అసోం అల్లర్లపై అలసత్వమేల?


Sat,October 6, 2012 04:24 PM

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుం టూ కాలక్షేపం చేశాడని..అది నిర్లక్ష్యానికి, బాధ్యతా రాహిత్యానికి సంకేతంగా చెప్పుకుంటాం. సరిగ్గా ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తున్నది. అసోంలో మారణహోమం జరుగుతున్నా.. చూస్తూ ఊరుకుంటున్నదే కానీ, ఏ చర్యలు తీసుకుంటున్న జాడ లేదు. అసోంలో బోడోలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రక్తపు పారుతున్నా.. అక్కడ శాంతి నెలకొల్పడానికి తీసుకోవాల్సిన చర్యలను పక్కనపెట్టి పాలకులు రాజకీయాలు మాట్లాడుతున్నారు. బోడోలు, ముస్లింల సమస్యను తేలికపాటి ఘర్షణలుగా కొట్టి పారేస్తున్నారు.

అసోంలో జరుగుతున్న అల్లర్లలో మరణాల సంఖ్య ఇప్పటికే వేలకు చేరిం ది. నిర్వాసితుల సంఖ్య నాలుగు లక్షలు దాటింది. వీరంతా 270కి పైగా ఉన్న శరణార్థ శిబిరాలలో తలదాచుకుంటున్నారు. కనీస వసతులు లేక అష్టకష్టాలు పడుతున్నారు. ప్రజల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే.. అసోం ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ మాత్రం అల్లర్లకు బాధ్యత కేంద్రానిదేనని అంటున్నారు. నిఘా సంస్థలు అల్లర్ల గురించి ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదంటే.. తప్పంతా కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పుకొస్తున్నారు. ‘తాము అడిగినప్పుడు తగినంత పోలీస్ బలగాలను అందివ్వకపోవడం కారణంగానే అల్ల ర్లు చెలరేగాయ’ని కేంద్రంపై దుమ్మెత్తి పోస్తున్నారు. దీని కి కేంద్రం కూడా తక్కువేమీ తినలేదు. ‘దేశంలో చాలాచోట్ల కేంద్ర బలగాల అవసరమున్నదని, అడిగారని పెద్దమొత్తంలో బలగాలను అన్నిచోట్లకు పంపలేం గదా!’ అని కేంద్రం తప్పించుకుంటున్నది. అయితే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వాలే కావడం గమనార్హం. పనిలో పనిగా గగోయ్ గత ఎన్డీఏ ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పిస్తున్నా రు. ఓటు బ్యాంకు రాజకీయాలతోనే అసోంలో ఈ పరిస్థితి వచ్చిందని మండిపడుతున్నారు.

అసోం అల్లర్లకు పెద్ద చరిత్రే ఉన్నది. చాలాఏళ్లుగా అక్కడ రగులుతున్న స్థానికేతరుల సమస్య అనేక ఉద్యమాలకు కారణమైంది. గతంలో ఈ సమస్యతోనే ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ పెద్ద ఉద్యమం లేవదీసి, ఏకంగా అధికారాన్నే చేజిక్కించుకున్నది. అసోంలో ఉన్న ఈ సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య లేదు. దీంతో అక్కడి సమస్యలు రావణకాష్టంలా మండుతూనే ఉన్నాయి. 1983లో జరిగిన నెల్లీ ఘటన మూడువేల మందిని బలితీసుకున్నది. అయినా ప్రభుత్వాలు గుణపాఠం నేర్చుకోలేదు. అది ఇప్పు డు తల మీది కుంపటిగా మారి వేలాదిమంది ప్రాణాలను బలితీసుకుంటున్న ది. అసోం దేశంలో మరే రాష్ట్రంలో లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నది.

ఆది నుంచీ అక్కడి ప్రజలు స్థానికేతరుల ఆధిపత్యం, దోపిడీకి బలవుతున్నారు. ఈ మధ్య చొరబాటుదారుల సమస్య కూడా అసోం ప్రజలను పీడిస్తున్నది. అలాగే.. అసోంలోని 27 జిల్లాల్లోని తొమ్మిందింటిలో ముస్లింల జనాభా అధికంగా ఉన్నది. అసోంలోని మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 60 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మకశక్తిగా ఉన్నారు. 57 నియోజక వర్గాల్లో గత మూడేళ్లలోనే 20 శాతం ఓటర్ల సంఖ్య పెరిగింది. 85 శాతం అట వీ భూమి మొత్తం బంగ్లా చొరబాటుదారుల ఆక్రమణలోనే ఉన్నది. అసోం లోని వ్యవసాయోత్పత్తి అంతా ఈ బంగ్లా చొరబాటుదారుల కబంధ హస్తాల్లో ఉన్నది. అలాగే నిర్మాణ రంగంలో కూడా వారిదే ఆధిపత్యం. రిక్షా కార్మికుల్లో కూడా 80 శాతం మంది వారే ఉన్నారు. అంటే.. అసోం రాష్ట్రంలో అన్ని రంగా ల్లో బంగ్లా చొరబాటు దారులదే పైచేయి అయింది.

నిఘా సంస్థల నివేదికల ప్రకారం 1901-1971మధ్య 70 ఏళ్లలో అసోం జనాభా 39 లక్షల 29 వేల నుంచి కోటి నలభై లక్షలకు పెరిగింది. ఇది 343. 77 శాతం పెరుగుదల. కానీ అదే సమయంలో దేశ జనాభా మాత్రం 150 శాతమే పెరిగింది. ఇలా దేశంలో ఎక్కడాలేని విధంగా అసోంలో చొరబాటుదారులు, స్థానికేతరుల సమస్య తీవ్రమవుతుంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కపెట్టుకుంటూ కూర్చున్నాయి. సమస్య మూలాల్లోకిపోయి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని పరిష్కరించకుండా.. అవకాశవాద వైఖరిని అవలంబించాయి. అన్ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడ్డాయి. దీనికి ఏ పార్టీ మినహాయింపు కాదు. పెరుగుతున్న చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా చూసిన పాలకులు దేశ ప్రయోజనాలను, దేశ సమక్షిగతను గాలికి వదిలేశాయి. తీరా సమస్య తీవ్రం కాగానే అన్నిపార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెతిపోసుకుంటున్నారు. ఆ బాధ్యత మీదంటే మీదే అని ఎవరికి వారు తప్పించుకుంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అసోం మరో కాశ్మీర్ మారే ప్రమాదం పొంచి ఉన్నది.

భారత పాలకులకు సమస్య ఏది వచ్చినా అది ఉధృతం అయ్యే దాకా పట్టించుకోకుం, ఆ తర్వాత బలవూపయోగం ద్వారా దాన్ని పరిష్కరిస్తామని భావిస్తున్నారు. పోలీసు బలగాలతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావు. సమస్య మూలాల్లోకిపోయి ప్రజల ఆమోదంతో పరిష్కరించనంత కాలం సమస్యలు అలాగే ఉంటాయి. ప్రభుత్వ చర్యలతో తాత్కాలికంగా ఉపశమనం కలిగినా ఆ సమస్యలు తిరిగి పునరావృతమవుతూనే ఉంటాయి. ఏదైనా సమస్యకు ఉపశమనం పరిష్కారం కాదు. రోగ నిర్ధారణ చేస్తేనే సరిపోదు దాన్ని నిర్మూలించిన నాడే అది పరిష్కారం అవుతుంది. కానీ మన ప్రభుత్వాలు ఈ దిశగా ఎప్పుడూ ఆలోచించిన పాపాన పోలేదు. దేశం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం లేదు. పాలకుల బాధ్యతారాహిత్యానికి అమాయక ప్రజపూందుకు రక్తాన్ని చిందించాలి. వారు బలి పశువులు ఎందుకు కావాలి? కాబట్టి కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. అలసత్వాన్ని వీడి సత్వర చర్యలకు పూనుకోవాలి. లేకపోతే.. తీవ్రవాదం వేళ్లూనుకొని దేశ సమక్షిగతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి అసోం ప్రజలు ముఖ్యంగా బోడోలు ఎదుర్కొంటున్న సమస్య ను పరిష్కరించాలి. దేశ సమక్షిగత, సమైక్యతలకు హాని తెచ్చే చొరబాటుదారులను నియంవూతించాలి. అక్రమ చొరబాటు దారులను, విదేశీయులను గుర్తించేందుకు ఒక రేషన్ కార్డు మాత్ర మే సరిపోదు. వారిని గుర్తించేందుకు పుట్టుక ధృవీకరణ పత్రం మొదలు నివా స, కుల, ప్రాంతీయ ధృవీకరణ పత్రాల ప్రాతిపదికగా చూడాలి. అప్పుడే అక్రమ చొరబాటుదారులు, స్థానికేతరుల సమస్య పరిష్కారం అవుతుంది. అసోంలోనే కాదు మరేచోట అయినా వలసవాదుల ఆగడాలను అరికట్టవచ్చు. స్థానిక ప్రజల ప్రయోజనాలను పరిరక్షించవచ్చు.

బోడోలు అంటున్న స్థానికేతరులను గుర్తించేందుకు కేంద్రం తక్షణ చర్యలు చేపట్టాలి. చొరబాటు దారులకు రెండు సంవత్సరాల మించి పనిచేసుకోవడానికి అనుమతి ఇవ్వవద్దు. అలాగే.. సామాజిక, రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తున్న స్థానికేతరుల ప్రాబల్యం తగ్గించేందుకు వారికి ఓటు హక్కును నిషేధించాలి. కాందీశీకులు, వలసలు పేరుతో జరుగుతున్న చొరబాట్లను తగ్గించేందుకు చట్టాలను కఠినతరం చేయాలి. అలాగే అసోంలోని సమస్యను కేవలం స్థానికేతరులు, చొరబాటుదారుల సమస్యను మానవతా దృక్పథంతో కాకుం డా.. సామాజిక ఆర్థిక, అధిపత్య, రాజకీయ సమస్యగా చూడాలి. దేశ సమక్షిగతకు సంబంధించిన సమస్యగా కూడా చూడాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలకాలి. ఇప్పటికైనా మించిపోయిందిలేదు. అసోంలో జరుగుతున్న మారణకాండపై ప్రధాని మన్మోహన్ మౌనంగా ఉండటం మంచిది కాదు. దేశం తగలబడిపోతుంటే.. ప్రధాని మిన్నకుండిపోవడం సరికాదు. బంగ్లాదేశ్‌తో సౌహార్ద్ర సంబంధాల పేరుతో.. దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టవద్దు. జాతి ప్రయోజనాలు మరువొద్దు. పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలన్న చందంగా పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కాదు. దేశ ప్రజల ప్రయోజనాలే పరమావిధిగా అన్ని రాజకీయ పక్షాలు ఐక్యంగా పనిచేయాలి. అసోంలో చెలరేగుతున్న మంటలను అదుపు చేయడానికి అందరూ కృషి చేయాలి.

-పూనం ఐ కౌశిష్, (ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్ )

35

PUNAM I KOUSHISH

Published: Sat,December 19, 2015 12:48 AM

శాసనకర్తలకు విద్య అవసరం లేదా?

ఎంపీలు, ఎమ్మెల్యేలు.. చట్టసభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరించాలి. ప్రజలకు కావాల్సినవి సాధించాలి. ప్రజలకు మంచి జీవితాన్నందించడం కోసం పా

Published: Wed,August 19, 2015 12:07 AM

కష్టంగా నెట్టుకొస్తున్న మోదీ

పరిపాలనా రంగంలో పరివర్తన కోసం భారత ప్రజ లు మోదీకి అధికారం కట్టబెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన

Published: Wed,August 12, 2015 01:47 AM

చర్చలు సాగని చట్టసభలు

ఇవ్వాళ రాజకీయాల్లో చర్చలకు తావులేకుండాపోయింది. బలప్రదర్శనకే పెద్దపీట వేస్తున్నారు. తమ సంఖ్యాబలంతో అధిపత్యం చూపించుకోవడానికే ప్రాధా

Published: Sat,May 16, 2015 12:39 AM

అధికార దుర్వినియోగం..

మన నేతలంతా వ్యాపారుల్లా అవతారాలెత్తి లాభాలు దండుకుంటుంటే.. ఆమ్ ఆద్మీ- గరీబ్ అవుతున్నాడు. మన నేతలు తమ ప్రైవేటు వ్యవహారాలుగా చెబుతున

Published: Thu,February 26, 2015 01:56 AM

పరిశుభ్రత సరే... ప్రాణాల సంగతి?

ఇండియాలో అన్నింటికన్నా అగ్గువ (చీప్) ఏదైనా ఉన్నదంటే.. అది మనుషు ల ప్రాణమే. కూరగాయల కన్నా ఒకింత విలువ, సమయాన్ని బట్టి వాటి ప్రాముఖ్

Published: Sun,December 21, 2014 01:51 AM

మత మార్పిడులకు పునాది ఏమిటి?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. కానీ ఇది

Published: Tue,April 15, 2014 01:23 AM

ప్రజా జీవితంలో వ్యక్తిగతం ఉంటుందా..?

ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులకు వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు. ఉండకూడదు అని గాంధీ బోధించారు. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత వ్

Published: Wed,April 2, 2014 01:18 AM

ఎన్నికలు- విదేశీ నిధులు

ప్రజాస్వామ్యం వెలుగొందాలి అంటే.. రాజకీయాలను నియంత్రిస్తున్న ధనప్రవాహాన్ని నియంత్రించాలి. ఎన్నికల నిధులు ఎక్కడనుంచి,ఏం ఆశించి వస్త

Published: Thu,February 6, 2014 12:15 AM

తెలంగాణ ఏర్పాటు-పాఠాలు

సామాజిక సమస్యల విషయంలో వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించి దానికి తగిన విధంగా మసలుకోకుంటే.. అది కాలక్రమంలో ప్రతీకారం తీర్చుకుంటుందని భ

Published: Sun,May 5, 2013 12:42 PM

నేతల చావు రాజకీయాలు

మన నేతలు ప్రతిదాన్నీ రాజకీయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అది ఇంకా ముదిరి శవరాజకీయాలనుంచి ఎదిగి చావు రాజకీయాల దాకా వచ్చింది. సరబ

Published: Mon,April 8, 2013 02:41 AM

జేపీసీలు ఎందుకోసం?

ఊహించినట్లుగానే శీతాకాల పార్లమెంటు సమావేశాలు వాడి, వేడిగా సాగా యి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు నడిచిందనిపించుకున్నది. శ్రీ

Published: Fri,March 15, 2013 02:16 AM

అవినీతి అంతమెప్పుడు?

ముఖం చూసి బొట్టు పెట్టడమన్నది మన సంప్రదాయమైపోయింది. ఇదిప్పుడు పాలనా విధానంలోకి తర్జుమా అయ్యింది. నీ చేయి బెంచి కిందినుంచి ఎంత తొంద

Published: Mon,January 21, 2013 12:11 AM

నేర రాజకీయాలే సమస్య

మేకలను బలి ఇచ్చి పులులను అందలమెక్కించే నీతి దేశంలో రాజ్యమేలుతున్న ది. ఇది ఎక్కడనో ఒకచోట జరుగుతున్న తంతు కాదు, దేశంలో మూల మూలనా ఇదే

Published: Thu,January 3, 2013 11:47 PM

మన ప్రయాణమెటు?

ఈమధ్య కొన్ని ఉదంతాలు సగటు భారతీయుడిని భయవూభాంతులకు గురిచేస్తున్నాయి. మనం కలలుగన్న భారత్ ఇదే నా అని కన్నీరు కార్చే స్థితి వచ్చింది.

Published: Mon,December 10, 2012 12:12 AM

నీతిబాహ్య రాజకీయాలే నీటి తగాదాలు

రాజకీయ నాయకులు ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ, మహానీయులు భావి తరాల కోసం ఆలోచిస్తారనేది పెద్దలమాట. దీని కనుగుణంగానే నేటి రాజకీయ న

Published: Sun,December 2, 2012 11:30 PM

ప్రజారోగ్యం పట్టని పాలకులు

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నది పాత మాట. ఇప్పుడు ప్రజల అనారోగ్యమే కొందరికి వరమైపోయింది. రోగగ్రస్థ సమాజంతోనే లాభాలను పిండుకునే పరిస్థిత

Published: Wed,October 10, 2012 05:33 PM

మాటల్లోనే గాంధీ మార్గమా?

నేనుంటున్న ఇంటి పక్కనే ఓ నవయువకుడు ఉంటాడు. ఆయనను ‘గాంధీ గురించి నీ అభివూపాయం ఏమిటీ’ అనగానే.. ‘అతనికేం సొట్టబుగ్గల అందగాడు. మోస్ట్

Published: Sat,October 6, 2012 04:25 PM

ఎంతకాలం ఈ గందరగోళం?

ఇరాచకం తరువాత అత్యంత అధ్వాన్నమైన స్థితి ప్రభుత్వం అంటాడు హెన్నీ బీచర్. ఇప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ పరిపాలనా విధానాన్ని చూస్తే

Published: Sat,October 6, 2012 04:25 PM

కాముకుల కాసుల క్రీడ

జంటిల్‌మెన్ గేమ్ జంగ్లీగా తయారైంది. ‘ఐపీఎల్’క్షికికెట్ వివాదాల మయం అవుతోంది. క్రికెట్ ఇవాళ.. మూడు ‘సీ’ల చుట్టూ తిరుగు తున్నది. క్య

Published: Sat,October 6, 2012 04:25 PM

అర్హత లేకున్నా అందలమేలా?

రాజకీయాలకు కేంద్ర నిలయమైన ఢిల్లీ ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటుం ది. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం (ఎన్సీటీసీ) ఏర్పాటుపై కేంద్రానికి ర