నేతల చావు రాజకీయాలు


Sun,May 5, 2013 12:42 PM

మన నేతలు ప్రతిదాన్నీ రాజకీయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అది ఇంకా ముదిరి శవరాజకీయాలనుంచి ఎదిగి చావు రాజకీయాల దాకా వచ్చింది. సరబ్‌జిత్ సింగ్ హత్యను మన నేతలు అందివచ్చిన అవకాశంగా మలుచుకుంటున్నారు. ప్రతివారూ సరబ్ మృతి నుంచి ఓట్లను రాల్చుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో మనకు అంతుపట్టని రెండు విషయాలున్నాయి. ఒక వీరజవాను తన సమాధి మీద చెక్కించుకున్న చివరి మాటలు. రెండవది-రాజకీయ నేతల వ్యవహారం. ఈక్రమంలో సరబ్‌జిత్‌సింగ్ జీవితం ఓ విషాదంగా ముగిసింది. 22 ఏళ్లుగా.. పాకిస్థాన్‌లో ఉరిశిక్ష పడి జైలులో గడుపుతున్న సరబ్ జీవితం అనుకోని పరిస్థితుల్లో అర్థాంతరంగా ముగిసింది. కొన్నేళ్లుగా సరబ్‌జిత్‌ను విడుదల చేయాలని భారత్ పాకిస్థాన్‌ను కోరుతూనే ఉన్నది.

ఆయన కుటుంబ సభ్యులు కూడా అనేక రకాలుగా అటు పాకిస్థాన్ అధికారులను, ఇటు భారత ప్రభుత్వాన్ని సరబ్‌ను విడుదల చేయించాలని వేడుకున్నారు. ఆయన ఉరిశిక్ష రద్దు పిటిషన్‌ను అక్కడి అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. కళ్ల ముందు ఉరితాడు వేలాడుతుంటే..కాలం గడుపుతున్న సరబ్‌ను అక్కడి జైలులో దాడికి గురై తీవ్ర గాయాలతో ఈనెల రెండోతేదీన చనిపోయాడు. ఈక్రమంలో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాకిస్థాన్ వ్యతిరేక నిరసనలు జరుగుతున్నాయి.

విషాదమేమంటే..మన సైనికులు దేశం కోసం తమ ప్రాణాలు ఇవ్వడానికి సదా సిద్ధంగా ఉంటున్నారు. కానీ మననేతలు మాత్రం వీలైనంత ఎక్కువ పోగేసుకుని ఎల్లకాలం ఎలా జీవించాలా అని ఆలోచిస్తున్నారు.ఈ క్రమంలో సరబ్‌జిత్ మరణం వారికి అందివచ్చిన అవకాశంగా తీసుకున్నారు. దీంతో సిక్కు ఓటు బ్యాంకును ఎలా కొల్లగొట్టాలో పథక రచన చేసి అమలు చేస్తున్నారు. ఓట్ల రాజకీయం పకడ్బందీగా చేసుకుపోతున్నారు. మన ప్రధాని మన్మోహన్‌సింగ్ అయితే ఏకంగా సరబ్‌ను ‘సాహసోపేతమైన భారత పుత్రుడు’ అని కీర్తించాడు. బీజేపీ అయితే..సరబ్ హత్యను తీవ్రంగా పరిగణించి పాకిస్థాన్‌తో అన్ని రకాల దౌత్యపరమైన సంబంధాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నది. పంజాబ్ ముఖ్యమంత్రి అకాలీదల్ నేత బాదల్ అతన్ని ‘జాతీయ హీరో’ అంటూ కీర్తించి, రాష్ట్రంలో మూడు రోజుల సంతాపదినాలను ప్రకటించారు.

కాంగ్రె స్ యువనేత, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తోపాటు అన్ని రాజకీయ పార్టీల ప్రముఖ నేతలంతా సరబ్ అంత్యక్షికియల్లో పాల్గొని అతని త్యాగాన్ని వేనోళ్ల పొగిడారు. 50వేల మంది పాల్గొన్న సరబ్ అంతిమ యాత్రలో పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. సరబ్‌జిత్‌సింగ్ కూతుళ్లిద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు, కోటి రూపాయల ఎక్స్‌క్షిగేషియా ఇస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి బాదల్ ప్రకటించారు. ఇదేగాక కేంద్ర ప్రభుత్వం కూడా సరబ్ కుటుంబానికి 25 లక్షల రూపాయలను నష్టపరిహారంగా ప్రకటించింది. పార్లమెంటు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి, అతని అంత్యక్రియలను పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాల ని ఆదేశించింది.

ఇదంతా బాగానే ఉన్నది. కానీ.. సరబ్ పాకిస్థాన్ జైలులో 22 ఏళ్లుగా నిర్బంధంలో ఉన్నప్పుడు ఇలాగే స్పందించి ఉంటే.. అతడికి ఈగతి పట్టేదా? రాజకీయ పార్టీల నేతలు, కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో సరబ్ విడుదల కోసం ఏం చేసిందంటే.. చెప్పడానికి ఏమీలేదు. సరబ్ కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వం దగ్గర మొర పెట్టుకున్నప్పుడల్లా సరబ్‌ను విడుదల చేయాలని ఒక ప్రకటన చేయడం మినహా చేసిందేమీలేదు. దౌత్యపరమైన చర్య లు, వత్తిడి చేస్తే.. సరబ్ పరిస్థితి వేరుగా ఉండేదేమో. కానీ.. ఆయన బతికి ఉన్నప్పుడు ఏ పార్టీకి, ప్రభుత్వానికి ఆయన దేశం కాని దేశంలో అక్రమంగా, అన్యాయంగా దశాబ్దాలుగా మగ్గుతున్నాడన్న ధ్యాస లేదు. ఇవ్వాళ..సరబ్ శవమై వచ్చిన తర్వాత ఆయన వీరత్వం, ధైర్యసాహసాలు గుర్తుకు వస్తున్నాయి.

అయితే...ఇక్కడ మరో ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నది. సరబ్ ప్రధాని మొ దలు అందరూ అంటున్నట్లు దేశం గర్వించదగ్గ అమరవీరుడేనా? ఆయనకు ఆ స్థాయి ఉన్నదా? దేశ సరిహద్దులో మనదేశ ప్రజల ప్రాణాలను కాపాడే క్రమంలో సరబ్ తన ప్రాణాలను పణంగా పెట్టాడా? దేశం కోసం ఆయన చేసిన త్యాగం ఏపాటిది? సరబ్‌జిత్‌సింగ్ అమాయకుడని మన ప్రభుత్వానికి తెలుసా? ఒక వేళ తెలిసినట్లయితే.. ఆయన విడుదల కోసం ఎందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి చేయలేదు? అయితే.. పాకిస్థాన్ సుప్రీంకోర్టు అతనికి మరణశిక్ష ఎందుకు విధించింది? భారత గూడాచారిగా..ఫైస్లాబాద్, లాహోర్‌లలో 1991 లో జరిగిన బాంబుపేలుళ్ల కేసులో 14 మంది మరణానికి కారకుడుగా సరబ్‌ను పాకిస్థాన్ నిర్బంధించడంలో నిజమెంత? ఈమొత్తం ఎపిసోడ్‌లో వాస్తవమెంత? లాంటి సవాలక్ష ప్రశ్నలు ఉన్నాయి.

పంజాబ్‌లోని తరన్ తరన్ జిల్లా భిక్‌వింద్ ప్రాంతానికి చెందిన ఓ అమాయక రైతు తాగిన మైకంలో పాకిస్థాన్ సరిహద్దును దాటిన నేరానికి సరబ్ ఇంత మూల్యాన్ని చెల్లించాడా? అయితే.. దీనిలో ప్రభు త్వ నిర్లక్ష్యం పాలు ఎంత? బాధ్యత ఎంత? నిజానికి సరబ్‌జిత్‌సింగ్ గాథ అత్యంత విషాదకరమైనది. హృదయం ద్రవింపచేసేది. చేయని నేరానికి దాయాదిదేశంలో బందీగా చిక్కి చావుబతుకుల మధ్య కళ్లముందు ఉరితాడు వేలాడుతుంటే.. ఏళ్ల తరబడి కాలం గడపడం భయంకరమైనది. చివరికి ఆయన సజీవంగా మాతృదేశానికి చేరకుండానే శవమై ఇంటికి చేరాడు. దీంతో అంతంత మాత్రంగా ఉన్న భారత్-పాక్ సంబంధాలు మరింత సంక్లిష్టంగా మారాయి. సరబ్ కుటుంబం చెబుతున్నట్లుగా తాగి న మైకంలో సరిహద్దు దాటిన నేరానికి పాకిస్థాన్ ఇంత దారుణంగా వ్యవహరించాల్సింది కాదని ప్రజలు అంటున్నారు.

సరబ్ కథ ఇలా నడుస్తుండగానే.. సరబ్ ఘటనలాంటిదే జమ్మూలో చోటుచేసుకున్నది. హిజ్‌బుల్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన టెర్రరిస్టుగా చెప్పబడుతున్న సానుల్లా రంజయ్‌పై జైలులో తోటి ఖైదీ దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీనితో ఇరుదేశాల మధ్య మరింత ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పాకిస్థాన్‌లో సరబ్‌కు జరిగిన తీరుగానే..,ఇండియాలో జమ్మూ కాశ్మీర్ జైలులో పాకిస్థాన్ ఖైదీ పై దాడి జరగడం,అతనూ ప్రాణాపాయ స్థితిలో ఉండటం అనేది దెబ్బకు దెబ్బ అనే సూత్రాన్ని గుర్తుకు తెస్తున్నది. దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు సామరస్య పూర్వక పరిస్థితుల్లో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి కానీ.., కన్ను కు కన్ను సమాధానం రీతిలో జరగడం ఎవరికీ మంచిది కాదు. ఈ క్రమంలో భారతీయ జైళ్లలో నిర్బంధంలోఉన్న పాక్ పౌరు ల స్థితిగతుల పట్ల జోక్యం చేసుకోవాల్సిందిగా ఐక్యరాజ్యసమితిని పాక్ కోరింది. ఇలాంటి ఘటనలు ఇంకా పునరావృతమైతే.. ఇరుదేశాల మధ్య అగాధం మరింత పెరిగి ఈ ప్రాంతమంతా యుద్ధ భూమిగా మారితే.. పాలకుల ప్రయోజనాలు నెరవేరుతాయేమో గానీ.. సామాన్య ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు. అమాయక సైనికు ల ప్రాణాలు బలిఅవుతాయి.

ఇలాంటి పరిస్థితిలో రాజకీయ పార్టీలు మా త్రం సరబ్ ఉదంతాన్ని ఓట్ల రాజకీయం చేయడానికి తమ శక్తి యుక్తులన్నింటినీ ఉపయోగిస్తున్నాయి. 1984ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రధాన ము ద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జన్ కుమార్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై సిక్కు ల్లో వ్యక్తమైన వ్యతిరేకతనుంచి తప్పించుకునేందుకు సరబ్ హత్యోదంతాన్ని కాంగ్రెస్ వాడుకుంటున్నది. ఢిల్లీలో మూడు వేల మంది సిక్కులను ఊచకోత కోసిన పాపంలో పాలుపంచుకున్న ప్రధాన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించడం వెనుక, ఇప్పుడు సరబ్‌ను దేశం కోసం త్యాగం చేసిన వీరుడుగా కీర్తించడం వెనుక ఉన్నది ఓట్ల రాజకీయం తప్ప మరోటి లేదు. అలాగే.. ఢిల్లీ గురుద్వార ఎన్నికల్లో ప్రత్యర్థి వర్గం గెలుపొందడం తో అకాలీదళ్ కూడా సిక్కుల మెప్పు పొందడం కోసం నానా తంటాలు పడుతున్న తరుణంలో సరబ్ శవం వారికి ఆసరాగా దొరికింది. దేశం ఏమైనా..పజలు ఎంత రక్తమోడినా రాజకీయ పార్టీలకు పట్టదు.

వారికి కావలసిన ఓట్ల కోసం ఎంతకైనా బరితెగిస్తారని సరబ్ ఉదంతంతో తేటతెల్లమైంది. దేశం కోసం ఎంతో అననుకూల పరిస్థితుల్లో పనిచేస్తూ ప్రాణాలు అర్పిస్తున్న సైనికులందరికీ ఇదే విధమైన గౌరవం, ఆదరణ లభిస్తున్నదా? అంటే లేదనే చెప్పాలి. ఇక్కడ సరబ్ ఎందుకు పాలకులకు కావలసి వచ్చిందో పార్టీలు ఆడుతున్న నాటకాలు చూస్తే అర్థమవుతున్నది. ప్రజలు, దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సైనికుల ప్రాణాలతో ఓట్ల రాజకీయం చేయడం పాలకులు మానుకునే విధంగా ప్రజలు ప్రశ్నించినప్పుడే దేశం శాంతియుతంగా, మానవీయంగా ఉంటుంది. ప్రజల మూఢ విశ్వాసాల పునాది మీద పాలకులు అధికార సౌధాలను నిర్మించుకునే దుస్థితి పోవాలి. మనుషుల ప్రాణాలతో రాజకీయాలు చేయడం అంతం కావాలి.

-పూనమ్ ఐ కౌశిష్
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్)

35

PUNAM I KOUSHISH

Published: Sat,December 19, 2015 12:48 AM

శాసనకర్తలకు విద్య అవసరం లేదా?

ఎంపీలు, ఎమ్మెల్యేలు.. చట్టసభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరించాలి. ప్రజలకు కావాల్సినవి సాధించాలి. ప్రజలకు మంచి జీవితాన్నందించడం కోసం పా

Published: Wed,August 19, 2015 12:07 AM

కష్టంగా నెట్టుకొస్తున్న మోదీ

పరిపాలనా రంగంలో పరివర్తన కోసం భారత ప్రజ లు మోదీకి అధికారం కట్టబెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన

Published: Wed,August 12, 2015 01:47 AM

చర్చలు సాగని చట్టసభలు

ఇవ్వాళ రాజకీయాల్లో చర్చలకు తావులేకుండాపోయింది. బలప్రదర్శనకే పెద్దపీట వేస్తున్నారు. తమ సంఖ్యాబలంతో అధిపత్యం చూపించుకోవడానికే ప్రాధా

Published: Sat,May 16, 2015 12:39 AM

అధికార దుర్వినియోగం..

మన నేతలంతా వ్యాపారుల్లా అవతారాలెత్తి లాభాలు దండుకుంటుంటే.. ఆమ్ ఆద్మీ- గరీబ్ అవుతున్నాడు. మన నేతలు తమ ప్రైవేటు వ్యవహారాలుగా చెబుతున

Published: Thu,February 26, 2015 01:56 AM

పరిశుభ్రత సరే... ప్రాణాల సంగతి?

ఇండియాలో అన్నింటికన్నా అగ్గువ (చీప్) ఏదైనా ఉన్నదంటే.. అది మనుషు ల ప్రాణమే. కూరగాయల కన్నా ఒకింత విలువ, సమయాన్ని బట్టి వాటి ప్రాముఖ్

Published: Sun,December 21, 2014 01:51 AM

మత మార్పిడులకు పునాది ఏమిటి?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. కానీ ఇది

Published: Tue,April 15, 2014 01:23 AM

ప్రజా జీవితంలో వ్యక్తిగతం ఉంటుందా..?

ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులకు వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు. ఉండకూడదు అని గాంధీ బోధించారు. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత వ్

Published: Wed,April 2, 2014 01:18 AM

ఎన్నికలు- విదేశీ నిధులు

ప్రజాస్వామ్యం వెలుగొందాలి అంటే.. రాజకీయాలను నియంత్రిస్తున్న ధనప్రవాహాన్ని నియంత్రించాలి. ఎన్నికల నిధులు ఎక్కడనుంచి,ఏం ఆశించి వస్త

Published: Thu,February 6, 2014 12:15 AM

తెలంగాణ ఏర్పాటు-పాఠాలు

సామాజిక సమస్యల విషయంలో వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించి దానికి తగిన విధంగా మసలుకోకుంటే.. అది కాలక్రమంలో ప్రతీకారం తీర్చుకుంటుందని భ

Published: Mon,April 8, 2013 02:41 AM

జేపీసీలు ఎందుకోసం?

ఊహించినట్లుగానే శీతాకాల పార్లమెంటు సమావేశాలు వాడి, వేడిగా సాగా యి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు నడిచిందనిపించుకున్నది. శ్రీ

Published: Fri,March 15, 2013 02:16 AM

అవినీతి అంతమెప్పుడు?

ముఖం చూసి బొట్టు పెట్టడమన్నది మన సంప్రదాయమైపోయింది. ఇదిప్పుడు పాలనా విధానంలోకి తర్జుమా అయ్యింది. నీ చేయి బెంచి కిందినుంచి ఎంత తొంద

Published: Mon,January 21, 2013 12:11 AM

నేర రాజకీయాలే సమస్య

మేకలను బలి ఇచ్చి పులులను అందలమెక్కించే నీతి దేశంలో రాజ్యమేలుతున్న ది. ఇది ఎక్కడనో ఒకచోట జరుగుతున్న తంతు కాదు, దేశంలో మూల మూలనా ఇదే

Published: Thu,January 3, 2013 11:47 PM

మన ప్రయాణమెటు?

ఈమధ్య కొన్ని ఉదంతాలు సగటు భారతీయుడిని భయవూభాంతులకు గురిచేస్తున్నాయి. మనం కలలుగన్న భారత్ ఇదే నా అని కన్నీరు కార్చే స్థితి వచ్చింది.

Published: Mon,December 10, 2012 12:12 AM

నీతిబాహ్య రాజకీయాలే నీటి తగాదాలు

రాజకీయ నాయకులు ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ, మహానీయులు భావి తరాల కోసం ఆలోచిస్తారనేది పెద్దలమాట. దీని కనుగుణంగానే నేటి రాజకీయ న

Published: Sun,December 2, 2012 11:30 PM

ప్రజారోగ్యం పట్టని పాలకులు

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నది పాత మాట. ఇప్పుడు ప్రజల అనారోగ్యమే కొందరికి వరమైపోయింది. రోగగ్రస్థ సమాజంతోనే లాభాలను పిండుకునే పరిస్థిత

Published: Wed,October 10, 2012 05:33 PM

మాటల్లోనే గాంధీ మార్గమా?

నేనుంటున్న ఇంటి పక్కనే ఓ నవయువకుడు ఉంటాడు. ఆయనను ‘గాంధీ గురించి నీ అభివూపాయం ఏమిటీ’ అనగానే.. ‘అతనికేం సొట్టబుగ్గల అందగాడు. మోస్ట్

Published: Sat,October 6, 2012 04:24 PM

అసోం అల్లర్లపై అలసత్వమేల?

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుం టూ కాలక్షేపం చేశాడని..అది నిర్లక్ష్యానికి, బాధ్యతా రాహిత్యానికి సంకేతంగా చె

Published: Sat,October 6, 2012 04:25 PM

ఎంతకాలం ఈ గందరగోళం?

ఇరాచకం తరువాత అత్యంత అధ్వాన్నమైన స్థితి ప్రభుత్వం అంటాడు హెన్నీ బీచర్. ఇప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ పరిపాలనా విధానాన్ని చూస్తే

Published: Sat,October 6, 2012 04:25 PM

కాముకుల కాసుల క్రీడ

జంటిల్‌మెన్ గేమ్ జంగ్లీగా తయారైంది. ‘ఐపీఎల్’క్షికికెట్ వివాదాల మయం అవుతోంది. క్రికెట్ ఇవాళ.. మూడు ‘సీ’ల చుట్టూ తిరుగు తున్నది. క్య

Published: Sat,October 6, 2012 04:25 PM

అర్హత లేకున్నా అందలమేలా?

రాజకీయాలకు కేంద్ర నిలయమైన ఢిల్లీ ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటుం ది. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం (ఎన్సీటీసీ) ఏర్పాటుపై కేంద్రానికి ర

Featured Articles