ఎంతకాలం ఈ గందరగోళం?


Sat,October 6, 2012 04:25 PM

ఇరాచకం తరువాత అత్యంత అధ్వాన్నమైన స్థితి ప్రభుత్వం అంటాడు హెన్నీ బీచర్. ఇప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ పరిపాలనా విధానాన్ని చూస్తే ఈ మాట అక్షరాలా సత్యమనిపిస్తుంది. ప్రత్యే కించి మూడు నెలలుగా సాగుతున్న రాజకీయ నాటకం మరీ విచిత్రంగా ఉన్నది. తోక చెప్పి నట్టు తల ఆడిస్తున్నట్టున్నది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజా స్వామ్యం, వంద కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో సర్కారు పేరుతో ఈ నాటకం సాగుతు న్నది. ఈ నాటకంలో అనేక మలుపులు! అవినీతి, కుంభ కోణాలు, వెన్నుపో ట్లు. అలకలు, గొడవలు. సంకీర్ణ సర్కారుకు ఉండే ఒత్తిళ్ళు.

ప్రధానికి ప్రభుత్వంపై పట్టు లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రివర్గ సహచరుడు సల్మాన్ ఖుర్షీద్ మాటల్లోనే తెలుస్తున్నది. పరిపాలనకు రంగం సిద్దం చేయవలసిన స్థాయి సోనియాకు మాత్రమే ఉన్నదట. ఆమె మొత్తం ఏర్పాట్లు చేస్తే, ప్రధాని మన్మోహన్ సింగ్ కేవలం ప్రభుత్వాన్ని నడుపుతారట. నిజమే. ప్రధానికి మంత్రివర్గం పై నియంత్రణ లేదు. కాంగ్రెస్ ఒకవైపు, మిత్రపక్షాలు మరోవైపు ఎవరి ఎజెండావారు అమలు చేసుకుంటున్నారు. ఎవరి మంత్రి వర్గం శాఖను వారి జాగీరుగా మార్చుకున్నా రు. ఎవరి ప్రయోజనాలు వారివి. ఎవరి పాల న వారిది. దీంతో ప్రభుత్వ శాఖల మధ్య అయోమయం నెల కొన్నది. పరిపాలన అంతా గందరగోళంగా తయారైంది. ఒక నాయకుడు లేడు, ఒక పాలనా లేదు.

మంత్రివర్గ సమిష్టి బాధ్యత అనేదే ఉత్తమాట. ఇక జవాబుదారీతనం, పారదర్శక అనే మాటలకు తావే లేకుండాపోయింది. మీ వెంట నలుగురైదుగురు ఎంపీలుం చాలు మీదొక చిన్న రాజ్యం. రాష్ట్రీయ్ లోక్‌దళ్‌కు ఐదుగురు ఎంపీలున్నారు చాలదూ! ఇక ఆయన పౌర విమాన యాన మంత్రి. ఆయన రాజ్యాన్ని ఆయన ఏలుకుంటున్నారు. ఇప్పుడు ఆయనకు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ చీఫ్ భరత్ భూష ణ్‌తో గొడవలు మొదలైనయి. విమానయాన భద్రత, పైలట్‌ల సమ్మె, విదేశాలతో ఒప్పందాలు మొదలైన అంశాలలో ఎవరి దారి వారిది. కింగ్ ఫిషర్ వ్యవహారం మరింత గందరగోళం గా మారింది. ఈ గొడవల పర్యవసానంగా భరత్ భూషణ్‌ను అజిత్ సింగ్ తొలగించారు. అయితే ఇక్కడ మరో విచిత్రం జరిగింది. ప్రధాని మన్మోహన్ సింగ్ భరత్ భూషణ్ పదవీ కాలాన్ని పొడిగించిన తరువాతనే ఈ తొలగింపు జరిగింది. ప్రధాని మాటను అజిత్ సింగ్ ఖాతరు చేయలేదని తెలు స్తూనే ఉన్నది. అయినా ప్రధాని మాట్లాడడం లేదు. సోనియాగాంధీ కూడా పట్టించుకోవడం లేదు.

మిత్ర పక్షాలు ఏమి చేసినా కాంగ్రెస్ మౌనంగా సర్దుకు పోవలసిందే. ప్రధా ని మౌనంగా భరించాల్సిందే. సంకీర్ణ ధర్మం అని చెప్పుకోవాలె. ఎందుకంటే కాంగ్రెస్‌కు తగినంత మెజారిటీ లేదు. 545 మందిలోక్‌సభ సభ్యులలో- 272 మంది సభ్యుల మద్దతు ఉంటేనే ప్రభుత్వం బతుకుతుంది. కాంగ్రెస్‌కు ఉన్నది 207 మంది మాత్రమే. అందువల్ల చిన్నా చితక పార్టీలన్నింటినీ జమ చేసు కోవలసి వచ్చింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపికి ఉన్నది తొమ్మిది మంది సభ్యులు. లాలూ ప్రసాద్ ఆర్‌జెడికి ఉన్నది నలుగురు సభ్యులు. ఇట్లా కాంగ్రెస్‌కు కచ్చితంగా మద్దతు ఇస్తానంటున్న పార్టీలన్నీ కలిపితే కూడా సంఖ్య 220కి మాత్రమే చేరుకుంటున్నది. అందువల్లనే మమతా బెనర్జీ నేతృత్వం లోని 19 మంది ఎంపీల మద్దతు తప్పనిసరి. డిఎంకెకు 18 మంది సభ్యుల మద్దతు కూడా పొందవలసి వచ్చింది. వీరికి తోడు బయటి మద్దతు అంటూ ములాయం, మాయావతిలను మెప్పించవలసి వస్తున్నది. సమాజ్‌వాది పార్టీకి 22 మంది, బిఎస్పీకి 21 మంది ఎంపీలున్నారు. వీరందరినీ ఏకతాటిపై నడి పించడం కాంగ్రెస్‌కు తలకు మించిన భారంగా మారుతున్నది. అనుక్షణం బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఈ పార్టీలు ఎప్పుడు సంకీర్ణం నుంచి వెళ్ళిపోయేది తెలువదు. వచ్చే రెండేళ్ళపాటు ఇవన్నీ కలిసి ఉంటాయా అనే అనుమానం కలుగుతున్నది.

కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మిత్రులు, శత్రువులు అనే తేడా లేదు. అందరినీ ఒకేలా ఎదుర్కోవలసిందే. మమతా బెనర్జీ వైఖరి ఇందుకు ఉదాహరణ. మొన్నటి వరకు ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇవ్వమంటూ తిరకా సు పెట్టారు. యూపీఏ విందుకు హాజరుకాలేదు. ఇదొక్కటే కాదు, ఏ విధాన నిర్ణయం తీసుకున్నా సరే మమతా బెనర్జీ అడ్డుపుల్ల వేస్తున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిద్దాం అంటే వద్దు అన్నారు. దీంతో ఆ నిర్ణయం అక్క డే అగిపోయింది. భూమి స్వాధీన చట్టం అంటే చేయవద్దు అన్నారు. లోకా యుక్త, పెన్షన్ బిల్లు, ఉగ్రవాద వ్యతిరేక చట్టం ఇట్లా అనేక అంశాలపై అడ్డుపుల్ల వేశారు. దీంతో ఏ విధాన నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రధానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. యూపీఏ ప్రభుత్వం ఎప్పుడూ ఊగిసలాడుతూనే ఉంటుంది.

ప్రణబ్ ముఖర్జీ క్యాబినెట్ పదవికి రాజీనామా చేసిన తరువాత నెంబర్ టూ ఎవరూ అనే ప్రశ్న తలెత్తింది. ఆ హోదా తనకు ఇవ్వలేదనే ఆగ్రహం శరద్ పవార్‌కు ఉన్నది. కేంద్రంలోనే కాదు, మహారాష్ట్రలోనూ కాంగ్రెస్, ఎన్‌సిపి కలిసి పనిచేస్తున్నాయి . అయినా సరే గొడవలు తప్పడం లేదు. మహారాష్ట్రలో కూడా ఎవరికి వారే అన్నట్టు పాలించుకుంటున్నారు. ఎప్పటికైనా కాంగ్రెస్‌ను దెబ్బకొట్టి మహారాష్ట్రలో సొంతంగా అధికారానికి రావాలని ఎన్‌సిపి భావిస్తు న్నది. ఇక పొత్తు ఎంతకాలం సాగుతుందనేది అనుమానమే. కేంద్ర ప్రభుత్వా న్ని అప్రతిష్ట పాలు చేయడంలో కరుణానిధి పాత్రను చెప్పుకోవలసిందే. స్పెక్ట్ర మ్ కుంభకోణంలో కేంద్ర మంత్రిగా ఉన్నట్టిరాజాపై వెంటనే చర్య తీసుకుంటే సరిపోయేది. కానీ కరుణానిధి అందుకు అంగీకరించలేదు. దీంతో ప్రధానికి ఉన్న గౌరవం దెబ్బతిన్నది. ఒక అవినీతి మంత్రిని తొలగించలేని నిస్సహాయత ఆయనది. తమిళనాడులో ఇద్దరు కుమారుల మధ్య వారసత్వ పోరు నడుస్తు న్న నేపథ్యంలో, ఈ గొడవలను సర్దుబాటు చేయడానికి డిఎంకె కేంద్ర మంత్రి వర్గంలో పదవులను వాడు కోవాలని భావించడం వల్ల వచ్చిన సమస్య ఇది.

సమాజ్‌వాది పార్టీ అధినేత ములా యం సింగ్ మొన్నటి వరకు శత్రువుగా ఉండి ఇప్పుడు యూపీఏ ప్రభుత్వానికి మిత్రుడిగా మారిపోయారు. ఆయన మద్ద తు ఇవ్వడానికి గట్టిగానే బేరానికి దిగారు. ఆయనపై సిబిఐ కేసులు ఎత్తివేయడంతో పాటు యాభై వేల కోట్ల రూపా యల మేర యూపీకి నిధులు ఇవ్వాలని షరతు పెట్టారట. ఈ విధంగా అనేక విధాలుగా కేంద్ర ప్రభుత్వం రాజీ పడ వలసి వస్తున్నది. లాలూ ప్రసాద్ మద్దతుపై ఎక్కువ కాలం ఆధారపడడం కష్టం. మాయావతి ప్రధాని పదవిపై కన్నేసి ఉన్నారు. అందువల్ల ఎంతకాలం మద్దతు ఇచ్చేది తెలువదు.

కేంద్రంలో పరిస్థితులు దిగజారిపోతున్నా, చక్కదిద్దడానికి ప్రధాని మన్మోహన్ సింగ్‌ప్రయత్నించడం లేదు. సోనియా కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రభుత్వ అసమర్థత వల్ల కాంగ్రెస్ పార్టీ కూడ ప్రతిష్టను కోల్పోతున్నది. పంజాబ్, గోవా, యూపీలలో కాంగ్రెస్ పార్టీ బలహీనత బయటపడ్డది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు జరగను న్నాయి. ఈ రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. సార్వత్రిక ఎన్నికల తరువాత యూపీఏ కూటమిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పాత్ర పోషిస్తుందా లేక సాధారణ భాగస్వామిగా ఉంటుందా అనేది తేలవలసి ఉన్నది.
ఇదే పరిస్థితి కొనసాగితే దేశ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది. సోని యా, మన్మోహన్ సింగ్‌లు కలిసికట్టుగా పరిస్థితిని చక్కదిద్దాలి. అవకాశ వాదులతో కఠినంగా వ్యవహరించాలి. రాజకీయాలలో నీతి, నియమాలకు స్థానం కల్పించాలి.

-పూనమ్ ఐ కౌశిష్
ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయన్స్

35

PUNAM I KOUSHISH

Published: Sat,December 19, 2015 12:48 AM

శాసనకర్తలకు విద్య అవసరం లేదా?

ఎంపీలు, ఎమ్మెల్యేలు.. చట్టసభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరించాలి. ప్రజలకు కావాల్సినవి సాధించాలి. ప్రజలకు మంచి జీవితాన్నందించడం కోసం పా

Published: Wed,August 19, 2015 12:07 AM

కష్టంగా నెట్టుకొస్తున్న మోదీ

పరిపాలనా రంగంలో పరివర్తన కోసం భారత ప్రజ లు మోదీకి అధికారం కట్టబెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన

Published: Wed,August 12, 2015 01:47 AM

చర్చలు సాగని చట్టసభలు

ఇవ్వాళ రాజకీయాల్లో చర్చలకు తావులేకుండాపోయింది. బలప్రదర్శనకే పెద్దపీట వేస్తున్నారు. తమ సంఖ్యాబలంతో అధిపత్యం చూపించుకోవడానికే ప్రాధా

Published: Sat,May 16, 2015 12:39 AM

అధికార దుర్వినియోగం..

మన నేతలంతా వ్యాపారుల్లా అవతారాలెత్తి లాభాలు దండుకుంటుంటే.. ఆమ్ ఆద్మీ- గరీబ్ అవుతున్నాడు. మన నేతలు తమ ప్రైవేటు వ్యవహారాలుగా చెబుతున

Published: Thu,February 26, 2015 01:56 AM

పరిశుభ్రత సరే... ప్రాణాల సంగతి?

ఇండియాలో అన్నింటికన్నా అగ్గువ (చీప్) ఏదైనా ఉన్నదంటే.. అది మనుషు ల ప్రాణమే. కూరగాయల కన్నా ఒకింత విలువ, సమయాన్ని బట్టి వాటి ప్రాముఖ్

Published: Sun,December 21, 2014 01:51 AM

మత మార్పిడులకు పునాది ఏమిటి?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. కానీ ఇది

Published: Tue,April 15, 2014 01:23 AM

ప్రజా జీవితంలో వ్యక్తిగతం ఉంటుందా..?

ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులకు వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు. ఉండకూడదు అని గాంధీ బోధించారు. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత వ్

Published: Wed,April 2, 2014 01:18 AM

ఎన్నికలు- విదేశీ నిధులు

ప్రజాస్వామ్యం వెలుగొందాలి అంటే.. రాజకీయాలను నియంత్రిస్తున్న ధనప్రవాహాన్ని నియంత్రించాలి. ఎన్నికల నిధులు ఎక్కడనుంచి,ఏం ఆశించి వస్త

Published: Thu,February 6, 2014 12:15 AM

తెలంగాణ ఏర్పాటు-పాఠాలు

సామాజిక సమస్యల విషయంలో వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించి దానికి తగిన విధంగా మసలుకోకుంటే.. అది కాలక్రమంలో ప్రతీకారం తీర్చుకుంటుందని భ

Published: Sun,May 5, 2013 12:42 PM

నేతల చావు రాజకీయాలు

మన నేతలు ప్రతిదాన్నీ రాజకీయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అది ఇంకా ముదిరి శవరాజకీయాలనుంచి ఎదిగి చావు రాజకీయాల దాకా వచ్చింది. సరబ

Published: Mon,April 8, 2013 02:41 AM

జేపీసీలు ఎందుకోసం?

ఊహించినట్లుగానే శీతాకాల పార్లమెంటు సమావేశాలు వాడి, వేడిగా సాగా యి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు నడిచిందనిపించుకున్నది. శ్రీ

Published: Fri,March 15, 2013 02:16 AM

అవినీతి అంతమెప్పుడు?

ముఖం చూసి బొట్టు పెట్టడమన్నది మన సంప్రదాయమైపోయింది. ఇదిప్పుడు పాలనా విధానంలోకి తర్జుమా అయ్యింది. నీ చేయి బెంచి కిందినుంచి ఎంత తొంద

Published: Mon,January 21, 2013 12:11 AM

నేర రాజకీయాలే సమస్య

మేకలను బలి ఇచ్చి పులులను అందలమెక్కించే నీతి దేశంలో రాజ్యమేలుతున్న ది. ఇది ఎక్కడనో ఒకచోట జరుగుతున్న తంతు కాదు, దేశంలో మూల మూలనా ఇదే

Published: Thu,January 3, 2013 11:47 PM

మన ప్రయాణమెటు?

ఈమధ్య కొన్ని ఉదంతాలు సగటు భారతీయుడిని భయవూభాంతులకు గురిచేస్తున్నాయి. మనం కలలుగన్న భారత్ ఇదే నా అని కన్నీరు కార్చే స్థితి వచ్చింది.

Published: Mon,December 10, 2012 12:12 AM

నీతిబాహ్య రాజకీయాలే నీటి తగాదాలు

రాజకీయ నాయకులు ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ, మహానీయులు భావి తరాల కోసం ఆలోచిస్తారనేది పెద్దలమాట. దీని కనుగుణంగానే నేటి రాజకీయ న

Published: Sun,December 2, 2012 11:30 PM

ప్రజారోగ్యం పట్టని పాలకులు

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నది పాత మాట. ఇప్పుడు ప్రజల అనారోగ్యమే కొందరికి వరమైపోయింది. రోగగ్రస్థ సమాజంతోనే లాభాలను పిండుకునే పరిస్థిత

Published: Wed,October 10, 2012 05:33 PM

మాటల్లోనే గాంధీ మార్గమా?

నేనుంటున్న ఇంటి పక్కనే ఓ నవయువకుడు ఉంటాడు. ఆయనను ‘గాంధీ గురించి నీ అభివూపాయం ఏమిటీ’ అనగానే.. ‘అతనికేం సొట్టబుగ్గల అందగాడు. మోస్ట్

Published: Sat,October 6, 2012 04:24 PM

అసోం అల్లర్లపై అలసత్వమేల?

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుం టూ కాలక్షేపం చేశాడని..అది నిర్లక్ష్యానికి, బాధ్యతా రాహిత్యానికి సంకేతంగా చె

Published: Sat,October 6, 2012 04:25 PM

కాముకుల కాసుల క్రీడ

జంటిల్‌మెన్ గేమ్ జంగ్లీగా తయారైంది. ‘ఐపీఎల్’క్షికికెట్ వివాదాల మయం అవుతోంది. క్రికెట్ ఇవాళ.. మూడు ‘సీ’ల చుట్టూ తిరుగు తున్నది. క్య

Published: Sat,October 6, 2012 04:25 PM

అర్హత లేకున్నా అందలమేలా?

రాజకీయాలకు కేంద్ర నిలయమైన ఢిల్లీ ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటుం ది. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం (ఎన్సీటీసీ) ఏర్పాటుపై కేంద్రానికి ర