నీతిబాహ్య రాజకీయాలే నీటి తగాదాలు


Mon,December 10, 2012 12:12 AM

రాజకీయ నాయకులు ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ, మహానీయులు భావి తరాల కోసం ఆలోచిస్తారనేది పెద్దలమాట. దీని కనుగుణంగానే నేటి రాజకీయ నేతలు అన్నింటినీ ఎన్నికల చుట్టూ తిప్పుతూ రాజకీ యం చేస్తున్నారు. కావేరీ జలాల సమస్యను పెంచి పెద్ద చేస్తున్నాయి. నేతలకు సమ స్య పరిష్కారం, ప్రజాప్రయోజనాలు నెరవేర్చడంకాక, తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మారిపోయింది. ఈనేపథ్యంలోనే..ఢిల్లీలో నేతలు రాజకీయ జూదం ఆడుతున్నారు. నిన్నగాక మొన్న ఎఫ్‌డీఐల గురించి నడిచిన తతంగమంతా దేశమంతా చూసి విస్తుపోయింది. ఏపార్టీ ఎందుకు ఎఫ్‌డీఐలను సమర్థిస్తున్నదో, వ్యతిరేకిస్తున్నవారు ఎందుకు వ్యతిరేకిస్త్తున్నారో చెప్పకుండా..రాజకీయ కుర్చీ ఆటకు రక్తి కట్టించారుపతిపక్ష పార్టీల నేతలు కూడా తమ వంతు పాత్రగా ప్రభుత్వానికి పరదాచాటు సాయమందించి ప్రభుత్వాన్ని నిలబెట్టారు. కానీ దేశ ప్రజల భవిష్యత్తును అగాథంలోకితోసి వంచించారు. ఈనేపథ్యంలోనే కావేరీ జలాల సమస్య కూడా రెండు రాష్ట్రాల మధ్య మంటలు రేపింది.

సమస్య సుప్రీంకోర్టు దాకా వెళ్లి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు నీటి జలాల సమస్యను ఓట్ల రాజకీయం చేస్తూన్నాయి. రాష్ట్రాల తీరు ఇలా ఉంటే, బాధ్యతాయుతంగా ఉండాల్సిన కేంద్ర ప్రభు త్వం కూడా సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధిగా ప్రయత్నించకుండా రాజకీయ లబ్ధిని పొందడానికి ప్రయత్నిస్తున్నది.
ఆధునిక ప్రపంచంలో భవిష్యత్తులో జరుగబోయే యుద్ధాలన్నీ నీటి కోసమే జరుగుతాయని నిపుణులు అంటున్న దానికి సాక్ష్యంగా ఇవ్వాళ దేశంలో మునుపెన్నడూ లేనివిధంగా నదీజలాల వివాదాలు పెరిగిపోతున్నాయి. నీటి పంపకాల కోసం రాష్ట్రాల మధ్య నిప్పు రాజుకుంటున్నది. దీనికంతటికీ రోజు రోజుకూ లభ్యమవుతున్న నీటి వనరుల శాతం తగ్గడమే కారణం. ఓ అంచనా ప్రకారం 2050నాటికి 1,180 మిలియన్ల క్యూబిక్ మీటర్ల నీరు అవసమరం. ఇది ఇప్పుడు అందుబాటు లో ఉన్న నీటి వనరులకు దాదాపు రెండురెట్లు. నానాటికీ తరిగిపోతున్న నీటి వనరులు, తగ్గుతున్న భూగర్భ జలాలు నీటి సమస్యను మరింత జఠిలం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

పరిస్థితులు ఇలాగే ఉంటే రాబోయే కాలంలో జల వివాదాలు తీవ్రమయ్యేట్టున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభు త్వం, సుప్రీంకోర్టు బాధ్యతాయుతంగా ఉండి సమస్యలు పరిష్కారం చేయకుంటే తగువులాటలే నీటి యుద్ధాలుగా పరిణమించే ప్రమాదం ఉన్నది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్యన నలుగుతున్న కావేరీ నదీజలాల సమస్య తాజా గా ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది.120ఏళ్లుగా రెండు రాష్ట్రాలు కావేరీ జలాలను పంచుకుంటున్నా, తాజాగా ఇదే పెద్ద సమస్యగా మారిపోయింది. రెండు రాష్ట్రాలూ వాస్తవిక దృష్టితో కాకుండా పక్షపాత ధోరణితో వ్యవహరించడం మూలంగానే సమస్య జఠిలమైంది. ఇరు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో కాకుం డా సమస్యను సాగదీసేందుకే ప్రయత్నిస్తున్నాయి. చివరికి సమస్య సుప్రీంకోర్టుకు చేరింది. తమకు న్యాయం చేయాలని తమిళనాడు మొరపెట్టుకుంది. కోర్టు మధ్యంతర తీర్పుగా పదివేలక్యూసెక్కుల నీటిని తమిళనాడుకు వదలాలని కర్ణాటకకు సూచించింది. అయితే ఈ సమస్య కోర్టు జోక్యంతో తాత్కాలికంగా పరిష్కారం అయినట్లు కనిపించినా, ఇది రెండు రాష్ట్రాల మధ్యన అగ్గిరాజేసినట్లే అయ్యింది.

కావేరీ జలవివాదంలో రెండు రాష్ట్రాలూ ప్రజల సెంటిమెంటుతో ఆటలాడుకుంటున్నాయి. వాస్తవాలను మరుగుపరిచి రాజకీయ నాటకానికి తెరలేపుతున్నాయి. కావేరీ నుంచి ఒక టీఎంసీ నీటిని వదిలినా వేలాది ఎకరాల పంటభూములు ఎడారిగా మారుతాయని కర్ణాటక వాదిస్తున్నది. తమిళనాడుకు నీరు వదిలితే రాబోయే రెండుమూడు నెలల్లోనే బెంగుళూరు, మైసూరు నగరాలు నీటి కరువుతో అల్లాడుతాయని కర్ణాటక చెప్పుకొస్తున్నది. మరోవైపు కావేరీ నుంచి నీరు అందకపోతే 15 లక్షల ఎకరాల పంటపొలాలు ఎండిపోతాయని తమిళనాడు అంటున్నది. తమిళులు దేశజనాభాలో ఆరుశాతం ఉంటే నీటిని మాత్రం మూడు శాతం నీటి వనరులను వాడుకుంటున్నారని చెబతున్నది. ఇలా ఏరాష్ట్రానికారాష్ట్రం తమ లెక్కలు చెబుతూ తమదే న్యాయమనే రీతిలో ముందుకు పోతే సమస్య పరిష్కారం ఎలా అనేది అస లు సమస్య. వచ్చే ఏడాదిలో ఎన్నికలకు సిద్ధమవుతున్న కర్ణాటకలో రాజకీయ పార్టీల నేతలు కావేరీ జలాల సమస్యను తురుపు ముక్కగా వాడుకుంటున్నాయి. యెడ్యూరప్ప మొదలు, శెట్టర్ దాకా అందరూ కావేరీ జల వివాదాన్ని ఎన్నికల నినాదంగా మార్చుకోవడానికి పావులు కదుపుతున్నారు. మరో వైపు తమిళనాడులో.. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏఐడీఎంకే, డీఎంకే కావేరి జలాలపై ఒకే గొంతుకతో మాట్లాడుతున్నాయి.

నిజానికి ఇవ్వాళదేశంలో కావేరీ సమస్య తాజాగా కనిపిస్తున్న వాటిలో ఒకటి మాత్రమే. కొన్నేళ్లుగా దేశంలో రాష్ట్రాల మధ్య నదీజలాల పంపకం సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఇవే అంతరాష్ట్ర రాజకీయ వివాదాలు, సరిహద్దు సమస్యలుగా కూడా రూపుదిద్దుకుంటున్నాయి. లెక్కకు మించి న్యాయపోరాటాలకు దారితీస్తున్నాయి. ఈ సమస్యలను బాధ్యతాయుతంగా వాస్తవికత పునాదిగా అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనాలతో కాలం వెల్లబుచ్చుతున్నది. అడ్డదారులు, దొడ్డిదారుల్లో సమస్యలకు పరిష్కారాలను వెతుకుతూ చోద్యం చూస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రవూపదేశ్-కర్ణాటక మధ్య కృష్ణానది జల వివాదం నడుస్తున్నది. మహారాష్ట్ర-కర్ణాటకల మధ్య గోదావరి జలాల పంపకం సమస్య, గోవా-కర్ణాటకల మధ్య మండేల్ మండోవి బేసిన్ సమస్య, మధ్యవూపదేశ్-గుజరాత్ మధ్య నర్మదా నది సమస్య రగులుతూనే ఉన్నా యి.

ఈ జల వివాదాల పరిష్కారం కోసం అంతపూరాష్ట్ర జలవివాదాల చట్టం 1956 ప్రకారం ఇప్పటికే అయిదు ట్రిబ్యూనళ్లు పనిచేస్తున్నాయి. అయినా వివాదాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. వీటిని పరిష్కరిస్తూ జలవనరులను అందరికీ న్యాయబద్ధంగా అందించాల్సిన ప్రభుత్వం మాత్రం,నీటి వనరుల యాజమాన్యా న్ని అనేక విభాగాల కింద విడదీసి సంక్లిష్టం చేసింది. జలవనరుల లభ్యత, పంపకాన్ని ఆరు మంత్రిత్వశాఖలకు అప్పగించింది. వాటర్ రిస్సోస్, రూరల్ డెవలప్‌మెంట్, అగ్రికల్చర్, అర్బన్ డెవలప్‌మెంట్, ఫుడ్ అండ్ ఎన్విరాన్ మెంట్ లాంటి కేంద్ర మంత్రి త్వశాఖలకు జలవనరుల పర్యవేక్షణ బాధ్యతను పెట్టింది. దీంతో..మంత్రిత్వశాఖల మధ్య సమన్వయ లోపం, మంత్రుల మధ్య విభేదాలు వెరసి జలవనరులు ఎవరికీ పట్టనిదైంది. దీంతో.పపంచంలో మరే దేశంలో లేనివిధంగా జలవనరుల యాజమాన్యం,సంరక్షణ, పంపకాలు సమస్యలుగా తయారవుతున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో గంగానదితోపాటు 11నదీ బేసిన్‌లు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి.

2025 నాటికి ఈ నదీ పరివాహక ప్రాంతాలన్నీ తీవ్రమైన నీటి కరువుతో కొట్టుమిట్టాడుతాయని నిపుణులు అంటున్నారు. 90కోట్ల మంది కరువుబారిన పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దానికి సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికే కనిపిస్తున్నాయి. దేశంలో మెజారీటి ప్రాంతాలను ప్రభుత్వమే కరువుపీడిత ప్రాంతాలుగా ప్రకటించే స్థితి వచ్చింది.ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. జల వనరులను జాతీయ వనరులుగా గుర్తించి ప్రజల మధ్య సహజ న్యాయసూవూతాల ప్రకారం ధర్మ పంపకం చేయాలి. జాతీయ నీటి కమిషన్‌ను ఏర్పాటు చేసి జల వివాదాలను పరిష్కరించాలి. ప్రాంతీయ సమస్యలను వాటికే వదిలివేయకుండా సత్వరమే పరిష్కరించాలి. అలాచేయక పోతే వచ్చే రెండు దశాబ్దాల్లో నీటి తగాదాలు పెరిగిపోయి అరాచకం రాజ్యమేలే పరిస్థితి రావచ్చు. కాబట్టి జలవనరులను న్యాయబద్ధంగా పంపకం చేసి ప్రజలకు వాస్తవ పరిస్థితులను అర్థం చేయించాలి. నానాటికీ తరిగిపోతున్న జలవనరుల నేపథ్యంలో వీలైనంతగా నీటి వాడకాన్ని తగ్గించుకునేట్లుగా ప్రజలను చైతన్యవంతం చేయాలి. 1951లో సరాసరి 5,177 క్యూబిక్ మీటర్ల నీరు అందుబాటులో ఉంటే..1991నాటికి అది 2,209కి పడిపోయింది. అది ఇంకా 2001 నాటికి 1,582 క్యూబిక్ మీటర్లకు పడిపోయింది.దీనిని పరిగణనలోకి తీసుకోకుండా నీటి కోసం తగువులాడటం పరిష్కారం కాదు. రాజ్యాంగంలో పొందుపరిచిన న్యాయ సూత్రాల ప్రకారంగా జల వివాదాలను పరిష్కరించుకోవాలి.

నాటి పాలకులు ముందుచూపుతోనే చాలా పథకాలు తయారు చేశారు. 1940లోనే ఎం.ఎన్.దస్తూర్ కమిటీ వేశారు. ఈ కమిటీ దేశాన్ని సస్యశ్యామలం కావాలంటే హిమాలయ పర్వతాలనుంచి వస్తున్న నదులను అనుసంధానం చేయాలని సూచించింది. దేశ దక్షిణ భూభాగం భారత ద్వీపకల్పంలోని 17నదులను కలిపి నీటి వనరులను పెంచాలని చెప్పింది. కానీ దశాబ్దాలు గడుస్తున్నా ఆ పథకం అమలుకు నోచుకోలేదు. సాధ్యాసాధ్యాల గురించి ఎడతెగని చర్చలు సాగించి చివరికి అటకెక్కించారు. ప్రస్తుత సమస్యలన్నింటికీ పాలకుల బాధ్యతా రాహిత్యం, నిర్లక్ష్యధోరణులే ప్రాధాన కారణం. ఇప్పటికైనా పాలకులు స్వార్థ, సంకుచిత ధోరణులు, స్వార్థ రాజకీయాలు మాని ప్రజలను పట్టించుకోవాలి. ప్రతి సమస్యను జఠిలం చేసి, కుల,మతపాంతీయతత్వాన్ని అద్ది ఓట్ల రాజకీయంచేయడం మానుకోవాలి. అప్పు డే దేశం సుఖశాంతులతో విలసిల్లుతుంది. లేదంటే భవిష్యత్తంతా అంధకారమే.

-పూనమ్ ఐ కౌశిష్
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్)

35

PUNAM I KOUSHISH

Published: Sat,December 19, 2015 12:48 AM

శాసనకర్తలకు విద్య అవసరం లేదా?

ఎంపీలు, ఎమ్మెల్యేలు.. చట్టసభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరించాలి. ప్రజలకు కావాల్సినవి సాధించాలి. ప్రజలకు మంచి జీవితాన్నందించడం కోసం పా

Published: Wed,August 19, 2015 12:07 AM

కష్టంగా నెట్టుకొస్తున్న మోదీ

పరిపాలనా రంగంలో పరివర్తన కోసం భారత ప్రజ లు మోదీకి అధికారం కట్టబెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన

Published: Wed,August 12, 2015 01:47 AM

చర్చలు సాగని చట్టసభలు

ఇవ్వాళ రాజకీయాల్లో చర్చలకు తావులేకుండాపోయింది. బలప్రదర్శనకే పెద్దపీట వేస్తున్నారు. తమ సంఖ్యాబలంతో అధిపత్యం చూపించుకోవడానికే ప్రాధా

Published: Sat,May 16, 2015 12:39 AM

అధికార దుర్వినియోగం..

మన నేతలంతా వ్యాపారుల్లా అవతారాలెత్తి లాభాలు దండుకుంటుంటే.. ఆమ్ ఆద్మీ- గరీబ్ అవుతున్నాడు. మన నేతలు తమ ప్రైవేటు వ్యవహారాలుగా చెబుతున

Published: Thu,February 26, 2015 01:56 AM

పరిశుభ్రత సరే... ప్రాణాల సంగతి?

ఇండియాలో అన్నింటికన్నా అగ్గువ (చీప్) ఏదైనా ఉన్నదంటే.. అది మనుషు ల ప్రాణమే. కూరగాయల కన్నా ఒకింత విలువ, సమయాన్ని బట్టి వాటి ప్రాముఖ్

Published: Sun,December 21, 2014 01:51 AM

మత మార్పిడులకు పునాది ఏమిటి?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. కానీ ఇది

Published: Tue,April 15, 2014 01:23 AM

ప్రజా జీవితంలో వ్యక్తిగతం ఉంటుందా..?

ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులకు వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు. ఉండకూడదు అని గాంధీ బోధించారు. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత వ్

Published: Wed,April 2, 2014 01:18 AM

ఎన్నికలు- విదేశీ నిధులు

ప్రజాస్వామ్యం వెలుగొందాలి అంటే.. రాజకీయాలను నియంత్రిస్తున్న ధనప్రవాహాన్ని నియంత్రించాలి. ఎన్నికల నిధులు ఎక్కడనుంచి,ఏం ఆశించి వస్త

Published: Thu,February 6, 2014 12:15 AM

తెలంగాణ ఏర్పాటు-పాఠాలు

సామాజిక సమస్యల విషయంలో వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించి దానికి తగిన విధంగా మసలుకోకుంటే.. అది కాలక్రమంలో ప్రతీకారం తీర్చుకుంటుందని భ

Published: Sun,May 5, 2013 12:42 PM

నేతల చావు రాజకీయాలు

మన నేతలు ప్రతిదాన్నీ రాజకీయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అది ఇంకా ముదిరి శవరాజకీయాలనుంచి ఎదిగి చావు రాజకీయాల దాకా వచ్చింది. సరబ

Published: Mon,April 8, 2013 02:41 AM

జేపీసీలు ఎందుకోసం?

ఊహించినట్లుగానే శీతాకాల పార్లమెంటు సమావేశాలు వాడి, వేడిగా సాగా యి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు నడిచిందనిపించుకున్నది. శ్రీ

Published: Fri,March 15, 2013 02:16 AM

అవినీతి అంతమెప్పుడు?

ముఖం చూసి బొట్టు పెట్టడమన్నది మన సంప్రదాయమైపోయింది. ఇదిప్పుడు పాలనా విధానంలోకి తర్జుమా అయ్యింది. నీ చేయి బెంచి కిందినుంచి ఎంత తొంద

Published: Mon,January 21, 2013 12:11 AM

నేర రాజకీయాలే సమస్య

మేకలను బలి ఇచ్చి పులులను అందలమెక్కించే నీతి దేశంలో రాజ్యమేలుతున్న ది. ఇది ఎక్కడనో ఒకచోట జరుగుతున్న తంతు కాదు, దేశంలో మూల మూలనా ఇదే

Published: Thu,January 3, 2013 11:47 PM

మన ప్రయాణమెటు?

ఈమధ్య కొన్ని ఉదంతాలు సగటు భారతీయుడిని భయవూభాంతులకు గురిచేస్తున్నాయి. మనం కలలుగన్న భారత్ ఇదే నా అని కన్నీరు కార్చే స్థితి వచ్చింది.

Published: Sun,December 2, 2012 11:30 PM

ప్రజారోగ్యం పట్టని పాలకులు

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నది పాత మాట. ఇప్పుడు ప్రజల అనారోగ్యమే కొందరికి వరమైపోయింది. రోగగ్రస్థ సమాజంతోనే లాభాలను పిండుకునే పరిస్థిత

Published: Wed,October 10, 2012 05:33 PM

మాటల్లోనే గాంధీ మార్గమా?

నేనుంటున్న ఇంటి పక్కనే ఓ నవయువకుడు ఉంటాడు. ఆయనను ‘గాంధీ గురించి నీ అభివూపాయం ఏమిటీ’ అనగానే.. ‘అతనికేం సొట్టబుగ్గల అందగాడు. మోస్ట్

Published: Sat,October 6, 2012 04:24 PM

అసోం అల్లర్లపై అలసత్వమేల?

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుం టూ కాలక్షేపం చేశాడని..అది నిర్లక్ష్యానికి, బాధ్యతా రాహిత్యానికి సంకేతంగా చె

Published: Sat,October 6, 2012 04:25 PM

ఎంతకాలం ఈ గందరగోళం?

ఇరాచకం తరువాత అత్యంత అధ్వాన్నమైన స్థితి ప్రభుత్వం అంటాడు హెన్నీ బీచర్. ఇప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ పరిపాలనా విధానాన్ని చూస్తే

Published: Sat,October 6, 2012 04:25 PM

కాముకుల కాసుల క్రీడ

జంటిల్‌మెన్ గేమ్ జంగ్లీగా తయారైంది. ‘ఐపీఎల్’క్షికికెట్ వివాదాల మయం అవుతోంది. క్రికెట్ ఇవాళ.. మూడు ‘సీ’ల చుట్టూ తిరుగు తున్నది. క్య

Published: Sat,October 6, 2012 04:25 PM

అర్హత లేకున్నా అందలమేలా?

రాజకీయాలకు కేంద్ర నిలయమైన ఢిల్లీ ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటుం ది. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం (ఎన్సీటీసీ) ఏర్పాటుపై కేంద్రానికి ర