ప్రజారోగ్యం పట్టని పాలకులు


Sun,December 2, 2012 11:30 PM

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నది పాత మాట. ఇప్పుడు ప్రజల అనారోగ్యమే కొందరికి వరమైపోయింది. రోగగ్రస్థ సమాజంతోనే లాభాలను పిండుకునే పరిస్థితులు దాపురించాయి. దీనికి కొందరు వ్యక్తుల తప్పుడు ధోరణులు మాత్రమే కారణంకాదు, ప్రభుత్వ విధానాల లోపమే కారణమైనప్పుడు ఫలితాలు ఎంత భయానకంగా ఉంటా యో నేడు కనిపిస్తున్నది. ప్రజల ఆరోగ్యం పట్ల పాలకుల విధానలోపం, నిర్లక్ష్యం వెరసి ప్రజల పాలిట శాపంగా మారింది. ‘ఆమ్ ఆద్మీ’ ప్రభుత్వంగా చెప్పుకుంటున్న పాలనలో ప్రజల ప్రాణాలకు భరోసా లేకుండా పోయింది. ప్రజల ఆరోగ్యం పట్ల పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా గత కొన్ని దశాబ్దాలుగా ఆరోగ్యానికి కేటాయిస్తున్న బడ్జెట్ నిధులే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

ఆ మధ్యన కేంద్ర మంత్రి జై రాం రమేష్ ‘ప్రతి గ్రామంలో దేవాలయం కన్నా ఓ‘లావూటిన్’ కట్టించడం మేల’ని సంచలనాత్మక ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారిగా దేశంలో ప్రజారోగ్యం, స్థితిగతులపై పెద్దఎత్తున చర్చ మొదలైంది. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి, కనీస అవసరాలు, సాని గురించి అందరూ మాట్లాడే పరిస్థితి వచ్చింది ‘ప్రభుత్వ గ్రామీణ ఆరోగ్య యంత్రాంగం ప్రజారోగ్య రక్షణలో పూర్తిగా విఫలమైనద’ని కేంద్ర మంత్రి జైరాం రమేష్ స్వయంగా అంగీకరించారు. కనీస వైద్య సదుపాయాలు కూడా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు కల్పించలేకపోతున్నాయి. అత్యవసరమైన మందులు అందుబాటులో ఉండటంలేదు. ఇది పూర్తిగా ప్రభు త్వ వైఫల్యమేనని వేరే చెప్పక్కరలేదు. దీంతోప్రజల ఆరోగ్యం గాలిలో దీపం గా మారింది. ఈపరిస్థితుల్లో ప్రజలు తమ ఆరోగ్యం కోసం తమ కష్టార్జితంలో 70 శాతం పైగా ఖర్చు చేయాల్సి వస్తున్నది.దీంతో కోట్లాది మందికి ఆరోగ్య రక్షణే మోయలేని భారంగా మారింది. ఆరోగ్యం కోసం చేస్తున్న ఖర్చులతో ప్రజలు అప్పుల పాలవుతున్నారు.కనీస అవసరాలు తీరక, మౌలిక సదుపాయాలు లేక ఆత్మగౌరవాన్ని నిలుపుకోలేని స్థితి లో చితికిపోతున్నారు.

దేశంలో దాదాపు 65 శాతం మందికి కనీస సాని సదుపాయాలు లేక ఆరు బయటనే కాలకృత్యాలుతీర్చుకుంటున్నారు. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే సాని సదుపాయాలు లేకుంటే అంటురోగాలు, అనారోగ్యానికి అంతేలేదు. 2011జనాభా లెక్కల ప్రకారం పట్టణాల్లోని 59 శాతంపైగా ఇళ్లలో టాయిపూట్లు లేవు. గ్రామీణ ప్రాంతాల్లోనైతే 80శాతంపైగా ఇళ్లలో మరుగుదొడ్లు లేవు. దీంతో సాధారణ గ్రామీణ పేదలు ఆరు బయట కాలకృత్యాలు తీర్చుకోక తప్పని పరిస్థితిఉన్నది. జార్ఖండ్ రాష్ట్రంలో 77శాతంపైగా ఇళ్లలో టాయిపూట్ సాదుపాయం లేదు. ఒడిషాలో76.6శాతం, బీహార్‌లో 75.8 శాతం ఇళ్లలో టాయిపూట్లు లేవు. దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు రోజుకు 50 రూపాయల కన్నా తక్కువ ఆదాయంగలవారు ఉంటే ఈ మౌలిక సదుపాయాల కల్పనను ఎవరు పట్టించుకోవాలి?
ఇంకా భయంకరమైన వాస్తవం ఏమంటే.. దేశంలో మూడింట రెండు వంతుల ఇళ్లలో మంచినీటి సౌకర్యంలేదు.

రక్షిత మంచినీరు అందించే ‘నలా’్ల (ట్యాప్)సౌకర్యం అసలేలేదు. డ్రైనేజీ సిస్టం సరేసరి. ఎక్కడా భూగర్భ మురుగుకాల్వ వ్యవస్థ లేదు. 36 శాతం కుటుంబాలు తమ తాగునీటి కోసం కిలోమీటర్‌కన్నా ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వస్తున్నది. ఇప్పటికీ 55 శాతం మంది గత్యంతరంలేని పరిస్థితుల్లో ఆరుబయటే స్నానం చేయాల్సిన దుస్థితి. ఇక కరువు పీడిత ప్రాతాల స్థితి అయితే దారుణం. గుక్కెడు మంచినీటి కోసం కోటి కష్టాలు పడుతున్నారు. ఆంధ్రవూపదేశ్‌లోని పలు ప్రాంతాలతోపాటు, ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలు కూడా కనీస నీటి అవసరాలు తీరక అల్లాడుతున్నాయి.

వీటన్నింటికితోడు అమానవీయమైన విషయం ఏమంటే నేటికీ లాట్రి న్, టాయిపూట్‌లను మనిషే శుభ్రం చేసి, మలమూవూతాలను తలపై మోసే పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ ఓఅంచనా ప్రకారం 13లక్షల టాయిపూట్స్ నుంచి మల మూవూతాలను నేరుగా రోడ్లమీదికే వదులుతున్నారు. 25 కోట్ల కుటుంబాలు నేటికీ మరుగుదొడ్ల శుభ్రతకు సాటి మనుషులపైనే ఆధారపడుతున్నారు.

విషాదమేమంటే..దాదాపుగా 20 వేల మందికి, 28 గ్రామాలకు ఒక డాక్టర్ అందుబాటులో ఉన్నాడు. సుమారు 20 కోట్ల మంది గ్రామీణ ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. 50 శాతమంది పిల్లలు పౌష్టికాహారలోపంతో చనిపోతున్నారు. ఇంకా 43 శాతం మంది పిల్లలు తక్కువ బరువుతో అనారోగ్య పీడితులుగా ఉన్నారు. ప్రతియేటా లక్షా 36వేల మంది గర్భిణీ స్త్రీలు ప్రసవ సమయంలో చనిపోతున్నారని ఐక్యరాజ్యసమితి గణాంకాలే చెబుతున్నాయి.మొత్తం గర్భిణీ స్త్రీలలో 20 శాతం మంది పౌష్టికాహారలోపం, రక్తహీనతతో బాధపడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటుతున్నా అంటురోగాలతో జనం అల్లాడుతూనే ఉన్నారు. కనీస జాగ్రత్తలతో దూరం చేసే విషజ్వరాలు, సీజనల్ వ్యాధులు కూడా ప్రజలను పీడిస్తూనే ఉన్నాయి. మదుమేహం, క్యాన్సర్, గుండె సంబంధిత రోగాలతో జనం స్మశాన వాటికకు చేరుతున్నారు. తీవ్రమైన రోగాలకు అవసరమైన రోగ నిర్ధారణ ప్రక్రియలు,మందులు అందుబాటులో లేక ప్రజలు చావుకు దగ్గరవుతున్నా రు. 2011 లెక్కల ప్రకారం టైప్-2 రకం మదుమేహం రోగులు 6కోట్ల 20 లక్షలకు పైగా ఉన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే మదుమేహ రోగుల సంఖ్య పది శాతం పెరిగింది. పరిస్థితి ఇలానే ఉంటే 2030 నాటికి దేశంలో డయాబెటిక్ రోగుల సంఖ్య పదికోట్లకు చేరుకుంటుందని అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్ పేర్కొన్నది.

ప్రజల జీవన పరిస్థితులు, ఆరోగ్య స్థితిగతులు ఇలా ఉంటే.. ప్రభుత్వ ఆసుపవూతుల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కనీస సదుపాయాల లేమితో పాటు, కనీస రోగ నిరోధక, రక్షణ సదుపాయాలు లేక ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి.ఈ స్థితిలో మనం ఏం చేయాలి? ఎటు పోవాలి? పాలకుల్లో చిత్తశుద్ధి ఉంటే వీటన్నింటికీ పరిష్కారాలు ఉంటాయి. సంక్షే మ రాజ్యం ప్రజల జీవించే హక్కును గ్యారంటీ చేయడమంటే..ఆరోగ్యానికి పూర్తి హామీ పడటమే. ప్రజల సంపూర్ణ ఆరోగ్యానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలి. ప్రజారోగ్యాన్ని కాపాడే బాధ్యతను స్వీకరించాలి. అన్నిరకాల రోగాల బారినుంచి ప్రజలను రక్షించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుని అందుకవసరమైన మందులనూ, చికిత్సలను ఉచితంగా అందుబాటులో ఉంచాలి. రోగ నిరోధక, రక్ష ణ, నివారణ బాధ్యతలను కూడా ప్రభుత్వమే తీసుకోవాలి. దీనికోసం గాను అవసరమైన ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేయాలి. గ్రామం మొదలు పట్టణం దాకా అందరికీ వైద్య కేంద్రాలను అందుబాటులో ఉంచాలి. సుశిక్షితులైన వైద్యులను ప్రజలకు చేరువలో ఉంచాలి. దీనికి కావలసింది ప్రజల ఆరోగ్యంపై, ప్రాణాలపై పాలకులకు ప్రేమ ఉండాలి. బాధ్యత ఉండాలి.ఆమ్ ఆద్మీ అనాథగా మారి అతని ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోకూడదు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం అతి తక్కువ బడ్జెట్‌ను ప్రజారోగ్యం కోసం కేటాయిస్తున్న దేశాల్లో భారత్ అగ్రభాగాన ఉన్నది. దీంతో ప్రజలకు కనీస ఆరోగ్యం, సాని పౌష్టికాహారం అనేవి అందని ద్రాక్షలా తయారయ్యాయి. 2010 లెక్కల ప్రకారం స్థూల జాతీయోత్పత్తిలో కేవలం నాలుగు శాతం కేటాయిస్తున్నారు. ఇది అత్యంత వెనుకబడిన ఆఫ్రికన్ దేశాలు, అఫ్ఘనిస్థాన్ దేశాలు కేటాయిస్తున్న దానికంటే తక్కువ. అదే అభివృద్ధి చెందిన దేశాలు ప్రజారోగ్యం, సాని కోసం 10 శాతం ఖర్చు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజారోగ్యం ఆశించిన స్థాయిలో ఉండాలంటే, మౌలిక సదుపాయలు కల్పించాలంటే ప్రజారోగ్యానికి బడ్జెట్ కేటాయింపులు పెరగాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మన్మోహన్‌సింగ్ వచ్చే 12వ పంచవర్ష ప్రణాళికలో ఇప్పుడున్న కేటాయింపుల కంటే మూడు రెట్లు పెంచుతామని ప్రకటించారు. సమస్య తీవ్రత తెరమీదికి వచ్చినప్పుడే సమస్యను పట్టించుకున్నట్లు కాకుండా.. సమస్య నివారణ కోసం చిత్తశుద్ధిగా కృషి చేయాలి. ప్రజారోగ్యాన్ని పట్టించుకుని దేశ ప్రజల ప్రాణాలను కాపాడాలి. ప్రజారోగ్యానికి పునాదిగా ఉండే అత్యావశ్యకమైన సాని సదుపాయాలను, పౌష్టికాహారాన్ని అందరికీ అందించాలి. అప్పుడు మాత్రమే దేశం ‘ఆరోగ్య భారత్’ విలసిల్లుతుంది.

-పూనమ్ ఐ కౌశిష్
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్)

35

PUNAM I KOUSHISH

Published: Sat,December 19, 2015 12:48 AM

శాసనకర్తలకు విద్య అవసరం లేదా?

ఎంపీలు, ఎమ్మెల్యేలు.. చట్టసభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరించాలి. ప్రజలకు కావాల్సినవి సాధించాలి. ప్రజలకు మంచి జీవితాన్నందించడం కోసం పా

Published: Wed,August 19, 2015 12:07 AM

కష్టంగా నెట్టుకొస్తున్న మోదీ

పరిపాలనా రంగంలో పరివర్తన కోసం భారత ప్రజ లు మోదీకి అధికారం కట్టబెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన

Published: Wed,August 12, 2015 01:47 AM

చర్చలు సాగని చట్టసభలు

ఇవ్వాళ రాజకీయాల్లో చర్చలకు తావులేకుండాపోయింది. బలప్రదర్శనకే పెద్దపీట వేస్తున్నారు. తమ సంఖ్యాబలంతో అధిపత్యం చూపించుకోవడానికే ప్రాధా

Published: Sat,May 16, 2015 12:39 AM

అధికార దుర్వినియోగం..

మన నేతలంతా వ్యాపారుల్లా అవతారాలెత్తి లాభాలు దండుకుంటుంటే.. ఆమ్ ఆద్మీ- గరీబ్ అవుతున్నాడు. మన నేతలు తమ ప్రైవేటు వ్యవహారాలుగా చెబుతున

Published: Thu,February 26, 2015 01:56 AM

పరిశుభ్రత సరే... ప్రాణాల సంగతి?

ఇండియాలో అన్నింటికన్నా అగ్గువ (చీప్) ఏదైనా ఉన్నదంటే.. అది మనుషు ల ప్రాణమే. కూరగాయల కన్నా ఒకింత విలువ, సమయాన్ని బట్టి వాటి ప్రాముఖ్

Published: Sun,December 21, 2014 01:51 AM

మత మార్పిడులకు పునాది ఏమిటి?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. కానీ ఇది

Published: Tue,April 15, 2014 01:23 AM

ప్రజా జీవితంలో వ్యక్తిగతం ఉంటుందా..?

ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులకు వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు. ఉండకూడదు అని గాంధీ బోధించారు. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత వ్

Published: Wed,April 2, 2014 01:18 AM

ఎన్నికలు- విదేశీ నిధులు

ప్రజాస్వామ్యం వెలుగొందాలి అంటే.. రాజకీయాలను నియంత్రిస్తున్న ధనప్రవాహాన్ని నియంత్రించాలి. ఎన్నికల నిధులు ఎక్కడనుంచి,ఏం ఆశించి వస్త

Published: Thu,February 6, 2014 12:15 AM

తెలంగాణ ఏర్పాటు-పాఠాలు

సామాజిక సమస్యల విషయంలో వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించి దానికి తగిన విధంగా మసలుకోకుంటే.. అది కాలక్రమంలో ప్రతీకారం తీర్చుకుంటుందని భ

Published: Sun,May 5, 2013 12:42 PM

నేతల చావు రాజకీయాలు

మన నేతలు ప్రతిదాన్నీ రాజకీయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అది ఇంకా ముదిరి శవరాజకీయాలనుంచి ఎదిగి చావు రాజకీయాల దాకా వచ్చింది. సరబ

Published: Mon,April 8, 2013 02:41 AM

జేపీసీలు ఎందుకోసం?

ఊహించినట్లుగానే శీతాకాల పార్లమెంటు సమావేశాలు వాడి, వేడిగా సాగా యి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు నడిచిందనిపించుకున్నది. శ్రీ

Published: Fri,March 15, 2013 02:16 AM

అవినీతి అంతమెప్పుడు?

ముఖం చూసి బొట్టు పెట్టడమన్నది మన సంప్రదాయమైపోయింది. ఇదిప్పుడు పాలనా విధానంలోకి తర్జుమా అయ్యింది. నీ చేయి బెంచి కిందినుంచి ఎంత తొంద

Published: Mon,January 21, 2013 12:11 AM

నేర రాజకీయాలే సమస్య

మేకలను బలి ఇచ్చి పులులను అందలమెక్కించే నీతి దేశంలో రాజ్యమేలుతున్న ది. ఇది ఎక్కడనో ఒకచోట జరుగుతున్న తంతు కాదు, దేశంలో మూల మూలనా ఇదే

Published: Thu,January 3, 2013 11:47 PM

మన ప్రయాణమెటు?

ఈమధ్య కొన్ని ఉదంతాలు సగటు భారతీయుడిని భయవూభాంతులకు గురిచేస్తున్నాయి. మనం కలలుగన్న భారత్ ఇదే నా అని కన్నీరు కార్చే స్థితి వచ్చింది.

Published: Mon,December 10, 2012 12:12 AM

నీతిబాహ్య రాజకీయాలే నీటి తగాదాలు

రాజకీయ నాయకులు ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ, మహానీయులు భావి తరాల కోసం ఆలోచిస్తారనేది పెద్దలమాట. దీని కనుగుణంగానే నేటి రాజకీయ న

Published: Wed,October 10, 2012 05:33 PM

మాటల్లోనే గాంధీ మార్గమా?

నేనుంటున్న ఇంటి పక్కనే ఓ నవయువకుడు ఉంటాడు. ఆయనను ‘గాంధీ గురించి నీ అభివూపాయం ఏమిటీ’ అనగానే.. ‘అతనికేం సొట్టబుగ్గల అందగాడు. మోస్ట్

Published: Sat,October 6, 2012 04:24 PM

అసోం అల్లర్లపై అలసత్వమేల?

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుం టూ కాలక్షేపం చేశాడని..అది నిర్లక్ష్యానికి, బాధ్యతా రాహిత్యానికి సంకేతంగా చె

Published: Sat,October 6, 2012 04:25 PM

ఎంతకాలం ఈ గందరగోళం?

ఇరాచకం తరువాత అత్యంత అధ్వాన్నమైన స్థితి ప్రభుత్వం అంటాడు హెన్నీ బీచర్. ఇప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ పరిపాలనా విధానాన్ని చూస్తే

Published: Sat,October 6, 2012 04:25 PM

కాముకుల కాసుల క్రీడ

జంటిల్‌మెన్ గేమ్ జంగ్లీగా తయారైంది. ‘ఐపీఎల్’క్షికికెట్ వివాదాల మయం అవుతోంది. క్రికెట్ ఇవాళ.. మూడు ‘సీ’ల చుట్టూ తిరుగు తున్నది. క్య

Published: Sat,October 6, 2012 04:25 PM

అర్హత లేకున్నా అందలమేలా?

రాజకీయాలకు కేంద్ర నిలయమైన ఢిల్లీ ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటుం ది. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం (ఎన్సీటీసీ) ఏర్పాటుపై కేంద్రానికి ర