పరిశుభ్రత సరే... ప్రాణాల సంగతి?


Thu,February 26, 2015 01:56 AM

ఇండియాలో అన్నింటికన్నా అగ్గువ (చీప్) ఏదైనా ఉన్నదంటే.. అది మనుషు ల ప్రాణమే. కూరగాయల కన్నా ఒకింత విలువ, సమయాన్ని బట్టి వాటి ప్రాముఖ్యత ఉంటుంది, కానీ భారత దేశంలో ఎప్పుడైనా మనిషి ప్రాణం అన్ని వేళలా అందుబాటులో కారు చవకగా దొరుకుతుంది. ఇది అనేక ఉదంతాల్లో తేటతెల్లం అయ్యిందే. విదేశీ కంపెనీలు తాము తయారుచేసిన మందుల పరీక్షల కోసం మన దేశాన్ని ప్రయోగశాలగా ఎంచుకోవడం. పందులపైనా, కోతులపైనా, ఎలుకలపైనా చేయాల్సిన ఔషధ పరీక్షలు (క్లినికల్ ట్రయ ల్స్) ఇక్కడ మనుషులపైనే చేయడం పరిపాటి అయ్యింది. అయినా మనుషుల ప్రాణాల రక్షణకు చేపట్టిన చర్యలు ఏమైనా ఉన్నాయా అంటే అనుమానమే.
దేశంలో రోజుకు లక్షలాదిమంది అనేక కారణాల తో చనిపోతున్నారు. ప్రధానంగా పోషకాహార లోపం తో, అనారోగ్యంతో లెక్కకు మించి ప్రాణాలు వదులుతున్నారు. కానీ మన పాలకులకు ఇదేమీ పట్టదు. సాధారణ మనిషి ప్రాణాన్ని పాలకులు, ప్రభుత్వాలు పట్టించుకోవు. ఎవరైనా చనిపోయారని చెబితే.. అలా గా.. సహజమే కదా అన్నట్లుగా వ్యవహరిస్తారు. ఈ మధ్యన దేశాన్ని, అనేక రాష్ర్టాలను కుదిపేసిన స్వైన్ ఫ్లూతో దాదాపుగా 800 మంది చనిపోయారు. 12వేల మంది స్వైన్ ఫ్లూ బారిన పడి చికిత్స పొందు తున్నారు. అయినా మన ప్రభుత్వాలు ఇదేమీ పెద్ద విష యమేమీ కాదన్నట్లు వ్యవహరిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్యమంత్రి ఇదేమీ భయపడాల్సిన జబ్బు కాదు, కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే.. స్వైన్ ఫ్లూ బారి నుంచి తప్పించుకోవచ్చు అని సెలవిచ్చారు. రేడియోల్లో, మీడియాలో అయితే.. చేతులు శుభ్రంగా కడుక్కుంటే చాలు.. స్వైన్ ఫ్లూ దరిచేరదు అని చెప్పుకొచ్చారు. నిజంగా ఇంత తేలికైన ప్రమాదకారి కాని జబ్బు అయితే.. ఇంత మంది దేశ వ్యాప్తం గా చనిపోతారా? దాని బారిన పడి చావుబతుకుల్లో మగ్గిపోవాలా?

సాధారణంగా ఈ స్వైన్ ఫ్లూ సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో భాగంగా వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోతుంది. కానీ మన దేశంలో ఈ హెచ్ 1ఎన్1 వ్యాక్సిన్ అందుబాటులోనే లేదు. ఆగస్టులో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే నవంబర్ వరకే అయిపోయింది. దీంతో స్వైన్ ఫ్లూను కట్టడి చేసేందు కు ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యలు మాట ల వరకే పరిమితమయ్యాయి. ఇక స్వైన్ ఫ్లూను కట్ట డి చేయడం ఎలా జరుగుతుంది! ప్రభుత్వ పరిస్థితి ఇలా ఉంటే.. కేంద్ర ఆరోగ్యమంత్రి మాటలు మరింత ఆశ్చర్యం గొలిపేవిగా ఉంటున్నాయి. వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకోవాలని ప్రైవేటు కంపెనీలకు ఎప్పుడో చెప్పామని, వారి నిర్లక్ష్యంతోనే వ్యాక్సిన్ కొరత ఏర్పడిందని అంటున్నారు. ప్రభుత్వ బాధ్యతను మరిచి ప్రైవేటు వ్యవస్థపై పడి ఏడ్వడం ఓ విచిత్ర పరిస్థితి.
సరిగ్గా ఈ పరిస్థితులనే ఆసరా చేసుకుని స్వైన్ ఫ్లూవ్యాక్సిన్‌ను వ్యాపార వస్తువుగా మార్చేసి లాభా లు గుంజుకున్నారు. 800రూపాయల వ్యాక్సిన్‌ను ప్రైవేటు హాస్పిటల్ వారు పదివేలకు అమ్ముకున్నారు. దేశ వ్యాప్తంగా ఈ తతంగం జరిగినా పట్టించుకున్న వారు కరువయ్యారు. కానీ ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రజలనుంచి నిరసన రావడంతో 4,500రూపాయలకే అమ్మాలని ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ఈ

డబ్బులకైనా.. ప్రజలందరికీ అందుబాటులో లేక అనేక అవస్థలు పడ్డారు. ప్రాణాలు కోల్పోయారు.
అయితే.. దేశాన్ని పీడించడంలో.., ప్రజల ప్రాణా లు తోడేయడంలో ఒక స్వైన్ ఫ్లూ ఒకటే కాదు, చికెన్ గున్యా, మలేరియా, పోలియో లాంటి అనేక మహమ్మారి రోగాలు దేశాన్ని పీడిస్తూనే ఉన్నాయి. ప్రజలను వణికిస్తూనే ఉన్నాయి.

దేశంలో పట్టణాల్లో సైతం 68 శాతం గ్రామాల్లో 9 శాతం మందికిమాత్రమే మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి. మిగతా జనం ఆత్మగౌరవాన్నిచంపుకుని కడు దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నారని గణాంకాలేచెబుతున్నాయి. ఇప్పటికీ 14లక్షల మంది మలమూత్రాలను ఎత్తిపోసేకార్మికులుగా పనిచేస్తున్న దేశంలో అంతరిక్ష పరిశోధనలు మాత్రంఅగ్రరాజ్యాలతో పోటీగా సాగుతున్నా యి. ఇదొక విచిత్ర పరిస్థితి..నినాదాలు, వాగ్దానాలు మాత్రమే దేశాన్నీ, ప్రజల జీవితాల్ని మార్చలేవు.దానికి సగటు మనిషి కేంద్రంగా ప్రభుత్వాల విధానాలు, అభివృద్ధికార్యక్రమాలు రూపొందించాలి.

మరో వైపు దేశంలో పోషకాహార లోపంతో చిన్నారులతో పాటు స్త్రీలు, పెద్దలూ ఎంతో మంది అకాల మరణానికి గురవుతున్నారు. చిన్నపిల్లలు అయితే అయిదేళ్ల లోపు చనిపోతే.. దాన్ని అసహజ మరణంగానే పరిగణించాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత దేశంలో ప్రజారోగ్య పరిస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రజారోగ్యానికి సంబంధించిన వసతులు, వనరులు కల్పించడంలో మన దేశం చాలా వెనుకబడ్డ దేశాలకన్నా కింది వరసన ఉన్నది. ప్రతి ఏటా పది లక్షల మంది సరియైన ఆరోగ్య వసతులు లేక అకాల మరణానికి గురవుతున్నారు. గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లోని 80 శాతం మంది ప్రజలకు స్పెషలిస్టుల వైద్యం అందక సతమతమవుతున్నారు. ఒక్క ఈ సంవత్సరమే దేశంలో 30లక్షల 75వేల మంది గుండె సంబంధిత జబ్బులతో చనిపోయారు. 20 లక్షల మంది గుండె పోటుతో చనిపోయారు. ప్రపంచంలో ఉన్న క్షయ వ్యాధిగ్రస్తుల్లో మూడింట ఒక వంతు మన దేశంలోనే ఉన్నారు. పోలియో, క్షయ వ్యాధిలాంటి వ్యాధు ల్లో అనేక ఆఫ్రియా దేశాల సరసన నిలుస్తూ.., నైజీరియా, ఆఫ్ఘనిస్థాన్ లాంటి దేశాలకన్నా అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నది. మరో మాటలో చెప్పాలంటే దేశం లో ప్రజారోగ్యం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ది.

ఈ పరిస్థితులు ఇలా ఉంటే.. ప్రజారోగ్యానికి ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాముఖ్యం అధ్వాన్నంగా ఉంటున్న ది. బడ్జెట్‌లో ఒక శాతం మాత్రమే కేటాయి స్తూ చేతు లు దులుపుకుంటున్నారు. చాలా వెనకబడ్డ దేశాలు పేద దేశాలు కూడా పదిశాతం కేటాయిస్తుం టే.. మన దేశంలో మాత్రం ఒక శాతంతో సరిపెడుతున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా ప్రకారం లక్ష మందికి 45మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారు. పది ఆస్పత్రి పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మహారాష్ట్రలో 28 గ్రామాలకు అంటే సుమారుగా 20వేల మంది జనాభాకు ఒక డాక్టర్ మాత్రమే ఉన్నా డు. ఈ పరిస్థితుల్లోనే దేశంలో కల రా, మలేరియా, ఫైలేరియా, క్షయ, పోలియో లాంటి వ్యాధులు ఇంకా తిష్ట వేసి ఉన్నాయి. ఈ అధ్వాన్న పరిస్థితుల్లోంచే .. మానవాభివృద్ధి సూచికలో 177 దేశా ల్లో భారత్ స్థానం 127గా ఉన్నది. కేవలం 20 రూపాయలకే కన్న బిడ్డను అమ్ముకునే దుస్థితి ఉన్న దేశంలో ప్రజల దీనత్వాన్ని కొలవడానికి కొలమానాలు లేవు. ఇదే పేదరికానికి, అమానవీయ పరిస్థితులకు తార్కాణంగా చెప్పుకోవచ్చు.

ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రధాని స్వచ్ఛ భారత్ గురించి తెగ మాట్లాడుతున్నారు. ప్రాణానికే భరోసా లేని లోకంలో పరిశుభ్రత గురించి మాట్లాడటం ఎంత వెటకారమో. ఇప్పటికీ దేశంలో పట్టణాల్లో సైతం 68 శాతం గ్రామాల్లో 9 శాతం మందికి మాత్రమే మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి. మిగతా జనం ఆత్మగౌరవాన్ని చంపుకుని కడు దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నారని గణాంకాలే చెబుతున్నాయి. ఇప్పటికీ 14లక్షల మంది మలమూత్రాలను ఎత్తిపోసే కార్మికులుగా పనిచేస్తున్న దేశంలో అంతరిక్ష పరిశోధనలు మాత్రం అగ్రరాజ్యాలతో పోటీగా సాగుతున్నా యి. ఇదొక విచిత్ర పరిస్థితి. ఒక వైపు శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి తారా స్థాయికి చేరుకుని అంతరిక్ష పరిశోధనలో విజయాల మీద విజయాలు సాధిస్తు న్నాం. అగ్రరాజ్యాల సరసన నిలుస్తున్నాం. మరో వైపు కనీస సౌకర్యాలు, నిధులు లేక ప్రజలు సాధారణ విషజ్వరాలకు ప్రాణాలు వదులుతున్నారు. బడిపిల్లలు కనీస సౌకర్యాలు లేక బడులు మానేస్తున్నారు. ఒక వైపు హై టెక్ అభివృద్ధి.., ఇంకో వైపు మనుషులే మల మూత్రాలు తోడేస్తున్న దుస్థితి. ఈ పరిస్థితులు మారాలంటే.. అన్నిరంగాల అభివృద్ధిలో సమన్వయం, సమతుల్యం అవసరం. అదిలేకుండా సాధించేది ఏమీ ఉండదు. నినాదాలు, వాగ్దానాలు మాత్రమే దేశాన్నీ, ప్రజల జీవితాల్ని మార్చలేవు. దానికి సగటు మనిషి కేంద్రంగా ప్రభుత్వాల విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించాలి. అప్పుడే సకల సమస్యలకూ పరిష్కారం.

1135

PUNAM I KOUSHISH

Published: Sat,December 19, 2015 12:48 AM

శాసనకర్తలకు విద్య అవసరం లేదా?

ఎంపీలు, ఎమ్మెల్యేలు.. చట్టసభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరించాలి. ప్రజలకు కావాల్సినవి సాధించాలి. ప్రజలకు మంచి జీవితాన్నందించడం కోసం పా

Published: Wed,August 19, 2015 12:07 AM

కష్టంగా నెట్టుకొస్తున్న మోదీ

పరిపాలనా రంగంలో పరివర్తన కోసం భారత ప్రజ లు మోదీకి అధికారం కట్టబెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన

Published: Wed,August 12, 2015 01:47 AM

చర్చలు సాగని చట్టసభలు

ఇవ్వాళ రాజకీయాల్లో చర్చలకు తావులేకుండాపోయింది. బలప్రదర్శనకే పెద్దపీట వేస్తున్నారు. తమ సంఖ్యాబలంతో అధిపత్యం చూపించుకోవడానికే ప్రాధా

Published: Sat,May 16, 2015 12:39 AM

అధికార దుర్వినియోగం..

మన నేతలంతా వ్యాపారుల్లా అవతారాలెత్తి లాభాలు దండుకుంటుంటే.. ఆమ్ ఆద్మీ- గరీబ్ అవుతున్నాడు. మన నేతలు తమ ప్రైవేటు వ్యవహారాలుగా చెబుతున

Published: Sun,December 21, 2014 01:51 AM

మత మార్పిడులకు పునాది ఏమిటి?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. కానీ ఇది

Published: Tue,April 15, 2014 01:23 AM

ప్రజా జీవితంలో వ్యక్తిగతం ఉంటుందా..?

ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులకు వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు. ఉండకూడదు అని గాంధీ బోధించారు. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత వ్

Published: Wed,April 2, 2014 01:18 AM

ఎన్నికలు- విదేశీ నిధులు

ప్రజాస్వామ్యం వెలుగొందాలి అంటే.. రాజకీయాలను నియంత్రిస్తున్న ధనప్రవాహాన్ని నియంత్రించాలి. ఎన్నికల నిధులు ఎక్కడనుంచి,ఏం ఆశించి వస్త

Published: Thu,February 6, 2014 12:15 AM

తెలంగాణ ఏర్పాటు-పాఠాలు

సామాజిక సమస్యల విషయంలో వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించి దానికి తగిన విధంగా మసలుకోకుంటే.. అది కాలక్రమంలో ప్రతీకారం తీర్చుకుంటుందని భ

Published: Sun,May 5, 2013 12:42 PM

నేతల చావు రాజకీయాలు

మన నేతలు ప్రతిదాన్నీ రాజకీయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అది ఇంకా ముదిరి శవరాజకీయాలనుంచి ఎదిగి చావు రాజకీయాల దాకా వచ్చింది. సరబ

Published: Mon,April 8, 2013 02:41 AM

జేపీసీలు ఎందుకోసం?

ఊహించినట్లుగానే శీతాకాల పార్లమెంటు సమావేశాలు వాడి, వేడిగా సాగా యి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు నడిచిందనిపించుకున్నది. శ్రీ

Published: Fri,March 15, 2013 02:16 AM

అవినీతి అంతమెప్పుడు?

ముఖం చూసి బొట్టు పెట్టడమన్నది మన సంప్రదాయమైపోయింది. ఇదిప్పుడు పాలనా విధానంలోకి తర్జుమా అయ్యింది. నీ చేయి బెంచి కిందినుంచి ఎంత తొంద

Published: Mon,January 21, 2013 12:11 AM

నేర రాజకీయాలే సమస్య

మేకలను బలి ఇచ్చి పులులను అందలమెక్కించే నీతి దేశంలో రాజ్యమేలుతున్న ది. ఇది ఎక్కడనో ఒకచోట జరుగుతున్న తంతు కాదు, దేశంలో మూల మూలనా ఇదే

Published: Thu,January 3, 2013 11:47 PM

మన ప్రయాణమెటు?

ఈమధ్య కొన్ని ఉదంతాలు సగటు భారతీయుడిని భయవూభాంతులకు గురిచేస్తున్నాయి. మనం కలలుగన్న భారత్ ఇదే నా అని కన్నీరు కార్చే స్థితి వచ్చింది.

Published: Mon,December 10, 2012 12:12 AM

నీతిబాహ్య రాజకీయాలే నీటి తగాదాలు

రాజకీయ నాయకులు ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ, మహానీయులు భావి తరాల కోసం ఆలోచిస్తారనేది పెద్దలమాట. దీని కనుగుణంగానే నేటి రాజకీయ న

Published: Sun,December 2, 2012 11:30 PM

ప్రజారోగ్యం పట్టని పాలకులు

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నది పాత మాట. ఇప్పుడు ప్రజల అనారోగ్యమే కొందరికి వరమైపోయింది. రోగగ్రస్థ సమాజంతోనే లాభాలను పిండుకునే పరిస్థిత

Published: Wed,October 10, 2012 05:33 PM

మాటల్లోనే గాంధీ మార్గమా?

నేనుంటున్న ఇంటి పక్కనే ఓ నవయువకుడు ఉంటాడు. ఆయనను ‘గాంధీ గురించి నీ అభివూపాయం ఏమిటీ’ అనగానే.. ‘అతనికేం సొట్టబుగ్గల అందగాడు. మోస్ట్

Published: Sat,October 6, 2012 04:24 PM

అసోం అల్లర్లపై అలసత్వమేల?

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుం టూ కాలక్షేపం చేశాడని..అది నిర్లక్ష్యానికి, బాధ్యతా రాహిత్యానికి సంకేతంగా చె

Published: Sat,October 6, 2012 04:25 PM

ఎంతకాలం ఈ గందరగోళం?

ఇరాచకం తరువాత అత్యంత అధ్వాన్నమైన స్థితి ప్రభుత్వం అంటాడు హెన్నీ బీచర్. ఇప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ పరిపాలనా విధానాన్ని చూస్తే

Published: Sat,October 6, 2012 04:25 PM

కాముకుల కాసుల క్రీడ

జంటిల్‌మెన్ గేమ్ జంగ్లీగా తయారైంది. ‘ఐపీఎల్’క్షికికెట్ వివాదాల మయం అవుతోంది. క్రికెట్ ఇవాళ.. మూడు ‘సీ’ల చుట్టూ తిరుగు తున్నది. క్య

Published: Sat,October 6, 2012 04:25 PM

అర్హత లేకున్నా అందలమేలా?

రాజకీయాలకు కేంద్ర నిలయమైన ఢిల్లీ ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటుం ది. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం (ఎన్సీటీసీ) ఏర్పాటుపై కేంద్రానికి ర

Featured Articles