మన భగీరథుడు అలీ నవాజ్ జంగ్


Tue,July 11, 2017 01:32 AM

కృష్ణా, గోదావరి నదులపై బ్యారేజీలు నిర్మించినందుకు బ్రిటిష్ ప్రభుత్వ మిలిటరీ ఇంజినీర్ సర్ అర్ధర్ కాటన్ 150 ఏళ్లుగా కోస్తాంధ్ర ప్రజలచే అపర భగీరథుడుగా కీర్తించబడుతున్నారు. ఏటా గోదావరి జిల్లాల ప్రజలు ఆయన పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ అంతకు మించి తెలంగాణలో నీటి ప్రాజెక్టులు అందించిన అలీ నవాజ్ జంగ్ పేరు మాత్రం
ఎవరికీ తెలువకుండా పోయింది!

నీటిపారుదల రంగానికే అలీ నవాజ్ కృషి పరిమితం కాలేదు. ప్రపం చ ప్రఖ్యాతి చెందిన ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనం, ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌తో పాటు హైదరాబాద్‌లోని పలు భవంతులు అలీ నవాజ్ నేతృత్వంలో, ఆయన పర్యవేక్షణలో నిర్మించినవే. ఆరు దశాబ్దాలు విస్మరించిన అలీ నవాజ్‌ను తెలంగాణ ప్రభుత్వం వెలుగులోకి తెచ్చి ఆయన జన్మదినాన్ని ఇంజినీర్స్ డేగా జరుపుకోవడానికి నిర్ణయించటం సముచితం.

nawab-ali-nawaz
కాటన్ తెలంగాణకు చేసిందేమీ లేకపోయినా ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగినందుకు ఈ ప్రాంత విద్యార్థులు తమ పాఠ్యపుస్తకాల్లో సుమారు యాభై ఏళ్లు అర్ధర్ కాటన్ గురించే చదివారు. తెలంగాణ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిన మీర్ నవాబ్ అలీ నవా జ్‌జంగ్ బహదూర్ గురించి ఈ ప్రాంత విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దాకా తెలియదు. అలీ నవాజ్ పుట్టినరోజైన జూలై 11ను తెలంగాణ ఇంజినీర్స్ డేగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన తర్వాతే ఆయన పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. అలీ నవాజ్ జంగ్ హైదరాబాద్ స్టేట్‌లో చేసిన కృషి కాటన్ కోస్తాంధ్రలో చేసిన కృషి కన్నా అనేక రెట్లు ఎక్కువ.

హైదరాబాద్ పాతబస్తీలోని శాలిబండ ప్రాంతంలో 1877 జూలై 11న జన్మించిన అలీ నవాజ్ పూర్తి పేరు మీర్ అహ్మద్ అలీ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్. ఆయన తండ్రి మీర్ వాయిజ్ అలీ నిజాం ప్రభుత్వంలోని దఫ్తర్-ఇ-ముల్కీ విభాగంలో సహాయకార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. అలీ నవాజ్ అబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌లో ప్రాథమిక విద్యనభ్యసించి 1896లో ప్రభుత్వ స్కాలర్‌షిప్‌పై ఇంగ్లండ్‌కు వెళ్లి ప్రఖ్యాత కూపర్స్ హిల్ కాలేజీలో ఇంజినీరిం గ్ చదివారు. విద్యార్థులందరిలోకెల్లా ప్రథమునిగా ఉత్తీర్ణుడై ఇంజినీరింగ్‌లోని వివిధ శాఖల్లో వివిధ మెరిట్ స్కాలర్ షిప్‌లను పొందారు.

1899లో హైదరాబాద్‌కు రాగానే నిజాం ప్రభుత్వం అలీ నవాజ్‌ను అసిస్టెంట్ ఇంజినీర్‌గా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో నియమించింది. ఆరోజుల్లో నీటిపారుదల, జల వనరుల నిర్వహణ పబ్లిక్ వర్క్స్ శాఖలో అంతర్భాగంగా ఉండేది. బాధ్యతలు చేపట్టిన తొలిరోజుల్లోనే అలీ నవాజ్ ప్రావీణ్యాన్ని అప్పటి హైదరాబాద్ చీఫ్ ఇంజినీర్ రోజ్ అలెన్ గుర్తించారు. 1901-05 మధ్య కాలంలో మెదక్ జిల్లాలోని మంజీరా నదిపై ఘన్‌పూర్ ఆనికట్, మహబూబ్‌నహర్ కెనాల్ బాధ్యతలను అలీనవాజ్ కు అప్పగించారు. 1906లో మూసీనది నెమలి కాల్వపై గతంలో నిర్మించిన కత్వను ఆసీఫ్‌నహర్ ప్రాజెక్ట్ పేరుతో పునర్నిర్మించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కూడా అలీ నవాజ్ బాధ్యతలు నిర్వహించారు. అలీ నవా జ్ ప్రావీణ్యాన్ని గుర్తించిన ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వర య్య మూసీనది వరదల నివారణ కోసం చేపట్టిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మాణ పనుల్లో కీలక బాధ్యతలు అప్పగించారు. వెంటవెంటనే పదోన్నతులు పొంది 1918లో అలీ నవా జ్ హైదరాబాద్ ప్రభుత్వంలో చీఫ్ ఇంజినీర్ బాధ్యతలు చేపట్టారు.

హైదరాబాద్ స్టేట్‌లో ఒక భారీ ప్రాజెక్టును నిర్మించాలనే ఆలోచన రాగానే మంజీరా నదిపై ప్రాజెక్టు నిర్మాణానికి అనువైన స్థలం ఎంపిక చేయాలని దిగువస్థాయి ఇంజినీర్లను ఆదేశించారు. అంతకుపూర్వం సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కాలంలోనే అలీ నవాజ్ ఘన్‌పూర్ ఆనికట్ నుంచి ఫతే నహర్ కెనాల్ నిర్మాణం చేపట్టారు. మం జీరానదిపై ప్రాజెక్టుకు అనువైన స్థలాలను దిగువస్థాయి అధికారులు ఎం పిక చేసి క్షేత్ర పర్యటనకు అలీ నవాజ్‌ను ఆహ్వానించారు. ఆ స్థలాలను పరిశీలించిన తర్వాత సంతృప్తి చెందక తానే స్వయంగా అనువైన స్థలం కోసం అన్వేషించి చివరికి ప్రస్తుత నిజాంసాగర్ డ్యాం సైట్‌ను ఎంపిక చేశారు. ఆసియా ఖండంలోనే అంతకుముందు లేనట్టి భిన్నమైన పద్ధతిలో ఈ ప్రాజెక్టును ఎనిమిదేళ్ల కాలంలో (1923-31) నిర్మించారు అలీ నవాజ్. నిజాం సాగర్ నిర్మిస్తున్న కాలంలోనే కృష్ణా నదీ పరివాహ క ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్మాణానికి పలు పథకాలను రూపొందించారు. వీటిలో ముఖ్యమైనవి తుంగభద్రా ప్రాజెక్టు, రాజోలిబండ డైవర్షన్ కెనాల్, అప్పర్ కృష్ణా, భీమా, ఏలేశ్వరం ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం కృష్ణానది పరీవాహక రాష్ర్టాలైన మైసూరు, బొంబాయి, మద్రాసు ప్రభుత్వాలతో, చీఫ్ ఇంజినీర్లతో అలీనవాజ్ పలుమార్లు చర్చ లు జరిపారు. అలీ నవాజ్‌లోని దార్శనికతను గుర్తించిన ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆయనకు ప్రభుత్వంలో నీటి పారుదల శాఖ కార్యదర్శి బాధ్యతలు కూడా అప్పగించారు. రిటైరైన తర్వాత కూడా అలీ నవాజ్‌కు ప్రభుత్వ సలహాదారు బాధ్యతలు అప్పగించారు.

అలీనవాజ్ తనకు ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను ఎంతో సమర్థంగా నిర్వహించారు. కృష్ణా నదిపై ప్రాజెక్టులను రూపకల్పన చేశారు. గోదావరి జలాలను హైదరాబాద్ రాష్ట్రంలోని నాందేడ్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ (ఖమ్మం తో కలిసి ఉన్న జిల్లా), నల్గొం డ, మెదక్ జిల్లాల్లో వినియోగించుకొని, లక్షలాది ఎకరాలను సాగులోకి తీసుకు రావడానికి గోదావరి బహుళార్థసాధక ప్రాజెక్టును రూపొందించారు. పెన్‌గంగ, దేవునూరు, ప్రాణహిత, అప్పర్ మానేరు, కడెం మొదలైన ప్రాజెక్టులను ప్రతిపాదించి ప్రణాళికలను కూడా సిద్ధం చేశారు. వీటితోపాటు 1858లో గోదావరిపై నిర్మాణ పనులు ప్రారంభమై ఇంజినీర్లు విష జ్వరాలతో మరణించడంతో నిలిచిపోయిన ఇచ్చంపల్లి ప్రాజెక్టును కూడా తిరిగి నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు.
1951 జూలై 27,28 తేదీల్లో నదీజలాల వివాదాల పరిష్కారం కోసం ఢిల్లీలో ప్రణాళికా సంఘం సంబంధిత రాష్ర్టాలతో సమావేశం నిర్వహించింది. ఇందులో కేంద్రప్రభుత్వం పై ప్రాజెక్టులన్నింటికీ నీటి కేటాయింపు లు చేసింది. ఈప్రాజెక్టులన్నీ చేపట్టాలని బూర్గుల రామకృష్ణారావు ప్రభు త్వం నిర్ణయించి ప్రణాళికా సంఘానికి ప్రతిపాదనలు కూడా పంపింది. దేవునూరు, ఏలేశ్వరం ( ఆ తర్వాత నందికొండ ప్రాజెక్టుగా పేరు మార్చి ప్రసుతం నాగార్జునసాగర్‌గా ప్రఖ్యాతి చెందింది) ప్రాజెక్టు పనులను ప్రారంభించారు.

పూర్వ హైదరాబాద్ రాష్ట్రంలో నిర్మించతలపెట్టిన ఏ ప్రాజెక్టును కూడా రాష్ర్టాల పునర్విభజన కారణంగా నిలిపివేయకూడదని స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్-1956 స్పష్టంగా (107,108 సెక్షన్లలో) పేర్కొన్నది. తెలంగాణను ఆంధ్రతో విలీనం చేసిన తర్వాత తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఆ ప్రాజెక్టులన్నీ రద్దు చేశారు. పనులు ప్రారంభించిన దేవునూరు ప్రాజెక్టును కూడా వదిలేశారు. నాగార్జునసాగర్, గోదావరి బహుళార్థసాధక ప్రాజెక్టు (పోచంపాడు-శ్రీరాంసాగర్)ల డిజైన్లు మార్చి తెలంగాణకు నష్టం జరిగేలా నిర్మించారు. బూర్గుల ప్రభు త్వం నిర్మాణాలు ప్రారంభించి చాలావరకు పనులు పూర్తి చేసిన కడెం, అప్పర్ మానేరు, రాజోలిబండ వంటి చిన్న ప్రాజెక్టులు మాత్రమే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పూర్తయ్యాయి. నవాజ్ జంగ్ బహదూర్ స్వప్నం నెరవేరి, ఆయన వేసిన ప్రణాళికలన్నీ పూర్తయి ఉంటే కోటి ఎకరాల సాగునీటి కల అరవై ఏళ్ల కిందటే నెరవేరేది. అలీ నవాజ్ దార్శనికతను అర్థం చేసుకోవడానికి ఒక్క గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టు ఉదాహరణ చాలు. ఈ ప్రాజెక్టు ద్వారా నాందేడ్ జిల్లాలో లక్ష ఎకరాలకు, మిగిలిన తెలంగాణ జిల్లాల్లో 28లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని పథకం సిద్ధం చేశా రు. ఈ ప్రాజెక్టులో అంతర్భాగంగా ఐదు ఆనకట్టలను నిర్మించాలనుకున్నారు. 1) నాందే డ్‌ప్రాజెక్టు, 2)కుష్టాపురం డ్యాం. 3)కడెం ప్రాజెక్టు. 4) పెద్దూరు రిజర్వాయర్. 5)లోయర్ మానేర్ డ్యాం.

ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం కావడంతోబాటు సమృద్ధిగా నీరు అందుబాటులో ఉన్నందున ఉత్తర తెలంగాణను గొప్ప పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి గోదావరి పారిశ్రామిక, వ్యవసాయ అభివృద్ధి ప్రణాళికను అలీ నవాజ్ జంగ్ మార్గదర్శకత్వంలో ఇ. డబ్ల్యు. స్లాటర్ కమిటీ రూపొందించి 1944లో నిజాం ప్రభుత్వానికి సమర్పించింది. రామగుండం ప్రాంత అభివృద్ధికి పునాది ఈ నివేదికే. అలీ నవా జ్ భారీ నీటి పారుదల ప్రాజెక్టులపై మాత్రమే దృష్టి పెట్టలేదు. బావుల అభివృద్ధి కోసం వెల్ సింకింగ్ డిపార్ట్‌మెంట్‌ను 1927లో ఫర్మాన్-ఇ-ముబారక్ ద్వారా నెలకొల్పి రైతులకు మేలు చేశారు. రామప్ప, లక్నవరం, పాకాల వంటి పెద్ద చెరువులన్నింటిని మరమ్మతు చేశారు. మూసీ నదిపై, ఇతర వాగులపై ఉన్న కత్వలను మరమ్మతు చేశారు. తాగునీటి కోసం గ్రామాల్లో సామూహిక బావులను తవ్వించారు.

నీటిపారుదల రంగానికే అలీ నవాజ్ కృషి పరిమితం కాలేదు. ప్రపం చ ప్రఖ్యాతి చెందిన ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనం, ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌తో పాటు హైదరాబాద్‌లోని పలు భవంతులు అలీ నవా జ్ నేతృత్వంలో, ఆయన పర్యవేక్షణలో నిర్మించినవే. ఆంధ్ర పాలనలో ఆరు దశాబ్దాలు విస్మరించిన అలీ నవాజ్‌ను తెలంగాణ ప్రభుత్వం వెలుగులోకి తెచ్చి ఆయన జయంతిని ఇంజినీర్స్ డేగా జరుపుకోవడం సముచితం. అలీ నవాజ్ చిరస్మరణీయుడు.
(వ్యాసకర్త: తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్)
(నేడు తెలంగాణ ఇంజినీర్స్ డే)
prakash

794

PRAKASH V

Published: Wed,August 9, 2017 12:02 AM

శ్రీరాంసాగర్ విషాద గాథ

మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారిచే పూర్వవైభవం పొందుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుదివందేళ్ల విషాద చరిత్ర.

Published: Sat,August 5, 2017 11:24 PM

సారు ఆశించిన సుపరిపాలన ఇదే

అంధకారంలో మగ్గుతుందనుకున్న తెలంగాణను అనతి కాలంలోనే పవర్‌కట్ లులేని రాష్ట్రంగా మార్చడం, గత రెండేళ్ళుగా సుమా రు 19 శాతం ఆర్థిక ప్రగత

Published: Sun,February 5, 2017 02:16 AM

స్వయంపాలన వెలుగులు

మూడు తరాల తెలంగాణ ప్రజలు స్వయం పాలన కోసం నీళ్ళు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం నినాదాలతో కారణజన్ముడైన(ఆచార్య జయశంకర్ మాటల్లో) కేసీఆ

Published: Tue,September 30, 2014 12:14 AM

చెరువుల పూడిక ఎంతెంత లోతు!

ఒక్కో చెరువు లేదా కుంటపై యాభై లక్షలు ఖర్చు చేస్తే మూడు లేదా నాలుగు ఎకరాల్లో కూడా పూడిక తీయడం సాధ్యపడదు. తెలంగాణలో వేలాది చెరువులు

Published: Wed,September 24, 2014 02:01 AM

ప్రజల భాగస్వామ్యంతోనే చెరువుల పునర్నిర్మాణం

చెరువుల పునర్నిర్మాణానికి ప్రభుత్వం అధికారుల సలహాలు, భాగస్వామ్యంపైనే ఆధారపడితే అది ఘోర తప్పిదమవుతుంది. గొలుసు చెరువుల నిర్మాణానికి

Published: Fri,March 21, 2014 01:32 AM

సంపూర్ణ తెలంగాణ సాధనే నేటి లక్ష్యం

సంపూర్ణ తెలంగాణ రాకుండా ఆంక్షలకు, ముంపు మండలాలను తెలంగాణ నష్టపోవడానికి కారకులు ఈ రెండు జాతీయ పార్టీల నేతలే. తెలంగాణలో గెలిచే ఈ పార

Published: Sat,October 6, 2012 04:30 PM

తెలంగాణ విలన్ కాంగ్రెసే

తమ స్వార్థపూరిత స్వభావంతో 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రానున్న ఎన్నికల్లో మట్టికరిపిం

Published: Sat,October 6, 2012 04:30 PM

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు డీవీ

తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించిన యోధుడు దేవులపల్లి వెంక నేడు ఆ మహనీయుని 27వ వర్ధంతి. సీమాంధ్ర పాలకులు తెలంగ

Published: Sat,October 6, 2012 04:29 PM

రాజీనామాలు సరే టీడీపీ వైఖరి ఏమిటి?

బస్సుయాత్రతో తమ వద్దకు వస్తున్న దేశం నేతలను ప్రజలు నిలదీసి, తెలంగాణ పై పార్టీ వైఖరిని ప్రకటించాలని కోరాలి. పార్టీ అధినేతచే ప్రధా

Published: Sat,October 6, 2012 04:29 PM

సారు లేడని మనాది వద్దు...

డిసెంబర్ తొమ్మిదిన కేంద్ర వూపభుత్వం చేసిన ప్రకటన అమలవుతదని, తెలంగాణ రాష్ట్రం తొందరగనే ఏర్పడుతుందని సారుకు నమ్మకం కుదిరింది. దీనికి

Published: Sat,October 6, 2012 04:29 PM

జనం కోసమే జయశంకర్ సారు

నాలుగు తరాలతో నడిచిన యోధుడు-2 చివరి రోజులల్ల సారును మీరు జీవితాన్ని సంపూర్ణంగా జీవించానని అనుకుంటున్నారా! అని అడిగిన. ఒక లక్ష

Published: Sat,October 6, 2012 04:28 PM

నాలుగు తరాలతో నడిచిన యోధుడు-1.

1970 నుండి 1996 దాకా తెలంగాణ ఉద్యమానికి తిరిగి ప్రాణం పోయడానికి సారు చేయని ప్రయత్నమంటూ లేదు. ‘ఆర్‌ఎస్‌యు నుండి ఆర్‌ఎస్‌ఎస్ దాకా ఎవ

Featured Articles