శ్రీరాంసాగర్ విషాద గాథ


Wed,August 9, 2017 12:02 AM

మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారిచే పూర్వవైభవం పొందుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుదివందేళ్ల విషాద చరిత్ర. ఇరువై లక్షల ఎకరాలకు సాగు నీరందించాల్సిన ఈ ప్రాజెక్టు నాలుగైదు లక్షల ఎకరాలకు మించి ఎందుకు నీరందించలేకపోతున్నది? ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేసిన పాపం ప్రకృతిదా? లేక పాలకులదా? మరో చరిత్రను లిఖించుకోబోతున్నశ్రీరాంసాగర్ చరిత్రను ఒక్కసారి మననం చేసుకుందాం.

పెండింగ్ ప్రాజెక్టులకు మరింత ప్రయోగం చేకూరే విధంగా రీ డిజైనింగ్ చేయాలని, కృష్ణా గోదావరి జలాల్లో మన వాటాను పూర్తిగా వినియోగించుకుంటూ వృథాగా సముద్రంలో కలిసే గోదావరి, కృష్ణా జలాలను మళ్లించి నిల్వ చేసుకోవడానికి పలు రిజర్వాయర్లను, ఎత్తిపోతల పథకాలను నిర్మించాలని త్రిముఖ వ్యూహాన్ని అమలుచేస్తున్నారు.

ప్రఖ్యాత తెలంగాణ ఇంజినీర్ నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహద్దూర్ 1918లో చీఫ్ ఇంజినీర్‌గా బాధ్యతలు చేపట్టగానే ఆయన పర్యవేక్షణలో ఎస్.ఇ.గా ఉన్న అబ్దుల్ ఖయూమ్ ఖాన్ గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టు ప్రణాళికను 1942 నాటికే రూపొందించారు.ఇ.డబ్ల్యు స్లాటర్ గోదావరి లోయ అభివృద్ధి పథకం అమలులో భాగం గా గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టులో అంతర్భాగమైన కడెం ప్రాజెక్టుకు 1949 ఏప్రిల్లో జనరల్ చౌదరి మిలిటరీ ప్రభుత్వం అనుమతులు మంజూరుచేసి అంచనా వ్యయం 8 కోట్ల 40 లక్షలుగా నిర్ధారించింది. ఆ గోదావరి ప్రాజెక్టు పూర్తి స్వరూపం ఇలా ఉంది.

1.నాందేడ్-బాసర మధ్య గోదావరిపై 94 టీఎంసీల సామర్థ్యంతో కవాల్‌గూడా స్టోరేజీ రిజర్వాయర్ నిర్మాణం. 2.పై రిజర్వాయర్‌కు 50 మైళ్ల దిగువన గోదావరిపై 55 టీఎంసీల కుష్టాపురం డ్యాం. 3.కుష్టాపురం డ్యాంకు కుడిపక్కన 166 మైళ్ల పొడువైన దక్షిణ కాల్వ హన్మకొండ దిగువన గల కృష్ణా-గోదావరి రిట్జ్ వరకు.4.కుష్టాపురం డ్యాంకు ఎడమ పక్కన విద్యుచ్ఛక్తి ఉత్పత్తిచేసే కాల్వ కడెం రిజర్వాయర్ (పెద్దూరు గ్రామం) వరకు 43 మైళ్ల పొడవు. 5. పెద్దూరు (కడెం) రిజర్వాయర్ నుంచి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు వరకు గోదావరి ఉత్తర కాల్వ నిర్మాణం. ఈ ప్రణాళిక ప్రకారం దక్షిణ కాల్వ ద్వారా 21.50 లక్షల ఎకరాల కమాండ్ ఏరియా, ఉత్తర కాల్వ ద్వారా 5.60 లక్షల ఎకరాల కమాండ్ ఏరియా, కడెం డ్యాం వరకు ఎడమ కాల్వ ద్వారా 84000 ఎకరాల కమాండ్ ఏరియా కవాల్‌గూడ ఎడమ కాల్వ ద్వారా మరో లక్ష కరాల కమాండ్ ఏరియాలో ఆయకట్టుకు సాగునీరందించాలని నిర్ణయించింది ప్రభుత్వం.

ఆ తర్వాత వచ్చిన వెల్లోడి ప్రభుత్వం ఈ పథకాన్ని మరిం త అభివృద్ధి చేసి దక్షిణ కాల్వను 166 మైలు నుంచి 240 మైలు వరకు పొడిగించింది. దీనివల్ల 35.67 లక్షల ఎకరాల కమాండ్ ఏరియాలో 21 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో సాగు నీరందించే అవకాశం ఏర్పడింది. గోదావరి ప్రాజెక్టు ద్వారా మొత్తం 144 మెగావాట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలను వెల్లోడి 1951 జూలై 27, 28 తేదీల్లో ఢిల్లీలో ప్రణాళికా సంఘం నిర్వహించిన అంతర్రాష్ట్ర నదీజలాల సమావేశంలో చర్చించి భవిష్యత్‌లో గోదావరిపై చేపట్టే ప్రాజెక్టుల కోసం 494 టీఎంసీల కేటాయింపులు పొందారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నీరు ఈ కేటాయింపుల వల్ల లభ్యమైంది. మరో 8 నెలలకే వెల్లోడి పాలన ముగిసి బూర్గుల ప్రభు త్వం ఏర్పడింది. 1956లో బూర్గుల ప్రభుత్వం కవాల్‌గూడ, కుష్టాపురం డ్యాంలకు బదులు పోచంపాడు గ్రామం వద్ద రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించింది. కవాల్‌గూడ వల్ల నాందేడ్ పట్టణం, కుష్టాపురం డ్యాం వల్ల బాసర రైల్వే లైన్ ముంపునకు గురవుతుందని భావించారు.

1956 పోచంపాడు పథకం: 1.డ్యాంకు ఇరువైపులా కాల్వల నిర్మా ణం. డ్యాంతో పాటు స్లూయిస్‌ల వద్ద 60 మెగావాట్ల విద్యుదుత్పాదన. 2.1200 క్యూ సెక్కులతో ఉత్తర కాల్వ ద్వారా 21,000 ఎకరాలకు ఆదిలాబాద్ జిల్లాలో సాగునీరు, కడెం ఆయకట్టు తర్వాత ఉత్తర కాల్వ 79వ మైలు వరకు 1,03,000 ఎకరాలకు సాగునీరు (కడెం ఆయకట్టు కలిపి 1,89,000 ఎకరాల ఆయకట్టు). 3.251 మైళ్ల పొడువైన పోచంపాడు కుడి కాల్వ 17,000 క్యూసెక్కులతో (గోదావరి దక్షిణ కాల్వ) నిర్మాణం. దీనిద్వారా 5 జిల్లా ల్లో 18,06,000 ఎకరాలకు సాగునీరు. కరీంనగర్ బ్రాంచ్ కెనాలపై 20 మెగావాట్ల విద్యుదుత్పత్తి.

సుమారు 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు తెలంగాణ ఆరు జిల్లాల్లో సాగు నీరందించే లక్ష్యంతో బూర్గుల ప్రభుత్వం రూపొందించిన ఈ గోదావరి ప్రాజెక్టు పథకాన్ని 1958లో అప్పటి నీటి పారుదల శాఖా మంత్రి జె.వి.నర్సింగరావు కేంద్రాన్ని రెండో ప్రణాళికలో చేర్చవలసిందిగా కోరారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 117 కోట్లుగా నిర్ధారించా రు. కానీ కేంద్ర ప్రభుత్వ సలహాపై సంజీవరెడ్డి ప్రభుత్వం పోచంపాడు ప్రాజెక్టును కేవలం 3 లక్షల 60 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే చిన్న సైజు ప్రాజెక్టుగా కుదించి ఆ ప్రతిపాదనలను కేంద్ర కమిషన్‌కు పంపింది. నిధుల ప్రస్తావనను కేంద్రం తేకుండానే ఈ చిన్న సైజు పోచంపాడును రెండో ప్రణాళికలో చేర్చడానికి అప్పటికే ప్రణాళికలో చేర్చిన దేవునూరు ప్రాజెక్టును తమ ప్రభుత్వం వదులుకుంటున్నదని, దేవునూరు నిధులను పోచంపాడుకు వ్యయం చేయాలని సంజీవరెడ్డి ప్రభుత్వం కేంద్రమంత్రికి లేఖలో తెలిపింది. దేవునూరును రాష్ట్ర ప్రభు త్వం వదులుకున్నా పోచంపాడును కేంద్రం రెండో ప్రణాళికలో చేర్చలేదు. సెంట్రల్ వాటర్, పవర్ కమిషన్‌లో కె.ఎల్.రావు సభ్యులు. నాగార్జునసాగర్‌లోనే కాక పోచంపాడులో కూడా కె.ఎల్.రావు ద్రోహం స్పష్టంగా అర్థమవుతుంది. 1961 మే 2న కేంద్రం గుల్హాతీ ఛైర్మన్‌గా కృష్ణా-గోదావరి కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ నివేదిక వచ్చేదాకా పోచంపాడు, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్మాణం ఆపాలని కేంద్రం ఆదేశించింది. ఈ రెండు ప్రాజెక్టులు కోస్తాంధ్రకు నీటి ప్రవాహాన్ని అడ్డుకునే ప్రాజెక్టులేనని కె.ఎల్.రావు భావించినట్లున్నారు. పోచంపాడును ధవళేశ్వరానికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మార్చుకోవాలనేది ఆయన ఆలోచన. చివరికి 1963 జూలై 26న పోచంపాడుకు, 25న శ్రీశైలంకు ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేశారు.

రెండవసారి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి పదవి చేపట్టిన తర్వాత 1963 మార్చి 23న పోచంపాడును స్టోరేజీ ప్రాజెక్టుగా మార్చుతూ మరో ప్రతిపాదనను సిద్ధం చేసి కేంద్రానికి పంపింది. ఈ ప్రతిపాదన ప్రకారం 66 టీఎంసీలను పోచంపాడు ఆయకట్టుకు వినియోగిస్తారు. ప్రధాన కాల్వ (దక్షిణ కాల్వ డిశ్చార్జి) కెపాసిటీ 8500 క్యూసెక్కులుగా నిర్ధారించారు. రెండోదశలో 1091 అడుగుల ఎత్తులో 112 టీఎంసీల స్టోరేజీతో పోచంపాడు రిజర్వాయర్ నిర్మించినా ఆ నీటిని తెలంగాణ వినియోగించుకునే అవకాశం లేదు. ఈ స్టోరేజీ కేవలం ధవళేశ్వరం ఆయకట్టు అవసరాలకే ఉపయోగపడుతుంది.సంజీవరెడ్డి ప్రభుత్వం, తర్వాత వచ్చిన బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం పోచంపాడు కోసం తెచ్చిన యంత్రాలను, వాహనాలను, పరికరాలను, సిబ్బందిని శ్రీశైలం ప్రాజెక్టు పనుల కోసం మళ్ళించింది. పోచంపాడుకు నిధులివ్వలేదు. 1965-68 మధ్య కాలంలో ఆరుట్ల కమలాదేవి వంటి వామపక్ష నేతలు, శాసనసభ అంచనాల కమిటీ తెలంగాణ రీజినల్ కమిటీ, తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు పలుమార్లు ప్రభుత్వాన్ని నిలదీసినా 1968 నాటికి 90 కోట్లు వ్యయమయ్యే ప్రాజెక్టుకు 7 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.

1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పోచంపాడు, నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో జరుగుతున్న అన్యాయాలను ఎజెండాలో చేర్చి ప్రభుత్వాన్ని నిలదీసింది. 1969 ఉద్యమ ఫలితమే వెంగళరావు ప్రభు త్వం 06-10-75న మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందం. దాని పర్యవ సానమే 1978లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోచంపాడును శ్రీరాంసాగర్ ప్రాజెక్టుగా పేరు మార్చి మొదటిదశలో 9,68,000 ఎకవరాలకు , రెండో దశలో 4,40,000 ఎకరాలకు సాగు నీరు ఇస్తూ నిజాంప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలను అమలు చేయాలని నిర్ణయించారు. ప్రధాని ఇందిరాగాంధీ జనగామ వచ్చిన సందర్భంగా ప్రజల, ప్రజాప్రతినిధుల కోరికపై శ్రీరాంసాగర్ వరద కాల్వకు హామీ ఇచ్చారు. ఫలితంగా రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చే విధంగా వరద కాలువ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ ప్రతిపాదనలకు అనుమతులు ఇవ్వడానికి కేంద్రం రెండు దశాబ్దాల సమయం తీసుకున్నది.అనుమతులు రాకముందే కాలువలు నిర్మించా రు తప్ప ఒక్క చుక్క కూడా నీరు పారలేదు.3-4-96న రెండోదశ, వర ద కాల్వకు కేంద్రం అనుమతులు లభించినా నేటికీ ఒక ్క ఎకరానికీ సాగునీరివ్వలేదు. రెండో దశ కింద కేవలం 27 వేల ఎకరాలకు చెరువులను నింపి నీరిచ్చారు. ఎస్సారెస్పీ మొదటిదశ పూర్తై చాలా ఏళ్లయినా 9,68,000 ఎకరాల్లో ఏనాడూ 5 లక్షల ఎకరాలకు మించి నీరివ్వలేదు. గత ఏడాది రబీలో మాత్రమే 6 లక్షల ఎకరాలకు మొదటిసారి నీరిచ్చి వందలాది చెరువులు నింపినారు.
prakash
తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాత ప్రాజెక్టులకు పూర్వవైభవం తేవాలని, పెండింగ్ ప్రాజెక్టులకు మరింత ప్రయోగం చేకూరే విధంగా రీ డిజైనింగ్ చేయాలని, కృష్ణా గోదావరి జలాల్లో మన వాటాను పూర్తిగా వినియోగించుకుంటూ వృథాగా సముద్రంలో కలిసే గోదావరి, కృష్ణా జలాలను మళ్లించి నిల్వ చేసుకోవడానికి పలు రిజర్వాయర్లను, ఎత్తిపోతల పథకాలను నిర్మించాలని త్రిముఖ వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. ఈ వ్యూహంలో భాగమే శ్రీరాంసాగర్‌కు పునరుజ్జీవం.1963 జూలై 26న నెహ్రూ పోచంపాడుకు శంకుస్థాపన చేసినప్పుడు తెలంగాణ ప్రజలు లక్షల సంఖ్యలో వచ్చి ప్రాజెక్టు ద్వారా తమకు కలుగబోయే ప్రయోజనాలను ప్రధాని ద్వారా విని ఎంతో ఆనందించారు. 54 ఏళ్లలో ప్రదాని నోటిమాటలు ఏనాడూ నిజం కాలేదు. నవాబ్ అలీ నవాజ్ జంగ్ కలల్ని, నెహ్రూ మాటలను నిజం చేస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరాంసాగర్ వద్ద ఏర్పాటుచేసే పునరుజ్జీవ సభకు అందరం కదులుదాం.
(వ్యాసకర్త: రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్)

1208

PRAKASH V

Published: Sat,August 5, 2017 11:24 PM

సారు ఆశించిన సుపరిపాలన ఇదే

అంధకారంలో మగ్గుతుందనుకున్న తెలంగాణను అనతి కాలంలోనే పవర్‌కట్ లులేని రాష్ట్రంగా మార్చడం, గత రెండేళ్ళుగా సుమా రు 19 శాతం ఆర్థిక ప్రగత

Published: Tue,July 11, 2017 01:32 AM

మన భగీరథుడు అలీ నవాజ్ జంగ్

కృష్ణా, గోదావరి నదులపై బ్యారేజీలు నిర్మించినందుకు బ్రిటిష్ ప్రభుత్వ మిలిటరీ ఇంజినీర్ సర్ అర్ధర్ కాటన్ 150 ఏళ్లుగా కోస్తాంధ్ర ప్రజల

Published: Sun,February 5, 2017 02:16 AM

స్వయంపాలన వెలుగులు

మూడు తరాల తెలంగాణ ప్రజలు స్వయం పాలన కోసం నీళ్ళు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం నినాదాలతో కారణజన్ముడైన(ఆచార్య జయశంకర్ మాటల్లో) కేసీఆ

Published: Tue,September 30, 2014 12:14 AM

చెరువుల పూడిక ఎంతెంత లోతు!

ఒక్కో చెరువు లేదా కుంటపై యాభై లక్షలు ఖర్చు చేస్తే మూడు లేదా నాలుగు ఎకరాల్లో కూడా పూడిక తీయడం సాధ్యపడదు. తెలంగాణలో వేలాది చెరువులు

Published: Wed,September 24, 2014 02:01 AM

ప్రజల భాగస్వామ్యంతోనే చెరువుల పునర్నిర్మాణం

చెరువుల పునర్నిర్మాణానికి ప్రభుత్వం అధికారుల సలహాలు, భాగస్వామ్యంపైనే ఆధారపడితే అది ఘోర తప్పిదమవుతుంది. గొలుసు చెరువుల నిర్మాణానికి

Published: Fri,March 21, 2014 01:32 AM

సంపూర్ణ తెలంగాణ సాధనే నేటి లక్ష్యం

సంపూర్ణ తెలంగాణ రాకుండా ఆంక్షలకు, ముంపు మండలాలను తెలంగాణ నష్టపోవడానికి కారకులు ఈ రెండు జాతీయ పార్టీల నేతలే. తెలంగాణలో గెలిచే ఈ పార

Published: Sat,October 6, 2012 04:30 PM

తెలంగాణ విలన్ కాంగ్రెసే

తమ స్వార్థపూరిత స్వభావంతో 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రానున్న ఎన్నికల్లో మట్టికరిపిం

Published: Sat,October 6, 2012 04:30 PM

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు డీవీ

తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించిన యోధుడు దేవులపల్లి వెంక నేడు ఆ మహనీయుని 27వ వర్ధంతి. సీమాంధ్ర పాలకులు తెలంగ

Published: Sat,October 6, 2012 04:29 PM

రాజీనామాలు సరే టీడీపీ వైఖరి ఏమిటి?

బస్సుయాత్రతో తమ వద్దకు వస్తున్న దేశం నేతలను ప్రజలు నిలదీసి, తెలంగాణ పై పార్టీ వైఖరిని ప్రకటించాలని కోరాలి. పార్టీ అధినేతచే ప్రధా

Published: Sat,October 6, 2012 04:29 PM

సారు లేడని మనాది వద్దు...

డిసెంబర్ తొమ్మిదిన కేంద్ర వూపభుత్వం చేసిన ప్రకటన అమలవుతదని, తెలంగాణ రాష్ట్రం తొందరగనే ఏర్పడుతుందని సారుకు నమ్మకం కుదిరింది. దీనికి

Published: Sat,October 6, 2012 04:29 PM

జనం కోసమే జయశంకర్ సారు

నాలుగు తరాలతో నడిచిన యోధుడు-2 చివరి రోజులల్ల సారును మీరు జీవితాన్ని సంపూర్ణంగా జీవించానని అనుకుంటున్నారా! అని అడిగిన. ఒక లక్ష

Published: Sat,October 6, 2012 04:28 PM

నాలుగు తరాలతో నడిచిన యోధుడు-1.

1970 నుండి 1996 దాకా తెలంగాణ ఉద్యమానికి తిరిగి ప్రాణం పోయడానికి సారు చేయని ప్రయత్నమంటూ లేదు. ‘ఆర్‌ఎస్‌యు నుండి ఆర్‌ఎస్‌ఎస్ దాకా ఎవ

Featured Articles