అవినీతి అంతమెప్పుడు?


Fri,March 15, 2013 02:16 AM

ముఖం చూసి బొట్టు పెట్టడమన్నది మన సంప్రదాయమైపోయింది. ఇదిప్పుడు పాలనా విధానంలోకి తర్జుమా అయ్యింది. నీ చేయి బెంచి కిందినుంచి ఎంత తొందరగా దూసుకు వస్తే.. అంత తొందరగా నీ పని జరుగుతుంది అన్న చందంగా తయారైంది. ఈ మధ్య మన పార్లమెంటు ప్రజా హక్కుల బిల్లు-2011కు ఆమోదముద్ర వేసింది. దీంతో పాలనా విధానంలో పారదర్శకత వస్తుందని మన నేతలు చెప్పుకొస్తున్నారు. ప్రజల హక్కులు, కోరికలు వారు కోరుకున్న విధంగా, కోరుకున్న సమయంలో తీరబోతున్నాయని చెబుతున్నారు. ప్రజల దైనందిన జీవితంలో ప్రభుత్వ యంత్రాంగంతో సంబంధం ఉండే అన్ని పనుల్లో సత్వర న్యాయం జరుగుతుందని అంటున్నారు.

ప్రజలు కోరుకున్న సమయంలో తాము కోరిన పత్రాలు (సర్టిఫికేట్లు) అందించలేకపోయినట్లయితే సంబంధిత అధికారుల తగు మూల్యం(నష్టపరిహారం) చెల్లించాల్సి వస్తుందని ఆ బిల్లులో పేర్కొన్నారు. పాస్‌పోర్టు జారీలో, జనన, మరణ సర్టిఫికేట్లు, రేషన్‌కార్డు, ఆస్తుల రిజిస్ట్రేషన్ తదితర పనులు సకాలంలో జరిగి తగు పత్రాలు కోరిన సమయంలో ఇవ్వక పోయినట్లయితే.. రోజుకు 250 రూపాయ ల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని బిల్లులో పేర్కొన్నారు. సంబంధిత అధికారు లు ప్రజలకు, వినియోగదారులకు నష్టపరిహారంగా 50వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే సంబంధిత అధికారులు చట్టపరమైన చర్యలకూ అర్హులవుతారని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సిటిజన్స్ చార్టర్‌లు ప్రదర్శించాలని లేనట్లయితే వారే బాధ్యత వహించాలని గ్రీవెన్స్ బిల్లులో పేర్కొన్నారు.

ఈ బిల్లు అమలులోకి వస్తే.. పాలనా విధానమంతా పారదర్శకంగా మారిపోతుందని చెప్పుకొస్తున్నారు మన పాలకులు. వారు చెబుతున్నట్లు దీనితో పారదర్శక పెరిగి అవినీతి అంతమవుతుందా అన్నది నేడు ప్రజలముందున్న ప్రశ్న. బలమైన లోక్ పాల్ బిల్లుతో అవినీతి అంతమవుతుందా? మన నేతలు, అధికారుల పనివిధానం, నేతలు- అధికారుల కుమ్మక్కు అనేది అంతం కాకుండా ప్రభుత్వంలో, పాలనా విధానంలో పారదర్శకత వస్తుందా? అవినీతి అంతం అవుతుందా? దీనికి అవునని కానీ, కాదని కానీ సమాధానం చెప్పడం కష్టం.

మన నేత ల్లో, అత్యున్నత స్థానాల్లో తిష్టవేసిన అధికారుల్లో జవాబుదారీతనం లేనంత కాలం ప్రజలు కోరుతున్న అవినీతిరహిత సమాజం అస్తిత్వంలోకి వస్తుందని చెప్పడానికి లేదు. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయా ల్లో చిన్న పని మొదలు పెద్ద పెద్ద కాంట్రాక్టుల దాకా ఏవీ ‘చేయి తడపనిదే’, కమీషన్లు లేనిదే ఏ పని కావ డం లేదు. పార్లమెంటులో ఆమోదించిన ఈ బిల్లుతో అవినీతి అంతమవుతుందని, పాలనా విధానం మారిపోతుందని ఆశించడం భమ్రే! దీనికి కారణం ఉత్తరవూపదేశ్ ప్రభుత్వ పనితీరును, అక్కడి నేతలు, అధికారుల పనితీరు చూస్తే అర్థమవుతుంది. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, ఆయన మంత్రి వర్గంలోని శివపాల్ యాదవ్ పనితీరు చెప్పకనే చెబుతున్నది. ఉత్తరప్రదేశ్‌లోని పీడబ్ల్యూడీ విభాగంలోని ఉద్యోగస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘మీరు బాధ్యతా యుతంగా మెలగండి. ప్రజలకు జవాబుదారీగా మెలగండి. కష్టించి పనిచేయండి. కానీ బందిపోటు దొంగల్లా ప్రజలను పీడించకండి’ అంటూ వారి పనివిధానాన్ని చెబుతూ హెచ్చరించాడు. అంటే.. అక్కడి పాలనా విధానంలో ఉద్యోగస్వామ్యం ఎంత అవినీతిలో కూరుకుపోయిందో చెప్పకనే చెప్పారు.

నేతలు అంటున్నట్లు ప్రభుత్వ పాలనా విభాగాల్లో అవినీతి పేరుకుపోవడానికి కేవలం ఉద్యోగస్తులనే నిందిస్తే చాలదు. ఇది అధికారుల, నేతల మిలాఖత్ వల్ల జరుగుతున్నది. పాలనా విభాగాల్లో అత్యున్నత స్థానాల్లోకి వారి వృత్తి నైపుణ్యం ఆధారంగా రావడంలేదు. సీనియారిటీ, వృత్తి నైపుణ్యం, నిబద్ధత ఉద్యోగ ప్రమోషన్లకు గీటురాయిగా ఉండటంలేదు. నేతలు తమకు తొత్తులైన, తమ చెప్పుచేతల్లో ఉండే ఉద్యోగులను తెచ్చి అధికారంలో అత్యున్నత స్థానాల్లో కూచో బెడుతున్నారు. దీంతో బడానేతల చెంచాలు చెలరేగిపోతున్నారు. పాలనా విధానాలన్నింటినీ ప్రభావితం చేస్తున్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వ అంగాలను నిర్వీర్యంచేసి తమ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నారు. ఇలాంటి నియామకాలతో అత్యున్నత స్థానాల్లోని ఉద్యోగులు, నేతలు అంతు పొంతులేని అవినీతికి తెరలేపుతున్నారు.

ఇది ఏ ఒక్క చోటనో, ఒక్క విభాగంలోనో జరిగిన విషయం కాదు. దేశమంతా ఇలాంటి అవినీతి, అక్రమ నియామకాలతోనే నిండి ఉన్నది. పాలనా విధానం నీరు గారిపోయి లంచగొండిగా మారడానికీ నేతల తీరే ప్రధాన కార ణం. దీంతో ఉద్యోగస్తుల్లో ప్రజలకు సేవ చేయాలనేది లేకుండాపోయింది. తమను అడ్డదారిన అందలమెక్కించిన నేతల ప్రయోజనాలను కాపాడటమే, నెరవేర్చడమే ప్రధానమైపోయింది. దీంతో సివిల్ సర్వెంట్లు అన్నది నేతల సేవగా మారిపోయింది.

మరోవైపు దేశ వ్యాప్తంగా పాలనా విధానాన్ని పరిశీలించినట్లయితే.. ఎక్కడా సరైన వ్యక్తి సరైన స్థానంలో, స్థాయిలో ఉండటం బూతద్దం పట్టి వెదికినా కనిపించడంలేదు. పాలనా విధానంలో అతిముఖ్యమైన స్థానంలోకి అసమర్థుడు వచ్చి చేరుతున్నాడు. అవినీతిపరుడు అత్యున్నత అధికార పీఠంపై తిష్ట వేస్తున్నాడు. దీంతో అవినీ తి అంతులేకుండా పెరిగిపోయి పారదర్శకత పాతర వేయబడుతున్నది. ఇది ఎంత దాకా పోయిందంటే.. ఏ పార్టీ, ఏ నేత అధికారంలోకి వస్తే.. ఎవరు అత్యున్నత పాలనా స్థానాల్లో కూర్చుంటారో ముందే లెక్కలు వేసుకుంటున్నారు. దీనికనుగుణంగా పావులు కదుపుతున్నారు. పాలనా విభాగాల్లో పెరిగిపోయిన అవినీతి, రాజకీయ జోక్యం గురించి 1995లో ఇచ్చిన వోహ్రా కమిటీ ఇచ్చిన రిపోర్టు చెత్తబుట్టలో దుమ్ముకొట్టుకునిపోతున్నది. కానీ ఆ రిపోర్టు చెప్పినట్లు పాలనా విధానాల్లో మార్పులకు అంకురార్పణ జరగలేదు.

ఒకానొక సర్వే ప్రకారం దేశంలో బ్యూరోక్షికాట్ల అవినీతి సొమ్ము సాలీనా 92,122 కోట్ల రూపాయలు ఉంటుంది. అంటే జాతీయోత్పత్తిలో 1.26 ఉంటుందన్నమాట. అలాగే.. ప్రతి యేటా ప్రభుత్వ పాలనా విభాగాల్లో ఉద్యోగుల లంచగొండి తనం వంద శాతం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే సీఏజీ (కాగ్) చెప్పిన విషయాలు చెప్పుకోవాలి. ‘భారతదేశం పేదలతో నిండి ఉన్న ధనవంతమైన దేశ’మని చెబుతూ.. ‘దేశంలోని పేదలను ఈ అవినీతి అధికారులు మరింత బికారులుగా మారుస్తున్నార’ని కాగ్ వాపోయింది. అలాగే 2009లో పది ఆసియాలో పేరెన్నికగన్న ఆర్థిక అధ్యయన సంస్థలు చేసిన సర్వే ప్రకారం దేశంలో ప్రభుత్వ పాలనా విభాగాల్లో అత్యంత కనిష్ఠ స్థాయిలో వృత్తి నైపుణ్యం కలిగిన అధికారులు ఉనారని తెలిపింది. ఇలాంటి పాలనాధికారుల వల్ల పరిపాలన అవీనీతి మయమై పోయి కనీస జవాబుదారీతనం లేదని తెలిపాయి.

ఇలాంటి పాలనాధికారుల మూలంగానే ప్రభు త్వ పథకాలేవీ ప్రజలకు చేరడం లేదని పేర్కొన్నాయి. దీంతోనే అవినీతి, పక్షపాతం, వివక్ష రాజ్యమేలుతున్నాయని తెలుపుతూ ఈ అవినీతిమయ అధికార గణం కారణం గానే సమాచార హక్కు చట్టం కూడా నిర్వీర్యమైపోయిందిని తెలిపింది.
ప్రైవేటులో అత్యున్నత సేవలందించిన వారిని ప్రభుత్వ పాలనావిభాగాల్లో అత్యున్నత స్థానాల్లో కూర్చోబెట్టడం అమెరికా ఒక పద్ధతిగా అనుసరించింది. దీన్ని అనుసరించిన మన పాలకులు ప్రైవేటు రంగంలోని నిపుణులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకునే దానికి తెరలేపి పెద్ద తతంగమే చేశారు. ఈ క్రమంలో నే నందన్ నిలేకని, రఘురాం రాజన్ ప్రభుత్వ పాలనారంగంలో అత్యున్నత స్థాయిలో వెలిగిపోతున్నారు. దీంతో.. అత్యున్నత స్థాయిలోని ఉద్యోగ స్వాముల్లో గుణాత్మక మార్పు వస్తుందని ఆశించారు. కానీ.. ఇదే మీ అనుకున్న ఫలితాలు సాధించలేదు. పోగా అధికార వర్గాల్లో లాబీలు, కుమ్ములాటలు నిత్యకృత్యమయ్యా యి. ప్రతియేటా అవినీతి గురించి చర్యలు తీసుకుంటున్నామని చెబుతూ ఏవో చర్యలకు ఉపక్షికమించడం అవన్నీ నీటిమీది రాతలుగానే మిగలడం పరిపాటి అయిపోయింది. కానీ మన నేతలు చెబుతన్నట్లు ఆవగింజంత కూగా మార్పు కనిపించం లేదు.

ఈ స్థితిలో దేశంలో ఏం చేయాలి? ఏమి చేస్తే పారదర్శక పెరిగి పాలనా విధానంలో జవాబుదారీతనం పెరుగుతుంది? అవినీతి, ఆశ్రీత పక్షపాతం అంతమవుతుంది? అన్నది ఎప్పుడూ తెగని ప్రశ్నగా మిగులుతున్నది. ఈ సందర్భంలో ప్రైవేటు గుత్త సంస్థలను నియంవూతించడం మొదటి చర్యగా ఉంటే కొంత మంచి పరిణామాలు సంభవించవచ్చు. సమాచార హక్కు ఉద్యమకారులు అంటున్నట్లు పాలనారంగాలన్నింటిలో విధిగా పారదర్శకతను పాటించాలి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ సేవలకు సంబంధించి సవివరమైన సమాచారంతో బోర్డులు ఏర్పాటు చేయాలి. ఇది ఏ ఒక్క అంగానికో, విభాగానికో పరిమితం కాకుం డా మొత్తం పాలనా రంగమంతా అమలు చేసినట్లయితే కొంత అవినీతిని అరికట్టవచ్చని భావిస్తున్నారు. ఉద్యోగుల, రాజకీయ నాయకుల కుమ్మక్కుకు చరమగీతం పాడి పాలనా విభాగాల్లో ప్రావీణ్యతకు పెద్ద పీట వేసినప్పుడు పారదర్శకత పెరిగి అవినీతి క్రమంగా తగ్గిపోతుంది. ఇది లోక్ నాయక్ జయవూపకాశ్ నారాయణ్ చెప్పినట్లు సంపూర్ణ విప్లవంగా రూపొంది దేశంలోని అవినీతి పంకిలాన్ని కడిగివేయాలి.

ఇవ్వాళ.. భారత్‌ను యువ భారత్‌గా చెప్పుకుంటున్నాము. జనాభాలో 50 శాతానికిపైగా 35 ఏళ్లలోపు వారున్నారు. ఈ యువత ఆకాంక్షలకు అనుగుణంగా పాలనా విధానాల్లో మార్పులు తీసుకొస్తే.. దేశంలో విప్లవాత్మక మార్పులు నెలకొంటాయి. ఉద్యోగులు, సివిల్ సర్వెంట్స్ నిజంగా ప్రజా సేవకులుగా మారి, ప్రజలకు సుపరిపాలన అందిస్తారు. పాలనా విభాగాల్లో అత్యున్నత స్థానాల్లో ఉండే ఐఏఎస్‌లు ఐయాం సారీ సర్వీస్‌లుగా ఉండే పరిస్థితి పోవాలి. అప్పుడే అవినీతి అంతమవుతుంది.

-పూనమ్ ఐ కౌషిశ్
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్)

35

PUNAM I KOUSHISH

Published: Sat,December 19, 2015 12:48 AM

శాసనకర్తలకు విద్య అవసరం లేదా?

ఎంపీలు, ఎమ్మెల్యేలు.. చట్టసభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరించాలి. ప్రజలకు కావాల్సినవి సాధించాలి. ప్రజలకు మంచి జీవితాన్నందించడం కోసం పా

Published: Wed,August 19, 2015 12:07 AM

కష్టంగా నెట్టుకొస్తున్న మోదీ

పరిపాలనా రంగంలో పరివర్తన కోసం భారత ప్రజ లు మోదీకి అధికారం కట్టబెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన

Published: Wed,August 12, 2015 01:47 AM

చర్చలు సాగని చట్టసభలు

ఇవ్వాళ రాజకీయాల్లో చర్చలకు తావులేకుండాపోయింది. బలప్రదర్శనకే పెద్దపీట వేస్తున్నారు. తమ సంఖ్యాబలంతో అధిపత్యం చూపించుకోవడానికే ప్రాధా

Published: Sat,May 16, 2015 12:39 AM

అధికార దుర్వినియోగం..

మన నేతలంతా వ్యాపారుల్లా అవతారాలెత్తి లాభాలు దండుకుంటుంటే.. ఆమ్ ఆద్మీ- గరీబ్ అవుతున్నాడు. మన నేతలు తమ ప్రైవేటు వ్యవహారాలుగా చెబుతున

Published: Thu,February 26, 2015 01:56 AM

పరిశుభ్రత సరే... ప్రాణాల సంగతి?

ఇండియాలో అన్నింటికన్నా అగ్గువ (చీప్) ఏదైనా ఉన్నదంటే.. అది మనుషు ల ప్రాణమే. కూరగాయల కన్నా ఒకింత విలువ, సమయాన్ని బట్టి వాటి ప్రాముఖ్

Published: Sun,December 21, 2014 01:51 AM

మత మార్పిడులకు పునాది ఏమిటి?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. కానీ ఇది

Published: Tue,April 15, 2014 01:23 AM

ప్రజా జీవితంలో వ్యక్తిగతం ఉంటుందా..?

ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులకు వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు. ఉండకూడదు అని గాంధీ బోధించారు. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత వ్

Published: Wed,April 2, 2014 01:18 AM

ఎన్నికలు- విదేశీ నిధులు

ప్రజాస్వామ్యం వెలుగొందాలి అంటే.. రాజకీయాలను నియంత్రిస్తున్న ధనప్రవాహాన్ని నియంత్రించాలి. ఎన్నికల నిధులు ఎక్కడనుంచి,ఏం ఆశించి వస్త

Published: Thu,February 6, 2014 12:15 AM

తెలంగాణ ఏర్పాటు-పాఠాలు

సామాజిక సమస్యల విషయంలో వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించి దానికి తగిన విధంగా మసలుకోకుంటే.. అది కాలక్రమంలో ప్రతీకారం తీర్చుకుంటుందని భ

Published: Sun,May 5, 2013 12:42 PM

నేతల చావు రాజకీయాలు

మన నేతలు ప్రతిదాన్నీ రాజకీయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అది ఇంకా ముదిరి శవరాజకీయాలనుంచి ఎదిగి చావు రాజకీయాల దాకా వచ్చింది. సరబ

Published: Mon,April 8, 2013 02:41 AM

జేపీసీలు ఎందుకోసం?

ఊహించినట్లుగానే శీతాకాల పార్లమెంటు సమావేశాలు వాడి, వేడిగా సాగా యి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు నడిచిందనిపించుకున్నది. శ్రీ

Published: Mon,January 21, 2013 12:11 AM

నేర రాజకీయాలే సమస్య

మేకలను బలి ఇచ్చి పులులను అందలమెక్కించే నీతి దేశంలో రాజ్యమేలుతున్న ది. ఇది ఎక్కడనో ఒకచోట జరుగుతున్న తంతు కాదు, దేశంలో మూల మూలనా ఇదే

Published: Thu,January 3, 2013 11:47 PM

మన ప్రయాణమెటు?

ఈమధ్య కొన్ని ఉదంతాలు సగటు భారతీయుడిని భయవూభాంతులకు గురిచేస్తున్నాయి. మనం కలలుగన్న భారత్ ఇదే నా అని కన్నీరు కార్చే స్థితి వచ్చింది.

Published: Mon,December 10, 2012 12:12 AM

నీతిబాహ్య రాజకీయాలే నీటి తగాదాలు

రాజకీయ నాయకులు ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ, మహానీయులు భావి తరాల కోసం ఆలోచిస్తారనేది పెద్దలమాట. దీని కనుగుణంగానే నేటి రాజకీయ న

Published: Sun,December 2, 2012 11:30 PM

ప్రజారోగ్యం పట్టని పాలకులు

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నది పాత మాట. ఇప్పుడు ప్రజల అనారోగ్యమే కొందరికి వరమైపోయింది. రోగగ్రస్థ సమాజంతోనే లాభాలను పిండుకునే పరిస్థిత

Published: Wed,October 10, 2012 05:33 PM

మాటల్లోనే గాంధీ మార్గమా?

నేనుంటున్న ఇంటి పక్కనే ఓ నవయువకుడు ఉంటాడు. ఆయనను ‘గాంధీ గురించి నీ అభివూపాయం ఏమిటీ’ అనగానే.. ‘అతనికేం సొట్టబుగ్గల అందగాడు. మోస్ట్

Published: Sat,October 6, 2012 04:24 PM

అసోం అల్లర్లపై అలసత్వమేల?

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుం టూ కాలక్షేపం చేశాడని..అది నిర్లక్ష్యానికి, బాధ్యతా రాహిత్యానికి సంకేతంగా చె

Published: Sat,October 6, 2012 04:25 PM

ఎంతకాలం ఈ గందరగోళం?

ఇరాచకం తరువాత అత్యంత అధ్వాన్నమైన స్థితి ప్రభుత్వం అంటాడు హెన్నీ బీచర్. ఇప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ పరిపాలనా విధానాన్ని చూస్తే

Published: Sat,October 6, 2012 04:25 PM

కాముకుల కాసుల క్రీడ

జంటిల్‌మెన్ గేమ్ జంగ్లీగా తయారైంది. ‘ఐపీఎల్’క్షికికెట్ వివాదాల మయం అవుతోంది. క్రికెట్ ఇవాళ.. మూడు ‘సీ’ల చుట్టూ తిరుగు తున్నది. క్య

Published: Sat,October 6, 2012 04:25 PM

అర్హత లేకున్నా అందలమేలా?

రాజకీయాలకు కేంద్ర నిలయమైన ఢిల్లీ ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటుం ది. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం (ఎన్సీటీసీ) ఏర్పాటుపై కేంద్రానికి ర