ప్రజా జీవితంలో వ్యక్తిగతం ఉంటుందా..?


Tue,April 15, 2014 01:23 AM

ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులకు వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు.
ఉండకూడదు అని గాంధీ బోధించారు. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత వ్యక్తిగత
జీవితమంటూ ఒకటి ఉండదు అని కూడా గాంధీ తేల్చి చెప్పారు. కాబట్టి తన వ్యక్తిగత జీవితమని చెప్పుకుంటున్న దానికి మోడీ ఏం సమాధానం చెబుతారు?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరు గుతున్న వేళ.. నేతల మాటల తూటా ల మధ్య ఓ పిడుగు లాంటి వార్త పేలింది. ఒక్కసారిగా దేశం దేశమంతా తలతిప్పి చూసేలా చేసింది. ఎవరి నోట విన్నా ఎవరీ.. జశోదాబె న్ అన్నదే అందరి ప్రశ్నగా మారింది. జశోదాబెన్ సాదాసీదా భారతీయ మహిళ కాదు. భావి ప్రధానిగా చెప్పుకుంటున్న నరేంద్రమోడీ ధర్మపత్ని అట! ఇంతకాలం ఈ జశోదాబెన్ తెరచాటున ఎందుకున్నది? మోడీ ఇంత కాలం తాను ఒంటరి (బ్యాచ్‌లర్)నని పబ్లిక్‌గా ప్రకటించారు గదా!అకస్మాత్తుగా మోడీకి ఎప్పుడో 46 ఏళ్ల క్రితం మరిచిపోయిన పేరు ఇప్పుడెందుకు గుర్తుకు వచ్చింది? రాజకీయ నాయకులు ఇంత సులువుగా తన అవసరాల కోసం ఇంత పెద్ద అబద్ధాలు చెబుతారా? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలు ఇప్పుడు దేశాన్ని వెంటాడుతున్నవి.

భావి ప్రధానిగా ప్రచారం చేసుకుంటున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఈ సారి వడోదర లోక్ సభ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. అయితే.. ఈ సారి ఎన్నికల కమిషన్ వ్యక్తిగత వివరణలు, విషయాల గురించి కచ్చితమైన వాస్తవాలు తెలియజేయాలని ఆదేశించింది. ఏ మాత్రం విషయాల్లో తేడాలున్నా, అవాస్తవాలున్నా.. అభ్యర్థిత్వం చెల్లనేరదని హెచ్చరించింది. దీంతో నరేంద్రమోడీ గతంలో దాచి ఉంచిన విషయాన్ని బహిర్గతం చేయాల్సి వచ్చింది. తనకు పెళ్లి అయ్యిందని, భార్య పేరు జశోదాబెన్ అని తెలిపి దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. దీంతో ఒక్కసారిగా దేశం నోరెళ్లపెట్టి చూసింది. గతంలో ఎన్నికలు జరిగినప్పుడు తనకు పెళ్లికాలేదని చెప్పలేదు కానీ, తాను ఒంటరినని ప్రకటించుకున్నాడు. పెళ్లి విషయాన్ని తెలిపే కాలమ్‌ను ఖాళీగా ఉంచాడు. అంటే.. మరో అర్థంలో తనకు పెళ్లికాలేదని చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. అసలు కథకు వస్తే.. ఎప్పుడో 46 ఏళ్లక్రితం నరేంద్రమోడీ 17 ఏళ్ల వయసులో గుజరాత్‌లోని రాజోసనా గ్రామానికి చెందిన 16 ఏళ్ల జశోదాబెన్‌తో పెళ్లిఅయ్యింది. పెళ్లి అయిన మూడేళ్లు మోడీ గహస్త జీవితాన్ని గడిపాడు. ఆతర్వాత ఏమైందో ఏమో.. ఇల్లు విడిచిపోయాడు. జశోదాబెన్ తన పుట్టింటికి వెళ్లి తన ఇద్దరు అన్నదమ్ముల తో కలిసి జీవిస్తున్నది. దశాబ్దాలుగా భర్తకు దూరం గా ఉన్నా.., తనను ఒంటరిని చేసి వెళ్లిపోయిన భర్తపై కోపం పెంచుకోలేదు. భారతీయ స్త్రీగా భర్త బాగోగులు కోరే భారతీయ వనితగా నిలిచిఉన్నది. అయితే ఇప్పుడు జశోదాబెన్ పదవీ విరమణ పొం దిన ఉపాధ్యాయురాలు. నెలకు 14వేల రూపాయ ల పింఛన్‌తో నియమనిష్టలతో బతుకుతున్నది. ఇపుడామె తన భర్త మోడీని ప్రధానిగా చూడాలని కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా నియమం పాటిస్తున్నది!

ఇదంతా ఇలా ఉంచితే.. ఇప్పుడు చర్చంతా మోడీ చుట్టూ, జశోదాబెన్ చుట్టూ తిరగడానికి కారణం లేకపోలేదు. ఏం ఆశించి మోడీ తన పెళ్లి విష యాన్ని దాచాడనేదే చర్చనీయాంశం అవుతున్నది. అనేక మార్లు బహిరంగ సభల్లో, ఎన్నికల కమిషన్‌కు తెలిపిన వ్యక్తిగత వివరాల్లో పెళ్లి విషయాన్ని దాచి, ఒంటరినని ప్రకటించిన మోడీని ఎలా విశ్వసించాలన్నదే అసలు విషయం. రాజకీ య నాయకులు ఇలా వ్యక్తి గత జీవితం పేరిట అబద్ధాలుడటం నైతికంగా ఎంత వరకు సమర్థనీయమ ని సమాజం అంటున్నది. రాజకీయాల కోసం ఎం తటి అబద్ధాన్నయినా ఇంత సులువుగా ఆడేస్తారా? నైతిక విలువల పట్టం కట్టాల్సిన ప్రజాప్రతినిధులు అబద్ధాలాడితే.. విలువల మాటేమిటి?

అయితే.. వ్యక్తుల వ్యక్తిగత విషయాలు ఎవరికీ చర్చనీయాంశం కాకూడదు. కారాదు అనేదే భారతీయ సమాజంలో ఉన్న నీతి. కానీ.. ప్రజాజీవితం లో ప్రవేశించి, ప్రజా ప్రతినిధిగా ముందుకు వచ్చిన వారంతా అన్ని విషయాల్లో తెరిచిన పుస్తకంగా ఉండాలని ప్రజలు కోరుకుంటారు. అన్ని నియమాలకు, విలువలకు తమ నేతలు ఉండాలని ఆశపడతారు. ముఖ్యంగా నైతిక విషయాల పట్ల పాలకులు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటారు. నైతిక విలువలు లేని నాయకులను ప్రజలు ఎప్పు డూ తమ విశ్వాసంలోకి తీసుకోలేదు. గతంలో ఇందుకు అనేక ఉదాహరణలున్నాయి. ఈ మధ్యనే జరిగిన శశిథరూర్ ఉదంతం ఉండనే ఉన్నది. థరూర్ తన ర్య సునందాపుష్కర్ కథ దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే లేపింది. పెద్ద కుంభకోణాలకు నెలవు అయ్యింది. అయితే చివరకు పుష్కర్ ఉదంతం విషాదాంతం అయినా నైతిక విలువల ప్రశ్న మన నేతలను పదే పదే వెంబడిస్తున్నది. ఇప్పడు తాజా గా మోడీ భార్య విషయం కూడా దేశాన్ని ఊపేస్తున్నది.

ఇక ఇలాంటి నైతిక విలువల విషయం ఒక పురాతన భారతీయ సంప్రదాయాల, సంస్కతి నేపథ్యంలో మాత్రమే ప్రధానం కావడం లేదు. చాలా అభివద్ధి చెందినవని చెప్పుకుంటున్న అమెరికా, ఇంగ్లండ్, యూరప్ దేశాల్లో కూడా నేతల నైతిక విలువల విషయం పదే పదే తెరమీదికి వచ్చి ఆయా దేశాలను కుదిపేసిన సందర్భాలూ ఉన్నాయి. అమెరికా దేశాధ్యక్షుడు బిల్ క్లింటన్ తన అధికార నివాసంలో అనైతిక, వివాహేతర సంబంధాలు కొనసాగించారని పదవినే కోల్పోయే స్థితి వచ్చింది. స్త్రీ, పురుష సంబంధాల్లో చాలా సరళత్వం పాటిస్తారని చెప్పుకుంటున్న దేశాల్లోనే వివాహేతర సబంధాలున్నాయని బయట పడిన సందర్భాల్లో చాలా మంది పోటీ నుంచి తప్పుకున్న సంఘటనలున్నాయి. మరి కొందరు పదవులు కోల్పోయిన ఉదంతాలు ఉన్నా యి. ఎంతో సత్ సంప్రదాయాలకు పెట్టని కోటగా చెప్పుకుంటున్న మన దేశంలోనే నైతిక విలువలు, విషయాలు అట్టడుగున ఉంటున్నాయి. పట్టించుకోరానివిగా మిగులుతున్నాయి.

అయితే మన నేతలకు అబద్ధాలు చెప్పడం పారిపాటి అయ్యింది. ప్రధాని మన్మోహన్‌సింగ్ కూడా తన రాజ్యసభ ఎన్నిక కోసం తన నివాసం అస్సాం అని తప్పుడు సమాచారం ఇచ్చారు. కానీ అది అప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాలేదు. ఎప్పుడై నా ఒక తప్పుకు మరో తప్పు సరిసమానం కాదు. ఒక తప్పును మరో తప్పు రద్దు చేయదు, సరిచేయ దు. కాబట్టి దానికి, దీనికి చెల్లు రీతిన పార్టీలు వ్య వహరించినా ప్రజలు ఇలాంటి అనైతిక విషయాల ను, అబద్ధాలను తీవ్రంగా పరిగణిస్తారు. కాబట్టి మోడీ తాను దాచి పెట్టిన జశోదాబెన్ విషయం అం త తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు.

గాంధీ సిద్ధాంతాలను ఎత్తి పట్టడం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించుకున్న మోడీ.., ఇక్కడే ఒక విషయం గుర్తు చేసుకోవాలి. ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులకు వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు. ఉండకూడదు అని గాంధీ బోధించాడు. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత వ్యక్తిగత జీవితమంటూ ఒకటి ఉండదు అని కూడా గాంధీ తేల్చి చెప్పారు. కాబట్టి తన వ్యక్తిగత జీవితమని చెప్పుకుంటున్న దానికి మోడీ ఏం సమాధా నం చెబుతారు?

940

PUNAM I KOUSHISH

Published: Sat,December 19, 2015 12:48 AM

శాసనకర్తలకు విద్య అవసరం లేదా?

ఎంపీలు, ఎమ్మెల్యేలు.. చట్టసభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరించాలి. ప్రజలకు కావాల్సినవి సాధించాలి. ప్రజలకు మంచి జీవితాన్నందించడం కోసం పా

Published: Wed,August 19, 2015 12:07 AM

కష్టంగా నెట్టుకొస్తున్న మోదీ

పరిపాలనా రంగంలో పరివర్తన కోసం భారత ప్రజ లు మోదీకి అధికారం కట్టబెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన

Published: Wed,August 12, 2015 01:47 AM

చర్చలు సాగని చట్టసభలు

ఇవ్వాళ రాజకీయాల్లో చర్చలకు తావులేకుండాపోయింది. బలప్రదర్శనకే పెద్దపీట వేస్తున్నారు. తమ సంఖ్యాబలంతో అధిపత్యం చూపించుకోవడానికే ప్రాధా

Published: Sat,May 16, 2015 12:39 AM

అధికార దుర్వినియోగం..

మన నేతలంతా వ్యాపారుల్లా అవతారాలెత్తి లాభాలు దండుకుంటుంటే.. ఆమ్ ఆద్మీ- గరీబ్ అవుతున్నాడు. మన నేతలు తమ ప్రైవేటు వ్యవహారాలుగా చెబుతున

Published: Thu,February 26, 2015 01:56 AM

పరిశుభ్రత సరే... ప్రాణాల సంగతి?

ఇండియాలో అన్నింటికన్నా అగ్గువ (చీప్) ఏదైనా ఉన్నదంటే.. అది మనుషు ల ప్రాణమే. కూరగాయల కన్నా ఒకింత విలువ, సమయాన్ని బట్టి వాటి ప్రాముఖ్

Published: Sun,December 21, 2014 01:51 AM

మత మార్పిడులకు పునాది ఏమిటి?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. కానీ ఇది

Published: Wed,April 2, 2014 01:18 AM

ఎన్నికలు- విదేశీ నిధులు

ప్రజాస్వామ్యం వెలుగొందాలి అంటే.. రాజకీయాలను నియంత్రిస్తున్న ధనప్రవాహాన్ని నియంత్రించాలి. ఎన్నికల నిధులు ఎక్కడనుంచి,ఏం ఆశించి వస్త

Published: Thu,February 6, 2014 12:15 AM

తెలంగాణ ఏర్పాటు-పాఠాలు

సామాజిక సమస్యల విషయంలో వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించి దానికి తగిన విధంగా మసలుకోకుంటే.. అది కాలక్రమంలో ప్రతీకారం తీర్చుకుంటుందని భ

Published: Sun,May 5, 2013 12:42 PM

నేతల చావు రాజకీయాలు

మన నేతలు ప్రతిదాన్నీ రాజకీయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అది ఇంకా ముదిరి శవరాజకీయాలనుంచి ఎదిగి చావు రాజకీయాల దాకా వచ్చింది. సరబ

Published: Mon,April 8, 2013 02:41 AM

జేపీసీలు ఎందుకోసం?

ఊహించినట్లుగానే శీతాకాల పార్లమెంటు సమావేశాలు వాడి, వేడిగా సాగా యి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు నడిచిందనిపించుకున్నది. శ్రీ

Published: Fri,March 15, 2013 02:16 AM

అవినీతి అంతమెప్పుడు?

ముఖం చూసి బొట్టు పెట్టడమన్నది మన సంప్రదాయమైపోయింది. ఇదిప్పుడు పాలనా విధానంలోకి తర్జుమా అయ్యింది. నీ చేయి బెంచి కిందినుంచి ఎంత తొంద

Published: Mon,January 21, 2013 12:11 AM

నేర రాజకీయాలే సమస్య

మేకలను బలి ఇచ్చి పులులను అందలమెక్కించే నీతి దేశంలో రాజ్యమేలుతున్న ది. ఇది ఎక్కడనో ఒకచోట జరుగుతున్న తంతు కాదు, దేశంలో మూల మూలనా ఇదే

Published: Thu,January 3, 2013 11:47 PM

మన ప్రయాణమెటు?

ఈమధ్య కొన్ని ఉదంతాలు సగటు భారతీయుడిని భయవూభాంతులకు గురిచేస్తున్నాయి. మనం కలలుగన్న భారత్ ఇదే నా అని కన్నీరు కార్చే స్థితి వచ్చింది.

Published: Mon,December 10, 2012 12:12 AM

నీతిబాహ్య రాజకీయాలే నీటి తగాదాలు

రాజకీయ నాయకులు ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ, మహానీయులు భావి తరాల కోసం ఆలోచిస్తారనేది పెద్దలమాట. దీని కనుగుణంగానే నేటి రాజకీయ న

Published: Sun,December 2, 2012 11:30 PM

ప్రజారోగ్యం పట్టని పాలకులు

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నది పాత మాట. ఇప్పుడు ప్రజల అనారోగ్యమే కొందరికి వరమైపోయింది. రోగగ్రస్థ సమాజంతోనే లాభాలను పిండుకునే పరిస్థిత

Published: Wed,October 10, 2012 05:33 PM

మాటల్లోనే గాంధీ మార్గమా?

నేనుంటున్న ఇంటి పక్కనే ఓ నవయువకుడు ఉంటాడు. ఆయనను ‘గాంధీ గురించి నీ అభివూపాయం ఏమిటీ’ అనగానే.. ‘అతనికేం సొట్టబుగ్గల అందగాడు. మోస్ట్

Published: Sat,October 6, 2012 04:24 PM

అసోం అల్లర్లపై అలసత్వమేల?

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుం టూ కాలక్షేపం చేశాడని..అది నిర్లక్ష్యానికి, బాధ్యతా రాహిత్యానికి సంకేతంగా చె

Published: Sat,October 6, 2012 04:25 PM

ఎంతకాలం ఈ గందరగోళం?

ఇరాచకం తరువాత అత్యంత అధ్వాన్నమైన స్థితి ప్రభుత్వం అంటాడు హెన్నీ బీచర్. ఇప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ పరిపాలనా విధానాన్ని చూస్తే

Published: Sat,October 6, 2012 04:25 PM

కాముకుల కాసుల క్రీడ

జంటిల్‌మెన్ గేమ్ జంగ్లీగా తయారైంది. ‘ఐపీఎల్’క్షికికెట్ వివాదాల మయం అవుతోంది. క్రికెట్ ఇవాళ.. మూడు ‘సీ’ల చుట్టూ తిరుగు తున్నది. క్య

Published: Sat,October 6, 2012 04:25 PM

అర్హత లేకున్నా అందలమేలా?

రాజకీయాలకు కేంద్ర నిలయమైన ఢిల్లీ ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటుం ది. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం (ఎన్సీటీసీ) ఏర్పాటుపై కేంద్రానికి ర