభ్యుడుగా ఉన్నా వాటికి రాజీనామా చేయాలి. వాటి వ్యాపారకార్యకలాపాల నిర్వహణకు దూరంగా ఉండాలి.

కానీ మన నేతల తీరు చూస్తుంటే.. రాజ్యాంగం చెబుతున్న ఏ సూత్రాన్నీ పాటిస్తున్న దాఖలాలు లే వు. ప్రతి ఒక్కరూ తమ అధికారాన్ని, ప్రైవేటు వ్యాపార కార్యకలాపాలను కలగలిపి ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు వినియోగించుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి నేతల వ్యవహారాల్లోంచే క్రోనీ క్యాపిటలిజం పుట్టుకు వచ్చింది. ఇవ్వాళ.. దేశంలో ఉన్న అన్ని రకాల అవలక్షణాలకూ, కుంభకోణాలకు అదే తల్లి అయ్యింది. మన నేతలంతా వ్యాపారుల్లా అవతారాలెత్తి లాభాలు దండుకుంటుంటే.. ఆమ్ ఆద్మీ- గరీబ్ అవుతున్నాడు. మన నేతలు తమ ప్రైవేటు వ్యవహారాలుగా చెబుతున్న అన్ని ఆర్థిక లావాదేవీల ముసుగులను తొలగించి చూస్తే నాయకుల వికృత రూపమంతా బయట పడుతుంది. ప్రజాస్వామ్యం మాటున వారు చేస్తున్న మాయాజాలం తెలిసి వస్తుంది. ఇలాంటి పరిస్థితి పోయినప్పుడే అవినీతి రూపుమాసిపోతుంది. ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుంది.

1170

PUNAM I KOUSHISH

Published: Sat,December 19, 2015 12:48 AM

శాసనకర్తలకు విద్య అవసరం లేదా?

ఎంపీలు, ఎమ్మెల్యేలు.. చట్టసభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరించాలి. ప్రజలకు కావాల్సినవి సాధించాలి. ప్రజలకు మంచి జీవితాన్నందించడం కోసం పా

Published: Wed,August 19, 2015 12:07 AM

కష్టంగా నెట్టుకొస్తున్న మోదీ

పరిపాలనా రంగంలో పరివర్తన కోసం భారత ప్రజ లు మోదీకి అధికారం కట్టబెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన

Published: Wed,August 12, 2015 01:47 AM

చర్చలు సాగని చట్టసభలు

ఇవ్వాళ రాజకీయాల్లో చర్చలకు తావులేకుండాపోయింది. బలప్రదర్శనకే పెద్దపీట వేస్తున్నారు. తమ సంఖ్యాబలంతో అధిపత్యం చూపించుకోవడానికే ప్రాధా

Published: Thu,February 26, 2015 01:56 AM

పరిశుభ్రత సరే... ప్రాణాల సంగతి?

ఇండియాలో అన్నింటికన్నా అగ్గువ (చీప్) ఏదైనా ఉన్నదంటే.. అది మనుషు ల ప్రాణమే. కూరగాయల కన్నా ఒకింత విలువ, సమయాన్ని బట్టి వాటి ప్రాముఖ్

Published: Sun,December 21, 2014 01:51 AM

మత మార్పిడులకు పునాది ఏమిటి?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. కానీ ఇది

Published: Tue,April 15, 2014 01:23 AM

ప్రజా జీవితంలో వ్యక్తిగతం ఉంటుందా..?

ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులకు వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు. ఉండకూడదు అని గాంధీ బోధించారు. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత వ్

Published: Wed,April 2, 2014 01:18 AM

ఎన్నికలు- విదేశీ నిధులు

ప్రజాస్వామ్యం వెలుగొందాలి అంటే.. రాజకీయాలను నియంత్రిస్తున్న ధనప్రవాహాన్ని నియంత్రించాలి. ఎన్నికల నిధులు ఎక్కడనుంచి,ఏం ఆశించి వస్త

Published: Thu,February 6, 2014 12:15 AM

తెలంగాణ ఏర్పాటు-పాఠాలు

సామాజిక సమస్యల విషయంలో వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించి దానికి తగిన విధంగా మసలుకోకుంటే.. అది కాలక్రమంలో ప్రతీకారం తీర్చుకుంటుందని భ

Published: Sun,May 5, 2013 12:42 PM

నేతల చావు రాజకీయాలు

మన నేతలు ప్రతిదాన్నీ రాజకీయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అది ఇంకా ముదిరి శవరాజకీయాలనుంచి ఎదిగి చావు రాజకీయాల దాకా వచ్చింది. సరబ

Published: Mon,April 8, 2013 02:41 AM

జేపీసీలు ఎందుకోసం?

ఊహించినట్లుగానే శీతాకాల పార్లమెంటు సమావేశాలు వాడి, వేడిగా సాగా యి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు నడిచిందనిపించుకున్నది. శ్రీ

Published: Fri,March 15, 2013 02:16 AM

అవినీతి అంతమెప్పుడు?

ముఖం చూసి బొట్టు పెట్టడమన్నది మన సంప్రదాయమైపోయింది. ఇదిప్పుడు పాలనా విధానంలోకి తర్జుమా అయ్యింది. నీ చేయి బెంచి కిందినుంచి ఎంత తొంద

Published: Mon,January 21, 2013 12:11 AM

నేర రాజకీయాలే సమస్య

మేకలను బలి ఇచ్చి పులులను అందలమెక్కించే నీతి దేశంలో రాజ్యమేలుతున్న ది. ఇది ఎక్కడనో ఒకచోట జరుగుతున్న తంతు కాదు, దేశంలో మూల మూలనా ఇదే

Published: Thu,January 3, 2013 11:47 PM

మన ప్రయాణమెటు?

ఈమధ్య కొన్ని ఉదంతాలు సగటు భారతీయుడిని భయవూభాంతులకు గురిచేస్తున్నాయి. మనం కలలుగన్న భారత్ ఇదే నా అని కన్నీరు కార్చే స్థితి వచ్చింది.

Published: Mon,December 10, 2012 12:12 AM

నీతిబాహ్య రాజకీయాలే నీటి తగాదాలు

రాజకీయ నాయకులు ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ, మహానీయులు భావి తరాల కోసం ఆలోచిస్తారనేది పెద్దలమాట. దీని కనుగుణంగానే నేటి రాజకీయ న

Published: Sun,December 2, 2012 11:30 PM

ప్రజారోగ్యం పట్టని పాలకులు

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నది పాత మాట. ఇప్పుడు ప్రజల అనారోగ్యమే కొందరికి వరమైపోయింది. రోగగ్రస్థ సమాజంతోనే లాభాలను పిండుకునే పరిస్థిత

Published: Wed,October 10, 2012 05:33 PM

మాటల్లోనే గాంధీ మార్గమా?

నేనుంటున్న ఇంటి పక్కనే ఓ నవయువకుడు ఉంటాడు. ఆయనను ‘గాంధీ గురించి నీ అభివూపాయం ఏమిటీ’ అనగానే.. ‘అతనికేం సొట్టబుగ్గల అందగాడు. మోస్ట్

Published: Sat,October 6, 2012 04:24 PM

అసోం అల్లర్లపై అలసత్వమేల?

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుం టూ కాలక్షేపం చేశాడని..అది నిర్లక్ష్యానికి, బాధ్యతా రాహిత్యానికి సంకేతంగా చె

Published: Sat,October 6, 2012 04:25 PM

ఎంతకాలం ఈ గందరగోళం?

ఇరాచకం తరువాత అత్యంత అధ్వాన్నమైన స్థితి ప్రభుత్వం అంటాడు హెన్నీ బీచర్. ఇప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ పరిపాలనా విధానాన్ని చూస్తే

Published: Sat,October 6, 2012 04:25 PM

కాముకుల కాసుల క్రీడ

జంటిల్‌మెన్ గేమ్ జంగ్లీగా తయారైంది. ‘ఐపీఎల్’క్షికికెట్ వివాదాల మయం అవుతోంది. క్రికెట్ ఇవాళ.. మూడు ‘సీ’ల చుట్టూ తిరుగు తున్నది. క్య

Published: Sat,October 6, 2012 04:25 PM

అర్హత లేకున్నా అందలమేలా?

రాజకీయాలకు కేంద్ర నిలయమైన ఢిల్లీ ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటుం ది. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం (ఎన్సీటీసీ) ఏర్పాటుపై కేంద్రానికి ర

Featured Articles