జేపీసీలు ఎందుకోసం?


Mon,April 8, 2013 02:41 AM

ఊహించినట్లుగానే శీతాకాల పార్లమెంటు సమావేశాలు వాడి, వేడిగా సాగా యి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు నడిచిందనిపించుకున్నది. శ్రీలంకలో తమిళులపై ఊచకోతకు సంబంధించి ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టే బిల్లులో సవరణలు చేర్చాలనే డిమాండ్‌తో యూపీఏ మిత్రపక్షం డీఎంకే ఏకంగా మద్దతు ఉపసంహరించుకున్నది. డీఎంకే మద్దతు ఉపసంహరణ టీ కప్పులో తుపానులా మారిపోయి, పార్లమెంటు సమావేశాలు నాటకీయతకు రక్తికట్టించాయి. ఇవన్నీ ఇలా ఉంటే.. ప్రభుత్వం తాను చేయదలుచుకున్న పనిని చల్లగా చేసుకుపోయింది. దేశాన్ని కుదిపేసిన వెస్ట్‌లాండ్ హెలీకాప్టర్ కుంభకోణంలో 362 కోట్ల రూపాయల లంచం ఉదంతంపై ప్రభుత్వం జేపీసీ వేసింది. ఒకవైపు ఈ కుంభకోణంపై సీబీఐ రంగంలోకి దిగి చార్జిషీట్ దాఖలు చేయడమే కాదు, మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ త్యాగిని ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలతో ఆయనను చార్జిషీట్‌లో నిందితునిగా చేర్చింది.

లంచాలు పుచ్చుకుని రక్ష ణ వ్యవస్థకు తూట్లు పొడిచారన్న దానిపై దేశమంతా అట్టుడుకిపోతుంటే.., ప్రభు త్వం ఎవరు అడగకున్నా జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)వేసింది. సీబీ ఐ కేసును విచారిస్తున్న సందర్భంలో జేపీసీ వేయవలసిన అవసరం లేదని ప్రధా న ప్రతిపక్షపార్టీ బీజేపీ వ్యతిరేకిస్తున్నా.. ప్రభుత్వం జేపీసీ వేసింది.

ఏదైనా కుంభకోణం జరిగిందని మీడియా కోడై కూసిన తర్వాత, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తేగానీ జేపీసీ వేయడానికి ముందుకు రాని ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నా జేపీసీ వేయడంలో మతలబు ఏమిటి? వెస్ట్‌లాండ్ ముడుపుల కేసులో సీబీఐ కంటే లోతైన విచారణ చేసి జేపీసీ నిజాలు నిగ్గుతేలుస్తుందా? అంటే.. వీటన్నింటికీ లేదనే సమాధానం చెప్పుకోవాలి. 2010 శీతాకాల సమావేశాల్లో కూడా 2జీ స్పెక్ట్రం కుంభకోణంపై పెద్ద ఎత్తున రభస జరిగింది. వెంటనే జేపీసీ వేయాలని బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. ఇదే కాం గ్రెస్ యూపీఏ ప్ర భుత్వం ససేమిరా అన్నది.

అసలు స్పె క్ట్రం కేటాయింపు ల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పుకొచ్చింది. అన్ని నిబంధనల ప్రకారమే జరిగాయని బొంకింది. కానీ 2జీ స్పెక్ట్రం కేటాయింపులను ‘కాగ్’ కూడా తప్పు పట్టి దేశ వూపయోజనాలు దెబ్బతీసే విధంగా వేలకోట్ల కుంభకోణం జరిగిందని తేల్చడంతో చివరికి సంబంధిత మంత్రులు జైలుకు వెళ్లక తప్పలేదు. ఇవన్నింటీని చూస్తుంటే.. జేపీసీలు ఎందుకు వేస్తారు? వాటితో ఏం సాధిస్తారు? జేపీసీలు నిజాలు నిగ్గుతేల్చి అవినీతి అంతానికి ఒక నిర్దిష్టమైన సూచనలు చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లాంటి ప్రశ్నలు సహజంగా తలెత్తుతాయి. ఇక వెస్ట్‌లాండ్ హెలీకాప్టర్ కుంభకోణంలో సీబీఐ విచారణ జరుగుతుండగానే ప్రభుత్వం జేపీసీ వేయడానికి వెనుక మతలబు ఏంటో తెలిసిపోతున్నది.ఆ కంపెనీ సీఈఓను ఇటలీ అధికారులు అరెస్టు కూడా చేశారు.

ఇక్కడ సీబీఐ ముడుపులు పుచ్చుకున్న ప్రధాన నిందితులపై కేసులు నమోదు చేసి విచారణ సాగిస్తున్నది. ఈ తరుణంలో జేపీసీ వేయడం అంటే..అసలు దోషులు తప్పించుకోవడానికి, సాక్ష్యాలు తారుమారు చేయడం,మాయం చేయడానికి కావలసిన సమయం ఇవ్వడానికేనని అర్థమవుతున్నది. ఇలాంటి అనుభవమే 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో వేసిన జేపీసీ కమిటీ చైర్మన్ చాకో తన ఆచరణలో చేసి చూపించాడు. టెలికాం కుంభకోణంలో జరిగిన అవినీతిని బట్టబయలు చేయడానికి బదులు విచారణ పేర వీలైనంత కాలయాపన చేయడానికి ప్రయత్నించారు. రాజా గద్దెమీద కూర్చొని ఎంత బెట్టు చేశారో దేశమంతా చూసింది. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మింగి ఏమి ఎరగనట్లు నమ్మించాలని చూసినా ప్రజా వత్తిడికి తలొగ్గి పదవిని వదులుకోక తప్పలేదు. కానీ అత్యున్నత అధికార వర్గాల అండదండలతోనే టెలికాం కుం భకోణం జరిగిందని, విచారణ పరిధిలోకి ప్రధాని మన్మోహన్,ఆర్థికమంత్రి చిదంబరం కూడా రావాలని ప్రజలు, ప్రతిపక్షాలు ఎంత ఆందోళన చేసినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. కుంభకోణానికి ప్రధాన బాధ్యులుగా రాజా, కణిమొళిని ప్రభుత్వంనుంచి తప్పించి చేతులు దులుపుకున్నది.

అంతిమంగా జేపీసీల మూలంగా జరుగుతున్నదంతా ఓ తంతుగా మారిపోయింది.యూపీఏ అయినా,ఎన్‌డీఏ అయినా జీపీసీల పనితీరు గొప్పగా ఏమీ లేదు. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు చేసిన నేరాల విచారణను కొందరు ప్రజావూపతినధులకు అప్పజెప్పడం ‘హత్యానేరం చేసిన వారికే దాని విచారణను అప్పజెప్పిన చందం’గా ఉంటున్నది. బీజేపీగానీ, కాంగ్రెస్ కానీ తమ సభ్యులే నేరం చేశారని తమ సభ్యులతో విచారణ చేసి నిజాలు వెల్లడి చేస్తాయా? ఇప్పటిదాకా ఏర్పాటైన ఐదు జేపీసీల చరిత్ర చూస్తే.. కాదనే సమాధానం వస్తున్నది. గతంలో ఏర్పాటు చేసిన నాలుగు జేపీసీలకు భిన్నంగా ఇప్పుడు వెస్ట్‌లాండ్ కుంభకోణంలో ఏర్పాటు చేసిన జేపీసీ ఏమి సాధిస్తుంది? సాధారణంగా జేపీసీల్లో అన్ని రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం కల్పించి అవినీతిపై విచారణ చేసే బాధ్యతను అప్పగిస్తారు. వీరు దానిపై అధ్యయనం చేసి ఓ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పిస్తారు. దానిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తారు. కానీ వాస్తవంలో గతంలో ఏర్పాటు చేసిన జేపీసీలు, ఇచ్చిన రిపోర్టులు ఏమయ్యా యో చూస్తే.. ప్రభుత్వ చిత్తశుద్ధి అర్థమవుతుంది.

1987ఆగష్టులో బోఫోర్స్ కుంభకోణం విషయంలో ప్రతిపక్షాలు 45 రోజు లు పార్లమెంటును బహిష్కరించాయి.ఆందోళనలు తీవ్రం కావడంతో.. చివరకు ప్రభుత్వం అంతా కాంగ్రెస్ సభ్యులతో కూడిన ఓ జేపీసీని వేసింది. ఇంత చేసి ఆకమిటీ ఇచ్చిన రిపోర్టును తిరస్కరించింది. రెండో జేపీసీ 1992లో హర్షద్ మెహతా కుంభకోణం విషయంలో వేశారు. ఈజేపీసీ కమిటీ నెలల తరబడి అధ్యయనం చేసి రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించింది. కానీ..ఆ రిపోర్టు ఇచ్చి న సూచనలను ఒప్పుకోవడంగానీ, తిరస్కరించడంకానీ చేయకుండా.. ఆ కమిటీ ఇచ్చిన ఏ సూచననూ అమలు చేసిన పాపానపోలేదు. మూడవ జేపీసీ 2001లో అహ్మదాబాద్ కో ఆపరేటివ్ బ్యాంకు కుంభకోణం. దీనిపై వేసిన జేపీసీ 105 సార్లు సమావేశమై సుదీర్ఘ అధ్యయనం చేసింది. స్టాక్ మార్కెట్ నిర్వహణలో ఉన్న లొసుగులను ఎత్తిచూపుతూ కమిటీ సూచించిన ఏ సూచననూ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలా లేదు.

ఇంత జరిగిన తర్వాత కూడా స్టాక్ మార్కెట్ నిర్వహణలో పాటించాల్సిన నియమాలను ఇంకా సరళతరం చేసి మరిన్ని మోసాలకు తలుపులు బార్లా తెరిచారే కానీ కుంభకోణాలు అడ్డుకోవడానికి కనీస చర్యలు తీసుకోలేదు. నాలుగో జేపీసీ శీతల పానీయాల్లో పురుగుమందులు ఉన్నాయనే దానిపైవేశారు. ఇవ్వా ల దేశంలో విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్న శీతల పానీయాలన్నింటి లో ప్రమాదకరమైన స్థాయిలో ఆరోగ్యానికి హానిచేసే రసాయనాలు, క్రిమిసంహారక మందులు ఉన్నాయని వైద్యశాస్త్ర ప్రయోగశాలలు రుజువు చేశాయి. దీంతో దేశంలో పెద్దఎత్తున ఆందోళన చెలరేగింది. ప్రజ ల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్న బహుళజాతి కంపెనీల శీతల పానీయాలను నిషేధించాలని ప్రజలు ఉద్యమించారు. దీంతో ప్రభుత్వం నిజానిజాలు తేల్చేందుకు ఓకమిటీ వేసింది. ఆ కమిటీ కూడా బహుళజాతి కంపెనీలు అమ్ముతున్న తాగేనీరు, సాఫ్ట్ డ్రింకుల పేర మార్కెట్లో ఉన్నవన్నీ ప్రమాదకరమైనవేనని తేల్చింది. వీటి ని సత్వరమే నిషేధించాలని సూచించింది. కానీ దీనిపై ప్రభుత్వం ఏచర్యలు తీసుకోలేదు. ఇప్పు డు 2జీ కుంభ కోణంపై వేసింది ఐదో జేపీసీ. ఇది ఆరునెలల్లో తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పిస్తుంది.

ఇప్పటిదాకా వేసిన జేపీసీలన్నీ అధ్యయనం, విచారణ చేసి ఓ రిపోర్టులను సమర్పించే వరకే చేస్తున్నాయి. తాము అందజేసిన రిపోర్టులను అమలు చేయాలనే అధికారం ఆ కమిటీలకు లే దు. వాటిపై ఏ చర్య తీసుకోవాలన్నా ప్రభుత్వ మే చేయాలి. జేపీసీలు ఇచ్చిన రిపోర్టులను పార్లమెంటులో చర్చచేసి తగు విధమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ ఇది ఏ సందర్భంలోనూ అమలవుతున్న దాఖలాలు లేవు. సాధారణంగా జేపీసీలకు వాటి చైర్మన్‌గా ప్రతిపక్షపార్టీ నాయకుడు ఉండాలి. జేపీసీకి అవసరమనుకుంటే కేంద్ర మంత్రులను, ప్రధానిని కూడా విచారించే అధికారం ఉండాలి. ఇలా ఉన్నప్పుడే జేపీసీల లక్ష్యం కొంతలో కొంత నెరవేరుతుంది. కానీ జాతీయ ప్రయోజనాల పేర జేపీసీలకు కళ్లెం వేస్తున్నారు. పని అప్పజెప్పి చేతులకు సంకెళ్లు వేస్తున్నారు.

కొంత కాలంగా సీబీఐ పనితీరుపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. సీబీఐ అధికారపార్టీ అనుబంధ సంస్థగా మారిపోయిందనే విమర్శలున్నాయి. అధికారం, అజమాయిషీలకు లొంగకుండా.. అన్ని రకాల అక్రమాలకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉన్నది. మధ్యవర్తుల కక్కుర్తి, లంచగొండుల ధనదాహానికి దేశభవూదతను పణంగా పెట్టే పరిస్థితులు పోవాలి. జేపీసీలు సమర్థవంతంగా పనిచేసి, అవి చేసిన సూచనలను ప్రభుత్వాలు పాటించినప్పుడే అవినీతి అంతమవుతుంది. జేపీసీలు కాలయాపనకు, ప్రతిపక్షాలు, ప్రజల కళ్లు కప్పడానికి సాధనాలు కాకూడదు.

-పూనమ్ ఐ కౌషిశ్
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్)

35

PUNAM I KOUSHISH

Published: Sat,December 19, 2015 12:48 AM

శాసనకర్తలకు విద్య అవసరం లేదా?

ఎంపీలు, ఎమ్మెల్యేలు.. చట్టసభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరించాలి. ప్రజలకు కావాల్సినవి సాధించాలి. ప్రజలకు మంచి జీవితాన్నందించడం కోసం పా

Published: Wed,August 19, 2015 12:07 AM

కష్టంగా నెట్టుకొస్తున్న మోదీ

పరిపాలనా రంగంలో పరివర్తన కోసం భారత ప్రజ లు మోదీకి అధికారం కట్టబెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన

Published: Wed,August 12, 2015 01:47 AM

చర్చలు సాగని చట్టసభలు

ఇవ్వాళ రాజకీయాల్లో చర్చలకు తావులేకుండాపోయింది. బలప్రదర్శనకే పెద్దపీట వేస్తున్నారు. తమ సంఖ్యాబలంతో అధిపత్యం చూపించుకోవడానికే ప్రాధా

Published: Sat,May 16, 2015 12:39 AM

అధికార దుర్వినియోగం..

మన నేతలంతా వ్యాపారుల్లా అవతారాలెత్తి లాభాలు దండుకుంటుంటే.. ఆమ్ ఆద్మీ- గరీబ్ అవుతున్నాడు. మన నేతలు తమ ప్రైవేటు వ్యవహారాలుగా చెబుతున

Published: Thu,February 26, 2015 01:56 AM

పరిశుభ్రత సరే... ప్రాణాల సంగతి?

ఇండియాలో అన్నింటికన్నా అగ్గువ (చీప్) ఏదైనా ఉన్నదంటే.. అది మనుషు ల ప్రాణమే. కూరగాయల కన్నా ఒకింత విలువ, సమయాన్ని బట్టి వాటి ప్రాముఖ్

Published: Sun,December 21, 2014 01:51 AM

మత మార్పిడులకు పునాది ఏమిటి?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. కానీ ఇది

Published: Tue,April 15, 2014 01:23 AM

ప్రజా జీవితంలో వ్యక్తిగతం ఉంటుందా..?

ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులకు వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు. ఉండకూడదు అని గాంధీ బోధించారు. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత వ్

Published: Wed,April 2, 2014 01:18 AM

ఎన్నికలు- విదేశీ నిధులు

ప్రజాస్వామ్యం వెలుగొందాలి అంటే.. రాజకీయాలను నియంత్రిస్తున్న ధనప్రవాహాన్ని నియంత్రించాలి. ఎన్నికల నిధులు ఎక్కడనుంచి,ఏం ఆశించి వస్త

Published: Thu,February 6, 2014 12:15 AM

తెలంగాణ ఏర్పాటు-పాఠాలు

సామాజిక సమస్యల విషయంలో వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించి దానికి తగిన విధంగా మసలుకోకుంటే.. అది కాలక్రమంలో ప్రతీకారం తీర్చుకుంటుందని భ

Published: Sun,May 5, 2013 12:42 PM

నేతల చావు రాజకీయాలు

మన నేతలు ప్రతిదాన్నీ రాజకీయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అది ఇంకా ముదిరి శవరాజకీయాలనుంచి ఎదిగి చావు రాజకీయాల దాకా వచ్చింది. సరబ

Published: Fri,March 15, 2013 02:16 AM

అవినీతి అంతమెప్పుడు?

ముఖం చూసి బొట్టు పెట్టడమన్నది మన సంప్రదాయమైపోయింది. ఇదిప్పుడు పాలనా విధానంలోకి తర్జుమా అయ్యింది. నీ చేయి బెంచి కిందినుంచి ఎంత తొంద

Published: Mon,January 21, 2013 12:11 AM

నేర రాజకీయాలే సమస్య

మేకలను బలి ఇచ్చి పులులను అందలమెక్కించే నీతి దేశంలో రాజ్యమేలుతున్న ది. ఇది ఎక్కడనో ఒకచోట జరుగుతున్న తంతు కాదు, దేశంలో మూల మూలనా ఇదే

Published: Thu,January 3, 2013 11:47 PM

మన ప్రయాణమెటు?

ఈమధ్య కొన్ని ఉదంతాలు సగటు భారతీయుడిని భయవూభాంతులకు గురిచేస్తున్నాయి. మనం కలలుగన్న భారత్ ఇదే నా అని కన్నీరు కార్చే స్థితి వచ్చింది.

Published: Mon,December 10, 2012 12:12 AM

నీతిబాహ్య రాజకీయాలే నీటి తగాదాలు

రాజకీయ నాయకులు ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ, మహానీయులు భావి తరాల కోసం ఆలోచిస్తారనేది పెద్దలమాట. దీని కనుగుణంగానే నేటి రాజకీయ న

Published: Sun,December 2, 2012 11:30 PM

ప్రజారోగ్యం పట్టని పాలకులు

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నది పాత మాట. ఇప్పుడు ప్రజల అనారోగ్యమే కొందరికి వరమైపోయింది. రోగగ్రస్థ సమాజంతోనే లాభాలను పిండుకునే పరిస్థిత

Published: Wed,October 10, 2012 05:33 PM

మాటల్లోనే గాంధీ మార్గమా?

నేనుంటున్న ఇంటి పక్కనే ఓ నవయువకుడు ఉంటాడు. ఆయనను ‘గాంధీ గురించి నీ అభివూపాయం ఏమిటీ’ అనగానే.. ‘అతనికేం సొట్టబుగ్గల అందగాడు. మోస్ట్

Published: Sat,October 6, 2012 04:24 PM

అసోం అల్లర్లపై అలసత్వమేల?

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుం టూ కాలక్షేపం చేశాడని..అది నిర్లక్ష్యానికి, బాధ్యతా రాహిత్యానికి సంకేతంగా చె

Published: Sat,October 6, 2012 04:25 PM

ఎంతకాలం ఈ గందరగోళం?

ఇరాచకం తరువాత అత్యంత అధ్వాన్నమైన స్థితి ప్రభుత్వం అంటాడు హెన్నీ బీచర్. ఇప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ పరిపాలనా విధానాన్ని చూస్తే

Published: Sat,October 6, 2012 04:25 PM

కాముకుల కాసుల క్రీడ

జంటిల్‌మెన్ గేమ్ జంగ్లీగా తయారైంది. ‘ఐపీఎల్’క్షికికెట్ వివాదాల మయం అవుతోంది. క్రికెట్ ఇవాళ.. మూడు ‘సీ’ల చుట్టూ తిరుగు తున్నది. క్య

Published: Sat,October 6, 2012 04:25 PM

అర్హత లేకున్నా అందలమేలా?

రాజకీయాలకు కేంద్ర నిలయమైన ఢిల్లీ ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటుం ది. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం (ఎన్సీటీసీ) ఏర్పాటుపై కేంద్రానికి ర

Featured Articles