మన ప్రయాణమెటు?


Thu,January 3, 2013 11:47 PM

delhiఈమధ్య కొన్ని ఉదంతాలు సగటు భారతీయుడిని భయవూభాంతులకు గురిచేస్తున్నాయి. మనం కలలుగన్న భారత్ ఇదే నా అని కన్నీరు కార్చే స్థితి వచ్చింది. ఇంతకూ మనమె టు పోతున్నాం? దేశం ఏమైపోతుందన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో 15 ఏళ్లకు పైబడిన యువతీ యువకులంతా రోడ్డెక్కి మాకు భద్రత కావాలని రోదిస్తున్నారు. సామూహిక అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన అమానత్ ఘటన తో యువత అంతా భయంతో వణికిపోతున్నది. అడుగు బయట పెట్టాడానికే జంకే పరిస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో వేలాది మంది తమ మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు.

ఈ యువత అడుగుతున్న విషయాన్ని ఆలోచించకుండాప్రభుత్వం వారందరినీ భయపెట్టి ఇళ్లలోకి పంపిం చే పనికి పూనుకున్నది. టియర్‌గ్యాస్‌తో, వాటర్‌క్యానన్‌లతో బెదరగొట్టి చెదరగొట్టడానికి బలవూపయోగానికి ఒడిగట్టింది. వందలాది మంది యువతీ యువకులను గాయపరిచి ఆసుపవూతుల పాలు చేసిం ది. కానీ.. యువత కోరుతున్న విషయాన్ని సానుభూతితో విని సమ స్య పరిష్కారానికి పూనుకుంటామని హామీ మాత్రం ఇవ్వలేకపో యింది. అలాగే మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న నిందితులను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్‌ను ఒప్పుకోవడానికి బదులు నేతలే అసలు విషయాన్ని పక్కదారిపట్టించే మాటలు మాట్లాడి విద్యార్థుల ఆవేదనను అవహేళన చేశారు. కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే తనకు ముగ్గురు కూతుళ్లున్నారని చెబుతూ... ఘటన తీవ్రత అర్థం చేసుకోగలనని చెప్పుకొచ్చారు. ఢిల్లీ ముఖ్య మంత్రిగాఉన్న షీలాదీక్షిత్ మాత్రం పురుషులను రెచ్చగొ విధంగా మహిళల వస్త్రధారణ ఉండకూడద ని, జీన్‌ప్యాంట్లు వేసుకోవద్దని నిండుగా ఉండే దుస్తులనే వాడాల ని ఉచిత సలహా పారేశారు. దీంతో యువతలో ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతాయుతంగా ప్రవర్తించని నేతల తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది.

ఎర్రబుగ్గ కార్లలో తిరుగుతూ చుట్టూ స్టెన్‌గన్నులు పట్టుకున్న పోలీసుల మధ్యన తిరుగాడే నేతల కు యువతీ యువకుల భయాలు ఏం అర్థమవుతాయి? నిజానికి దేశంలో నెలకొన్న నేటి దుస్థితికి అటు నేతలు, ఇటు పోలీసులదే ప్రధాన బాధ్యత. ఖాకీ, ఖద్దరు మిలాఖత్‌తో జరుగుతున్న అవినీతి అక్రమాలకు అంతేలేకుండా పోయింది. సాధారణ ప్రజలకు రక్షకులుగా ఉండాల్సిన పోలీసులకు నేతల రక్షణే ప్రధానం అయిపోయింది. ఇక ఆమ్ ఆద్మీ రక్షణ గాలిలో కొట్టుమిట్టాడుతున్న దీపంగాక మరేం అవుతుంది .

విషాదమేమంటే.. నవ నాగరికతకు, అభివృద్ధికి కేంద్రాలుగా చెప్పుకుంటున్న నగరాల్లోనే నేరాలు రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. లండన్‌కు చెందిన ఓ సంస్థ చేసిన సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 150 సురక్షితమైన నగరాల్లో ఢిల్లీ, ముంబై నగరాలు 139, 126 స్థానాల్లో నిలిచాయి. అంటే.. మన దేశంలో నగరాల్లోని ప్రజల భద్రత ఎంత దుర్భరంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు భారతదేశంలో అతిపెద్ద మెట్రోపాలిటన్ పోలీస్ ఫోర్స్ ఉన్నది. ఒక్క ఢిల్లీలోనే 83,762 మంది పోలీసులున్నారు. వీరిలో 30 శాతానికంటే తక్కువమంది సాధారణ శాంతిభద్రతల కోసం పనిచేస్తున్నా రు.

మిగతా 70 శాతం మంది పోలీసులు మన నేతలు, వీఐపీల రక్ష ణ బాధ్యతలే చూస్తున్నారు. ఇక సాధారణ ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుంది? పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బ్యూరో అధ్యయ నం ప్రకారం 2010లో 50,059 మంది పోలీసులు 16,788 మంది వీఐపీల రక్షణ బాధ్యతలు చూస్తున్నారు. అదే సాధారణ శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా 1,037 మంది ప్రజలకు ఒక సాధారణ పోలీసు ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సరాసరిగా 333 మందికి ఒక పోలీసు ఉన్నాడు. ఉన్న పోలీసులు కూడా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా పనిచేస్తున్నారా అంటే చట్టం వారి చేతుల్లో లాఠీగా మారిపోయింది. పోలీసులు, ఖాకీ యూనిఫామ్ అంటే అన్నింటికీ లైసెన్స్ అన్న చందంగా తయారైంది. సాధారణ పౌరుడు చేయలేని నేరాలన్నీ పోలీసులుచేసే దుస్థితి ఉన్నది. లాఠీ, తుపాకీ పట్టుకున్న పోలీసులే అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్‌లు, బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలను తోడేస్తున్నారు. వీరికి దన్నుగా రాజకీయనేతలు కూడా చేరితే.. అరాచకత్వం, కీచక పర్వం రాజ్యచేస్తాయి. ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నది అదే.

ఇక మననేతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎంపీలు, ఎమ్మెల్యేలపైనే తీవ్రమైన హత్యా నేరారోపణలు, కిడ్నాప్, అత్యాచారం లాంటి తీవ్రమైన కేసులున్నాయి. ఏఐడీఎంకే తృణముల్ కాంగ్రెస్ సభ్యులైన ఇద్దరు ఎంపీలపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిదిమందిపై, పశ్చిమబెంగాల్‌లో ఏడుగురిపై అత్యాచారం కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా చూస్తే 360 మంది ఎమ్మెల్యేలు లైంగిక నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. ఇలా ప్రజాప్రతినిధులే నేరగాళ్లుగా ఉన్న దేశంలో శాంతి భద్రతల సమస్య ఉండదా! ప్రజలకు భద్రత ఇంతకన్నా మెరుగ్గా ఉంటుందని ఆశించడం అత్యా శే అవుతుంది.

పౌరుల భద్రత విషయంలో నూ, శాంతి భద్రతల విషయంలో నూ మెరుగైన ఫలితాలు ఉండాలంటే.. పోలీసుల విధి నిర్వహణ లో రాజకీయాల ప్రమేయం, నేత ల జోక్యం ఉండరాదని 2006లో సుప్రీంకోర్టు సూచించింది. పోలీసుల బదిలీలు, పదోన్నతుల్లో నేత ల జోక్యం ఉన్నంత కాలం పోలీసుల నుంచి మెరుగైన ఫలితాలను ఆశించలేమని తేల్చి చెప్పింది. భారత పోలీస్ వ్యవ స్థ బ్రిటిష్ కాలంనాటి పద్ధతుల్లో పని చేయడం నేటి ప్రజలకు శాపం. వలసవాద, బానిస ఆర్డర్లీ విధానంతో నేటికీ నడుస్తున్న పోలీ సు వ్యవస్థను ఆధునీకరించాలి. ఆధునిక సమాజ అవసరాలకనుగుణంగా మానవీకరించాలి.

ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా, పోలీస్ వ్యవస్థను నిర్మించాలి. పోలీసులు రాజకీయ నాయకుల చెప్పుచేతల్లో కాకుండా న్యాయం, చట్టం పరిధిలో పనిచేయాలి. పోలీసులను పనిచేయించేది చట్టం కావాలి కానీ, ప్రభుత్వంలోని రాజకీయ నేతలు కాకూడదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇటీవలి పరిణామాల పట్ల బాధ్యతతో వ్యవహరించాలి. పోలీస్ వ్యవస్థ నిష్ఫాక్షికంగా చట్ట పరిధిలో పనిచేసిన నాడే శాంతి భద్రతలు నెలకొంటాయి. సామాన్యునికి భద్రత ఉంటుంది. అప్పుడు మాత్ర మే పోలీసులు అంటే నిజమైన రక్షకులుగా ప్రజల చేత మన్ననలు పొందగలుగుతారు. పోలీసులు తమ పోలీస్‌స్టేషన్ల గోడలపై రాసుకున్నట్లు మీతో మేము, మీ కోసం మేము అన్నది గోడ మీది రాతగా కాకుండా అర్థవంతంగా ఆదర్శంగా ఆచరణలో ఉండాలి. ఈ మార్పులనే దేశంలోని సామాన్యులు కోరుకుంటున్నారు.

-పూనమ్ ఐ కౌశిష్
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్)

35

PUNAM I KOUSHISH

Published: Sat,December 19, 2015 12:48 AM

శాసనకర్తలకు విద్య అవసరం లేదా?

ఎంపీలు, ఎమ్మెల్యేలు.. చట్టసభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరించాలి. ప్రజలకు కావాల్సినవి సాధించాలి. ప్రజలకు మంచి జీవితాన్నందించడం కోసం పా

Published: Wed,August 19, 2015 12:07 AM

కష్టంగా నెట్టుకొస్తున్న మోదీ

పరిపాలనా రంగంలో పరివర్తన కోసం భారత ప్రజ లు మోదీకి అధికారం కట్టబెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన

Published: Wed,August 12, 2015 01:47 AM

చర్చలు సాగని చట్టసభలు

ఇవ్వాళ రాజకీయాల్లో చర్చలకు తావులేకుండాపోయింది. బలప్రదర్శనకే పెద్దపీట వేస్తున్నారు. తమ సంఖ్యాబలంతో అధిపత్యం చూపించుకోవడానికే ప్రాధా

Published: Sat,May 16, 2015 12:39 AM

అధికార దుర్వినియోగం..

మన నేతలంతా వ్యాపారుల్లా అవతారాలెత్తి లాభాలు దండుకుంటుంటే.. ఆమ్ ఆద్మీ- గరీబ్ అవుతున్నాడు. మన నేతలు తమ ప్రైవేటు వ్యవహారాలుగా చెబుతున

Published: Thu,February 26, 2015 01:56 AM

పరిశుభ్రత సరే... ప్రాణాల సంగతి?

ఇండియాలో అన్నింటికన్నా అగ్గువ (చీప్) ఏదైనా ఉన్నదంటే.. అది మనుషు ల ప్రాణమే. కూరగాయల కన్నా ఒకింత విలువ, సమయాన్ని బట్టి వాటి ప్రాముఖ్

Published: Sun,December 21, 2014 01:51 AM

మత మార్పిడులకు పునాది ఏమిటి?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. కానీ ఇది

Published: Tue,April 15, 2014 01:23 AM

ప్రజా జీవితంలో వ్యక్తిగతం ఉంటుందా..?

ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులకు వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు. ఉండకూడదు అని గాంధీ బోధించారు. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత వ్

Published: Wed,April 2, 2014 01:18 AM

ఎన్నికలు- విదేశీ నిధులు

ప్రజాస్వామ్యం వెలుగొందాలి అంటే.. రాజకీయాలను నియంత్రిస్తున్న ధనప్రవాహాన్ని నియంత్రించాలి. ఎన్నికల నిధులు ఎక్కడనుంచి,ఏం ఆశించి వస్త

Published: Thu,February 6, 2014 12:15 AM

తెలంగాణ ఏర్పాటు-పాఠాలు

సామాజిక సమస్యల విషయంలో వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించి దానికి తగిన విధంగా మసలుకోకుంటే.. అది కాలక్రమంలో ప్రతీకారం తీర్చుకుంటుందని భ

Published: Sun,May 5, 2013 12:42 PM

నేతల చావు రాజకీయాలు

మన నేతలు ప్రతిదాన్నీ రాజకీయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అది ఇంకా ముదిరి శవరాజకీయాలనుంచి ఎదిగి చావు రాజకీయాల దాకా వచ్చింది. సరబ

Published: Mon,April 8, 2013 02:41 AM

జేపీసీలు ఎందుకోసం?

ఊహించినట్లుగానే శీతాకాల పార్లమెంటు సమావేశాలు వాడి, వేడిగా సాగా యి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు నడిచిందనిపించుకున్నది. శ్రీ

Published: Fri,March 15, 2013 02:16 AM

అవినీతి అంతమెప్పుడు?

ముఖం చూసి బొట్టు పెట్టడమన్నది మన సంప్రదాయమైపోయింది. ఇదిప్పుడు పాలనా విధానంలోకి తర్జుమా అయ్యింది. నీ చేయి బెంచి కిందినుంచి ఎంత తొంద

Published: Mon,January 21, 2013 12:11 AM

నేర రాజకీయాలే సమస్య

మేకలను బలి ఇచ్చి పులులను అందలమెక్కించే నీతి దేశంలో రాజ్యమేలుతున్న ది. ఇది ఎక్కడనో ఒకచోట జరుగుతున్న తంతు కాదు, దేశంలో మూల మూలనా ఇదే

Published: Mon,December 10, 2012 12:12 AM

నీతిబాహ్య రాజకీయాలే నీటి తగాదాలు

రాజకీయ నాయకులు ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ, మహానీయులు భావి తరాల కోసం ఆలోచిస్తారనేది పెద్దలమాట. దీని కనుగుణంగానే నేటి రాజకీయ న

Published: Sun,December 2, 2012 11:30 PM

ప్రజారోగ్యం పట్టని పాలకులు

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నది పాత మాట. ఇప్పుడు ప్రజల అనారోగ్యమే కొందరికి వరమైపోయింది. రోగగ్రస్థ సమాజంతోనే లాభాలను పిండుకునే పరిస్థిత

Published: Wed,October 10, 2012 05:33 PM

మాటల్లోనే గాంధీ మార్గమా?

నేనుంటున్న ఇంటి పక్కనే ఓ నవయువకుడు ఉంటాడు. ఆయనను ‘గాంధీ గురించి నీ అభివూపాయం ఏమిటీ’ అనగానే.. ‘అతనికేం సొట్టబుగ్గల అందగాడు. మోస్ట్

Published: Sat,October 6, 2012 04:24 PM

అసోం అల్లర్లపై అలసత్వమేల?

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుం టూ కాలక్షేపం చేశాడని..అది నిర్లక్ష్యానికి, బాధ్యతా రాహిత్యానికి సంకేతంగా చె

Published: Sat,October 6, 2012 04:25 PM

ఎంతకాలం ఈ గందరగోళం?

ఇరాచకం తరువాత అత్యంత అధ్వాన్నమైన స్థితి ప్రభుత్వం అంటాడు హెన్నీ బీచర్. ఇప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ పరిపాలనా విధానాన్ని చూస్తే

Published: Sat,October 6, 2012 04:25 PM

కాముకుల కాసుల క్రీడ

జంటిల్‌మెన్ గేమ్ జంగ్లీగా తయారైంది. ‘ఐపీఎల్’క్షికికెట్ వివాదాల మయం అవుతోంది. క్రికెట్ ఇవాళ.. మూడు ‘సీ’ల చుట్టూ తిరుగు తున్నది. క్య

Published: Sat,October 6, 2012 04:25 PM

అర్హత లేకున్నా అందలమేలా?

రాజకీయాలకు కేంద్ర నిలయమైన ఢిల్లీ ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటుం ది. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం (ఎన్సీటీసీ) ఏర్పాటుపై కేంద్రానికి ర

Featured Articles