ఎన్నికలు- విదేశీ నిధులు


Wed,April 2, 2014 01:18 AM

ప్రజాస్వామ్యం వెలుగొందాలి అంటే.. రాజకీయాలను నియంత్రిస్తున్న ధనప్రవాహాన్ని నియంత్రించాలి. ఎన్నికల నిధులు ఎక్కడనుంచి,ఏం ఆశించి వస్తున్నాయో రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆలోచించగలిగినప్పుడే ప్రజానుకూల విధానాలు రూపొందుతాయి. పారదర్శకమైన పాలన అందుతుంది.
దేశంలో ఎన్నికల కాలం వచ్చింది. ఎక్కడ చూసినా ఎలక్షన్ల హడావుడి జోరందుకున్నది. గల్లీనుంచి ఢిల్లీ దాకా ఎన్నికల హోరు ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ చూసినా ఎన్నికల్లో ధన ప్రవాహం గురించి చర్చ మునుపెన్నడూ లేనివిధంగా సాగుతున్నది. ఈ క్రమంలోనే రాజకీయ పార్టీ లు ఎన్నికల నిధులను ఓటర్లపై కుమ్మరిస్తున్నాయి. ఓట్లను దండుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. చోటా బడానేతలు ఎన్నికల్లో ధన ప్రవాహ బలంతో పాగా వేయడానికి పడరాని పాట్లు పడుతున్నారు. అయితే.. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా రాజకీయ పార్టీలు ఎన్నికల నిధులను సమకూర్చుకోవడంలో పోటీ పడుతున్నాయి.
తద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి తంటాలు పడుతున్నాయి. దీనికోసం రాజకీయ పార్టీలన్నీ ఏ రూపం లో వీలైతే ఆ రూపంలో ఎన్నికల నిధులను సమకూర్చుకోవడానికి వెనుకంజ వేయడం లేదు. ముఖ్యంగా బడా పారిశ్రామికవేత్తలు, విదేశీ కార్పొరేట్ సంస్థల నుంచి కూడా పెద్ద మొత్తంలో ఎన్నికల నిధులను పార్టీలు తమ ఖాతాలో జమ చేసుకుంటున్నాయి.
గత కొన్నాళ్లుగా దేశంలోకి విదేశీ, బహుళజాతి కంపెనీల ధన ప్రవాహం పెరిగిపోయింది. ముఖ్యం గా వేదాంత కంపెనీ నిధులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చిపడుతున్నాయి. రాజకీయ పార్టీల ఖాతాల్లో చేరిపోతున్నాయి. అయితే విదేశీ నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసే, నియంత్రించే విదేశీ నిధుల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్) ఆమోదం మేరకే నిధులు వచ్చి చేరుతున్నాయా? అంటే అనుమానమే. ఈమధ్య కాలంలోనే వేదాంత కంపెనీ కాంగ్రెస్ పార్టీకి 10.29 కోట్ల రూపాయలు చందా రూపంలో చెల్లించింది.
అలాగే బీజేపీకి కూడా 19.5 కోట్లు ముట్టజెప్పింది. మరో 28 కోట్ల రూపాయలు వివిధ పార్టీలకు ముట్టజెప్పింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ హైకోర్టు విదేశీ నిధుల గురించి విదేశీ నిధులు ఎన్నికల రాజకీయాలను కానీ, ప్రభుత్వాధికారులు, న్యాయమూర్తులను కానీ ప్రభావితం చేసే విధంగా ఉండరాద ని తేల్చి చెప్పింది. ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్- 1976 ప్రకారం విదేశీ నిధులు ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ఉండరాదని తెలిపింది. కానీ దేశంలో బడా కంపెనీల నుంచి రాజకీయ పార్టీలన్నింటికి ఎన్నికల నిధులు అందుతున్నాయన్నది బహిరంగ రహస్యం. బడా పారిశ్రామిక, కార్పొరేట్ కంపెనీలు ఇస్తున్న నిధులు తీసుకుంటున్న పార్టీలు ఆ కంపెనీలకు అనుకూలమైన విధానాలు రూపొందిస్తూ ప్రజలకు తీవ్రంగా నష్టపరుస్తున్నారన్నది జగమెరిగిన సత్యం.
వేదాంత కంపెనీ ఎన్డీయే ప్రభుత్వానికి వందకోట్ల రూపాయలు ముట్టజెప్పి ప్రభుత్వ రంగ సంస్థ బాల్కో కంపెనీని చేజిక్కించుకున్నది. మరో కార్పొరేట్ కంపెనీ తాను అనుకున్న కాంట్రాక్టులు పొందడానికి 50 కోట్లు ముట్టజెప్పింది. ఇదిలా ఉంటే మరో పారిశ్రామిక కంపెనీ కాంగ్రెస్ పార్టీకి 50 కోట్లు అందించింది. దీంతో ఆ కంపెనీ ప్రతినిధిని కాంగ్రెస్ పార్టీ తన పార్టీ ముఖ్య స్థానంలోకి తీసుకున్నది. ఈ కార్పొరేట్ కంపెనీల చిత్ర విచిత్రాలు ఎలా ఉంటాయంటే.. ఒక కార్పొరేట్ కంపెనీ బీజేపీకి పెద్ద మొత్తంలో ఎన్నికల నిధులు ఇచ్చి , ఆ కంపెనీ ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ తరఫున 2004 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు. ఈ విధంగా కార్పొరేట్ కంపెనీలు ఇరువైపులా పదునైన కత్తిలా భారత రాజకీయ వ్యవస్థలో ఉన్న రెండు ప్రధాన పార్టీలను బుట్టలో వేసుకుని తమ పని తాము చేసుకుని పోతున్నాయి.
ఇదిలా ఉంటే గత కొన్ని నెలలుగా దేశంలోకి విదేశీ నిధులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఈ అధికారుల పరిశీలనలో తేలిందేమంటే.. స్వచ్ఛంద సంస్థల పేరుతో పెద్ద మొత్తంలో విదేశీ నిధులు భారత్‌దేశంలోకి వచ్చి పడుతున్నాయని గుర్తించారు. పశ్చిమ బెంగాల్ కేంద్రంగా జరిపిన పరిశోధనలో తేలిందేమంటే.. గత సంవత్సరం కన్నా ఈ ఏడాది ఎక్కువ నిధులు వచ్చిపడుతున్నాయి.
2012లో 14 వందల కోట్లు వస్తే 2013లో 17 వందల కోట్లు వచ్చాయి. అయితే వీటిలో అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి ముట్టినట్టుగా కేవలం 2 కోట్ల 81లక్షలుగా చెప్పారు. బీజేపీకి 11కోట్ల 69 లక్షలు ముట్టాయి. కానీ ఎవరూ చెప్పని రహస్యం ఏమంటే.. పార్టీలు ఎన్నికలకోసం ఖర్చుపెట్టిన 3675 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిచ్చారు అన్నదానికి ఎవరూ సమాధానం చెప్పడం లేదు. 2011-12 సంవత్సరంలో దేశంలోని ఆరు రాజకీయ పార్టీల సంవత్సరాదాయం 4899 కోట్ల రూపాయలు.
ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకోసం వచ్చిందో ఏ పార్టీ చెప్పదు! ఎవరు నమ్మినా నమ్మకపోయినా.. కాంగ్రెస్ పార్టీకి అందిన నిధుల్లో 11.89 శాతం అంటేనే 774 కోట్ల రూపాయలు. బీజేపీ అందిన నిధులు 426 కోట్లు. బీఎస్‌పీకి 99 కోట్లు. ఇలా ఏ పార్టీ చూసినా వాటి చరిత్ర ఇలాగే ఉన్నది. కమ్యూనిస్టు పార్టీలు కూడా తక్కువేమీ తినలేదు. ఈ పార్టీలకు కూడా బడా కార్పొరేట్ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలోనే నిధులు అందుతున్నాయి. ఆ పార్టీలు కూడా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా విధానాలు రూపొందించి ప్రజలను బలిచేస్తున్నారు.ఈ నేపథ్యంలో వచ్చినవే సింగూర్, నందిగ్రాం ఉదంతాలు.
ఇంకా ఆశ్చర్యపరిచే విషయమేమంటే.. బడా పారిశ్రామిక కంపెనీల సీఈఓలంతా పార్లమెంట్ కారిడార్‌లో యధేచ్చగా తిరుగుతూ పార్లమెంట్‌లో జరిగే ప్రతి విషయాన్నీ ప్రభావితం చేస్తూ ఉంటారు. పరిస్థితి ఎంతదాకా పోయిందంటే.. రాజకీయ పార్టీల భవిష్యత్తు కూడా బడా కంపెనీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటున్నది. ఎవరు ఎంత కాలం ఏ పదవిలో ఉండాలో కూడా కంపెనీలే నిర్ణయించే, శాసించే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి ఇలా ఉంటే.. రాజకీయ వేత్తలంతా ప్రజలకు చేరువై అభిమానం చూరగొని ఎన్నికల్లో ఓట్లు పొంది ప్రజా ప్రతినిధులుగా వచ్చే కాలం పోయింది.
ఎన్నికల సమయంలోనే ప్రజల ముందుకు పోయి డబ్బును కుమ్మరించి ఓటర్లను ప్రభావితం చేసి ఎన్నిక కావడానికి ఆరాటపడుతున్నారు. మరో వైపు వ్యాపార వేత్తలే రాజకీయవేత్తల అవతారం ఎత్తడం కూడా ఈ మధ్యన పెరిగిపోయింది. తాము నిధులు ఇచ్చి రాజకీయ నాయకులు చుట్టూ తిరగడం ఎందుకనుకున్నారో ఏమో.. ఏకంగా వారే ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నారు. ఇటీవలి కాలంలో ఇలా వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులుగా అవతారం ఎత్తిన వారి సంఖ్య గణనీయంగానే పెరిగింది.ఈ పరిస్థితు ల్లో ఎన్నికలు సజావుగా జరగాలి, ప్రజాస్వా మ్యం వెలుగొందాలి అంటే.. రాజకీయాలను నియంత్రిస్తున్న ధనప్రవాహాన్ని నియంత్రించాలి. ఎన్నికల నిధులు ఎక్కడనుంచి, ఏం ఆశించి వస్తున్నాయో రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆలోచించగలిగినప్పుడే ప్రజానుకూల విధానాలు రూపొందుతాయి. పారదర్శకమైన పాలన అందుతుంది.
-పూనమ్ ఐ కౌశిష్
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్)

498

PUNAM I KOUSHISH

Published: Sat,December 19, 2015 12:48 AM

శాసనకర్తలకు విద్య అవసరం లేదా?

ఎంపీలు, ఎమ్మెల్యేలు.. చట్టసభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరించాలి. ప్రజలకు కావాల్సినవి సాధించాలి. ప్రజలకు మంచి జీవితాన్నందించడం కోసం పా

Published: Wed,August 19, 2015 12:07 AM

కష్టంగా నెట్టుకొస్తున్న మోదీ

పరిపాలనా రంగంలో పరివర్తన కోసం భారత ప్రజ లు మోదీకి అధికారం కట్టబెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన

Published: Wed,August 12, 2015 01:47 AM

చర్చలు సాగని చట్టసభలు

ఇవ్వాళ రాజకీయాల్లో చర్చలకు తావులేకుండాపోయింది. బలప్రదర్శనకే పెద్దపీట వేస్తున్నారు. తమ సంఖ్యాబలంతో అధిపత్యం చూపించుకోవడానికే ప్రాధా

Published: Sat,May 16, 2015 12:39 AM

అధికార దుర్వినియోగం..

మన నేతలంతా వ్యాపారుల్లా అవతారాలెత్తి లాభాలు దండుకుంటుంటే.. ఆమ్ ఆద్మీ- గరీబ్ అవుతున్నాడు. మన నేతలు తమ ప్రైవేటు వ్యవహారాలుగా చెబుతున

Published: Thu,February 26, 2015 01:56 AM

పరిశుభ్రత సరే... ప్రాణాల సంగతి?

ఇండియాలో అన్నింటికన్నా అగ్గువ (చీప్) ఏదైనా ఉన్నదంటే.. అది మనుషు ల ప్రాణమే. కూరగాయల కన్నా ఒకింత విలువ, సమయాన్ని బట్టి వాటి ప్రాముఖ్

Published: Sun,December 21, 2014 01:51 AM

మత మార్పిడులకు పునాది ఏమిటి?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. కానీ ఇది

Published: Tue,April 15, 2014 01:23 AM

ప్రజా జీవితంలో వ్యక్తిగతం ఉంటుందా..?

ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులకు వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు. ఉండకూడదు అని గాంధీ బోధించారు. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత వ్

Published: Thu,February 6, 2014 12:15 AM

తెలంగాణ ఏర్పాటు-పాఠాలు

సామాజిక సమస్యల విషయంలో వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించి దానికి తగిన విధంగా మసలుకోకుంటే.. అది కాలక్రమంలో ప్రతీకారం తీర్చుకుంటుందని భ

Published: Sun,May 5, 2013 12:42 PM

నేతల చావు రాజకీయాలు

మన నేతలు ప్రతిదాన్నీ రాజకీయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అది ఇంకా ముదిరి శవరాజకీయాలనుంచి ఎదిగి చావు రాజకీయాల దాకా వచ్చింది. సరబ

Published: Mon,April 8, 2013 02:41 AM

జేపీసీలు ఎందుకోసం?

ఊహించినట్లుగానే శీతాకాల పార్లమెంటు సమావేశాలు వాడి, వేడిగా సాగా యి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు నడిచిందనిపించుకున్నది. శ్రీ

Published: Fri,March 15, 2013 02:16 AM

అవినీతి అంతమెప్పుడు?

ముఖం చూసి బొట్టు పెట్టడమన్నది మన సంప్రదాయమైపోయింది. ఇదిప్పుడు పాలనా విధానంలోకి తర్జుమా అయ్యింది. నీ చేయి బెంచి కిందినుంచి ఎంత తొంద

Published: Mon,January 21, 2013 12:11 AM

నేర రాజకీయాలే సమస్య

మేకలను బలి ఇచ్చి పులులను అందలమెక్కించే నీతి దేశంలో రాజ్యమేలుతున్న ది. ఇది ఎక్కడనో ఒకచోట జరుగుతున్న తంతు కాదు, దేశంలో మూల మూలనా ఇదే

Published: Thu,January 3, 2013 11:47 PM

మన ప్రయాణమెటు?

ఈమధ్య కొన్ని ఉదంతాలు సగటు భారతీయుడిని భయవూభాంతులకు గురిచేస్తున్నాయి. మనం కలలుగన్న భారత్ ఇదే నా అని కన్నీరు కార్చే స్థితి వచ్చింది.

Published: Mon,December 10, 2012 12:12 AM

నీతిబాహ్య రాజకీయాలే నీటి తగాదాలు

రాజకీయ నాయకులు ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ, మహానీయులు భావి తరాల కోసం ఆలోచిస్తారనేది పెద్దలమాట. దీని కనుగుణంగానే నేటి రాజకీయ న

Published: Sun,December 2, 2012 11:30 PM

ప్రజారోగ్యం పట్టని పాలకులు

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నది పాత మాట. ఇప్పుడు ప్రజల అనారోగ్యమే కొందరికి వరమైపోయింది. రోగగ్రస్థ సమాజంతోనే లాభాలను పిండుకునే పరిస్థిత

Published: Wed,October 10, 2012 05:33 PM

మాటల్లోనే గాంధీ మార్గమా?

నేనుంటున్న ఇంటి పక్కనే ఓ నవయువకుడు ఉంటాడు. ఆయనను ‘గాంధీ గురించి నీ అభివూపాయం ఏమిటీ’ అనగానే.. ‘అతనికేం సొట్టబుగ్గల అందగాడు. మోస్ట్

Published: Sat,October 6, 2012 04:24 PM

అసోం అల్లర్లపై అలసత్వమేల?

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుం టూ కాలక్షేపం చేశాడని..అది నిర్లక్ష్యానికి, బాధ్యతా రాహిత్యానికి సంకేతంగా చె

Published: Sat,October 6, 2012 04:25 PM

ఎంతకాలం ఈ గందరగోళం?

ఇరాచకం తరువాత అత్యంత అధ్వాన్నమైన స్థితి ప్రభుత్వం అంటాడు హెన్నీ బీచర్. ఇప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ పరిపాలనా విధానాన్ని చూస్తే

Published: Sat,October 6, 2012 04:25 PM

కాముకుల కాసుల క్రీడ

జంటిల్‌మెన్ గేమ్ జంగ్లీగా తయారైంది. ‘ఐపీఎల్’క్షికికెట్ వివాదాల మయం అవుతోంది. క్రికెట్ ఇవాళ.. మూడు ‘సీ’ల చుట్టూ తిరుగు తున్నది. క్య

Published: Sat,October 6, 2012 04:25 PM

అర్హత లేకున్నా అందలమేలా?

రాజకీయాలకు కేంద్ర నిలయమైన ఢిల్లీ ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటుం ది. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం (ఎన్సీటీసీ) ఏర్పాటుపై కేంద్రానికి ర

Featured Articles