కాముకుల కాసుల క్రీడ


Sat,October 6, 2012 04:25 PM

జంటిల్‌మెన్ గేమ్ జంగ్లీగా తయారైంది. ‘ఐపీఎల్’క్షికికెట్ వివాదాల మయం అవుతోంది. క్రికెట్ ఇవాళ.. మూడు ‘సీ’ల చుట్టూ తిరుగు తున్నది. క్యాష్, క్రికెట్, కాంట్రవర్సీగా రూపు మార్చుకున్నది. వెర సి ఇప్పుడు ఐపీఎల్ అంటే.. ‘ఇండియా పైసా లిమిటెడ్’ నుంచి ‘ఇండి యా ప్రాబ్లమ్ లీగ్’ గా మారింది. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ అనుకున్న లక్ష్యాల నుంచి పక్కదారి పట్టింది. సూపర్ స్టార్లు, బడావ్యాపారులు, అందమైన అమ్మాయిలు, ఎయిర్‌లైన్ యజమానులు అంతా కలిసి మర్యాదస్తుల ఆట క్రికెట్‌ను నేలబారు పట్టించారు. ఆటకు సంబంధించిన నియమాలను, పోటీతత్వాన్నీ మంటగలిపి మలినం చేశారు. అన్నింటినీ.. మగువ, మనీ నియంవూతిస్తున్నాయి. ఇన్‌స్టంట్ క్రికెట్ ఇండియా పరువును మంటకలుపుతున్నది.

ఐపీఎల్ ప్రారంభమైన నాటినుంచీ దీనిపై అనేక రకాలుగా చర్చ జరుగుతున్నది. ఇది క్రికెట్‌కు మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుందని నాటి నుంచీ వాదిస్తున్నవారూ ఉన్నారు. క్రికెట్‌ను వ్యాపారమయం, డబ్బుమయం చేయడం ఏ విధంగానూ క్రికెట్‌కు మేలు చేయదని అంటున్నారు. దీనికనుగుణంగానే..ఐపీఎల్‌ను అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. మొదటినుంచి వివాదాలమయం అవుతున్నది. ఇంకా ఇప్పటి ఐదో ఐపీఎల్‌కు వచ్చే సరికి ఇంకా ముదిరి పాకాన పడ్డ చందంగా తయారైంది. రాయ ల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఆటగాడు ‘చీర్ గాల్’ (డ్యాన్సర్)ను అవమాన పరిచిన ఘటనలో ఓ ఆస్ట్రేలియన్ క్రికెటర్ జైలు పాలయ్యే పరిస్థితి వచ్చింది. మరికొంతమంది క్రికెటర్లు స్టింగ్ ఆపరేషన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడి అడ్డంగా దొరికిపోయా రు. వారిపై నిషేధం కూడా అమలవుతున్నది. ఓ ఫ్రాంచైజీ యజమాని అయిన షారూక్ ఖాన్ తప్ప తాగి భద్రతాధికారులతోనే తలపడి క్రికెట్ పరువును బజారున పడేశాడు. అయిదేళ్లు వాంఖడే స్టేడియంలోకి రాకుండా నిషేధానికి గురయ్యాడు. ఇలా చెప్పుకుంటూ.. పోతే క్రికెట్‌కు మచ్చ తెచ్చే ఎన్నో ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

ఇప్పుడు భారతీయ క్రికెట్ అంతా వ్యాపారమయం అయింది. డబ్బు తో గబ్బుకొడుతున్నది. డబ్బుగల వాళ్లంతా తమ మనీ పవర్‌ను ప్రదర్శి స్తూ.. క్రీడా స్ఫూర్తిని మంటగలుపుతున్నారు. ఆటగాళ్ల ఆటనూ డబ్బుతో ప్రభావితం చేస్తున్నారు. ఆటగాడి ఆటను నియంవూతిస్తున్నారు. కోటీశ్వరు లు కోట్లాదిమంది ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారు. అంతిమంగా.. క్రికెట్ అంటే.. ‘క్యాష్’గా మార్చేశారు. ఇంతటితోనే ఐపీఎల్ లీలలు ఆగిపోలేదు. ఫెరా నిబంధనలు ఉల్లంఘించి విదేశాల నుంచి నల్లడబ్బును అక్రమ మార్గాల్లో తెచ్చేందుకు ఐపీఎల్‌ను వాడుకుంటున్నట్లు గుసగుసలున్నాయి. అండర్ వరల్డ్ డాన్‌లు, కొంతమంది నేతల డబ్బుమూటలు ఐపీఎల్ క్రికెట్‌కు మసి పూస్తున్నాయి. ఐపీఎల్‌ను మారిన కాలానికి మారిన క్రికెట్‌గా మొదట చెప్పుకొచ్చారు. కాలానుగుణంగా వచ్చిన క్రికెట్ ఆటగా గొప్పలు చెప్పారు. కానీ.. డబ్బు ప్రభావంతో.. సిక్స్‌లు, ఫోర్‌లన్నీ.. డబ్బులతోనే ప్రవహిస్తున్నాయి. దీంతో.. మొత్తం మీద క్రికెట్ అభిమానులు ‘క్లీన్ బౌల్డ్’ అయ్యారు. ఈ పరిస్థితులను చూస్తుంటే.. నేడు క్రికెట్‌ను పీడిస్తున్న ఈ జాడ్యం రేపు హాకీ, ఫుట్‌బాల్, టెన్నిస్ తదితర ఆటలకు కూడా బలి తీసుకోవచ్చు.

అయిదురోజుల క్రికెట్ నుంచి అయిదు గంటల వినోదంగా మారిన ఐపీఎల్, క్రికెట్ అభిమానులను రంజింపచేస్తుందని అనుకున్నారు. హోట ళ్లు, రెస్టాంట్లు, గిఫ్ట్ స్టోర్స్ మొదలు చిన్న వ్యాపారుల దాకా క్రికెట్‌తో లాభపడేవారు. మతంపాంతం, చివరికి దేశం లాంటి ఎల్లలు మరిచి అంతా ఏకంగా క్రికెట్ ఆటతో ఆనందం పొందేవారు. ఎంతో మందికి జీవనోపాధి కూడా ఇచ్చింది. కానీ కోట్లాదిమంది ప్రజలు అన్నీ మరిచి క్రికెట్ లోకంలో విహరించే బదులు ఛిన్నాభిన్నం అయ్యారు. ధనం అన్నింటినీ.. మాయం చేసింది.
మరోవైపు ఐపీఎల్ క్రికెట్ క్రీడాకారులను కూడా భ్రష్టుపట్టించింది. కోట్లలో అమ్ముడుపోయే ఆటగాళ్లు క్రికెట్ స్వభావాన్ని, రూపు రేఖలను కూడా శాసిస్తున్నారు. ఆటకంటే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యాపారమే ప్రధా నం అయిపోయింది. తెల్లని బట్టలతో జెంటిల్‌మెన్ గేమ్‌గా ఉన్న క్రికెట్ రంగురంగుల బట్టలతో అనేక మరకలను అంటించుకుంటున్నది. ఐపీఎల్‌లో పాల్గొనే తొమ్మిది ఫ్రాంచైజీలు మొత్తం మీద 8000 కోట్ల రూపా యల వ్యాపారానికి కేంద్రం అవుతున్నాయి. ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకే 200 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ ఆటల పదేళ్ల ప్రసార హక్కులను 3,672 కోట్లకు అమ్మారు. ఆటగాళ్ల స్పాన్సర్‌షిప్ పేర అయిదేళ్లకు గాను మరో 200 కోట్ల వ్యాపారం జరుగుతున్నది. ఇంత పెద్ద మొత్తంలో ఆట పేరుతో కోట్లలో వ్యాపారం జరుగుతుంటే.. ప్రభుత్వం ఈ వ్యాపార సంస్థలకు పన్ను మినహాయింపు నిచ్చింది. దీంతో.. ప్రభుత్వం ఎన్నివేల కోట్లు నష్టపోతున్నది? ఇదంతా మన క్రికెటర్లకు పట్టదు. దేశ ప్రజలు, వారి జీవన పరిస్థితులు పట్టవు. ఎందుకంటే.. క్రికెట్ ఆటతో రాత్రికి రాత్రి సెలవూబిటీలు అయిపోయి కోట్లు కూడ బెడుతున్నారు. మొత్తం మీద అంద రు క్రికెటర్లు ఏడాదిలో వ్యాపార ప్రకటనలతో బ్రాండ్ అంబాసిడర్‌గా 1000 కోట్లు సంపాదిస్తున్నారు.

ఈ పరిణామాలన్నీ క్రికెట్ స్వరూపాన్ని, స్వభావాన్ని ప్రభావితం చేశాయి. దాన్ని డబ్బుల జూదంగా మార్చివేశాయి. దీనికి బడా వ్యాపార దిగ్గజాలు, అవినీతితో బలిసిన రాజకీయ నేతలు ప్రధాన కారణం. భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండూ.. ఈ వ్యాపార ఊబిలో కూరుకుపోయాయి. ఈ పరిస్థితుల్లో క్రికెట్‌ను ఒక ఆట గా, జంటిల్‌మెన్ గేమ్‌గా బతికించాలంటే.. తీవ్రమైన చర్యలే అవసరం. డబ్బు ప్రభావా న్నీ, బడా వ్యాపారుల ప్రమేయాన్నీ తగ్గించిన నాడే క్రికెట్, అందునా భారత క్రికెట్ బాగు పడుతుంది. బతికి బట్టకడుతుంది. లేదంటే.. క్రికెట్ వ్యాపార సామ్రాజ్యంలో కొట్టుకుపోయి ఏ ఒడ్డు కు చేరుతుందో.. ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే.. భవిష్యత్తులో ఏం జరగబోతున్నదో ఛాయా మావూతంగా కనిపిస్తూనే ఉన్నది. ఇకనైనా మనం మేల్కోవాలి. ‘పైసా ఫేక్ తమాషా దేక్’ అన్న చందంగా తయారైన క్రికెట్‌ను కాపాడుకోవాలి.

-పూనమ్ ఐ కౌశిష్
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్)

35

PUNAM I KOUSHISH

Published: Sat,December 19, 2015 12:48 AM

శాసనకర్తలకు విద్య అవసరం లేదా?

ఎంపీలు, ఎమ్మెల్యేలు.. చట్టసభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరించాలి. ప్రజలకు కావాల్సినవి సాధించాలి. ప్రజలకు మంచి జీవితాన్నందించడం కోసం పా

Published: Wed,August 19, 2015 12:07 AM

కష్టంగా నెట్టుకొస్తున్న మోదీ

పరిపాలనా రంగంలో పరివర్తన కోసం భారత ప్రజ లు మోదీకి అధికారం కట్టబెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన

Published: Wed,August 12, 2015 01:47 AM

చర్చలు సాగని చట్టసభలు

ఇవ్వాళ రాజకీయాల్లో చర్చలకు తావులేకుండాపోయింది. బలప్రదర్శనకే పెద్దపీట వేస్తున్నారు. తమ సంఖ్యాబలంతో అధిపత్యం చూపించుకోవడానికే ప్రాధా

Published: Sat,May 16, 2015 12:39 AM

అధికార దుర్వినియోగం..

మన నేతలంతా వ్యాపారుల్లా అవతారాలెత్తి లాభాలు దండుకుంటుంటే.. ఆమ్ ఆద్మీ- గరీబ్ అవుతున్నాడు. మన నేతలు తమ ప్రైవేటు వ్యవహారాలుగా చెబుతున

Published: Thu,February 26, 2015 01:56 AM

పరిశుభ్రత సరే... ప్రాణాల సంగతి?

ఇండియాలో అన్నింటికన్నా అగ్గువ (చీప్) ఏదైనా ఉన్నదంటే.. అది మనుషు ల ప్రాణమే. కూరగాయల కన్నా ఒకింత విలువ, సమయాన్ని బట్టి వాటి ప్రాముఖ్

Published: Sun,December 21, 2014 01:51 AM

మత మార్పిడులకు పునాది ఏమిటి?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. కానీ ఇది

Published: Tue,April 15, 2014 01:23 AM

ప్రజా జీవితంలో వ్యక్తిగతం ఉంటుందా..?

ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులకు వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు. ఉండకూడదు అని గాంధీ బోధించారు. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత వ్

Published: Wed,April 2, 2014 01:18 AM

ఎన్నికలు- విదేశీ నిధులు

ప్రజాస్వామ్యం వెలుగొందాలి అంటే.. రాజకీయాలను నియంత్రిస్తున్న ధనప్రవాహాన్ని నియంత్రించాలి. ఎన్నికల నిధులు ఎక్కడనుంచి,ఏం ఆశించి వస్త

Published: Thu,February 6, 2014 12:15 AM

తెలంగాణ ఏర్పాటు-పాఠాలు

సామాజిక సమస్యల విషయంలో వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించి దానికి తగిన విధంగా మసలుకోకుంటే.. అది కాలక్రమంలో ప్రతీకారం తీర్చుకుంటుందని భ

Published: Sun,May 5, 2013 12:42 PM

నేతల చావు రాజకీయాలు

మన నేతలు ప్రతిదాన్నీ రాజకీయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అది ఇంకా ముదిరి శవరాజకీయాలనుంచి ఎదిగి చావు రాజకీయాల దాకా వచ్చింది. సరబ

Published: Mon,April 8, 2013 02:41 AM

జేపీసీలు ఎందుకోసం?

ఊహించినట్లుగానే శీతాకాల పార్లమెంటు సమావేశాలు వాడి, వేడిగా సాగా యి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు నడిచిందనిపించుకున్నది. శ్రీ

Published: Fri,March 15, 2013 02:16 AM

అవినీతి అంతమెప్పుడు?

ముఖం చూసి బొట్టు పెట్టడమన్నది మన సంప్రదాయమైపోయింది. ఇదిప్పుడు పాలనా విధానంలోకి తర్జుమా అయ్యింది. నీ చేయి బెంచి కిందినుంచి ఎంత తొంద

Published: Mon,January 21, 2013 12:11 AM

నేర రాజకీయాలే సమస్య

మేకలను బలి ఇచ్చి పులులను అందలమెక్కించే నీతి దేశంలో రాజ్యమేలుతున్న ది. ఇది ఎక్కడనో ఒకచోట జరుగుతున్న తంతు కాదు, దేశంలో మూల మూలనా ఇదే

Published: Thu,January 3, 2013 11:47 PM

మన ప్రయాణమెటు?

ఈమధ్య కొన్ని ఉదంతాలు సగటు భారతీయుడిని భయవూభాంతులకు గురిచేస్తున్నాయి. మనం కలలుగన్న భారత్ ఇదే నా అని కన్నీరు కార్చే స్థితి వచ్చింది.

Published: Mon,December 10, 2012 12:12 AM

నీతిబాహ్య రాజకీయాలే నీటి తగాదాలు

రాజకీయ నాయకులు ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ, మహానీయులు భావి తరాల కోసం ఆలోచిస్తారనేది పెద్దలమాట. దీని కనుగుణంగానే నేటి రాజకీయ న

Published: Sun,December 2, 2012 11:30 PM

ప్రజారోగ్యం పట్టని పాలకులు

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నది పాత మాట. ఇప్పుడు ప్రజల అనారోగ్యమే కొందరికి వరమైపోయింది. రోగగ్రస్థ సమాజంతోనే లాభాలను పిండుకునే పరిస్థిత

Published: Wed,October 10, 2012 05:33 PM

మాటల్లోనే గాంధీ మార్గమా?

నేనుంటున్న ఇంటి పక్కనే ఓ నవయువకుడు ఉంటాడు. ఆయనను ‘గాంధీ గురించి నీ అభివూపాయం ఏమిటీ’ అనగానే.. ‘అతనికేం సొట్టబుగ్గల అందగాడు. మోస్ట్

Published: Sat,October 6, 2012 04:24 PM

అసోం అల్లర్లపై అలసత్వమేల?

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుం టూ కాలక్షేపం చేశాడని..అది నిర్లక్ష్యానికి, బాధ్యతా రాహిత్యానికి సంకేతంగా చె

Published: Sat,October 6, 2012 04:25 PM

ఎంతకాలం ఈ గందరగోళం?

ఇరాచకం తరువాత అత్యంత అధ్వాన్నమైన స్థితి ప్రభుత్వం అంటాడు హెన్నీ బీచర్. ఇప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ పరిపాలనా విధానాన్ని చూస్తే

Published: Sat,October 6, 2012 04:25 PM

అర్హత లేకున్నా అందలమేలా?

రాజకీయాలకు కేంద్ర నిలయమైన ఢిల్లీ ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటుం ది. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం (ఎన్సీటీసీ) ఏర్పాటుపై కేంద్రానికి ర

Featured Articles