తెలంగాణ సాయుధ పోరాట యోధుడు డీవీ


Sat,October 6, 2012 04:30 PM

తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించిన యోధుడు దేవులపల్లి వెంక నేడు ఆ మహనీయుని 27వ వర్ధంతి. సీమాంధ్ర పాలకులు తెలంగాణ చరివూతను ఎప్పుడూ తొక్కిపెట్టే ప్రయత్నమే చేశారు. ఆ చరివూతను సృష్టించిన గొప్ప నాయకుల గురించి కూడా నేటితరానికి తెలియనివ్వలేదు. 1940 నుంచి 1968 దాకా పార్టీలో ముఖ్యమైన బాధ్యతలలో పనిచేసిన డి.వి.ని సిపిఐ, సీపీ ఎం పార్టీలు కూడా తెలంగాణ గడ్డపై పుట్టినందుకేనేమో పూర్తిగా విస్మరించాయి. వరంగల్ జిల్లాలోని ఇనుగుర్తి గ్రామంలో 1917 జూన్ 1న డి.వి. జన్మించారు.స్వగ్రామం నల్గొండ జిల్లాలోని సూర్యాపేట-ఖమ్మం దారిపక్కనే ఉన్న చందుపట్ల. 1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న రోజుల్లో వందేమాతరం ఉద్యమంలో పాల్గొని నిజాం సర్కారు ఆగ్రహానికి గురై బహిష్కరించబడిన విద్యార్థుల్లో పి.వి.నరసింహారావుతో పాటు డి.వి. ఒకరు.

ఆగిపోయిన డిగ్రీ చదువు జబల్‌పూర్‌లో చదువుతున్న రోజుల్లో లెనిన్ రచనలు డి.వి. దృష్టికి వచ్చినవి. ఆ రచనలతో ప్రభావితమై 1939లోనే కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకొని కార్యకర్తగా విప్లవ జీవితాన్ని ప్రారంభించిన డి.వి., తన చివరి శ్వాస వరకు విప్లవకారునిగా ఆదర్శవంతమైన జీవితం గడిపారు.పార్టీ ఆదేశంతో 1939 నుంచి కార్యకర్తలకు రాజకీయ శిక్షణా తరగతులను నిర్వహిస్తూ తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రజల విముక్తికై జీవితాన్ని అంకితం చేయాలనే నిర్ణయం తీసుకుని పార్టీ ఫుల్‌టైం కార్యకర్తగా మారారు. 1943లో పార్టీ డి.వి.ని నల్గొండ జిల్లా కార్యదర్శిగా నియమించింది.ఆ బాధ్యతను ఆయన ఎంతో సమర్థవంతంగా నిర్వహించి మహత్తర విప్లవపోరాటానికి నాయకత్వం వహించారు. పాలకుర్తి అయిలమ్మ తన పొలంలో పంటను రక్షించుకోవడానికి చేసిన పోరాటం వీటిలో ఒకటి. భూస్వాముల భూమిని పంచాలనే ప్రతిపాదన పార్టీ ముందు పెట్టి సాయుధపోరాటానికి భూమి పంపకానికీ ముడిపెట్టి భారత విప్లవానికి విలువైన సిద్ధాంతాన్ని అందించారు డివి. మూడువేల గ్రామాల్లో ప్రజలు ‘గ్రామ స్వరాజ్యాలు’ ఏర్పరుచుకున్నది డి.వి. మార్గదర్శకత్వంలోనే.ఇదంతా ఇలా ఉంటే ఆంధ్ర నేతలు కృష్ణా జిల్లా నుంచి దిగుమతై ప్రత్యక్ష పోరాటం తామే నడిపినట్లు ప్రచారం చేసుకోవడం గమనార్హం.

1948 సెప్టెంబర్ 17న పోలీసు చర్య తర్వాత సాయుధ పోరాటాన్ని విరమించాలనే పార్టీ నేతల (రావినారాయణడ్డి, బద్దం ఎల్లాడ్డి తదితరులు)తో సిద్ధాంత పోరాటం చేసి ఆ పోరాటాన్ని 1951దాకా కొనసాగించారు . పోరాట విరమణ తర్వాత 1953లో రహస్య జీవితాన్నుంచి బయటికి వచ్చిన డి.వి. 1957లో నల్గొండ ద్విసభ్య నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. డి.వి.కి సొంత జీవితమంటూ ఏనాడూ లేదు. ఐదేళ్లు ఎంపీగా ఉన్నా ఒక్కనాడైనా భర్యాబిడ్డలకు ఢిల్లీ చూపెట్టలేదు. పెన్షన్ డబ్బు తీసుకోవాలని పార్లమెంట్ సెక్ర కోరినప్పుడు డి.వి. తిరస్కరించారు. 1962లో చైనా యుద్ధం, 1964లో పాకిస్థాన్ యుద్ధం సందర్భాల్లో డి.వి. ని ప్రభుత్వం జైల్లో పెట్టింది.

భారత కమ్యూనిస్టు పార్టీ మితవాద ధోరణిని ఎదిరించి సీపీఎంను ఏర్పాటు చేయడంలో, ఆ తర్వాత సుందరయ్య మితవాద పోకడలను వ్యతిరేకించి విప్లవ కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర డి.వి దే. నక్సల్బరీ, శ్రీకాకుళం గిరిజనోద్యమాల సందర్భంగా అతివాద ధోరణులనెదిరిస్తూ తరిమెల నాగిడ్డితో కలిసి పార్టీలో ఆంతరంగిక పోరాటం చేశారు డి.వి.1975లో తరిమెల నాగిడ్డితో కలిసి ‘భారత విప్లవకారుల సమైక్యతా కేంద్రాన్ని’ స్థాపించారు.ఎమ్జన్సీలో రహస్య జీవితంలోనే 1984 జూలై 12 న డివి కన్నుమూశారు. ఆయన జీవిత చరిత్ర 1940 -1984 మధ్య ఈనేలపై సాగిన ఐదు దశాబ్దాల విప్లవోద్యమాల చరిత్రే. సుందరయ్య, రాజేశ్వరరావు, బసవపున్నయ్య వంటి వారెవ్వరికీ 1948-51 పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని నడిపించిన అనుభవం లేదు. వీరంతా అప్పుడప్పుడు పోరాట నేతలకు అందుబాటులోకి వస్తూ.., చర్చలు జరుపుతూ, కార్యకర్తలకు శిక్షణ నిస్తుండేవారు. వారంతా తెరపైకి వచ్చారు. ఆ పోరాట బాధ్యుడు అయిన డివి తెరమరుగు చేయబడ్డాడు. అనేక విషయాల్లో నేటి తరానికి డివి ఎంతో ఆదర్శవూపాయుడు. తెలంగాణ భూమిపువూతులలో ఉత్తమ పుత్రుడు దేవులపల్లి వెంకజోహార్ డివి.

-విపకాశ్
ప్రొ. జయశంకర్ తెలంగాణ ఆర్ అండ్ డి సెంటర్
( నేడు దేవులపల్లి వెంకటేశ్వరరావు 27వ వర్ధంతి)

35

PRAKASH V

Published: Wed,August 9, 2017 12:02 AM

శ్రీరాంసాగర్ విషాద గాథ

మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారిచే పూర్వవైభవం పొందుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుదివందేళ్ల విషాద చరిత్ర.

Published: Sat,August 5, 2017 11:24 PM

సారు ఆశించిన సుపరిపాలన ఇదే

అంధకారంలో మగ్గుతుందనుకున్న తెలంగాణను అనతి కాలంలోనే పవర్‌కట్ లులేని రాష్ట్రంగా మార్చడం, గత రెండేళ్ళుగా సుమా రు 19 శాతం ఆర్థిక ప్రగత

Published: Tue,July 11, 2017 01:32 AM

మన భగీరథుడు అలీ నవాజ్ జంగ్

కృష్ణా, గోదావరి నదులపై బ్యారేజీలు నిర్మించినందుకు బ్రిటిష్ ప్రభుత్వ మిలిటరీ ఇంజినీర్ సర్ అర్ధర్ కాటన్ 150 ఏళ్లుగా కోస్తాంధ్ర ప్రజల

Published: Sun,February 5, 2017 02:16 AM

స్వయంపాలన వెలుగులు

మూడు తరాల తెలంగాణ ప్రజలు స్వయం పాలన కోసం నీళ్ళు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం నినాదాలతో కారణజన్ముడైన(ఆచార్య జయశంకర్ మాటల్లో) కేసీఆ

Published: Tue,September 30, 2014 12:14 AM

చెరువుల పూడిక ఎంతెంత లోతు!

ఒక్కో చెరువు లేదా కుంటపై యాభై లక్షలు ఖర్చు చేస్తే మూడు లేదా నాలుగు ఎకరాల్లో కూడా పూడిక తీయడం సాధ్యపడదు. తెలంగాణలో వేలాది చెరువులు

Published: Wed,September 24, 2014 02:01 AM

ప్రజల భాగస్వామ్యంతోనే చెరువుల పునర్నిర్మాణం

చెరువుల పునర్నిర్మాణానికి ప్రభుత్వం అధికారుల సలహాలు, భాగస్వామ్యంపైనే ఆధారపడితే అది ఘోర తప్పిదమవుతుంది. గొలుసు చెరువుల నిర్మాణానికి

Published: Fri,March 21, 2014 01:32 AM

సంపూర్ణ తెలంగాణ సాధనే నేటి లక్ష్యం

సంపూర్ణ తెలంగాణ రాకుండా ఆంక్షలకు, ముంపు మండలాలను తెలంగాణ నష్టపోవడానికి కారకులు ఈ రెండు జాతీయ పార్టీల నేతలే. తెలంగాణలో గెలిచే ఈ పార

Published: Sat,October 6, 2012 04:30 PM

తెలంగాణ విలన్ కాంగ్రెసే

తమ స్వార్థపూరిత స్వభావంతో 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రానున్న ఎన్నికల్లో మట్టికరిపిం

Published: Sat,October 6, 2012 04:29 PM

రాజీనామాలు సరే టీడీపీ వైఖరి ఏమిటి?

బస్సుయాత్రతో తమ వద్దకు వస్తున్న దేశం నేతలను ప్రజలు నిలదీసి, తెలంగాణ పై పార్టీ వైఖరిని ప్రకటించాలని కోరాలి. పార్టీ అధినేతచే ప్రధా

Published: Sat,October 6, 2012 04:29 PM

సారు లేడని మనాది వద్దు...

డిసెంబర్ తొమ్మిదిన కేంద్ర వూపభుత్వం చేసిన ప్రకటన అమలవుతదని, తెలంగాణ రాష్ట్రం తొందరగనే ఏర్పడుతుందని సారుకు నమ్మకం కుదిరింది. దీనికి

Published: Sat,October 6, 2012 04:29 PM

జనం కోసమే జయశంకర్ సారు

నాలుగు తరాలతో నడిచిన యోధుడు-2 చివరి రోజులల్ల సారును మీరు జీవితాన్ని సంపూర్ణంగా జీవించానని అనుకుంటున్నారా! అని అడిగిన. ఒక లక్ష

Published: Sat,October 6, 2012 04:28 PM

నాలుగు తరాలతో నడిచిన యోధుడు-1.

1970 నుండి 1996 దాకా తెలంగాణ ఉద్యమానికి తిరిగి ప్రాణం పోయడానికి సారు చేయని ప్రయత్నమంటూ లేదు. ‘ఆర్‌ఎస్‌యు నుండి ఆర్‌ఎస్‌ఎస్ దాకా ఎవ