సారు ఆశించిన సుపరిపాలన ఇదే


Sat,August 5, 2017 11:24 PM

అంధకారంలో మగ్గుతుందనుకున్న తెలంగాణను అనతి కాలంలోనే పవర్‌కట్ లులేని రాష్ట్రంగా మార్చడం, గత రెండేళ్ళుగా సుమా రు 19 శాతం ఆర్థిక ప్రగతిని సాధించి దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలుపడం ముఖ్యమం త్రి కేసీఆర్ సమర్థతకు నిదర్శనం. కొత్తరూపును సంతరించుకుంటున్న తెలంగాణ వర్తమానం, భవిష్యత్తు చిత్రపటాన్ని కనులారా వీక్షించి ఉంటే జయశంకర్ సారు ఎంతో ఆనందించి ఉండేవారో!

jayashekar
తెలంగాణ మార్గదర్శి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 83వ జయంతిని నేడు రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. విద్యార్థి దశ నుంచి ఆఖరి శ్వాస దాకా జయశంకర్ తెలంగాణే ధ్యాసగా జీవించారు. 1952 లో నాన్-ముల్కీ గోబ్యాక్ ఉద్యమం నుంచి 2010-11 లలో తెలంగాణ జాయింట్ యాక్ష న్ కమిటీ ఆందోళనల వరకు, ఫజల్ అలీ ఆధ్వర్యంలోని రాష్ర్టాల పునర్విభజన కమిషన్ (19 54) నుంచి శ్రీకృష్ణ కమిటీ (2010) వరకు, మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నుంచి సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్ వరకు, కొండా వెంకటరంగారెడ్డి నుంచి మన ప్రియతమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వరకు నాలుగు తరాల నేతలతో కలిసి తెలంగాణ కోసం పనిచేశారు. ప్రతీ కమిషన్, కమి టీ ముందు ఎంతో సమర్థవంతంగా తెలంగాణ ప్రజల మనోభావాలను గణాంకాల ఆధారాలతో వివరించారు.

ఎప్పటి కప్పుడు నేతలకు అవసరమైన సలహాలు, సూచనలిస్తూ, ఉద్యమ దిశను నిర్దేశిస్తూ తెలంగాణ మార్గదర్శిగా నిలిచారు ప్రొఫెసర్ జయశంకర్. ఆయన ఈ లోకాన్ని వీడి అప్పుడే ఆరేళ్ళు దాటినా ఇప్పటికీ మన మధ్యే ఉన్నట్లు జ్ఞాపకాలు మన వెన్నంటే ఉన్నాయి. ఎవరు చూసినా చూడకున్నా మరికొద్ది కాలంలోనే సాక్షాత్కరించబోయే తెలంగాణ రాష్ర్టాన్ని తాను కళ్ళారా చూస్తానని, బంగారు తెలంగాణ నిర్మాణంలో తాను చురుగ్గా పాల్గొంటానని జయశంకర్ సన్నిహితులతో అనేవారు. అంతలోనే క్యాన్సర్ ఆయనను మన నుంచి దూరం చేసింది. జయశంకర్ తెలంగాణ మహోదయాన్ని కళ్ళా రా చూడలేకపోయినా, ఆయన ఆశయాలకు ప్రతిరూపంగానే బంగారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో నిర్మించబడుతున్నది. తెలంగాణ ప్రజలు సుమారు ఆరు దశాబ్దాలుగా ఏ లక్ష్యాల కోసం స్వయం పాలనను కోరుకున్నారో అవే లక్ష్యాలను గత మూడేళ్ళుగా కేసీఆర్ అమలు చేస్తున్నారు. కె.వి. రంగారెడ్డి ఆశించిన రాజకీయార్థిక సంస్కరణలు, కొండాలక్ష్మణ్ బాపూజీ స్వప్నించిన బడుగు బలహీనవర్గాల ఆర్థిక వికా సం, ప్రజాకవి కాళోజీ తపించిన సామాన్యపౌరుని హక్కులు, జయశంకర్ ఆశించిన ఆత్మగౌరవంతో కూడిన స్వయంపాలన కేసీఆర్ సారథ్యంలో విజయవంతంగా అమలు జరుగుతున్నాయి. 1997-2000 సంవత్సరాలలో వేలాదిగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ ఎంతో కలత చెందారు.

చరిత్రలో ఏనాడు బలవన్మరణాలకు పాల్పడే దౌర్భాగ్యస్థితి తెలంగాణ రైతులకు రాలేదని బాధపడేవారు. సీమాంధ్రకు అక్రమంగా తరలించబడుతున్న కృష్ణా, గోదావరి నదుల నీళ్ళు తెలంగాణ పొలాలకు మలిపిన నాడు ఈ ప్రాంత రైతులు ఆత్మహత్యలకు పాల్పపడాల్సిన అవసరం ఉండదు అని జయశంకర్ పలు ప్రసంగాల్లో అనేవారు. గత మూడేళ్ళుగా సాగునీటి రంగంలో కేసీఆర్ అనుసరిస్తున్న త్రిముఖ వ్యూహం ద్వారా జయశంకర్ స్వప్నం నిజం కాబోతున్నది. పాత ప్రాజెక్టులకు పూర్వ వైభవం తీసుకువచ్చి వాటి చరిత్రను మార్చడం, పెండింగ్ ప్రాజెక్టులకు అవసరమైన చోట రీ-డిజైనింగ్, రీ-స్ట్రక్చరింగ్ చేసి త్వరితగతిన పూర్తి చేయడం, అవసరమైన దగ్గర, అవకాశమున్న ప్రాంతంలో కొత్త ప్రాజెక్టులను, రిజర్వాయర్లను నిర్మించడం త్రిముఖ వ్యూహంలో భాగమే. మిషన్ కాకతీయ, శ్రీరాం సాగర్ పునరుజ్జీవం, కాళేశ్వరం రీ-డిజైనింగ్, డిండి, పాలమూరు-రంగారెడ్డి పథకాలు.

2014 ఎన్నికల ప్రణాళికలో టీఆర్‌ఎస్ హామీ ఇచ్చినట్లుగానే ప్రతి నియోజక వర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరివ్వడానికి శరవేగంగా ప్రాజెక్టుల నిర్మా ణం జరుగుతున్నది. పరిశ్రమల్లో మూడు షిఫ్టుల పని విధానాన్ని చూశాం. కానీ సాగునీటి ప్రాజెక్టుల దగ్గర మూడు షిఫ్టులలో 24x 7 పనులు జరుగడం తెలంగాణలో మాత్రమే చూస్తున్నాం. కోటి ఎకరాల కు సాగునీరందించాలనే కేసీఆర్ స్వప్నాన్ని రాబో యే రెండు, మూడేళ్ళలో మంత్రి హరీశ్‌రావు, వేలా ది ఇంజినీర్లు, సిబ్బంది నిజం చేయబోతున్నారు. 1998లో వాగుల్లో నిల్వవున్న కలుషితమైన నీళ్ళు తాగిన సుమారు 2500 మంది ఆదిలాబాద్ ఆదివాసీలు కలరా బారిన పడి మరణించడం జయశంకర్ చే కన్నీళ్ళు పెట్టించింది. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వా లు రక్షిత మంచినీటి పథకాలపై వేల కోట్లు ఖర్చు చేసినా ఆదివాసీ గిరిజనులు కలరా, అతిసారా, అంటువ్యాధుల బారిన పడి మరణిస్తూనే ఉన్నారు. ఈ ఉపద్రవాన్ని శాశ్వతంగా రూపుమాపే ప్రయత్న మే మిషన్ భగీరథ. పల్లెలు, తండాలు, ఆదివాసీ గూడాల్లో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అతి త్వరలో అందుబాటులోకి రానున్నది.

మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన 1996-2001 మధ్య కాలంలో వేలాది మంది తెలంగాణ యువతీ యువకులను నక్సటైట్ ముద్ర వేసి బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపడం, నెలల తరబడి రహస్య ప్రదేశాల్లో లాకప్‌లలో చిత్రహింసలకు గురి చేయడం, తప్పుడు కేసులు బనాయించి ఏళ్ళతరబడి బెయిల్ రాకుండా చేసి జైళ్ళలో నిర్బంధించడం, నక్సలైట్ల కు సహాయం చేస్తున్నారని గిరిజన గూడాలను కాలబెట్టడం, పోలీసుల ఇనుప బూట్ల చప్పుళ్ళతో భయం భయంగా పల్లెలు నిద్ర లేవడం వంటి ఘటనలు జయశంకర్‌ను తీవ్రమైన మానసికక్షోభకు గురిచేసినవి. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్. ఆర్. శంకరన్ వంటి పెద్దలతో కలిసి కన్‌సర్న్ సిటిజన్ కమిటీ తరపున రాజ్యహింసను ప్రశ్నించారు. ఇరువైపులా శాంతిని నెలకొల్పడానికి కృషి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత మూడేళ్ళలో (ఒకే ఒక్క ఎన్‌కౌంట ర్ సంఘటన తప్ప) ప్రశాంత పరిస్థితి నెలకొన్నది. పోలీసు వ్యవస్థను సమూలంగా మార్చాలన్న కేసీఆర్ ఆశయం ఆచరణ రూపం దాల్చింది. ఆవేశంతో అడవి బాట పట్టుతున్న వారెందరినో పోలీసులు పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు సత్ఫలితాన్నిస్తుండటంతో అడవి బాట పట్టాల్సిన అవసరం యువతకు కలుగడం లేదు.

ఆర్థిక శాస్ర్తాన్ని అధ్యయనం చేసి బోధించిన ప్రొఫెసర్ జయశంకర్ అణగారిన వర్గాలకు అభివృద్ధిలో వాటా లభించాలనేవారు. ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రణాళికలు అణగారినవర్గాల ఆర్థిక వికాసానికి ఎంతో దోహదపడుతున్నాయి. నేత కార్మికులకు చేయూత, సబ్సిడీపై 21 గొర్రెలు, ఉచితంగా చేప పిల్లలను చెరువుల్లో వదలడం, కల్లు దుకాణాలు తెరవడం, ఈత, తాటి చెట్ల పెంపకం, వ్యవసాయానికి పెద్దపీట, రైతు రుణాల మాఫీ, దళితులకు మూడు ఎకరాల భూమి, ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి, విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు, పారిశ్రామికవేత్తలకు రాయితీలిచ్చే టీఎస్ ప్రైడ్, వృద్ధుల, వితంతువుల, వికలాంగుల పెన్షన్ల పెంపు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు, కేసీఆర్ కిట్లు, ఆరోగ్యలక్ష్మి, దీపం పథకం, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, మున్సిపల్ కార్మికులకు అడుగకుండానే జీతాల పెంపు, తెలంగాణ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెం ట్, వెల్‌నెస్ సెంటర్లు, జర్నలిస్టుల, న్యాయవాదుల సంక్షేమనిధి, ఎం.బి.సి కార్పొరేషన్ ఏర్పాటు, మైనారిటీల సంక్షేమం, 200 లకు పైగా మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, కాలేజీలు, పారిశ్రామిక వేత్తల కోసం టీఎస్ ప్రైమ్, 12 శాతం రిజర్వేషన్ల అమలుకై కృషి యాభైశాతం సబ్సిడీపై ఆటోలు ఇలా సుమారు రెండు వందలకు పైగా సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. చదువుకు పరమార్థం ఉద్యోగం అని ఏనాడు జయశంకర్ భావించలేదు. తెలంగాణలోని సుమారు కోటి కుటుంబాల్లో కుటుంబానికొక్కరైనా చదివి ఉద్యోగాన్వేషణలో ఉన్నవారో, లేక భవిష్యత్తులో ఉద్యోగాన్ని పొందాలనే తలంపుతో చదువుకుంటున్న వారో ఉన్నారు.

prakash
వీరందరికీ ఉద్యోగాల కల్పన అనేది అసా ధ్యం. ఎవరి సామర్థ్యానికి తగినట్లు వారు స్వయం ఉపాధి కల్పన చేసుకోవాలి. ఏ దేశంలోనైనా జనాభాలో ఒక్క శాతానికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగా లు లభిస్తాయి. తెలంగాణలోని వివిధ శాఖల్లో వున్న సుమారు లక్ష ఉద్యోగాల ఖాళీలను ఈ ఐదేళ్ళలో పూర్తి చేస్తామని కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. ఈ దిశలో ఇప్పటికే వేలాది ఉద్యోగాలు భర్తీ అయి మరెన్నో నోటిఫికేషన్ల దశలో ఉన్నాయి. టీఎస్‌ఐపాస్ వంటి విధానాలను అనుసరించడం ద్వారా వేలాది పరిశ్రమలు హైదరాబాద్, తెలంగాణ జిల్లా ల్లో ఏర్పాటవుతున్నవి. ఐటీ రంగంపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టడం వలన వేలాదిమందికి పరిశ్రమల్లో ఐటీ రంగంలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తున్నవి. ఒకప్పటి కల్లోలిత ప్రాంతాల్లో తీవ్రవాద ప్రభావిత గ్రామాల్లోని యువకులు ప్రభు త్వ సహకారం పొందుతూ వ్యవసాయాన్నే జీవనాధారంగా చేసుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కొందరు విదేశీ ఉద్యోగాలు వదిలి ఆధునిక వ్యవసాయ పద్ధతులను చేపట్టుతూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అంధకారంలో మగ్గుతుందనుకున్న తెలంగాణను అనతి కాలంలోనే పవర్‌కట్ లులేని రాష్ట్రంగా మార్చడం, గత రెండేళ్ళుగా సుమా రు 19 శాతం ఆర్థిక ప్రగతిని సాధించి దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలుపడం ముఖ్యమం త్రి కేసీఆర్ సమర్థతకు నిదర్శనం. కొత్తరూపును సంతరించుకుంటున్న తెలంగాణ వర్తమానం, భవిష్యత్తు చిత్రపటాన్ని కనులారా వీక్షించి ఉంటే జయశంకర్ సారు ఎంతో ఆనందించి ఉండేవారో!
(రచయిత: తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్)
(నేడు ప్రొఫెసర్ జయశంకర్ సారు జయంతి)

856

PRAKASH V

Published: Wed,August 9, 2017 12:02 AM

శ్రీరాంసాగర్ విషాద గాథ

మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారిచే పూర్వవైభవం పొందుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుదివందేళ్ల విషాద చరిత్ర.

Published: Tue,July 11, 2017 01:32 AM

మన భగీరథుడు అలీ నవాజ్ జంగ్

కృష్ణా, గోదావరి నదులపై బ్యారేజీలు నిర్మించినందుకు బ్రిటిష్ ప్రభుత్వ మిలిటరీ ఇంజినీర్ సర్ అర్ధర్ కాటన్ 150 ఏళ్లుగా కోస్తాంధ్ర ప్రజల

Published: Sun,February 5, 2017 02:16 AM

స్వయంపాలన వెలుగులు

మూడు తరాల తెలంగాణ ప్రజలు స్వయం పాలన కోసం నీళ్ళు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం నినాదాలతో కారణజన్ముడైన(ఆచార్య జయశంకర్ మాటల్లో) కేసీఆ

Published: Tue,September 30, 2014 12:14 AM

చెరువుల పూడిక ఎంతెంత లోతు!

ఒక్కో చెరువు లేదా కుంటపై యాభై లక్షలు ఖర్చు చేస్తే మూడు లేదా నాలుగు ఎకరాల్లో కూడా పూడిక తీయడం సాధ్యపడదు. తెలంగాణలో వేలాది చెరువులు

Published: Wed,September 24, 2014 02:01 AM

ప్రజల భాగస్వామ్యంతోనే చెరువుల పునర్నిర్మాణం

చెరువుల పునర్నిర్మాణానికి ప్రభుత్వం అధికారుల సలహాలు, భాగస్వామ్యంపైనే ఆధారపడితే అది ఘోర తప్పిదమవుతుంది. గొలుసు చెరువుల నిర్మాణానికి

Published: Fri,March 21, 2014 01:32 AM

సంపూర్ణ తెలంగాణ సాధనే నేటి లక్ష్యం

సంపూర్ణ తెలంగాణ రాకుండా ఆంక్షలకు, ముంపు మండలాలను తెలంగాణ నష్టపోవడానికి కారకులు ఈ రెండు జాతీయ పార్టీల నేతలే. తెలంగాణలో గెలిచే ఈ పార

Published: Sat,October 6, 2012 04:30 PM

తెలంగాణ విలన్ కాంగ్రెసే

తమ స్వార్థపూరిత స్వభావంతో 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రానున్న ఎన్నికల్లో మట్టికరిపిం

Published: Sat,October 6, 2012 04:30 PM

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు డీవీ

తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించిన యోధుడు దేవులపల్లి వెంక నేడు ఆ మహనీయుని 27వ వర్ధంతి. సీమాంధ్ర పాలకులు తెలంగ

Published: Sat,October 6, 2012 04:29 PM

రాజీనామాలు సరే టీడీపీ వైఖరి ఏమిటి?

బస్సుయాత్రతో తమ వద్దకు వస్తున్న దేశం నేతలను ప్రజలు నిలదీసి, తెలంగాణ పై పార్టీ వైఖరిని ప్రకటించాలని కోరాలి. పార్టీ అధినేతచే ప్రధా

Published: Sat,October 6, 2012 04:29 PM

సారు లేడని మనాది వద్దు...

డిసెంబర్ తొమ్మిదిన కేంద్ర వూపభుత్వం చేసిన ప్రకటన అమలవుతదని, తెలంగాణ రాష్ట్రం తొందరగనే ఏర్పడుతుందని సారుకు నమ్మకం కుదిరింది. దీనికి

Published: Sat,October 6, 2012 04:29 PM

జనం కోసమే జయశంకర్ సారు

నాలుగు తరాలతో నడిచిన యోధుడు-2 చివరి రోజులల్ల సారును మీరు జీవితాన్ని సంపూర్ణంగా జీవించానని అనుకుంటున్నారా! అని అడిగిన. ఒక లక్ష

Published: Sat,October 6, 2012 04:28 PM

నాలుగు తరాలతో నడిచిన యోధుడు-1.

1970 నుండి 1996 దాకా తెలంగాణ ఉద్యమానికి తిరిగి ప్రాణం పోయడానికి సారు చేయని ప్రయత్నమంటూ లేదు. ‘ఆర్‌ఎస్‌యు నుండి ఆర్‌ఎస్‌ఎస్ దాకా ఎవ