స్వయంపాలన వెలుగులు


Sun,February 5, 2017 02:16 AM

మూడు తరాల తెలంగాణ ప్రజలు స్వయం పాలన కోసం నీళ్ళు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం నినాదాలతో కారణజన్ముడైన(ఆచార్య జయశంకర్ మాటల్లో) కేసీఆర్ సారథ్యంలో ఉద్యమించి వివిధ పార్టీల నాయకులను, దేశాధినేతలను ఒప్పించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నారు.

అంధకార పాలనను అంతమొందించి స్వయం పాలన వెలుగులను అందిస్తున్న ప్రజానుకూల పాలనను గుర్తించనిరాకరించడం, అసహనంతో నిందలకు దిగడం, ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడం మార్పు కోరేవారికి తగదు.


ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి గా పాలనాబాధ్యతలు చేపట్టినప్పుడు ప్రజలను ప్రగతి పథంలో ఎలా నడిపించవచ్చో కేసీఆర్ రుజువు చేస్తున్నారు.గత రెండున్నరేండ్ల తెరాస పాలనాతీరును పరిశీలిస్తే తెలంగాణ దశ-దిశ, వికాసంవైపు తొలి అడుగులు అర్థమవుతాయి. యాభై ఏడేండ్ల వలస పాలనలో భాష-యాస పేరుతో ఇక్కడి ప్రజలను అనేక రకాలుగా అవమానించారు. గత ప్రభుత్వాలు నిర్మించ సంకల్పించిన, ప్రణాళికా సంఘం ఆమోదం పొందిన పలు తెలంగాణ సాగునీ టి ప్రాజెక్టులను రద్దుచేశారు. గతంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయించకుండా వివ క్ష చూపారు. ఉద్దేశపూర్వకంగానే వేలాది చెరువులు, కుంట లు పూడికతో నిండి గండ్లు పడేలా చేశారు. ఫలితంగా స్వయం పోషకంగా శతాబ్దాల పాటు విలసిల్లిన తెలంగాణ పల్లెలు దారిద్య్రానికి ఆకలి చావులకు, ఆత్మహత్యలకు, వలసలకు నెలవై జీవాన్ని కోల్పోయాయి.

పల్లెల్లో జీవించలేక పట్టణాలకు వలసవచ్చిన వారికి పనులు లభించే అవకాశాలున్నా.. అనేక పరిశ్రమలను ఆం ధ్రా పాలకులు మూసేయడంతో తెలంగాణ గ్రామీణ యువకులు గల్ఫ్ బాట పట్టారు. తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలను, ఉన్నత విద్యా సంస్థల్లోని సీట్లను ఆంధ్ర ప్రాంత యువత కబళించడంతో తెలంగాణ యువతీయువకులు అశాంతికి, ఆందోళనకు గురై ఉద్యమ బాట పట్టా రు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్యాయాలకు తెరపడింది. ఉద్యమ కాలంలో ప్రజలతో మమేకమై వారి బాధలను అర్థం చేసుకున్న ఎందరో నేతలు వివిధ శాఖల కు మంత్రులుగా బాధ్యతలు చేపట్టి కేసీఆర్ సారథ్యంలో దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు.
తెలంగాణ ప్రజలు తప్పనిసరిగా అధికారాన్ని ఇస్తారనే దృఢసంకల్పంతోనే తెలంగాణ రాష్ట్ర సమితి తన ఎన్నికల ప్రణాళికను రచించి ప్రజల ముందుపెట్టింది. బంగారు తెలంగాణ నిర్మాణం లక్ష్యంతో కేసీఆర్ ఆలోచనలకు అద్దం పట్టిన మ్యానిఫెస్టోను ఆవిష్కరించింది.

ప్రభు త్వ ఏర్పాటు తర్వాత మ్యానిఫెస్టోలో పొందుపరిచిన హామీ ల ను అమలు జరుపుతున్నది. పల్లె కన్నీటికి, వృత్తులు అంతరించిపోవడానికి, రైతుల ఆత్మహత్యలకు కారణం గ్రహించి సీఎం కేసీఆర్ సాగునీటి వనరులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గత మూడు బడ్జెట్లలో మిషన్ కాకతీయ, పెం డింగ్ ప్రాజెక్టులకు, కొత్త ప్రాజెక్టులకు అత్యధిక నిధులు కేటాయించారు. లో ఓల్టేజీతో, కరెంటు కొరతతో బోర్లు, బావుల కింది రైతాంగం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితిని గమనించిన కేసీఆర్ విద్యుదుత్పాదనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తొలి ఏడా దే నాణ్యమైన విద్యుత్తును రైతులకు అందించింది. రుణమాఫీ భారం సుమారు 20 వేల కోట్లు ఉండగలదని అం చనా ఉన్నా ఏ మాత్రం వెనుకంజవేయక అధికారం చేపట్టగానే ఇచ్చిన హామీ ప్రకారం ఈ ప్రభుత్వం నెరవేర్చింది.

తెరాస ప్రభుత్వం వ్యవసాయరంగం, సాగునీటి కల్పనకు ఇస్తున్న ప్రాధాన్యంతోనే దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయి. రెండున్నరేండ్ల తెరా స పాలనలో తొలి రెండేళ్ళు దారుణమైన కరువు నెలకొన్నా ఇటీవలి వర్షాలకు ప్రాజెక్టులు, చెరువులు నిండి, బావులు, బోర్లలో సమృద్ధిగా నీరు చేరింది. రైతుల్లో ఆశలు చిగురిం చాయి. నైపుణ్యం, ప్రతిభ ఉన్న ఎందరో ఐటీ ఉద్యోగులు ఇటీవల వ్యవసాయరంగంపై మక్కువచూపి బంగారు పం టలు పండిస్తూ లాభాలను ఆర్జించడం మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్రంలోని లక్షలాది నిరుద్యోగులకు ఈ ఐటీ రైతులు మార్గదర్శకం కావాలి.

సత్వర పారిశ్రామికాభివృద్ధి, వృత్తివిద్యా కోర్సుల్లో శిక్ష ణ, ఈ-కామర్స్, డైరెక్ట్ సెల్లింగ్ రంగాన్ని ప్రోత్సహించడం వంటి చర్యల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఎన్నికల ప్రణాళికలో స్పష్టం చేశా రు. టీఎస్‌ఐపాస్ ద్వారా అనేక పరిశ్రమలు తెలంగాణలో ఇప్పటికే ప్రారంభమై సుమారు 35 వేల మందికి ఉపాధి కల్పించాయి. టీఎస్‌పీఎస్సీ ద్వారా, సింగరేణి, విద్యుత్ రం గం, పోలీసు శాఖ, ఇతర శాఖల ద్వారా మరో ముప్పై వేల ప్రభుత్వోద్యోగాల కల్పన ఇప్పటికే జరిగింది. మరో డ్బ్భై వేల ఉద్యోగ ఖాళీలను భర్తీచేసే ప్రక్రియకు ఉపాధ్యా పోస్టు ల నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాబోయే రెండేళ్లలో ఈ లక్ష్యాన్ని పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు.
ప్రభుత్వ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌పై నిందలు వేయడమే పనిగా పెట్టుకున్న ప్రతిపక్షాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రజానుకూల పాలన సాగుతున్నా ఆయనపై నిం దల వర్షం నేటికీ కొనసాగిస్తూనే ఉన్నాయి.

తమ స్వప్రయోజనాల కోసం అసంతృప్తితో ఉన్న నిరుద్యోగులను రెచ్చగొ ట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కొందరు మేధావులు, ఉద్యమకారులు ప్రజాపక్షం అంటూ ఈ రాజకీయపక్షాలతో గొంతుకలుపడం విచారకరం.ఒక్కో మేధావికి, ఒక్కో రాజకీయ పార్టీకి రాష్ట్ర అభివృద్ధి పట్ల తమదైన స్వంత అభివృద్ధి నమూనాలుండవచ్చు. వారు సమాజాన్ని చూసే కోణం నుంచి, వారి స్వంత అనుభవాల నుంచి ఈ అభివృద్ధి నమూనాలు రూపుదిద్దుకొని ఉండవచ్చు. తమ ఆలోచనల ప్రకారం ఈ ప్రభుత్వం పని చేయాలని, ఏ మేధావి, ఏ పార్టీ అనుకున్నా అది ఆచరణ సాధ్యం కాదు. తమదైన అభివృద్ధి నమూనాను ప్రజల ముందుపెట్టి, వారి ఆమోదం పొంది అధికారం చేపట్టినప్పుడు మాత్రమే వారనుకున్న రీతిలో పాలన సాగిస్తారు.
ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చి ఆచరణలో ఆ హామీలకు భిన్నంగా ఈ ప్రభుత్వం వ్యవహరించినప్పుడు ఆ అం శాలపై ప్రశ్నించడం తప్పుకాదు. ప్రజలు కూడా హర్షిస్తారు. అది కాకుండా రంధ్రాన్వేషణే లక్ష్యంగా అసంతృప్తి వాదులను కూడగట్టి ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని నిందలు వేసినా అది ప్రజాపక్షం అనిపించుకోదు. అంధకార పాలనను అంతమొందించి స్వయం పాలన వెలుగులను అందిస్తున్న ప్రజానుకూల పాలనను గుర్తించనిరాకరించడం, అసహనంతో నిందలకు దిగడం, ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడం మార్పు కోరేవారికి తగదు. వికాసానికి బాసటగా నిలువడం మేధావులకు శోభనిస్తుంది.
Prakash

1225

PRAKASH V

Published: Wed,August 9, 2017 12:02 AM

శ్రీరాంసాగర్ విషాద గాథ

మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారిచే పూర్వవైభవం పొందుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుదివందేళ్ల విషాద చరిత్ర.

Published: Sat,August 5, 2017 11:24 PM

సారు ఆశించిన సుపరిపాలన ఇదే

అంధకారంలో మగ్గుతుందనుకున్న తెలంగాణను అనతి కాలంలోనే పవర్‌కట్ లులేని రాష్ట్రంగా మార్చడం, గత రెండేళ్ళుగా సుమా రు 19 శాతం ఆర్థిక ప్రగత

Published: Tue,July 11, 2017 01:32 AM

మన భగీరథుడు అలీ నవాజ్ జంగ్

కృష్ణా, గోదావరి నదులపై బ్యారేజీలు నిర్మించినందుకు బ్రిటిష్ ప్రభుత్వ మిలిటరీ ఇంజినీర్ సర్ అర్ధర్ కాటన్ 150 ఏళ్లుగా కోస్తాంధ్ర ప్రజల

Published: Tue,September 30, 2014 12:14 AM

చెరువుల పూడిక ఎంతెంత లోతు!

ఒక్కో చెరువు లేదా కుంటపై యాభై లక్షలు ఖర్చు చేస్తే మూడు లేదా నాలుగు ఎకరాల్లో కూడా పూడిక తీయడం సాధ్యపడదు. తెలంగాణలో వేలాది చెరువులు

Published: Wed,September 24, 2014 02:01 AM

ప్రజల భాగస్వామ్యంతోనే చెరువుల పునర్నిర్మాణం

చెరువుల పునర్నిర్మాణానికి ప్రభుత్వం అధికారుల సలహాలు, భాగస్వామ్యంపైనే ఆధారపడితే అది ఘోర తప్పిదమవుతుంది. గొలుసు చెరువుల నిర్మాణానికి

Published: Fri,March 21, 2014 01:32 AM

సంపూర్ణ తెలంగాణ సాధనే నేటి లక్ష్యం

సంపూర్ణ తెలంగాణ రాకుండా ఆంక్షలకు, ముంపు మండలాలను తెలంగాణ నష్టపోవడానికి కారకులు ఈ రెండు జాతీయ పార్టీల నేతలే. తెలంగాణలో గెలిచే ఈ పార

Published: Sat,October 6, 2012 04:30 PM

తెలంగాణ విలన్ కాంగ్రెసే

తమ స్వార్థపూరిత స్వభావంతో 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రానున్న ఎన్నికల్లో మట్టికరిపిం

Published: Sat,October 6, 2012 04:30 PM

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు డీవీ

తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించిన యోధుడు దేవులపల్లి వెంక నేడు ఆ మహనీయుని 27వ వర్ధంతి. సీమాంధ్ర పాలకులు తెలంగ

Published: Sat,October 6, 2012 04:29 PM

రాజీనామాలు సరే టీడీపీ వైఖరి ఏమిటి?

బస్సుయాత్రతో తమ వద్దకు వస్తున్న దేశం నేతలను ప్రజలు నిలదీసి, తెలంగాణ పై పార్టీ వైఖరిని ప్రకటించాలని కోరాలి. పార్టీ అధినేతచే ప్రధా

Published: Sat,October 6, 2012 04:29 PM

సారు లేడని మనాది వద్దు...

డిసెంబర్ తొమ్మిదిన కేంద్ర వూపభుత్వం చేసిన ప్రకటన అమలవుతదని, తెలంగాణ రాష్ట్రం తొందరగనే ఏర్పడుతుందని సారుకు నమ్మకం కుదిరింది. దీనికి

Published: Sat,October 6, 2012 04:29 PM

జనం కోసమే జయశంకర్ సారు

నాలుగు తరాలతో నడిచిన యోధుడు-2 చివరి రోజులల్ల సారును మీరు జీవితాన్ని సంపూర్ణంగా జీవించానని అనుకుంటున్నారా! అని అడిగిన. ఒక లక్ష

Published: Sat,October 6, 2012 04:28 PM

నాలుగు తరాలతో నడిచిన యోధుడు-1.

1970 నుండి 1996 దాకా తెలంగాణ ఉద్యమానికి తిరిగి ప్రాణం పోయడానికి సారు చేయని ప్రయత్నమంటూ లేదు. ‘ఆర్‌ఎస్‌యు నుండి ఆర్‌ఎస్‌ఎస్ దాకా ఎవ

Featured Articles