అర్హత లేకున్నా అందలమేలా?


Sat,October 6, 2012 04:25 PM

Raju-Sach talangana patrika telangana culture telangana politics telangana cinemaరాజకీయాలకు కేంద్ర నిలయమైన ఢిల్లీ ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటుం ది. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం (ఎన్సీటీసీ) ఏర్పాటుపై కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య బాహాబాహీ సాగుతూనే ఉన్నది. మధ్య లో ఎవరు రాష్ట్రపతి అనే విషయమై చర్చ. అసలే యూపీఏ పక్షవాతంతో బాధపడుతున్నది. అందులో కాంగ్రెస్‌కు మమతాకు గొడవ. ఈ అయోమయంలో రాజ్యసభకు నియామకాలు. క్రికెట్ ఆటగాడు సచిన్, బాలీవుడ్ నటీ రేఖ రాజ్యసభలో అడుగుపెట్టారు. ఇదో నిరంతరం సాగే సిల్‌సిలా. పారిక్షిశామికవేత్తలు, పైరవీ కారులు, కుటిల రాజకీయవేత్తలతో కళకళలాడే రాజ్యసభలో గౌరవనీయులైన సచిన్, రేఖ అడుగుపెడాతరంటే వద్దనే వారెవరుంటారు. ఆటగాళ్లు, సినిమావాళ్లు రాజ్యసభకు రంజింప చేయడం ఇది మొదటిసారి కాదు. చివరిసారి కాదు. సచిన్ ఓ గొప్ప ఆటగాడు అనడంలో సందేహం లేదు. రేఖ అలనాటి గొప్ప నటి. ఇతరుల మాదిరిగానే భిన్నరంగాల ప్రముఖులైన వీరికి రాజ్యసభలో అడుగుపెట్టే హక్కున్నది. ఇదో గౌరవనీయమైన విషయం.

కానీ ఇక్కడో విషయం ఆలోచించాలి. సచిన్ పార్లమెంటుకు అలంకారవూపాయంగా ఉండాల్సిందేనా? భారత్ ఉమ్రావ్‌జాన్‌ను సత్కరించదలుచుకుంటే రాజ్యసభకు నామినేట్ చేయడం ఒక్కటే మార్గమా? వీరిరువురు ప్రజల సమస్యలను గానీ, దేశ సమస్యలను గానీ ఎన్నడైనా పట్టించుకున్నారా? క్రికెట్, సినిమా లు... అంతే తప్ప ఈ దేశాన్ని పీడిస్తున్న అవినీతి గురించో, అసమర్థ పాలన గురించో, ప్రజల సమస్యల గురించో ఏనాడైనా వీరు పట్టించుకున్నారా? సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే యూపీఏ వీరిని నామినేట్ చేసిందా?

క్రికెట్ నా జీవితం అని సచిన్ ఇప్పటికే స్పష్టంగా చెప్పాడు. ఆయన ఇంకా ఆడుతూనే ఉంటాడు. ఇప్పట్లో రిటైర్డ్ కావాలన్న ఆలోచనే లేదు. ప్రభుత్వానికి సచిన్‌ను సత్కరించాలని ఉంటే భారతరత్న ఇస్తే సరిపోయేది. క్రికెట్ రంగంలో వంద అంతర్జాతీయ సెంచరీలు చేసి, బ్రాడ్‌మన్ తర్వాత అంత గొప్ప ఆటగాడు అనిపించుకున్న ఘనత సచిన్‌ది. ఈయన భారతరత్నకు అర్హుడే. ఇక రేఖ గురించి. సిల్‌సిలా సినిమాలో తన సహ నటి అయిన, అమితాబ్ భార్య జయా బచ్చన్‌తో ఆమెకు కిస్సా కుర్సీకా నడుస్తూనే ఉన్నది. రేఖ అడుగుపెడుతున్నట్టు తెలియగానే సమాజ్‌పార్టీ ఎంపీ అయిన జయాబచ్చన్ తన సీటును మరోచోటికి మార్పించుకున్నది. లతామంగేష్కర్, పండిట్ రవిశంకర్, స్వర్గీయ ఎంఎఫ్ హుస్సేన్ రాజ్యసభలో పెదవి విప్పలేదు. సచిన్ మాత్రం నోరు తెరుస్తాడా? రేఖ రాజకీయ ముజ్రా ప్రదర్శిస్తారా?

రాజ్యసభ సభ్యుల నియామకంలో ప్రభు త్వం అధికార దుర్వినియోగానికి పాల్పడడం ఇది మొదటిసారి కాదు. రాజ్యాంగం ప్రకారం-సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, కళలు, సామాజిక సేవ వంటి రంగాలలో పరిజ్ఞానం, అనుభవం గల వారిని రాష్ట్రపతి నియమించవచ్చు. ఇటువంటి భిన్న రంగాలలోని నిష్ణాతులు ఎన్నికల రాజకీయాలలో పాల్గొనడానికి ఇష్టపడకపోవ చ్చు. అందువల్ల పార్లమెంటు వీరి సేవలను వినియోగించుకోవడానికి ఈ ఏర్పాటు జరిగింది. ఈ అంశంపై రాజ్యాంగ సభలో వేడి వేడి చర్చ సాగింది. రాష్ట్రపతికి 12 మందిని నియమించే అధికారం కల్పించడం వల్ల ఆ రాజ్యాంగ పదవిలో ఉన్నవారు ఆశ్రీత పక్షపాతానికి పాల్పడ్డారనే ఆరోపణలు రావచ్చు.

ఇది వాంఛనీయం కాదు అని రాజ్యాంగసభలో కొందరు అభ్యంతరం వ్యక్తపరిచారు. ఇప్పుడు ఆ ఆందోళన నిజమైంది. ఈ నియామకాల విషయంలో నెహ్రూ నిజాయితీగానే వ్యవహరించారు. డాక్టర్ జాకీర్ హుస్సేన్ (ఆ తర్వాత రాష్ట్రపతి అయ్యారు), అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ప్రొఫెసర్ సత్యేంవూదనాథ్ బోస్ తదితరులను నెహ్రూ రాజ్యసభకు పంపించగలిగారు. ధర్మశాస్త్రాలలో ఉద్ధండుడైన డాక్టర్ పీవీ కనే, డాక్టర్ రాధాకుముద్ ముఖర్జీ, డాక్టర్ తారాచంద్ వంటి చరిత్ర కారులు, మైథిలీ శరణ్‌గుప్తా, హరివంశ్ రాయ్ బచ్చన్ వంటి సాహితీవేత్తలు, పృథ్వీరాజ్ కపూర్ వంటి కళాకారులు నెహ్రూ హయాంలో రాజ్యసభను అలంకరించారు.

ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ కాలం వచ్చే సరికి అంతా మారిపోయింది. వీరు తమ రాజకీయ సన్నిహితులకు సీట్లు పంచిపెట్టారు. నేషనల్ హెరాల్డ్‌కు చెందిన మోహన్‌లాల్ సక్సేనా, ఎస్పీ మిట్టల్ (హర్షత్ మెహతా ఫేం), సయ్యద్ అన్వారా తైమూర్ (అస్సాం మాజీ ముఖ్యమంత్రి) మామా మహమ్మద్ యూని స్ మొదలైన ఘనాపాటీలు రాజ్యసభలో చొరబడడం మొదలైంది. బీజేపీకి ప్రచా రం చేసిన హేమామాలినికి రాజ్యసభలో స్థానం లభించింది. సోనియాగాంధీ తమ కుటుంబానికి విశ్వాసపావూతుడైన మణిశంకర్ అయ్యర్‌ను లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాజ్యసభకు నామినేట్ చేయించారు. అధికార పార్టీకి కొమ్ముకాసే వారికే రాజ్యసభలోని నామినేటెట్ సీట్లు దక్కుతున్నాయి. దీంతో పెద్దల సభ క్రమంగా తన ఔన్నత్యాన్ని కోల్పోతున్నది. ఇప్పుడు అభ్యర్థుల అర్హతలు ఎవరూ చూడడం లేదు. రాజకీయ నాయకులకు సన్నిహితులైతే చాలు.

లేదా కోట్లకు పడగపూత్తిన వ్యాపారస్తులై ఉండాలి. ఇప్పుడు రాజ్యసభకు లోక్‌సభకు సమాంతర సభగా మారిపోయింది. విజ్ఞతతో కూడిన చర్చల స్థానంలో అరుపులు, కేకలు వినపడుతున్నాయి. డబ్బులు ఉన్నవాళ్లు, బ్రోకర్లు సభలో ప్రవేశించడం సాధారణమైపోయింది. నేషనల్ ఎలక్షన్ వాచ్ వెల్లడించిన ప్రకారం-9 మంది పార్లమెంటు సభ్యుల ఆస్తులు కోట్లలో ఉన్నాయి. వీరిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు 33 మంది. బీజేపీ వారు 21 మంది. ఏడుగురు సమాజ్‌వాదీ పార్టీకి చెందినవారు. ముప్ఫై ఏడు మంది ఎంపీలపై క్రిమినల్ కేసులున్నా యి. కింగ్ ఫిషర్‌విజయ్‌మాల్యా, వీడియోకాన్ రాజ్‌కుమార్ ధూత్, బీపీ కంపెనీకి చెందిన చంద్రశేఖర్, రిలయన్స్‌కు చెందిన పరిమళ్ నాత్వానీ తదితరులు పార్లమెంటులో అడుగుపెట్టారు.

రాజ్యసభకు ఎన్నిక కావడానికి అవసరమైన ఓట్లు కొనుగోలు చేయడం కూడా ఒక జాడ్యంగా మారింది. పారిక్షిశామికవేత్తల రంగ ప్రవేశం వల్ల ఈ ఓట్ల రేటు పెరిగినట్టు తెలుస్తున్నది. కొందరు సభ్యులు ఎన్నిక కావడానికి 10-25 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారని వెల్లడైంది. ఎంపీ లాడ్స్ కింద ఒక్కో సభ్యుడు ఏడాదికి ఐదు కోట్ల వంతున ఆరేళ్లలో 30 కోట్ల రూపాయల నిధులు కేటాయించవచ్చు. ఇతరత్రా ప్రాబల్యం, సౌకర్యాలు ఉండనే ఉంటాయి. మాయావతి ముఖ్యమంవూతిగా ఉన్నప్పటి ఉదంతాన్ని ఇప్పటికీ విచివూతంగా చెప్పుకుంటారు. తమ పార్టీ తరఫున రాజ్యసభకు పంపించినప్పుడు వేలం నిర్వహించారని చెబుతుంటారు. ఎక్కువ డబ్బు ఇచ్చిన మహానుభావులకే ఎంపీ సీట్లు దక్కాయి. ఈ వేలంలో నెగ్గిన ఎంపీలు తమ ఎంపీలాడ్స్ నిధులను సమర్పించుకోవాల్సి వచ్చింది.

రాష్ట్రాల ప్రాతినిధ్య సభగా నిర్దిష్ట పాత్ర వహించాల్సిన రాజ్యసభ క్రమంగా తన స్వభావాన్ని కోల్పోతున్నది. పైరవీకారుల మూలంగా రాష్ట్రాల గొంతు వినిపించే వారు కరువైపోతున్నారు. మనం ఎటు పయనిస్తున్నాం? రాజ్యసభకు నామినేషన్ పద్ధతి ఉండడం వల్ల అధికార పార్టీ మాత్రమే లబ్ధి పొందుతున్నది. ఒక అందమైన ముఖారవిందాన్ని, ఒక సిక్సర్ కొట్టే కండ పుష్టిగలవాన్ని రాజ్యసభలో చూసుకునే మహాభాగ్యం కోసం ప్రజల సొమ్ము వృథా చేయడం ఎంత వరకు సమంజసం? అప్పుడప్పుడు ఈ పెద్దల సభను రద్దు చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్నది.

రాజ్యసభను ప్రయోగాత్మకంగా మాత్రమే ఏర్పాటు చేస్తున్నామని, దాన్ని తొలగించుకునే సౌకర్యం ఉన్నదని అంబేద్కర్ 1949లో చెప్పారు. ఆధునిక రాజ్య అవసరాలను ఏకసభ చక్కగా తీర్చగలదని హెరాల్డ్ లాస్కీ అన్న మాటలతో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ కూడా ఏకీభవించారు. అయితే ఏకంగా రాజ్యసభనే రద్దుచేయాలని విపరీత ఆలోచన ప్రస్తుతానికి రాకపోవడమే మంచిది. ఇప్పుడు అంత అవసరం లేదు. రాజ్యసభను ఇప్పటికీ ఒక అర్థవంతమైన సభగా తీర్చిదిద్దుకోవచ్చు. ఈ సభ పార్టీలకు అతీతంగా ఉండాలని జయవూపకాశ్ నారాయణ్ అభివూపాయపడ్డారు. లోక్‌సభలో లేదా అసెంబ్లీలో ఒక పర్యాయం మాత్రమే ఎన్నికైన వారు రాజ్యసభకు ఎంపిక కావాలి. అది రెండు పర్యాయాలు మాత్రమే అవకాశం ఉండాలి. కానీ రాజ్యసభలో నాలుగు పర్యాయాలకు పైగా ఎన్నికైన వారున్నారు. వీరు ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నవారు కాదు. రాజ్యసభ రాష్ట్రాల ప్రాతినిధ్య సభగా తమకు గుర్తింపును కోల్పోతూ ఉన్నది. ఇప్పటికైనా దీని ప్రాధాన్యాన్ని పెంపొదించాలి.

-పూనమ్ ఐ కౌశిష్
ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయన్స్ (INFA)


35

PUNAM I KOUSHISH

Published: Sat,December 19, 2015 12:48 AM

శాసనకర్తలకు విద్య అవసరం లేదా?

ఎంపీలు, ఎమ్మెల్యేలు.. చట్టసభల్లో ప్రజల గొంతుకగా వ్యవహరించాలి. ప్రజలకు కావాల్సినవి సాధించాలి. ప్రజలకు మంచి జీవితాన్నందించడం కోసం పా

Published: Wed,August 19, 2015 12:07 AM

కష్టంగా నెట్టుకొస్తున్న మోదీ

పరిపాలనా రంగంలో పరివర్తన కోసం భారత ప్రజ లు మోదీకి అధికారం కట్టబెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందన

Published: Wed,August 12, 2015 01:47 AM

చర్చలు సాగని చట్టసభలు

ఇవ్వాళ రాజకీయాల్లో చర్చలకు తావులేకుండాపోయింది. బలప్రదర్శనకే పెద్దపీట వేస్తున్నారు. తమ సంఖ్యాబలంతో అధిపత్యం చూపించుకోవడానికే ప్రాధా

Published: Sat,May 16, 2015 12:39 AM

అధికార దుర్వినియోగం..

మన నేతలంతా వ్యాపారుల్లా అవతారాలెత్తి లాభాలు దండుకుంటుంటే.. ఆమ్ ఆద్మీ- గరీబ్ అవుతున్నాడు. మన నేతలు తమ ప్రైవేటు వ్యవహారాలుగా చెబుతున

Published: Thu,February 26, 2015 01:56 AM

పరిశుభ్రత సరే... ప్రాణాల సంగతి?

ఇండియాలో అన్నింటికన్నా అగ్గువ (చీప్) ఏదైనా ఉన్నదంటే.. అది మనుషు ల ప్రాణమే. కూరగాయల కన్నా ఒకింత విలువ, సమయాన్ని బట్టి వాటి ప్రాముఖ్

Published: Sun,December 21, 2014 01:51 AM

మత మార్పిడులకు పునాది ఏమిటి?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేశంలో అందరికీ మత స్వేచ్ఛ ఉన్నది. అంటే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. కానీ ఇది

Published: Tue,April 15, 2014 01:23 AM

ప్రజా జీవితంలో వ్యక్తిగతం ఉంటుందా..?

ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులకు వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు. ఉండకూడదు అని గాంధీ బోధించారు. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత వ్

Published: Wed,April 2, 2014 01:18 AM

ఎన్నికలు- విదేశీ నిధులు

ప్రజాస్వామ్యం వెలుగొందాలి అంటే.. రాజకీయాలను నియంత్రిస్తున్న ధనప్రవాహాన్ని నియంత్రించాలి. ఎన్నికల నిధులు ఎక్కడనుంచి,ఏం ఆశించి వస్త

Published: Thu,February 6, 2014 12:15 AM

తెలంగాణ ఏర్పాటు-పాఠాలు

సామాజిక సమస్యల విషయంలో వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించి దానికి తగిన విధంగా మసలుకోకుంటే.. అది కాలక్రమంలో ప్రతీకారం తీర్చుకుంటుందని భ

Published: Sun,May 5, 2013 12:42 PM

నేతల చావు రాజకీయాలు

మన నేతలు ప్రతిదాన్నీ రాజకీయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అది ఇంకా ముదిరి శవరాజకీయాలనుంచి ఎదిగి చావు రాజకీయాల దాకా వచ్చింది. సరబ

Published: Mon,April 8, 2013 02:41 AM

జేపీసీలు ఎందుకోసం?

ఊహించినట్లుగానే శీతాకాల పార్లమెంటు సమావేశాలు వాడి, వేడిగా సాగా యి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు నడిచిందనిపించుకున్నది. శ్రీ

Published: Fri,March 15, 2013 02:16 AM

అవినీతి అంతమెప్పుడు?

ముఖం చూసి బొట్టు పెట్టడమన్నది మన సంప్రదాయమైపోయింది. ఇదిప్పుడు పాలనా విధానంలోకి తర్జుమా అయ్యింది. నీ చేయి బెంచి కిందినుంచి ఎంత తొంద

Published: Mon,January 21, 2013 12:11 AM

నేర రాజకీయాలే సమస్య

మేకలను బలి ఇచ్చి పులులను అందలమెక్కించే నీతి దేశంలో రాజ్యమేలుతున్న ది. ఇది ఎక్కడనో ఒకచోట జరుగుతున్న తంతు కాదు, దేశంలో మూల మూలనా ఇదే

Published: Thu,January 3, 2013 11:47 PM

మన ప్రయాణమెటు?

ఈమధ్య కొన్ని ఉదంతాలు సగటు భారతీయుడిని భయవూభాంతులకు గురిచేస్తున్నాయి. మనం కలలుగన్న భారత్ ఇదే నా అని కన్నీరు కార్చే స్థితి వచ్చింది.

Published: Mon,December 10, 2012 12:12 AM

నీతిబాహ్య రాజకీయాలే నీటి తగాదాలు

రాజకీయ నాయకులు ఎన్నికల గురించి ఆలోచిస్తారు కానీ, మహానీయులు భావి తరాల కోసం ఆలోచిస్తారనేది పెద్దలమాట. దీని కనుగుణంగానే నేటి రాజకీయ న

Published: Sun,December 2, 2012 11:30 PM

ప్రజారోగ్యం పట్టని పాలకులు

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నది పాత మాట. ఇప్పుడు ప్రజల అనారోగ్యమే కొందరికి వరమైపోయింది. రోగగ్రస్థ సమాజంతోనే లాభాలను పిండుకునే పరిస్థిత

Published: Wed,October 10, 2012 05:33 PM

మాటల్లోనే గాంధీ మార్గమా?

నేనుంటున్న ఇంటి పక్కనే ఓ నవయువకుడు ఉంటాడు. ఆయనను ‘గాంధీ గురించి నీ అభివూపాయం ఏమిటీ’ అనగానే.. ‘అతనికేం సొట్టబుగ్గల అందగాడు. మోస్ట్

Published: Sat,October 6, 2012 04:24 PM

అసోం అల్లర్లపై అలసత్వమేల?

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుం టూ కాలక్షేపం చేశాడని..అది నిర్లక్ష్యానికి, బాధ్యతా రాహిత్యానికి సంకేతంగా చె

Published: Sat,October 6, 2012 04:25 PM

ఎంతకాలం ఈ గందరగోళం?

ఇరాచకం తరువాత అత్యంత అధ్వాన్నమైన స్థితి ప్రభుత్వం అంటాడు హెన్నీ బీచర్. ఇప్పుడు కేంద్రంలో మన్మోహన్ సింగ్ పరిపాలనా విధానాన్ని చూస్తే

Published: Sat,October 6, 2012 04:25 PM

కాముకుల కాసుల క్రీడ

జంటిల్‌మెన్ గేమ్ జంగ్లీగా తయారైంది. ‘ఐపీఎల్’క్షికికెట్ వివాదాల మయం అవుతోంది. క్రికెట్ ఇవాళ.. మూడు ‘సీ’ల చుట్టూ తిరుగు తున్నది. క్య