నేర రాజకీయాలే సమస్య


Mon,January 21, 2013 12:11 AM

currupt-1మేకలను బలి ఇచ్చి పులులను అందలమెక్కించే నీతి దేశంలో రాజ్యమేలుతున్న ది. ఇది ఎక్కడనో ఒకచోట జరుగుతున్న తంతు కాదు, దేశంలో మూల మూలనా ఇదే జరుగుతున్నది.‘చట్టం తనపనితాను చేసుకుంటూ పోతుంద’ని నేతలు పదే పదే చెబుతున్నది సామాన్యుని విషయంలో మాత్రమే నిజమవుతున్నది. కానీ పలుకుబడి గల బడానేతల విషయంలో మాత్రం చట్టం కళ్లు మూసుకుని అచేతనంగా ఉంటున్నది. కింది కోర్టుపైన పైకోర్టు, దానిపైన ఆపైకోర్టుల్లో అప్పీళ్లతో అసలు నేరస్తులు చట్టానికి చిక్కకుండా తప్పించుకుంటూనే ఉన్నారు. ఫలితంగా చట్టబద్ధపాలన అనేది పుస్తకాల్లో మాత్రమే భద్రంగా ఉంటున్నది.

ప్రజావూపాతినిధ్యచట్టం 1951,సెక్షన్ 8(4) ప్రకారం ప్రజా వూపతినిధులకు ప్రత్యేక హక్కులు, భద్రత అనేది మన నేతలకు రక్షక కవచంగా మారిపోయింది. ఇది ఆర్టిక ల్ 14, రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానులేనన్న దానికి విరుద్ధంగా అమలవుతున్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 ప్రకారం ఏ వ్యక్తి అయినా నేరస్తునిగా రుజువై శిక్షార్హుడైన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు. కానీ ప్రజావూపాతినిధ్య చట్టం ప్రకారం ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి విషయంలో ఈ చట్టం అమలు కావడంలేదు. ప్రజా ప్రనిధులుగా ఉన్న వ్యక్తులు ఏదైనా నేరం రుజువై శిక్ష పడినా అతను పై కోర్టుకు అప్పీలుకు వెళ్లి యథావిధిగా కొనసాగుతున్నారు. కోర్టు, తర్వాత ఇంకా పైకోర్టు.. ఇలా ఏళ్లకు ఏళ్లు తమ పదవీ కాలమే కాదు, ఏకంగా 25, 30 ఏళ్లు కేసులు కోర్టుల్లోనే పెండింగులో ఉంటూ సదరు నేరస్తుడు ప్రజావూపతినిధిగా అధికారం వెలగబెడుతూనే ఉంటున్నాడు. ఇంకా విషాదమేమంటే.. జైలులో ఉన్న వ్యక్తికి ఓటు హక్కులేదు. కానీ.. జైలులో ఉన్న వ్యక్తి ఏకంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ప్రజా ప్రతినిధిగా చట్ట సభల్లోకి వెళ్ల వచ్చు. ఈహక్కు మాత్రం దేశంలో నూటికి నూరు పాళ్లు అమలవుతున్నది. జైలులో ఉండి ఎంపీలు, ఎమ్మెల్యేలు గా ఎన్నికవుతున్నారు.

చేతులకున్న బేడీలను ఆభరణాలుగా ప్రదర్శించుకుంటూచట్టసభల్లోకి దర్జా గా అడుగుపెడుతున్నారు. ప్రజా ప్రతినిధులకు ఉండే ప్రత్యేక హక్కులను అనుభవి స్తూ.. పార్లమెంటు, అసెంబ్లీలలోకి స్వేచ్ఛగా అడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నేరస్తుపూవరో, ప్రజా శ్రేయస్సు కోసం చట్టాలు చేసే ప్రజా ప్రతినిధుపూవరో వేరుచేసి చూడలేని పరిస్థితి నెలకొన్నది. హంతకులు, దోపిడీదారులు, రేపిస్టులు, దారిదోపిడీ గాళ్లూ ప్రజా ప్రతినిధులుగా చట్టసభల్లోకి అడుగుపెడుతుంటే.. రాజకీయాలు, నేరాలు కలగలిసిపోయిన ఓ వికృత దృశ్యం కనిపిస్తున్నది.
ఈ నేపథ్యంలోనే నేరస్త రాజకీయాల గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. విషాదమేమం లోక్‌సభలో ఉన్న 543 మంది పార్లమెంటు సభ్యుల్లో 162మందిపై క్రిమినల్ కేసులున్నాయి. అంటే పార్లమెం టు సభ్యుల్లో 30శాతం మంది నేరస్తులే. అలాగే రాజ్యసభలోనూ 39 మంది అంటే 16 శాతం నేరస్తులే. వీరిలో 76 మందిపై తీవ్రమైన నేరారోపణలున్నాయి. ఇక అత్యున్నత చట్టసభ ఇలా ఉంటే, రాష్ట్రాల్లోని శాసనసభలు దీనికి భిన్నంగా ఏమీ లేవు. నేరగాళ్లతో నిండి ఉన్న శాసన సభల్లో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నది. యూపీలో 403మంది శాసనసభ్యుల్లో 189మందిపై క్రిమినల్ కేసులున్నాయి. దీని తర్వాత మహారాష్ట్ర ద్వితీయ స్థానంలో ఉన్నది. ఇక్కడ 287 మందిలో 146 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. బీహార్‌లో 241 మందిలో 139మందిపై, పశ్చిమ బెంగాల్‌లో 102మందిపై క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్నా యి. అలాగే కేరళలో 67 మందిపై, అస్సాంలో 13 మంది పై, పాండిచ్చేరిలో 9మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయి. దేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీ తీసుకున్నా అందులో 30 నుంచి 50 శాతం మంది నేరస్తులున్నారు. ఈ నేరమయ సంస్కృతికి పరాకాష్ట ఏమంటే బీహార్‌లో ఓ ఎమ్మెల్యే తాగిన మత్తులో స్టెన్ గన్నుతో శాసన సభా స్పీకర్‌నే కాల్చి పారేస్తానని బెదిరించాడు.

అయితే ఈ గణాంకాలన్నీ మన రాజకీయ వ్యవస్థ తీరును తేటతెల్లం చేస్తున్నాయి. నేరమయ రాజకీయాలు దేశంలో ఏస్థాయిలో చెలామణి అవుతున్నాయో తేల్చి చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 1448 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 641 మందిపై చాలా తీవ్రమైన హత్య, కిడ్నాప్, దొంగతనం, డెకాయిటీ, అత్యాచారం లాంటి కేసులు ఉన్నాయి. ఆరుగురు ప్రజావూపతినిధులు తమ అఫిడవిట్లలోనే తమపై అత్యాచారం కేసులున్నాయని చెప్పుకున్నారు. 141 మంది హత్యారోపణలు ఎదుర్కొంటున్నారు. 352 మంది హత్యయత్నాల కేసుల్లో ఉన్నారు. 145 మంది దొంగతనం కేసుల్లో ఉన్నారు. 90మందిపై కిడ్నాప్ కేసులున్నాయి. 75 మంది డెకాయిటీ కేసుల్లో ఉన్నారు. దీంతో దేశంలోని అత్యున్నత న్యాయస్థానం మొదలు కేంద్ర ఎన్నికల సంఘం దాకా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. నేరమయ రాజకీయాలను మార్చడం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాయి. పౌరసంఘాల సాయంతో నేరస్తరాజకీయాలను మార్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. నేరరాజకీయాల పట్ల సర్వత్రా అందోళన, నిరసన వ్యక్తమవుతున్నా.., పరిస్థితిలో ఆవగింజంత మార్పు కూడా రావడంలేదు.
ఇదిలా ఉంటే, క్రిమినల్స్ జైలునే బుల్లెట్ ప్రూఫ్ నివాసంగా చేసుకుని తమ దందాలకు తెరతీస్తున్నారు. కొందరు తమ గూండాగ్యాంగులతో జైలులోనే దర్బార్‌లను నడుపుతున్నారు. సెల్‌ఫోన్‌లతో తాఖీదులు జారీ చేస్తున్నారు. ఇలాంటి కండబలం, ధనబలం ఉన్న నేతలను రక్షించేందుకు చట్టంలోని లొసుగులను ఆసరాచేసుకుని విడిపించే తెలివైన లాయర్లు ఉండనే ఉన్నారు. ఇలాంటి ప్రజా ప్రతినిధులు తమ రక్షణకోసం పోలీసులను ఉపయోగించుకుంటున్న తీరు మరో విషాదం. ఒక్కొక్కరు తమ అధికార దర్పానికి గుర్తుగా.. రక్షణగా పోలీసులను నియమించుకుంటున్నారు. మనరక్షణ వ్యవస్థలోని సగం మంది పోలీసులు ఇలాంటి 2,500 మంది నేతల రక్షణ బాధ్యతల్లోనే ఉంటున్నారు. ఒక్కో ప్రజా ప్రతినిధికి సగటున పదిమంది పోలీసులు రక్షణ బాధ్యతలు నిర్వహిస్తుంటే.., దేశంలో లక్ష మందికి పది మంది చొప్పున పోలీసులు రక్షణ బాధ్యతలు చూస్తున్నారు.

కనిపిస్తున్న గణాంకాలు,మన ప్రజా ప్రతినిధుల స్థితి గతులు చూస్తే.. దేశంలో రాజకీయాలన్నీ నేరమయం అయిపోయాయని తేలిపోతున్నది. పవివూతతకు చిరునామాగా చెప్పుకునే గంగానదిని కాలుష్య కాసారంగా మార్చిన తీరుగానే, నీతి,నియమాలు, నిస్వార్థ రాజకీయాలు, ప్రజాసేవ గురించి మాట్లాడిన చోటనే రోజు రోజుకూ రాజకీయాలు నేరమయం అవుతున్నాయి. నేరస్తులే రాజకీయ నేతలుగా రూపాంతరం చెంది, నాయకులుగా చెలామణి అవుతున్నారు. మరి ఈ నేరమయ రాజకీయాలను రూపు మాపే దారే లేదా అంటే.. జవాబు దొరకని ప్రశ్నగానే చూస్తున్నారు. ఓ మాజీ ముఖ్యమంత్రి తాను నియమించుకున్న 22 మంది మంత్రుల్లో అందరిపై క్రిమినల్ కేసులున్నాయి కదా! మంచివారిని మంత్రులుగా నియమించుకోవచ్చు కదా? అంటే..వారిపై క్రిమినల్ కేసులు ఉంటే..,వారి గతంతో నాకు సంబం ధం లేదు. అయినా.. వారిపై నేరారోపణలు ఉంటే.. ప్రజలు ఎందు కు ఎన్నుకున్నారు? అని ఎదురు ప్రశ్నించారు. ప్రజలు నేరస్తుల్నే ఎన్నుకుంటున్నారు కాబట్టి వారే మంత్రులవుతారని చెప్పుకొచ్చారు. కండబలం, ధనబలం, మంది మార్బలంతో ఓటర్లను ప్రలోభ పెట్టి గెలిచే వారిని తప్పు పడదామా? లేదా ఓట్లేసిన ప్రజలను తప్పు పడదామా? ఇలాంటి ప్రశ్నలతో రాజకీయాలు చేసే వాళ్లతో దేశం నిండిపోయింది. వారి ఇష్టానుసారంగా నడిపించుకునేదే ప్రజాస్వామ్యం! ఇలాంటి నేరమయ, ధనస్వామ్యంలో ప్రజలకు మేలు జరుగుతుందని, ప్రజలకు హక్కులుంటాయిని అనుకోవడం, ఆశించడం అత్యాశ.

ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నడుస్తున్నదంతా చట్ట బద్ధ పాలన కాదు. చట్టాన్ని రక్షణ కవచంగా చేసుకుని రాజ్యమేలుతున్న నేరగాళ్ల రాజ్యం. సగం అసెంబ్లీ, పార్లమెంటు జైళ్లో ఉండే స్థితి ఉన్నప్పుడు నేరస్తుపూవరో, నిర్దోషుపూవరో తేల్చేది ఎవ రు? మాఫియాలంతా నేతలుగా తయారై మారాజులైనప్పుడు సామాన్యుని స్థానం ఎక్కడ ఉం టుంది? నీతికి, న్యాయానికీ విలువ ఎంత ఉం టుంది? ప్రజా ప్రతినిధుల ముసుగులో మాఫియాలంతా ఊరేగుతున్నప్పుడు నీతిమయ రాజకీయాలు నట్టేట కలిశాయి. ఎవరైనా ఎలా గెలిచారన్నది ప్రధానం కాకుండా పోయింది. ఎవరు గెలుస్తారో వారిదే రాజ్యం అయిపోయింది.

ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మరో కొత్త రకమైన ఎన్నికల సంస్కరణలు రావాలి. జైలులో ఉన్నవారికి ఓటు వేసే హక్కు లేనప్పుడు పోటీ చేసే అధికారం కూడా ఉండకూడదు. ఒకసారి నేరారోపణ జరిగి శిక్ష పడిన వ్యక్తి పై కోర్టులో అప్పీలుకు పోయినా ఎన్నికలో పోటీకి అనర్హుడుగా ప్రకటించాలి. ప్రజా ప్రతినిధులు ముఖ్యంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులను సత్వర విచారణ చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి.
అంతిమంగా ప్రజల ప్రయోజనాలే ప్రథమావిధిగా భావించే వారే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే విధంగా ఓటర్లలో చైతన్యం రావాలి. నిస్వార్థ రాజకీయ నేతలకే ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అప్పుడు మాత్రమే సాధారణ పౌరునికి రక్షణ ఉం టుంది. దోపిడీలు, డెకాయిటీలు, అత్యాచారాలు చేసే నేతల రాజ్యంలో పేదలకు రక్షణ, న్యాయం దక్కదు. దీనికోసం ప్రజలే తమ ఓటు హక్కు ఆయుధంతో ప్రజాస్వామ్యానికి జీవం పోయాలి. నేరమయ రాజకీయాల నుంచి దేశాన్ని విముక్తి చేయాలి.

-పూనమ్ ఐ కౌశిష్
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్)


35

PUNAM I KOUSHISH

Published: Sat,December 19, 2015 12:48 AM

శాసనకర్తలకు విద్య అవసరం లేదా?

ఎంపీలు, ఎమ్మెల్యేలు.. చట్టసభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరించాలి. ప్రజలకు కావాల్సినవి సాధించాలి. ప్రజలకు మంచి జీవితాన్నందించడం కోసం పా

Published: Wed,August 19, 2015 12:07 AM

కష్టంగా నెట్టుకొస్తున్న మోదీ

పరిపాలనా రంగంలో పరివర్తన కోసం భారత ప్రజ లు మోదీకి అధికారం కట్టబెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన

Published: Wed,August 12, 2015 01:47 AM

చర్చలు సాగని చట్టసభలు

ఇవ్వాళ రాజకీయాల్లో చర్చలకు తావులేకుండాపోయింది. బలప్రదర్శనకే పెద్దపీట వేస్తున్నారు. తమ సంఖ్యాబలంతో అధిపత్యం చూపించుకోవడానికే ప్రాధా

Published: Sat,May 16, 2015 12:39 AM

అధికార దుర్వినియోగం..

మన నేతలంతా వ్యాపారుల్లా అవతారాలెత్తి లాభాలు దండుకుంటుంటే.. ఆమ్ ఆద్మీ- గరీబ్ అవుతున్నాడు. మన నేతలు తమ ప్రైవేటు వ్యవహారాలుగా చెబుతున

Published: Thu,February 26, 2015 01:56 AM

పరిశుభ్రత సరే... ప్రాణాల సంగతి?

ఇండియాలో అన్నింటికన్నా అగ్గువ (చీప్) ఏదైనా ఉన్నదంటే.. అది మనుషు ల ప్రాణమే. కూరగాయల కన్నా ఒకింత విలువ, సమయాన్ని బట్టి వాటి ప్రాముఖ్

Published: Sun,December 21, 2014 01:51 AM

మత మార్పిడులకు పునాది ఏమిటి?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. కానీ ఇది

Published: Tue,April 15, 2014 01:23 AM

ప్రజా జీవితంలో వ్యక్తిగతం ఉంటుందా..?

ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులకు వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు. ఉండకూడదు అని గాంధీ బోధించారు. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత వ్

Published: Wed,April 2, 2014 01:18 AM

ఎన్నికలు- విదేశీ నిధులు

ప్రజాస్వామ్యం వెలుగొందాలి అంటే.. రాజకీయాలను నియంత్రిస్తున్న ధనప్రవాహాన్ని నియంత్రించాలి. ఎన్నికల నిధులు ఎక్కడనుంచి,ఏం ఆశించి వస్త

Published: Thu,February 6, 2014 12:15 AM

తెలంగాణ ఏర్పాటు-పాఠాలు

సామాజిక సమస్యల విషయంలో వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించి దానికి తగిన విధంగా మసలుకోకుంటే.. అది కాలక్రమంలో ప్రతీకారం తీర్చుకుంటుందని భ

Published: Sun,May 5, 2013 12:42 PM

నేతల చావు రాజకీయాలు

మన నేతలు ప్రతిదాన్నీ రాజకీయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అది ఇంకా ముదిరి శవరాజకీయాలనుంచి ఎదిగి చావు రాజకీయాల దాకా వచ్చింది. సరబ

Published: Mon,April 8, 2013 02:41 AM

జేపీసీలు ఎందుకోసం?

ఊహించినట్లుగానే శీతాకాల పార్లమెంటు సమావేశాలు వాడి, వేడిగా సాగా యి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు నడిచిందనిపించుకున్నది. శ్రీ

Published: Fri,March 15, 2013 02:16 AM

అవినీతి అంతమెప్పుడు?

ముఖం చూసి బొట్టు పెట్టడమన్నది మన సంప్రదాయమైపోయింది. ఇదిప్పుడు పాలనా విధానంలోకి తర్జుమా అయ్యింది. నీ చేయి బెంచి కిందినుంచి ఎంత తొంద

Published: Thu,January 3, 2013 11:47 PM

మన ప్రయాణమెటు?

ఈమధ్య కొన్ని ఉదంతాలు సగటు భారతీయుడిని భయవూభాంతులకు గురిచేస్తున్నాయి. మనం కలలుగన్న భారత్ ఇదే నా అని కన్నీరు కార్చే స్థితి వచ్చింది.

Published: Mon,December 10, 2012 12:12 AM

నీతిబాహ్య రాజకీయాలే నీటి తగాదాలు

రాజకీయ నాయకులు ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ, మహానీయులు భావి తరాల కోసం ఆలోచిస్తారనేది పెద్దలమాట. దీని కనుగుణంగానే నేటి రాజకీయ న

Published: Sun,December 2, 2012 11:30 PM

ప్రజారోగ్యం పట్టని పాలకులు

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నది పాత మాట. ఇప్పుడు ప్రజల అనారోగ్యమే కొందరికి వరమైపోయింది. రోగగ్రస్థ సమాజంతోనే లాభాలను పిండుకునే పరిస్థిత

Published: Wed,October 10, 2012 05:33 PM

మాటల్లోనే గాంధీ మార్గమా?

నేనుంటున్న ఇంటి పక్కనే ఓ నవయువకుడు ఉంటాడు. ఆయనను ‘గాంధీ గురించి నీ అభివూపాయం ఏమిటీ’ అనగానే.. ‘అతనికేం సొట్టబుగ్గల అందగాడు. మోస్ట్

Published: Sat,October 6, 2012 04:24 PM

అసోం అల్లర్లపై అలసత్వమేల?

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుం టూ కాలక్షేపం చేశాడని..అది నిర్లక్ష్యానికి, బాధ్యతా రాహిత్యానికి సంకేతంగా చె

Published: Sat,October 6, 2012 04:25 PM

ఎంతకాలం ఈ గందరగోళం?

ఇరాచకం తరువాత అత్యంత అధ్వాన్నమైన స్థితి ప్రభుత్వం అంటాడు హెన్నీ బీచర్. ఇప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ పరిపాలనా విధానాన్ని చూస్తే

Published: Sat,October 6, 2012 04:25 PM

కాముకుల కాసుల క్రీడ

జంటిల్‌మెన్ గేమ్ జంగ్లీగా తయారైంది. ‘ఐపీఎల్’క్షికికెట్ వివాదాల మయం అవుతోంది. క్రికెట్ ఇవాళ.. మూడు ‘సీ’ల చుట్టూ తిరుగు తున్నది. క్య

Published: Sat,October 6, 2012 04:25 PM

అర్హత లేకున్నా అందలమేలా?

రాజకీయాలకు కేంద్ర నిలయమైన ఢిల్లీ ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటుం ది. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం (ఎన్సీటీసీ) ఏర్పాటుపై కేంద్రానికి ర

Featured Articles