ప్రజల భాగస్వామ్యంతోనే చెరువుల పునర్నిర్మాణం


Wed,September 24, 2014 02:01 AM

చెరువుల పునర్నిర్మాణానికి ప్రభుత్వం అధికారుల సలహాలు, భాగస్వామ్యంపైనే ఆధారపడితే అది ఘోర తప్పిదమవుతుంది. గొలుసు చెరువుల నిర్మాణానికి సారథులు ప్రజలే కావాలి.పరిరక్షణ బాధ్యత ఆయకట్టుదారులపైనే ఉండాలి.

తెలంగాణ తొలి ప్రభుత్వం గొలు సు చెరువుల పునర్నిర్మాణంపై దృష్టి పెట్టినట్టు వార్తలను చూసే అర్థమవుతున్నది. పాలకుల ఆలోచనలను అధికార యంత్రాంగంతో అమల్లోకి తేవడం సాధారణం గా జరిగే పద్ధతి. తెలంగాణ చెరువులను పునరుద్ధరించే ఒక గొప్ప యజ్ఞాన్ని నియోజక వర్గానికో, సర్కిల్, జిల్లాకో విభాగాన్ని ఏర్పాటు చేసి అధికారులకు మాత్రమే పరిమితం చేస్తే ప్రజలు ఆశిస్తున్న ఫలితాలు పెద్దగా రాకపోవచ్చు. అరవై ఏళ్ళుగా ఏ ప్రభుత్వాలూ తెలంగాణ చెరువుల వ్యవస్థను పట్టించుకు న్న పాపానపోలేదు. మైనర్ ఇరిగేషన్‌లో పనిచేసిన, ప్రస్తుతం చేస్తున్న అధికారులకు చెరువుల పునర్నిర్మాణంపై సరైన అవగాహన ఉండే అవకాశమే లేదు. తన ఆలోచనలకు తగ్గట్లుగా ఆశించిన ఫలితాలు రావాలని ముఖ్యమంత్రి భావించినట్లయితే అర్థం చేసుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి.

తెలంగాణ ప్రాంతంలో నేటికీ మిగిలి ఉన్న 41 వేలకుపైగా చెరువులు, కుంటల్లో నాల్గింట మూడు వంతులకు పైగా వంద ఎకరాలకు లోపు ఆయకట్టు కు నీరిచ్చే చిన్న కుంటలే. వీటిలో చాలా వరకు రైతు లు స్వయంగా నిర్మించుకున్నవే. 11వ శతాబ్ది నుంచి 20వ శతాబ్దం వరకు కందూరు చోడరాజుల నుంచి ఏడవ నిజాం వరకు నిర్మించిన చెరువులన్నీ దాదాపు పెద్ద చెరువులే. ఈ చెరువులపై మాత్రమే రాజుల పాలనలో నీటి నియంత్రణ, పరిరక్షణ అధికారుల చేతుల్లో ఉండేది. వేలాది కుంటల, చిన్న చెరువుల నిర్వహణ, పరిరక్షణ వాటి కింది ఆయకట్టుదారులే చూసుకునేవారు.

అధికారుల యాజమాన్యంలోని పెద్ద చెరువులకు అకస్మాత్తుగా ప్రమాదం ముంచుకొస్తే దానిపై కాపలా ఉండే నీరడి వాటి పరిరక్షణ కు వెంటనే రైతుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి వారి సహకారంతో ఆ ప్రమాదం నుంచి చెరువును కాపాడుకునే వాడు. రాత్రికి రాత్రి రైతులు తట్టా, పారలతో, గడ్డిమోపులతో, ఉస్కె సంచులతో చెరు వుల గండిని పూడ్చి, దగ్గర మైసమ్మను పెట్టుకొని మళ్ళీ గండిపడకుండా చూడాలని మొక్కుకునేవారు. అట్ల వచ్చినవే గండి మైసమ్మలు, కట్ట మైసమ్మలు. చెరువులు కబ్జా అయినా, వాటి కింది పొలాలు ప్లా ట్లుగా మారినా ఇప్పటికీ గతంలో ఇక్కడో చెరువో, కుంటో వుండేదనడానికి సాక్ష్యంగా పట్టణాల్లో సైతం గండి మైసమ్మలు, కట్ట మైసమ్మలు వేలాదిగా మిగిలే ఉన్నాయి. ప్రజల భాగస్వామ్యం చెరువుల నిర్వహణలో ఉండేదని చరిత్రను అర్థం చేసుకోవడానికి ఈ ఆధారాలు చాలు.

ఐదారు దశాబ్దాలుగా ప్రతిదానికీ ప్రభుత్వంపై ఆధారపడే స్థితికి ప్రజల ఆలోచనలు చేరినవి. కనుక అధికారులపై ఆధారపడడం తప్ప మరోదారి లేదని ఎవరైనా భావిస్తే అది పొరపాటు. చారిత్రక ఉద్య మం ద్వారా ప్రజల భాగస్వామ్యంతోనే తెలంగాణ ఏర్పడింది.

ఉద్యమంలో పాల్గొన్న ప్రజలు పునర్నిర్మాణంలో తమ వంతు బాధ్యతను నిర్వహించడాని కి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఉద్యమ స్ఫూర్తి అందరిలో మిగిలే ఉన్నది. వేలాదిమంది ఇతర దేశాల్లో ఉన్న తెలంగాణ ప్రాంత విద్యావంతు లు తమ ఊరి చెరువు పునర్నిర్మాణం కోసం తాము సంపాదించిన డబ్బులో ఎంతో కొంత ఖర్చు చేయడానికి ముందుకొస్తున్నారు.మరికొందరు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి నిధిని ప్రోగు చేసి ఏదైనా ఒక చెరువు పునరుద్ధరణకు తమ వంతు సాయమం దించడానికి ముందుకొస్తున్నారు. పల్లె ప్రజలు చెరువును తల్లిలా భావిస్తారు. తమ వద్ద డబ్బు లేకున్నా స్వచ్ఛందంగా పనిచేయడానికి, కనీసం తవ్విన పూడి క మట్టినైనా తమ పొలాల్లో వేసుకోవడానికి, స్వంత ట్రాక్టర్లు ఉన్న వారు డీజిల్ పోస్తే కిరాయి లేకుండా ట్రాక్టర్లివ్వడానికి జె.సి.బి.ల యాజమానులు తక్కువ కిరాయికైనా చెరువు కోసం జె.సి.బిలు పెట్టడానికి, స్వచ్ఛంద సంస్థలు తమవంతు బాధ్యత నిర్వహించడానికి ముందుకొస్తున్నాయి. రిటైర్డ్ ఇంజనీర్లు, అధికారులు తమ వంతుగా స్వచ్ఛందంగా ఈ యజ్ఞంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇదేదో నీటిపారుదల శాఖకు సంబంధించిన వ్యవహారంగా పరిగణించి ప్రజలను భాగస్వాములను చేయకుండా అధికారులకే వదిలేయాలని ఆలోచిస్తే మంచిది కాదు.

చెరువుల పునర్నిర్మాణంలో ప్రజల సహకారం తో పరిష్కరించుకోవాల్సిన సమస్యలు అనేకం ఉన్నా యి. మీది చెరువు అలుగు దుంకితే ఆ నీళ్ళు క్రింది చెరువులోకి వచ్చే ఒర్రెల్లో చాలా వరకు పూడ్చబడ్డా యి. శికం భూములపై రెవెన్యూ అధికారులు ఏక్‌సాల్ పట్టాలివ్వడం వల్ల నాలుగైదు దశాబ్దాలుగా ఆ ఒర్రెల్ని పూడ్చి వ్యవసాయం చేస్తున్నారు రైతులు. ఈ శికం భూములను దున్నడం వల్లనే మట్టి వదులై వర్షంపడ్డప్పుడు చెరువులకు కొట్టుకొచ్చి గజాల ఎత్తు పూడిక చేరింది. ఒకపక్క పూడిక తీస్తుంటే మరోపక్క నుంచి పూడిక చేరొద్దంటే ముందు శికం భూములు దున్నకుండా ఆపాలి. ఏక్‌సాల్ పట్టాలిచ్చిన రైతుల ను ఒప్పించాలి. అవసరమైన వారికి ఉపాధి చూపించాలి. ఒర్రెల్ని మళ్ళీ పునరుద్ధరించాలి. వాటి వెంట చెట్లు పెంచాలి. చెరువులో ఒర్రె కలిసే ముందు ఒక చెక్‌డ్యాంలను(పూడికను నివారించే ఉద్దేశంతో) కట్టాలి.

వర్షాకాలం చెరువు నిండుతుందనగా ఆ చెరువు కట్టలను కొందరు రైతులే దొంగచాటున దౌర్జన్యంగా తెగ్గొట్టడం కొన్ని గ్రామాల్లో చూడవచ్చు. ఆ రైతులకు శికంలో పట్టాలున్న స్వంత భూములు, లేదా కబ్జా భూములు ఉండడమే ఈ విధ్వంసచర్యకు కారణం. అధికారులు ఫుల్ రిజర్వాయర్ లెవల్ గీతగీసి చేతు లు దులుపుకుంటారు. మళ్ళీ యథాతథ స్థితే కొనసాగతుంది. ఇక్కడ చేయాల్సింది ఆ వూరి ప్రజల భాగస్వామ్యంతో ఈ రైతుల సమస్యను సానుకూలంగా అర్థం చేసుకొని పరిష్కరించడం. ఎంతవరకు వారి పట్టా భూమి మునుగుతున్నదో గుర్తించి ప్రత్యామ్నా యం చూపి వారికి నచ్చచెప్పగలగాలి. విధ్వంసం మళ్ళీ జరగకుండా రైతుల పర్యవేక్షణ ఉండాలి. టీడీ పీ ప్రభుత్వం హయాంలో ఏర్పాటైన సాగునీటి యాజమాన్య సంఘాలు లంచగొండితనానికి, డబ్బు సంపాదన మార్గాలుగా మారినవి. వాటిని రద్దు చేసి స్వచ్ఛందంగా, ఉద్యమస్ఫూర్తితో ఉన్న జనంతో కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలి.

చెరువుల్లో, కుంటల్లో పూడికతీత భారీ ఖర్చుతో కూడుకున్నందున పూడిక తీయడం అనవసరమనే ఇంజనీర్లు ఎక్కువ సంఖ్యలోనే ప్రభుత్వంలో ఉన్నా రు. వీరికి జమాఖర్చులు తప్ప పల్లెల గోస, చెరువు ఆత్మఘోష అర్థంకాదు. అడుగంటిన భూగర్భజలాల రీ చార్జీకి చెరువుల్లో పూడికను తీయడం తప్ప మరే అడ్డదారీ లేదనే సత్యాన్ని గుర్తించాలి. ఒక్కో చెరువు లో రెండు మూడు మనిషి నిల్వల పూడికను ఏ ఒక్క ఏడాదో తొలిగిస్తామనుకుంటే అది జరిగే పనికాదు. దానివల్ల ఉపయోగం లేదు. పూడికతీత ఒక పద్ధతి ప్రకారం జరగాలి. ఊరి రైతుల అవసరాలను దృష్టి లో పెట్టుకొని తమ పొలాల్లో చల్లుకోవడానికి ఎన్ని ట్రాక్టర్ల పూడిక మట్టి అవసరమో లెక్కకట్టి అంతే పరిమాణంలో ఆ సంవత్సరం పూడికమట్టిని ఒక క్రమపద్ధతితో తీయాలి.

పూడిక తీయడానికి, రైతులు పొలాల్లో చల్లుకోవడానికి దొరికే సమయం ఏడాది లో మూడు నెలలు మాత్రమే.మార్చి నెలలో పూడిక తీత పనులు మొదలు పెట్టాలంటే ఫిబ్రవరి నాటికే ఎంత పూడిక తీసేది, ఒక్కో రైతు ఎంత మట్టి తీసుకుపోయేదీ నిర్ణయించబడాలి.గ్రామీణ ఉపాధి హమీ పథకాన్ని రైతులు పూడిక మట్టి తీసుకుపోవడానికి , పొలాల్లో చల్లుకోవడానికి , పూడిక తీతకు కొంతమేరకు ఉపయోగించుకోవాలి. ఫిబ్రవరి రెండోవారం నాటికే జాబ్‌కార్డులు రైతులకు అందజేయాలి. యూరియా, డీఏపీ కి బదులు పూడిక మట్టిని పొలా ల్లో చల్లుకునే వారు రెండు రెట్లు అధికంగా పంటలు పండించడం నేను చాలా గ్రామాల్లో స్వయంగా చూశాను. దీన్ని ప్రోత్సహించాలి. పూడిక మట్టితో ఇటుకల తయారీ చేపట్టవచ్చు. భవన నిర్మాణానికి పనికి వచ్చే ఇసుకనూ ఈ పూడిక మట్టి నుంచి వేరు చేసి వినియోగించుకోవచ్చు.

పూడిక తీయడానికి యంత్రాలను వాడొద్దని పనిదినాలు పెంచడానికి మనుషులతోనే పూడిక తీయించాలని కొందరు అధికారులు తప్పుడు సలహాలు కూడా ప్రభుత్వానికి ఇస్తున్నట్లు తెలుస్తున్నది. యం త్రాలు వాడుకుంటే ఆశించిన లక్ష్యం 2014లో కూడా నెరవేరదు. యంత్రాలను వినియోగించడాని కి గ్రామీణ ఉపాధి పథకంలో వెసులుబాటు లేకుం టే ప్రభుత్వమే జిల్లాకో రెండు మూడువందల జె.సి. బి.లను కొనుగోలు చేసి పూడిక తీత పనులు చేపట్టా లి. ఇది ఏ ఒక్క సంవత్సరమో పూర్తయ్యేది కాదు. ఒక్కో చెరువులో కనీసం సగం పూడిక తీయడానికి పదేళ్ళకు పైగానే పడుతుంది. నామమాత్రపు కిరాయి తో జె.సి.బి.లతో చేయడమే లాభదాయకం.

పల్లెలకు పూర్వవైభవం తెచ్చే చెరువుల పునర్నిర్మా ణం,గొలుసు కట్టు చెరువుల పునరుద్ధరణ ఒక మహాయజ్ఞంగా జరగాలి. ఒక గొలుసులోని కుంటలు, చెరువులను ఒకే యూనిట్‌గా పరిగణించి దానిపై ఒకే అధికారి పర్యవేక్షణ ఉండేలా చూడాలి. నియోజక వర్గానికో, జిల్లాకో సర్కిల్ ఏర్పాటు చేయడం కారణంగా ఒకే గొలుసులోని చెరువులు, కుంటలు ఇద్దరు లేదా ముగ్గురు అధికారుల పర్యవేక్షణ కిందికి వస్తే గొలుసు చెరువుల భవిష్యత్ పరిరక్షణ, పర్యవేక్షణ సాధ్యపడదు. గొలుసు చెరువులు, కుంటలన్నీ తెలంగాణ ప్రభుత్వ సమగ్ర సాగునీటి వ్యవస్థలో అంతర్భాగమే అయినా వీటి ప్రాధాన్యాన్ని, ప్రజల భాగస్వామ్య అవసరాన్ని గుర్తించి ట్యాంక్ డెవలప్‌మెం ట్ అథారిటీని పైనుంచి గ్రామస్థాయి దాకా ఏర్పా టు చేయాలి. ప్రతి చెరువుకు, కుంటకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి. అధికారి రైతుల భాగస్వామ్యం తో పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేయాలి.

పూడిక మట్టిని తీసుకుపోయే ప్రతి రైతూ ఒక్కో ట్రాక్టర్ మట్టికి విధిగా నామమాత్రమైనా చెల్లించాలి. ఆయకట్టు పరిధిలోని రైతు కూడా తనవంతుగా స్వచ్ఛందంగా పనిచేయడమో, కూలీని తానే నియమించడమో, ఎంతో కొంత ఎకరానికి ఇంత అని డబ్బు చెల్లించడమో జరగాలి. ఉచితంగా ఏమిచ్చినా దానికి విలువ తెలియదు.చాలా గ్రామాల్లో బ్యాంకు ల నుంచి ఐదారు వేలు ఒక్కొక్కరు రుణాలు తీసుకొని పూడికతీతకు స్వచ్ఛందంగా ఖర్చుపెట్టిన ఉదాహరణలున్నాయి. మట్టి చల్లుకునే రైతులు ట్రాక్టరుకింత అని నామమాత్రపు ధరను చెల్లించిన ఉదాహరణలూ ఉన్నాయి.

prakashచిత్తశుద్ధితో చెరువుల పునర్నిర్మాణం జరగాలని కోరుకునే వారితో, ఇప్పటికే ఈ పనిని కొన్ని సంవత్సరాలుగా అనేక కష్టాలకోర్చి స్వచ్ఛందంగా అంకిత భావంతో చేస్తున్న ఫ్రీడం (డాక్టర్ రవీందర్, స్వర్ణ)లాంటి ఎన్నో స్వచ్చంద సంస్థలున్నాయి. పూడికతీతకు తమ వంతుగా జె.సి.బి.లకు సమకూర్చుస్తు న్న బాలవికాస (కాజీపేట, వరంగల్) లాంటి సంస్థలున్నాయి. ఇప్పటికే పూడికతీతకు జె.సి.బి ట్రాక్టర్లను ఉపయోగించడానికి అనుమతులిచ్చిన గ్రామీణ ఉపాధి హామీ అధికారులున్నారు. ఇదొక మహాయజ్ఞంగా భావించి స్వచ్ఛందంగా తమ స్వగ్రామంలో జరిగే చెరువు పునరుద్ధరణకు ఆర్థికంగా, హార్థికంగా సహకరించాలనుకుంటున్న రైతులు, యువకులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఎన్.ఆర్.ఐ.లు సిద్ధంగా ఉన్నారు. వీరినెవ్వరినీ పరిగణనలోకి తీసుకోకుండా చెరువుల పునర్నిర్మాణానికి ప్రభుత్వం అధికారుల సలహాల, భాగస్వామ్యంపైనే ఆధారపడితే అది ఘోర తప్పిదమవుతుంది. గొలుసు చెరువుల నిర్మాణానికి సారథు లు ప్రజలే కావాలి. పరిరక్షణ బాధ్యత ఆయకట్టుదారులపైనే ఉండాలి.


1055

PRAKASH V

Published: Wed,August 9, 2017 12:02 AM

శ్రీరాంసాగర్ విషాద గాథ

మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారిచే పూర్వవైభవం పొందుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుదివందేళ్ల విషాద చరిత్ర.

Published: Sat,August 5, 2017 11:24 PM

సారు ఆశించిన సుపరిపాలన ఇదే

అంధకారంలో మగ్గుతుందనుకున్న తెలంగాణను అనతి కాలంలోనే పవర్‌కట్ లులేని రాష్ట్రంగా మార్చడం, గత రెండేళ్ళుగా సుమా రు 19 శాతం ఆర్థిక ప్రగత

Published: Tue,July 11, 2017 01:32 AM

మన భగీరథుడు అలీ నవాజ్ జంగ్

కృష్ణా, గోదావరి నదులపై బ్యారేజీలు నిర్మించినందుకు బ్రిటిష్ ప్రభుత్వ మిలిటరీ ఇంజినీర్ సర్ అర్ధర్ కాటన్ 150 ఏళ్లుగా కోస్తాంధ్ర ప్రజల

Published: Sun,February 5, 2017 02:16 AM

స్వయంపాలన వెలుగులు

మూడు తరాల తెలంగాణ ప్రజలు స్వయం పాలన కోసం నీళ్ళు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం నినాదాలతో కారణజన్ముడైన(ఆచార్య జయశంకర్ మాటల్లో) కేసీఆ

Published: Tue,September 30, 2014 12:14 AM

చెరువుల పూడిక ఎంతెంత లోతు!

ఒక్కో చెరువు లేదా కుంటపై యాభై లక్షలు ఖర్చు చేస్తే మూడు లేదా నాలుగు ఎకరాల్లో కూడా పూడిక తీయడం సాధ్యపడదు. తెలంగాణలో వేలాది చెరువులు

Published: Fri,March 21, 2014 01:32 AM

సంపూర్ణ తెలంగాణ సాధనే నేటి లక్ష్యం

సంపూర్ణ తెలంగాణ రాకుండా ఆంక్షలకు, ముంపు మండలాలను తెలంగాణ నష్టపోవడానికి కారకులు ఈ రెండు జాతీయ పార్టీల నేతలే. తెలంగాణలో గెలిచే ఈ పార

Published: Sat,October 6, 2012 04:30 PM

తెలంగాణ విలన్ కాంగ్రెసే

తమ స్వార్థపూరిత స్వభావంతో 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రానున్న ఎన్నికల్లో మట్టికరిపిం

Published: Sat,October 6, 2012 04:30 PM

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు డీవీ

తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించిన యోధుడు దేవులపల్లి వెంక నేడు ఆ మహనీయుని 27వ వర్ధంతి. సీమాంధ్ర పాలకులు తెలంగ

Published: Sat,October 6, 2012 04:29 PM

రాజీనామాలు సరే టీడీపీ వైఖరి ఏమిటి?

బస్సుయాత్రతో తమ వద్దకు వస్తున్న దేశం నేతలను ప్రజలు నిలదీసి, తెలంగాణ పై పార్టీ వైఖరిని ప్రకటించాలని కోరాలి. పార్టీ అధినేతచే ప్రధా

Published: Sat,October 6, 2012 04:29 PM

సారు లేడని మనాది వద్దు...

డిసెంబర్ తొమ్మిదిన కేంద్ర వూపభుత్వం చేసిన ప్రకటన అమలవుతదని, తెలంగాణ రాష్ట్రం తొందరగనే ఏర్పడుతుందని సారుకు నమ్మకం కుదిరింది. దీనికి

Published: Sat,October 6, 2012 04:29 PM

జనం కోసమే జయశంకర్ సారు

నాలుగు తరాలతో నడిచిన యోధుడు-2 చివరి రోజులల్ల సారును మీరు జీవితాన్ని సంపూర్ణంగా జీవించానని అనుకుంటున్నారా! అని అడిగిన. ఒక లక్ష

Published: Sat,October 6, 2012 04:28 PM

నాలుగు తరాలతో నడిచిన యోధుడు-1.

1970 నుండి 1996 దాకా తెలంగాణ ఉద్యమానికి తిరిగి ప్రాణం పోయడానికి సారు చేయని ప్రయత్నమంటూ లేదు. ‘ఆర్‌ఎస్‌యు నుండి ఆర్‌ఎస్‌ఎస్ దాకా ఎవ