చెరువుల పూడిక ఎంతెంత లోతు!


Tue,September 30, 2014 12:14 AM

ఒక్కో చెరువు లేదా కుంటపై యాభై లక్షలు ఖర్చు చేస్తే మూడు లేదా నాలుగు ఎకరాల్లో కూడా పూడిక తీయడం సాధ్యపడదు. తెలంగాణలో వేలాది చెరువులు 50 ఎకరాలు అంతకన్న ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నవే. పారటో నియమం(80: 20) ప్రకారం తెలంగాణలోని పదివేల గ్రామాల్లో వూరికో పెద్ద చెరువును
ఎంచుకొని దానిపై సుమారు రెండుకోట్ల రూపాయల అంచనాలతో పనులను చేపట్టితే
ఏడాదికి రెండువేల చెరువుల పునరుద్ధరణ సాధ్యం.

తెలంగాణను పాలించిన రాజులెందరో ఉన్నారు. జనజీవన వికాసానికి, ఆర్థిక ప్రగతికి దోహదపడిన చెరువుల ను, కుంటలను నిర్మించిన కాకతీయులను, కుతుబ్‌షాహీలను, మీర్ మహబూబ్ అలీఖాన్ బహుదుర్(6వ నిజాం), మీర్ ఉస్మాన్ అలీఖాన్ (7వ నిజాం), చాందాను పాలించిన గోండు రాజు హీర్షాను, కర్ణాటకలో చెరువులను తవ్విన చోళులను, శ్రీకృష్ణదేవరాయలను, తమిళనాడులో ఏడో శతాబ్దిలోనే చెరువులను నిర్మించిన పల్లవరాజులను ప్రజలు సదా స్మరించుకుంటూనే ఉన్నారు. ధ్వంసమైన గొలుసు చెరువుల పునర్నిర్మాణం కోసం చిత్తశుద్ధితో కార్యాచరణకు పూనుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఖ్యాతి కూడా దశ దిశలు విస్తరించి రానున్న తరాలు ఆయన్ని గుర్తు చేసుకుంటాయి.

వలస దోపిడీకి గురై ఆత్మహత్యలు, ఆకలి చావు లు, వలసలు, నిరుద్యోగం, అనారోగ్యంతో జీవచ్ఛవాలై బతుకులీడుస్తున్న తెలంగాణ జనానికి ఊరట ను, భవిష్యత్తుపై నమ్మకాన్ని, ఆశలను కల్పించే మహాసంకల్పం ఈ చెరువుల పునర్నిర్మాణం.45 వేల కు పైగా ఉన్న చెరువులను, కుంటలను బాగు చేయాలనే సంకల్పం గొప్పది. ఏనాడూ ఒక్క చెరువు రిపేరుకు కనీసం 5 లక్షల రూపాయలను ఖర్చు పెట్టిన దాఖలాల్లేవు.

అటువంటిది ఒక్కో చెరువుకు యాభై లక్షలకు పైగా ఖర్చు చేసి బాగు చేయాలనే ముఖ్యమంత్రి ఆలోచనకు జనమంతా నీరాజనాలు పడుతున్నారు. సుమారు 22,500 కోట్లు రానున్న ఐదేళ్లలో ఖర్చుచేసి చెరువులన్నిటినీ బాగు చేస్తానన్న ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిజం చేయాల్సిన బాధ్య త అధికారులపై,ప్రజలపై ఉన్నది. ఎంత మంచి లక్ష్యమైనా ప్రజల భాగస్వామ్యం లేనిదే నెరవేరదు. వూరి చెరువును బాగు చేసుకోవాలంటే దానివలన లాభపడే జనమంతా ఉద్యమస్ఫూర్తితో పాల్గొనాలి. చెరువుల పునర్నిర్మాణానికి , బంగారు తెలంగాణకు అంకితమైన ముఖ్యమంత్రికి, నీటిపారుదల అధికారులకు ఫ్రీడం సంస్థ అనుభవాలు ఎంతో ఉపకరిస్తాయి. ఒడిశా, కర్ణాటకలో చెరువుల పునర్నిర్మాణంలో రెండు దశాబ్దాలుగా అంకితభావంతో పనిచేస్తున్న మహిళల ( గ్రామ వికాస్ సంస్థ), కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన, ప్రపంచ బ్యాంకు నిధుల్లో సుమారు యాభై శాతం ఆదా చేసిన జల సంవర్ధని యోజన సంఘ్ అనుభవాలు కూడా అధ్యయనం చేయాలి.

తెలంగాణలోని ఏ చెరువు చూసినా ఒకటి నుంచి మూడు మీటర్ల లోతు పూడిక నిండింది. సగటున రెండు మీటర్లు అనుకున్నా ఎకరం చెరువు లోతట్టు లో పూడిక తీయాలంటే 8 వేల క్యూబిక్ మీటర్ల మట్టి ని తవ్వి తీయాలి. తెలంగాణలో వంద ఎకరాలకు మించి సాగునీరిచ్చే ఏ చెరువు చూసినా 100 ఎకరాల నుంచి సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నవి. చెరువంతా పూడిక తీయడం వీలుకాకున్నా కనీసం ఒక్కో పెద్ద చెరువులో 50 ఎకరాల్లో రెండుమీటర్ల లోతు పూడికైనా తీయాల్సి ఉంటుంది. ఎకరానికి 8 వేల క్యూబిక్ మీటర్ల పూడికను ప్రామాణికంగా తీసుకుంటే 50 ఎకరాల్లో 4 లక్షల సీఎంటీ పూడిక తీయాల్సి వస్తుంది. ఒక సీఎంటీ పూడిక మట్టి తీయడానికి జేసీబీతో తవ్వడానికయ్యే ఖర్చు యాభై రూపాయలు. ఆ మట్టిని ట్రాక్టర్లలో రైతుల పొలాల కు చేర్చాలి. చెరువు లోతట్టు నుంచి రైతుల పొలాలు కనీసం రెండు నుంచి ఐదారు కిలోమీటర్ల దూరం ఉంటాయి. ఈ దూరానికి ట్రాక్టరు కిరాయి ఒక్కో ట్రిప్పుకు సుమారు 250 రూపాయలు. ఒక ట్రాక్టర్ లో 2.5 సీఎంటీల పూడిక మట్టిని నింపవచ్చు.

అంటే 2.5 సీఎంటీల పూడిక తీతకయ్యే ఖర్చు 300 రూపాయలు. ఒక్క క్యూబిక్ మీటర్‌కు 120 రూపాయలు అనుకుంటే 4 లక్షల సీఎంటీల పూడిక తీత, సరఫరా ఖర్చు నాలుగుకోట్ల ఎనభై లక్షలు. ఒక ఎకరంలో పూడిక, సరఫరా ఖర్చు సుమారు పదిలక్షల రూపాయలు. సగటున ఒక పెద్ద చెరువు రెండువందల ఎకరాలుగా లెక్కకట్టితే కనీసం పదోవంతు 20 ఎకరాల్లో రెండు మీటర్ల పూడికతీసినా ఒక్కో చెరువుకు రెండు కోట్లు ఖర్చువుతుంది. కేవలం పూడికతీతే కాకుండా చెరువు పునర్నిర్మాణంలో భాగమైన చెరువు కట్ట, తూము, పంట కాల్వ, మత్తడి, కట్టుకాల్వలు, శికం, కంప తొలగింపు, భూమికోత నివారణ, చెక్‌డ్యాంల నిర్మాణం, చెట్ల పెంపకం వంటి పనులకు కనీసం ఇర వై లక్షల ఖర్చు ఉంటుంది. అంతా కలిపి రెండు కోట్ల తో సరిపెడదామనుకున్నా ఐదేళ్ళలో 22, 500 కోట్లు ఖర్చు చేస్తే ఒక మేరకు బాగుపడే చెరువుల సంఖ్య 11,250 మాత్రమే, ఇంజనీర్లకు ముఖ్యమంత్రి కల్పిస్తామన్న ల్యాప్‌టాప్ వంటి సౌకర్యాల ఖర్చును దీనిలో నుంచి మినహాయిస్తే ఐదేళ్ళలో ఎక్కువలో ఎక్కువ పదివేల చెరువుల పునరుద్ధరణ సాధ్యపడుతుంది.

ఇటాలియన్ ఆర్థికవేత్త విల్‌ఫ్రెడ్ పారెటో నియమాన్ని (80: 20) చెరువులకు వర్తింపచేస్తే 80 శాతం కుంటలు 20 శాతం ఆయకట్టుకు నీరిసే,్త 20 శాతం చెరువులు 80 శాతం ఆయకట్టుకు నీరందిస్తున్నాయి. ముఖ్యమంత్రి ప్రకటించిన చెరువుల బడ్జెట్ ను 80 శాతం ఆయకట్టుకు నీరందించే 20 శాతం చెరువులపై ఖర్చు చేస్తే ఉపయోగం ఉంటుంది. ఏ పనిలోనైనా ప్రాధాన్యాలను ఎంచుకోవాలి. ఒకవేళ 22, 500 కోట్ల బడ్జెట్‌ను 45 వేల చెరువులు, కుంటలపై సమానంగా ఖర్చు చేయాలనుకుంటే ఆశించిన ఫలితాలు రావని ఫ్రీడం, గ్రామవికాస్ స్వచ్ఛంద సంస్థల అనుభవాలు తేటతెల్లం చేస్తున్నాయి.

ఒక్కో చెరువు లేదా కుంటపై యాభై లక్షలు ఖర్చు చేస్తే మూడు లేదా నాలుగు ఎకరాల్లో కూడా పూడిక తీయడం సాధ్యపడదు. తెలంగాణలో వేలాది చెరువులు 50 ఎకరాలు అంతకన్న ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నవే. పారటో నియమం(80: 20) ప్రకారం తెలంగాణలోని పదివేల గ్రామాల్లో వూరికో పెద్ద చెరువును ఎంచుకొని దానిపై సుమారు రెండుకోట్ల రూపాయల అంచనాలతో పనులను చేపట్టితే ఏడాదికి రెండువేల చెరువుల పునరుద్ధరణ సాధ్యం.

కర్ణాటకలో నాలుగేళ్ళ క్రితం 36 వేల చెరువులన్నింటినీ పునర్నిర్మాణం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ బడ్జెట్, ఇతర సాధ్యాసాధ్యాలను పరిశీలించి, ఐదు వేల చెరువులను ఎంచుకొని ఏడాదికి వెయ్యి చెరువులను చేపట్టారు. తెలంగాణలో కూడా సమస్యలను అధ్యయనం చేసి, ప్రజల్లో భాగస్వాములయ్యే చైతన్యాన్ని పెంచిన తర్వాతే ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటా యి. ఏకకాలంలో (మార్చి- మే )నెలల్లో రెండువేల గ్రామాల్లో పూడికతీత పనులకు పెద్ద మొత్తంలో ట్రాక్టర్లు, జేసీబీలు అవసరం. పూడిక తీత 60 రోజుల్లో పూర్తి చేయాలనుకుంటే ఎన్ని ట్రాక్టర్లు, జేసీబీలు కావాలో చూద్దాం. ఒక ట్రాక్టరులో 2.50 సీఎంటీ పూడిక మట్టిని సరఫరా చేయవచ్చు. ఒక ఎకరంలో 8 వేల సీఎంటీల పూడిక తీయాలి. అంటే ఒక ఎకరంలో 3200 ట్రాక్టర్ లోడ్ పూడిక మట్టి వస్తుంది. రోజుకు ఒక ట్రాక్టర్ 20 ట్రిప్పులు చేస్తే 60 రోజుల్లో 1200 ట్రిప్పులు చేస్తుంది. ఎకరానికి సుమారు మూడు ట్రాక్టర్లు కావాలి. అంటే 20 ఎకరాలలో పూడిక మట్టి (1,60,000 సీఎంటీ) తీయడానికి 60 ట్రాక్టర్లు కావాలి. మొత్తం రెండు వేల చెరువుల్లో పూడిక సరఫరాకు (60 x 2000= 1, 20, 000) ట్రాక్టర్లు కావాలి. తెలంగాణలో ఉన్న ట్రాక్టర్ల సంఖ్య 75 వేల లోపే.

prakesh వీటిలో కొన్ని పనిచేయకపోవచ్చు. మరికొన్నింటిని రైతులు స్వంతానికి వాడుకోవచ్చు. కనీసం 60 వేల ట్రాక్టర్లు లభించినా, సగం అవసరాన్నే తీర్చగలవు. జేసీబీల పరిస్థితి ఇలా గే ఉంటుంది. ఒక జేసీబీ రోజుకు 10 గంటల్లో 500 సీఎంటీల పూడిక తీస్తుంది. 60 రోజులకు 30, 000 వేల సీఎంటీల పూడిక తీస్తుంది. 20 ఎకరాల్లో 1, 80, 000 సీఎంటీల పూడిక తీయడానికి కనీసం 5 జేసీబీలు కావాలి. 2000 చెరువులకు 10 వేల జేసీబీలు అవసరం.

తెలంగాణలో వర్కింగ్ కండిషన్‌లో ఉన్న జేసీబీల సంఖ్య సుమారు నాలుగు వేలు. ఆంధ్రప్రదేశ్‌లో వున్నవి మరో ఐదు వేలు. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున చెరువుల పూడిక తీత పనులు కొనసాగుతున్నందున అక్కడి జేసీబీలు మనకు లభించకపోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వున్న అన్ని జేసీబీలను ఎంగేజ్ చేసినా రెండువేల చెరువుల్లో పూడిక తీయడానికే చాలవు. కానీ ఏడాదికి 9 వేల చెరువుల్లో పూడిక తీతకు ఇరిగేషన్ అధికారులు ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రుల సబ్ కమిటీ ఇంకా నిపుణుల, ప్రజాసంఘాల, స్వచ్ఛంద సంస్థల సలహాలు కూడా తీసుకోలేదు. ముఖ్యమంత్రి గారి మహా సంకల్పాన్ని ప్రారంభించడంలో అధికారులకు తొందరపాటు పనికిరా దు. దీనిపై విస్తృత అధ్యయనం చర్చ జరగాలి.


1382

PRAKASH V

Published: Wed,August 9, 2017 12:02 AM

శ్రీరాంసాగర్ విషాద గాథ

మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారిచే పూర్వవైభవం పొందుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుదివందేళ్ల విషాద చరిత్ర.

Published: Sat,August 5, 2017 11:24 PM

సారు ఆశించిన సుపరిపాలన ఇదే

అంధకారంలో మగ్గుతుందనుకున్న తెలంగాణను అనతి కాలంలోనే పవర్‌కట్ లులేని రాష్ట్రంగా మార్చడం, గత రెండేళ్ళుగా సుమా రు 19 శాతం ఆర్థిక ప్రగత

Published: Tue,July 11, 2017 01:32 AM

మన భగీరథుడు అలీ నవాజ్ జంగ్

కృష్ణా, గోదావరి నదులపై బ్యారేజీలు నిర్మించినందుకు బ్రిటిష్ ప్రభుత్వ మిలిటరీ ఇంజినీర్ సర్ అర్ధర్ కాటన్ 150 ఏళ్లుగా కోస్తాంధ్ర ప్రజల

Published: Sun,February 5, 2017 02:16 AM

స్వయంపాలన వెలుగులు

మూడు తరాల తెలంగాణ ప్రజలు స్వయం పాలన కోసం నీళ్ళు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం నినాదాలతో కారణజన్ముడైన(ఆచార్య జయశంకర్ మాటల్లో) కేసీఆ

Published: Wed,September 24, 2014 02:01 AM

ప్రజల భాగస్వామ్యంతోనే చెరువుల పునర్నిర్మాణం

చెరువుల పునర్నిర్మాణానికి ప్రభుత్వం అధికారుల సలహాలు, భాగస్వామ్యంపైనే ఆధారపడితే అది ఘోర తప్పిదమవుతుంది. గొలుసు చెరువుల నిర్మాణానికి

Published: Fri,March 21, 2014 01:32 AM

సంపూర్ణ తెలంగాణ సాధనే నేటి లక్ష్యం

సంపూర్ణ తెలంగాణ రాకుండా ఆంక్షలకు, ముంపు మండలాలను తెలంగాణ నష్టపోవడానికి కారకులు ఈ రెండు జాతీయ పార్టీల నేతలే. తెలంగాణలో గెలిచే ఈ పార

Published: Sat,October 6, 2012 04:30 PM

తెలంగాణ విలన్ కాంగ్రెసే

తమ స్వార్థపూరిత స్వభావంతో 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రానున్న ఎన్నికల్లో మట్టికరిపిం

Published: Sat,October 6, 2012 04:30 PM

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు డీవీ

తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించిన యోధుడు దేవులపల్లి వెంక నేడు ఆ మహనీయుని 27వ వర్ధంతి. సీమాంధ్ర పాలకులు తెలంగ

Published: Sat,October 6, 2012 04:29 PM

రాజీనామాలు సరే టీడీపీ వైఖరి ఏమిటి?

బస్సుయాత్రతో తమ వద్దకు వస్తున్న దేశం నేతలను ప్రజలు నిలదీసి, తెలంగాణ పై పార్టీ వైఖరిని ప్రకటించాలని కోరాలి. పార్టీ అధినేతచే ప్రధా

Published: Sat,October 6, 2012 04:29 PM

సారు లేడని మనాది వద్దు...

డిసెంబర్ తొమ్మిదిన కేంద్ర వూపభుత్వం చేసిన ప్రకటన అమలవుతదని, తెలంగాణ రాష్ట్రం తొందరగనే ఏర్పడుతుందని సారుకు నమ్మకం కుదిరింది. దీనికి

Published: Sat,October 6, 2012 04:29 PM

జనం కోసమే జయశంకర్ సారు

నాలుగు తరాలతో నడిచిన యోధుడు-2 చివరి రోజులల్ల సారును మీరు జీవితాన్ని సంపూర్ణంగా జీవించానని అనుకుంటున్నారా! అని అడిగిన. ఒక లక్ష

Published: Sat,October 6, 2012 04:28 PM

నాలుగు తరాలతో నడిచిన యోధుడు-1.

1970 నుండి 1996 దాకా తెలంగాణ ఉద్యమానికి తిరిగి ప్రాణం పోయడానికి సారు చేయని ప్రయత్నమంటూ లేదు. ‘ఆర్‌ఎస్‌యు నుండి ఆర్‌ఎస్‌ఎస్ దాకా ఎవ

Featured Articles