మత మార్పిడులకు పునాది ఏమిటి?


Sun,December 21, 2014 01:51 AM

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. కానీ ఇది చాలా సందర్భాల్లో దుర్వినియోగం అవుతున్నది. ఐక్య రాజ్యసమితి కూడా మత స్వేచ్ఛ అనేది మానవహక్కుగా గుర్తించింది. కానీ ప్రపంచంలో చాలా దేశాల్లో మత స్వేచ్ఛ ఉన్న దాఖలాలు లేవు.

ఈ మధ్య దేశంలో దేవుళ్ల మధ్య కొట్లాట ఎక్కువయ్యింది. ఎక్కడ చూసినా దేవుళ్ల మధ్య ఆధిపత్య పోరాటం కనిపిస్తున్నది. ఉత్తర ప్రదేశ్‌లో హిందూ- ముస్లిం దేవుళ్ల మధ్య కొట్లాట, మధ్యప్రదేశ్‌లో హిందూ-క్రిస్టియన్ దేవుళ్ల మధ్య కొట్లాట జరుగుతున్నది. ఇలా ఎక్కడ చూసినా ఏదో స్థాయిలో దేవుళ్ల మధ్య పోరు ఎక్కువయ్యింది. ఈ పరిస్థితి చూస్తే అసలు దేశంపైనే దేవునికి కోపం వచ్చిందా అనిపిస్తున్నది. విషాదమేమంటే రాజకీయనేతల పాత్ర దేవుళ్ల స్థానంలో ఉంటున్నది. వారి అవసరాల, ఆధిపత్యం కోసం, ఓట్ల కోసం దేవుళ్ల మధ్య కొట్లాటగా మారుస్తున్న తీరు కనిపిస్తున్నది.

ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర గురించి ఆలోచించాలి. ఈ మధ్య ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహిస్తున్న ఘర్ వాపస్( స్వంత గూటికి చేరుకోవడం) కార్యక్రమం వివాదాస్పదం అవుతన్నది. ఆర్‌ఎస్‌ఎస్ వారు ఘర్‌వాపస్ కార్యక్రమం పేర ముస్లిం పేదలను తిరిగి హిందూ మతంలోకి తీసుకునే కార్యక్రమాన్ని ఆగ్రా లో నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమం ఒక ఆగ్రాలోమాత్రమే జరగలేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, గుజరాత్, ఒడిశా రాష్ర్టాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాల పేర ముస్లింలను, క్రిస్టియన్‌లను హిందూ మతంలోకి మత మార్పిడి చేశారు. దీంతో దేశవ్యాప్తంగా మత మార్పిడుల విషయం చర్చనీయాంశం అవుతున్నది.

మరోవైపు హిందూ జనజాగరణ్ మంచ్ మాత్రం ముస్లిం, క్రిస్టియన్ మత సంస్థలు చేస్తున్న కార్యక్రమాల పట్ల తీవ్రంగా స్పందిస్తున్నది. పేద హరిజన, గిరిజన ప్రజలను డబ్బే, వైద్యం, విద్య లాంటి వసతులను ఎరచూపి మత మార్పిడులకు పాల్పడుతున్నారని హెచ్‌జేఎం సంస్థ ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీ యోగీ ఆదిత్యనాథ్ హిందువులకు డబ్బు ఎరచూపి ముస్లిం మతంలోకి మార్చిన వారిని తిరిగి హిందూ మతంలోకి తెస్తామని చెప్పుకొచ్చారు. ఈ ఘర్‌వాపస్ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్‌లో పెత్త ఉత్సవంలా నిర్వహిస్తామని అన్నారు. ఇలాంటి మత మార్పిడులు ఏదో స్థాయిలో గత పదేళ్లుగా జరుగుతున్నా, ఇప్పుడు అదొక ఉద్యమంగా సాగుతుండటంతో దేశ వ్యాప్తంగా చర్చకు తెరలేపింది.

మరోవైపు కేరళ ముఖ్యమంత్రి ఉమన్ చాంది చేసిన ప్రకటన పెద్ద దుమారం లేపింది. ఆయన చెప్పినదాన్ని బట్టి నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎన్‌డీఎఫ్), క్యాంపస్ ఫ్రంట్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) లాంటి ముస్లిం మతవాద సంస్థలు పేద హిందూ కులాల ప్రజలను డబ్బులు, విద్య, వైద్యం సదుపాయాల ఎరచూపి మత మార్పిడులకు పాల్పడుతున్నాయని అన్నారు. ఆయన కేరళ అసెంబ్లీలో ఈ జూన్ నెలలో చెప్పినదాన్ని బట్టి ఒక కేరళలో 2006లో 2667 మంది హిందూ యువతులను ముస్లిం మతంలోకి మార్చారు. పోలీసు అధికారుల లెక్కల ప్రకారం ఈ నాలుగేళ్లలో నాలుగు వేల మంది మత మార్పడి చెందారు. కర్ణాటక రాష్ట్రం విషయానికి వస్తే 30 వేల మంది హిందువులు ముస్లిం మతంలోకి మార్పిడి చెందారని హిందూ జాగృతి సమితి ఆరోపించింది.

ఈ లెక్కలు, గణాంకాలు ఎలా ఉన్నా దేశంలో మత మార్పిడులు జోరుగా సాగుతున్నాయన్నది వాస్తవం. దీనికి కారణమేమిటి? దీనివెనక ఉన్న కుట్రలు ఏమిటి? వీటిలో మత విశ్వాసాల పాత్ర ఎంత? అనేవి చర్చనీయాంశాలే. అయితే ఈ రోజు సంఘ్ పరివార్ చెబుతున్న, చేస్తున్న ఘర్‌వాపస్ కార్యక్రమాన్ని ఎలా చూడాలన్నదే నేటి సమస్య. ఇదిలాగే కొనసాగితే దేశంలో ఇన్నాళ్లుగా లౌకిక భావనలతో ఉన్న వ్యవస్థ ప్రమాదంలో పడదా అన్నదే సమస్య! ఇదిలా ఉంటే మత మార్పిడులకు వ్యతిరేకంగా వీహెచ్‌పీ, భజరంగ్‌దల్ లాంటి హిందూ సంస్థలు మత మార్పిడులను నిరోధించే పేర సాయుధ దళాలను రక్షణ సేన పేరిట ఏర్పాటు చేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ప్రతి గ్రామంలో ఇలాంటి సాయుధ దళాలను ఏర్పాటు చేశారు.

క్రిస్టియానిటీ మత మార్పిడులను ఎదుర్కొనేందుకు ఈ దళాలు హిందువులకు రక్షణగా ఉంటాయిని చెప్పుకొస్తున్నారు. ఇలాంటి సంస్థలే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, గుజరాత్, ఒడిషా రాష్ర్టాల్లో హిందూ మత రక్షకులుగా పనిచేస్తున్నాయి. లౌకిక ప్రజాస్వామిక వ్యవస్థలో మత మార్పిడుల విషయం వివిధ జాతి సమూహాల మధ్య అభద్రత నెలకొనే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మత మార్పిడుల నిరోధక చట్టం చేయాల న్న డిమాండ్ వస్తున్నది. పరిస్థితులు ఇలా ఉంటే.. ఈ పరిస్థితి నుంచి రాజకీయ నేతలు తమ పబ్బం గుడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ సమాజంలో మతం నిర్వహిస్తున్న పాత్రను, అణచివేత సాధనంగా ఉటున్న తీరును మరుగునపరుస్తున్నారు. తాము చేస్తున్న మత రాజకీయాల ఫలితంగా దేశం ముక్కలయ్యే పరిస్థితి వస్తున్నా, ఘోషిస్తున్నా పట్టించుకున్న పరిస్థితి లేదు.

ఇవ్వాళ దేశంలో మత ప్రచారం అనేది పెద్ద పరిశ్రమగా మారిపోయింది. దీని వెనుక డబ్బు పాత్ర ఎంతో ఉన్నది. అమెరికా, యూరప్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోని చర్చిలు పెద్ద ఎత్తున ధనరాశులను మన దేశంలో కుమ్మరిస్తున్నాయి. దీంతో క్రిస్టియన్ మత సంస్థల ప్రచార కార్యక్రమాలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించాయి. పెద్ద పట్టణాలు, నగరాలు మొదలు దట్టమైన అడవుల్లోని మారు మూల ఆదివాసీ గ్రామాల దాకా క్రిస్టియన్ మత ప్రచార సంస్థలు తమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నా యి. స్వాతంత్య్రానంతర కాలంలో ఇది యథేచ్ఛగా కొనసాగింది. దీంతో లక్షల సంఖ్య లో మత మార్పిడులు జరిగాయి.

ఈ మత మార్పిడుల వెనుక చాలా సందర్భాల్లో డబ్బు పాత్ర ఉన్నా, కుల అణచివేతల నుంచి విముక్తి అన్న అంశమూ ప్రధాన భూమిక అవుతున్నది. అలాగే విషాదమేమంటే ప్రజాస్వామికవాదులు, మేధావుల నుంచి లౌకిక ప్రజాస్వామిక విలువల పరిరక్షణ కోసం జరగాల్సిన కృషి జరగడంలేదు. కొంత మంది మేధావుల అవకాశవాద ధోరణి, మేధావుల పేర చెలామణి అవుతున్న వారి వక్రీకరణ లు లౌకిక విలువలను నిలుపలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే ప్రపంచీకరణలో భాగంగా వస్తున్న సంస్కృతిక విలువలను సరిగా సమాజానికి అర్థం చేయించడంలో వైఫల్యం కారణం గా మత మౌడ్యం పెరిగిపోతున్నది. ఈ పరిస్థితికి తోడు నాయకులు ఓటుబ్యాంకు రాజకీయాలు మతవాదాలను, వైషమ్యాలను పెంచి పోషిస్తున్నాయి.

వేల సంవత్సరాలుగా హిందూ మతంలో అట్టడుగు కులాలుగా దోపిడీ, అణచివేతలకు, అంటరాని తనానికి గురవుతున్న వారి రోదనలు మన నేతల చెవికి ఎక్కలేదు. వారి సాంఘిక జీవన పరిస్థితులను పట్టించుకుని వారి సమస్యల పరిష్కారం కోసం కనీస ప్రయత్నం చేయలేదు. ఈ పరిస్థితులను ఆసరా చేసుకునే మత సంస్థలు వేళ్లూనుకున్నాయి. మత మార్పిడుల వెనుక సాంఘిక కుల అణచివేతల నుంచి విముక్తి అన్న అంశం తీసివేయలేనిది. కానీ మన సామాజిక పరిస్థితులు మాత్రం ఏమాత్రం ప్రజాస్వామికరించబడలేదనడనాకి అనేక దుష్టాంతాలున్నాయి. ఇప్పటికీ హిందువుల్లోని అగ్రవర్ణాలలోని 52 శాతం మంది అస్పృశ్యతను పాటిస్తున్నారు. కుల సమానత్వాన్ని పాటించడం లేదు.

దళితులను దేవాలయాల్లోకి రానీయడం లేదు. కులాల మధ్య అడ్డుగోడలు సురక్షితంగా కాపాడబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంరికీ సమానహక్కులు అనేది రాజ్యాంగం ప్రసాదించిన విషయం అనుభవంలోకి రానిదై పోయింది. రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 25 ప్రకారం దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. కానీ ఇది చాలా సందర్భాల్లో దుర్వినియోగం అవుతున్నది. ఐక్య రాజ్యసమితి కూడా మత స్వేచ్ఛ అనేది మానవహక్కుగా గుర్తించింది. కానీ ప్రపంచంలో చాలా దేశాల్లో మత స్వేచ్ఛ ఉన్న దాఖలాలు లేవు. క్రిస్టియన్ మతం ప్రబలంగా ఉన్న యూరప్, అమెరికా, ఇంగ్లండ్‌ను వదిలిపెడితే అరబ్బు దేశాల్లో మత స్వేచ్ఛకు తావే లేదు.

అరబ్బు దేశాలన్నింటా ఎవరైనా ముస్లిం మతంలోకి మారడానికి స్వేచ్ఛ ఉన్నది కానీ,దాన్నుంచి ఇతర మతాల్లోకి మారే స్వేచ్ఛ లేదు. అలాగే మన దేశంలోనూ మత మార్పిడుల సమస్య కేవలం ఆర్థిక ప్రలోభాల సమస్యగానే కాకుండా సాంఘిక సమానతలు, ఆత్మగౌరవ సమస్యలు వీటి వెనుక ఉన్నాయన్న వాస్తవం గుర్తించాలి. అప్పుడే మత మార్పిడుల నేపథ్యం, కారణాలు అర్థమవుతాయి. వాటితో వస్తున్న సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. లౌకిక ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలబడుతుంది.

2588

PUNAM I KOUSHISH

Published: Sat,December 19, 2015 12:48 AM

శాసనకర్తలకు విద్య అవసరం లేదా?

ఎంపీలు, ఎమ్మెల్యేలు.. చట్టసభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరించాలి. ప్రజలకు కావాల్సినవి సాధించాలి. ప్రజలకు మంచి జీవితాన్నందించడం కోసం పా

Published: Wed,August 19, 2015 12:07 AM

కష్టంగా నెట్టుకొస్తున్న మోదీ

పరిపాలనా రంగంలో పరివర్తన కోసం భారత ప్రజ లు మోదీకి అధికారం కట్టబెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన

Published: Wed,August 12, 2015 01:47 AM

చర్చలు సాగని చట్టసభలు

ఇవ్వాళ రాజకీయాల్లో చర్చలకు తావులేకుండాపోయింది. బలప్రదర్శనకే పెద్దపీట వేస్తున్నారు. తమ సంఖ్యాబలంతో అధిపత్యం చూపించుకోవడానికే ప్రాధా

Published: Sat,May 16, 2015 12:39 AM

అధికార దుర్వినియోగం..

మన నేతలంతా వ్యాపారుల్లా అవతారాలెత్తి లాభాలు దండుకుంటుంటే.. ఆమ్ ఆద్మీ- గరీబ్ అవుతున్నాడు. మన నేతలు తమ ప్రైవేటు వ్యవహారాలుగా చెబుతున

Published: Thu,February 26, 2015 01:56 AM

పరిశుభ్రత సరే... ప్రాణాల సంగతి?

ఇండియాలో అన్నింటికన్నా అగ్గువ (చీప్) ఏదైనా ఉన్నదంటే.. అది మనుషు ల ప్రాణమే. కూరగాయల కన్నా ఒకింత విలువ, సమయాన్ని బట్టి వాటి ప్రాముఖ్

Published: Tue,April 15, 2014 01:23 AM

ప్రజా జీవితంలో వ్యక్తిగతం ఉంటుందా..?

ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులకు వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు. ఉండకూడదు అని గాంధీ బోధించారు. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత వ్

Published: Wed,April 2, 2014 01:18 AM

ఎన్నికలు- విదేశీ నిధులు

ప్రజాస్వామ్యం వెలుగొందాలి అంటే.. రాజకీయాలను నియంత్రిస్తున్న ధనప్రవాహాన్ని నియంత్రించాలి. ఎన్నికల నిధులు ఎక్కడనుంచి,ఏం ఆశించి వస్త

Published: Thu,February 6, 2014 12:15 AM

తెలంగాణ ఏర్పాటు-పాఠాలు

సామాజిక సమస్యల విషయంలో వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించి దానికి తగిన విధంగా మసలుకోకుంటే.. అది కాలక్రమంలో ప్రతీకారం తీర్చుకుంటుందని భ

Published: Sun,May 5, 2013 12:42 PM

నేతల చావు రాజకీయాలు

మన నేతలు ప్రతిదాన్నీ రాజకీయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అది ఇంకా ముదిరి శవరాజకీయాలనుంచి ఎదిగి చావు రాజకీయాల దాకా వచ్చింది. సరబ

Published: Mon,April 8, 2013 02:41 AM

జేపీసీలు ఎందుకోసం?

ఊహించినట్లుగానే శీతాకాల పార్లమెంటు సమావేశాలు వాడి, వేడిగా సాగా యి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు నడిచిందనిపించుకున్నది. శ్రీ

Published: Fri,March 15, 2013 02:16 AM

అవినీతి అంతమెప్పుడు?

ముఖం చూసి బొట్టు పెట్టడమన్నది మన సంప్రదాయమైపోయింది. ఇదిప్పుడు పాలనా విధానంలోకి తర్జుమా అయ్యింది. నీ చేయి బెంచి కిందినుంచి ఎంత తొంద

Published: Mon,January 21, 2013 12:11 AM

నేర రాజకీయాలే సమస్య

మేకలను బలి ఇచ్చి పులులను అందలమెక్కించే నీతి దేశంలో రాజ్యమేలుతున్న ది. ఇది ఎక్కడనో ఒకచోట జరుగుతున్న తంతు కాదు, దేశంలో మూల మూలనా ఇదే

Published: Thu,January 3, 2013 11:47 PM

మన ప్రయాణమెటు?

ఈమధ్య కొన్ని ఉదంతాలు సగటు భారతీయుడిని భయవూభాంతులకు గురిచేస్తున్నాయి. మనం కలలుగన్న భారత్ ఇదే నా అని కన్నీరు కార్చే స్థితి వచ్చింది.

Published: Mon,December 10, 2012 12:12 AM

నీతిబాహ్య రాజకీయాలే నీటి తగాదాలు

రాజకీయ నాయకులు ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ, మహానీయులు భావి తరాల కోసం ఆలోచిస్తారనేది పెద్దలమాట. దీని కనుగుణంగానే నేటి రాజకీయ న

Published: Sun,December 2, 2012 11:30 PM

ప్రజారోగ్యం పట్టని పాలకులు

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నది పాత మాట. ఇప్పుడు ప్రజల అనారోగ్యమే కొందరికి వరమైపోయింది. రోగగ్రస్థ సమాజంతోనే లాభాలను పిండుకునే పరిస్థిత

Published: Wed,October 10, 2012 05:33 PM

మాటల్లోనే గాంధీ మార్గమా?

నేనుంటున్న ఇంటి పక్కనే ఓ నవయువకుడు ఉంటాడు. ఆయనను ‘గాంధీ గురించి నీ అభివూపాయం ఏమిటీ’ అనగానే.. ‘అతనికేం సొట్టబుగ్గల అందగాడు. మోస్ట్

Published: Sat,October 6, 2012 04:24 PM

అసోం అల్లర్లపై అలసత్వమేల?

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుం టూ కాలక్షేపం చేశాడని..అది నిర్లక్ష్యానికి, బాధ్యతా రాహిత్యానికి సంకేతంగా చె

Published: Sat,October 6, 2012 04:25 PM

ఎంతకాలం ఈ గందరగోళం?

ఇరాచకం తరువాత అత్యంత అధ్వాన్నమైన స్థితి ప్రభుత్వం అంటాడు హెన్నీ బీచర్. ఇప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ పరిపాలనా విధానాన్ని చూస్తే

Published: Sat,October 6, 2012 04:25 PM

కాముకుల కాసుల క్రీడ

జంటిల్‌మెన్ గేమ్ జంగ్లీగా తయారైంది. ‘ఐపీఎల్’క్షికికెట్ వివాదాల మయం అవుతోంది. క్రికెట్ ఇవాళ.. మూడు ‘సీ’ల చుట్టూ తిరుగు తున్నది. క్య

Published: Sat,October 6, 2012 04:25 PM

అర్హత లేకున్నా అందలమేలా?

రాజకీయాలకు కేంద్ర నిలయమైన ఢిల్లీ ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటుం ది. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం (ఎన్సీటీసీ) ఏర్పాటుపై కేంద్రానికి ర

Featured Articles