మాటల్లోనే గాంధీ మార్గమా?


Wed,October 10, 2012 05:33 PM

నేనుంటున్న ఇంటి పక్కనే ఓ నవయువకుడు ఉంటాడు. ఆయనను ‘గాంధీ గురించి నీ అభివూపాయం ఏమిటీ’ అనగానే.. ‘అతనికేం సొట్టబుగ్గల అందగాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అని చెప్పుకొచ్చాడు. ‘రాహుల్ గాంధీ గురించి కాదు’ అనగానే.., ‘ఓ సోనియాగాంధీ గురించా’ అంటూ.. ‘ఆమె మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్’ అని చెప్పుకొచ్చాడు. ‘కాదు ఆమె గురించి కూడా కాదు..’ అని చెబుతుండగానే.. పక్కింట్లో ఉన్న ఎనిమిదేళ్ల బాలుడు వచ్చి ‘ఓ గాంధీ తాతా గురించా.. ఆయన పుట్టిన రోజున మా స్కూలుకు సెలవు ఇస్తార’ని చెప్పుకొచ్చాడు. గాంధీ గురించి నేటి తరానికి ఉన్న జ్ఞానాన్ని చూసిన తర్వాత జాతిపిత మహాత్మాగాంధీకి ఇంత దుర్గతి పట్టిందా అనిపించింది. పరాయి పాలనకు వ్యతిరేకంగా జాతినంతా ఏకతాటిపై నడిపించి విలువలతో కూడిన జీవనం అంటే ఏమిటో, స్వేచ్ఛా స్వాతంవూత్యాలకున్న విలువ ఏంటో జాతి జనులకు చెప్పి, మేల్కొలిపి దేశానికి స్వాతంవూత్యాన్ని తెచ్చిన మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ గురించి భారత జాతి ఎంత కృతజ్ఞతాభావంతో ఉన్నదో తెలియజేస్తున్నది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న రాజ్‌ఘాట్ దగ్గర ఆయన సమాధిపై ఉన్న చెత్తా చెదారాన్ని దులిపి, ఓ దండేసి రావడంతోనే సరిపుచ్చుకుంటున్నారు. గాంధీ సమాధి దగ్గర శాంతి, అహింస లాంటి కొన్ని శాంతి వచనాలు వల్లెవేసి యథాలాపంగా మళ్లీ అధికార పగ్గాల చేపట్టి పాలనా పనుల్లో మునిగిపోతున్నారు. రాజ్యాంగ యంత్రంతో ప్రజలను చట్టాల కొరడాతో పాలించడానికి బయలుదేరుతున్నారు. వాస్తవానికి ఇదే ఇప్పటి విషాదం. జాతి పిత గాంధీ విధానాలకు, భావజాలానికి సమాధి కట్టడం అంటే ఇదే.

నిజానికి గాంధీ చెప్పిన మార్గాన్ని వీడి, ఇప్పటికే మనం 65 ఏళ్లలో చాలా దూరమే ప్రయాణం చేశాం. ఇవ్వాళ.. ‘గాంధీయిజం’ మేధావులు మాట్లాడుకు నే ఓ సిద్ధాంతంగా కుదించబడింది. ఆయన మార్గం గురించీ, ఆయన ఆచరణ గురించీ, పాలనా విధానం గురించీ చెప్పిన విషయాలను మన పాలకులు తమ అవసరార్థం,చాలా సౌకర్యంగా మరిచిపోయారు. గాంధీ చెప్పిన విలువలతో కూడి న సమాజం, ప్రజలకు జవాబుదారీ తనం, త్యాగపూరిత జీవన విధానం, అధికార దర్పానికి దూరంగా ప్రజలకు సేవకులుగా ఉండాలన్న గాంధీ సిద్ధాంతాలకు మన పాలకులు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చారు. ఇదే ఇవాళ్టి దేశ సమస్య.

ఏ అధికార ఆధిపత్యాన్ని గాంధీ నిరసించాడో అదే అధికార దర్పం, ఆధిపత్యం దేశంలో రాజ్యమేలుతున్నది. దేశంలో పాలితులు, పాలకులుగా రెండు తెగలుగా ప్రజలు విభజింపబడ్డారు. ‘పాలకులు, పాలక పార్టీలు ప్రజలను శాసించే స్థాయికి చేరుకోవడం అత్యంత విషాదకర పరిణామ’మని గాంధీ చెప్పారు. కానీ దేశంలో ఇదే జరిగింది. పార్టీలు ప్రజలపై ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. రాజ్యాంగ బద్ధమైన పదవులను రబ్బరు స్టాంపులుగా మార్చి, శాసననిర్మాణ సభలే సర్వాధికారాలు చెలాయిస్తున్నాయి.

స్వాతంవూత్యానంతరం కాంగ్రెస్ పార్టీని రద్దుచేసి, పార్టీ రహిత పాలనను అందించాలని గాంధీ ఆశించారు. ప్రజలకు సేవ చేసే లోక్ సేవాసంఘ్ పేరుతో పాలన సాగాలని అన్నారు. ఎందుకంటే.. పార్టీ అనేది నిర్మాణయుతమైన అధికార కేంద్రంగా తయారై ప్రజలపై నియంతృత్వం చేస్తుందని హెచ్చరించారు. అలాగే ఆనాడే కొందరు కాంగ్రెస్ నేతలు వ్యాపార వర్గాల దగ్గర చందాలు వసూలు చేస్తున్న విషయాన్ని తీవ్రంగా గర్హించారు. అధికారుల బదిలీల విషయంలో నేతల ఒత్తిడిలు, లంచాలను గాంధీ ఆనాడే గుర్తించి వ్యతిరేకించారు. కొందరు కాంగ్రెస్ నేతలు స్వాతంత్య్ర పోరాటాన్నీ, స్వాతంత్య్ర ఫలాలను తమ సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. భారత జాతి మొత్తం చేసిన పోరాటాలు, త్యాగాల ఫలితంగా వచ్చిన స్వేచ్ఛా స్వాతంవూత్యాలను కాంగ్రెస్ పార్టీ తన సొంత జాగీరుగా మార్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కాలం గడిచిన కొద్దీ గాంధీ భయాలన్నీ నిజమయ్యాయి. అవుతున్నాయి.
ఒకసారి చరివూతను చూస్తే.. గతంలో నేతలు తమ అవినీతి, అక్రమాలకు, ఆధిపత్యాలకు ఓ ముసుగైనా ఉండేది. కానీ.. నేడు ఏ ముసుగు లేకుండా నగ్నంగా దోచుకుంటున్నారు. ఏ విలువలూ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రజలను నిర్లక్ష్యం చేసి తమ ప్రయోజనాలను చూసుకుంటున్నారు.

లంచాలు, కమీషన్లు బాహాటం గా చేతులు మారుతున్నాయి. ప్రజల పట్ల నిబద్ధత లేని నాయకులు అధికార పీఠా న్ని ఎక్కుతున్నారు. దీనిని నిరోధించాలని గాంధీ అన్నారు. కానీ..విషాదమేమం నేటి నాయకులంతా ప్రజలంటే పట్టింపు లేని వారే అందలమెక్కుతున్నారు. నేతలకు గద్దెనెక్కడమే పరమావధిగా మారిపోయింది. దాని కోసం అన్ని విలువలనూ కాలరాస్తున్నారు. అధికారులు, ప్రజా వూపతినిధులు అధికార దుర్వినియోగానికి పాల్పడరాదని పేర్కొన్నారు గాంధీ. ఏ ఒక్కరూ అధికారాన్ని ఉపయోగించుకుని విలాసాలకు పోవద్దని అన్నారు. కానీ.. నేటి నేతలకు అధికారంతో అందలాపూక్కడమే, భోగ విలాసాలను అనుభవించడమే పనిగా పెట్టుకున్నారు. అది వారికి అందివచ్చిన అవకాశంగా భావిస్తున్నారు. మంత్రులు, నేతలు ప్రజల పక్షా న నిలిచి వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలి. కానీ నేటి నేత లు పెట్టుబడిదారులకు, భూస్వాములకు జీ హుజూర్‌గా మారిపోయి వారి ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో సామాన్యుల ఆశలు గల్లంతయ్యాయి. ప్రజల కోసం పనిచేసే వారే కరువయ్యారు. నేటి పరిస్థితి చూస్తే.. సమాజంలో అందరూ సమానులుగా ఉండే బదులు.. కొందరు మాత్రమే ఎక్కువ సమానులుగా బతుకుతున్నారు. అధికారాన్ని, సామాజిక అభివృద్ధి ఫలాలను అనుభవిస్తున్నారు. చుట్టూ అత్యాధునిక ఆయుధాలను ధరించిన రక్షక భటుల వలయంలో.., ఎర్ర బుగ్గలున్న కార్లలో తిరుగుతూ ప్రజలకు ఆమడ దూరంలో ఉంటున్నారు. ప్రజలకు రక్షకులుగా ఉం డాల్సిన నేతలు ప్రజల నుంచే రక్షణ పొందుతున్న తీరుగా రక్షకభటుల రక్షణలో తిరుగుతున్నారు. గాంధీ చెప్పిన విధానాలను, సిద్ధాంతాలను గాలికి వదిలేసి, గాంధీ జపం చేస్తూ కాలం వెల్లబుచ్చుతున్నారు. తలపైన గాంధీటోపీ ధరించి గాంధీ విధానాలకు తూట్లు పొడుస్తున్నారు. ఇలాంటి నేతల నుంచి ప్రజలు ఏం ఆశిస్తారు? ఆశించినా ఫలితం ఏం దక్కుతుంది?

నిజాయితీకి, నిబద్ధతకూ, నిరాడంబరత్వానికి మారు పేరుగా పిలువబడుతున్న ప్రధాని మన్మోహన్‌సింగ్ యూపీఏ మూడవ వార్షికోత్సవ సమావేశంలో మాట్లాడుతూ..రూపాయలు చెట్లకు కాయవని చెప్పుకొచ్చారు. రూపాయలు చెట్ల కు కాయవు సరే..వారు అనుసరిస్తున్న విధానాలు గాంధీ అనుయాయులుగా ఎలా గాలికి వదిలేస్తున్నారో మరిచిపోయినట్లున్నారు. ఆ వార్షిక సమావేశానికి హాజరైన 375 మందికి ఒక్కొక్కరికీ.. ఒక పూట భోజనానికి 7,721 రూపాయలు ఖర్చు చేశారు. మొత్తంగా వారి భోజనాల ఖర్చులు 11,34,296, టెంట్ ఖర్చులు 14,42,678, పూల కోసం 26,444 చొప్పున మొత్తం 28,95,503 రూపాయ లు ఖర్చు చేశారు. ఇలా ఖర్చు చేస్తున్నప్పుడు పైసలు చెట్లకు కాయవని ప్రధానికి గుర్తుంటే ఎంత బాగుండు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే జనాభాలో సగానికి సగం మంది అర్ధాకలితో అలమటిస్తున్నారు. 70 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతంలో 32 రూపాయలు, గ్రామీణ ప్రాంతంలో 26 రూపాయలు సంపాదిస్తున్న వారు అయితే దారిద్య్రరేఖకు ఎగువన నివసిస్తున్న ప్రణాళికా సంఘం చెప్పుకొచ్చింది. అలాగే ప్రతి ఏటా లక్ష మంది కనీస వైద్య సదుపాయాలు అందక ప్రాణాలు విడుస్తున్నారు. ప్రతి ఐదుగురు బాలల్లో ఒక్కరు పౌష్టికాహార లోపంతో నకనకలాడుతున్నారు. ప్రజల పరిస్థితి ఇలా ఉంటే.. మన నేతల భోజనాల ఖర్చులు వారి జీవన విధానాన్ని ఎలా చూడాలి.

ప్రతి ఏటా గాంధీ జయంతి, వర్ధంతి సందర్భంగా అహింస జపం చేయడం మన పాలకులకు అలవాటుగా మారిపోయింది. కానీ.. చుట్టూ సమాజంలో పేరుకుపోయిన హింస గురించి పట్టించుకోరు. ఈ పరిస్థితుల్లో భారత్‌లోని సాధారణ పౌరుడు ఆకలితో, ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. దీంతోనే.. ఎక్కడ చూసినా ప్రజాందోళనలు మునుపెన్నడూ లేనంతగా జరుగుతున్నాయి. పాలకులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ అవకాశం దొరికినా నేతలపై తమ నిరసనను వెల్లగక్కుతున్నారు. ఆకాశాన్నంటుతున్న ధరలు, పెరిగిన విద్యుచ్ఛక్తి, నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడు జీవించలేని పరిస్థితులు సృష్టిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గాంధీ అహింసా సిద్ధాంతాన్ని సాధారణ ప్రజలకు చెబితే వింతగా చూసే పరిస్థితి దాపురించింది. అంతిమంగా కనిపిస్తున్నదేమంటే.. గాంధీ పేరుతో చెలామణి అవుతున్న నేతలంతా గాంధీ సిద్ధాంతాలకు, విధానాలకు తూట్లు పొడు స్తూ.. పబ్బం గడుపుకుంటున్నారు. రాజకీయాలు వ్యాపారమయమైపోయి అక్ర మ సంపాదనకు అడ్డదారులు అయ్యాయి. వ్యాపారం అవినీతి మయం అయిపోయింది. విద్య నైతికత లేనిదైపోయింది. పనిచేయకుండా ధన సంపాదన ఎక్కువైంది. ఏ నైతికత, కట్టుబాట్లు లేని ఆనందాలకోసం అర్రుల చాచటం ఎక్కువైంది.

ఏ త్యాగం లేకుండానే.. అంతా సొంతం చేసుకోవాలనే ఆరాటం అంతటా సర్వసాధారణం అయింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ తీరును, నేతలను ప్రశ్నించడమే నేరమైపోయింది. ఇలాంటి స్థితులను ఊహించే కాబోలు గాంధీ ఆనాడే ‘నేను ఈ రోజు మీకు నాయకుణ్ని. రేపు నన్ను మీరే జైళ్లో నిర్బంధించవచ్చు. ఎందుకంటే.. రామ రాజ్యం తెస్తామని తిలోదకాలిచ్చిన తీరును, మీ పాలక విధానాలను విమర్శిస్తాను.’కాబట్టి అన్నాడు గాంధీ. మనల్ని విమర్శించినందుకు మనం గాంధీని జైలులో నిర్బంధించలేదు. హత్య చేశాం. ఆయన పేరును వాడుకుంటూ ప్రతి రోజూ హత్య చేస్తున్నాం. మనదంతా అబద్ధాలతో కూడిన ఆచరణే కదా!

-పూనమ్ ఐ కౌశిష్
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్)

35

PUNAM I KOUSHISH

Published: Sat,December 19, 2015 12:48 AM

శాసనకర్తలకు విద్య అవసరం లేదా?

ఎంపీలు, ఎమ్మెల్యేలు.. చట్టసభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరించాలి. ప్రజలకు కావాల్సినవి సాధించాలి. ప్రజలకు మంచి జీవితాన్నందించడం కోసం పా

Published: Wed,August 19, 2015 12:07 AM

కష్టంగా నెట్టుకొస్తున్న మోదీ

పరిపాలనా రంగంలో పరివర్తన కోసం భారత ప్రజ లు మోదీకి అధికారం కట్టబెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన

Published: Wed,August 12, 2015 01:47 AM

చర్చలు సాగని చట్టసభలు

ఇవ్వాళ రాజకీయాల్లో చర్చలకు తావులేకుండాపోయింది. బలప్రదర్శనకే పెద్దపీట వేస్తున్నారు. తమ సంఖ్యాబలంతో అధిపత్యం చూపించుకోవడానికే ప్రాధా

Published: Sat,May 16, 2015 12:39 AM

అధికార దుర్వినియోగం..

మన నేతలంతా వ్యాపారుల్లా అవతారాలెత్తి లాభాలు దండుకుంటుంటే.. ఆమ్ ఆద్మీ- గరీబ్ అవుతున్నాడు. మన నేతలు తమ ప్రైవేటు వ్యవహారాలుగా చెబుతున

Published: Thu,February 26, 2015 01:56 AM

పరిశుభ్రత సరే... ప్రాణాల సంగతి?

ఇండియాలో అన్నింటికన్నా అగ్గువ (చీప్) ఏదైనా ఉన్నదంటే.. అది మనుషు ల ప్రాణమే. కూరగాయల కన్నా ఒకింత విలువ, సమయాన్ని బట్టి వాటి ప్రాముఖ్

Published: Sun,December 21, 2014 01:51 AM

మత మార్పిడులకు పునాది ఏమిటి?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. కానీ ఇది

Published: Tue,April 15, 2014 01:23 AM

ప్రజా జీవితంలో వ్యక్తిగతం ఉంటుందా..?

ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులకు వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు. ఉండకూడదు అని గాంధీ బోధించారు. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత వ్

Published: Wed,April 2, 2014 01:18 AM

ఎన్నికలు- విదేశీ నిధులు

ప్రజాస్వామ్యం వెలుగొందాలి అంటే.. రాజకీయాలను నియంత్రిస్తున్న ధనప్రవాహాన్ని నియంత్రించాలి. ఎన్నికల నిధులు ఎక్కడనుంచి,ఏం ఆశించి వస్త

Published: Thu,February 6, 2014 12:15 AM

తెలంగాణ ఏర్పాటు-పాఠాలు

సామాజిక సమస్యల విషయంలో వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించి దానికి తగిన విధంగా మసలుకోకుంటే.. అది కాలక్రమంలో ప్రతీకారం తీర్చుకుంటుందని భ

Published: Sun,May 5, 2013 12:42 PM

నేతల చావు రాజకీయాలు

మన నేతలు ప్రతిదాన్నీ రాజకీయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అది ఇంకా ముదిరి శవరాజకీయాలనుంచి ఎదిగి చావు రాజకీయాల దాకా వచ్చింది. సరబ

Published: Mon,April 8, 2013 02:41 AM

జేపీసీలు ఎందుకోసం?

ఊహించినట్లుగానే శీతాకాల పార్లమెంటు సమావేశాలు వాడి, వేడిగా సాగా యి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు నడిచిందనిపించుకున్నది. శ్రీ

Published: Fri,March 15, 2013 02:16 AM

అవినీతి అంతమెప్పుడు?

ముఖం చూసి బొట్టు పెట్టడమన్నది మన సంప్రదాయమైపోయింది. ఇదిప్పుడు పాలనా విధానంలోకి తర్జుమా అయ్యింది. నీ చేయి బెంచి కిందినుంచి ఎంత తొంద

Published: Mon,January 21, 2013 12:11 AM

నేర రాజకీయాలే సమస్య

మేకలను బలి ఇచ్చి పులులను అందలమెక్కించే నీతి దేశంలో రాజ్యమేలుతున్న ది. ఇది ఎక్కడనో ఒకచోట జరుగుతున్న తంతు కాదు, దేశంలో మూల మూలనా ఇదే

Published: Thu,January 3, 2013 11:47 PM

మన ప్రయాణమెటు?

ఈమధ్య కొన్ని ఉదంతాలు సగటు భారతీయుడిని భయవూభాంతులకు గురిచేస్తున్నాయి. మనం కలలుగన్న భారత్ ఇదే నా అని కన్నీరు కార్చే స్థితి వచ్చింది.

Published: Mon,December 10, 2012 12:12 AM

నీతిబాహ్య రాజకీయాలే నీటి తగాదాలు

రాజకీయ నాయకులు ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ, మహానీయులు భావి తరాల కోసం ఆలోచిస్తారనేది పెద్దలమాట. దీని కనుగుణంగానే నేటి రాజకీయ న

Published: Sun,December 2, 2012 11:30 PM

ప్రజారోగ్యం పట్టని పాలకులు

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నది పాత మాట. ఇప్పుడు ప్రజల అనారోగ్యమే కొందరికి వరమైపోయింది. రోగగ్రస్థ సమాజంతోనే లాభాలను పిండుకునే పరిస్థిత

Published: Sat,October 6, 2012 04:24 PM

అసోం అల్లర్లపై అలసత్వమేల?

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుం టూ కాలక్షేపం చేశాడని..అది నిర్లక్ష్యానికి, బాధ్యతా రాహిత్యానికి సంకేతంగా చె

Published: Sat,October 6, 2012 04:25 PM

ఎంతకాలం ఈ గందరగోళం?

ఇరాచకం తరువాత అత్యంత అధ్వాన్నమైన స్థితి ప్రభుత్వం అంటాడు హెన్నీ బీచర్. ఇప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ పరిపాలనా విధానాన్ని చూస్తే

Published: Sat,October 6, 2012 04:25 PM

కాముకుల కాసుల క్రీడ

జంటిల్‌మెన్ గేమ్ జంగ్లీగా తయారైంది. ‘ఐపీఎల్’క్షికికెట్ వివాదాల మయం అవుతోంది. క్రికెట్ ఇవాళ.. మూడు ‘సీ’ల చుట్టూ తిరుగు తున్నది. క్య

Published: Sat,October 6, 2012 04:25 PM

అర్హత లేకున్నా అందలమేలా?

రాజకీయాలకు కేంద్ర నిలయమైన ఢిల్లీ ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటుం ది. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం (ఎన్సీటీసీ) ఏర్పాటుపై కేంద్రానికి ర

Featured Articles